ramgopal varma
-
నేను ఎవ్వరికి భయపడనని నీకు మట్టుకే తెలుసు: ఆర్జీవీ ట్వీట్ వైరల్!
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వ్యూహం చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని వెల్లడించారు. (ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి) ఇప్పటికే ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 'అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ‘వ్యూహం’ను ఆపలేరు అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలోని ఓ డైలాగ్‌తో ఆర్జీవీ ట్వీట్ చేశారు. అందులో అల్లు అర్జున్, సునీల్ మధ్య జరిగిన సీన్ మీమ్‌ను షేర్ చేశారు. అందులో పుష్ప క్యారెక్టర్లో ఆర్జీవీని చూపించారు. ఆర్జీవీ షేర్ చేసిన ట్వీట్లో.. 'శీనప్ప.. నేను ఎవ్వడికి భయపడనని నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? అన్నో.. ఇది ఒకటి తలలో పెట్టుకో ఎప్పటికీ.. నేను నా వ్యూహంతో నీ కెరీర్‌ను గెలకడానికి రాలే. నా వ్యూహంతో నీ వ్యూహం బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే' అన్న డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. త్వరలోనే వ్యూహం మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వెల్లడించారు. (ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్‌గా ఉందేంటి బ్రో!) pic.twitter.com/RehuN6PGPk — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023 -
ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఇన్ని రోజులు ప్రాజెక్ట్-కె పేరుతో నిర్మించిన ఈ మూవీ టైటిల్‌ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే బాలీవుడ్, కోలీవుడ్ నుంచి అగ్రతారలు సైతం ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ నటించినున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారనేది లేటెస్ట్ టాక్. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: అమ్మాయిగా మారేందుకు సర్జరీ చేయించుకున్న జబర్దస్త్ సాయి?) ప్రభాస్ కల్కి చిత్రంలో టాలీవుడ్ డైరెక్టర్స్ రాంగోపాల్ వర్మ గెస్ట్ రోల్ పోషిస్తున్నరంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి సైతం నటిస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా ఆర్జీవీ పేరు తెరపైకి రావడం మరింత ఆసక్తిగా మారింది. అంతే కాకుండా ఇప్పటికే వీరిద్దరు తమ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరీ దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఏదేమైనా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో వైరలవుతోంది. కాగా.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపిక పదుకొణె నటిస్తోంది. (ఇది చదవండి: 'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!) #Prabhas & RGV Will be Seen Together in #Kalki2898AD . RGV Has Completed his Shooting Part in @Kalki2898AD pic.twitter.com/ujUlw9OqdP — Team PraBOSS (@Team_PraBoss) September 6, 2023 Rgv & Prabhas will be seen together in #ProjectK https://t.co/suP5MxM1Bj pic.twitter.com/PX7SZIKB4Q — Freaking REBELS (@FreakingRebels) September 6, 2023 -
ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది: రామ్‌గోపాల్ వర్మ
‘‘సగిలేటి కథ’ సినిమా ట్రైలర్ నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ‘ఏదో జరిగే..’ పాటని అందంగా తీశారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నటుడు నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఏదో జరిగే..’ వీడియో సాంగ్‌ని రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి వర్మగారే’’ అన్నారు దేవీప్రసాద్ బలివాడ. ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్ సుద్మూన్. ‘‘ఏదో జరిగే..’ పాట అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అశోక్ మిట్టపల్లి. సి స్పేస్ కో ఫౌండర్ పవన్ మాట్లాడారు. -
నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ.. సైడ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!
సినిమా ఇండస్ట్రీలో సొంతంగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ఓవర్‌నైట్ స్టార్ గుర్తింపు వచ్చినా గ్లామర్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవటం అంతా ఆషామాషీ కాదు. కానీ ఏకంగా బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ డైరెక్టర్‌గా ఎదగడమంటే మాటలు కాదు. అంతకుమించిన సక్సెస్ ఉండదు కూడా. అలాంటి అసాధ్యం కానీ విషయాన్ని చేసి చూపించాడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్. అతనెవరో కాదు.. పోకిరీ మూవీతో చరిత్ర సృష్టించిన పూరి జగన్నాథ్. (ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్) అప్పట్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించిగా.. ఆయన పక్కనే పూరి బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్జీవీ ట్వీట్లో రాస్తూ..' ఒక బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా శివ సెట్స్‌లో సూపర్ స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . అతని విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.' అంటూ శివ సినిమాలోని ఫోటోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి నుంచి లైగర్ దాకా ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగులో ఇప్పటివరకు ఆయన 33 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, పోకిరి, చిరుత, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. కాగా.. గతేడాది విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాతో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబయిలో ఉంటున్నారు. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) A would be Super Smart director #PuriJagan on the sets of SHIVA as a background artiste ..His is a truly inspirational RISE ! pic.twitter.com/BPJ6rOfgf1 — Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2023 -
కుక్కల దాడిపై స్పందించిన వర్మ.. జీహెచ్ఎంసీ మేయర్‌పై సెటైర్లు!
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఏ కామెంట్ చేసిన సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారిపోతుంది. అయితే, తాజాగా తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తనదైన స్టైల్లో వర్మ ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల దాడులు పెరుగుతున్న కారణంగా మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో భాగంగా మేయర్.. కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై వర్మ స్పందించారు. ఈ సందర్బంగా వర్మ.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సార్.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ప్రశ్నించారు. Hey @GadwalvijayaTRS why don’t u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won’t eat our children ? pic.twitter.com/2dfa426hRv — Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 అయితే, అంతకుముందు మేయర్.. ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్ చేశారు. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. Hey @GadwalvijayaTRS I WANT TO BITE @KTRBRS @hydcitypolice pic.twitter.com/bXTFqsxzzH — Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 -
టీడీపీ నేత పట్టాభి పై RGV ఫైర్
-
ఆర్జీవీ మరో సంచలన ట్వీట్.. ఆయన వ్యూహమేంటో చెప్పేశారు..!
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటే ఓ సంచలనం. ఆయన ఏం చేసినా అందరి కంటే భిన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ట్విటర్లో యాక్టివ్‌గా ఉండే వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. అతి త్వరలోనే రాజకీయాలపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం పేరుతో ఓ రాజకీయ సినిమా తీయనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది బయోపిక్ కాదు … బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు శాతం నిజాలే ఉంటాయని స్పష్ట చేశారు. తాజాగా ఈ ఆయన తీయబోయే సినిమాపై చేసిన మరో ట్వీట్ తెగ వైరలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై వివరణ ఇచ్చారు ఆర్జీవీ. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ఆర్జీవీ ప్రకటించారు. వంగవీటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ ట్వీట్లో ఆర్జీవీ ప్రస్తావిస్తూ.. 'BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం' అంటూ కొత్త అర్థం చెప్పారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి పార్ట్ “వ్యూహం” , రెండోది “శపథం” .రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుందంటూ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచారు. BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం — Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2022 -
ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఏ కామెంట్ చేసినా ఎవరూ ఊహించని విధంగా కొత్తదనం కనిపిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలవుతోంది. నిన్న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసి రచ్చపై స్పందించారు. బిల్లా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లోనే అభిమానులు బాణాసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్జీవీ ఆ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: అది దీపావళి కాదు.. ప్రభాస్ అభిమానుల పిచ్చి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ ఇప్పడు రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యేదంటూ పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ఆర్జీవీ పోస్ట్ చేశాడంటే అది వైరల్ కావడం ఖాయం. దీపావళిని పురస్కరించుకుని అందరూ బాగుండాలని తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. Hey #Prabhas May GOD re release Radhe Shyam and this time it becomes a bigger hit than BAHUBALI #HappyDiwali — Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2022 -
అది దీపావళి కాదు.. ప్రభాస్ అభిమానుల పిచ్చి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. రెబల్ పుట్టినరోజు సందర్బంగా బిల్లా సినిమాను పలు థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. దీంతో థియేటర్లకు భారీగా చేరుకున్న అభిమానులు దీపావళి పేల్చినట్లు టపాసులు కాల్చి రచ్చ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో బాణాసంచా పేల్చడంతో అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. ఫ్యాన్స్ అత్యుత్సాహమే దీనికి కారణం. సీట్లకు మంటలు వ్యాపించడంతో అభిమానులు బయటకు పరుగులు తీశారు. అయితే ఈ సంఘటనపై తాజాగా సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. తనదైన శైలిలో ప్రభాస్ అభిమానుల చర్యను అభివర్ణించారు. ఇంతకీ ఏమన్నారంటే..! (చదవండి: అరాచకం.. థియేటర్లో బాణాసంచా పేల్చిన ప్రభాస్ ఫ్యాన్స్) ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్జీవీ ఇలా రాసుకొచ్చారు. ' అక్కడ జరుగుతున్నది దీపావళి వేడుక కాదు. ప్రభాస్ సినిమా తెరపై ప్రదర్శిస్తుండగా థియేటర్లోనే బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకోవడం. ఇది ప్రభాస్ అభిమానుల పిచ్చి చర్య. ఆయన ఫ్యాన్స్ జరుపుకున్న దీపావళి పండుగ స్టైల్ ఇది' అంటూ ట్వీట్ చేశారు. అయితే సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చడంతో యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. అయితే షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. Celebrating Diwali #Prabhas fans style https://t.co/ocr0OUEet6 — Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2022 No it’s not Diwali celebration ..It’s the madness of #Prabhas fans celebrating by burning a theatre while his film is running on the screen pic.twitter.com/lbYje0t356 — Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2022 -
కేవలం అవి మాత్రమే థియేటర్లకు రప్పించలేవ్.. కాంతారపై ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇప్పుడు ఎవరి నోటా విన్నా వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా 'కాంతార'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడలోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయడంతో కలెక్షన్లతో పలు పెద్ద చిత్రాల రికార్డులు బద్దలు కొడుతోంది. (చదవండి: కాసుల వర్షం కురిపిస్తున్న కాంతార.. మౌత్‌టాక్‌తోనే హిట్‌టాక్) అయితే ఈ సినిమా సక్సెస్ పట్ల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సైతం స్పందించారు. కేవలం సూపర్ స్టార్స్, మాసివ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ వీఎఫ్ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించగలవని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటున్న తరుణంలో పేరు లేని చిన్న సినిమా పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొడుతోందని ట్వీట్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Just when all Filmwallas came to the conclusion that only SUPER STARS, MASSIVE PRODUCTION VALUES and SPECTACULAR VFX can bring people to theatres , a small tiny film with no names #Kantara is breaking all the records of the BIGGIES — Ram Gopal Varma (@RGVzoomin) October 17, 2022 -
గరికపాటిపై ఆర్జీవీ ఆగ్రహం.. వదిలే ప్రసక్తే లేదంటూ..!
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్ల మధ్య జరిగిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. వివాదాస్పద కామెంట్లు చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు. ‘మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఆ ట్వీట్లో తనదైన శైలిలో గరికపాటిపై విరుచుకుపడ్డారు. వివాదం ఎక్కడ మొదలైందంటే! ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’ అని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు వివాదానానికి దారి తీశాయి. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా.. ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించిన సంగతి తెలిసిందే. సర్ @NagaBabuOffl గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ @KChiruTweets ???? — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 సర్ @NagaBabuOffi గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు 🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా @KChiruTweets నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి 😡😡😡😌😌😌 — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 -
ఈ కథ అందరికీ తెలియాలి: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘కొండా’ పేరుతో మరో బయోపిక్‌కి శ్రీకారం చుట్టారు. వరంగల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘కొండా’ చిత్రం వరంగల్‌లో ప్రారంభం అయింది. అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యోయో టాకీస్ పతాకంపై మల్లారెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘మురళి, సురేఖ గార్ల జీవిత కథని అందరికీ తెలియాలనే ‘కొండా’ చిత్రం నిర్మిస్తున్నాం. వారి జీవిత చరిత్రను పదిశాతం సినిమాలో చూపించినా నా ప్రయత్నం విజయవంతం అయినట్టే’’ అన్నారు. ‘‘నిజజీవితంలో కొండా దంపతులు ఎలా ధైర్యంగా నిలబడ్డారు? అనేది ‘కొండా’ ద్వారా చూపించబోతున్నాం’’ అన్నారు నిర్మాత ముకుంద్. ‘ ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి. -
సుబ్బారావ్, ప్యారేలాల్.. ఈ వైరస్లు ఎందుకు లేవు
హైదరాబాద్ : విచిత్రమైన వ్యాఖ్యలకు విపరీతమైన చేష్టలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. తన ప్రశ్నలు, ప్రవర్తన మనకు నచ్చకపోయినా ... అందులో లాజిక్ మనల్ని ఏదో మూలన ఆలోచింప చేస్తుంది. తాజాగా కరోనా వేరియంట్లపై సెటైరిక్‌గా ట్వీట్ వదిలాడు వర్మ. వైరస్ వేరియంట్లకు ఎవరికీ అర్థం కాకుండా గుర్తుంచుకోవడం కష్టం అయ్యేలా Bi7172, Nk4421, K9472 ,AV415లాంటి పేర్లు ఎందుకు పెడుతున్నారు ?వైరస్ వేరియంట్లకు కూడా ప్యారేలాల్, చింటూ, జాన్ డేవిడ్, సుబ్బారావు ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టడం లేదంటూ సైంటిస్టులను ప్రశ్నించాడు. కొద్ది మంది వర్మ ప్రశ్నకు సైంటిఫిక్ సమాధానాలు ఇవ్వగా మరికొందరు ఈ ఐటమ్ తెలివి తేటలతోనే సినిమాలు తీస్తున్నావంటూ వర్మపై సెటైర్లు వేశారు. చాలా మంది నవ్వుకున్నారు. చదవండి : కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు! Hey Scientists,instead of boggling our minds with impossible to remember names like Bi7172, Nk4421, K9472 ,AV415 etc ,Why can’t you name them Pyarelal, Chintu, John David , ,Subba Rao etc ???😳😳😳 — Ram Gopal Varma (@RGVzoomin) June 24, 2021 -
వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే
బయోపిక్‌ల రారాజు.. వివాదాల చక్రవర్తి రామ్‌గోపాల్ వర్మ మరో సంచలన బయోపిక్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ‘పవర్ స్టార్’ సినిమా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్ వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘‘ బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియోటర్ కొత్త సినిమాకు ‘పవర్ స్టార్’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్ఎస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు. (ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్) BREAKING NEWS: My next film on RGVWORLDTHEATRE is titled POWER STAR ..it will be starring P K, M S , N B , T S, a Russian woman , four children , 8 buffaloes and R G V ..No prizes will be given for understanding who the characters are #RGV’sPOWERSTAR — Ram Gopal Varma (@RGVzoomin) June 28, 2020 అనంతరం ‘పవర్ స్టార్’లో పాత్రధారికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ‘నా కొత్త సినిమా ‘పవర్ స్టార్’లో హీరో ఇతనే. అతడు మా ఆఫీస్ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం. ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కాని యాధృచ్చికం.. ఉద్ధేశ్యపూర్వకం కాని ఉద్ధేశ్యపూర్వకం’’ అంటూ తన దైన శైలిలో రాసుకొచ్చారు. -
డేట్ ఫిక్స్
రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు రానున్న తాజా చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రామ్‌గోపాల్‌వర్మతో కలిసి సిద్దార్ధ తాతోలు దర్శకత్వం వహించిన చిత్రం ఇది. టి. అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించారు. రివైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఏ వర్గాన్నీ టార్గెట్ చేసిన చిత్రం కాదు ఇది. ఫ్యాక్షనిజమ్, రౌడీయిజమ్, రాజకీయాల నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’’ అని చిత్రబృందం వెల్లడించింది. నట్టి క్రాంతి, నట్టి కరుణ ఈ చిత్రానికి సహనిర్మాతలు. -
బ్యూటిఫుల్
రామ్‌గోపాల్ వర్మ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘బ్యూటిఫుల్’. ఆయన గతంలో తీసిన ఐకానిక్ మూవీ ‘రంగీలా’ కు ఇది ట్రిబ్యూట్. నైనా, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇదివరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని వర్మతో కలసి దర్శకత్వం వహించారు అగస్త్య మంజు. ప్రస్తుతం ‘బ్యూటిఫుల్’ చిత్రం రామ్‌గోపాల్ వర్మ టైగర్ ప్రొడక్షన్‌పై నిర్మాణం జరుపుకుంది. టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. ‘‘మా ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.. అందరూ వెరీ బ్యూటిఫుల్ అంటున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం:రవి శంకర్, సాహిత్యం: సిరా శ్రీ. -
‘ఇస్మార్ట్ ’ పోలీస్!
సాక్షి, హైదరాబాద్: ఆయనది యాక్షన్.. వారిది ఇస్మార్ట్ రియాక్షన్! ఆయనది ట్వీట్.. వారిది ‘ట్రీట్’. ఆయన పోలీసులెక్కడున్నారంటే.. వారు చలానా రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆయనే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన రూటే సెపరేటు.. రీల్లోనూ, రియల్‌గానూ ఆయనది వివాదా’స్పదం’. టీఎస్07 2552 బుల్లెట్ బైక్‌ను ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి డ్రైవ్ చేస్తుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆగస్త్య, రాంగోపాల్ వర్మ వెనుక కూర్చొని ఉన్నారు. ఈ ఫొటోను వర్మ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. తాము మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో ‘ఇస్మార్ట్ శంకర్’సినిమా చూసేందుకు హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళుతున్నామంటూ ట్వీట్ చేసిన కొంతసేపటికి... ‘పోలీసులు ఎక్కడ ఉన్నారు... వాళ్లంతా థియేటర్లో సినిమాలు చూస్తున్నారని అనుకుంటున్నాను’అని మరో ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. వర్మ ట్వీట్లను ఫాలో అయ్యే ఓ వ్యక్తి.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా పోలీసులకే సవాల్ విసిరేలా చేసిన వ్యాఖ్యలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫేస్బుక్ ద్వారా పంపి ఫిర్యాదు చేశారు. వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘మీరు పంపిన ఫొటో ఆధారంగా ఆ బైక్ నంబర్‌కు ఈ–చలానా విధిస్తున్నాం... మాతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు’అంటూ ఇస్మార్ట్‌గా ప్రతిస్పందించారు. ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200, హెల్మెట్ లేనందుకు రూ.135... మొ త్తంగా రూ.1335 జరిమానాను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విధించారు. అయితే, పోలీసులు జారీ చేసిన ఈ–చలానా బైక్ యజమాని బడ్డె దిలీప్‌కుమార్‌కు వెళ్లింది. -
ప్రభుత్వం కుప్పకూలిపోతుందా..ఎందుకంత భయం బాబు?
సాక్షి, హైద్రాబాద్ : ఒక్క సినిమా తీస్తేనే మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందంటారా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ విజయచందర్.. సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. సోమవారమిక్కడ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను నిర్బంధించడం సరికాదని హితవు పలికారు. వర్మ ప్రెస్‌మీట్ పెడితే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమిటని, ఎందుకంత భయపడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. అసలు ఏ ఉద్దేశంతో వర్మను నిర్బంధించి బయటకు పంపేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారు కదా.. ‘ ప్రెస్‌మీట్ పెట్టాలంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలా. వర్మకు ప్రెస్‌మీట్ పెట్టే హక్కు ఉందా లేదా అసలు. కథానాయకుడు, మహానాయకుడు అనే రెండు బయోపిక్‌లకు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారే. మరి ఇతర చిత్రాల గురించి ఆవిధంగా ప్రచారం చేసుకోకూడదా. ఓ వ్యక్తి స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు’అని విజయచందర్ మండిపడ్డారు. -
వర్మను నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాం: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమైన రాంగోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. వర్మను ప్రెస్‌మీట్ పెట్టకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. పౌరుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో వర్మ, రాకేశ్‌రెడ్డిలను బలవంతంగా గన్నవరం విమానాశ్రయానికి తరలించి లాంజ్‌లో నిర్బంధించిన విషయం తెలిసిందే. కాగా తనను అక్రమంగా అడ్డుకోవడంపై రామ్‌గోపాల్ వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత పౌరుడిగా ప్రెస్‌మీట్ పెట్టుకునే హక్కు తనకు ఉందని.. దీనిపై లీగల్‌గా పోరాడుతానని వర్మ అన్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్లో ఉన్నామా లేక ప్రజాస్వామ్యంలోనా..?
గన్నవరం: రాష్ట్రంలో దిక్కుమాలిన పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. గన్నవరంలో రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ.. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేక పాకిస్తాన్ ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా సమావేశానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని సూటిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు, ఎన్నికల కమిషన్, సెన్సార్‌బోర్డు అన్నీ కూడా సినిమాకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం ఏమిటని అడిగారు. వర్మను నిర్బంధించడం అప్రజాస్వామికం: అంబటి డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో అడుగుపెట్టాలంటే చంద్రబాబు నాయుడి పర్మిషన్ తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యమేలుతోందన్నారు. నిజాలు బయటకు వస్తాయనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మే 23వ తేదీతో చంద్రబాబు పాలన అంతమవుతోందని జోస్యం చెప్పారు. వెన్నుపోటు బయటకు వస్తుందనే ఆందోళన: మల్లాది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు అంశం బయటకు వస్తుందనే భయంతోనే ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాంగోపాల్ వర్మ సినిమాను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన సినిమాకు భయపడి విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సమావేశం అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య: పార్దసారధి రాంగోపాల్ వర్మ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ నేత పార్ధసారధి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ దర్శక, నిర్మాతల మీడియా సమావేశాన్ని అడ్డుకోలేదని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే ఎందుకు చంద్రబాబుకు అంత భయమని సందేహం వెలిబుచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మీడియా సమావేశం కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఏపీలో కనిపించడం లేదన్నారు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని సన్నివేశాలను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించామని ఆ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు. తన వివరణపై సీఈవో ద్వివేది సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం, వాస్తవ పరిస్థితుల ఆధారంగా సినిమా తీశామన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా...రాజకీయ పార్టీలను, వ్యక్తులను కించపరిచే విధంగా తీశారన్న ఆరోపణలల్లో వాస్తవం లేదన్నారు. పసుపు జెండాలను తప్ప, పార్టీలను చూపించలేదన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తామన్నారు. సెన్సార్స్ క్లియరెన్స్ కూడా వచ్చిందని నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఉందంటూ ఈసీకి ఫిర్యాదులు అందటం, చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిర్మాత రాకేష్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు (సోమవారం) ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరు అయ్యారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అయితే అంతకు ముందు రాకేష్ రెడ్డి తనకు వచ్చిన నోటీసులపై వాట్సాప్ ద్వారా సమాధానం ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందిన ఈసీ... వ్యక్తిగతంగా కమిటీ ఎదుట హాజురు కావాలని స్పష్టం చేసింది. దీంతో రాకేశ్ రెడ్డి ఈసీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగని ఉత్కంఠ
సాక్షి, అమరావతి : రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. సినిమా విషయంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.పరిశీలన తర్వాత తుది నిర్ణయం వెలువరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 25న ఓటర్ల తుది జాబితా ఈనెల 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకోకుండా చూశామని, కొత్త ఓట్ల చేర్పుపై దుష్ప్రచారం చేయవద్దని కోరారు.రాష్ట్రంలో ఎవరి ఓటు తొలగించలేదని, దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరికి ఓటు హక్కు కల్పించామని చెప్పారు. కాగా, రాష్ట్రానికి 75మంది ఎన్నికల పరిశీలకులను నియమించామని, ప్రతి రెండు లోక్‌సభ నియోజక వర్గాలకు ఓ పోలీస్ పరిశీలకుడు., ఓ సాధారణ పరిశీలకుడు,ప్రతి మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఓ సాధారణ పరిశీలకులు పర్యవేక్షిస్తారని చెప్పారు.రాజకీయ పార్టీలు, ప్రజలు పరిశీలకులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
వాటీజ్ దిస్ అనేది..లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోనే
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మరిచిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూడద్దొంటూ చంద్రబాబు ఏవిధంగా చెబుతారని ఆమె సూటిగా ప్రశ్నించారు. పార్టీ నేతలకు ఏ సినిమా చూడాలో కూడా చంద్రబాబే చెప్పడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. వాస్తవాలు ఉన్నాయి కనుకనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటే చంద్రబాబు భయపడుతున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్‌పై బాలకృష్ణ తీసిన సినిమాల్లో వాస్తవం లేదు కాబట్టే.. ఆ సినిమాలను ప్రజలు ఆదరించడం లేదన్నారు. ఆ సినిమాలతో బయోపిక్కు అర్థమే మార్చేశారని ఆమె ఎద్దేవా చేశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ధైర్యంగా, నిజాయితీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా అసలు విషయాన్ని ప్రజల్లోకి తెస్తున్నారని, ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఈ సినిమా ద్వారా ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని, లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వాటీజ్ దిస్ అనేది...ఈ సినిమాతోనే తెలుస్తుందన్నారు. బయోపిక్ అంటూ బాలకృష్ణ ఏం చూపించలేదో, తాను అది చూపిస్తానంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెబుతున్నారని అన్నారు. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసుకునే చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లేనని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి, ఆయన పతనానికి కారణం అయిన చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అలా చేయలేదని ఖండించాలని సవాల్ విసిరారు. తాను చేసిన పాపాలన్నీ చంద్రబాబును నలువైపుల నుంచి కారు మేఘాల్లా కమ్ముకు వస్తున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు. ఆ కారణంగా తనపై నిందలు వేసి, అవాస్తవాలు ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మరణం, ఆనాటి పరిణామాలపై విచారణ కమిటీ వేయాలని తాను అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా అడిగినా, పట్టించుకోలేదని అన్నారు. చరిత్రను దిక్కు, మొక్కు లేకుండా చేయాలని చూసిన చంద్రబాబు దుర్మార్గం ఇన్నాళ్లకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రూపంలో బయటపడుతుందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. -
పాక్ ప్రధానికి వర్మ దిమ్మతిరిగే కౌంటర్
జమ్ము కాశ్మీర్ పుల్వామా ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మండిపడ్డారు. ప్రియమైన, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. మాటలతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు నమ్మినప్పుడు ... మూడుసార్లు వివాహాలు చేసుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చిందో అంటూ సెటైర్ వేశారు. రామ్‌గోపాల్ వర్మ ఇంగ్లీష్‌లో చేసిన ఈ ట్వీట్‌ను ప్రముఖ రచయిత కోన వెంకట్ తెలుగులో అనువదించి రీట్వీట్ చేశారు. మా గురువు @RGVzoomin చెప్పిన మాటలు తెలుగులోకి మార్చి వెలుగులోకి తీసుకురావాలనిపించింది !! ప్రియతమ ప్రధానమంత్రి (పాకిస్థాన్) @ImranKhanPTI మాటలతో అన్ని సమస్యలు పరిష్క్ రించుకోవచ్చని మీరు నమ్మినప్పుడు ... మూడుసార్లు వివాహాలు చేసుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చిందో... 😂😂😂 https://t.co/GwnS2Rxz6b — kona venkat (@konavenkat99) February 20, 2019 'ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్డీఎక్స్తో మా వైపు పరిగెత్తుకొస్తున్నపుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మూగ భారతీయులకు కొంచెం మీ జ్ఞానాన్ని పంచండి. ఊరికే ఏమీ వద్దు. భారతీయులందరం మీకు, మీ ట్యూషన్ టీచర్‌కు ఫీజు చెల్లిస్తాము. మీ దేశంలో ఎవరు(ఒసామా బిన్‌లాడెన్) నివసిస్తున్నారనేది అమెరికాకు తెలుస్తుంది. కానీ, మీ దేశంలో ఎవరు నివసిస్తున్నారనేది మీకు తెలియదు. అసలు మీది నిజంగానే ఓ దేశమేనా? ఏదో మూగ భారతీయున్ని అడుగుతున్నాను సర్. దయచేసి నన్ను కొంచెం ఎడ్యుకేట్ చేయండి సర్. ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు, కానీ మీరు కూడా వాటిపై ప్రేమ లేదనే విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదాలను మీరు బంతులుగా భావించి, పాకిస్తాన్ బౌండరీలు దాటిస్తూ భారత పెవిలియన్‌లోకి కొడుతున్నారు, కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా లేక బాంబులు అనుకుంటున్నారో కాస్త చెప్పాలి. దయచేసి మాకు తెలివి తేటలు నేర్పండి సర్' అని రామ్‌గోపాల్ వర్మ ఎద్దేవా చేశారు. Dear Prime Minister @ImranKhanPTI if America came to know who lives in ur country(Osama) and ur own country doesn’t know who lives in ur own country, is ur country actually a country? ..Me just a dumb Indian asking sir...Please please educate Imran Sir🙏 — Ram Gopal Varma (@RGVzoomin) February 20, 2019 పుల్వామా ఉగ్రవాద దాడి కారణంగా ప్రస్తుతం భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి (ఐరాస)ను పాకిస్తాన్ కోరిన విషయం తెలిసిందే. భారత్, పాక్‌ల మధ్య చర్చలకు చొరవ తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌కు విజ్ఞప్తి చేసింది. ‘పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా భారత నేతలు డిమాండ్ చేస్తుండటాన్ని నేను భారతీయ టీవీ చానళ్లలో చూశాను. భారత్ ప్రతీకార దాడికి దిగితే మేం కూడా దాడి చేస్తాం. యుద్ధం మొదలుపెట్టడమే మన చేతుల్లో ఉంది. ఆపడం కాదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇది పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వమనీ, ఉగ్రవాదులు తమకూ శత్రువులేననీ, తగిన సాక్ష్యాలు అందిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుల్వామా ఉగ్రవాద దాడికి పాకిస్తానే కారణమనేలా ఏదైనా ఆధారం ఉంటే భారత్ ఇవ్వాలనీ, చర్యలు తీసుకోదగ్గ సాక్ష్యాలను భారత్ సమర్పిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్ చెప్పారు. అయితే 'స్వయంగా ఈ దాడికి పాల్ప డిన ఉగ్రవాది మాటలను, దాడి తామే చేసినట్లు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించడాన్ని ఇమ్రాన్ పక్కనబెట్టారు. జైషే సంస్థ పాకిస్తాన్ నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తోందనీ, దాని చీఫ్ మసూద్ అజార్ పాక్‌లోనే ఉన్నాడన్న విషయం ప్రపంచమంతటికీ తెలిసిందే. చర్యలు తీసుకోడానికి పాక్‌కు ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి' అని భారత్ ప్రశ్నించింది. ఈ క్రమంలో వర్మ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. -
కంగనా ఓ గొప్ప హీరో : వర్మ
సాక్షి, హైదరాబాద్ : యాక్షన్ హీరోలందరూ నటీమణులుగా కనిపిస్తున్న ఈ తరుణంలో, ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా తెరపై ఓ గొప్ప హీరోను చూశానని కంగనారనౌత్‌ను రామ్‌గోపాల్ వర్మ పొగడ్తలతో ముంచెత్తారు. మణికర్ణికలో కంగనా అద్భుతమైన నటనతో తనను ఎక్కడికో తీసుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇలాంటి ఉగ్రరూపాన్ని చివరిసారిగా ఎంటర్‌ది న్యూడ్రాగన్ చిత్రంలో బ్రూస్లీలో చూశానని ట్విట్టర్లో పేర్కొన్నారు. క్రిష్ జాగర్లమూడితో కలిసి కంగనా రౌనత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ రచనా సహకారం అందించారు. అతుల్ కులకర్ణి, డానీ డెంజొప్ప, జిషు సేన్‌గుప్తా, రిచర్డ్ కీప్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
‘వెన్నుపోటు’పై ఎమ్మెల్యే ఫిర్యాదు
కర్నూలు: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మ తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి వెన్నుపోటు పేరుతో ఓ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటపై ఎస్వీ మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాట తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అవమానించేవిధంగా ఉందని, ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా పాటను రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. (టీడీపీలో గుబులు పుట్టిస్తున్న వర్మ పాట) మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన విధంగా ఈ పాటలో సృష్టించారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. చంద్రబాబు కీర్తిప్రతిష్టలు దిగజార్చేవిధంగా చిత్రీకరించిన రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాల్సిందిగా కర్నూలు టూటౌన్లో మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. (ఆ పాటలో మీనింగ్ ఏంటి.. ఈ దిష్టిబొమ్మలేంటి: వర్మ) -
వైస్రాయ్ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ!
పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దొడ్డి దోవన దక్కించుకున్న చంద్రబాబుతో వైస్రాయ్ హోటల్ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ. ఇప్పుడు తండ్రి జీవితాన్ని గొప్పగా తెరకు ఎక్కిస్తానని బయలుదేరడం విడ్డూరం కాదా? ఎన్టీఆర్‌పై సినిమా ద్వారా బాలకృష్ణ ఏం కోరుకుంటున్నాడు? బాబు నాయకత్వంలో ఎన్టీఆర్‌కు తాము చేసిన ద్రోహం ఎక్కడా కనపడకూడదు. అదే సమయంలో ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని చూపించి టీడీపీకి లాభం చేకూరే విధంగా సినిమా ఉండాలి. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి ముగింపు పలికి ఇప్పుడు ఆయన నామ జపం చేస్తున్న బాబు చిత్తశుద్ధి ఎంతో.. తండ్రి పట్ల బాలకృష్ణ భక్తి శ్రద్ధలు కూడా అంతే. మహానటి సావిత్రి జీవితం ఇటీవలే తెరకెక్కింది. చాలావరకు వాస్తవానికి దగ్గరగా ఉంది ఆ సినిమా అని అందరూ చెప్పుకున్నారు. ఆ సినిమా తీసిన వాళ్ళు తప్పకుండా సావిత్రి జీవితానికి సంబంధించి అన్ని కోణాలనూ జాగ్రత్తగా పరిశీలించి, అధ్యయనం చేసి ఉంటారు. ఎందుకంటే ఒక మహానటి జీవితాన్ని తెరకు ఎక్కించాలన్న సదుద్దేశం తప్ప ఆ సినిమా నిర్మాతలకు వేరే ప్రయోజనాలు ఏమీ ఉండవు కాబట్టి. మహానటి సావిత్రి జీవించి లేరు, ఆమె వారసులెవరికీ సావిత్రి పేరు వాడుకుని ఇప్పుడు ఏదో లబ్ధి పొందాలన్న దుగ్ధ ఉండి ఉండదు. అసలా చిత్ర నిర్మాణంతో సావిత్రి కుటుంబానికి ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి ఆ సినిమాలో నిజాయితీ కనిపిస్తుంది. అందుకే అందరి మన్ననలూ పొందింది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఏమిటీ సినిమా గోల అని విసుక్కోవచ్చు ఎవరయినా. నిజమే.. ఎన్నికలు తరుముకొస్తున్నాయి. తెలంగాణాలో ఎన్నికల కోడి ముందే కూసింది. డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి, దాని వెనువెంటనే 2019 ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకూ, లోక్ సభకూ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచో ఎన్నికల వేడి కొనసాగుతున్నది. ఏపీలో ఎన్నికలు జరిగేలోపే రానున్న రెండు సినిమాలను ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. ఎన్నికలకు సినిమాలకు ఏమిటి సంబంధం అన్న ప్రశ్న వేయవచ్చు ఎవరయినా. నిజమే సాధారణంగా ఎన్నికల సమయంలో నిర్మాతలెవరూ తమ సినిమాలను విడుదల చెయ్యాలని కోరుకోరు. ఎన్నికల హడావుడిలో పడి జనం తమ సినిమాలు చూడరన్న అభిప్రాయం వారిది. అయితే ఇప్పుడు ఒక రెండు సిని మాలు మాత్రం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వస్తున్నాయి. మొదటగా ఒకే సినిమా రాజ కీయ అవసరాల కోసం ప్రారంభమైంది. అయితే దాని వెనువెంటనే ఇంకో సినిమా అదే ఇతివృత్తానికి దగ్గరగా రాబోవడం గమనార్హం. మహా నటుడి ఆత్మ క్షోభించనుందా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, వేలాది మందికి రాజకీయ జన్మఇచ్చిన ఎన్టీఆర్ మరణించిన 22 సంవత్సరాలకు ఆయన జీవితాన్ని వెండితెరకు ఎక్కించాలన్న ఆలోచన ఆయన కొడుకు, సినిమా హీరో, టీడీపీ శాసన సభ్యుడు, ఏపీ సీఎం బావమరిది, ఆ రాష్ట్ర మంత్రి మామ బాలకృష్ణకు వచ్చింది. తండ్రిని అప్రజాస్వామిక పద్ధతిలో పదవి నుంచి దింపి మానసిక క్షోభకు గురిచేసి, ఆయన అకాల మరణానికి పరోక్షంగా కారకుడయిన కొడుకే తండ్రి జీవితాన్ని తెరకు ఎక్కించబూనుకోవడం విడ్డూరం. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దొడ్డిదో వన దక్కించుకున్న బాబుతో వైస్రాయ్ హోటల్ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన తండ్రి జీవితాన్ని గొప్పగా తెరకు ఎక్కిస్తానని బయలుదేరడం విడ్డూరం కాక మరేమిటి? దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్న ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి ముగింపు పలికి ఇప్పుడు ఆయన విగ్రహాలకు దండవేసి ఆయన నామ జపం చేస్తున్న బాబు చిత్తశుద్ధి ఎంతో.. తండ్రి పట్ల బాలకృష్ణ భక్తి శ్రద్ధలు కూడా అంతే. మహానటి సావిత్రి సినిమా తీసిన వాళ్ళకీ, ఎన్టీఆర్ మీద సినిమా తీయబోతున్న ఆయన కొడుక్కీ ఏ మాత్రం పోలిక లేదు. అక్కడ నిజాయితీగా ఒక మహానటి జీవితాన్ని జనం ముందు ఉంచే ప్రయత్నం జరిగితే ఇక్కడ ఒక మహానటుడి ఆత్మ క్షోభించే రీతిలో మరో సినిమా నిర్మాణం జరగబోతున్నది. ఒకసారి తప్పు చేస్తే దిద్దుకునే అవకాశమే ఉండదా ఇక, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉంటుందా అని ఎవరయినా బాలకృష్ణ ప్రయత్నాన్ని సమర్ధించవచ్చు. కానీ, ఎన్టీఆర్ రాజకీయ పతనానికి మూలకారకుడయిన బాబు కానీ, అందుకు సహకరించి దాన్ని విజయవంతం చేసిన బాలకృష్ణ కానీ ఈ 22 ఏళ్ళలో ఏ ఒక్కసారయినా ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దెదించి మేం తప్పుచేశాం అని చెంపలు వేసుకున్నారా? ఎన్టీఆర్ పేరిట బాలకృష్ణ సినిమా అనగానే మరో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని ఇంకో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు సినిమాల్లో నిజంగా ఎవరు ఏ మేరకు వాస్తవంగా తీస్తారు, ఎవరు ఎటువంటి వక్రీకరణలకు పాల్పడుతారు అన్నది చూడాల్సి ఉంది. పరిపూర్ణ జీవిత చిత్రణకు మంగళమేనా? బాలకృష్ణ సినిమా షూటింగ్ మొదలయింది. తండ్రి పాత్ర బాలకృష్ణ తానే పోషిస్తున్నాడు. ఇందులో బాబు పాత్రకు మరో నటుడు రానాను ఎంపిక చేసారు. ఇంచుమించు తనను బాబులాగా కనిపించేటట్టు మేకప్ బాగానే చేశారు. అంటే ఎన్టీఆర్ సినిమా ఆయన జీవితంలోకి బాబు ప్రవేశించేంత వరకూ కథ ఉంటుందన్నమాట. అయితే మరి వైస్రాయ్ ఎపిసోడ్, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, ఆయన మరణం వరకూ జరిగిన పరిణామాలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయా? ఉంటే బాలకృష్ణ తీస్తున్న ఈ సినిమా దర్శకుడు క్రిష్ నిజాయితీగా వాస్తవాలను తెరకు ఎక్కిస్తాడా? ఇప్పటికే ఒక దర్శకుడు తేజ ఈ సినిమా దర్శకత్వం నుంచి తప్పుకున్నాడు. కారణం అందరికీ తెలిసిందే నిర్మాత చెప్పినట్టు వినడం కుదరక తప్పుకున్నాడని ప్రచారం. ఎన్టీఆర్ సినిమా ద్వారా నిర్మాత బాలకృష్ణ ఏం కోరుకుంటున్నాడు? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. సమాధానం కోసం పెద్దగా వెతుక్కోనక్కర లేదు. బాబు నాయకత్వంలో ఎన్టీఆర్‌కు తాము చేసిన ద్రోహం ఎక్కడా కనపడకూడదు అదే సమయంలో ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని చూపించి టీడీపీకి లాభం చేకూరే విధంగా సినిమా ఉండాలి. ఎన్టీఆర్ పుట్టుక నుంచి మరణం దాకా తెరకు ఎక్కిస్తే చాలా వివాదాస్పద అంశాలు తెరకు ఎక్కించాల్సి వస్తుంది. అందుకని ఆయన జీవితం చివరి దాకా కాకుండా 60 ఏళ్ళు నిండగానే రాజకీయరంగ ప్రవేశం చేసి 1983లో తొలిసారి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో సినిమా ముగుస్తుందని సినీ పరిశ్రమ వర్గాలే చెపుతున్నాయి. అంటే ఆయన నట జీవితం మాత్రమే ఈ సినిమాలో మనం చూస్తాం. పోనీ ఇంకాస్త దూరం వెళ్లి నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటును విఫలం చేసి తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేవరకూ చూపించవచ్చునని చెపుతున్నారు. బహుశా ఇదే జరగొచ్చు. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటు ఎపిసోడ్ ఉంటేనే బాబు పాత్రకు ప్రాముఖ్యత వస్తుంది. కానీ అక్కడో ఇక్కడో ముగించేస్తే ఎన్టీఆర్ జీవితాన్ని పరి పూర్ణంగా చూపించినట్టు కాదు. వెన్నుపోటును చూపించే నిజాయితీ ఎవరిది? అందుకే రాంగోపాల్ వర్మ మరో సినిమా తీయడానికి సిద్ధపడ్డట్టున్నాడు. బాలకృష్ణ సినిమా ఎక్కడ ముగిసి పోతుందో అక్కడి నుంచి ఆయన సినిమా మొదలవుతుందని చెప్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమయిన ఘట్టాలన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. ఎన్నెన్ని మలుపులు, ఎన్ని మెరుపులు ఎన్ని మరకలు అన్నీ ఆ తరువాతి అధ్యాయంలోనే మనకు కనిపిస్తాయి. 1984లో తిరుగుబాటును చిత్తుచేసి ఇందిరాగాం«ధీ అంతటి మహా నాయకురాలు ఒక మెట్టు దిగొచ్చి అధికారం తిరిగి తనకు అప్పగించేట్టు చేసుకున్న దగ్గరి నుంచీ, సొంత అల్లుడి చేతుల్లోనే ఘోరమయిన వెన్నుపోటు పొడిపించుకుని కొద్ది మాసాలకే చనిపోయేవరకూ ఎన్టీఆర్ జీవితం అంతా ఉద్వేగభరితమే. అందులో 85 –89 మధ్య కాలంలో ఆయన పాలన తీరు, వివాదాస్పద నిర్ణయాలు, 89లో ఓటమి ఆ తరువాత సొంత కుటుంబం నుంచే ఎదుర్కొన్న నిరాదరణ, అనారోగ్యం, రాజకీయ అవమానాలు, లక్ష్మీపార్వతి ఆయన జీవితంలో ప్రవేశించడం, ఆమెతో పెళ్లి, మళ్ళీ 1994లో కాంగ్రెస్‌ను మట్టి కరిపించి సొంత అల్లుడి అంచనాలనే తారుమారు చేసి అద్భుత విజయం సాధించి అధికారాన్ని తిరిగి కైవసం చేసుకున్న తీరు అన్నీ రసవత్తర ఘట్టాలే. ఇవన్నీ రాంగోపాల్ వర్మ సినిమాలో ఉండే అవకాశం చాలా ఉంది. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో చూపించే నిజాయితీ బాలకృష్ణ సినిమాకు ఉండదు. ఏ రకంగా చూసినా రాంగోపాల్ వర్మ సినిమా మాత్రమే ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తిపరుస్తుందని చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి ఎన్టీఆర్ జీవితం మొత్తం సమగ్రంగా తెలియాలంటే రెండు సినిమాలూ చూడాలి. అయితే ఆత్మకథలు రాసుకునే వాళ్లకు ఎంత నిజాయితీ ఉండాలో జీవిత చరిత్రలు రాసేవాళ్ళు, తెరకెక్కించే వాళ్ళూ వాస్తవాల చిత్రీకరణలో అంతే నిజాయితీ ఉండాలి. వివాదాస్పద సినీ ప్రముఖుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్‌కు ఎంత న్యాయం చేస్తాడో చూడాలి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
భైరవగీత కహానీ ఏంటి?
ధనంజయ, ఇర్రా ముఖ్య తారలుగా సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘భైరవగీత’. దర్శక– నిర్మాత రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో భాస్కర్ రాశి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుని రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్నారు. ఈ సినిమా కన్నడ వెర్షన్ ట్రైలర్‌ను నటుడు శివరాజ్‌కుమార్ రిలీజ్ చేయనున్నట్లు రామ్‌గోపాల్ వర్మ వెల్లడించారు. ఇంతకుముందు ‘బాక్సర్, జెస్సీ, తగరు’ వంటి కన్నడ చిత్రాల్లో ధనంజయ నటించారు. -
బాహుబలిలో శ్రీదేవి అందుకే చేయలేదు: ఆర్జీవీ
-
సైకిల్ చైన్‌తో కొట్టినా సరే!
‘హలో’ తర్వాత అఖిల్ తదుపరి సినిమా ఏంటి? అనే క్యూరియాసిటీతో ఉండగానే ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరితో మూవీకి క్లాప్ కొట్టారు అఖిల్. ఆ సినిమా అఫీషియల్‌గా సెట్స్ మీదకు వెళ్లకముందే మరో సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇది అనౌన్స్ చేసింది అఖిల్ కాదు ఆర్జీవీ (రామ్ గోపాల్ వర్మ). ట్వీటర్ అకౌంట్ ద్వారా అఖిల్‌తో తన తదుపరి సినిమా ఉంటుందని పేర్కొన్నారు ఆర్జీవీ. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘జీవితంలో ఈ సర్కిల్ భలే గమ్మత్తుగా ఉంది. దర్శకుడిగా నా తొలి సినిమా ‘శివ’ను నాగార్జున నటించి, నిర్మించారు. 25ఏళ్ల తర్వాత నాగార్జునతో ‘ఆఫీసర్’ సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నాను. ఇప్పుడు అఖిల్‌ని డైరెక్ట్ చేయబోయే సినిమాను నాగార్జున నిర్మించబోతున్నారు. ‘మీరు (నాగ్ని ఉద్దేశించి) నన్ను సైకిల్ చైన్‌తో కొట్టినా సరే.. నేనో విషయం నిజాయితీగా చెప్పదలుచుకున్నాను. మీరు ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు మీకున్న స్టైల్, యాటిట్యూడ్, వాయిస్ కంటే అఖిల్ అన్నింట్లో బెటర్‌గా ఉన్నాడు. అఖిల్‌తో నేను చేయబోయే సినిమా యంగ్ క్యూట్ లవ్‌స్టోరీ కాదు.. ఇంటెన్స్‌తో కూడిన రియలిస్టిక్ యాక్షన్ మూవీ’’ అని పేర్కొన్నారు ఆర్జీవీ. -
క్లారిటీ ఇచ్చిన ‘ఆఫీసర్’ టీం
రాజుగారి గది 2 తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాను అందించిన కాంబినేషన్ కావటంతో ఆఫీసర్ పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నాగ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా కొద్ది రోజలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆఫీసర్ చిత్రం నిర్మాణదశలోనే ఉందని.. ఇంకా బిజినెస్ జరగలేదంటూ క్లారిటీ ఇచ్చింది. రామ్ గోపాల్‌వర్మ కు చెందిన నిర్మాణ సంస్థ ‘కంపెనీ’ సీఈఓ సుధీర్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది. @iamnagarjuna and @RGVzoomin #OFFICER releasing on May 25th. #NAGRGV4 #Officeron25thMay pic.twitter.com/EP25u7qhSV — R-Company (@RGV_COMPANY) 11 March 2018 -
ఆఫీసర్ ఆన్ యాక్షన్ మోడ్
విలన్స్‌ను రఫ్పాడిస్తున్నాడు హీరో నాగార్జున. ఎక్కడో తెలుసా? ముంబైలోని ఓ ఎల్తైన భవనంపై. మరి..అక్కడే ఎందుకు? అంటే మాత్రం ‘ఆఫీసర్’ సినిమా చూడాల్సిందే. నాగార్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్‌గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆఫీసర్’. మైరా సరీన్ ఫీమెల్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. క్లైమాక్స్ షూట్ మినహా సినిమా కంప్లీట్ అయ్యిందని సమాచారం. ప్రస్తుతం చిత్రబృందం క్లైమాక్స్‌ను ఫినిష్ చేసే పనిలోనే ఉన్నారు. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూట్ ఆన్‌లొకేషన్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగార్జున. ఈ ఫొటోను చూస్తుంటే ఆన్ డ్యూటీలో విలన్స్‌ను ఆఫీసర్ కుమ్మేస్తున్నట్లు ఉంది కదూ! ‘‘పర్వత శిఖరంపై జివదనీ మాయ దేవాలయం ఉంది. మేము ముంబైలోని పదో ప్లోర్‌పై యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు నాగార్జున. ‘‘నాగ్..‘శివ’ సినిమాలో కన్నా ఇప్పుడే నువ్వు ఫిట్‌గా ఉన్నావ్. అలా ఎలా మెయిన్‌టెయిన్ చేయగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ∙‘ఆఫీసర్’ చిత్రంలో నాగార్జున.. -
జస్ట్ ఇంకో నెల... అంతే!
జోరు అందుకుంది. అవును.. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ నిర్మించనున్న చిత్రం పనులు జోరుగా సాగుతున్నాయి. నాగార్జున–నాని కాంబినేషన్లో సంస్థ అధినేత సి. అశ్వనీదత్ ఒక సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ వంటి రెండు విజయాలను అందించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆరేడు నెలలుగా ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తున్నాయి కానీ ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ లేదు. ఈ సినిమా మొదలు కావడానికి జస్ట్ ఇంకో నెల... అంతే. వచ్చే నెల 24న షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నామని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పటికల్లా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ చేస్తున్న సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. అలాగే, నాని చేస్తోన్న ‘కృష్ణార్జున యుద్ధం’ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఈ హీరోలిద్దరూ వైజయంతి మూవీస్ నిర్మించే సినిమాతో బిజీ అవుతారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఊహించని మలుపులతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుందట. మంచి కామెడీతో, ట్విస్టులతో సిన్మా థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుందట. అంటే... ఎన్ అండ్ ఎన్... అదేనండీ నాగార్జున అండ్ నాని ఫుల్ ఫన్ ఇస్తారన్నమాట. -
రామ్‌గోపాల్ వర్మకు కొట్టేంత కోపం ఎందుకొచ్చింది?
ముంబయి : తన మనసులో ఉన్న మాటనే కాదు.. భావాన్ని కూడా ఏమాత్రం సంకోచం లేకుండా బాహాటంగా బయటపెట్టే వ్యక్తులను లెక్కిస్తే ముందు ప్లేస్‌లో ప్రముఖ దర్శకుడు, నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్‌గోపాల్ వర్మ ఉంటారని చెప్పాలి. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం జీఎస్టీ(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్). పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో ఆయన ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది. అయితే, ఇప్పటికే ఈ సినిమా హాట్‌హాట్‌గా చర్చ జరుగుతుండంటం మహిళా సంఘాలు అడ్డు చెబుతుండటం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఎంత వివాదాస్పద అంశాలను కథాంశంగా తీసుకొని ఆయన తెరకెక్కిస్తారో అంతకంటే ఆకట్టుకునేలా తన చిత్రాలకు పబ్లిసిటీ ఇస్తారు. తాజాగా తన జీఎస్టీ చిత్రానికి కూడా ప్రచారంలో భాగంగానే అన్నట్లుగా ఓ వీడియోను వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం పద్మావతి చిత్రం విడుదల కాకుండా పలువురు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అలాంటి ఆందోళన కారులే తన జీఎస్టీ చిత్రాన్ని కూడా అడ్డుకునేందుకు వచ్చినట్లు వారందరినీ కూడా వర్మ స్వయంగా కసితీరా తన్నుతున్నట్లు ఓ ఇమేజినరీ వీడియోను రూపొందించి పోస్ట్ చేశారు. వర్మ నిజంగా సినిమాల్లో ఫైట్ చేస్తే నేటి హీరోలను మించిపోగలరేమో అన్నట్లుంది ఆ వీడియో. మరి మీరు కూడా ఓ లుక్కేయండి. -
నాగ్ హిట్ లిస్ట్‌లో అతను!
ఫ్రమ్ గీతాకృష్ణ టు కల్యాణ్ కృష్ణ నాగార్జున ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్‌గోపాల్ వర్మ, దశరథ్, లారెన్స్... ఇలా నాగ్ పరిచయం చేసిన దర్శకులు పది మందికి పైనే ఉంటారు. జస్ట్ తాను హీరోగా నటించిన సినిమాల ద్వారానే కాదు.. నిర్మించిన చిత్రాల ద్వారా కూడా కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగ్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నారట. అతని పేరు వంశీ అని తెలిసింది. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాల తర్వాత కొత్త దర్శకుడు వంశీతో చేసే సినిమా మొదలవుతుందని భోగట్టా. సమ్మర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట. నాగ్ ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుల్లో ఆల్మోస్ట్ అందరూ సక్సెస్. సో.. వంశీ కూడా ఆ హిట్ లిస్ట్‌లో చేరతారని ఊహించవచ్చు. -
రేయ్.. అఖిల్ ఆ విషయం నాకు చెప్పలేదూ..!
అవునా.. నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ తుపాకీ ఎక్కుపెట్టారా? ‘సిస్టమ్’ని ప్రశ్నించబోతున్నారా? .. మంగళవారం ఫిల్మ్‌నగర్‌లో ఇదే చర్చ. దీనికి కారణం లేకపోలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రానికి ‘గన్’, ‘సిస్టమ్’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట. ఈ రెండిటిలో ఏ టైటిల్‌ని ఫిక్స్ చేస్తారబ్బా? అన్నది డిస్కషన్. కొంతమంది ‘గన్’కి ఫిక్సయ్యారు. ఎందుకంటే, చేతిలో గన్‌తో సీరియస్‌గా ఉన్న నాగార్జున లుక్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది మాత్రం ‘సిస్టమ్’కి ఫిక్సయ్యారు. ఎవరేం ఫిక్స్ అయినా వర్మ వేరే ఫిక్స్ అవుతున్నారు. ‘‘ప్రచారంలో ఉన్న ఈ రెండు టైటిల్స్ నిజం కాదు’’ అని ‘సాక్షి’కి క్లారిటీ ఇచ్చారు రామ్‌గోపాల్ వర్మ. మరి.. ఏం పెట్టాలనుకుంటున్నారు? అంటే.. ‘శపథం’ అని ఊహించవచ్చు. ఎందుకంటే గాసిప్పురాయుళ్ల కథనాల్లో ఈ టైటిల్ కూడా ఉంది. మరి.. ఈ టీమ్ ఈ టైటిల్‌కే ఫిక్స్ అవుతుందని శపథం చేయొచ్చా? ఏమో.. మరి.. వర్మ ఏం ఫిక్స్ అయ్యారో? వెయిట్ అండ్ సీ. కాగా ఈ సినిమాలో మైరా సరీన్ అనే కొత్తమ్మాయి నాగార్జునతో జోడీ కడుతున్నారు. అఖిల్ చెప్పలేదు..! అఖిల్ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హాలో’. ఈ సినిమా ఆడియో గురంచి అఖిల్ ట్విట్టర్లో ‘‘జస్ట్.. ‘హాలో’ ఫైనల్ ఆడియో మిక్స్ విన్నా. సాంగ్స్‌ను మీ అందరికీ వినిపించాలని చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. వెయిట్ చేయలేను. ఇవాళ (బుధవారం) సమ్‌థింగ్ లాంచ్ చేయబోతున్నాను’ అని అఖిల్ పేర్కొన్నారు. ‘‘ రేయ్.. అఖిల్ నువ్వు ఇవాళ సాంగ్‌ను లాంచ్ చేస్తున్నావన్న విషయం నాకు చెప్పలేదు? నువ్వు రిలీజ్ చేయబోయే సాంగ్ ఇదేనా? (పాట క్లిప్పింగ్ వీడియోను పోస్ట్ చేశారు). ఐ లవ్ ది సెట్ (పాట సెట్‌ను ఉద్దేశించి)æ’’ అని నాగార్జున సరదాగా ట్వీట్ చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఈ నెల 22న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అప్పుడు సైకిల్ చైన్... ఇప్పుడు లాఠీ!
యస్... సైకిల్ చైన్‌కి, లాఠీకి లింక్ కుదిరింది. ఎలాగంటే? రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద ట్రెండ్ సెట్టరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘శివ’లో స్టూడెంట్‌గా చేసిన నాగార్జున చేత సైకిల్ చైన్ లాగించారు వర్మ. అయితే, ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో రూపొందనున్న సినిమాలో నాగార్జున చేత లాఠీ పట్టిస్తున్నారు వర్మ. వర్మ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న సినిమాలో లాఠీ పట్టి రఫ్పాడించే పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్లో నాగార్జున కనిపించబోతున్నారు. ‘‘వర్మ డైరెక్షన్లో తెరకెక్కబోయే స్టైలిష్ యాక్షన్ డ్రామాలో పోలీసాఫీసర్‌గా నటించబోతున్నా’’ అని నాగ్ పేర్కొన్నారు. అంతేకాదు... ‘‘1988లో ఆర్జీవీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు చాలామంది షాకయ్యారు. డిఫరెంట్‌గా ఆలోచించారు. ఇప్పుడీ 2017లో కూడా చాలామంది హ్యాపీగా ఫీలైతే... ఎక్కువమంది షాకయ్యారు. లెట్స్ రాక్ రామూ’’ అని నాగార్జున పేర్కొన్నారు. ‘‘నాగ్... నువ్వెప్పుడూ తక్కువగా మాట్లాడతావు. నేనే ఎక్కువగా మాట్లాడతా. ఇప్పుడు రోల్స్ మార్చుకుందాం. సినిమానే మాట్లాడుతుంది’’ అని నాగ్‌కి రిప్లై ఇచ్చారు వర్మ. ఈ నెల 20న ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రివెంజ్ కంప్లీట్! ‘‘నేను దర్శకుణ్ణి అవుతానంటే మా నాన్నగారు నమ్మలేదు. అందుకే, ‘శివ’ ముహూర్తపు సన్నివేశానికి నాన్నతో క్లాప్ కొట్టించి, రివెంజ్ తీర్చుకున్నా. మా అమ్మగారు నాకు ఏమీ రాదంటుంటారు. అందుకే నాగ్‌తో స్టార్ట్ చేయబోయే నా కొత్త సినిమాకి మా అమ్మగారితో క్లాప్ కొట్టించాలనుకుంటున్నాను. రివెంజ్ కంప్లీట్!’’ అని వర్మ పేర్కొన్నారు. -
ఆఫ్టర్ 28 ఇయర్స్.. సేమ్ ప్లేస్..
ఆల్మోస్ట్ 28 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజైంది. అంతే... బాక్సాఫీసు బద్దలైంది. ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఓ నయా ట్రెండ్ స్టార్టయ్యింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అనేలా సీన్ మారింది. అంతలా సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘శివ’. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌ను రిపీట్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూట్‌ను ఈ నెల 20న స్టార్ట్ చేయనున్నారు. విశేషం ఏంటంటే..‘శివ’ సినిమా ఫస్ట్ షాట్‌ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ చిత్రం షూటింగ్‌ని కూడా స్టార్ట్ చేయనున్నారు. దీంతో సేమ్ ప్లేస్.. సేమ్ కాంబినేషన్.. సేమ్ హిట్ కన్ఫార్మ్ అంటున్నారు అక్కినేని అభిమానులు. పడిరి సుధీర్ చంద్ర సమర్పణలో రామ్‌గోపాల్‌వర్మ కంపెనీ బ్యానర్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. నవంబర్‌లో స్టార్ట్ చేసిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలతో పాటు, ఇతర విషయాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. -
హిట్ కాంబినేషన్ గురూ!
నాగార్జున–రామ్‌గోపాల్ వర్మలది హిట్ కాంబినేషన్. కాదు.. కాదు.. సూపర్ హిట్ కాంబినేషన్. సుమారు 28 ఏళ్ల క్రితం ఈ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘శివ’ సృష్టించిన సెన్సేషన్ అలాంటిది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నాగ్–రాము ఓ సినిమా చేయనున్నారు. ఇటీవల ఈ మూవీ గురించి వర్మ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దర్నీ పక్కన పెడితే నాగ్–టబులది కూడా హిట్ కాంబినేషన్. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాల్లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ కేక. అఖిల్ ‘సిసింద్రీ’లో నాగ్‌తో టబు ‘ఆటాడుకుందాం రా.. అందగాడా...’ అంటూ సందడి చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నాగ్ హీరోగా వర్మ దర్శకత్వం వహించనున్న సినిమాలో టబూని నాయికగా తీసుకున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. మరోవైపు.. అఖిల్ తాజా చిత్రం ‘హలో’లో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారనే వార్త కూడా ఉంది. -
జేడీ బాబు!
జేడీ చక్రవర్తి కదా... జేడీ బాబు అంటున్నారేంటి అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. త్వరలో జేడీ ఓ రాజకీయ నాయకుడి పాత్ర చేయనున్నారట. అందుకే ‘జేడీ బాబు’ అనాల్సి వచ్చింది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో ఊహించే ఉంటారు. యస్... చంద్రబాబు నాయుడు. నటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో రామ్‌గోపాల్ వర్మ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎన్టీఆర్ పాత్రకి ఎవరు సరిపోతారు? లక్ష్మీ పార్వతిగా నటించేది ఎవరు? చంద్రబాబునాయుడు పాత్ర ఎవరు చేస్తారు? అనే చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పాత్రల్లో ఇండస్ట్రీకి పరిచయం లేని కొత్తవారు కనిపిస్తారని వర్మ ప్రకటించి, క్లారిటీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు పాత్ర ఎవరు చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. బాబు పాత్రలో వర్మ ప్రియ శిష్యుల్లో ఒకరైన నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. జేడీ మంచి నటుడు. పైగా గడ్డం కూడా మెయిన్టైన్ చేస్తారు. అందుకే చంద్రబాబు పాత్రకే అతనే కరెక్ట్ అన్నది వర్మ ఆలోచనట. గురువు అడిగితే శిష్యుడు కాదంటారా? ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ‘ఉగ్రం’ అనే చిత్రంలో నటిస్తున్నారు జేడీ. -
జస్ట్... ఫోర్ మంత్స్!
కుదిరితే నాలుగు రోజుల్లో కూడా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమా తీయగలరు. ‘దొంగల ముఠా’ను ఐదు రోజుల్లో తీశారు కదా! కథను, అందులో కంటెంట్‌ను బట్టి షూటింగ్ డేస్ ప్లాన్ చేస్తారాయన. ఇప్పుడు నాగార్జున హీరోగా తీయబోయే సినిమా షూటింగును నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తానని వర్మ పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’తోనే వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత నాగార్జునతో ‘అంతం’, ‘గోవిందా గోవింద’ సినిమాలు తీశారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కుదిరింది. అయితే... ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు తక్కువని కొన్ని ఊహాగానాలు రావడంతో వర్మ స్పందించారు. ‘‘అక్కినేని నాగార్జున సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభించి, ఫిబ్రవరిలో ముగిస్తా. ఏప్రిల్‌లో సినిమా విడుదలవుతుంది. ఏప్రిల్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స్టార్ట్ చేసి, సెప్టెంబర్‌కి రెడీ చేస్తా’’ అని ఆయన పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ ఫ్యామిలీని కలవను!
ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వెండితెరపై ఏం చూపించబోతున్నారు? ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ఆయన ఎవర్ని టార్గెట్ చేశారు? సాధారణ స్థాయి నుంచి తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడిగా ఎదిగిన ఎన్టీఆర్ జీవితం, అక్కణ్ణుంచి సీయంగా ఎదిగిన పరిణామాలను కాకుండా... ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత ఘట్టాన్నే తీసుకోవడంలో వర్మ ఆంతర్యం ఏంటి? ఇటువంటి ప్రశ్నలకు సోమవారం ‘సాక్షి టీవీ’ లైవ్‌కి విచ్చేసిన వర్మ సమాధానాలు ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే.... ► స్నేహితులు, రచయితలతో మాటల సందర్భంలో ‘ఏపీలో ఎవరి లైఫ్‌పై బయోపిక్ తీస్తే బాగుంటుంది?’ అనడిగితే... ‘నో వన్ కెన్ బి బిగ్గర్ దేన్ ఎన్టీఆర్’ అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనుందని నేను ప్రకటించాను. ఐడియా వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌గారి లైఫ్ గురించి డీప్‌గా స్టడీ చేశా. ► లక్ష్మీ పార్వతిగారిని నేను కలవలేదు. ఆమె ఎన్టీఆర్‌గారి జీవితంలోకి వచ్చిన టైమ్‌లో నేను బాంబేలో ఉన్నా. అసలు, ఎన్టీఆర్‌గారి లైఫ్‌లోకి లక్ష్మీ పార్వతిగారు వచ్చిన తర్వాత జరిగిన సంఘటలను నా సినిమాకి కథగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే... ఎన్టీఆర్‌గారు సూపర్‌స్టార్, సూపర్ పొలిటీషియన్. ఓ గొప్ప వ్యక్తిగా ఉన్న ఆయన సడన్‌గా మామూలు మనిషిగా మారారు. ఆ టైమ్‌లో లక్ష్మీ పార్వతిగారు ఆయన లైఫ్‌లోకి ప్రవేశించారు. ఎన్టీఆర్‌గారు అలా కావడానికి, ఆ మానసిక స్థితిలోకి వెళ్లడానికి కారణమైన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల్లోంచి ఏవేం జరిగాయి? ఎవరెవరు ఎంటరైతే ఎన్టీఆర్ ఎలా మారారు? మారిన వ్యక్తి గురించి ఎవరెవరు ఏమేం అనుకున్నారు? అనే అంశాలు నాకు ఆసక్తిగా అన్పించాయి. ► కథ గురించి ఎవరెవర్ని కలిశాననేది కొన్ని కారణాల వల్ల చెప్పలేను. కానీ, ఎన్టీఆర్‌గారి ఫ్యామిలీని మాత్రం కలవలేదు. కలవను కూడా! ఎందుకంటే... ఎన్టీఆర్‌గారితో ఎమోషనల్ కాంటాక్ట్ ఉన్నవాళ్లకు వ్యక్తిగతంగానో, రాజకీయంగానో, మరో రకంగానో ఏవో ప్రయోజనాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని తమ అభిప్రాయాల్ని చెబుతారు. అప్పుడు నేను నిజాన్ని తెలుసుకోలేను. ఎవరికైతే వ్యక్తిగత ప్రయోజనాలు లేవో... వాళ్లను కలిశా. రామారావుగారింట్లో పనిచేసిన డ్రైవర్ని కలిశా. పనివాళ్లనూ, ఒక వంట వ్యక్తిని కూడా కలిశా. వాళ్లకు ఏం తెలీదని మనమంతా అనుకుంటాం. కానీ, మన ఇంట్లో పనిచేసే వాళ్లకు మన గురించి తెలిసినంత మనకు కూడా తెలీదని నేను నమ్ముతా. ► సినిమాలో నటీనటులుగా అందర్నీ కొత్తవాళ్లనే తీసుకుంటా. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవరెవరి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ సినిమాలో పాత్రలుగా ఉంటాయో... ఇప్పుడే చెప్పలేను. -
రాంగోపాల్ వర్మ వర్సెస్ మంత్రి సోమిరెడ్డి
సాక్షి, అమరావతి : ఎన్టీ రామారావు జీవిత చరిత్ర కథాంశంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించ తలపెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై బుధవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సినీ దర్శకుడి మధ్య విమర్శల యుద్ధం జరిగింది. సినిమాలో లక్ష్మీ పార్వతినే హీరోయిన్గా పెట్టుకొండని మంత్రి సోమిరెడ్డి ఎద్దేవా చేయగా.. ‘లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా’ అంటూ రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. సినిమా నిర్మాణంపై మంత్రి సోమిరెడ్డి బుధవారం వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలతో సంచలనం అవ్వాలనుకుంటారు. పనీ పాట లేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీపార్వతినే హీరోయిన్గా పెట్టుకోండి. ఈ సినిమా వెనుక వైసీపీ నేతలు ఉన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రకు భంగం కలిగేలా సినిమా ఉంటే ఆయన అభిమానులు రాంగోపాల్ వర్మకు బుద్ధి చెబుతారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు జగన్ నిర్మాతగా ఉండి, లక్ష్మీపార్వతిని హీరోయిన్గా, జబర్దస్త్ నటులను సినిమాలో కో ఆర్టిస్టులుగా పెట్టుకుంటే మరీ మంచిది’ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసని చెప్పారు. మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ వెంటనే స్పందించారు. ‘మీ ఉచిత సలహాకు ధన్యవాదాలు. మీరు ఓకే అంటే లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. -
రాజకీయాలకు అతీతంగా... లక్ష్మీస్ ఎన్టీఆర్
‘‘రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే ఈ సినిమా తీయాలనేది మా ఇద్దరి (వర్మ, రాకేశ్‌రెడ్డి) ఆంతరంగిక అభిమతం’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని తీయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పి. రాకేశ్‌రెడ్డి నిర్మించనున్నారు. ‘‘ఒక్క అడుగు (లక్ష్మీ పార్వతిది) ఓ వ్యక్తి (ఎన్టీఆర్) హృదయంలో ప్రేమను, వందలమంది హృదయాల్లో ద్వేషాన్ని సృష్టించింది. కానీ, అదే అడుగు లక్షలమంది మళ్లీ ఆయన్ను ప్రేమించేలా చేసింది – ఇదే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రకథ’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. -
25 ఏళ్ల తరువాత వారి కాంబినేషన్లో..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ హీరో నాగార్జున ప్రధాన పాత్రతో ఓ సినిమా తీయబోతున్నట్లు మంగళవారం తన ఫేస్బుక్ పోస్ట్‌చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. తమ కాంబినేషన్లో వచ్చిన శివ సినిమాకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు నేను, నాగ్ చేసిన సినిమాలన్నింటికి ఇది భిన్నంగా ఉంటుదన్నారు. నాకు శివ సినిమా మంచి సక్సెస్‌ని ఇచ్చిదని, ఈ సినిమాతో మరోసారి తన అంచనాలను అందుకుంటానని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. కాగా నాగ్ ఆర్జీవీ కాంబినేషన్లో 25 సంవత్సరాల తరువాత ఓ సినిమా రూపొందనుండటం విశేషం. -
వర్మ ఇంకో బుల్లెట్ వదిలాడు..
హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకో పుస్తకం రాస్తున్నాడట. కేవలం తన కామెంట్స్, సినిమాలతోనే కాకుండా ట్విట్స్తో కూడా సంచలనాలు క్రియేట్ చేసే వర్మ మరో బుక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాడట. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్ చేశాడు. 'బుల్లెట్స్ అండ్ బూబ్స్' పేరుతో ఒక పుస్తక రచనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపాడు. ముంబై కి చెందిన మాఫియా డాన్ జీవితానికి సంబంధించి అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నాడు. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తాను కలిసినపుడు తనకెదురైన అనుభవాలు, డాన్ తనతో పంచుకున్న అభిప్రాయాలు ఇందులో వుంటాయని వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇతర గ్యాంగ్ స్టర్లతో పోలిస్తే దావూద్ చాలా మిస్టీరియస్ గా ఎవరికీ అంతు చిక్కకుండా వుండడం తనకు నచ్చుతుందన్నాడు. ఈ 20 ఏళ్లలో అతనికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఇంతకాలంగా అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యాన్ని అతను ఎలా ఏలాడు ..తదితర అంశాలు ఇందులో ఉంటాయంటూ అభిమానులను ఊరిస్తున్నాడు. కాగా ఇప్పటికే కే 'నాఇష్టం', 'గన్స్ అండ్ థైస్' పేరుతో పుస్తకాలను విడుదల చేసిన వర్మ అనేక విమర్శల పాలయ్యాడు. మరి తనదైన శైలిలో చెలరేగి టైటిల్ పెట్టిన తాజా పుస్తకంపై ఎలాంటి విమర్శలు, వివాదాలు రగలనున్నాయో వేచి చూడాల్సిందే. My "Bullets and Boobs" book will have a chapter on my experience on when I met the greatest Gangster ever — Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2016