
టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ- నాగార్జున కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం శివ. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు పూర్చి చేసుకున్న సందర్భంగా హీరో నాగార్జున ట్వీట్ చేశారు. శివ మూవీ రోజులను గుర్తు చేసుకున్నారు.
నాగార్జున తన ట్వీట్‌లో రాస్తూ..'శివ రిలీజై నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజు మా నాన్నగారు ఏఎన్‌ఆర్ కలిసి కారులో డ్రైవింగ్ చేయడం ఇప్పటికీ మరిచిపోలేను. ఆరోజు రాత్రి నాన్నాగారు శివ సినిమా చూసి..తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా శివని సూపర్‌హిట్ చేసిన అభిమానులకు.. అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్జీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.
నాగార్జున పోస్ట్‌కు దర్శకుడు ఆర్జీవీ సైతం స్పందించారు. నా జీవితంలో గొప్ప బ్రేక్ ఇచ్చారంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు, నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. శివ లేకపోతే ఈ రోజు నేను ఉండేవాన్ని కాదంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా.. శివ చిత్రంలో అమలా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.
And thank you for giving me a BREAK of a LIFE TIME ..Without ur unwavering support and absolute trust in me , there wouldn’t have been neither SHIVA nor ME 🙏🏻 https://t.co/a5W2Y8BcUn
— Ram Gopal Varma (@RGVzoomin) October 6, 2024