shivaratri
-
ఆ పాట రాయడం శివుడి అనుగ్రహంగా భావిస్తున్నా
-
తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో విషాదం
-
Ananya Nagalla: శ్రీశైలం గుడిలో శివ దర్శనం చేసుకున్న సెలబ్రిటీ అనన్య నాగళ్ల ఫొటోస్
-
YS Jagan: రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
-
ఒరేయ్ గుంటల్లారా.. ఏట్లో జాగర్తర్రా
ఒరేయ్ గుంటల్లారా శివరాత్రికి గుంప సోమేశ్వరాలయానికి వెళ్తారు గావాలా... జాగర్త యేరు జోరుగా పారతంది .. గుమ్ములు.. గోతులు ఉంతాయి ... ఎక్కడబడితే అక్కడ దిగకండి.. జాగర్తగా చూసుకుని ఎల్లండి.. మళ్ళా రాత్రివరకు ఉండకండి.. గమ్మున సెనగలు ఖజ్జూరం కొనుకుని వచ్చియండి. మళ్ళా రేపు వెల్దురు లెండి.. అంటూ అమ్మమ్మ చెప్పిన జాగర్తలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయ్. అవును విజయనగరం జిల్లాలో పార్వతీపురం ఏజన్సీ ప్రాంతంలో నాగావళి,. జంఝావతి నదుల సంగమ ప్రాంతంలో ఉన్న ఈ సోమేశ్వరాలయం ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్టించాడని అంటారు. ఆయన తన నాగలితో ఒక చారికను గీయగా ఏర్పడిందే నాగావళి అని, అదే సమయంలో శివ లింగాన్ని కూడా బలరాముడే ప్రతిష్టించాడని స్థలపురాణం చెబుతోంది.ఒడిశా.. శ్రీకాకుళం.. పార్వతీపురం ప్రాంతాలనుంచి వచ్చే వేలాదిమంది భక్తులతో శివరాత్రి నాడు సోమేశ్వర ఆలయం కిక్కరిసిపోతుంది. పిల్లాపెద్దా ముందురోజే.. అంటే జాగరణ రోజే ఎడ్లబళ్ళమీద నాగావళీ తీరానికి చేరడం.. సమీప తోటల్లో బస చేసి.. అక్కడే వండుకుని తిని.. ఆరోజు నాగావళి ఇసుక తిన్నెలమీద వేసే పౌరాణిక.. జానపద నాటకాలు డ్రామాలో చూసి తెల్లారుతూనే రెండునదుల సంగమం వద్ద మూడు మునకలేసి సోమేశ్వరుడిని దర్శించుకోవడం గొప్ప అనుభూతి. శివరాత్రి రోజు పగలంతా అక్కడే ఇసుక తిన్నెల్లో తిరగడం.. ఒళ్ళు వేడెక్కగానే బుడుంగున మళ్ళీ నీటిలో మునగడం.. ఆలయం వద్ద ఇచ్చే ప్రసాదాలు తినడం. ఆడుకోవడం ఇదే.. ఇక పొద్దల్లా శివయ్య సన్నిధిలోనే గడిచిపోయేది.. ఎంత పుణ్యం. ఎంత మోక్షం వచ్చిందో లెక్క తెలీదు.. అవును బాల్యం అంటేనే పుణ్యం.. ఆకాలం అంతా పుణ్యకాలమే.. ఎక్కడా పాపం అంటని పనులు.. ఎప్పుడూ అబద్ధం చెప్పని నోరు.. ఏరా నీకు ప్రసాదం ఇందాకే ఇచ్చాను కదా అని పూజారి అంటే.. కాదని అనడం రాక.. అవును ఇచ్చారు కానీ మళ్ళీ ఇవ్వండి అనేంత అమాయకత్వం..శివయ్య పండగ అంటే ముల్లోకాలకూ సంబరం.. అందులోనూ బాల్యంలో ఉన్న మాలాంటి పిల్లిబిత్తిరిగుంటలకు మరింత సంబరం... అలా యేటి గట్టుపై కూర్చుని వచ్చిపోయే పిచ్చికలను చూడడం.. నీటిలో జలకాలాడే చేపలను ఉత్తచేత్తో పట్టుకోవాలని ఆరాటపడడం. అవి చేతికి దొరికినట్లే దొరికి చేతిలోంచి జారిపోవడం.. ఒక అద్భుత అనుభవం.. కానీ అంతెత్తున ఎగిరే కింగ్ ఫిషర్ మాత్రం క్షణాల్లో డైవ్ చేసి నా కళ్ళముందే పెద్ద పెద్ద పరిగెలను ఎత్తుకెళ్ళడం చూసి సంభ్రమాశ్చర్యానికి లోనవడం.. డొంక దారిన శివాలయానికి అని వచ్చే కొన్ని యువ జంటలు మార్గమధ్యంలో పరాచికాలు ఆడడం.. అవన్నీ మా పిల్లగుంటల కంటబడటం కూడా ఓ జ్ఞాపకం. అమ్మమ్మ ఇచ్చిన ఐదు రూపాయల్లో అంతా లాటరీలు.. గుండాటలో పోగొట్టకుండా జాగ్రత్త చేసుకుని .. కొంత ఖర్చుకు పోను.. ఇంటికి వెళ్ళేటపుడు సెనగలు. ఖర్జూరం పట్టుకెళ్ళడం మనం సాధించిన ఘనవిజయమే.. అందుకే అంటారు బాల్యం బంగారం అని.-సిమ్మాదిరప్పన్న. -
Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా..
మహాకుంభమేళా.. ప్రపంచం యావత్తూ తరలివచ్చి, కనులారా వీక్షిస్తున్న మహాద్భుత ఉత్సవం. ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా శివరాత్రి పర్వదినం అంటే ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమం వేదికగా ఈ మహోత్సవం జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళా భారత్‌కు పలు కొత్త రికార్డులను కూడా అందించింది. మహాకుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ ఉత్సవంలో మహోన్నతంగా నిలిచిన కొన్ని అంశాలివే..విదేశీయుల భాగస్వామ్యంమహాకుంభమేళా(Mahakumbh Mela)కు భారీగా జనం తరలివచ్చారు. 183 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకూ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించినవారి సంఖ్య 60 కోట్లను దాటింది. ఒక్క మౌని అమావాస్య నాడు ఏకంగా 10 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానం చేయడం విశేషం.ఆధునిక సాంకేతికతమహాకుంభమేళా డిజిటల్ మహా కుంభ్(Digital Maha Kumbh) దిశగా సాగింది. ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా ఈ ఉత్సవం నిలిచింది. మహాకుంభమేళాలో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజిటల్ మోనిటరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఏఐ, వీఆర్, ఏఆర్, లిడార్, ఎల్ఈడీ డిస్ప్లే, హోలోగ్రామ్ల వంటి అత్యాధునిక సాంకేతికతలు వినియోగించారు. భక్తులకు కట్టుదిట్టమైన భద్రతను అందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగించారు.ఆకాశంలో అరుదైన దృశ్యంమహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఆ రోజున మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం కావడం విశేషం. ఆనాడు కుంభమేళాలో చివరి రాజ స్నానం ఆచరిస్తారు. మహా కుంభమేళా ముగింపు రోజున ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించనుంది. సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు ఒకేసారి కనిపించనున్నాయి. మహా కుంభమేళా ముగింపు రోజున బుధుడు, శుక్రుడు, శని, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ మొదలైన ఏడు గ్రహాలు సూర్యునికి ఒక వైపున ఒకే వరుసలో కనిపించనున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సౌర వ్యవస్థలో ఇటువంటి అరుదైన దృశ్యం అత్యంత అరుదుగా కనిపిస్తుంది.ఆర్థిక భాగస్వామ్యంఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళాను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా ముందుకు సాగింది. యూపీ సర్కారు కుంభమేళా బడ్జెట్‌కు రూ. 6,382 కోట్లు కేటాయించింది. దీనిలో రూ. 5,600 కోట్లు ఈవెంట్ల నిర్వహణ , మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెచ్చించింది. మహాకుంభమేళా పూర్తయ్యేనాటికి యూపీ ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందనే అంచనాలున్నాయి. మహా కుంభమేళా కారణంగా స్థానికంగా ఉన్న చిన్న, పెద్ద వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే.. -
హరహర మహదేవ..కాలినడకన శ్రీశైలం చేరుకుంటున్న భక్తులు (ఫోటోలు)
-
ఒక్క నిమ్మకాయ రూ.35వేలు!
తమిళనాడులోని ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ రూ.35,000 పలికింది. శివరాత్రి సందర్భంగా ఆ మహా శివుడికి సమర్పించిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేయగా ఓ భక్తుడు అత్యధిక మొత్తానికి దక్కించుకున్నారు. తమిళనాడులోని ఈరోడ్‌కి 35 కిలోమీటర్ల దూరంలోని శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతోపాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. ఈ వేలంలో 15 మంది భక్తులు పాల్గొనగా, ఈరోడ్‌కు చెందిన ఒక భక్తుడు రూ. 35,000కు నిమ్మకాయను దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి స్వామివారి ముందు ఉంచి పూజ చేసి వందలాది మంది భక్తుల సమక్షంలో వేలం దక్కించుకున్న భక్తుడికి అందజేశారు. స్వామివారికి సమర్పించిన నిమ్మకాయను పొందడం అదృష్టంగా భక్తులు భావిస్తారు. తమకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. -
Mahashivaratri: తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు
-
‘ఈశా’ శివరాత్రి వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
ఈ నెల 8న మహాశివరాత్రి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులోగల ‘ఈశా’ ఫౌండేషన్ రాబోయే మహశివరాత్రి వేడుకలను ఆదియోగి విగ్రహం ముందు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మెగా వేడుక మార్చి 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు సద్గురు యూట్యూబ్ ఛానల్లో, ప్రధాన మీడియా నెట్‌వర్క్‌లలో ప్రసారం కానుంది. ఆరోజు అర్ధరాత్రి, బ్రహ్మ ముహూర్త సమయంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘సద్గురు’ జగ్గీవాసుదేవ్ భక్తులను శివుని ధ్యానంలో లీనమయ్యేలా చేయనున్నారు. కాగా గతంలో జరిగిన ‘ఈశా’ మహాశివరాత్రి వేడుకల లైవ్ స్ట్రీమింగ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023లో ‘ఈశా’లో జరిగిన మహాశివరాత్రి వేడుకలను 14 కోట్ల మంది వీక్షించారు. -
శ్రీశైలంలో శివ మాల వస్త్రాలు పంచిన ఎమ్మెల్యే
-
వేములవాడలో శివరాత్రి ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం: బండి సంజయ్
-
మహాశివరాత్రి స్పెషల్.. శివుని ప్రత్యేక గీతాలు
మహా శివరాత్రి శివ భక్తులకు అత్యంత ఇష్టమైన పండుగ. ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. శివభక్తులు తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రత్యేక గీతాలు ఆలపిస్తారు. అలాగే శివుడి చరిత్రను వివరిస్తూ పలు సినిమాలు కూడా వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి గుర్తు చేసుకుంటూ అత్యంత ప్రీతికరమైన పాటలేవో తెలుసుకుందాం. ఓం మహాప్రాణ దీపం సాంగ్ -శ్రీ మంజునాథ (2001) ఇది చిరంజీవి, అర్జున్ సర్జా నటించిన శ్రీ మంజునాథ (2001) చిత్రంలోని చాలా ప్రజాదరణ పొందిన భక్తి గీతం. ప్రసిద్ధ తెలుగు పాటను శంకర్ మహదేవన్ పాడారు. ఈ పాదం -శ్రీ మంజునాథ (2001) శ్రీ మంజునాథ చిత్రంలోని శ్రీపాదం ప్రసిద్ధ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం పాడారు. ఆటగదరా శివా .. ఆటగదా కేశవ సాంగ్ జీవిత చిత్రాన్ని చూపించే పాటల్లో ఎక్కువ మందికి ఇష్టమైన పాట ఆటగదరా శివా... ఈ పాటలో ప్రతి అక్షరం అద్భుతమే. ఆటగదరా శివా ఆటగద కేశవా అంటూ సాగే పాట చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచించగా.. ఈ పాటను ఏసుదాసు ఆలపించారు. ఎట్టాగయ్యా శివా శివా మరణానికి-పుట్టుకకు మధ్యలో అన్నీ ఎదురీతలే. బంధాలకు ప్రతిమనిషీ బందీనే, అందరికీ వేదన బాధ ఒక్కటే... దయచూడు భోళాశంకరా కరుణ చూపించు అంటూ సాగే ఈ పాట ఆటగదరా శివ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. భ్రమ అని తెలుసు సాంగ్ బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు.. అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే పాట ఇది. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోని ఈ పాట శివ భక్తులకు ఇష్టమైన పాటగా నిలిచింది. మాయేరా అంతా మాయేరా నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే.. మనవాళ్లు మనది అన్నది మాయే...జననం-మరణం మాయ మధ్యలో జరిగే నాటకం అంతా మాయ..జగమంతా మాయే..జనమంతా మాయే..కళ్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయే అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉంటుంది ఓ మహాదేవా సాంగ్ 1966లో విడుదలైన ఓ మహాదేవ పాట శివునికి అంకితం చేయబడింది. తెలుగు చిత్రం పరమానందయ్య శిష్యుల కథ కోసం పి.సుశీల పాడారు. లింగాష్టకం సాంగ్ లింగాష్టకం మ్యూజిక్ ఇయర్స్ ఆఫ్ శాండల్‌వుడ్ అనే సంగీత ఆల్బమ్‌కు చెందినది. దీనిని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట 1976లో విడుదలైంది. -
Maha Shivratri 2022: హరహర మహాదేవ
-
శివ శివ శంకర.. భక్తజన జాతర
సాక్షి, నెట్వర్క్: మహా శివరాత్రి ఉత్సవాలకు శివాలయాలు ముస్తాబయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన శివాలయాలన్నీ విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్నాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నిచోట్లా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణల్లో భక్తుల జాగరణకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వేములవాడలోని రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు భక్తులు ఇప్పటికే తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక్కడ సోమవారం ఆరంభమైన మహాజాతర మంగళ, బుధవారాల్లోనూ కొనసాగనుంది. మరోపక్క మంగళవారం నాటి ఉత్సవాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లోని బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అచ్చంపేటలోని ఉమామహేశ్వరాలయం శివపూజలకు సిద్ధమైంది. నల్లమల అటవీ ప్రాంతంలో ‘చెంచుల పండుగ’ పేరుతో నిర్వహించే శివరాత్రి వేడుకల్లో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మంగళవారం పెద్దపట్నం పండుగ నిర్వహించనున్నారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ప్రధానాలయంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. వరంగల్ నగరంలోని చారిత్రక వేయిస్తంభాల గుడి (రుద్రేశ్వరస్వామి ఆలయం)లో మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలో క్యూలైన్లు ఏర్పాటుచేసి చలువ పందిళ్లు వేశారు. గవర్నర్, సీఎం శివరాత్రి శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహాశివుడు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రార్థించారు. కాళేశ్వరం ప్రధాన ఆలయం ఎములాడలో జాతర షురూ వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం మహాశివరాత్రి జాతర.. ఉదయం 3 గంటలకు స్వామికి సుప్రభాత సేవతో ప్రారంభమైంది. 5 గంటలకు ప్రాతఃకాల పూజ, మధ్యాహ్నం 2.30కి రాజన్నకు మహానివేదన సమర్పించారు. రాజన్న జాతరకు ఈసారి 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఇక మంగళవారం మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఉదయం టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొననున్నారు. కాగా, రాజన్న దర్శనానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు గుడి ఆవరణతోపాటు చెరువులోని ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు నిలిపివేయడంతో షవర్ల వద్ద రద్దీ పెరిగింది. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దుచేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువు ఖాళీస్థలంలో శివార్చన పేరుతో 1,500 మంది కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
మౌనవ్రతం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
మహాశివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయాలు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు వ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును పరమ శివునిపై కేంద్రీకరించాలి. వీలైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఫరవాలేదు. జాగారం చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ, పరనింద, పరాన్నభోజనం, చెడుతలపుతో, అశ్లీలపుటాలోచనలతో చేసే ఉపవాస, జాగారాలకు ఫలితం లేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమకచమకాలను వినడం కూడా ఫలదాయకమే! మహిమాన్వితం... మంత్ర జపం మహాశివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. ఓం నమః శివాయ!! చదవండి: ఉపవాసం రోజు ఏం చేయాలి? ఆరు రకాల ఉపవాసాలు మంచివట! -
రండి.. రాజన్న సేవలో తరించండి!
వేములవాడ: పేదల దేవుడు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం ఆలయ అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు జాగరణచేపట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, వసతీసౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం రాత్రి నుంచే వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల రాక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ వేములవాడకు చేరుకుంటారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ‘మహా’ జాతర ఏర్పాట్లపై సమీక్ష వేములవాడ రాజన్న సన్నిధిలో బుధవారం నుంచి మూడురోజులపాటు జరిగే మహాశివరాత్రి జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. కోవిడ్–19 నిబంధనలు సడలించాక రాజన్న భక్తులు తమ ఇలవేల్పు వేములవాడ రావడం అధికమైందన్నారు. భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. అందరికీ వసతి లభించేలా, మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటులోకి తేవాలన్నారు. శానిటైజర్లు, మాసు్కలు పంపిణీ చేయాలని చెప్పారు. వైద్యసేవలు అందించాలని, భద్రత కల్పించాలని ఆదేశించారు. పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఆర్టీవో శ్రీనివాస్‌రా వు, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్‌బాషా, అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, తహసీల్దార్ మునీందర్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, 14మంది ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల సేవలో నిమగ్నం కావాలని మంత్రి సూచించారు. -
ఆది దంపతుల కల్యాణ మహోత్సవం
-
పులకించిన శైవ క్షేత్రాలు
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. రాజన్న నామస్మరణంతో వేములవాడ క్షేత్రం పులకించిపోయింది. తొలుత స్వామికి మహాలింగార్చన నిర్వహిం చారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, గురవరాజులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ కృష్ణభాస్కర్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చారని ఆలయ అధికారులు అంచనా వేశారు. ప్రముఖుల దర్శనాలు, ప్రత్యేక పూజల సందర్భంగా ఐదుసార్లు భక్తుల దర్శనానికి బ్రేక్‌లు పడ్డాయి. మరోవైపు.. రాజన్న గుడిచెరువు ఖాళీ స్థలంలో భక్తులు జాగరణ ప్రారంభించారు. ఉపవాస దీక్షతో తెల్లవార్లూ జాగరణ చేశారు. భక్తులకు ఉత్సాహం ఇచ్చేలా భక్తితో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అలాగే, హన్మకొండలోని ప్రసిద్ధ వేయిస్తంభాల ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాశివుడిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి సైతం శుక్రవారం ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా పాలంపేట రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం శివ నామస్మరణతో మారుమోగింది. రామప్ప దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివపార్వతుల కల్యాణం కనుల పండువగా జరిగింది. అలాగే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరాలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. -
మహాశివరాత్రి: కృష్ణానదిలో భక్తుల పుణ్యస్నానాలు
-
కోర్కెలు తీర్చే గోలెం
దక్షిణ కాశిగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశిలో లింగం, గంగలో స్నానం.. శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తండోపతండాలుగా వస్తారు. ఈ క్షేత్రంలో ఈ ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలు నాలుగు రోజులపాటు మార్చి 4 నుంచి 7 వరకూ జరుగుతాయి. గోలేం కథ ఇది స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టుకి వెనుక పెద్ద మట్టి గోలెం ఉంది. అది ఎంత పెద్ద గోలెమంటే గర్భాలయం ద్వారం పట్టనంత. శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్న సంతానం కోసం స్వామివారిని పూజిస్తుంటాడు. తనకు కుమారుడు పుడితే ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా ఆవు పాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నాగన్నకు ఒక కొడుకు పుట్టాడు. మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా పాలుపోసి దానిని గర్భాలయంలోనికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అది గర్భగుడి ముఖ ద్వారం పట్టనంత పెద్ద గోలెం అవడంతో గర్భాలయంలోనికి తీసుకెళ్లలేక అమితమైన దుఃఖంతో గోలెంతోపాటు తనకు ఆ పరమ శివుడు ప్రసాదించిన బిడ్డను కూడా ఆలయం ముఖమంటపంలోనే విడిచి పెట్టి ఇంటికి వెళ్లిపోతాడు. మర్నాడు స్వామి వారి నిత్యపూజలకై అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలెం మూలవిరాట్టు వెనకాల ఉన్నది. అలాగే నాగన్నకు పుట్టిన బిడ్డ కూడా గోలెం పక్కనే బోసినవ్వులతో ఆడుకుంటున్నాడు. ఇది చూసిన నాగన్నతో సహా గ్రామస్తులంతా ముఖలింగేశ్వరుని మహాత్యాన్ని వేనోళ్ల సుత్తించారు. న్యాయమైన కోర్కెలు తీర్చే నాగభూషణుడు ఈ గోలెంలో పాలతోపాటు బియ్యం, వడ్లు (ధాన్యం) మంచినీరు, అన్నం, పండ్లు ఇలా భక్తులు మొక్కులకు అనుగుణంగా ఆ గోలెం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. దీనిఫలితంగా సంతాన యోగం, గ్రహాదోషాల నివారణ, వివాహాలు, ఇతర న్యాయపరమైన కోర్కెలు తీరుతాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. ఇలా తమ కోర్కెలను తలచుకొని ఆ గోలేన్ని ముట్టుకొని ఆ పరమేశ్వరుని నిండు మనస్సుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు కొద్దికాలంలో తీరుతాయన్నది భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీముఖలింగం గోలెం వర్ధిల్లుతోంది. సుంకరి శాంత భాస్కరరావు సాక్షి, జలుమూరు. శ్రీకాకుళం -
హర హర మహాదేవ
లోక కళ్యాణం కోసం గరళాన్ని సైతం గొంతులో దాచుకొని అందరికీ అమృతాన్ని పంచిన ప్రేమమూర్తి ఆయన. రాక్షసులకు సైతం వరాలను అనుగ్రహించగల బోళాశంకరుడు, మూడోకన్నుతో లోకాలన్నిటì నీ భస్మం చేయగల ముక్కంటి, లోకంలోని సర్వ దుఃఖాలను, సర్వుల పాపాలను తనలో లయం చేసుకునే లయకారుడయిన శివుడిని అర్చించడం కంటే మించిన పూజ, అంతకు మించిన సాధన మరేదీ లేదు. ఆ స్వామి ఓంకార నాదంతో స్వయం ప్రకాశ స్తంభంగా(లింగం)గా ఆవిర్భవించిన పర్వదినం ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినం మాఘమాసంలో బహుళ పక్షంలో అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్దశి తిథిలో వస్తుంది. ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథులు ‘మాస శివరాత్రులు’ గా వ్యవహరిస్తారు. ఏడాది కాలంలో వచ్చే ద్వాదశ శివరాత్రులలో మాఘ బహుళ చతుర్దశి శివునికి అత్యంత ప్రీతికరమైనది. కనుకనే ఈ మాఘ బహుళ చతుర్దశి మహా శివరాత్రిఅంటే శివరాత్రులలో గొప్పది అయింది. శివలింగ ఆవిర్భావం గురించిన వివరణ శివపురాణంలో ఉంది. దానిని అనుసరించి... ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు..? అనే వాదన తలెత్తింది. వారి గర్వాన్ని పోగొట్టేందుకు శివుడు కోటిసూర్య సమాన దివ్యతేజస్సుతో లింగరూపంలో ఆవిర్భవించాడు. ఆ లింగం ఆది, అంతం తెలుసుకోగలిగిన వారే గొప్పవారు అని వారితో చెప్పాడు. అప్పడు ఆ లింగం మూలస్థానం చూసేందుకు విష్ణువు వరాహరూపంలో పైకి, అంతిమ స్థానం చూసేందుకు బ్రహ్మ, హంస రూపంలో కిందివైపుకి ప్రయాణించారు. ఎంతగా వెదికినా, మరెంతగా శోధించినా ఫలితం కనిపించలేదు. బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ తేజోమయ లింగ ఆది, అంతాలను తెలుసుకోలేకపోయారు. అప్పుడు వారిద్దరూ శివుడిని ‘మహాప్రభూ’.. మమ్మల్ని అనుగ్రహించండి. మీ నిజరూపాన్ని ప్రదర్శించండి’ అని అన్నారు. అప్పుడు శివుడు వారికి దివ్యజ్ఞానాన్ని ప్రసాదించాడు. మాఘ బహుళ చతుర్దశి నాడే ఈ మహాలింగం ఉద్భవించింది. అందుకే అది మహాశివరాత్రి పర్వదినమయ్యిందని అంటారు. స్నానం... దానం... అర్చన అభిషేకం... ఉపవాసం... జాగారం మహాశివరాత్రి పర్వదినాన పూజ, అభిషేకం, ఉపవాసాలను భక్తిశ్రద్ధలతో నిర్వర్తించడం వలన శివానుగ్రహానికి పాత్రులు కాగలరు. శివరాత్రినాడు మహాదేవుని అర్చించి మోక్షాన్ని పొందిన భక్తుల కథలు పురాణాల ద్వారా మనకు కొంతవరకూ పరిచితమే కాబట్టి అభిషేక ప్రియుడైన శివుని ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, అభిషేకాలు, నాలుగు జాముల్లోనూ పూజలు, జాగరణలతో శివపూజ సాగించాలి. మొదటి పూజ రాత్రి ఎనిమిదిగంటలకు ప్రారంభిస్తారు. చివరి పూజ తెల్లవారుజామున ఐదుగంటలకు ముగిస్తారు. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతోంది. అయితే, చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది. ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం ఉండే ముందురోజు, ఉపవాసం మరుసటి రోజు కూడా మాంసాహారం, గుడ్డు తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను, విఘ్నాలేమీ లేకుండా నా దీక్ష చక్కగా సాగాలి’ అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి దేవునికి దగ్గరగా ఉండడం అని అర్థం. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం ఈ కాలంలో అయితే చాలా కష్టం. జీవారాధన మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగులుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అప్పుడే మనం చేసిన ఉపవాసం ఫలిస్తుంది. ఎందుకంటే అష్టమూర్తితత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే. అందుకే స్వామి వివేకానంద ’జీవారాధనే శివారాధన’ అన్నారు. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం కాకుండా, వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, అలాగే నిలబడాలి. అప్పుడే దృష్టిని కేంద్రీకరించగలుగుతాం. ఆ శివశక్తిని గ్రహించ గలుగుతాం. మౌనవ్రతమూ మహిమాన్వితమే! శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించరాదు. మనసును కూడా మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివునిపై కేంద్రీకరించాలి. మీరు అభిషేకం చేయించుకోకపోయినా ఆందోళన అవసరం లేదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమక చమకాలను వింటే చాలు.. మనసు మధురభక్తితో నిండిపోతుంది. ఈ జగత్తంతా శివమయమే. అంతటా శివతాండవమే. ఎక్కడ చూసినా ఎంతో పురాతన చరిత్రనూ, మరెంతో వైభవాన్నీ, ఆ స్వామి మహిమలనూ కలిగిన శైవక్షేత్రాలే. శివతత్త్వాన్ని శిల్పాల రూపంలో, స్థలపురాణాల రూపంలో జ్ఞానామృతాన్ని పంచుతుంటాయి. అందుకే అందుబాటులో ఉన్న ఏ శివాలయానికైనా వెళదాం, ఆ ఆనందాన్ని దోసిళ్లతో గ్రోలుదాం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివభక్త్యామృతంలో ఓలలాడదాం. పూర్ణిమా స్వాతి త్రిలోకనాయకుడు ఆ స్వామి త్రినేత్రుడు. త్రిగుణాకారుడు. త్రి ఆయుధుడు. త్రిజన్మ పాప సంహారుడు. మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు. త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు. త్రిశూలధారి. త్రికాలాలకు, త్రి నామాలకు అధిపతి. త్రిలోక రక్షకుడు. ఆకాశమనే లింగానికి భూమి పీఠం. సమస్త దేవతలూ అందులో ఉన్నారు. అంతా అందులోనే లయమవుతుంది. అందుకే ఈశ్వరులకు ఈశ్వరుడు, దేవతలకు దైవం అయిన పరమేశ్వరుడు జాగ్రద్, సుషుప్త, స్వప్నాలకు అతీతుడు. అన్నీ ఆయనలో ఉన్నాయి. అంతటా ఆయనే నిండి ఉన్నాడు. -
‘మహా’ జాతరకు రాజన్న ప్రసాదం
వేములవాడ: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలువబడుతున్న ఎములాడ రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై అంతే మక్కువ చూపుతారు. మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారన్న అంచనాలో అధికార యంత్రాంగం ఉంది. భక్తులకు రాజన్న లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్చార్జీలు రెండురోజులుగా పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం ఉన్న లేబర్‌కు తోడు మరింత మందిని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గోదాంలోని ఓ గది నిండా ట్రేలలో తయారు చేసిన లడ్డూలు సిద్ధం చేశారు. వచ్చేనెల 2 వరకు నాలుగు లక్షల లడ్డూలు సిద్ధం చేసి ఉంచుతామని, 3, 4, 5 తేదీల్లోనూ భక్తుల రద్దీని బట్టి మరో లక్ష లడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత శివరాత్రి జాతరలో 3.23 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. జాతరకు ప్రత్యేక కౌంటర్లు రాజన్న లడ్డూ ప్రసాదం రుచిగా ఉండేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ అందుకు అనుగుణంగా దిక్టం (ప్రసాదాల్లో వాడే వస్తువుల కొలతలు) రూపొందించింది. దీని ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన శనగపప్పు, కాజు, మిష్రి, కిస్మిస్, బాదాం, యాలకులతో పాటు సుగంధ ద్రవ్యాలను సైతం ఇందులో పొందుపరుస్తుండటంతో రాజన్న లడ్డూ తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మార్కెట్లో చక్కెర ధర అధికంగా ఉన్నా భక్తులకు తక్కువ ధరకే లడ్డూ ప్రసాదం అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర దేవాదాయశాఖ రూ.15కు ఒక లడ్డూ చొప్పున విక్రయించాలని ఆదేశించింది. ఆమేరకు స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదం అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటి వరకు కొనసాగిన ఆంధ్రాబ్యాంకు భవనంలో ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో రాజన్నను దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్లే భక్తులు నేరుగా ప్రసాదాల కౌంటర్‌కు చేరుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. రాజన్న హుండీ ఆదాయం రూ. కోటిన్నర వేములవాడ రాజన్నను దర్శించుకునే భక్తులు హుండీలలో వేసిన కానుకలను ఆలయ అధికారులు బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో లెక్కించారు. 22 రోజుల్లో రాజన్నకు రూ. 1,50,29,406 నగదు, 652 గ్రాముల బంగారం, 13 కిలోల 900 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. నాలుగేళ్లుగా వస్తున్న ఆదాయం ఇలా.. 2014–15 రూ. 7.30 కోట్లు 2015–16 రూ. 8.89 కోట్లు 2016–17 రూ. 8.38 కోట్లు 2017–18 (అక్టోబర్ వరకు) రూ. 5.63 కోట్లు 2017–18 నవంబర్‌లో –రూ. 90 లక్షలు 2017–18 డిసెంబర్లో– రూ. 1.35 కోట్లు 2018–19 జనవరిలో – రూ.1.40 కోట్లు మూడులక్షల లడ్డూలు సిద్ధం చేస్తాం జాతరకు వచ్చే భక్తులకు రాజన్న ప్రసాదం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఈసారి 5 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బందిని రప్పించి లడ్డూ ప్రసాదాలు త యారు చేయిస్తున్నాం. ఇప్పటికే 2 లక్షల లడ్డులు సిద్ధం చేశాం. జాతర సందర్భంగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న భక్తులకు ప్రసాదాలను అందుబాటులో ఉంచేం దుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. – వరి నర్సయ్య, గోదాం ఇన్చార్జి -
కాపాడబోయి..కాటికి
వారంతా ఆరిలోవలోని ఇందిరానగర్ కాలనీకి చెందినవారు.. శివరాత్రి జాగారం అనంతరం బుధవారం ఉదయం సముద్ర స్నానానికి కుటుంబాలతో జోడుగుళ్లపాలెం బీచ్‌కు వెళ్లారు.అక్కడ పిల్లలు ఆడుతున్న బంతి నీళ్లలోకి వెళ్లింది.దానికోసం యశ్వంత్ అనే చిన్నారి సముద్రంలోకి వెళ్లాడు. అది గమనించిన తండ్రి వెంకటశివరామ్ప్రసాద్ సముద్రంలోకి వెళ్లి కొడుకును ఒడ్డుకు చేర్చాడు. కానీ అతన్ని మాత్రం కెరటాలు తమలోకి లాక్కున్నాయి. దాంతో స్నేహితుడి కోసం రమణ నీళ్లలోకి దూకగా.. అతన్నీ కెరటాలు కబళించాయి. రెండు కుటుంబాల్లో ఈ దుర్ఘటన అంతులేని విషాదం నింపింది. ఆరిలోవ(విశాఖ తూర్పు): రోజంతా శివరాత్రి జరుపుకొన్నారు. జాగారంతో శివపూజలు చేశారు. మరుసటిరోజు పుణ్యస్నానాలకు బీచ్‌కు వెళ్లారు. తీరంలో రాకాసి కెరటం కొడుకుని కాటేసేందుకు దూసుకురావడంతో రక్షించేందుకు ఓ తండ్రి సముద్రంలోకి ముందుకు దూకాడు. ఇదంతా గమనిస్తున్న మరో వ్యక్తి తన స్నేహితుడిని రక్షించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో స్నేహితులిద్దరూ రాకాసి కెరటానికి బలైపోయారు. దీంతో రెండు కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. పెద్ద దిక్కును కోల్పోయి ఎలా బతకాలని బోరున విలపిస్తున్నాయి. ఈ హృదయవిదారకర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడో వార్డు పరిధి డెయిరీఫారం దరి ఇందిరాగాంధీనగర్‌కు చెందిన దువ్వి వెంకట శివరాంప్రసాద్(48), కిర్లంపల్లి రమణ(45) కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి బుధవారం ఉదయం 10 గంటలకు జోడుగుళ్లుపాలెం బీచ్‌కు సముద్ర స్నానాలకు వెళ్లారు. పెద్దలంతా ఒకవైపు స్నానం చేస్తుండగా పక్కనే వారి కుటుంబాలలోని పిల్లలంతా కలిసి నీటిలో బంతితో ఆడుతున్నారు. బంతి లోపలకు వెళ్లిపోవడంతో దాన్ని తీసుకురావడానికి యశ్వంత్ అనే కుర్రాడు వెళ్లాడు. వెనుక నుంచి ఉధృతంగా వస్తున్న అలలను యశ్వంత్ గమనించలేదు. వాటిని గమనించిన వెంకట శివరాంప్రసాద్ తన కుమారుడు ప్రమాదానికి గురికాకుండా రక్షించాలని ముందుకు దూకాడు. అదే సమయంలో దూసుకొచ్చిన పెద్ద కెరటంలో తండ్రీ కొడుకు చిక్కుకుపోయారు. దీంతో కుమారుడిని ఒడ్డుకు నెట్టేసిన శివరాంప్రసాద్ అలతో పాటు లోపలకు కొట్టుకుపోయాడు. యశ్వంత్ ప్రాణాలతో ఒడ్డుకు చేరాడు. ఇదంతా గమనిస్తున్న కిర్లంపల్లి రమణ తన స్నేహితుడు శివరాంప్రసాద్‌ను రక్షించాలని లోపలకు వెళ్లి అదే అలకు కొట్టుకుపోయాడు. వారిద్దరూ అలల్లో చిక్కుకుపోయిన విషయాన్ని గమనించిన లైఫ్‌గార్డులు, గజ ఈతగాళ్లు వారిద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే వారిద్దరూ కడుపునిండా సముద్రం నీళ్లు తాగేశారు. అందుబాటులో ఉన్న 108 వాహçనం సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అప్పటికే వెంకట శివరాంప్రసాద్ మృతి చెందాడని వారు నిర్థారించారు. కొన ఊపిరితో ఉన్న రమణను హెల్త్‌సిటీలో పినాకిల్ ఆస్పతికి తరలించారు. అక్కడ వైద్యం చేసిన కొంతసేపటికి రమణ మరణించాడు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం సముద్ర స్నానంలో మృతి చెందిన ఇద్దరూ వారి కుటుంబాలకు పెద్ద దిక్కు. వారే ఆయా కుటుంబాలను పోషిస్తున్నారు. వెంకట శివరాంప్రసాద్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులున్నారు. కిర్లంపల్లి రమణకు భార్య నూకరత్నం, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివరాంప్రసాద్ ఇందిరాగాంధీనగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, రమణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరిద్దరి అకాల మరణంతో ఆయా కుటుంబాలు దిక్కులేనివిగా మిగిలాయి. కుటుంబ భారాన్ని ఎలా మోయాలంటూ ఆయా కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ఇందిరాగాంధీనగర్ కాలనీ విషాదంలో మునిగిపోయింది. అందరితో సరగాదా గడిపే వారిద్దరూ ఒకేసారి కనుమరుగయ్యారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరి ఉందని ఆస్పత్రికి తీసుకెళ్లినా... వెంకట శివరాంప్రసాద్‌కు ఊపిరి ఆడుతున్నట్లు గమనించిన బంధువులు వెంటనే ఆటోలో విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే విమ్స్‌కు చేరేలోగా అతను మరణించాడని అక్కడి వైద్యులు తెలపడంతో బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. 108 సిబ్బంది సరిగా పరిశీలించకుండా ఊపిరి ఉండగానే మరణించాడని నిర్లక్ష్యం చేశారని విమ్స్ వద్ద మృతుని బంధువులు, కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే ఆయన ప్రాణాలు మిగిలేవని, 108 సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆయన ప్రాణాలు పోయాయని ఆరోపిస్తున్నారు. మృతదేహాలను ఆరిలోవ పోలీసులు పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు. -
జన్మకో శివరాత్రి
ఆఫీసులో పనిలేదు. నేను ఒంటరిగా ఖాళీగా కూర్చుని కిటికీ బయటకు చూస్తున్నాను, అన్యమనస్కంగా. నా మనసు తేలిక పడినట్టనిపించింది. ఎంతో సంతోషంగా వుంది. అకారణంగా ఉల్లాసపడుతోంది మనసు. గాలి మధురంగా సుతిమెత్తగా వీస్తూంది. మనసు దూది పింజెలా గాలిలో తేలిపోతోంది. ఏవిటీ విచిత్రం? వసంత ఋతువు వచ్చేసిందా? ఇంత తొందరగానా? జనవరిలోనే వసంతమా? తొందరేమిటి? మకర సంక్రాంతి వచ్చేసింది గదా? ఇరవయ్యో తారీఖున వసంత పంచమి, అరె, నిజమేనా ఐతే వసంతం వచ్చేసింది! కిటికీ లోంచి చూస్తుంటే తోటలోని ఓ మామిడి చెట్టు పూతమీద వుందని తెలుస్తూంది. నేను కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాను. నాకు హుషారుగా ఉంది. చేతులు నలుపుకుంటూ ఆలోచించాను, సాయంత్రం యింటికి వెడుతుంటే ఏం తీసుకువెళ్లాలా అని. మల్లెపూలు తీసుకు వెడితే బాగుంటుంది. రాత్రంతా మొత్తం యిల్లంతా మల్లెల గుబాళింపుతో మత్తెక్కిపోతుంది. ఛ.. నాకు మతి గాని పోయిందా? ఏభై అయిదేళ్ల వయసులో ఈ ఆలోచనలేమిటి? కిటికీలు లేని వంట యింట్లో ఉడుకుతూన్న మాంసం వంటకాల వాసనతో నిండివుండే యింట్లో – ఎపుడు ఏ ఋతువు మారుతుందో తెలుస్తుందా? పిల్లల జంఝాటంలో వుండే ఆమెకు మల్లెలు ముడిచే తీరికా కోరికా ఎక్కడ? అటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, చక్కగా బఠానీ, కాలీఫ్లవరూ తీసుకు వెడితే మంచిది. ∙∙ అంతలో తలుపు తోసుకు లోపలికి వచ్చి వార్తనందించారు స్టాఫు.‘‘అయ్యా! త్వరగా రండి. ఢిల్లీ డైరెక్టరేటు నుంచి మీకు ఫోనొచ్చింది. డైరెక్టరుగారు లైన్లో ఉండి, సేనాపతిగారిని పిలు– అంటున్నారు.’’ నా పేరు నిశాకర సేనాపతి. ప్రభుత్వంలో డెప్టీ డైరెక్టరుగా పనిచేస్తున్నాను. రిటైరవ్వడానికి యింకా రెండు సంవత్సరాల నాలుగు మాసాలు బాకీ వుంది.‘‘ఢిల్లీ నుంచా? నన్నెవరు పిలుస్తారు? అరె, ఆ కాల్ మరెవరిదో అయివుంటుందయ్యా!’’‘‘ఔన్సార్! మీకే ఫోన్..’’ ఢిల్లీ నుంచి నన్నెవరు పిలుస్తారు? అందులోనూ డైరెక్టరుగారు స్వయంగా ఫోను పట్టుకుని పిలుస్తున్నారు కాబట్టి వెళ్లక తప్పదు. మరో దారిలేదు.నేను మా డైరెక్టరుగారి గదిలోకి ప్రవేశించగానే డైరెక్టరుగారు అప్రయత్నంగానే కుర్చీలోంచి సగం లేచి నుంచున్నారు. నేనంటే ఆయనకొక ప్రత్యేకమైన గౌరవభావం ఉంది. ఆయన ప్రతీ మాటలో, కదలికలో అది ఇలా తొంగి చూస్తూ ఉంటుంది. ‘‘అహుజా గారు మిమ్మల్ని పిలుస్తూ లైన్లో ఉన్నారు’’అహుజా?నేను ఫోనులో ‘‘సేనాపతి స్పీకింగ్’’అటువైపు నుంచి అట్టహాసంగా నవ్వు వినిపించింది. – ‘‘అబె స్పీకింగ్ క్యా బోయ్.. మై జాన్ బోల్ రహా హూ...’’హఠాత్తుగా ముప్ఫై సంవత్సరాల క్రిందటి స్ఫురద్రూపం గుర్తుకొచ్చింది. నన్ను నేను మర్చిపొయి ‘‘అబె తూ జాన్ బోల్రహా హై? కహాసే?’’ఫోన్ పెట్టేసి నేను చూస్తుంటే డైరెక్టర్‌గారు నిలబడే ఉన్నారు. ఆయన ప్రక్కన మరో ముగ్గురు ఆఫీసర్లు నిలబడి ఉన్నారు. ముఖ్యమంత్రిగారు స్వయంగా వాళ్లను పంపించారు. చీఫ్ సెక్రెటరీగారు ఆజ్ఞాపించగా వారు వచ్చారు.‘‘అయ్యా! నమస్కారం ఢిల్లీ నుంచి వార్త వచ్చింది, ఆహుజా సాబ్ వస్తున్నారని. ఆయనతో మరో ఏడుగురు అధికార్లు కూడా వస్తున్నారు. ముగ్గురు ఆఫీసర్ల కోసం హోటలు ఓబెరాయ్‌లో రూములు బుక్ చేశాం. కానీ అందులో ఒకరు యిక్కడ తమ స్నేహితుల యింట్లో ఉంటామంటున్నారు.’’ ‘‘నిశాకర్ బాబు. అహుజాసాహెబ్ మంచి స్నేహితులండి.’’ డైరెక్టరు గారు కలగజేసుకుని చెప్పేరు.‘‘కూర్చోండి సార్!’’ అంటూ ఆ వచ్చిన అధికార్లు నాకోసం ఒక కూర్చీని దగ్గరగా లాగేరు. నేను కూర్చునే వరకూ అంతా నిలబడే ఉన్నారు.డైరెక్టరుగారు బెల్ కొట్టి కాఫీ ఆర్డరు ఇచ్చి, నా గుణవర్ణనను సాగించేరు. ఈ వుదయం నేనొక ఫైలు విషయం మీద మాట్లాడాలనుకుని వచ్చి తిరిగి వెళ్లిపోయాను. కారణం డైరెక్టరుగారు అప్పుడు కాళ్లు బార జాపుకుని అమెరికాలో వున్న వాళ్ల అమ్మాయితో కష్టసుఖాలు మాట్టాడుకుంటున్నారు. ‘‘మీకు మరే రకమైన ఇబ్బంది వుండదు. నిశాకర్బాబు అహుజా సాహెబ్‌కి కొద్దిగా నచ్చచెబితే సరిపోతుంది. మీరా రకంగా నిశాకరబాబు గారికి చెప్పండి.’’ ‘‘విషయం ఏవిటంటే సార్.. అహుజా సాహెబు కీలక వ్యక్తి. ఆయన ఎలా చెబితే అలా జరుగుతుంది. మేం వరదల గురించి ఒక నివేదికను పంపేము. ఆ తర్వాత లెక్క జూస్తే మేం ఇచ్చిన ఫిగరు సరికాదని తేలింది. అన్ని హెడ్స్ క్రిందా డిస్ట్రిబ్యూట్ చేయడానికి బొత్తిగా చాలడంలేదు. అందువల్ల కనీసం ఎంత లేదన్నా మరొక పదికోట్లు పెంచాల్సి వుంటుంది. ఈ విషయం అహుజాగారికి చెప్పడానికి ఎవరికి సాహసం రావడం లేదు. అలా చెప్పిన వాడిని అహుజాగారు నమిలి మింగేస్తారని వాళ్ల భయం. గతంలో ఒకసారి ఆ రుచి చూసిన వాళ్లే వీరంతా.’’ ‘‘సామల్ బాబూ! మీరుండండి. సార్‌కి నేను వివరంగా చెబుతాను. అదేం లేదు సార్! అహుజా సాహెబు మీకు సన్నిహితులు. మా రివైజ్డు ఎస్టిమేటునొకసారి చూడమని చెప్పండి చాలు. నేను మీకు ఆ కాపీని యిస్తున్నాను. దానిని మీరాయనకు చూపించండి. చూస్తేచాలు ఆయనకు విషయం అర్థం అవుతుంది. ఒక వేళ ఏదైనా అడగాలనుకుంటే, నేను.. అంటే నిరంజన్ ఖుంతియా అక్కడే హాజరుగా వుంటాను.’ డైరెక్టరు అన్నారు ‘‘సార్ తమరు స్వయంగా వెళ్లకపోతే..’’‘‘ఉండండీ, మీకేం తెలుసు? నేను లేకపోతే అహుజా గారిని ఫేస్ చెయ్యలేరు. తర్వాత నాకేసి చూసి ‘‘అలా అయితే నడవండి సార్ ముందుగానే అంతా చూసి, మొత్తం ప్రోగ్రాం సిద్ధం చేసి ఉంచుదాం!’’నేను మా డైరెక్టరుగారి అనుమతి కోసం అడిగాను – ‘‘సార్ నేను వెళ్లనా?’’‘‘సార్! వెళ్లండి సార్! ఇది దేశం పని కదా?’’నాకు నమ్మబుద్ధి కావడం లేదు. బహుశా ఆయన వెళ్లమన్నది ఖుంతియా బాబునేమో! నాకు కాళ్లు తేలిపోతున్నట్టు అనిపించాయి. నన్ను వాళ్లు గాలిలో ఎక్కడికో నడిపిస్తున్నారనిపించింది.ఒబెరాయ్‌లో కూర్చోబెట్టి వాళ్లు తర్ఫీదు యిస్తుంటే, నేను గుడ్లగూబలా చూస్తూ అన్నింటికి ఔనంటూ ఉండాలన్న మాట. ఖుంతియా అన్నారు – ‘‘సార్, నేను మీ అనుమతి లేకుండా డిన్నర్ కోసం ఆర్డరిచ్చాను’’ ‘‘ఐయామ్ సారీ! నేను కొంచెం ముందుగా వెళ్లకుంటే రేపటికోసం ఏర్పాట్లు జరగవు!’’ ‘‘ఔను.. ఆ మాట నిజమే’’ అన్నారు సామల్.ఖుంతియా కోపంగా అన్నారు – ‘‘హాత్, ఆ మాటా నిజమే! మనం వుండగా సార్ ఏర్పాట్లు చేయాలా? సార్! ఏమేం ఏర్పాటు చెయ్యాలో చెప్పండి. మేం చేస్తాం. రేపు లంచ్ యిక్కణ్ణుంచే తీసుకువెడితే ఎలా ఉంటుంది సార్? అంటే అహూజా సాబ్గారి ఇష్టాయిష్టాలు ప్రకారం.. కావలసినవన్నీను.’’ ‘‘సార్‌ని యివన్నీ అడగడవేవిటి? మనం మొత్తం ఫ్యామిలీ కోసం తీసుకుంటాం. ఇంట్లో తయారైనట్లుగానే ఉంటాయి వంటకాలు. హోటల్ తిండిలా వుండనే ఉండదు. ఇవాల్టి నుంచి 5271 వెహికలు సార్ నిమిత్తం మూడురోజుల పాటు ఉంచండి. ఎగ్జిక్యూటివ్ యింజనీరు బిస్వాల్గారికి చెప్పండి. జీప్తో పాటు మరో యిద్దరు స్టాఫ్‌తో డ్యూటీలో సిద్ధంగా ఉండమని.’’నేను తాపీగా దృఢ స్వరంతో అన్నాను – ‘‘మీరు నన్ను కాస్తంత మా యింటి దగ్గర డ్రాప్ చెయ్యగలరా? అంతకన్నా మీరేం చెయ్యనక్కర్లేదు. తర్వాత రేపు ఏరోడ్రోమ్కి వెళ్లే ముందు నన్ను పికప్ చేస్తే చాలు, మీకు వీలయితే. లేకపోయినా ఫరవా లేదు. నా ఏర్పాట్లు నేను చేసుకుంటా.’’‘‘సార్! మీకు కోపం వచ్చిందనుకుంటాను. మా ఉద్దేశం అదికాదు! నేను సార్‌ని యింటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను.’’‘‘అవసరం లేదు. మీరు మీ ఏర్పాట్లు చూసుకోండి. రానున్న యేడుగురు అధికార్లకూ కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. డ్రయివరుకి చెబితే అతను నన్ను డ్రాప్ చేసి వస్తాడు.’’5271 వెహికలు డ్రయివర్ని పిలిపించి ఖుంతియా చెప్పారు – ‘‘అరె సుదామ్! నువ్వు సార్ దగ్గర డ్యూటీలో ఉండు. బన్వారీ నుంచి నీకు కావాల్సిన పెట్రోలు తీసుకో!’’ నేను కార్లో కూర్చుని ఆలోచించాను.‘జ్ఞాన్ ప్రకాష్ అహూజా! నువ్వెంతగా ఎదిగిపోయేవు? ఇంత పవరుందా నీ చేతిలో? నిన్ను నా యింట్లో ఉంచుకోవడమంటే మహాప్రభువుని యింట్లో ఉంచుకున్నట్టేను. ఇవాల్టి నుంచే వీళ్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రేపు ఏమవుతారో ఏమిటో?’‘‘సుదామ్! కొంచెం అలా బజార్లోకిపోనీ!’’ నిర్జన రాస్తాలో అదే చల్లని గాలి మెలమెల్లగా వీస్తూంది. ఆ ఎదురుగా రెక్కలు చాచుకున్న నీలాకాశం. కాలి ఫ్లవరు, బఠాణీ, టమాటా, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. రేపు రోజే వేరు. రేపు యిల్లంతా శుభ్రపరచుకోవాలి.మంచి ఉత్సాహంగా యింట్లోకి అడుగుపెట్టి, మాటల మధ్యలో అహూజా రాక గురించి చెప్పేను. ఢిల్లీ నుంచి ఎవరొస్తున్నారో మా పిల్లలు ఊహించలేకపోతున్నారు. మా ఆవిడ నిర్వికారంగా కూర్చుని నేలకేసి చూస్తు అంతా వింటూంది, మాటామంతీ లేకుండా. ఉత్కంఠ ఉత్సాహం బొత్తిగా ఉండవు ఆవిడ అంతే.‘‘నువ్వేమీ మాట్లాడవేవిటి? రేపు ఏమేం కావాలో చెబితేకదా అవి ఏర్పాటు చెయ్యచ్చును.’’ ‘‘ఇంకేం చెప్పమంటారు? అక్కర్లేని తద్దినాన్ని నెత్తినేసుకుని వచ్చారు. అంత పెద్దాయన్ని చర్చల కోసం మన యింటికే ఎందుకు తెస్తున్నట్టు?వాళ్లందరి మంచీ మర్యాదా ఎవరు చూస్తారు? రాత్రి యింటికొచ్చి చల్లగా వార్త చెప్పికూర్చున్నారు. ప్రొద్దున్నే తీసుకొచ్చి నా నెత్తిన కూర్చోబెడతారు. ఇవన్నీ ఎలా చెయ్యాలి? మీరేం చేసుకుంటారో చేసుకోండి. నాకు రిక్షా ఏర్పాటు చెయ్యండి. ఓ మూడురోజులు మా మావయ్య యింట్లో వుండి వస్తాను, ఎన్నిసార్లో రమ్మని చెప్పాడు.’’నాకు చెమటలు పట్టేశాయి. నిజమే, నేననుకున్నంత సులువేంకాదు అంత పెద్దవాడికి ఆతిథ్యం యివ్వడం. నేను కళ్లు తేలేసుకుని కూర్చున్నాను. పిల్లలు చల్లగా జారుకున్నారు. పెద్ద విపత్తు యేదో మీదపడనుందని వాళ్లకు అర్థమయింది.అతి కష్టం మీద ఆవిడను రాజీకి తీసుకరాగలిగేను. ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటే ప్రణాళికను తయారు చేసుకోవచ్చును. ‘‘చూడు, అహూజా ఎంత పెద్ద అధికారి అయినా అతను నాకు స్నేహితుడు. అతనికి అంటూ ప్రత్యేక ఏర్పాట్లు యేమీ చెయ్యనవసరం లేదు. నేనాలోచిస్తున్నది అతని భార్య గురించి. నా భయమంతా ఆమెకు ఎలా మర్యాదలు చేయడమా అని!’’ ∙ ‘‘వాళ్లు రాంగానే కప్పు చాయి యిస్తావు. మన యింట్లో వున్న పెద్దకప్పులు సరిపోతాయా?’’‘‘ఎక్కడ కూర్చోబెట్టాలి? సోఫాదిళ్ల అవస్థ ఎలా వుందో చూస్తున్నారా? నేను ఎన్నిసార్లో మీకు చెప్పాను, విన్నారు కాదు. ఇప్పుడు మన దరిద్రమంతా బయటపెట్టుకోవాలి.’’ ‘‘ఇంకా వినండి. వాళ్లు డైనింగు టేబిలుకి అలవాటుపడ్డవాళ్లు. మన టేబిలుకి ఒక కాలు లేదు. దాన్ని తీసుకొచ్చిన రోజు నుంచి దాని మీద అక్కర్లేని వస్తువులన్నీ పెట్టాం. క్రిందపెట్టెలూ. కుర్చీలు ఏనాడో విరిగి మూలన పడ్డాయి. పిల్లలు డైనింగ్ టేబిలు కావాలంటూ ఎప్పట్నుంచో చెబుతున్నారు, విన్నారా మీరు? ఇప్పుడు క్రింద పీటలు వేసి కూర్చోబెడతారా? పోనీ ఆ పీటలయినా ఉంటేను కొంపలో?’’ నా తల తిరిగిపోయింది.‘‘భోజనంలోకి ఏం వడ్డిస్తారు? అప్పడాలు, వడియాలు, తోటకూర వేపుడూనా? వాళ్లకు యిష్టమయిన వంటకాలు ఏమిటో మీకు తెలుసా? ఒక వేళ తెలుసున్నా అవన్నీ వండి వార్చడానికి మనుషులేరి? నా వల్లకాదు. ఎందులో పెడతారు? సీమవెండి కంచాల్లోనా?’’నేను కళ్లూ చెవులూ మూసుకున్నాను. చెమటలతో నా నుదురు తడిసి ముద్దయింది. ఆవిడ మాట ప్రకారం అసంభవ కార్యక్రమం యిది. నిజంగా నాకు కోర్టులో మరణశిక్ష విధించినట్టుగా ఉంది. నేనీ రాత్రే చచ్చిపోతానా? ఉదయాన్నే అహూజా నాకు దండవేసి వెళ్లిపోతాడా? అలాగైతేనే నయం. అన్ని లోపాల్నీ దాచుకున్నట్టూ గౌరవాన్ని దక్కించుకున్నట్టూ అవుతుంది. ‘‘నా మాట విని, యేదో వంక చెప్పి వాళ్లని ఒక హోటల్లో దింపండి. ఒకసారి మన యింటికి తీసుకుని వస్తే, నేను పక్కింటి మంగతాయారు యింటి నుంచి కప్పులూ, ప్లేట్లూ పట్టుకొచ్చి టీ బిస్కెట్లు యిచ్చి సాగనంపుతాను.’’నా గొంతుక ఎండిపోయింది. అతి కష్టం మీద నా మనసులోని మాట చెప్పేను.‘‘వాళ్లు మన యింట్లో ఉంటారు.’’ ‘‘ఏవిటీ? ఇక్కడ ఉంటారా? ఎక్కడుంటారు? డాబాపైనా? మెట్లమీదనా? సాబ్ యిక్కడే మిగతా వారితో కలిసి వుండడమే మంచిది. మాయింట్లో వుంటే ఆయనకు యిబ్బందేను.’’ ‘‘ఆ విషయం మేం ముందే ఆలోచించాం. ఆయన వ్యవహారశైలి మేం ఢిల్లీలో చూసేం కదా? అరెబాబా! ఎంత టిప్ టాప్ ఆఫీసరు? కాస్తంత తేడా వస్తే తినేస్తాడు. ఆయనతో వ్యవహారం మాటలుకాదు.’’‘‘సామల్ నీకు అర్థం కాలేదా? నీకు కామన్సెన్సు లేదు. సార్, మీరు మరొకలా అనుకోకండి. అతను కొంచెం తాగేడు. సార్, నేను ఊరికే కంపెనీ యిద్దామని కూర్చున్నాను. విషయం ఏవిటంటే, ఒకవేళ అహూజా సాహెబ్ మీ యింట్లో వుండేందుకు నిర్ణయించుకునే వుంటే, ఆయన రాజీపడేది ఉండదు. అహూజా గారి నిర్ణయం మారడమంటూ ఉండదు. అందువల్ల మీ యిబ్బందులు ఏవిటో చెబుతే వాటిని సవరిద్దాం.’’ ‘‘ఒక యిబ్బంది అయితే చెప్పొచ్చు. అన్నీ యిబ్బంది గానే వున్నాయి. ఉండడానికి, తిండికీ, పడకకీ, స్నానానికి అన్నీ యిబ్బందులే. ఇల్లు కూడా ప్రభుత్వం వారిదేను. సీలింగు పెచ్చులూడి ఊసలు బయట పడి కనబడుతున్నాయి. తలుపులకు రంగు వేసి ఏనాడో అయింది. గోడలు నాచుపట్టి ఉన్నాయి. కిటికీలకు అద్దాలు లేవు. ాయిఖానాలో ఫ్లష్ అవుట్ లేదు. ఫ్యాను తిరగడం లేదు.’’‘‘అర్థమయింది. యు ఆర్ రైట్సార్! అహుజా సాబ్ అక్కడ ఉండలేరు. ఉంటే మాకు తలలు öట్టేసినట్టవుతుంది.’’సామల్ బుర్ర బరుక్కుని అన్నాడు– ఖుంతియాతో, ‘‘సార్, మీ ఇంట్లో ఉంటే యిబ్బంది ఉండదనుకుంటా.’’ ఖుంతియా ఎగిరి గంతేస్తూ అయిడియా అంటూ అరిచాడు. ‘‘ఐడియా! సామల్! ఐడియా! ఈ మూడు రోజులు సార్, తమ క్వార్టరు వదిలేస్తారు. నేను సర్క్యూట్ హౌస్‌కి వెళ్లిపోతాను. నేను ఒక్కణ్నే ఉంటున్నాను. మా ఆవిడ అస్సాం వెళ్లింది. నెల రోజుల తర్వాత గానీ రాదు. మంచి అయిడియా, తెలిసిందా సార్! మీరు మరేం ఆలోచించకుండా మా ఇంటికి మారిపోండి. అక్కడొక పని కుర్రాడిని ఫ్యూను లాగ కూర్చోబెడదాం. వాడే వంటా వార్పూ అన్నీ చేస్తాడు.’’ ‘‘పిల్లలు, వాళ్ల పుస్తకాలు, మా యితరత్రా వాడుకునే సామాను వెళ్లినా ఫరావాలేదు కదా?’’‘‘నో ప్రాబ్లమ్! మూడు రోజులు మీరు ఒక పిక్నిక్కి వెడుతున్నారనుకోండి! ఆ విధంగా మీ సామానంతా ఓ రెండు పెట్టెల్లో సర్దుకుంటే సరి! త్వరపడండి..’’అతనికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకర్థం కాలేదు– ‘‘మీ ఋణం తీర్చుకోలేను’’‘‘ఏమిటి మీరలా అంటారు? మీరు సరిగా అర్థం చేసుకోలేదు. మేం మీకోసం.. అదే అహుజా సాబ్ కోసం – యేదేనా చేయగలం!’’ఖుంతియా గారింట్లో రాత్రి ఒక గంట సమయం అటూ యిటూ తిరిగాం. మెరిసిపోయే టేబిలు, అద్దం, సోఫా, మూడు పరుపులు, పడక గదిలో డన్లప్ పరుపులు, ముందు గదిలో కార్పెట్టు. పెద్ద బరువుని దించుకున్నట్లయింది నాకు. వీస్తున్న గాలి కూడా హాయి గొలుపుతూంది. కిటికీ లోంచి వస్తూన్న పూల వాసన యిల్లంతా నిండిపోయింది. వసంతపు వెల్లువ నిలువునా ముంచెత్తింది. నా శరీరం, మనసు, ప్రాణం పులకించిపోయేయి. ఇంతటి సౌభాగ్యానికి నోచుకున్న ఆనందంతో నాకు నిద్రపట్టలేదు ఆ రాత్రంతా.తెలతెలవారుతుండగానే వెచ్చటి తేనీటి వాసన మేలుకొలుపు పాడింది. పని కుర్రాడు కప్పు సాసరుతో టీని అందించాడు పడగ్గదిలో. పిల్లలు ఉత్సాహంగా తిరుగుతున్నారు యిల్లంతా. మా ఆవిడకు యిదంతా అలవాటు చేసుకునేందుకు కొంత సమయం పట్టింది. ఇంటి చూట్టూ పెద్దతోట. తోటనిండా పూలు. ఇల్లంతా పూలవాసన. నాకు రెక్కలొచ్చినంత సంబరం కలిగింది. గాలిలో పక్షిలా తేలగలననిపించింది. పిల్లలు, బ్రెడ్డు, బట్టరు ఎగ్గు తింటూ కనిపిస్తున్నారు. వాళ్ల మొహాలు ఉదయాన్నే లేలేత ఎండకు వికసించిన మొగ్గల్లా మెరుస్తున్నాయి.ఉదయాన్నే స్నానపానాదులు ముగించుకున్న నా భార్యాపిల్లలు పెద్దింటి, కాదు గొప్పింటి గొప్ప వ్యక్తుల్లా యేదో కలలోలా చాలా సుకుమారంగా మనోహరంగా కనిపిస్తున్నారు. అపూర్వ వసంతం యింటాబయటా లోలోపలా. ఏభైయేళ్ల మధ్యకాలంలో యిటువంటి మరచిపోలేని వసంతాన్ని అనుభవించి ఉండలేదు. నాకు తెలుసు.. ఈ వసంత ఋతువు మూడు రోజులేనని! ఇందులో కొంత దగా, కొంత మోసం, కొంత ఆత్మవంచన దాగివున్నాయని కూడా నాకు తెలుసు. ఇతరుల నాటకంలో మేం కొద్ది పాత్రలమేనని కూడా తెలుసు. కానీ వసంతానుభవం మాత్రం మి«థ్యకాదు. అయితే, మధ్యమధ్య ఎంతో కొంత అనుతాపం కూడా కలుగుతూంది కలుపుమొక్కల్లా. దీని తరువాత ఏమైంది? అహూజ్సాబ్ వచ్చేరా? వెళ్లేరా? ఈ విషయాల గురించి మీరాలోచిస్తున్నారా? వాటికంత ప్రాధాన్యత ఉందా? నేను మూడు రోజులపాటు ఉచితంగా వాళ్లతో సమానంగా ధౌళి, కోణార్క్ తిరగడం, పక్షిలా ఎగిరినట్లు వేగంగా కదలడం, ముప్ఫై సంవత్సరాల గతాన్ని ఒక్క అంగలో దాటడం, సరిగ్గా ముప్ఫై సంవత్సరాల క్రిందటి చాపల్యాన్ని నా కళ్ల ముందుకు తెచ్చుకోవడం ప్రాధాన్య విషయం కాదా? మేం మాత్రం ఉద్వేగపూరిత ఉన్మత్త వసంతంలో నిమగ్నమై ఉంటిమి అన్న విషయం యదార్థం.వసంతం వెళ్లిపోయింది, మరిరాదు. కిటికీలు లేని వంటిల్లు జీవితం కూడా ముగిసిపోతున్నట్లేను.ఒడియా కథల సంకలనం ‘తరగని చీకటిరాత్రి’ సౌజన్యంతో.. -
శివరాత్రికి రూ.3.11 కోట్ల ఆదాయం
కర్నూలు (రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్‌కు శివరాత్రి పండుగ లాభాలు తెచ్చి పెట్టింది. 10రోజుల పాటు శ్రీశైలంతోపాటు వివిధ శైవ క్షేత్రాలకు 12డిపోల నుంచి 340 ప్రత్యేక బస్సులు నడిపారు. రూ. 49లక్షల ఆదాయార్జనతో ఆదోని డిపో మొదటి స్థానంలో ఉండగా ఎమ్మిగనూరు, నంద్యాల డిపోలు రూ.46 లక్షలు ప్రకారం సాధించాయి. ఆళ్లగడ్డ, డోన్ డిపోలు చివరి స్థానంలో నిలిచాయి. కర్నూలు-1, 2డిపోలు ఈ సారి వెనుకబడ్డాయి. -
శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
వైభవంగా త్రిశూల స్నానం
- మహానంది క్షేత్రంలో పూర్ణాహుతి - అంకురార్పణలో మొలకలు వృద్ది - సమృద్ధిగా వర్షాలకు సూచనగా చెప్పిన పండితులు మహానంది: మహానంది క్షేత్రంలో వారం రోజుల పాటు వైభవంగా జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం మహాపూర్ణాహుతి పూజలతో ముగిశాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీదేవి సహీత మహానందీశ్వరస్వామి వారికి రుద్రగుండం కోనేరులో వైభవంగా త్రిశూల స్నానం చేయించారు. వేదపండితులు రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండిత బృందం విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. రుద్రగుండం కోనేరులో స్వామివారికి నిర్వహించిన త్రిశూల స్నానంలో భక్తులు పాల్గొని తరించారు. కలశ ఉద్వాసన, ధ్వజ అవరోహణ, మూలమూర్తుల కంకణాల విసర్జన, దీక్షా హోమాలు, మహాపూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అనంతరం స్థానిక స్వామివారి కల్యాణమండపంలో నాగవేళి పూజలు నిర్వహించారు. వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ 2017 మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అంకురార్పణలో అంకురాలు బాగా మొలిచాయన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయనేందుకు ఇది సూచనగా తెలిపారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు శ్రీనివాసులు, బాలరాజుయాదవ్, మునెయ్య, రామకృష్ణ, కేశవరావు, శివారెడ్డి, మౌళీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుష్పోత్సవం..మల్లన్న వైభవం
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం పుష్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల యాగాలకు ఆదివారం పూర్ణాహుతి జరిగిన విషయం విదితమే. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణచేసి ఉత్సవాలకు ముగింపు పలికారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో మహాశివ రాత్రిన వధూవరులైన స్వామివార్ల పుష్పోత్సవ, శయనోత్సవ సేవలను సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను రాత్రి 8.30 గంటలకు అశ్వవాహనంపై అధిష్టింపజేసి విశేష వాహనపూజలను అర్చకులు, వేదపండితలు నిర్వహించారు. అనంతరం అశ్వవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లను ఆలయంలోనే ఊరేగించారు. స్వామివార్ల పుష్పోత్సవ, శయనోత్సవ వేడుకల కోసం పరిమళభరితమైన పుష్పాలతో అలంకార మండపాన్ని తీర్చిదిద్దారు. రాత్రి 9.30గంటల తరువాత ఆదిదంపతులకు వేదమంత్రోచ్చారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ పుష్పోత్సవ సేవా కార్యక్రమం జరిగింది. 11 రకాల పుష్ప ఫలాదులతో స్వామివార్లకు పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా స్వామివార్ల కోసం ఎర్రబంతి, పసుపుబంతి, పసుపు, తెల్లచేమంతి, మల్లెలు, కనకాంబరాలు, ఎర్ర, తెల్ల, ముద్ద, దేవ, సువర్ణ గన్నేరు, నంది, గరుడవర్థనం, మందారం, ఎర్ర , నీలం ఆస్టర్, కాగడాలు, జబ్రా, కారినేషన్, ఆర్కిడ్స్, గ్లాడియేలస్ తదితర పుష్పాలను ఉపయోగించారు. స్వామివార్ల ఏకాంత సేవ కోసం అద్దాల మండపంలోని ఊయల తల్పాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఏకాంతసేవను ఆగమ సంప్రదాయానుసారం వేదమంత్రోచ్చారణల మధ్య అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. అలయ ఏఈఓ కృష్ణారెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
మహానందమాయే!
కనుల పండువగా సాగిన మహానందీశ్వరుడి రథోత్సవం మహానందిలో కనులపండువగా జరిగిన రథోత్సవం అశేష భక్తజనవాహిని మధ్య కదిలిన రథం మహానంది: నల్లమల పర్వత పాన్పుల అందాలు.. నీలాకాశం నింగి అందాలకు తోడుగా మహానందీశ్వరుడి రథోత్సవం కనులపండువ సాగింది. మహానంది దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో ఆదివారం సాయంత్రం రథోత్సవం వైభవంగా సాగింది. కర్నూలు అడిషనల్ జడ్జి ఇంతియాజ్ అహ్మద్, నంద్యాల ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్రావు, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్, నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, కల్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు రథోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణం పూర్తయిన తర్వాత ఆదివారం పెళ్లిపెద్దలు శ్రీ పార్వతీ సహిత శ్రీ బ్రహ్మనందీశ్వరస్వామితో కలిసి రథంలో కొలువయ్యారు. ఈ మేరకు లక్షలాది మంది భక్తులు హరహర...మహాదేవ...శంభో శంకర.....శ్రీ మహానందీశ్వరస్వామికి జై...శ్రీ కామేశ్వరీదేవి మాతాకీ జై....అంటూ భక్తులు భక్తిపూర్వకంగా ప్రణమిల్లారు. ఆలయం పురవీధుల్లో సాగిన ర థోత్సవాన్ని తిలకించిన భక్తులు మహానందానికి గురయ్యారు. రథోత్సవంలో విశేష పూజలు: రథోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం రథం వద్ద వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ, తదితర çపండిత బృందం ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవాచనం, రథాంగబలి, నవకలశ స్నపనము, రథాంగహోమము, దీక్షా హోమం, తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం తిమ్మాపురం గ్రామానికి చెందిన పుల్లయ్యాచారి కుంభంకూడు మోసుకొచ్చారు. రథానికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత తెడ్లకు కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేపట్టారు. రథంలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా, ప్రదక్షిణలు చేయడం ద్వారా పునర్జన్మ ఉండదని, సర్వ పాపాలు హరిస్తాయని వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. తూర్పున ధర్మం, పడమట జ్ఞానం, ఉత్తరాన ఐశ్వర్యం, దక్షిణాన మోక్షం లభిస్తుందన్నారు. రథంలో బ్రహ్మ, అనంతుడు, ఇంద్ర, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఉంటారని వారు వివరించారు. పూజా కార్యక్రమాల్లో పాలకమండలి సభ్యులు బండి శ్రీనివాసులు, రామకృష్ణ, సీతారామయ్య, మునెయ్య, బాలరాజు, శివారెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సురేంద్రనా«ద్‌రెడ్డి, నంద్యాల రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో ఉద్రిక్తత: మహానందీశ్వరుడి రథోత్సవంలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. మహానందీశుని రథోత్సవం స్థానిక ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం వద్దకు చేరుకోగానే అక్కడ ఆపాలి అంటూ కొందరు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు అర్చకులు, పండితులపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు వెంటనే వారించడంతో సమస్య సద్దుమణిగింది. -
మహా విషాదం
⇒ గోదావరిలో మునిగి నలుగురు మృతి ⇒ చింతలబయ్యారం వద్ద ప్రమాదం ⇒ యువకుల ప్రాణాలు తీసిన శివరాత్రి స్నానం ⇒ మరణంలోనూ వీడని స్నేహ బంధం మహా శివరాత్రి పండగ పూట ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, దైవ దర్శనానికి వెళ్లాలనుకున్న ఆ నలుగురు మిత్రుల ప్రాణాలను గోదారి మింగేసింది. పినపాక మండలం చింతల బయ్యారం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘటనలో గూదె ప్రేమ్‌కుమార్(22), తంతరపల్లి మురళీకృష్ణ(20), అల్లి నాగేంద్రబాబు(20) బోనగిరి పవన్‌కుమార్(20) గోదావరిలో ఉన్న సుడిగుండంలో మునిగి ప్రాణాలు వదిలారు. శివరాత్రి పండగ.. నలుగురి యువకుల ప్రాణాలను బలిగొంది. నాలుగు నిరుపేద కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. శివరాత్రి రోజున గోదావరిలో పుణ్య స్నానాలు చేసేం దుకు వెళ్లిన స్నేహితులైన నలుగురు యువకులు నీట మునిగి మృతిచెందారు. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామ పంచాయతీలోని చింతలబయ్యారం గ్రామం వద్ద గల శివాలయంలో పూజలు చేసేందుకని ఏడూళ్ళబయ్యారం సాయినగర్‌కు చెందిన గూదె ప్రేమ్‌కుమార్(22), తంతరపల్లి మురళీకృష్ణ(20), సెంటర్‌కు చెందిన అల్లి నాగేంద్రబాబు(20), ఉప్పాక గ్రామానికి చెందిన బోనగిరి పవన్‌కుమార్(20) తమ కుటుంబీకులతో కలిసి శుక్రవారం ఉదయం వెళ్లారు. అందరూ కలిసి పుణ్య స్నానాలు ఆచరించేందుకని గోదావరిలోకి దిగారు. స్నేహితులైన ఆ నలుగురు యువకులు మాత్రం గోదావరి మధ్యలోకి వెళ్లి అక్కడ జలకాలాడుతున్నారు. అక్కడ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశం(సుడిగుండం)లో బోనగిరి పవన్‌కుమార్ మునిగిపోతుండడాన్ని మిగి లిన ముగ్గురు గమనించారు. అతడిని రక్షిం చేందుకని నాగేంద్రబాబు, మురళీకృష్ణ, గూదె ప్రేమ్‌కుమార్ వెళ్లారు. నలుగురూ పూర్తిగా నీట మునిగారు. అక్కడకు దగ్గరలోనే స్నానమాచరిస్తున్న స్థానికులు, ఈతగాళ్లు గమనించి వెంటనే ఈదుకుంటూ వెళ్లారు. సుమారు రెండు గంటలపాటు వెదికారు. నాటు పడవ సాయం తో సుడిగుండం వద్ద ఆ నలుగురి మృతదేహాలను గుర్తించారు. ఒడ్డుకు తీసుకొచ్చారు. ఉత్సాహంగా లోనికెళ్లిన ఆ నలుగురు.. గంటల వ్యవధిలోనే నిర్జీవంగా బయటకు వస్తుండడాన్ని వారి కుటుంబీకులు తట్టుకోలేకపోయా రు. గుండెలవిసేలా రోదించారు. ప్రాణ స్నేహితులు ఈ నలుగురు యువకులవి నిరుపేద కుటుం బాలే. గూదె ప్రేమ్‌కుమార్, తంతరపల్లి మురళీకృష్ణ, అల్లి నాగేంద్రబాబుది ఏడూళ్లబయ్యారం గ్రామం. బోనగిరి పవన్‌కుమార్‌ది ఉప్పాక గ్రామం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రేమ్‌కుమార్ డిగ్రీ చదువును మధ్యలో ఆపేశాడు. మిగతా ముగ్గురు, భద్రాచలంలోని ప్రైవేట్ కాలేజీలో ఐటీఐ సెకండియర్ విద్యార్థులు. వీరు గురువారం పరీక్షలు రాసి ఇంటికి వచ్చారు. ఉప్పాకలో ఉంటున్న పవన్‌కుమార్‌ని పిలిపించారు. ప్రాణ స్నేహితులైన ఈ నలుగురు, శుక్రవారం మహాశివరాత్రి రోజున చింతలబయ్యారం గ్రామంలోని శివాలయంలో పూజలు చేసేందుకని కుటుంబీకులతో కలిసి వచ్చారు. ప్రాణ స్నేహితులైన ఈ నలుగురిని విడదీయడం.. శివయ్యకు ఇష్టం లేకపోయిందేమో! నలుగురినీ ఒకేసారి తీసుకెళ్లాడు. ఓదార్పు ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మణుగూరు డీఎస్పీ బి.అశోక్‌కుమార్, ఏడూళ్ళబయ్యారం సీఐ అంబటి నర్సయ్య హుటాహుటిన గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. మృతుల కుటుంబీకులను ఓదార్చారు. మృతదేహాలకు గోదావరి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించేలా చూడాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఫోన్లో కోరారు. వైద్యులు వెంటనే వచ్చి, పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు నలుగురు యువకుల మృతిపై ఏడూళ్లబయ్యా రం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమా దం తీరును తెలుసుకున్నారు. మృతుల వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ అంబటి నర్సయ్య చెప్పారు. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై ఎంపీ పాటిల్ దాడి
ఆందోళనకు దిగిన జర్నలిస్టులు... చివరకు క్షమాపణ చెప్పిన పాటిల్ జహీరాబాద్: ఆలయంలో ఫొటోలు తీస్తున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ చేయిచేసుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయానికి మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు వస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫొటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులు కవరేజీ కోసం శుక్రవారం అక్కడికి చేరుకున్నారు. మంత్రి పర్యటన రద్దు కాగా, డిప్యూటీ స్పీకర్ ఆలయానికి వచ్చారు. గర్భగుడిలోకి పట్టువస్త్రాలు సమర్పించేందుకు పద్మాదేవేందర్‌రెడ్డి వస్తున్న క్రమంలో ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్నారు. అక్కడే ఉన్న ఎంపీ బీబీ పాటిల్ ఫొటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశారు. లోపలికి ఎందుకు వచ్చారు? పోలీసులెలా అనుమతించారు? అంటూ రుసరుస లాడారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌పై చేయిచేసుకున్నారు. ఆగ్రహించిన జర్నలిస్టు లు ఆందోళనకు దిగారు. స్పందించిన డిప్యూటీ స్పీకర్ సారీ చెప్పారు. బయలుదేరి వెళ్లేందుకు ఎంపీ వాహనంలో కూర్చోగా జర్నలిస్టులు ఆయన వాహనం ముందు బైఠాయించారు. ఎంపీ అనుచరుల ఓవర్‌యాక్షన్‌తో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పాటిల్.. క్షమాపణ చెప్పడంతో మీడియా ప్రతినిధులు శాంతించారు. -
ఉరుకుందకు పోటెత్తిన భక్తులు
కౌతాళం: శివరాత్రిని పురస్కరించుకుని ఉరుకుంద శ్రీఈరన్న స్వామి దేవాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఎంతో నిష్టతతో క్యూలో నిల్చుకొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామి వారి మూలవిరాట్‌ను ప్రత్యేక ఫలపుష్పాలతో ఆలంకరించి సుప్రభాతసేవ, మహామంగళ హారతి, ఆకుపూజ నిర్వహించారు. -
సంగమేశ్వరంలో భక్తల సందడి
కొత్తపల్లి: ఏడు శివరాత్రి పర్వదినాల తర్వాత ఈ ఏడాది మొదటిసారి పండుగ రోజున భక్తులకు సంగమేశ్వరుని దర్శనభాగ్యం లభించింది. ఏటా శివరాత్రి పండగ నాటికి సప్తనదీజలాల్లో నీటి మట్టం తగ్గకపోవడంతో స్వామివారు జల గర్భంలోనే ఉండేవారు. ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది నదిలో నీరు తగ్గడంతో శివరాత్రి సందర్భంగా శుక్రవారం జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహబూబ్‌నగర్ నుంచి వేలాదిగా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. ముందుగా దిగువఘాట్‌కు చేరుకొని సప్తనదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. శివనామస్మరణ పఠిస్తూ కాయ, కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
శివరాత్రి ,ఏం చేయాలి? ,ఎలా జరుపుకోవాలి?
ఎలా ఉండాలి? పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్దేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అదే మన సనాతన సంస్కృతి. ఏ పండుగ జరుపుకోవడానికైనా, అసలు కారణాలు తెలుసుకుంటే కానీ, ఆంతర్యం బోధపడదు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు పెద్దలు. • జీవారాధన ముఖ్యం మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్థాలు మిగులుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. ఎందుకంటే, అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అన్నారు. అందుకే ‘జీవారాధనే శివారాధన’ అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. • ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం. బాలలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణులకు, ఔషధ సేవనం చేయాల్సిన వారికి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయడం వల్ల ఉపవాస ఫలం ఉండదు. ⇒ ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను’ అని సంకల్పం చెప్పుకోవాలి. ⇒ ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. ⇒ మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతునివైపు మనసును తిప్పడం కష్టం. ⇒ శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. ∙ఆహారానికి, నిద్రకే కాదు... మాటలకు కూడా..! ⇒ శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయాలు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు వ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివునిపై కేంద్రీకరించాలి. ⇒ వీలైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఫరవాలేదు. జాగారం చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ, పరనింద, పరాన్నభోజనం, చెడుతలపుతో, అశ్లీలపుటాలోచనలతో చేసే ఉపవాస, జాగారాలకు ఫలితం లేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమకచమకాలను వినడం కూడా ఫలదాయకమే! ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారికి ఆరోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. అలాంటప్పుడు అవసరమైనంతవరకే మాట్లాడండి, ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి. • మహిమాన్వితం... మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. ⇒ శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. -
శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన కోటప్ప కొండ
-
మహానందిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మహానంది: మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి అంకురార్పణ పూజలు చేశారు. మహానంది దేవస్థానం పాలక మండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్.. విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, చండీశ్వరపూజ, దీక్షాధారణ, అఖండస్థాపనములు, తిరుమంజనము జరిపారు. రాత్రి అగ్నిప్రతిష్ఠాపన, కలశస్థాపన, వాస్తుపూజా హోమం, భేరిపూజ, ధ్వజారోహణం, బలిహరణం, వేదశాస్త్ర సమర్పణం గావించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, కళ్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు, ఆలయ ధర్మకర్తలు బాలరాజు, రామకృష్ణ, మునెయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
మహానంది: మహానంది క్షేత్రంలో జరగనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు మహానంది దేవస్థానం పండితుడు రవిశంకర అవధాని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో ఈ నెల 27వరకు ఉత్సవాలు ఉంటాయన్నారు. అందులో భాగంగా 24న మహా లింగోద్భవం, మహా లింగోద్భవం, 25న స్వామివారి కల్యాణం, 26న రథోత్సవం ఉంటాయన్నారు. ఈ ఏడాది కొత్తగా శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారికి పుష్పపల్లకీ ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు. -
శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
20 ఏళ్లలో ఏడోసారి
- శివరాత్రి పూజకు సంగమేశ్వరుడు సిద్ధం ఆత్మకూరు: మరోసారి శ్రీ సంగమేశ్వర క్షేత్రం కృష్ణా జలాల దిగ్బంధం నుంచి బయటపడుతోంది. గత ఏడాది ఆగస్టు నెలలో కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరడంతో సంగమేశ్వర క్షేత్రం నీట మునిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 839 అడుగులకు నీటి మట్టం చేరడంతో సంగమేశ్వర దేవాలయంలో బయటపడింది. ఏడాది మహాశివరాత్రి వేళ పూజలు నిర్వహించే అవకాశం ఏర్పడింది. మరో ఐదు అడుగుల నీరు తగ్గితే గర్భాలయంలో శివ లింగం కూడా బయటపడనుంది. భక్తులు నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి సంగమేశ్వరం క్షేత్రం బ్యాక్‌వాటర్‌లో నీట మునుగుతోంది. దాదాపు 20 ఏళ్లలో ఇప్పటి వరకు శివరాత్రి సమయానికి ఆరు సార్లు బయటపడగా.. ఏడో సారి కూడా సంగమేశ్వరుడు పూజలకు సిద్ధమవుతున్నాడు. 2003 నుంచి ఈ క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం నాటికి పూర్తిగా బయటపడడం ప్రారంభమైంది. 2004, 2005 వరుసగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. 2006 నుంచి 2010 వరకు ఽవర్షాలు సంవృద్ధిగా కురవడంతో ఐదేళ్లు పూర్తి స్థాయిలో బయటపడ లేదు. 2011లో నాలుగో సారి ఈ క్షేత్రం జలదిగ్బంధం వీడింది. 2012 నుంచి వరుసగా మరో మూడేళ్లు శ్రీశైలం జలాశయాలు తగ్గక పోవడంతో శివరాత్రి వేడుకలు జరగలేదు. అనంతరం 2015, 2016లో వరుసగా సంగమేశ్వరుడు దర్శనమచ్చారు. ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు క్షేత్రం గోపురం కూడా కనిపించలేదు. స్వామి శివరాత్రి పూజలు నిర్వహించడం సాధ్యం కాదని భక్తులు అనుకున్నారు. అయితే 20 రోజుల్లో డ్యామ్‌లో నీటిని దిగువకు విడుదల చేయడంతో అనతి కాలంలోనే క్షేత్రం జలదిగ్బంధం నుంచి బయటపడింది. శ్రీ సంగమేశ్వర కల్యాణానికి ఏర్పాట్లు: ఎట్టకేలకు కృష్ణా జలాల దిగ్బంధం నుంచి బయటపడిన సంగమేశ్వరుడు కల్యాణ మహోత్సవానికి సిద్ధమవుతున్నాడు. 24న శివరాత్రి సందర్భంగా శుక్రవారం స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, విశేషపూజలు, అర్ధరాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. 25న స్వామివార్ల కల్యాణానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ పేర్కొన్నారు. -
ఈశ్వరుడు మనకోసం ఎంచుకున్న కాలం... శివరాత్రి
కాలగమనంలో శుక్లపక్షం, కృష్ణపక్షం ఎలా ఉన్నాయో, పూర్తి చీకటి– అమావాస్య వైపుకు తిరిగిన కాలంలో ఇంద్రియ నిగ్రహం, ఆత్మ సంయమనం అనే మార్గాల ద్వారా ఈశ్వర తత్వానికి దగ్గరగా వెళ్లగలిగే సోపానాలే, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఇవి మాసానికి ఒకమారు, సంవత్సరానికి ఒకమారు మనకు లభిస్తాయి. ఇది ఈశ్వరుడు మనకోసం ఎంచుకున్న కాలం. అందుచేతనే ఆ రాత్రి ఆటవికుడు ఒకడు బిల్వవృక్షం మీద కూర్చొని క్రూరమృగం నోటికి దొరక కుండా, రాత్రంతా ఒక్కో దళం తుంచుతూ, తెలియకుండానే కింద ఉన్న శివలింగం మీద పడేస్తూ జాగారం ఉండడం చేత అనుకోకుండానే సాధన పూర్తి చేసి మోక్షం పొంది తరించాడని మనకు మహా శివరాత్రి కథ చెబుతోంది. ఉపవాసం, జాగరణ అనేవి ఇంద్రియ నిగ్రహం, సమత్వం ద్వారా మనలోని చీకటిని తొలగించుకుని ఈశ్వర తత్వాన్ని తెలుసుకునేందుకు మనకు ఇచ్చిన సాధనాలు. అలా అని నీరసంతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసాలు చేసి మరింత అనారోగ్యాన్ని తెచ్చుకోమని కాదు. అదేవిధంగా నాలుగు చలన చిత్రాల సందర్శనం చేసి మర్నాడు రోజంతా నిద్ర పొమ్మని కూడా కానే కాదు. మహాశివరాత్రి రోజున జరిగే రుద్రాధ్యాయ పారాయణ నమక చమకంతో జరిపే అభిషేకాలు ఎంతో లాభదాయకాలు. సమస్త పాపక్షయానికి, అనావృష్టి నివారణకు, గోరక్షకు, అకాల మృత్యువు దోష నివారణకు, అభయానికి, నాయకత్వం పొందటానికి, వ్యాధి నివారణకు, సంతాన ప్రాప్తికి, కుటుంబ సంక్షేమం, తదితరాలకు మొదటి అనువాకం, ధనప్రాప్తికి, శత్రుక్షయానికి, విజ్ఞతప్రాప్తికి రెండవ అనువాకం, ఆరోగ్యానికి మూడవ అనువాకం, క్షయవ్యాధి నివారణకు, సంపూర్ణ ఆరోగ్యానికి నాల్గవ అనువాకం, మోక్షప్రాప్తికి అయిదవ అనువాకం, శివునితో సమానమైన పుత్రప్రాప్తికి అయిదు, ఆరు అనువాకాలు, ఆయువుకు ఏడవ అనువాకం, రాజ్యప్రాప్తికి ఎనిమిదవ అనువాకం, ధనకనక వస్తువాహనాలు, వివాహం జరగడానికి తొమ్మిదవ అనువాకం, సమస్త భయ నాశనానికి పదవ అనువాకం, తీర్థయాత్రలకు, జ్ఞానార్జనకు పదకొండవ అనువాకం, ఇలా సకల కార్యసిద్ధికోసం మహాశివరాత్రి అనువాకాలను ఉచ్చరిస్తూ అభిషేకం చేయడం ఆచారం. దీని తర్వాత శివునితో మమేకమవుతూ చమకంతో అభిషేకం జరుపుతారు. ఆత్మసాక్షాత్కారానికి తొలిమెట్టు ఇంద్రియ నిగ్రహం. శాస్త్రాలు నిర్దేశించిన సమయాలు శక్తిమంతమైనవి. ఆయా సమయాలలో చేపట్టే అభ్యాసం చాలా మంచిది. శివుని నర్తనం, శివ శక్తుల సమ్మేళనం సృష్టిలోని అన్ని ప్రక్రియలకు, అస్తిత్వాలకూ మూలమని తెలుస్తోంది. తొలుత ఈ ప్రక్రియ మహాశివరాత్రి రోజున మహర్షులకు విదితమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆనంద నర్తనానికి తార్కాణం చిదంబరంలోని ఆకాశలింగం. ఇక్కడ ఉన్న చిత్ సభ, మానవుని శరీరంలోని నాడులు, వాటి నిర్మాణం, సకల విశ్వంలోని శక్తులు, వాటినుండి ప్రసారమయ్యే శక్తి, శబ్దబ్రహ్మం లయ విన్యాసం ఇత్యాదులను అనుసరించి నిర్మించటం జరిగింది. శివునికి రెండు స్వరూపాలు– చంద్రస్వరూపం, అగ్ని స్వరూపం. సామాన్యంగా మనం పూజించే శివుడిది చంద్రస్వరూపం. కాలాన్ని శాసించే శివుడు, కాలాన్ని సూచించే చంద్రుడు కలిసిన స్వరూపం చంద్రశేఖర స్వరూపం. గ్రహదోషాలు, గ్రహదశలలో గల సమస్యలు, వాటి నివారణకు మహాశివరాత్రి రోజున జరిపే అభిషేకం ఎంతో ప్రధానమైనది. ఈరోజున ద్వాదశ జ్యోతిర్లింగాలలో లేదా పంచభూత లింగాలలో ఏ క్షేత్రమైనా గానీ లేదా ఇంటికి దగ్గరలో ఉన్న ఏ శివాలయాన్నైనా సందర్శించి మనసారా ఒక్కసారైనా పంచాక్షరి ఉచ్చరించిన వారికి ఎంతో ఫలితం ఉండగలదు. ఈశావాస్యోపనిషత్తు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్... ’ అని చెబుతుంది. పరమేశ్వర తత్వమొక్కటే పరిపూర్ణమైనది. ఒక వృత్తం తన ఆకారంలో చాలా గొప్పది. అది అనంతమైన మోతాదులో పెరుగుకుంటూ వెళ్లినా దాని కేంద్రం ఒక్కటే. పరిపూర్ణ తత్త్వమనేది ఒక గోళానికి చెందింది. పరిపూర్ణమైన దానిలోని భాగాలన్నీ, అణువులన్నీ పరిపూర్ణాలే అని తెలుసుకోవడమే సాధన! సృష్టి యావత్తూ శివలింగమే– ఈ భూమిని కూడా ఒక లింగమేనని ధ్యానించాలి. సృష్టిలో ఒక చిన్న పరిపూర్ణత్వం ఈ ధరణి. అన్ని స్పందనలూ, చేతనలూ ఆయనలోనే, ఆయన వలనే! అటు అనంతం ఇటు అనంతం, పైన అనంతం, కింద అనంతం చుట్టూ తిరిగి చూస్తే సర్వం లింగాకారమే.. సర్వం శివమయం జగత్! – వేదాంతం శ్రీపతి శర్మ -
శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు
– రూ. 217 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ – కడప జోన్‌కు 149 కొత్త బస్సులు – పెద్దనోట్ల రద్దుతో తగ్గిన 4 శాతం ఓఆర్ – ఆర్టీసీ ఈడీ రామారావు వెల్లడి కోవెలకుంట్ల: శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కడప జోన్ నుంచి 380 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు ఆ జోన్ ఈడీ ఆర్. రామారావు చెప్పారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోను తనిఖీ చేసి వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలకు కర్నూలు రీజియన్‌లోని 140 బస్సులతోపాటు అనంతపురం రీజియన్ నుంచి 140 బస్సులు, తిరుపతి నుంచి 60 సప్తగిరి బస్సులు, నెల్లూరు నుంచి 40 బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులను ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నుంచి శ్రీశైలంతోపాటు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన మహానంది, యాగంటి, ఓంకారం, తదితర ప్రాంతాలకు నడుపుతామని వెల్లడించారు. గత ఏడాది జోన్‌లోని కర్నూలు, కడప, అనంతపురం రీజియన్లలో రూ. 145 కోట్ల నష్టాలు ఉండగా ఈ ఏడాది ఆ నష్టం రూ. 217 కోట్లకు చేరిందన్నారు. ఖర్చులు, డీజల్ ధరలు పెరిగిపోవడం, ఓఆర్ తగ్గిపోవడం, కార్మికులకు వేతనాలు పెంపు, తదితర కారణాలు ఆర్టీసీకి నష్టాలు చేకూర్చయనా్నరు. రూ. 500, రూ.1000 నోట్ల రద్దు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. జోన్‌పరిధిలో నవంబర్, డిసెంబర్ నెలలో 3–4 శాతం ఆక్యుపెన్సీరేటు తగ్గిందన్నారు. జోన్‌కు ఇప్పటి వరకు 149 కొత్త బస్సులు రాగా వీటిలో 47 సూపర్ లగ్జరీ, 20 డీలక్స్, 82 ఎక్స్‌ప్రెస్ బస్సులను ఆయా డిపోలకు కేటాయించామన్నారు. మరో 411 బస్సులు రావాల్సి ఉందని చెప్పారు. కర్నూలు రీజియన్‌లో 40 మంది డ్రైవర్లు అదనంగా ఉండటంతో వారిని కడప రీజియన్‌కు బదిలీ చేసి అదనంగా ఉన్న 50 మంది కండక్టర్లను కర్నూలు జిల్లాకు బదిలీ చేశామన్నారు. ఇప్పట్లో కొత్తగా కండక్లర్, డ్రైవర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లేనట్లేనన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలబాటలో పయనింపచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆయా డిపోల్లో ఎన్ఫోర్స్మెంట్ టీములను బలోపేతం చేశామన్నారు. ఈ బృందాలు నిరంతరం రోడ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాయన్నారు. దశలవారీగా ఆర్టీసీ బస్టాండ్లను అభివృద్ధి చేస్తున్నామని ముందుగా జిల్లాకేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల బస్స్టేషన్లపై దృష్టిసారించినట్లు వెల్లడించారు. తర్వాతి క్రమంలో శిథిలావస్థకు చేరుకున్న బస్టాండ్లను ఆధునికీకరిస్తామన్నారు. డిపోల్లో ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 9వ తేదీన కోవెలకుంట్ల బస్టాండ్ సమీపంలో 40 షాపుల నిర్మాణాలకు టెండర్లు పిలువనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, నంద్యాల డిప్యూటీ సీటీఎం మధుసూదన్, ఈడీ ముఖ్య కార్యదర్శ వెంకటేశ్వరరెడ్డి, డిపో మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
శ్రీగిరి.. ఉత్సవభేరి
- శాస్త్రోక్తంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు - సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ - చండీశ్వరునికి విశేష పూజలు శ్రీశైలం: శివ భక్తులకు భూకైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభ పూజలను అత్యంత శాస్త్రోక్తంగా ఈఓ నారాయణ భరత్ గుప్త, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో భాగంగా బ్రహ్మోత్సవాల నిర్వాహకుడైన చండీశ్వరుని ఆవాహన చేసి దీక్షా వస్త్రాలను సమర్పించి కంకణధారణ చేయించారు. ఆ తరువాత ఉత్సవంలో పాల్గొనే అర్చకులు, వేదపండితులు, భజంత్రీలు, సంబంధిత సిబ్బందికి దీక్షా వస్త్రాలను అందజేశారు. అనంతరం పుణ్యహవాచనం, శివసంకల్పం, చండీశ్వర పూజ, రుత్విగ్వరణం, అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, కలశ స్థాపన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుని ఆధ్వర్యంలో ముక్కంటి బ్రహ్మోత్సవాలను చండీశ్వరుడే నిర్వహిస్తారని వేదపండితులు తెలిపారు. అందుకే చండీశ్వరునికి ముందుగా కంకణధారణ చేస్తామన్నారు. ఉత్సవ సమయంలో ప్రతి రోజూ ఉభయ దేవాలయ పూజల వేళల్లో ఈ చండీశ్వరుని పల్లకి ఊరేగింపు ఉంటుందన్నారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉదయం యాగశాలలో గణపతి పూజతో ప్రారంభం కాగా, రాత్రి 8 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన పూజలు జరిగాయి. అనంతరం పల్లకిలో చండీశ్వరుడిని ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజ స్తంభం వద్దకు తీసుకు వచ్చారు. వేదమంత్రోచ్ఛారణలతో మంత్రపూర్వకంగా సకల దేవతలను ఆహ్వానిస్తూ శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి రావాల్సిందిగా ముక్కోటి దేవతలకు పిలుపునిచ్చారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుని పర్యవేక్షణలో చండీశ్వరుని ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు మహాశివరాత్రి రోజున శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని, మహావిష్ణువు కన్యాదానం చేయగా, బ్రహ్మ రుత్వికత్వం నిర్వహిస్తారని శైవాగమం చెబుతోందని వేదపండితులు పేర్కొన్నారు. ధ్వజారోహణకు ఈఓ దూరం: ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో ఆలయ కార్యనిర్వహణాధికారి కంకణధారణ చేసుకుని ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణ కార్యక్రమ క్రతువులను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. అయితే అత్యున్నత అధికారి లేనప్పుడు, ఆలయ అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభ క్రతువులలో కీలకమైన ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణ కార్యక్రమాలకు ఈఓ హాజరు కాకపోవడంతో అర్చకులు, వేదపండితులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలకు తావిచ్చినట్లయింది. -
శైవ క్షేత్రాలకు 380 ప్రత్యేక సర్వీసులు
ఆర్టీసీ ఈడీ రామారావు కర్నూలు(రాజ్‌విహార్): మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలో 380 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు రామారావు తెలిపారు. బుధవారం స్థానిక బళ్లారి రోడ్డులోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో శివరాత్రి ఏర్పాట్లపైన డీఎంలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 27 వరకు శ్రీశైలంతో పాటు ఇతర శైవ క్షేత్రాలకు సర్వీసులు నడపనున్నట్లు ఈడీ తెలిపారు. శ్రీశైలం వెళ్లే సర్వీసులకు అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. అనంతపురం, నెల్లూరు, తిరుపతి రీజియన్ల నుంచి 240 బస్సులు తెప్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రద్దీకి తగ్గట్లుగా శ్రీశైలం, మహనంది, కొలనుభారతి, ఓంకారం, భోగేశ్వరం, యాగంటి, రాయచూరు, సంగమేశ్వరం, గురజాల, బ్రహ్మగుండానికి సర్వీసులు కేటాయిస్తామన్నారు. స్పెషల్ ఆపరేషన్స్‌లో భాగంగా తాను ఓవరాల్‌గా పర్యవేక్షిస్తామని, మెకానికల్ మొబైల్ టీం, హెల్ప్‌లైన్ సెంటర్లు, సెక్యూరిటీ, ట్రాఫిక్ సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ప్రతి డిపో వద్ద సమాచార కేంద్రాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ రజియా సుల్తానా, అధికారులు, డీఎంలు పాల్గొన్నారు. -
శ్రీగిరికి ఉత్సవ శోభ
-
జలధీశ్వరా పాహిమామ్
శివరాత్రి స్పెషల్ – 1 జలధీశ్వర ఆలయం. రెండవ శతాబ్దికి చెందిన అతి పురాతన దేవాలయం. శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవాలయాలకు విభిన్నంగా ఏకపీఠం మీద శివపార్వతులు దర్శనమిచ్చే అరుదైన దేవాలయం. శివరాత్రి సందర్భంగా ఘంటసాల గ్రామంలో కొలువుతీరిన జలధీశ్వరాలయంపై ప్రత్యేక వ్యాసం. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే దారిలో కొడాలికి ఎడమవైపున అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘంటసాల గ్రామంలోని శ్రీబాలపరమేశ్వరీ సమేత జలధీశ్వరాలయం ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి. విజయవాడకు 60 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేవాలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చి భగవంతుని దర్శించుకుంటారు. త్రికాల సంధ్యాస్నానాలకు అనువుగా సముద్ర తీరంలోని ఈ గ్రామంలో బాలపార్వతీ సమేతంగా జలధీశ్వరునిగా కొలువై ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలను, అష్టాదశ శక్తిపీఠాలను దర్శిస్తే వచ్చే పుణ్యమే ఈ దేవాలయ సందర్శన వల్ల కూడా కలుగుతుందని స్థలపురాణం చెబుతోంది. జలధీశ్వర అభిషేక జలం సేవిస్తే అనేక వ్యాధులు నయమవుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. శివుని కోరిక మేరకు... ఏకపీఠే విరాజన్తం సర్వమంగళాయా సహా ఘంటశాల పురాధీశం జలధీశ్వర ముపాస్మహే భస్మాలంకృత సర్వాంగం అగస్త్యేన ప్రతిష్ఠితం భక్తాభీష్ట ప్రదం వందే అద్వైత జ్ఞాన సిద్ధయే‘‘ పూర్వం శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి సృష్టిలోని సకల జీవకోటి భక్తితో ఉత్తరాపథానికి తరలి వెళ్లింది. జీవకోటి భారంతో ఉత్తరాపథం కృంగిపోసాగింది. అప్పుడు పరమేశ్వరుడు అగస్త్య మహర్షిని పిలిచి సృష్టి సమతుల్యం కావడం కోసం తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి, పవిత్రప్రదేశంలో శివపార్వతుల విగ్రహప్రతిష్ఠ జరిపి ఏకాగ్రతతో పూజలు జరిపితే తమ కల్యాణ మహోత్సవ సందర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పాడు. దాంతో అగస్త్యుడు దక్షిణాపథానికి వచ్చి ఘంటసాల గ్రామంలో ఏకపీఠంపైన శివపార్వతులను ప్రతిష్ఠించాడని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. జలధి ఒడ్డున ఉన్న శివుడు ఘంటసాల గ్రామానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందిన గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టాలెమీ ఈ గ్రామాన్ని ‘కంటకస్సిల’ అని పేర్కొన్నాడు. సిద్ధార్థుని గుర్రమైన కంటకం పేరు మీద ఈ గ్రామానికి కంటకశైలమనీ, తరువాత కంటకశిల అనీ రానురాను ఘంటసాలగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకారంభంలో ఇదొక రేవు పట్టణంగా ఉండేదనీ, ఇక్కడ వర్తక వాణిజ్యాలు సాగించిన మహా నావికులున్నారనీ, క్రీ.శ. 3వ శతాబ్దంలో ఉపాసిక బోధిసిరి ఇక్కడొక శిలామండపాన్ని కట్టించిందని శాసనాలు తెలియచేస్తున్నాయి. ఈ గ్రామంలో శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి నాణాలు, రోమన్ నాణాలు, శాలంకాయనుల నాణాలు లభించాయి. ఇక ఈ గ్రామంలోనే ఉన్న జలధీశ్వర ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇది అతి పురాతన ఆలయాలలో నాలుగవదని పురావస్తు శాస్త్రకారులు చెబుతున్నారు. గుడిమల్లం, అమరావతి, దాక్షారామం... ఆలయాలలోని శివలింగాన్ని పోలి ఉంటుంది ఇక్కడి శివలింగం. అప్పట్లో వ్యాపార నిమిత్తం సముద్రంలో (జలధిలో) పడవలలో ప్రయాణించిన వర్తకులు, మత్స్యకారులు, నావికులు ఇక్కడి శివుడిని అర్చించడం వల్ల ఈయనకు జలధీశ్వరుడని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి శివుడు శివలింగం ఆకారంలో పార్వతీ సమేతుడై ఏక పానవట్టం మీద దర్శనమిస్తాడు. ఇది చాలా అరుదైన దృశ్యం. ఏక పీఠం మీద శివపార్వతులు ఉన్న ఏకైక దేవాలయం ఇదే అని చెప్పవచ్చు. సాధారణంగా గర్భగుడికి ఎదురుగా నంది దర్శనమిస్తాడు. ఇక్కడ మాత్రం పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా ఇద్దరినీ సమదృష్టితో చూస్తూ కనువిందు చేస్తాడు నందీశ్వరుడు. ఆలయంలో పూజలు ప్రతిరోజూ ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు, సాయంత్రం 5 గం. నుంచి రాత్రి 8 గం. వరకు. ఏటా జరిగే ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు ప్రతినెలా మాస శివరాత్రి సందర్భంగా నమకం, చమకం, శ్రీసూక్తంతో రుద్రాభిషేకాలు మాఘ పూర్ణిమ సందర్భంగా స్వామివారి కళ్యాణం దేవీ నవరాత్రులు, కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు విశేష పూజలు ఏటా డిసెంబర్లో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు. మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు నాటి కంటక శాలే.. నేటి ఘంటశాల శాతవాహనుల కాలంలో ఇది బౌద్ధస్థావరంగా ఉన్నట్లు తవ్వకాల్లో తెలిసింది. ఇక్ష్వాకుల కాలంలో ఈ ప్రాంతాన్ని జీర్ణోద్ధరణ చేశారు. సిద్ధార్ధుడు ఇల్లు విడిచి వెళ్లినప్పుడు ఒక గుర్రం మీద వెళ్లాడట. ఆ గుర్రం పేరు కంటక. ఆ గుర్రం పేరు, కొండను పోలిన స్థూపం పేరు కలిపి కంటకశాల అయిందని, రానురాను ఘంటసాల అయ్యిందని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతం అప్పట్లో వర్తక స్థావరంగా కూడా వెలిసింది. నహపాలుడు శకవంశానికి చెందినవాడు. దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే శకనాణాలు దొరికాయి. 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతానికి చోళపాండ్యపురం అని పేరు. జలధిని ఈశ్వరునిగా భావించి, జలధీశ్వరస్వామిని ప్రతిష్ఠించి శివాలయాన్ని నిర్మించారు. మొదటి వేయిసంవత్సరాలు ఇక్కడ బౌద్ధం విరాజిల్లింది. తరువాత నుంచి జలధీశ్వరస్వామితో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. జలధీశ్వరస్వామి శివలింగంలో ఒక ప్రత్యేకత ఉంది. పలనాటి సున్నపు రాతితో ఈలింగాన్ని రూపొందించారని స్థానికులు చెబుతారు. ప్రాకృత, తెలుగు, కన్నడ శాసనాలు ఉన్నాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో చాలామంది ఇక్కడ నుంచి పాల్గొన్నారు. – ఈమని శివనాగిరెడ్డి, సిఈవో, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ ఇలా చేరుకోవాలి... రోడ్డు మార్గం: తెలుగు రాష్ట్రాలలోని అన్నిప్రాంతాల నుంచి ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. రైలు మార్గం: మచిలీపట్నం అతి సమీప రైలుస్టేషన్. ఇక్కడ నుంచి ఘంటసాల 27కి.మీ. దూరంలో ఉంది. విమాన మార్గం: విజయవాడ అతి సమీప విమానాశ్రయం. ఇక్కడ నుంచి 50 కి.మీ. దూరం. ఇక్కడ నుంచి ఆర్టిసి బస్సులు, ప్రైవేట్ బస్సులు, టాక్సీలు దేవాలయం వరకు దొరుకుతాయి. ఆలయ సందర్శన వేళలు: ఉదయం 6.30 నుండి రాత్రి 9.30 వరకు అనేక ప్రత్యేకతలు ఆలయానికి ఎదురుగా గోపురం, మూడువైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఆలయ మహామండపానికి ఇరువైపులా పల్నాటి సున్నపురాయితో చెక్కిన భైరవుడు, నరసింహస్వామి విగ్రహాలున్నాయి. నరసింహస్వామి క్షేత్ర పాలకునిగాను, భైరవుడు ద్వారపాలకుని గాను ఉండటం ఆ ఆలయంలో మరో ప్రత్యేకత. సరస్వతీమాత, మరికొందరు దేవతామూర్తుల విగ్రహాలు మనలను భక్తి పారవశ్యంలో ముంచుతాయి. ఇక్కడ ఉన్న సరస్వతీదేవి విగ్రహం మొహంజొదారో కాలానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతారు. ఘంటసాలలో ఇంకా వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాంబ ఆలయం, భావనారుషి ఆలయం, రామాలయం, పెన్నేరమ్మ, ముత్యాలమ్మలకు కూడా దేవాలయాలు ఉన్నాయి. – డా. పురాణపండ వైజయంతి సాక్షి, విజయవాడ అవనిగడ్డ, కృష్ణాజిల్లా -
మహాశివరాత్రికి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
– మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ మహానంది: మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం దేవస్థానం కార్యాలయంలో పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్ఠాత్మకమైన లింగోద్భవ కార్యక్రమంలో గత ఏడాది ఈఓ, పాలకమండలి సభ్యులకు సైతం చోటు లేకపోయిందని, ఈ ఏడాది దేవస్థానం పరిధిలో తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపడతామన్నారు. వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో గాకుండా కేవలం దంపతులు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అందులో భాగంగా ఈ ఏడాది రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారికి నూతనంగా పుష్పపల్లకీ సేవ నిర్వహించనున్నట్లు చెప్పారు. మహానంది దేవస్థానంలో రూ.74లక్షలతో గ్రానైట్ పనులు చేపడుతున్నామన్నారు. రూ.16లక్షలతో శాండ్‌బ్లాస్టింగ్, బండపరుపు పనులు జరుగుతున్నాయన్నారు. ఉత్సవాలకు రూ.15.73లక్షలు మంజూరైందని, అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణానికి నంద్యాలకు చెందిన కూరగాయల వ్యాపారి లక్కబోయిన ప్రసాద్ దంపతులు దాతలుగా వ్యహరిస్తున్నారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఉన్న శాశ్వత లైన్లతో పాటు తాత్కాలిక లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పార్కింగ్ నుంచి ఆలయం వరకు భక్తులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. వీటి కోసం నంద్యాలకు చెందిన రామకృష్ణ, ప్రభాత్, శాంతిరాం విద్యా సంస్థలు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయన్నారు. టెంకాయలు సమర్పించే చోట, చెప్పుల స్టాండు వద్ద భక్తుల నుంచి అధికంగా వసూలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవస్థానం పాలకమండలి ధర్మకర్త సీతారామయ్య ఆధ్వర్యంలో తాగునీరు సరఫరా చేస్తామన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు బాలరాజుయాదవ్, రామకృష్ణ, మునెయ్య, చింతకుంట్ల శివారెడ్డి, బండి శ్రీనివాసులు, సీతారామయ్య, మౌళీశ్వరరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
భక్తుల సౌకర్యానికే అధిక ప్రాధాన్యత
- మహాశివరాత్రి ఏర్పాట్లపై ఈఓ సమీక్ష శ్రీశైలం : శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై దేవస్థానం ఈఓ నారాయణభరత్ గుప్త బుధవారం సాయంత్రం వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా పనుల పురోభివృద్ధిపై చర్చించారు. ముఖ్యంగా భక్తులకు తాత్కాలిక వసతి, మంచినీటి సదుపాయం, సౌకర్యవంతమైన దర్శనం, అన్నదానం, పారిశుద్ద్యం అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు... బ్రహ్మోత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు నిర్వహించే కార్యక్రమాలు సంప్రదాయ బద్దంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు పాతాళగంగ మార్గంలోని యాత్రిక వసతి సముదాయంలో ఇప్పటికే రెండు షెడ్లను సిద్ధం చేశారు.· మరో షెడ్‌ను కూడా అందుబాటులోకి అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందులో లాకర్ సదుపాయం, శుద్ధనీటి సరఫరా, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత మినరల్‌వాటర్ కేంద్రాలు... భక్తుల సౌకర్యార్థం గంగాసదన్, కల్యాణకట్ట వద్ద ఉచిత మినరల్ వాటర్ కేంద్రాలను ఏర్పాటు, శివరాత్రిలోగా దేవస్థానం వైద్యశాల, చంద్రవతి కల్యాణ మండపంతో పాటు మరో మూడు ప్రదేశాల్లో ఈ శుద్ధ జల కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాధులు ప్రబల కుండా జిల్లా యంత్రాంగంతో కలిసి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పార్కింగ్ సౌకర్యం... వాహనాల పార్కింగ్ కోసం దేవస్థానం యజ్ఞవాటిక, హెలిప్యాడ్, గౌరిసదన్ ప్రక్కన, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, ఫిలిగ్రీమ్ షెడ్ల వెనుక ప్రాంతాన్ని చదును చేసి అవసరమైన ఏర్పాట్లును చేస్తున్నామన్నారు. విశ్రాంతి గదులు... క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి ఉండేందుకు వీలుగా కంపార్టుమెంట్లలో వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా మరో 12 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ మొత్తం 17 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయగా, వీటిలో 11 కంపార్టుమెంట్లు ఉచిత దర్శనానికి, 6 కంపార్టుమెంట్లను శీఘ్రదర్శనాన్ని భక్తులకు అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. పాతాళగంగ వద్ద ఏర్పాట్లు... పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీక్షాపరులకు దర్శన ఏర్పాట్లు... శివదీక్షా భక్తుల దర్శనానికి వేచి ఉండేందుకు చంద్రావతి కల్యాణ మండపంలో అవసరమైన ఏర్పాట్లు చేసి, అక్కడి నుంచి శివాజీపార్క్ మీదుగా ప్రత్యేక క్యూ లైన్ ద్వారా సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా మహాద్వారం నుంచి దర్శనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి శివదీక్షా శిబిరాలలో అన్నప్రసాదాలను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవ కార్యక్రమాలన్నింటిని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
శ్రీశైలదేవస్థానానికి మినీ బస్సులు
శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మినీ బస్సులను ఏర్పాటు చేస్తుంది. మొత్తం మూడుబస్సుల్లో మంగళవారం రెండు బస్సులు శ్రీశైలానికి వచ్చాయి. వీటికి ఈఓ నారాయణభరత్ గుప్త , జేఈఓ హరినాథ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బస్సులను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో, «ధార్మిక ప్రచారానికి వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
22 నుంచి మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
– 24న మహాశివరాత్రి, లింగోద్భవం – 26న రథోత్సవం మహానంది : మహానంది పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 22 నుంచి 27వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై బుధవారం మహానంది దేవస్థానం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఆలయ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ 20వ తేదీన శ్రీ గంగా, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి ఉత్సవమూర్తులు పెళ్లిపెద్ద అయిన శ్రీ పార్వతీ సమేత బ్రహ్మానందీశ్వరస్వామి వారిని ఆహ్వానించేందుకు నంద్యాలకు వెళ్తాయన్నారు. 21న నంద్యాల నుంచి మహానందికి చేరుకుంటాయన్నారు. 22న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 24న మహా శివరాత్రి, లింగోద్భవం, 25వ తేది తెల్లవారుఝామున స్వామి వారి కల్యాణోత్సవం, 26న ర«థోత్సవం ఉంటుందన్నారు. 27న ఉదయం మహాపూర్ణాహుతి, త్రిశూలస్నానం, ధ్వజ అవరోహణం, పూజలతో శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. శివరాత్రిలోగా ఫ్లోరింగ్...నంది విగ్రహ ఏర్పాటు: మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేనాటికి నందిసర్కిల్ వద్ద భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని డీసీ డాక్టర్ శంకర వరప్రసాద్ తెలిపారు. అలాగే ఆలయంలో తూర్పు భాగంలో ఫ్లోరింగ్ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఉత్సవాల ఆహ్వానపత్రికల ముద్రణ, పూల అలంకరణ, స్వామివారి కల్యాణోత్సవాలకు దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు బాలరాజుయాదవ్, అర్చకులు పాల్గొన్నారు. -
శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
– ఫిబ్రవరి 17 నుంచి బ్రహ్మోత్సవాలు – భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు – అధికారులకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైల బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కోఆర్డినేషన్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ముందుగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి భరత్‌గుప్తా బ్రహోత్సవాలకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫిబ్రవరి 17 నుంచి 26వ తేదీ వరకు బ్రహోత్సవాలు జరుగుతాయని, 24న మహా శివరాత్రిని పురస్కరించుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతేడాది వరకు కల్యాణోత్సవాన్ని చంద్రావతి మండపంలో నిర్వహించామని, ఈ యేడాది నాగుల కట్ట లో జరిపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని, పారిశుద్ధ్య, తాగునీరు, మరుగుదొడ్లు, చలువ పందిళ్లు, భోజన సదుపాయాలపై దృష్టి సారించాలని వివరించారు. ఈ యేడాది ప్రయోగాత్మకంగా 13 జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎంపిక చేసిన భక్తులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీశైలంతో పాటు ఆత్మకూరు నుంచి దొర్నాల, అక్కడి నుంచి నుంచి శ్రీశైలం వరకు రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను ఈ నెల చివరికల్లా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికులకు సంఖ్యకు సరిపడే బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 21వ తేది ఉదయం నుంచి 27 వరకు స్పర్శ దర్శనాన్ని నిలుదల చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ..శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. సమావేశంలో జేసీ హరికిరణ్,, జేసీ–2 రామస్వామి, డీఆర్వో గంగాధర్ గౌడ్, ఆత్మకూరు డీఎఫ్ఓ సెల్వం, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. -
శివదీక్ష ధారణ ప్రారంభం
- ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో మంగళవారం శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శివదీక్ష ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామిఅమ్మవార్ల ప్రధానార్చకులు శివదీక్ష« మాలధారణ చేయించారు. అర్చకులు మాట్లాడుతూ మన పురాణాలు, ఇతిహాసాలు శివదీక్షను ప్రస్తావించాయని తెలిపారు. జగజ్జనని శివదీక్షను ఆచరించినట్లుగా చెప్పబడుతోందన్నారు. పాండవ మధ్యముడైన అర్జునుడు కూడా శివదీక్షను ఆచరించాడని మహాభారతంలో చెప్పబడిందన్నారు. ఆంగ్లశకం 660లో బాదామి చాళుక్యుడైన మొదటి విక్రమాదిత్యుడు శివదీక్షను మండలదీక్షగా స్వీకరించినట్లు శాసనాలు చెబుతున్నాయని తెలిపారు. మరుగున పడిన ఈ శివదీక్షలను శ్రీశైల దేవస్థానం పునరుద్ధరించిందని ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి చెప్పారు. -
పకడ్బందీగా మహాశివరాత్రి ఏర్పాట్లు
·అధికారులతో ఈఓ సమీక్ష గత బ్రహ్మోత్సవాల అనుభవాలు,లోటుపాట్లపై చర్చ రోజూ 15 లక్షల గ్యాలెన్ల నీటి సరఫరా పాతాళగంగ, లింగాలగట్టు వద్ద బ్యారికేడ్లు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టనున్నట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. బుధవారం సాయంత్రం పరిపాలనా భవనంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఏసీ మహేశ్వరరెడ్డి, అధికారులు, ఉభయ ఆలయాల ప్రధానార్చకులు, వేదపండితుతో ఈఓ సమీక్ష నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలు, లోటుపాట్లను దృష్టిలో ఉంచుకుని వాటికనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఇందులో భాగంగా భక్తులకు రోజూ 15 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే క్షేత్రమంతటా 500లకు పైగా మంచినీటి కుళాయిలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.· లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆయా ప్రదేశాలు, విశాలమైన ప్రాంగణాలను ఏర్పాటు చేసి షామియానాలు, చలువపందిళ్లను ఏర్పాటు చేయవల్సిందిగా ఇంజనీరింగ్ విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివదీక్షా శిబిరాలు, శివసదనం, శివాజీగోపురం ఎదురుగా ఉన్న ఉద్యానవనాలు, హరిహరరాయగోపురం ఎదురుగా ఉన్న గార్డెన్, తదితర ప్రదేశాలలో తాత్కాలికంగా వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ ప్రదేశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదుల ఏర్పాటు -అత్యవసర వైద్యసేవల కోసం ప్రత్యేక చర్యలు వాహనాల పార్కింగ్‌కు యజ్ఞవాటిక, హెలిప్యాడ్, తదితర ప్రదేశాల వద్ద చదును చేసి అవసరమైన ఏర్పాట్లు ఏపీఎస్ఆర్టీసీ, కర్ణాటక, ప్రైవేటు వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు అవసరమైనచోట్ల వన్‌వే ట్రాఫిక్ నిర్వహణకు చర్యలు క్షేత్ర వ్యాప్తంగా విద్యుత్ దీపాల ఏర్పాటు స్వామివార్ల దర్శనం కోసం ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, ప్రత్యేక శివదీక్షా భక్తులకు వేర్వేరు క్యూల ఏర్పాటు గతంలో ఉన్న క్యూల పరిధిని దాదాపు 30 శాతం పెంపు పాదయాత్ర భక్తులకు నాగలూటి, కైలాసద్వారం వద్ద ఏర్పాట్లు భక్తులు పుణ్యస్నానాలాచరించేందుకు వీలుగా పాతాళగంగ, లింగాలగట్టు వద్ద బ్యారికేడింగ్, గజ ఈతగాళ్లను నియామకం ·- పాల పదార్థాలు, డీజీల్, పెట్రోల్ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు · -ఉత్సవాలలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పుష్పాలంకరణ ·- పలు ధార్మిక,సాంస్కృతిక కార్యక్రమాలను శివదీక్షస్వాములు, భక్తులను అలరించడానికి శివదీక్షాశిబిరాలలో, దేవస్థానం పుష్కరణి వద్ద, గ్రామోత్సవంలో జానపద కళారూపాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. -
సుదీర్ఘ నిద్రాత్యాగం
తిక్క లెక్క ఏడాదికోసారి వచ్చే శివరాత్రి రోజు జాగారం చేస్తేనే మర్నాడు నిద్రతో కళ్లు కూరుకుపోతుంటాయి. మర్నాడు చుక్క చూడనిదే జాగరణను విరమించరాదనే పట్టుదలతో నిద్రను ఆపుకొని కొందరు ఆ తర్వాత నానా తంటాలు పడుతుంటారు. ఫొటోలో కనిపిస్తున్న రాండీ గార్డనర్ అనే ఈ అమెరికన్ కుర్రాడు ఏకంగా పదకొండు రోజులు.. కచ్చితంగా చెప్పాలంటే 264 గంటల 24 నిమిషాలు నిద్రపోకుండా గడిపి గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇదేమీ ఇటీవలి రికార్డు కాదు లెండి. రాండీ తన పదహారేళ్ల వయసులో.. అంటే 1964లోనే ఈ రికార్డు సాధించాడు. ఈ రికార్డు కోసం అతడు ఎలాంటి మందులను, ఉత్ప్రేరకాలను వాడలేదు. ఇప్పటి వరకు ఈ రికార్డు అతడి పేరు మీదే ఉంది. -
శంభోశంకర
శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం వేకువజాము నుంచే శ్రీకాళహస్తి, తిరుపతిలోని కపిలేశ్వరాలయం, తలకోనలోని సిద్ధేశ్వరాలయం, మల్లయ్యకొండ, కైలాసకోన, సదాశివకోన, మూలకోన, కోటిలింగాలు, గుడిమల్లం తదితర శైవ క్షేత్రాల్లో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తజనం బోళాశంకరుడి ఆశీస్సుల కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. -
లక్షన్నర శివలింగాలు
బ్రహ్మ మురారి సురార్చిత లింగం.. పుట్టమన్నుతో లక్షన్నర శివలింగాలు మహా శివరాత్రి సందర్భంగా సోమవారం తుమకూరులోని కన్యకా పరమేశ్వరి మహిళా సంఘం సభ్యులు ఇక్కడి శంకర మఠంలో పుట్టమన్నుతో తయారు చేసిన లక్షా 50 వేల శివలింగాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇంత మొత్తంలో శివలింగాలను తయారు చేయడానికి మూడు నెలలు సమయం పట్టిందని మహిళా సంఘం సభ్యులు తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ ‘హర’ నామ స్మరణతో మారుమోగాయి. శివరాత్రి పర్వదినాన నీలకంఠున్ని దర్శించుకునేందుకు సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్ద బారులు తీరారు. కోలారులోని కోటి లింగేశ్వర, ధర్మస్థలలోని మంజునాథేశ్వర, యడియూరులోని సిద్ధలింగేశ్వర, శివగంగలోని గవి గంగాధరేశ్వర, నంజనగూడులోని నంజుండేశ్వర, మురుడేశ్వర, గోకర్ణతో సహా అన్ని దేవాలయాల్లోను సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. -
భద్రత కట్టుదిట్టం
ఉగ్రవాదుల దాడుల సమాచారంతో నిఘా ముమ్మరం అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనపు బలగాల మోహరింపు ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో భారీ భద్రత బెంగళూరు: శివరాత్రి పర్వదినం సందర్భంలో దేశంలో విధ్వంసాన్ని సృష్టించడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు దేశంలోని అన్ని ప్రముఖ ప్రాంతాలు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగానే కర్ణాటక వ్యాప్తంగా, బెంగళూరులో సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనపు పోలీసు బలగాలను మోహరించిన అధికారులు ప్రతి ఒక్కరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాధారణ భద్రతతో పోలిస్తే దాదాపు రెట్టింపు పోలీసు బలగాలను, రిజర్వు బలగాలను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మోహరించారు. ఇదే సందర్భంలో విమానాశ్రయానికి చేరుకుంటున్న వాహనాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించన తర్వాతే పోలీసులు అనుమతిస్తున్నారు. మొత్తం మూడు దశల్లో వాహనాల తనిఖీ జరుగుతోందంటే భద్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విమానాశ్రయానికి చేరుకుంటున్న ప్రయాణికులు, విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వారు ఇలా ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక బెంగళూరులోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద సైతం అదనపు భద్రతా బలగాలను మోహరించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉండే ఆలయాల వద్ద కూడా పోలీసుల పహారా కనిపించింది. ఇక ఉగ్రవాదులు జనసందోహం అధికంగా ఉండే ప్రాంతాల్లో దాడులకు తెగబడవచ్చుననే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల వద్ద కూడా అదనపు బలగాలను మోహరించారు. -
పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తజనం
తెల్లవారుజాము 3 గంటల నుంచే స్నానాలు కృష్ణానదిలో నీరు లేక జల్లు స్నానాలతో సరి విజయవాడ (ఇంద్రకీలాద్రి) : మహా శివరాత్రి పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానది తీరంలోని పద్మావతి, సీతమ్మ వారి పాదాలు, దుర్గ, భవానీపురం, పున్నమి ఘాట్లకు భారీగా తరలివచ్చారు. నదిలో నీటి మట్టం పడిపోవడంతో భక్తులందరూ జల్లు స్నానాలతో సరిపెట్టారు. పుణ్యస్నానాల కోసం దుర్గాఘాట్‌కు చేరుకున్న భక్తులు గంటల తరబడి క్యూలైన్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దుర్గాఘాట్ నీరు పూర్తిగా మురికిగా మారింది. మోటారుతో నీరు తోడించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు సమీపంలోని పాత శివాలయం, అశోక స్థూపం సమీపంలోని విజయేశ్వరాలయం, ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని పూజించారు. విశేష అలంకరణ మహా శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయాలను విశేషంగా అలంకరించారు. పెళ్లి కుమార్తె దుర్గమ్మను, అంతరాలయ ప్రాంగణాన్ని సప్తవర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మరో వైపున మల్లేశ్వరాలయాన్ని బంతి, జిల్లేడు పూలతో అలంకరించారు. ఆది దంపతుల కల్యాణోత్సవానికి ముస్తాబైన ఇంద్రకీలాద్రిపై ఎక్కడ చూసినా పచ్చటి మామిడి తోరణాలు, అరటిచెట్లు స్వాగతం పలికాయి. భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి మహా శివరాత్రి మహోత్సవాలను పురష్కరించుకుని ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా పెళ్లి కుమార్తెగా ముస్తాబైన దుర్గమ్మను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనం శివ నామస్మరణతో వచ్చారు. భక్తుల క్యూలైన్ పాత అన్నదాన భవనం వరకు చేరింది. దుర్గగుడి ఈవో అప్రమత్తం కృష్ణలంక సీతమ్మవారి పాదాల ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసేందుకు దేవస్థానం షవర్లు ఏర్పాటు చేసింది. అయితే కొంత మంది భక్తులు ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఐరన్ మెస్ తొలగించి నదిలో స్నానాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఊబి, ప్రమాదకరమైన గుంతలు ఉంటాయని తెలుసుకున్న దుర్గగుడి ఈవో నర్సింగరావు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఐరన్ మెస్ తిరిగి ఏర్పాటుచేయించారు. అనంతరం జిల్లా అధికారులు, పోలీసు శాఖకు సమాచారం ఇచ్చారు. సుమారు రెండు గంటలపాటు ఈవో నర్సింగరావు, ఏఈవో వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ ఎన్.రమేష్ నదివద్దే ఉండి భక్తులు నీటిలోకి దిగకుండా చర్యలు తీసుకున్నారు. -
మృత్యువులోనూ చేయికలిపి..
శివరాత్రి స్నానాలకెళ్లి మృత్యువాత ఇద్దరు మృతితో దివిసీమలో విషాదఛాయలు శివరాత్రి పర్వదినం..నదిలో స్నానాలు ఆచరించడం సంప్రదాయం. ఆ ముగ్గురూ నదిలో పుణ్య స్నానాలకు దిగారు.. నీళ్లు అల్లరి పెడుతుంటే ఆనందంతో మరింత లోతుకు వెళ్లారు.. సరదా గడిపిన యువకులను మృత్యువు వెంబడించింది.. ముగ్గురూ చెల్లాచెదురయ్యూరు.. వీరిని గమనించిన స్థానికులు ఒకరి ప్రాణాలను నిలబెట్టగలిగారు.. ఆ ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నదీ గర్భంలో కలిసి శివైక్యమయ్యూరు. పాత ఎడ్లంక (అవనిగడ్డ) పుణ్యస్నానాలకు వెళ్లి.. కృష్ణానదిలో స్నానం చేసేందుకు స్నేహితులు పువ్వాడ రమణ, నడకుదిటి మనోజ్‌కుమార్, సింహాద్రి సాయినవీన్ దిగారు. సరదాగా ఈత వేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు. సాయినవీన్‌ను అంబేడ్కర్ కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఇద్దరి కోసం వెతుకులాడే ప్రయత్నంలో అంబేడ్కర్ కూడా ఆపాయంలో చిక్కుకుని కేకలు వేయడంతో గజ ఈతగాళ్లు రక్షించారు. మునిగిన ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలించారు. ఆచూకీ దొరకలేదు. దీంతో వలతో సుమారు 500 మీటర్లు గాలించడంతో రమణ, మనోజ్‌కుమార్ కుమార్ మృతదేహాలు దొరికాయి. స్నానాలకు వెళ్లొదని చెప్పినా.. శివరాత్రి స్నానాలకు వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్లి విగత జీవిగా వచ్చావా నాయనా అంటూ మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులు విలపించారు. కుమార్ అవనిగడ్డ జెడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. నువ్వు లేకుండా నేను ఎలా బతకను తమ్ముడూ అంటూ సోదరుడు పవన్‌కుమార్ విలపించారు. మనోజ్‌కుమార్ తండ్రి బసవపున్నారావు స్థానిక వెల్డింగ్ షాపులో పనిచేస్తుండగా సోదరుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, ఎస్సీసెల్ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు నలుకుర్తి రమేష్, డీఎస్పీ ఖాదర్‌బాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మత్యుంజయుడు సాయినవీన్ సింహాద్రి సాయినవీన్ మృత్యుంజయుడిగా బ యట పడ్డాడు. మిత్రులు పువ్వాడ రమణ, నడకుదిటి మనోజ్‌కుమార్‌తో కలిసి కృష్ణానదిలోకి స్నా నాలకు వెళ్లిన ఈ ముగ్గురూ మునిగిపోయారు. అం బేడ్కర్ మునిగిపోయిన సాయినవీన్ని కాపాడాడు. ప్రమాదాన్ని గుర్తించి ఉంటే.. ముగ్గురు యువకులు మునిగిపోయినప్పుడే చూసిన వారు చెప్పి ఉంటే గజ ఈతగాళ్లు కాపాడేవారే. అంబేడ్కర్‌ని కాపాడిన తరువాత మరొకరు ఉన్నారని చెప్పారు. అప్పటికే 15 నిముషాలు గడచిపోయింది. గజ ఈతగాళ్ళకు అంబేడ్కర్ చేయి కనబడటంతో వెంటనే రక్షించ గలిగారు. ఆ సమయంలో గల్లంతైన ఇద్దరి గురించి చెప్పి ఉంటే వారిని రక్షించే వారమని గజ ఈతగాళ్లు చెప్పారు. రమణ కుటుంబంపై పగబట్టిన విధి.. రమణ తండ్రి కోటేశ్వరరావు పదేళ్ల క్రితం చనిపోగా, తల్లి నాగరత్నం నాలుగేళ్ల క్రితం మరణించింది. నలుగురు వివాహిత కూతుళ్లుండగా రమణ ఒక్కడే మగపిల్లవాడు. తల్లిదండ్రులు చనిపోయినా అక్క వద్ద ఉంటూ నాగాయలంకలో మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నాడు. రమణ శివరాత్రి స్నానాలకు వచ్చి మృత్యువు పాలవ్వడంతో సోదరి కొల్లూరి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. రక్షించబోయి.. ప్రమాదం నుంచి బయటికి.. పాత ఎడ్లంక(అవనిగడ్డ) : ప్రమాదంలో యువకులను కాపాడే ప్రయత్నంలో అంబేడ్కర్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. గజ ఈతగాళ్లు రక్షించడంలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈత వేస్తు ముగ్గురు యువకులు మునిగిపోతుండగా గుర్తించిన అంబేడ్కర్ అందులో సింహాద్రి సాయినవీన్‌ను కాపాడాడు. మిగిలిన ఇద్దరిని రక్షించేందుకు నదిలో దిగాడు. కాని లోతు అందకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నాడు. గజ ఈతగాళ్లు రక్షించారు. ఎస్ఐ వెంకటకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు కలిసి మచిలీపట్నం తరలించారు. -
శివ.. శివా..
ముందస్తు నీటి ఏర్పాట్లు శూన్యం కృష్ణానదిలో 7.7 అడుగులకు పడిపోయిన నీటిమట్టం ముక్కుమూసుకుని మురికి నీటిలోనే స్నానాలు భక్తుల ఆగ్రహావేశాలు విజయవాడ : శివయ్య భక్తులకు ఈ ఏడాది చేదు అనుభవం ఎదురైంది. సోమవారం తెల్లవారుజామున శివరాత్రి పుణ్యస్నానాలు చేద్దామని కొండంత ఆశతో కృష్ణానదికి చేరుకుంటే అడుగడుగునా ఇసుకే ప్రత్యక్షమైంది. మునుపెన్నడూ లేనివిధంగా నదిలో నీటిమట్టం పడిపోవడంతో భక్తులు స్నానమాచరించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడా మడుగులా కనిపించిన మురికినీటితోనే ముక్కు మూసుకుని మమ అనిపించారు. కృష్ణానదిలో నీటిమట్టం 7.7 అడుగులు మాత్రమే ఉండడంతో దుర్గాఘాట్‌తో పాటు సీతమ్మవారి పాదాలు, కృష్ణవేణి ఘాట్, భవానీ ఘాట్, వీఐపీ ఘాట్లలో నీరు బాగా అడుగంటిపోయింది. కేవలం పాదాలు మాత్రమే తడిశాయి. ఆ నీరు కూడా చెత్తాచెదారంతో నిండి ఉంది. మంత్రి ఇలాకాలో ఏర్పాట్లు ఏవీ.. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత జిల్లాలోనే భక్తులకు నీటికష్టాలు తప్పడం లేదు. పండుగ వేళ పూర్తిస్థాయిలో పుణ్యస్నానాలు చేసేందుకు నోచుకోలేకపోయారు. ఇరిగేషన్ అధికారులు ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో జల్లుస్నానాలు చేసేందుకు పోటీ పడ్డారు. తొక్కిసలాట జరగకుండా భక్తులను ఘాట్లలోకి విడతల వారీగా పంపారు. షవర్స్ కింద కేవలం తల తడుపుకొని బయటకు వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. ఒక దశలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం, షవర్స్ సరిపోకపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ట్యూబులతో భక్తుల పైకి నీళ్లు పంపింగ్ చేశారు. ప్రమాదపుటంచున భక్తులు సీతమ్మవారి పాదాలు వద్ద ఘాట్‌లో నీరు లేకపోవడంతో భక్తులు నదీగర్భంలోకి వెళ్లి స్నానాలు చేయడానికి ప్రయత్నించారు. అక్కడ ఊబులు ఉండడంతో భయపడిన దేవస్థానం ఈవో సీహెచ్.నర్సింగరావు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఏర్పాట్లు పరిశీలించారు. భక్తుల తొక్కిసలాట జరగకుండా, ఊబులు ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు అప్పటికప్పుడు మెష్‌లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. -
భక్తులను కాపాడబోయి మృత్యుఒడికి...
విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి శివవరాత్రి పర్వదినాన అపశ్రుతి బహదూర్‌ఫురా: శివరాత్రి పర్వదినం సందర్భంగా గుడి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. భక్తులను విద్యుత్ వైర్లు ఉన్న వైపు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్న క్రమంలోనే అతడు షాక్‌కు గురయ్యాడు. ఈ విషాద ఘటన బహదూర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పో లీసుల కథనం ప్రకారం... మహాశివరాత్రి సందర్భంగా కిషన్‌బాగ్‌లోని కాశిబుగ్గ గుడి వద్ద సోమవారం బహదూర్‌పురా పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ (25) బందోబస్తులో ఉన్నాడు. వందలాదిగా తరలివస్తున్న భక్తులను అతను అదుపు చేస్తున్నాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కొందరు భక్తులు మధ్యాహ్నం ఒంటి గంటకు గర్భగుడి పక్కనున్న మరో దారిలో బయటికి వెళ్లేందుకు యత్నించగా అడ్డుకొని పక్కకు పంపించాడు. ఇదే క్రమంలో శ్రీనివాస్ నాయక్ కాలు జారి విద్యుత్ వైర్లపై పడ్డాడు. షాక్‌కు గురై పక్కనే ఉన్న నీటి సంపులో పడిపోయాడు. తోటి కానిస్టేబుళ్లు వెంటనే మెయిన్ ఆఫ్ చేసి శ్రీనివాస్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందా డు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, చార్మినార్ ఏసీపీ అశోక చక్రవర్తి, బహదూర్‌పురా ఇన్స్పెక్టర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రీనివాస్ నాయక్ మృతదేహాన్ని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సందర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీనివాస్‌నాయక్ మృతి వార్త తెలిసి అతడు నివాసముండే ఆర్ఎన్ కాలనీకి బంధువులు,స్నేహితులు పెద్ద ఎత్తున చేరుకొని విలపించారు. -
హరహర మహాదేవ శంభో
ఏ నోట విన్నా పంచాక్షరీ మంత్ర జపమే... ఏ దారిని కన్నా పంచ భూతాత్ముడైన ఆ పరమ శివుని ఆలయాలకు చేరుతున్న జనమే. హరహర మహాదేవ అంటూ ఆ బోళా శంకరుడుని ఆర్తిగా స్మరిస్తూ, తమ శక్తి మేరకు అర్చిస్తూ, అభిషేకిస్తూ భక్తులు అలౌకికానందంలో తేలియాడారు... సుఖశాంతులు ప్రసాదించాలని ఆ జంగమదేవరను శరణచొచ్చారు. నర్సీపట్నం: బలిఘట్టంలో త్రిశూల పర్వతంపై వేంచియున్న శ్రీ బ్రహ్మలింగేశ్వరస్వామిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. స్వామికి మహోన్యాసపూర్వక రుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్తర వాహిని నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పురోహితులతో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. పితృదేవతులను మననం చేస్తూ బుడగజంగాల మంత్రోచ్ఛారణలతో నదీ ప్రాంతం కోలాహాలంగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్వామి వారి ఆలయ సమీపంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. బలిఘట్టం యూత్ సభ్యులు భక్తులకు పులిహార, మజ్జిగ పంపిణీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి వాహనాలను క్రమబద్ధీకరించారు. పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచదార్లలో... రాంబిల్లి: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పంచదార్ల పుణ్యక్షేత్రం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలలు నుంచి వేకువజామునే భక్తులు ఇక్కడకు చేరుకొని తొలుత ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉమా ధర్మలింగేశ్వరస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి, సహస్ర లింగేశ్వరస్వామి వార్లను దర్శించుకొని పూజలు చేశారు. క్షేత్రపాలకుడైన ధర్మలింగేశ్వరస్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ధర్మలింగేశ్వరస్వామిని దర్మించుకునేందుకు, ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు(దిన్‌బాబు), డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ దంపతులతో పా టు వేలాది మంది భక్తులు ఉమా ధర్మలింగేశ్వర స్వా మిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాల అనంతరం అర్చకులు తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. -
గోదావరి నదిలో మునిగి బాలుని మృతి
ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం గుట్టాపూర్ వద్ద గల గోదావరి నదిలో మునిగి యోగీష్‌కుమార్(15) అనే బాలుడు సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. శివరాత్రి పర్వదినం కావడంతో స్నానానికి వెళ్లిన యోగీష్‌కుమార్ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతిచెందాడు. మృతునిది ఉట్నూరు మండల లక్కారం గ్రామం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో కడెం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
హరోం హర.. హర!
- మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం: శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు హరహర మహదేవ.. శంభోశంకర నామస్మరణతో మార్మోగుతున్నాయి. దేశంలో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివ నామస్మరణతో శ్రీశైల మల్లన్నదర్శించుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయం ప్రాంగణంలోనే వేలమంది భక్తులు ఉపావాస దీక్షలు ఆచరిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే భక్తులు పాతాల గంగలో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం ముక్కంటి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. -
ఉపవాసం.. ఉపయోగం...
నమశ్శివాయ! ఏడాదికి ఒక్కరోజైనా శరీర అంతర్గత అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు శివరాత్రి. శివభక్తులు ఉపవాసన, జాగరణ చేస్తుంటారు. వారి దీక్ష మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే... పండ్లు - పాలు చాలా మంది ఈ రోజు పండ్లు, పాలతో సరిపెట్టేస్తారు. ఇది చాలా మంచిది. పాలు సమతుల ఆహారం. పండ్లు పోషకాలను ఇవ్వడమే కాకుండా ఆకలి కానివ్వకుండా సాయపడతాయి. రోజులో కనీసం ఆరు సార్లు పండ్లు, పాలతో సరిపెట్టడం వల్ల శరీరంలోని విషపూరితాలు బయటకు వెళ్లిపోతాయి. సాధారణంగా ఈ పద్ధతి ప్రతి రోజూ జరుగుతుంది. ఈ పనంతా కాలేయం చేస్తుంది. రోజంతా పండ్లు, పాలు తీసుకోవడం వల్ల కాలేయానికి విశ్రాంతి లభించి, దాంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ♦ పండ్లలో ఉండే ఖనిజాలు, విటమిన్లు అందడం వల్ల పోషకాహార లోపం వంటివి ఉంటే ఈ రోజుతో భర్తీ అవుతాయి. పీచు పదార్థం వల్ల జీర్ణవ్యవస్థ అంతా శుభ్రపడుతుంది. ♦ ఈ కాలం ప్రకృతి నుంచి పండ్లు బాగా అందుతాయి. వచ్చే ఎండాకాలానికి సిద్ధపడటానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. ♦ రోజంతా తగినన్ని పండ్లు, పాలు తీసుకున్నవారు కేజీ నుంచి 2 కేజీల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇలా సరైనది కాదు... ♦ రోజంతా ఏమీ తినకుండా కేవలం టీ, కాఫీలతో సరిపెట్టేయడం మంచిది కాదు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఆకలి పుడుతున్నప్పుడు ఆహారం అందివ్వకపోతే పొట్టలో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో అల్సర్ పెరిగి, మంట పుడుతుంది. తరచూ ఉపవాసాలు చేసేవారు ఇదే పద్ధతిని అనుసరిస్తే జీర్ణవ్యవస్థపై చెడుప్రభావం చూపి, అనారోగ్యం కలుగుతుంది. ♦ ఉపవాసం వల్ల నిన్నంతా ఏమీ తినలేదు కదా అని ఉపవాస దీక్ష వదిలే రోజు ఉదయాన్నే కావల్సినదానికన్నా అధికంగా ఆహారం తీసుకుంటుంటారు కొందరు. ఒకేసారి అలా తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఒంట్లో చేరుతాయి. పైగా రాత్రి జాగరణ చేయడం వల్ల మరుసటి రోజు భోజనం చేసి, నిద్రపోతారు. తిండి, నిద్ర వల్ల ఒంట్లో అదనపు కొవ్వు పెరుగుతుంది. ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక... ♦ రోజులో 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. ♦ పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి. ♦ పచ్చికొబ్బరి కోరి సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి యాడ్ చేసుకోవచ్చు. ♦ గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. ♦ ఆరుసార్లు తీసుకుంటే మంచిది. ఆకలి వేస్తున్న ఇదీ ఉండదు. ఆరోగ్యంపై దెబ్బ పడదు. ♦ పాలు ఇష్టపడని వారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు. కండరాలు బలహీనం కాకుండా ఉంటాయి. ♦ జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. ♦ పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. - డా.జానకి, న్యూట్రిషనిస్ట్, డైటా క్లినిక్ -
హరోం హరా..
ఊరు.. వాడ.. కొండ.. కోన.. పులకించే పండుగ శివరాత్రి. ఊరూరా ప్రభలు కట్టడం ఈ పండుగ ప్రత్యేకత. పంట ఇంటికి పంటలర వస్తున్న తరుణంలో సంక్రాంతి. ఆ ఆదిదేవుడు దయతో అన్ని పంటలు పూర్తిగా ఇంటికి చేరాక శివరాత్రి. త మను, తమ పంటలను కంటికి రెప్పలా కాపాడిన ఆ భోళాశంకరునికి రైతులు మొక్కులు తీర్చుకుంటారు. వ్యవసాయ వాహనాలు, ఎద్దులు, ఇతరపశువులను శివాలయం చుట్టూ తిప్పుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై భ క్తులు ఉత్సాహంగా, ఉల్లాసంగా శివయ్య దర్శనానికి తరలివెళతారు. కొందరు భక్తులు రోజంతా ఉపవాసంతో జాగరం చేయడం ఆనవాయితీ. శివరాత్రి నాడు భక్తులు హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ పారవశ్యంతో చేసే శివనామ స్మరణతో చలి శివ..శివా.. అంటూ పారిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రముఖ శివాలయాలు సోమవారం నిర్వహించ నున్న శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. యనమలకుదురులో శివరాత్రి ఏర్పాట్లు యనమలకుదురు(పెనమలూరు) : నేటి నుంచి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి భక్తులు కొండ పైకి వెళ్లటానికి ప్రత్యేక వాహనాలు కేటాయించారు. ఇతరుల వాహనాలు కొండపైకి అనుమతించరు. మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దీపాలు పెట్టారు. దాదాపు 60 అడుగులు ఎత్తు హనుమంతుడి విగ్రహానికి రంగులు వేశారు. నటరాజస్వామిని తీర్చి దిద్దారు. ఆరు మాసాలుగా చేపట్టిన కొండపై విస్తరణ పూర్తి చేశారు. శివగిరిపై ఉత్సవాలకు సిద్ధం మొగల్రాజపురం : కొండపై (శ్రీ వాగ్దేవీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం) శివగిరి మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది.40 అడుగుల ఎత్తు త్రిభుజాకారపు డమరుకం కలిగిన శివలింగాన్ని కొండపై ఏర్పాటు చేశారు. సున్నపుబట్టీల సెంటర్లోని అమ్మ కల్యాణ మండపం నుంచి శివగిరికి దారి ఉంది. సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని శివగిరిక్షేత్ర స్థాపకుడు మల్లికార్జునశర్మ తెలిపారు. బలివేలో ఏర్పాట్లు సిద్ధం.. నూజివీడు : ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో రామలింగేశ్వరస్వామి (భలే రామస్వామి) ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతోంది. ఆలయం లో రామలింగేశ్వరస్వామి పశ్చిమ అభిముఖంగా దర్శనమిస్తారు. ఏటా మహాశివరాత్రి నాడు ఇక్కడ స్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్తరవాహినీ ముక్త్యాల.. జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాలలో భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఏటా ఉత్తరవాహినిలో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. లక్షల సంఖ్యలో భక్తులు స్వామి కల్యాణాన్ని తిలకిస్తారు. అధికారులు స్నానఘాట్లను శుభ్రం చేయించారు. గ్రామ సమీపంలోని పంచముఖ అమృత లింగేశ్వరస్వామి (కోటి లింగాలు) మహాశివరాత్రికి ముస్తాబైంది. కోటిలింగాలను ఇక్కడ ప్రతిష్టించేందుకు 108 ఉప ఆలయాలు ఏర్పాటు చేశారు. రామేశ్వరుని ఆలయం ముస్తాబు తోట్లవల్లూరు : శివరాత్రి సందర్భంగా మండలంలోని ఐలూరులో గంగా పార్వతీ సమేత రామేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో సుమారు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నదిలో నీరు లేకపోవటంతో బోర్లు వేయించి జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తారు. అనంతరం రామేశ్వరస్వామి, రఘునాయకస్వామిని దర్శించుకుంటారు. భక్తుల రాకకు పంచాయతీ, దేవాదాయశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సకల పాప హరణం.. సంగమేశ్వరుడి దర్శనం.. కూడలి(నందిగామ రూరల్): శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు గుర్తొచ్చేది కూడలి తిరునాళ్ల. ఏటా శివరాత్రికి నందిగామ మండలంలోని దాములూరు కూడలిలో సంగమేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో స్వామి వెలిశారు. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు హాజరవుతారు. ఈ ఏడాది వైరా, కట్టెలేరు ఎండిపోయాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు ప్రత్యామ్నాయంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు కుంటలు ఏర్పాటుచేశారు. కూడలి తిరునాళ్ల ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులు తిరునాళ్ల కొనసాగుతుంది. -
బోధన్‌లో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర ఆలయంలో ఈ నెల 3 నుంచి 8వ తేది వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు పూజాకార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. నిజాం చెక్కర ఫ్యాక్టరీని తెరిపించాలని ఈ సందర్భంగా దేవునికి ప్రార్థనలు చేసినట్లు మంత్రి తెలిపారు. -
నిండుగా.. దండిగా
మార్కెట్‌ను ముంచెత్తిన మిర్చి 25వేల పైచిలుకు బస్తాల రాకా వ్యాపారుల సిండికేటు, పడిపోయిన ధర శివరాత్రికి ముందు మూడు రోజులు బంద్.. శనివారం నుంచి మళ్లీ మూడు దినాలు వరంగల్ మార్కెట్‌కు సెలవు కావడంతో శుక్రవారం మిర్చి పోటెత్తింది. ఒక్క రోజే సుమారు 25 వేలకు పైగా బస్తాలను రైతులు తీసుకురావడంతో యార్డులన్నీ ఎర్రబంగారమయ్యూరుు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. శుక్రవారం పెద్ద ఎత్తున మిర్చి ముంచెత్తింది. ఈ సీజన్లో తొలిసారిగా అన్ని రకాల మిర్చి కలిపి దాదాపుగా 25 వేల బస్తాలు వచ్చారుు. మార్కెట్‌కు సెలవుల తర్వాత మళ్లీ మూడు రోజులు వరుసగా సెలవులున్నాయనే సమాచారంతో రైతులు త్వరపడ్డారు. దీంతో వ్యాపారులు సిండికేటై ధరను ఒక్కసారిగా త గ్గించారు. నాలుగు రోజుల కిందట తేజ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.8వేలు పై చిలుకు పలికింది. వండర్ హాట్, దీపిక, యూఎస్-341 రకాలకు రూ.10వేల ధర పలికింది. శుక్రవారం వీటిలో సగానికి ధర తగ్గించేశారు. అధికారులు, యూర్డు ఇన్చార్జి కల్పించుకోకపోవడంతో.. అడ్తిదారుల మాటలు న మ్మి ఎంతోకొంతకు అమ్ముకున్నారు కొందరు రైతులు. పూర్తిస్థాయి మిర్చి సీజన్ ప్రారంభం కాకముందే ఇలాంటి పరిస్థితి ఉండడం రైతులను కలవరపెడుతోంది. మార్కెట్ అధికారులు, యార్డు ఇన్చార్జిలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తే తప్ప మిర్చి ధర పెరిగే అవకాశాల్లేవు. ఇదే జరిగితే రైతులు ఇతర రాష్ట్రాల మార్కెట్లకు మిర్చి తరలించే అవకాశం ఉంది. - వరంగల్‌సిటీ -
హరోం హర
‘‘దేవగణార్చిత సేవిత లింగం భావై ర్భక్తిభిరేవ చ లింగమ్! దినకర కోటి ప్రభాకర లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్!!’’ ...శైవక్షేత్రాల్లో భక్తిగీతాలు మార్మోగుతుండగా ‘హరహర శంకర భ క్తవ శంకర.. శంభో హరహర నమోఃనమోః’ అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి సందర్భంగా మంగళవారం అన్ని రోడ్లూ, వాహనాలు భక్తులతో కిటకిటలాడారుు. అర్చకులు మంత్రోచ్ఛారణ చేసి స్వామివారికి పూలు, విభూది, రుద్రాక్ష లు, బిళ్వదళాలు సమర్పించారు. శివలింగాలకు పాలాభిషేకం చేశారు. జాతర జరిగే ప్రాంతాలకు వేలాది గా తరలివచ్చిన భక్తులు అక్కడే ఉన్న కొలను, నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. పలువురు ప్రముఖులు క్షేత్రాలను సందర్శించి పూజలు చేశారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఖమ్మం కల్చరల్: ద్వాదశ జ్యోతిర్లింగాల ఏర్పాటు జిల్లాకే గర్వకారణమని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పోంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వీటిని ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నగరంలోని టీటీడీ కల్యాణమండపంలో ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కైలాస, ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, చైతన్య అలంకారాల ప్రదర్శన మంగళవారంతో నాలుగో రోజుకు చేరింది. మహాశివరాత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా నాల్గో రోజు ఇక్కడకు విచ్చేసి ప్రదర్శనను తిలకించారు. బ్రహ్మకుమారీలు జ్యోతిర్లింగాల విశిష్టతను ఎంపీకి వివరించారు. ఆధ్యాత్మికత వల్ల లభించే ప్రశాంతత గురించి చెప్పారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రలకు చెందిన జ్యోతిర్లింగాలను ప్రత్యేక చొరవ తీసుకుని ఖమ్మంలో ప్రదర్శనగా ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. వాటి విశిష్టతను తెలియజెప్పేందుకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్న బ్రహ్మాకుమారీల కృషిని కొనియాడారు. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శన విజయవంతం కావాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం శివాలయూల్లో ప్రత్యేక పూజలు చేశా.. ప్రజల శ్రేయస్సుకోసం జిల్లాలోని వివిధ శివాలయాల్లో శివరాత్రిని పురష్కరించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు ఎంపీ తెలిపారు. క్షీరాభిషేకం, రుద్రాభిషేకం తదితర పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. జిల్లా ప్రజానీకం పాడిపంటలతో తులతూగాలని పరమేశ్వరుని కోరానన్నారు. శివాలయూల అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటిని బ్రహ్మకుమారీలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలాసంపత్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి సాధు రమేశ్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, జిల్లా నాయకులు జిల్లేపల్లి సైదులు, పత్తి శ్రీను పాల్గొన్నారు. -
శివం శంకరం
మహాశివరాత్రికి పోటెత్తిన భక్తజనం 1.25 లక్షల వుందికి దర్శనభాగ్యం లఘుదర్శనంతో... శివరాత్రి సక్సెస్స్ శభాష్ రామిరెడ్డి.. సావూన్యులకు సువర్ణదర్శనం స్కౌట్స్ సేవలు అభినందనీయుం శ్రీకాళహస్తి: దక్షిణకైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి క్షేత్రం మంగళవారం భక్తుల శివనావుస్మరణలతో మార్మోగింది. శివరాత్రి పర్వదినాన స్వామి, అవ్మువార్ల దివ్యదర్శనం కోసం భక్తులు లక్షలాదిమంది తరలివచ్చారు. దీంతో ఆలయు ప్రాంగణవుంతా కిక్కిరిసిపోరుుంది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నుంచి సామాన్యుల వరకు అందరికీ లఘు దర్శనం అమలుచేశారు. అధికారులు ఊహించిన మేర కంటే భక్తులు తాకిడి అధికమైనప్పటికీ ఈవో రామిరెడ్డి ప్రణాళికాబద్ధంగా క్యూలను ఏర్పాటు చేయించడంతో భక్తులు సులువుగా స్వామివారిని దర్శించుకోగలిగారు. అరుుతే పలువురు ఆలయాధికారులు వూత్రం ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వీఐపీలు, తమ ఆప్తుల సేవల్లో తరించిపోయూరు. అరుునప్పటికీ స్కౌట్స్, వలంటీర్లు ఈవోకు పూర్తిగా సహకరించడంతో ఉత్సవం విజయువంతంగా పూర్తిచేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయు ప్రాంగణాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే స్వామివారి మూలవిరాట్లతోపాటు ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలతో అలంకరించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. అప్పటి నుంచే భక్తులు స్వర్ణముఖినదిలో స్నానాలు చేసి, ఆలయానికి రావడం ప్రారంభించారు. రద్దీని నిలువరించడానికి సాధారణ భక్తులతో పాటు వీఐపీలకు అధికారులు ప్రత్యేక క్యూను ఏర్పాటు చేశారు. ఇసుకేస్తే రాలని జనం మహాశివరాత్రిని పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఉదయం నుంచి భక్తులు రద్దీ గంటగంటకు పెరగడంతో ఎటుచూచినా భక్తజనంతో ఆలయం నిండిపోయింది. ఇక మధ్యాహ్నం తర్వాత భక్తుల రద్దీ ఇసుకేస్తే రాలనంతగా జనసందడి కనిపించింది. 1.25 లక్షలకుపైగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే 50 వేలమంది భక్తులు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. శభాష్ రామిరెడ్డి శ్రీకాళహస్తీశ్వరాలయుంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ లో పక్కా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పాయని, ఈవో పని తీరు శభాష్ అని పలువురు కొనియాడారు. శివరాత్రిరోజు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 200 మంది తన అనుచరులతో పట్టువస్త్రాల సమర్పణకు హాజరైనా క్యూ ఏర్పాటు చేయుడంతో ఆటంకాలను అధికమించి సావూన్య భక్తులకు సైతం దర్శనం కలిగించారు. ఈ ఏడాది డీఎస్పీ వెంకటకిషోర్ పోలీసులకు పలు సలహాలిస్తూ పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. భక్తులకు అందుబాటులో ప్రసాదాలు భక్తులకు ఇబ్బందులు లేకుండా పులిహోర, లడ్డు,వడ,జిలేబీలను సిద్ధం చేశారు. సుపథావుండపంలో ప్రత్యేకంగా పదికౌంటర్లను ఏర్పాటుచేయుడంతో ప్రతిభక్తుడు ప్రసాదాన్ని సౌకర్యవంతంగా అందుకున్నాడు. అంతేకాకుండా ఆలయుం తరపున ఉచితప్రసాదాలను అందించడం జరిగింది. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమా ల్లో సినీ గాయకుడు హేమచంద్ర బృందం సంగీత విభావరి ప్రేక్షకులను మైమరిపించింది. స్వర్ణవుుఖినదిలో భక్తులు స్నానాలు చేసుకునేందుకు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి అధికారులు చేసిన ఏర్పాట్లు విజయువంతవుయ్యూరుు. ఈవో రామిరెడ్డికి అధికారు లు పూర్తిసహకారం అందించకపోరుునప్పటికీ ఆయున వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో శివరాత్రి ఉత్సవాన్ని దిగ్విజయుంగా పూర్తిచేయుగలిగారని పలువురు అభిప్రాయపడ్డారు. బుధవారం తెల్లవారుజావుున వుూడుగంటలకు లింగోద్భవ దర్శనభాగ్యం ప్రతి భక్తుడు పొందేలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
రాజమండ్రి సిటీ : శివరాత్రి సందర్భం గా గోదావరిలో పుణ్యస్నానాలకు వెళ్లిన పలువురు మహిళలు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రాంతంలో తక్కువ లోతు ఉండడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. రాజమండ్రి రూరల్ ప్రాంతం నామవరానికి చెందిన సుమారు 50 మంది పుణ్యస్నానాలు చేసేందుకు గౌతమఘాట్కు చేరుకున్నారు. అక్కడ నీరు అపరిశుభ్రంగా ఉండడంతో గోదావరి మధ్యలోని కేతావారి లంకలో దిగి స్నానం చేయాలని భావించారు. చేపలు వేటాడే ఇంజన్ నావ ను మనిషికి రూ.25 చొప్పున మాట్లాడుకుని వారు బయలుదేరారు. లంకలో దిగి స్నానాలు చేసిన అనంతరం తిరిగి వస్తుండగా పడవ బోల్తాపడింది. అయితే పడవ బోల్తా పడిన ప్రదేశం దిబ్బ కావడంతో పెద్దలోతు లేదని, అందుకే అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెబుతున్నారు. ఇదే ప్రమాదం 4 మీటర్ల ముందు జరిగి ఉంటే ఘోరప్రమాదం జరిగేదంటున్నారు. పడవ చిన్నది కావడం, నడిపే వ్యక్తి అనుభవలేమి వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రారంభంలోనే ఇంజన్ వేగం పెంచడంతో పడవ బోల్తా పడిందని మహిళలు తెలిపారు. గోదావరిలో ప్రయాణికులను తరలించేందుకు అనుమతులు లేనప్పటికీ భక్తుల ప్రాణాలతో చెలగామాడుతూ పడవలు నడపడాన్ని నిరోధించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తరువాత చర్యలు చేపట్టే కన్నా ముందే శ్రద్ధ వహిస్తే ఇబ్బందులుండవని పలువురు అభిప్రాయపడ్డారు. టూటౌన్ ఎస్సై శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని భక్తులను మరో పడవపై ఒడ్డుకు చేర్చే చర్యలు చేపట్టారు. -
చెరువులో పడి విద్యార్థి మృతి
చిత్తూరు: మహాశివరాత్రి సందర్భంగా చెరువులో స్నానానికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన సదుం మండలకేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలు.. సదుం మండలకేంద్రానికి చెందిన చంద్ర ఏకైక కుమారుడు దిలీప్(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మాహాశివరాత్రి సందర్భంగా సదుం మండల కేంద్రంలోని చిక్కరాల చెరువులోకి స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు చెరువులో మునిగి మృతి చెందాడు. -
గజవాహనాధీశా.. నమో నమః
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రామరీ సమేతుడైన మల్లికార్జునుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీస్వామిఅమ్మవార్ల దివ్యమంగళస్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు గజవాహనాధీశా... నమోనమః అంటూ కర్పూర నీరాజనార్పలించారు. -
శివరాత్రికి సరికొత్త శోభ
-
భారీ భద్రత
{sాఫిక్ నియంత్రణకు తొలి ప్రాధాన్యం 125 సీసీ కెమెరాలతో అణువణువూ నిఘా అసాంఘిక శక్తుల నియంత్రణకు {పత్యేక బృందాలు ఘాట్ రోడ్డులో భక్తులు అప్రమత్తంగా ఉండాలి ‘సాక్షి’తో ఎస్పీ ఆకె రవికృష్ణ సాక్షి, కర్నూలు : ‘శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు భద్రత పరంగా ఎటువంటి ఢోకా లేదు. 2,393 మంది సిబ్బంది, వందలాది సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం. అసాంఘిక శక్తులు, దొంగల నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. ఆత్మకూరు, డోర్నాల ఘాట్‌రోడ్డులో ప్రయాణించే భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి’ అంటున్న జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ.. తాత్కాలికంగా రథోత్సవం వరకు అక్కడే బస చేసి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షిస్తాన్నంటున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీగిరిపై చేపట్టిన పలు భద్రత చర్యలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే... భక్తులకు అసౌకర్యం కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. అసాంఘిక శక్తులపైన డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక నిఘా బృందాలను పెట్టాం. నిఘా వర్గాలతో తనిఖీ నిర్వహించి శ్రీశైలం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. క్యూలైన్లు, పాతాళగంగ, ఘాట్‌రోడ్డులో ప్రయాణికుల భద్రతపైనా జాగ్రత్తలు తీసుకున్నాం. 125 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. బందోబస్తు కోసం ఇద్దరు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 126 మంది ఎస్ఐలు, ఇద్దరు ఏఆర్ ఎస్ఐలు, 403 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1127 మంది కానిస్టేబుళ్లు, 84 మంది మహిళా కానిస్టేబుళ్లు, ఏఆర్ సిబ్బంది 25 సెక్షన్లు, 550 మంది హోంగార్డులు, 14 స్పెషల్‌పార్టీ బృందాలతోపాటు కడప జిల్లా నుంచి మరో 450 పోలీసులను ఉపయోగిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది పార్కింగ్ ఏర్పాట్లు చేశాం. సూచికలు ఏర్పాటు చేశాం. క్యూలైన్లలో రద్దీ వల్ల తొక్కిసలాట లేకుండా పర్యవేక్షిస్తున్నాం. తలుపుల వద్ద మెటల్ డిటెక్టర్ ద్వారా భక్తులకు తనిఖీలు చేసి ఆలయం లోపలకు అనుమతిస్తున్నాం. దొంగతనాలు, నేరాలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, క్రైమ్పార్టీలు తిరుగుతున్నాయి. అనుమానస్పద వ్యక్తుల కదిలికలపైన నిఘా పెట్టాం. ఘాట్‌రోడ్డులో ప్రయాణించే భక్తులు రోడ్డుకు ఒకవైపునే ప్రయాణించాలి. రహదారుల మధ్యన హాకర్స్ వ్యాపారాల పేరుతో రోడ్లను ఆక్రమిస్తే సహించేది లేదు. పాతాళ గంగ నుంచి నందిమండపం వరకు, నందిమండపం నుంచి ఆలయం ప్రధాన ద్వారం, దేవస్థానం చుట్టుపక్కల ఉండే అన్ని ముఖ్య రహదారుల్లో హాకర్లు లేకుండా చేస్తాం. వ్యాపారులు అనుమతి ఉన్నచోటే విక్రయాలు చేసుకోవాలి. భక్తులకు అసౌకర్యంగా ఉన్నా.. రోడ్ల మీద వ్యాపారులు నిర్వహించినా సహించేది లేదు. శివదీక్ష శిబిరాలు, ప్రధాన రహదారులు, పాతాళగంగ, దేవస్థానంలో లోపల భక్తుల కదికలపైన నిఘా ఉంచాం. కంట్రోల్‌రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. రథోత్సవం పూర్తి అయ్యే వరకు శ్రీశైలంలోనే బసచేసి, రక్షణ, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తాను. రహదారుల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా రెండు ప్రత్యేక క్రేన్లను వినియోగిస్తున్నాం. నిత్యం ద్విచక్ర వాహనాల్లో పెట్రోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా మహానంది, యాగంటి, ఓంకారం, బ్రహ్మగుండం, పాత బుగ్గ, జగన్నాథ గట్టు, కాల్వబుగ్గ తదితర పుణ్యక్షేత్రాలలో కూడా అవసరమైన పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టాం. శివరాత్రి సందర్భంగా దేవస్థానానికి వచ్చే భక్తులు, విలేకరులు, ఫొటో, వీడియో గ్రాఫర్ల పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించాలి. -
శివోహం... పంచభూత ప్రయాణం
ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థల దేవాలయాలు. విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుడిదేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి పర్వదినాన సందర్శించడం జన్మధన్యంగా భావిస్తారు భక్తజనం. లయకారుడైన శివుడిని ఎక్కడ వెదకాలని పరితపించే భక్తులకు ఈ పంచభూత స్థలదేవాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. - నిర్మలారెడ్డి 1. ఆకాశ లింగం నటరాజస్వామి ఆలయం: చిదంబరం తమిళనాడులోని కడలూరు జిల్లాలో గల ముఖ్య పట్టణం చిదంబరం. చెన్నై నుంచి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై ‘యంత్ర’ అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ‘ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీస్థలం ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. తమిళనాడు శివాలయాలకు పుట్టిల్లు అని చెప్పవచ్చు. చోళ, పాండ్య చక్రవర్తులు శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఎన్నో శివాలయాలు ఇక్కడ వెలుగొందుతుంటాయి. తిల్లయ్ కాళీ ఆలయం, పాశుపతేశ్వర ఆలయం, అన్నామలై యూనివర్శిటీ, పిచ్చవరం పిక్నక్ స్పాట్.. లను ఇక్కడ సందర్శించవచ్చు. చెన్నై నుంచి చిదంబరానికి నేరుగా రైలులో చేరుకోవచ్చు. తమిళనాడులోని వివిధ ప్రదేశాల నుంచి చిదంబరానికి బస్సు సౌకర్యం ఉంది. 2. పృథ్వీ లింగం ఏకాంబరేశ్వరాలయం : కంచి కంచి ఉత్తరభాగాన్ని శివకంచి అంటారు. పంచభూత క్షేత్రాలలో ఒకటైన ఏకాంబరేశ్వరాలయం పృథ్వీ(భూమి)కి సూచికగా ఉంది. భారతదేశంలో అతి పెద్ద గోపురాలలో ఈ ఆలయం ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో కంచిలో గల మామిడి చెట్టు కింద స్వామి వెలసాడు కాబట్టి ఏకాంబరుడు అనే పేరు వచ్చిందని, ఈ స్వామి భూమిని సూచిస్తాడు అని చెబుతారు. దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. అలాగే ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దాదాపు 3,500 సంవత్సరాలు వయస్సు గల మామిడి వృక్షం ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం. చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది ఏకాంబరేశ్వర దేవాలయం. కంచికి బస్సు, రైలు సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కామాక్షి దేవాలయం ఉన్నది కంచిలోనే! 3. వాయు లింగం శ్రీకాళహస్తీశ్వరాలయం : శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గల ఈ దేవాలయం శ్రీ (సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు) ఈ మూడు పేర్లతో ప్రసిద్ధి చెందింది. స్వయంభువుగా వెలసిన ఇక్కడ శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతుంటుంది. ఆ విధంగా ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాళహస్తిని దక్షిణకాశీ అనీ అంటారు. మహాశివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. దేవాలయాన్ని పల్లవులు, తర్వాత చోళులు నిర్మించినట్టుగా శిలాఫలకాల ద్వారా తెలుస్తోంది. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో గల శ్రీకాళహస్తికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇతర జిల్లాల నుంచి నేరుగా శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యం ఉంది. శ్రీకాళహస్తికి మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గం కాళహస్తి గుండా వెళుతుంది. 4. జల లింగం జంబుకేశ్వరాలయం: తిరుచిరాపల్లి తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే త్రిచికి 11 కి.మీ దూరంలో పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వరాలయం ఉంది. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ‘జలం’ ను సూచిస్తుంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలందుకుంటున్న క్షేత్రం అనీ, జంబు వృక్షాలు (తెల్లనేరేడు) అధికంగా ఉండటం వల్ల కూడా ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. జంబుకేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివలింగం పానపట్టం ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం చూపించేందుకు లింగం పానపట్టుపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి తీసి, ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు ఉంది. చెన్నై నుంచి శ్రీరంగం, అక్కడ నుంచి తిరుచిరాపల్లి చేరుకోవడం సులువు. 5. అగ్ని లింగం అరుణాచలేశ్వరాలయం : తిరువణ్ణామలై దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో ‘అగ్ని’ భూతలింగానికి అరుణాచలేశ్వరాలయం ప్రతీక. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఉంది ఈ క్షేత్రం. తేజోలింగం కనుక దీన్ని అగ్ని క్షేత్రం అంటారు. ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దానిచుట్టూ అరుణమనే పురం ఏర్పాటైందని పురాణాలు తెలుపుతున్నాయి. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా చుట్టూ రోడ్డు ఉంది.చెన్నై నుంచి 185 కి.మీ దూరంలో ఉన్న అరుణాచలేశ్వరాలయం. తిరుపతి నుంచీ రైలులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. పంచభూత స్థల లింగాలు 1. ఆకాశ లింగం: నటరాజస్వామి ఆలయం చిదంబరం 2. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరాలయం కంచి 3. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీకాళహస్తి 4. జల లింగం: జంబుకేశ్వరాలయం తిరుచిరాపల్లి 5. అగ్ని లింగం: అరుణాచలేశ్వరాలయం తిరువణ్ణామలై -
సమస్యల కొలిమి
ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమన్న పేరు. భద్రాద్రి తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయంగా కీర్తి. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం. కానీ సదుపాయాల మాటకు వస్తే మాత్రం చెప్పడానికి ఏమీ ఉండదు. జిల్లాలోని రామతీర్థం క్షేత్రం దుస్థితి ఇది. స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడకు విచ్చేసే భక్తులకు తాగేందుకు కనీసం మంచినీరు ఉండదు. ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ప్రసాదమూ దొరకదు. పోనీ కాసేపు రాముని సన్నిధిలో విశ్రాంతి తీసుకుందామనుకున్నా షెల్టర్లు కూడా లేవు. రామతీర్థం(నెల్లిమర్ల), న్యూస్‌లైన్: రామతీర్థం దేవాలయం వార్షికాదాయం కోటిన్నర పైమా టే. ఏటా ఇరవై లక్షలకు తగ్గకుండా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. కానీ అధికారులు మాత్రం భక్తుల సంఖ్యకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వసతి షెల్టర్ల విషయంలో అధికారులు ఘో ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా ఏ ఒక్కరూ పరిస్థితి మార్చడానికి చర్యలు తీసుకోవడం లేదు. సుమారు 500 ఏళ్ల కిందటి ఈ ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యం గా శివరాత్రి, శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. ఒక్క శివరాత్రి నాడే పదిలక్షల మంది భక్తు లు రామతీర్థం వస్తారు. ఏటా ఆలయానికి సుమారు కోటిన్నర రూపాయల ఆదా యం లభిస్తుంది. ఆలయానికి సంబంధించి 888 ఎకరాల పంట భూములున్నాయి. ఇన్ని ఉన్నా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కనీస స్థాయిలో కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించలేక పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నా రు. ఈ విషయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భ క్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తు తం ఆలయానికి వచ్చే భక్తులకు ఆల యంలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కోవడానికి కుళాయిలు కూడా లేవు. గతం లో ఇక్కడున్న కుళాయిలు చాలాకా లం కిందటే పాడయ్యాయి. ఇప్పటివరకు వాటిని పట్టిం చుకున్న నాథుడే లేడు. దీంతో అందరూ కోనేరు వద్దకు వెళ్లాల్సి వస్తోం ది. అలాగే భక్తులకు తాగునీరు కూడా అందుబాటులో లేదు. గతంలో భక్తుల సౌకర్యార్థం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి న మినరల్ వాటర్ ప్లాంటు కు సంబంధించి ఒకే ఒక్క కుళాయి ఏర్పాటు చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అది కూడా నిరుపయోగంగా మారుతోంది. దీంతో భక్తులు ఆలయం వెలుపల విక్రయించే వాటర్ ప్యాకెట్లు కొనుక్కుని తాగాల్సి వస్తోంది. ఇక ప్రసాదం విషయానికొస్తే గత నాలుగేళ్లుగా ఇక్కడికొచ్చే భక్తులకు ప్రసాదం సక్రమంగా అందడం లేదు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ మాత్రమే ఇక్కడ పులిహోర ప్రసాదం దొరుకుతుంది. తర్వాత వచ్చే భక్తులకు తినేందుకు, ఇళ్లకు తీసుకెళ్లేందుకు రాముల వారి ప్రసాదమే దొరకదు. ఈ విషయంలో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే దేవస్థానానికి విచ్చేసే భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు అందుబాటులో లేవు. గతంలో ఇక్కడ నిర్మిం చిన సామూహిక మురుగుదొడ్లు ఐదేళ్ల క్రితమే నిరుపయోగంగా మారాయి. దీంతో భక్తులు తీవ్రంగా ఇక్కట్లకు గురవుతున్నారు. అలాగే స్నానపు గదులు కూడా అందుబాటులో లేవు. దీంతో మహిళా భక్తులకు ఇబ్బంది కలుగుతోంది. కోనేటిలో స్నానాలు చేసినా దుస్తులు మా ర్చుకునేందుకు గదులు లేకపోవడంతో తం టాలు పడుతున్నారు. ప్రతి ఏటా కోట్ల లో ఆదాయం సమకూరుతున్నా.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలు కేవలం ధనికులు, వీఐపీలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దే వాదాయ శాఖ అధికారులు కల్పించుకుని భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం
-
నేడు మహా శివరాత్రి
-
శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
కోరుట్ల : శివరా త్రి ఉత్సవాలకు పట్టణంతో పాటు మండలంలోని సంగెం, యూసుఫ్‌నగర్ గ్రామాల్లో శివలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాలను విద్యుద్ధీపాలతో అలంకరించారు. సంగెం శి వారులోని పెద్దవాగు, చిన్నవాగు సంగమంలో శివాలయం ఉండడం తో ఇక్కడికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటా రు. పట్టణంలోని పురాతన మహా దేవ ఆలయం, శివమార్కండేయ కోటి నవదుర్గాఆలయాన్ని ముస్తాబు చేశారు. సంగమహేశ్వర ఆలయం లో శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తామని ఆలయ కమిటీ, వీడీసీ సభ్యులు తెలిపారు.