రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ టీజ‌ర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Maker Announced Rajinikanth Annaatthe Teaser Release Date | Sakshi
Sakshi News home page

Annaatthe: రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ టీజ‌ర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Tue, Oct 12 2021 11:07 AM | Last Updated on Tue, Oct 12 2021 11:08 AM

Maker Announced Rajinikanth Annaatthe Teaser Release Date - Sakshi

సూపర్‌ స్టార్‌ ర‌జనీకాంత్కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. దీంతో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవ‌ల విడుదలైన ఈ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్స్, సాంగ్స్ ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం.


సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధిమారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని అక్టోబర్‌ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఇప్పటికే భారీ అంచనాలు ఉండడంతో ఇది కచ్చితంగా రికార్డులు తిరగ రాస్తుందని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. కీర్తిసురేశ్‌, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ నవంబర్‌ 4న థియేటర్స్‌లో విడుదల కానుంది.

చదవండి: అక్టోబర్‌ 4న ఎస్పీ బాలు ఆలపించిన చివరి పాట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement