
ఆల్మోస్ట్ 28 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజైంది. అంతే... బాక్సాఫీసు బద్దలైంది. ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఓ నయా ట్రెండ్ స్టార్టయ్యింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అనేలా సీన్ మారింది. అంతలా సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘శివ’. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌ను రిపీట్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూట్‌ను ఈ నెల 20న స్టార్ట్ చేయనున్నారు.
విశేషం ఏంటంటే..‘శివ’ సినిమా ఫస్ట్ షాట్‌ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ చిత్రం షూటింగ్‌ని కూడా స్టార్ట్ చేయనున్నారు. దీంతో సేమ్ ప్లేస్.. సేమ్ కాంబినేషన్.. సేమ్ హిట్ కన్ఫార్మ్ అంటున్నారు అక్కినేని అభిమానులు. పడిరి సుధీర్ చంద్ర సమర్పణలో రామ్‌గోపాల్‌వర్మ కంపెనీ బ్యానర్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. నవంబర్‌లో స్టార్ట్ చేసిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలతో పాటు, ఇతర విషయాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment