శివదీక్ష ధారణ ప్రారంభం
శివదీక్ష ధారణ ప్రారంభం
Published Tue, Jan 17 2017 11:58 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో మంగళవారం శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శివదీక్ష ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామిఅమ్మవార్ల ప్రధానార్చకులు శివదీక్ష« మాలధారణ చేయించారు. అర్చకులు మాట్లాడుతూ మన పురాణాలు, ఇతిహాసాలు శివదీక్షను ప్రస్తావించాయని తెలిపారు. జగజ్జనని శివదీక్షను ఆచరించినట్లుగా చెప్పబడుతోందన్నారు. పాండవ మధ్యముడైన అర్జునుడు కూడా శివదీక్షను ఆచరించాడని మహాభారతంలో చెప్పబడిందన్నారు. ఆంగ్లశకం 660లో బాదామి చాళుక్యుడైన మొదటి విక్రమాదిత్యుడు శివదీక్షను మండలదీక్షగా స్వీకరించినట్లు శాసనాలు చెబుతున్నాయని తెలిపారు. మరుగున పడిన ఈ శివదీక్షలను శ్రీశైల దేవస్థానం పునరుద్ధరించిందని ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి చెప్పారు.
Advertisement
Advertisement