శివరాత్రితో శివశివా అంటూ చలి వెళ్లిపోతుందంటారు.. కా నీ శీతాకాలానికి ముందే అది దారి చూసుకుంటోంది...
వేసవి ఈ మారు హడావుడిగా వచ్చేసినట్లుంది. పగటి ఉషో‘్ణగ్రత’లు ప్రభావం చూపుతున్నాయి. ఎండ..ఘాటు పెరిగింది. తొలి రోజుల్లోనే ఇలా ఉంటే..‘మండు’కాలం ఎలా ఉంటుందోనని పట్టణవాసులు బెంబేలెత్తుతున్నారు. ఉపశమనాలకోసం పరుగులు తీస్తున్నారు.
పాలమూరు, న్యూస్‌లైన్ : శివరాత్రితో శివశివా అంటూ చలి వెళ్లిపోతుందంటారు.. కా నీ శీతాకాలానికి ముందే అది దారి చూసుకుంటోంది... ఫలితంగా చలి ప్రభావం తగ్గి వేసవి తాపం పెరిగింది. శివరాత్రి పండుగ తర్వాత చలి తీవ్రత తగ్గుతుంది.. కానీపర్వదినానికి పక్షం రోజుల ముందే పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న మార్పుల కారణం గా.. జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పె రుగుతుండగా జనం అందుకు తగిన అలవా టు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో ఆరో తేదిన పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 32.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కాగా బుధవారం పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టం 31.9 డిగ్రీలుండగా.. కనిష్టం 18.1 డి గ్రీలు నమోదయింది. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నమోదు విభాగం అధికారులు పేర్కొన్నారు. పిబ్రవరి చివరి వారం నుంచి చూపాల్సిన ఉష్ణోగ్రతల ప్రభావం మొదటి వారంలోనే ప్రా రంభం కావడం ఇబ్బందిగా మారింది.
రా త్రి వేళల్లో చల్లగాలులు వీస్తుండటం, పగ టి పూట మాత్రం ఉక్కపోత పోస్తుండటంతో జనం ఇబ్బంది పడాల్సి వస్తోంది. శీతాకాలంలోనే వేసవి ప్రవేశించింది.. ఎండలు తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా పెరుగుతుండటంతో వేసవి తాపంతో తల్లిడిల్లుతున్నారు. ఒకవైపు గంటల కొద్దీ విద్యుత్ కోతలతో ఇళ్లల్లో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో గొడుగు, టోపీ, చేతి రుమాళ్ల కొనుగోలుపై జనం దృష్టి పెడుతున్నారు.