శైవ క్షేత్రాలకు 380 ప్రత్యేక సర్వీసులు
Published Thu, Feb 16 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
ఆర్టీసీ ఈడీ రామారావు
కర్నూలు(రాజ్‌విహార్): మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలో 380 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు రామారావు తెలిపారు. బుధవారం స్థానిక బళ్లారి రోడ్డులోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో శివరాత్రి ఏర్పాట్లపైన డీఎంలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 27 వరకు శ్రీశైలంతో పాటు ఇతర శైవ క్షేత్రాలకు సర్వీసులు నడపనున్నట్లు ఈడీ తెలిపారు. శ్రీశైలం వెళ్లే సర్వీసులకు అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. అనంతపురం, నెల్లూరు, తిరుపతి రీజియన్ల నుంచి 240 బస్సులు తెప్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రద్దీకి తగ్గట్లుగా శ్రీశైలం, మహనంది, కొలనుభారతి, ఓంకారం, భోగేశ్వరం, యాగంటి, రాయచూరు, సంగమేశ్వరం, గురజాల, బ్రహ్మగుండానికి సర్వీసులు కేటాయిస్తామన్నారు. స్పెషల్ ఆపరేషన్స్‌లో భాగంగా తాను ఓవరాల్‌గా పర్యవేక్షిస్తామని, మెకానికల్ మొబైల్ టీం, హెల్ప్‌లైన్ సెంటర్లు, సెక్యూరిటీ, ట్రాఫిక్ సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ప్రతి డిపో వద్ద సమాచార కేంద్రాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ రజియా సుల్తానా, అధికారులు, డీఎంలు పాల్గొన్నారు.
Advertisement