
రాష్ట్రమంతటా.. పెరిగిన ఎండల తీవ్రత
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఏకంగా 25 జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం జిల్లా వంకులంలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ పిప్పల్‌దరి, ములుగు జిల్లా ఘనపూర్, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో 41.2, నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 41.1, నిర్మల్ జిల్లా కుబీర్‌లో 41, నల్లగొండ జిల్లా పడ్మట్‌పల్లిలో 40.9, వనపర్తి జిల్లా కనాయపల్లిలో 40.8, భద్రాచలంలో 40.7 డిగ్రీలు, హైదరాబాద్ మెట్టుగూడలోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 1 నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాత్రి వేళల ఉష్ణోగ్రతలు సైతం తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లోనూ చలి తగ్గలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 19.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment