శివభక్తి గాన సుధ
శ్రీశైలం: నాగులకట్ట కళావేదికపై బుధవారం రాత్రి కళానీరాజనంలో భాగంగా మనో(నాగుర్‌బాబు) బృంద సభ్యులు శివభక్తి గాన సుధ కార్యక్రమాన్ని నిర్వహించారు. వక్రతుండ మహాకాయ, గణపతి స్తోత్రంతో ప్రారంభించి.. శివభక్తి గీతాలను ఆలాపించారు. ఈ సందర్భంగా ఈఓ నారాయణభరత్ గుప్త మాట్లాడుతూ.. సాంస్కృతిక వారోత్సవాల్లో భాగంగా దేవస్థానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తి గానసుధలో మనోతోపాటు పవన్ చరణ్, శ్రీనిధి, కె. లక్ష్మీ కీర్తనలు పాల్గొన్నారు. మనో ఆరెస్ట్రా బృందం వాయిద్య సహకారాన్ని అందించగా, హైదరాబాద్‌కు చెందిన నేతి శ్రీశైలం అండ్ సన్స్ శ్రీస్వామిఅమ్మవార్ల సేవగా వీరు స్పాన్సర్స్‌గా వ్యవహరించినట్లు తెలిపారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, దేవస్థానం వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నేడు కథక్ నృత్య ప్రదర్శన
కళానీరాజనంలో భాగంగా గురువారం రచనా యాదవ్ గురుగాన్.. కథక్ నృత్యప్రదర్శన ఉంటుందని ఈఓ భరత్ గుప్త తెలిపారు.