Shiva
-
లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!
గయాసురుడు... పేరుకే అసురుడు కానీ ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు. అతడొకసారి విష్ణువును గురించి గొప్ప తపస్సు చేసి, తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు. తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పు విస్తరించి, జీవించసాగాడు. దాంతో ప్రతివారూ గయుణ్ణి తాకి మోక్షం ΄పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోవడంతో ఇంద్రుడికి, యమధర్మరాజుకు పని లేకుండా పోయింది. దాంతో వారిద్దరూ కలిసి బ్రహ్మవద్దకు వెళ్లి, ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వైచిత్రి గురించి త్రిమూర్తులు పరిపరివిధాలుగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇంద్రుడు గయాసురుడి వద్దకెళ్లాడు. ‘‘గయాసురా! లోకకల్యాణం కోసం మేమంతా కలసి ఒక యజ్ఞం చేయదలచుకున్నాము. ఆ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగినదనిపించింది. కనుక నీవు అనుమతిస్తే, నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము’’ అని అడిగాడు ఇంద్రుడు. గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి, తన శరీరాన్ని పెంచి ఉత్తరదిశగా తలను ఉంచి పడుకున్నాడు. సకల దేవతలు, రుషులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా, బ్రహ్మదేవుడు యజ్ఞం ఆరంభించాడు. అయితే, యజ్ఞంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నితత్వాన్ని తట్టుకోలేక గయుడి తల కదలడం ప్రారంభించింది. బ్రహ్మ సూచన మేరకు ‘దేవవ్రత’ అనే శిలను గయుడి తల మీద ఉంచి, ఆ శిలమీద విష్ణువు నిల్చున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞవేడిమిని, తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుడిని చూసి హృదయం ద్రవించిపోయిన విష్ణువు ‘‘వత్సా! ఏదైనా వరాన్ని కోరుకో’’ అని అడిగాడు. అందుకు గయాసురుడు ‘‘దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల, అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదధూళి సోకడం వల్ల నా జన్మ ధన్యమైంది. నేను ఇంతకుముందు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనదైనప్పటికీ, మీ భక్తుడినైన నన్ను సంహరించలేక, ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది. అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ అని కోరుకున్నాడు. నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు అనుగ్రహించాడు. గయుడి శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ. పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ. రాక్షసుడైనప్పటికీ, లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు. ‘‘నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ దాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ – డి.వి.ఆర్(చదవండి: ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి) -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఒకే ఆస్పత్రిలో తండ్రి మరణం.. కొడుకు జననం
రాజోళి: విధి ఆ కుటుంబంతో వింత నాటకమాడింది. భర్త చనిపో యాడని బాధపడాలో.. అతనికి ప్రతిరూపంగా జన్మించిన కొడుకు ను చూసి సంబరపడాలో తెలియని దయనీయస్థితి ఏర్పడింది ఆ తల్లి కి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజో ళి మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివ (28)కు ఏపీ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా బల పాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో ఏడాది క్రితం వివాహమైంది. కాగా మంగళవారం శివ తుమ్మలపల్లె నుంచి రాజోళికి వెళ్తున్న క్ర మంలో బైక్ అదుపు తప్పి కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శివ భార్య లక్ష్మితో పాటు కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శివ మృతి చెందగా, తర్వాత గంట సమయంలోనే పురిటి నొప్పు లతో శివ భార్య అదే ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఒకవైపు భర్త చనిపోయాడనే బాధ.. మరోవైపు కొడుకు రూపంలో మళ్లీ జన్మించాడనే నమ్మకంతో ఆమె పడిన వేదన వర్ణనాతీతం. పుట్టిన బిడ్డను చూసుకునే భాగ్యం తండ్రికి లేదని, బిడ్డకు తండ్రిని చూపించే అదృష్టం తల్లికి లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ట్యాక్సీ డ్రైవర్ కోసం లండన్ నుంచి హైదరాబాద్‌కు వివాహిత
శంషాబాద్: ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఓ యువకుడు పంపిన మేసేజ్‌కు ఆ వివాహిత మనసు గతితప్పింది. ‘మీ నవ్వు బాగుంటుంది’ అన్న మేసేజ్ చూడగానే 17 ఏళ్ల వివాహ బంధాన్ని సైతం ఆమె పక్కన పెట్టేసింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న స్పృహ మరచి మెసేజ్ పంపిన వ్యక్తి కోసం ఏకంగా విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని భాగ్యనగరానికి వాలిపోయింది. ఆన్లైన్ పేమెంట్‌తో.. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఓ జంటకు 17 ఏళ్ల కిందట పెళ్లయింది. వారికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలం కిందట భర్తకు లండన్‌లో ఉద్యోగం రావడంతో ఆయన ఒక్కడే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహిత తల్లి చనిపోవడంతో ఆమె అస్తికలను కలిపేందుకు పహాడీషరీఫ్‌కు చెందిన ఓ ట్రావెల్స్ కారును బుక్ చేసుకొని వెళ్లి వచ్చింది. గూగుల్ పే ద్వారా ట్యాక్సీ డ్రైవర్ శివకు కిరాయి చెల్లించింది. దీంతో వివాహితపై కన్నేసిన అతను.. ఆమెకు గుడ్ మార్నింగ్ సందేశాలు పంపేవాడు. తొలుత వాటిని పట్టించుకోని వివాహిత ఆ తర్వాత అతని పొగడ్తల సందేశాలకు కరిగిపోయింది. ట్యాక్సీ డ్రైవర్‌తో ఫోన్లో సంభాషించడంతోపాటు పలుమార్లు అతన్ని కలిసింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన అత్తింటి వారు.. ఈ విషయాన్ని భర్తకు ఫోన్లో వివరించారు. దీంతో అతను భార్య, ఇద్దరు పిల్లలను సెపె్టంబర్ 16న హైదరాబాద్ నుంచి లండన్ రప్పించుకున్నాడు. ఏం జరిగింది..? లండన్ వెళ్లినా వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. సెపె్టంబర్ 29న భర్త తల్లి చనిపోవడంతో అతను హైదరాబాద్ వచ్చాడు. ఆ మర్నాడే వివాహిత తన ఇద్దరి పిల్లలను లండన్‌లోని ఓ పార్కుకు తీసుకొచ్చి అక్కడే వదిలేసి ట్యాక్సీ డ్రైవర్‌ను కలిసేందుకు ముంబై మీదుగా హైదరాబాద్ చేరుకుంది. తల్లి తమను వదిలేసి ఎటో వెళ్లిపోయిందంటూ పిల్లలు తండ్రికి ఫోన్లో చెప్పడంతో అతను హుటాహుటిన ఈ నెల 1న లండన్‌కు తిరిగి చేరుకున్నాడు. భార్యకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చిoది. చివరకు కాల్ కలవడంతో ఆమెతో మాట్లాడగా తనను ఎవరో కిడ్నాప్ చేసి శంషాబాద్ మధురానగర్ నుంచి బాలాపూర్ వైపు తీసుకెళ్తున్నట్లు భర్తకు చెప్పింది.దీంతో అతను వెంటనే తన స్నేహితులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆన్లైన్లో ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్జీఐఏ, రాజేంద్రనగర్, బోయిన్పల్లి పోలీసులు ఆమె ఫోన్‌ను ట్రాక్ చేయగా చివరకు ఫోన్ లొకేషన్ రాజేంద్రనగర్‌లో చూపింది.శంషాబాద్ టు గోవా.. పలుమార్లు ట్యాక్సీ డ్రైవర్ ఫోన్‌కు కూడా ఫోన్లు చేయగా ఓసారి వివాహిత లిఫ్ట్ చేసి మాట్లాడింది. ట్యాక్సీ డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని.. తాము గోవాలో ఉన్నట్లు తెలిపి లైవ్ లోకేషన్ షేర్ చేసింది. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వస్తున్నట్లు బస్సు టికెట్‌ను వాట్సాప్ చేసింది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం ఆరాంఘర్ వద్ద వారిని బస్సులోంచి దింపి ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనకు చెప్పకుండా లండన్ ఎందుకు వెళ్లావని.. ఆత్మహత్య చేసుకొని నువ్వే కారణమని చెబుతానని ట్యాక్సీ డ్రైవర్ బ్లాక్మెయిల్ చేయడంతోనే తాను హైదరాబాద్‌కు వచ్చానని వివాహిత పోలీసులకు తెలిపింది. అయితే ట్యాక్సీ డ్రైవర్ మాత్రం ఈ నెల 5న తన పుట్టినరోజు ఉన్నందున.. ఆ వేడుకకు రావాలని ఆహ్వానించడంతో వివాహిత ఇష్టపూర్వకంగానే వచ్చిoదని పోలీసులకు వివరించాడు. మరోవైపు తన భార్యను తిరిగి లండన్ పంపాలని భర్త ఆర్జీఐఏ పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు ఆమెను సోమవారం సాయంత్రం దగ్గరుండి లండన్ విమానం ఎక్కించారు. ట్యాక్సీ డ్రైవర్‌ను విచారించిన పోలీసులు... ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగానే కలుసుకున్నందున అతనిపై కేసు నమోదు చేయలేదు. -
ఆ రోజు నాన్నగారు చెప్పిందే నిజమైంది: నాగార్జున
టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ- నాగార్జున కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం శివ. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు పూర్చి చేసుకున్న సందర్భంగా హీరో నాగార్జున ట్వీట్ చేశారు. శివ మూవీ రోజులను గుర్తు చేసుకున్నారు.నాగార్జున తన ట్వీట్లో రాస్తూ..'శివ రిలీజై నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజు మా నాన్నగారు ఏఎన్ఆర్ కలిసి కారులో డ్రైవింగ్ చేయడం ఇప్పటికీ మరిచిపోలేను. ఆరోజు రాత్రి నాన్నాగారు శివ సినిమా చూసి..తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా శివని సూపర్‌హిట్ చేసిన అభిమానులకు.. అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్జీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.నాగార్జున పోస్ట్‌కు దర్శకుడు ఆర్జీవీ సైతం స్పందించారు. నా జీవితంలో గొప్ప బ్రేక్ ఇచ్చారంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు, నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. శివ లేకపోతే ఈ రోజు నేను ఉండేవాన్ని కాదంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా.. శివ చిత్రంలో అమలా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.And thank you for giving me a BREAK of a LIFE TIME ..Without ur unwavering support and absolute trust in me , there wouldn’t have been neither SHIVA nor ME 🙏🏻 https://t.co/a5W2Y8BcUn— Ram Gopal Varma (@RGVzoomin) October 6, 2024 -
‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అంటూ రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు కావచ్చు లేదా ఆ సినిమాకి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు... సందర్భం ఏదైనా రీ రిలీజ్‌కి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతుండటం కూడా ఓ కారణం. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా ‘వన్స్ మోర్’ అంటూ ఆ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత చిత్రాలను 4కె క్వాలిటీతో అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ ఈ నెల 22న విడుదల కాగా, నాగార్జున ‘శివ’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘ఈశ్వర్, డార్లింగ్’, ధనుష్ ‘త్రీ’ వంటి సినిమాలు రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆ విశేషాల్లోకి...మొక్కే కదా అని... ‘వీరశంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’, ‘షౌకత్ అలీఖాన్... తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నా... లేకుంటే తలలు తీసుకెళ్లేవాణ్ణి’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది... ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’.. వంటి డైలాగులు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చెబుతుంటే అభిమానుల, ప్రేక్షకుల ఈలలు, కేకలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఇంద్ర’. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవి బర్త్ డే కానుకగా 2002 జూలై 22న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి మణిశర్మ సంగీతం, పాటలకు తగ్గట్టు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఇంద్ర’ విడుదలైన 22 ఏళ్లకు సరిగ్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు మేకర్స్. రీ రిలీజ్లోనూ థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ప్రత్యేకించి పాటల సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు వేస్తున్నారు. 22 ఏళ్లకు రీ రిలీజైన ‘ఇంద్ర’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం. సైకిల్ చైన్‌తో... నాగార్జున నటించిన చిత్రాల్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ వెండితెర పైకి రానున్నాయి. ఒకటి ‘శివ’, మరోటి ‘మాస్’. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 35 ఏళ్లకి ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే.. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు రానున్నాడు శివ. మమ్మమ్మాస్ ‘వచ్చే నెల ఒకటో తారీఖుకి నువ్వు ఉండవ్.. పదిహేనో తారీఖుకి నీకు భయమంటే ఏంటో తెలుస్తుంది.. ఇరవయ్యో తారీఖుకి నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది.. ఇరవైఅయిదో తారీఖుకి పబ్లిక్‌కి నువ్వంటే భయం పోతుంది.. ఒకటో తారీఖు నువ్వు ఫినిష్’ అంటూ తనదైన స్టైల్లో నాగార్జున చెప్పిన డైలాగ్స్ ‘మాస్’ చిత్రంలోనివి. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మాస్’. ఈ మూవీలో జ్యోతిక, ఛార్మీ కౌర్ హీరోయిన్లు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా 2004 డిసెంబరు 23న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా దాదాపు 20 ఏళ్లకు మమ్మమ్మాస్ అంటూ ‘మాస్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 28న ‘మాస్’ సినిమాని రీ రిలీజ్ చేస్తోంది యూనిట్. తిక్క చూపిస్తా... ‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దబాంగ్’కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా 2012 మే 11న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత ‘గబ్బర్ సింగ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ధూల్‌పేట్ ఈశ్వర్ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి... ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’. మరోటి ‘డార్లింగ్’. నటుడు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఈశ్వర్’. ఈ మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్గా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ తన మాస్ హీరోయిజమ్‌ను చూపించారు. కె. అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న విడుదలై, ఘన విజయం సాధించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్లస్ అయింది. దాదాపు 22 ఏళ్లకు మరోసారి ‘ఈశ్వర్’ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఈశ్వర్’ని రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. లవర్ బాయ్ డార్లింగ్ ప్రభాస్ లోని లవర్ బాయ్‌ని చక్కగా తెరపై చూపించిన చిత్రం ‘డార్లింగ్’. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 23న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రత్యేకించి ప్రభాస్–కాజల్ ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పద్నాలుగేళ్ల తర్వాత ‘డార్లింగ్’ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డేని పురస్కరించుకుని ‘డార్లింగ్’ని రిలీజ్ చేస్తున్నారు. సో.. తన బర్త్‌డే సందర్భంగా ‘ఈశ్వర్, డార్లింగ్’ సినిమాలతో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ప్రభాస్. మళ్లీ కొలవెరి ధనుష్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘3’. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. కస్తూరి రాజా విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2012 మార్చి 30న రిలీజై హిట్‌గా నిలిచింది. రామ్‌గా ధనుష్, జననిగా శ్రుతీహాసన్‌ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీనేజ్ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా పన్నెండేళ్ల తర్వాత ‘త్రీ’ని మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రీ రిలీజ్ చేయనుంది యూనిట్. సెప్టెంబర్ 14న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కానున్నా యని టాక్. -
అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?
అభిషేకప్రియుడైన ఆ మహాదేవునికి పాలు, నీళ్లతో అభిషేకించి తరిస్తాం. అంతేగాదు ఆయనకు ఎంతో ప్రీతీపాత్రమైన బిల్వపత్రాలతో పూజిస్తాం. అలాంటిది అక్కడ మాత్రం ప్రజలు అవేమీ కాకుండా ఇళ్లు ఊడ్చే చీపురులను సమర్పిస్తారట. ఇదేం వింత ఆచారం రా బాబు అనిపిస్తోంది కదూ..! ఇంతకీ అక్కడ ఇలా ఎందుకు చేస్తారు..? ఆ గుడి ఎక్కడ ఉంది తదితర విశేషాలేంటో చూద్దామా..!ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో ఈ వింత శివాలయం ఉంది. ఇది పురాతన పాతాలేశ్వర్ శివాలయం. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారట.ఈ పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో శివునికి ఇలా చీపురు సమర్పిస్తే కోరుకున్న ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుందని వారి ప్రగాఢ నమ్మకం. చీపురు సమర్పించగానే భోళాశంకరుడు వరాలు వెంటనే ఇచ్చేస్తాడనే నానుడి ప్రచారంలో ఉంది. అంతేగాదు ఇలా చీపురుని సమర్పిస్తే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారట. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. పూర్వీకుల కాలం నుంచి అక్కడి ప్రజలు శివుడికి ఇలా చీపురులను సమర్పించే ఆచారం పాటిస్తున్నారని చెప్పారు ఆలయ పూజారి. అందుకోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలుచుంటారని చెప్పుకొచ్చారు. నిత్యం వదలాది మంది దర్శించుకోవడానికి వస్తుంటారని అన్నారు. ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్‌ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్‌కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించమని సేథ్‌ను కోరాడు. అప్పటి నుంచే ఈ ఆలయంలో చర్మవ్యాధి వచ్చిన వాళ్లంతా ఇక్కడ చీపురు సమర్పించాలని నమ్మకం ఏర్పడింది. ఇలా చేయడం వల్లే తమ కష్టాలు తీరిపోతాయని అక్కడ భక్తులు విశ్వసించడం విశేషం. అందుకే ఇప్పటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకునే ఆచారం కొనసాగుతోంది. ఏదీ ఏమైన కొన్ని పురాతన ఆలయాల్లో ఏర్పడే ఆచారాలు అత్యంత వింతగా ఉంటాయి. ఒక్కరితో మొదలైన నమ్మకం ఆచారంగా మారి బలంగా నమ్మే సంప్రదాయంగా మారిపోతుంది అనడానికి ఈ దేవాలయ కథే ఉదాహరణ. కొన్ని ఆచారాలు ఆరోగ్య రహస్యలతో మిళితమై ఉంటాయి కూడా. అందుకే కాబోలు మన సనాతన ధర్మం అత్యంత గొప్పది అని పదే పదే చెబుతుంటారు పండితులు.(చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
లోక్‌సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్‌గాంధీ
సాక్షి,ఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ప్రసంగం వివాదానికి దారి తీసింది. సోమవారం(జులై1) ఆయన సభలో మాట్లాడుతూ బీజేపీపై లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హిందుత్వ అంటే అబద్ధాలు ప్రచారం చేయడం, ద్వేషం పెంచడం కాదన్నారు.బీజేపీ మాత్రం ఇవే చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హిందువులుగా చెప్పుకునే వాళ్లు హింస, అబద్ధాలు, ద్వేషం గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్లు హిందువులు కాదన్నారు. సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్...స్పీకర్ అభ్యంతరం..అయితే రాహుల్ సభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ శివుని ఫొటోనూ సభలో ప్రదర్శించారు. దీనిని స్పీకర్ ఓంబిర్లా తప్పుపట్టారు. సభలో ప్లకార్డులు, ఫొటోలు ప్రదర్శించడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..నా ఇల్లు, పదవి లాగేసుకున్నారువిపక్ష నేతలను, ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్నారుఈడీ నుంచి 55 గంటల విచారణ ఎదుర్కొన్నాపరమతాత్మ మోదీతో నేరుగా మాట్లాడతారుఅదికారం కంటే నిజం గొప్పదిప్రతిపక్షంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, గర్వపడుతున్నాశివుడి ఎడమ చేతి వెనక త్రిశులం ఉంటుందిత్రిశూలం హింసకు చిహ్నం కాదుఒకవేళ త్రిశూలం హింసకు చిహ్నం అయితే, శివుడి కుడి చేతిలో ఉండేదికొందరికి ఆ చిహ్నం అంటే భయంసభలో గురునానక్ ఫోటోను సైతం ప్రదర్శించిన రాహుల్హిందూ సమాజం అంటే ఒక్క మోదీ కాదుహిందువులంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వారే కాదుసభలో ఉన్నావారు, బయటవారు కూడా హిందువులేరాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం..లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రసంగంపై ప్రధాని మోదీ అభ్యంతరం తెలిపారు. హిందువులు హింసావాదులన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులపై దాడి అని మోదీ అని అభివర్ణించారు.అనంతరం మాట్లాడిన కేంద్రహోం మంత్రి అమిత్ షా రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా మైక్ మళ్లీ కట్ చేశారు.. రాహుల్లోక్‌సభలో తన మైక్‌ను మళ్లీ కట్ చేశారని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. రాహుల్ వర్సెస్ స్పీకర్లోక్సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ.మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలబడే ఇచ్చారని రాహుల్ వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. ‘ తన కంటే వయసులో మోదీ పెద్దవారు కాబట్టే తలవంచానని వివరణ ఇచ్చారు.రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం: రాహుల్కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలో పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు రాహుల్. ‘ఈడీ విచారణను 65 గంటలు ఎదుర్కొన్నా అధికారం కంటే నిజం గొప్పది’ అని రాహుల్ స్పష్టం చేశారు. -
ఇద్దరు స్నేహితుల కథే ‘ఈవీఓఎల్’
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఈవీఓఎల్’ (ఏ లవ్‌స్టోరీ ఇన్ రివర్స్). తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో రామ్ యోగి వెలగపూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు స్నేహితుల మధ్య అవగాహన నేపథ్యంలో సాగే కథే ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్. -
అహం దెబ్బతిని..
శంషాబాద్: జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. కడ్తాల్ మండలం గోవిందాయపల్లికి చెందిన గుండమోనీ శివ (28) మియాపూర్‌లో చికెన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామాని కి చెందిన శేషగిరి శివ (28) నగరంలోని గాయత్రీనగర్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి జలకం రవికి వీరితో స్నేహం ఉంది. ముగ్గురూ బీజేవైఎంలో చురుగ్గా పనిచేశారు. శివ, శేషగిరి శివకు కొంతకాలం క్రితం రవితో మన స్పర్థలు రాగా, వారు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో రవికి వీరికి దూరం పెరిగింది. దీనికితోడు ఈ నెల 4న కడ్తాల్‌లోని బట్టర్ఫ్లై వెంచర్లో రవి తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ 300 ఫొటోలు గోవిందాయిపల్లికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనికి ఇద్దరు శివలు అభ్యంతరం చెబుతూ ఫొటోలు డిలేట్ చేసి, రవిని వాట్సాప్ గ్రూప్‌లో నుంచి తొలగించారు. దీంతో తనను అవమానించి, ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని అంతం చేయాలని రవి నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన పల్లె నాగరాజుగౌడ్, తలకొండ రాజు, జీలుకుంట్ల విజయ్, తిరు పతి జగదీశ్‌గౌడ్, నిట్ల ప్రవీణ్, వల్లేపు దాసు శేఖర్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. వారిద్దరు ఈ నెల 5న ఓ వైన్స్ దుకాణంలో మద్యం తాగుతున్నారని తెలుసుకున్న రవి.. తన ఇన్నోవాలో ఆరుగురు స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. బలవంతంగా వారిని కారులో ఎక్కించుకొని బట్టర్ఫ్లై వెంచర్లో తాను అద్దెకుంటున్న గది వద్దకు తీసుకొచ్చి హతమార్చారు. ఆ తర్వాత గదికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మీర్పేట్ వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్.. ఆర్జీవీ పోస్ట్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనే. టాలీవుడ్లో తనదైన మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆర్జీవీ. నాగార్జునతో కలిసి తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో అమలా హీరోయిన్గా నటించింది.అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. శివ మూవీని త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్లో(ఎక్స్) పోస్ట్ చేశారు. నాగార్జున స్టైల్లో సైకిల్ చైన్ తెంచుతున్న వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్‌కు ఆర్జీవీ సూపర్ హిట్ చిత్రాలు అందించారు. Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024 -
Ram Gopal Varma: అర్థం కానీ డిక్షనరీ.. తెలివైన స్వేచ్ఛా జీవి
అతనో అర్థం కానీ డిక్షనరీ. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నచ్చని పని చెయడు. నచ్చిన పని ఎవరు వద్దన్నా ఆపడు. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తాడు. వోడ్కా తాగుతూ సరదాగా ట్వీట్ చేసి..సంచలనంగా క్రియేట్ చేస్తాడు. కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తోనే సినిమా తీసి.. ‘నచ్చితే చూడండి లేకపోతే లేదు’అంటూ కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పేస్తాడు. ఆయనను తిట్టేవాళ్లు ఉన్నారు.. పొగిడేవాళ్లు ఉన్నారు. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా స్వాతంత్య్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనే రామ్‌గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. నేడు(ఏప్రిల్ 7) అతితెలివైన ఈ ఇన్నోసెంట్ ఫెల్లో బర్త్‌డే. ఈ సందర్భంగా ఆర్జీవీ గురించి ఆసక్తికరమైన విషయాలు.. ► వర్మ స్వస్థలం విజయవాడ. 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో జన్మించాడు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. ► చదువు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్లేవాడట. ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఎప్పటికైన తన పేరు కూడా అలానే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడట. ► ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బతుకుదెరువు కోసం డీవీడీలు, వీసీఆర్‌లు రెంట్‌కి ఇచ్చే దుకాణం పెట్టుకొని.. సినిమా చాన్స్‌ల కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘రావుగారిల్లు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత నాగార్జున తో పరిచయం అతని జీవితాన్ని మార్చివేసింది. ► శివతో సంచలనం: ఆర్జీవీ చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగార్జున. 1989 అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. నాగార్జునతో సైకిల్ చైన్ లాంగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు.సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు.ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే..అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ► ఆ తర్వాత వెంకటేశ్, శ్రీదేవి జంటగా తీసిన క్షణక్షణం మూవీ ఆద్యంతం కొత్త స్ర్కీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాడు. బ్యాంక్ దొంగతనం నేపథ్యంతో తీసిన ఈ చిత్రం సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ► 1993లో రాము, మణిరత్నం తో కలిసి తీసిన ‘గాయం’ జగపతిబాబు కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి జగపతి బాబు ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్నాడు. ► నాగార్జున, శ్రీదేవి జంటగా తీసిన గోవిందా…గోవిందా మూవీ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలన్లు వేంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ పెను దుమారమే రేపింది. సెన్సార్ కత్తెర పడటంతో వర్మ టాలీవుడ్ పై అలిగాడు. ఆ తర్వాత తెలుగు సినిమాలు తీయనని ఒట్టేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ► బాలీవుడ్‌పై దండయాత్ర: రంగీలా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆర్జీవీ. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిలా హీరో హీరోయన్లుగా వర్మ తీసిన ఈ చిత్రం 1994లో రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రంతోనే ఎ.ఆర్.రెహమాన్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ► ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్ చిత్రాల్లో సత్య ఒకటి. తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు, సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు. ► ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ► అమితాబ్ తో తీసిన ‘సర్కార్’ చిత్రం రాము తీసిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అమితాబ్, అభిషేక్ లు తెరపై కూడా తండ్రీ కొడుకులుగా నటించిన ఈ మూవీ తరువాత బాలీవుడ్ ను వర్మవుడ్ గా మార్చాడనే కాంప్లిమెంట్ అందుకున్నాడు. ఈ సినిమా థీం పాయింట్ లో వర్మ చెప్పిన గెలుపోటముల సూత్రం అద్భుతం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్కార్ రాజ్’ కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ ‘సర్కార్ 3’ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ► ‘రక్త చరిత్ర’ తర్వాత ఆర్జీవీ తెలుగులో వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా కాంట్రవర్సీ స్టోరీలతోనే సినిమాలను తెరెక్కిస్తున్నాడు. అయితే వాటిల్లో ఏవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. కానీ వెండితెరపై ఏదైన కొత్త ప్రయోగం చేయాలంటే ఇప్పటికీ ఎవరైనా ఆర్జీవీ తర్వాతనే. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. -
Vemulawada : వేములవాడ ఆలయంలో రాజన్న కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
‘కంగువ’ నాకెంతో స్పెషల్ : హీరో సూర్య
'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలన్న కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు . ప్రతి సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ లీలలు
-
జన్మకో శివరాత్రి అని ఎందుకంటారో తెలుసా!
శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్ధం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసినా సమస్త మంగళాలు ప్రోదిచేసి అందించే దైవం బోళాశంకరుడు అన్నది అందరూ అనుభవైకపూర్వకంగా అనుభవించే సత్యం. మహా శివరాత్రి అనడానికి.. ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు.ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాసశివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు.ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్బంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివ అంటే.. శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది.శివ అంటే మంగళం,శుభం,క్షేమం,భద్రం,శాంతం అనే అర్ధాలు చెప్పబడ్డాయి.అన్నిటికీ ఆధారమైనవాడు శివయ్య.అలసిన జీవుడు ధ్యానంలో చేరేది శివ చైతన్యవలయంలోనికే. పరమ శివుని ఆవిర్భావం అందరికీ తెలిసిందే.భక్త సులభుడు మరియు భక్త వరదుడు శంకరుడు అన్నది పురాణాలు ద్వారా అందరికీ సుపరిచితం. శివతత్వం అంటే.. సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీ మాత శివతత్వం గ్రంథస్తం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని ఘని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి "సిరా" (ఇంక్) గానూ, కల్పవృక్షం కొమ్మను "కలం"(పెన్) గాను, భూమాతను "కాగితం"(పేపర్)గా చేసుకుని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కానీ సశేషం శివతత్వం అని గ్రహించి "పరమేశ్వరా నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభసాధ్యంగా అందరికీ అందేదీ"అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం. శివపూజ.. గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలిపిన అమృతవాక్కు పురాణాల ద్వారా గ్రహించిన మహనీయులు ప్రపంచానికి అందించినది "కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము".సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ రోజు ఉపవాసమే నైవేద్యం:- పార్వతీనాధునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం.తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణమ్ చేసి తీసుకోవచ్చు.శక్తి కొద్దీ ఎవరు ఇష్టపూర్వకంగా సమర్పించే ఆహారం అయినా పరమాత్మునికి ప్రీతికరమైనది. అభిషేకప్రియుడు.. లింగరూపుడు అయిన శివయ్యకు శుద్ధజలం(మంచి నీరు)అత్యంత ప్రీతి కరమయిన అభిషేకద్రవ్యం.గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత.మరో రకంగా ఆలోచిస్తే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు భగవానుడు.శక్తి కొద్దీ పంచామృతాలు,పళ్లరసాలు భక్తులు సమర్పిస్తారు.ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది.స్థూలంగా శివునికి అభిషేకం అత్యంత ప్రియం. బిల్వదళం.. మారేడుదళాలు సంవత్సరం మొత్తంలో శిశిరఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండటమే కాక శరీరం లోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళకంటుడికి మారేడుదళం సమర్పిస్తారు భక్తులు.ఈ బిల్వదళం సమర్పణలో ఒక్కో రకమయిన పురాణ వివరణలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజును ఉపవాసంతో శివుడిని అర్చించి జాగరణ చేయడం అనేది అత్యంత కష్టమైన విధి విధానం. వీటన్నింటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైన నియమంగా చేస్తే చాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఆర్కోక్తి జన్మకో శివరాత్రి. అందువల్లే దీన్ని మహా శివరాత్రి అని కూడా పిలవడం జరిగింది. ఐక్యతకు శివకుటుంబం ఆదర్శం.. పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు,సింహం,నెమలి,ఎలుక ఏంతో అన్యోన్యతతో ఒదిగి ఉండటం ప్రస్తుత సమాజానికి ఒక విలువైన పాఠం.ఎన్నో వైరుధ్యాలు,భావాలు,వ్యక్తిత్వాలు ఉన్నా సమాజం అనే గొడుగు క్రింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి మరియు సౌబ్రాతృత్వాలు అందించగలం.ఐక్యతే విజయ సూత్రం అని చెబుతోంది శివకుటుంబం. దయగల దైవం చంద్రశేఖరుడు. భక్తితో శివునికి చేరవ్వవుదాం. సత్కర్మలు ఆచరించి నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఇవ్మమని అడుదాం. శివతత్వాన్ని శాశ్వతం చేసుకుందాం మన నిత్య జీవనవిధానంలో.. (చదవండి: శివయ్య అనుగ్రహం కావాలంటే..) -
పరమ శివుని భక్తిని చాటి చెప్పే చిత్రాలు.. ఎంచక్కా ఓటీటీల్లో చూసేయండి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి మొదలైంది. శివనామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ, ఉపవాసం చేయడం ఆనవాయితీ. అలా ఆ పరమశివుడిని, పార్వతిదేవిని స్మరించుకుంటూ భక్తితో పొంగిపోతుంటారు. ఇప్పటికే ఆ పరమ శివుని మహిమలపై వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. శివరాత్రి సందర్భంగా శివున్ని తరించుకుంటూ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే. శివుని భక్తిని చాటి చెప్పే సినిమాల జాబితాను మీకోసం తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఓటీటీల యుగంలో ఏయే సినిమా ఏక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరే చూసేయండి. అలాగే శివరాత్రికి కచ్చితంగా చూడాల్సిన సినిమాల జాబితా ఇదుగో మీ కోసమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మహాభక్త సిరియాళ భక్త శంకర అమెజాన్ ప్రైమ్ భక్త కన్నప్ప ఎరోస్ నౌ శ్రీ మంజునాథ శివకన్య జీ5 మహాశివరాత్రి జియో సినిమా శివరాత్రి మహత్యం యూట్యూబ్ భక్త సిరియాళ భక్త మార్కండేయ శ్రీ మంజునాథ ఉమాచండీ గౌరీశంకరుల కథ కాళహస్తి మహత్యం శివలీలలు మహాశివరాత్రి దక్షయజ్ఞం జగద్గురు ఆదిశంకర మావూళ్లో మహాశివుడు శివకన్య శివరాత్రి మహత్యం వీటిలో భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ భక్త మార్కండేయ, మహాభక్త సిరియాళ మరింత విశేషం కానుంది. మహాభక్త సిరియాళ చిత్రంలో తారకరత్న, అర్చన జంటగా నటించారు. వీటితోపాటు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీహారి నటించిన జగద్గురు ఆదిశంకర చూడాల్సిన సినిమా. ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి.. -
కోయంబత్తూరులోని ఆదియోగి శివ: వితికాశేరు భక్తి పారవశ్యం (ఫోటోలు)
-
విదేశాల్లోని ప్రముఖ శివాలయాలివే..
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం, శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి 2024, మార్చి 8న వచ్చింది. ఆ రోజున శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. మహాశివుడు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పూజలందుకుంటున్నాడు. విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం(నేపాల్) మన పొరుగు దేశం నేపాల్‌లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శివాలయం పశుపతినాథ్ మందిరం. శివరాత్రినాడు లక్షలాది శివభక్తులు ఇక్కడికి మహాశివుని దర్శనం కోసం తరలివస్తారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. పశుపతినాథుని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారికి మరో జన్మలో జంతు రూపం రాదని నమ్ముతారు. మున్నేశ్వరం (శ్రీలంక) నేపాల్‌లో మాదిరిగానే శ్రీలంకలోనూ అత్యంత పురాతన శివాలయం ఉంది. దాని పేరు మున్నేశ్వరం. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుని వధించిన తరువాత రాముడు తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి ఈ ఆలయంలో పూజించాడని అంటారు. శివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారుతుంది. శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం(మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం.. ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని గాజుతో నిర్మించారు. ఆలయంలోని గోడలపై సుమారు మూడు లక్షల రుద్రాక్షలను పొదిగారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ఈ ప్రసిద్ధ శివాలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో ఉంది. ప్రంబనన్ ఆలయం ఎనిమిది దేవాలయాల సమూహం. ఈ ఆలయం 850 బీసీలో నిర్మితమయ్యింది. ఈ శివాలయం గోడలపై విష్ణువు, హనుమంతుడు, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవుళ్ళు, దేవతల గురించిన వివరాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం దీప కాంతులతో వెలిగిపోతుంది. ముక్తి గుప్తేశ్వరాలయం (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్తేశ్వరాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ శోభ రెండింతలవుతుంది. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉంది. ఈ ఆలయం చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. -
శివ బాలకృష్ణ కేసులో మరో కీలక ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రెండు కోట్ల 70 లక్షల రూపాయలను నగదును సీజ్ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై ఆరా తీస్తోంది. పలు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులపై ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదీ చదవండి: తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు! -
శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున 52 ఎకరాల భూములు
సాక్షి, యాదాద్రి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బయటపడ్డాయి. ఆయనపై జరుగుతున్న విచారణ సందర్భంగా.. భువనగిరి జిల్లాలో భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలువైన వ్యవసాయ భూములను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ చేసుకున్నట్లు తేలింది. వలిగొండ, బీబీనగర్, మోత్కూరు మండలాల్లో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున గల 52.31 ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి వాటిని ఫ్రీజ్ చేయాలని కోరినట్లు సమాచారం. రిజిస్టర్ డాక్యుమెంట్ల కావాలి శివబాలకృష్ణ కుటుంబ సభ్యులైన శివనవీన్, శివఅరుణ, ఎస్.ప్రసాద్, ఎస్.పద్మావతి, ఎస్.రఘుదేవి పేరున వ్యవసాయ భూముల డాక్యుమెంట్ల ఫ్రీజ్ చేయాలని కలెక్టర్‌ను ఏసీబీ అఽధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్లు, స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, మ్యుటేషన్ ఫైల్స్ ఇవ్వాలని కోరారు. అలాగే, శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబందించిన డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్లను నిలిపివేయాలని, తాము ఇచ్చిన వివరాల ప్రకారం ధరణీ పోర్టల్లోఉన్న రికార్డులను, కార్యాలయంలో ఉన్న రికార్డుల హార్డ్ కాపీలను పరిశీలించాలని కోరారు. శివబాలకృష్ణ పేరు మీద జిల్లాలో ఇంకేమైన ఆస్తుల డాక్యుమెంట్లు ఉంటే వాటికి సంబంధించి చెల్లించిన ఫీజు వివరాలను తమకు ఇవ్వడంతోపాటు వాటిని కూడా ఫ్రీజ్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. 22 మంది ఆధార్‌కార్డులు శివబాలకృష్ణకు కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు, స్నేహితులు, బావమరిది, సొదరుని కుమారులు, కోడలు, వారి స్నేహితులకు సంబంధించి మొత్తం 22మంది ఆధార్ కార్డులు కలెక్టర్‌కు ఏసీబీ అధికారులు పంపించారు. జిల్లాలో ఎక్కడైనా వీరికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆస్తిపాస్తుల వివరాలు తమకు ఇవ్వడంతో పాటు వాటికి సంబంఽధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవీ.. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరుతో భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారులు గుర్తించిన భూముల వివరాలు ఇలావున్నాయి.. వలిగొండ మండలం నర్సాపూర్‌లో ఎస్.హరిప్రసాద్ పేరున 8 ఎకరాలు, ఎస్.రఘుదేవి పేరున 11.03 ఎకరాలు, వలిగొండ మండల చిత్తాపురంలో ఎస్.పద్మావతి పేరున ఎకరం 30 గుంటలు, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో శివఅరుణ పేరున 20 గుంటలు, మోత్కూరు మండలం పాలడుగులో శివనవీన్ పేరున 6.32 ఎకరాలు, 12.5 ఎకరాలు, వలిగొండ మండలం రెడ్లరేపాకలో శివనవీన్ పేరున 4.22 ఎకరాలు, 5.32 ఎకరాల వ్యవసాయ భూమిని వారి కుటుంబ సభ్యులపేరున ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ -
Bommak Siva: సినిమా అంతా ఒకటే పాత్ర ఉంటుంది
‘‘105 మినిట్స్’ మంచి ప్రయోగాత్మక చిత్రం. సినిమా మొత్తం ఒకటే పాత్ర ఉంటుంది. కానీ, ఇంకో వాయిస్ వినిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ బాలీవుడ్ నటుడి మాటలు వినిపిస్తుంటాయి’’ అని నిర్మాత బొమ్మక్ శివ అన్నారు. హీరోయిన్ హన్సిక లీడ్ రోల్లో రాజు దుస్సా దర్శకత్వం వహించిన చిత్రం ‘105 మినిట్స్’. బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. బొమ్మక్ శివ మాట్లాడుతూ– ‘‘నాకు రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్‌లు ఉన్నాయి. సినిమాపై ఫ్యాషన్‌తో మొదటి ్రపాజెక్టుగా ‘105’ మూవీ తీశాను. రాజు దుస్సా చక్కగా తీశాడు. హన్సికను ఈ మూవీలో కొత్తగా చూస్తారు. మైత్రీ మూవీస్ సంస్థ మా సినిమాని రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
జన్మదినం రోజే యువకుడి విషాదం..
మహబూబాబాద్ / వరంగల్: జన్మదినం రోజునే ఓ యువకుడు అనంతలోకాలకు చేరాడు. తన బర్త్‌డే వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన కమలాపూర్ మండలం కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వంగపల్లికి చెందిన నకీర్త శివ (20) కమలాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం శివ ఇంట్లో మల్లన్న పట్నాలు వేశారు. అదేరోజు శివ పుట్టిన రోజు కూడా కావడంతో స్నేహితులు సాయంత్రం ఫోన్ చేసి పిలిచారు. దీంతో స్నేహితుల వద్దకు వెళ్లి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నాడు. తిరిగి అదేరోజు రాత్రి ద్విచక్రవాహనంపై వంగపల్లిలోని తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో కమలాపూర్‌లోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద నడికూడ నుంచి కొత్తకొండకు వెళ్తున్న ట్రాక్టర్.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందగా అతడితో పాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కమలాపూర్‌కు చెందిన మరో యువకుడు అరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇవి చదవండి: ప్రేయసి కోసం పరీక్ష.. చిక్కుల్లో ప్రియుడు! -
నవరసాల రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్ ప్రోఫెసర్‌గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ మేగోటి– సుధాకర్ మారియో, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు.