
హరోం హర.. హర!
శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు హరహర మహదేవ.. శంభోశంకర నామస్మరణతో మార్మోగుతున్నాయి.
- మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు హరహర మహదేవ.. శంభోశంకర నామస్మరణతో మార్మోగుతున్నాయి. దేశంలో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివ నామస్మరణతో శ్రీశైల మల్లన్నదర్శించుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయం ప్రాంగణంలోనే వేలమంది భక్తులు ఉపావాస దీక్షలు ఆచరిస్తున్నారు.
సోమవారం ఉదయం నుంచే భక్తులు పాతాల గంగలో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం ముక్కంటి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.