
శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
కోరుట్ల : శివరా త్రి ఉత్సవాలకు పట్టణంతో పాటు మండలంలోని సంగెం, యూసుఫ్‌నగర్ గ్రామాల్లో శివలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాలను విద్యుద్ధీపాలతో అలంకరించారు.
సంగెం శి వారులోని పెద్దవాగు, చిన్నవాగు సంగమంలో శివాలయం ఉండడం తో ఇక్కడికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటా రు. పట్టణంలోని పురాతన మహా దేవ ఆలయం, శివమార్కండేయ కోటి నవదుర్గాఆలయాన్ని ముస్తాబు చేశారు. సంగమహేశ్వర ఆలయం లో శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తామని ఆలయ కమిటీ, వీడీసీ సభ్యులు తెలిపారు.