huge devotees
-
అంగరంగ వైభవంగా నాగోబా జాతర..ఆకట్టుకున్న ఆదివాసీల సాంస్కృతి (ఫొటోలు)
-
వైకుంఠ ఏకాదశి.. తిరుమలకు పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు..
-
Tirumala: గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల
తిరుమల: ప్రపంచమంతా పార్టీలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా అందుకు భిన్నంగా గోవిందనామస్మరణతో తిరుమలలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు శ్రీవారి భక్తులు. సరిగ్గా 12 గంటలకు భక్తులందరూ గోవింద నామాన్ని జపించడంతో తిరుగిరులు మార్మోగాయి. దీంతో శ్రీవారి ఆలయం ముందు సందడి వాతావరణం నెలకొంది. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ లడ్డూ ప్రసాదంను పంచుకున్న భక్తులు తిరుమలలో నేడు (బుధవారం) తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుంది. . మంగళవారం శ్రీవారిని 62,495 మంది భక్తులు దర్శించుకోగా, 19,298 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,715 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 24,503 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
తిరుమల : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. క్యూకాంప్లెక్స్‌లో 17 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 68,146 మంది స్వామిని దర్శించుకున్నారు. 22,667 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 5 గంటల్లో దర్శనమవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. నేడు టిటిడి నూతన చైర్మన్ గా భాద్యతలు చేపట్టనున్న బిఆర్ నాయుడుటిటిడి చైర్మన్ తో పాటు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నవేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెస్ రాజు సాంబశివరావు జంగా కృష్ణమూర్తి దర్శన్ శాంతారాం రామమూర్తి జానకి దేవి మహేంద్ర రెడ్డి ఆనంద్ సాయి నరేష్ కుమార్ అదిథ్ దేశాయ్ సౌరబ్ బోరా నర్సిరెడ్డి రాజశేకర్ గౌడ్ -
తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు .శనివారం అర్ధరాత్రి వరకు 73,684 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 36,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.2.72 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 3 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
భక్తులతో కిటకిటలాడిన అలిపిరి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,080 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 27,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 3 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఆగష్టు 30: తిరుమల సమాచారం..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 62,529 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 29, 730 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.51 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 65,131 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 30,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల సమయం.ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం , ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. టీటీడీకి భారీ విరాళంతిరుమల 2024 ఆగస్టు 29: హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు, శ్రీ రాజమౌళి, శ్రీ ప్రసాద రావు, శ్రీమతి మాలతీ లక్ష్మీ కుమారిలు బుధవారం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.3.70 కోట్లు విరాళంగా అందజేశారు.ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం లోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాతలు విరాళం చెక్కును అందజేశారు. -
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,910 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,320 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.26 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
శ్రావణ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,131 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 30,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల సమయం.దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించారని స్పష్టం చేసింది. -
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న (శనివారం) 83,538 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 30,267 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.25 కోట్లుగా లెక్క తేలింది. -
July 03: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 67,398 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 26,512 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
July 2: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 75,449 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
TTD : శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 81,005 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 28,244 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
June 30: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 80,404 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
June 22: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . నిన్న 72,294 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,855 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి రాజసంతిరుపతి: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శమిచ్చారు.బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.వాహన సేవలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, డిఎల్ఓ శ్రీ వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ గోవింద రాజన్, విజివో శ్రీ బాలి రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
June17: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటలు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 69,870 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.42,119 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రారంభమైన అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలుఅప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నిన్న సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగ్గా.. ఈ ఉదయం 6.55 నుంచి 7.25 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకు అప్పలాయగుంట వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.21 దాకా తిరుచానూరు తెప్పోత్సవాలు నేటి నుంచి ఐదు రోజులపాటు(ఈనెల 21వ తేదీ దాకా) తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో తెప్పలపై అమ్మవారు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక తెప్పోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు ప్రకటించారు. -
June16: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 82,886 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.Powered by00:03/10:2307:25శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
June15: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 66,782 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,229 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
June13 :తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 75,068 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
June12: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 18 గంటలు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 76,665 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.తిరుమల వెళ్లనున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. నిన్న 73,811 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 34,901 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.19 కోట్లు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది -
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. నిన్న 76,381 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.85 కోట్లు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది -
తిరుమలలో నేటి భక్తుల రద్దీ
సాక్షి , తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. .శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. నిన్న 89,161 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,450 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.77 కోట్లు.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించిందిజూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలుఆకాశగంగ అంజనా దేవి – బాలాంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకం– జాపాలి తీర్థం వద్ద హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పఠనంతిరుమల, 2024 మే 26: జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.ఇందులో భాగంగా ఈ ఐదు రోజులు పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతోపాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఆకాశ గంగలోని అంజనాద్రి ఆంజనేయ ఆలయంలోహనుమత్ జయంతి సందర్భంగా ఆకాశ గంగలోని శ్రీ అంజనాదేవి- శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ ఐదు రోజుల పాటు ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. మొదటి రోజు జూన్ 1న మల్లెపూలు, జూన్ 2న తమలపాకులు, జూన్ 3న ఎర్ర గన్నేరు మరియు కనకాంబరం, జూన్ 4న చామంతి మరియు చివరి రోజైన జూన్ 5న సింధూరంతో అభిషేకం చేస్తారు.వేద పండితులచే శ్రీ ఆంజనేయ సహస్ర నామార్చన, మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహిస్తారు.ఉదయం 10 గంటలకు ఆకాశ గంగ వద్ద శ్రీ ఆంజనేయ జన్మ వృత్తాంతంపై ప్రవచన కార్యక్రమం ఉంటుంది.జపాలిలో:ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. జూన్ 1న హరికథ, జూన్ 2 న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు, జూన్ 3న పురంధర దాస సంకీర్తనలు, జూన్ 4న హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన, జూన్ 5న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే హరికథ గానం నిర్వహిస్తారు.ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు ఉంటాయి.నాద నీరాజనం వేదికపై:నాద నీరాజనం వేదికపై ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య శ్రీ హనుమన్ జననం మరియు శ్రీ హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై ప్రముఖ వేద పండితులచే ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. -
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
-
యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..
-
Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు ౩౦- 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుంది.సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్ని నిండిపోయి.. ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు. భక్తులు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. -
Tirumala: తిరుమలలో భారీ రద్దీ.. బారులు తీరిన భక్తులు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 70,668 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 38,036 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.64 కోట్లు.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 80,048 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.17 కోట్లు.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది -
తిరుమలలో పెరిగిన రద్దీ
-
వైభవంగా గంగమ్మ జాతర..
-
సంతానాన్ని కలిగించే ప్రసాదం..ఎగబడ్డ జనం..
-
Tirumala: ఏప్రిల్ 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 18న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,163 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,287 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 2.99 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న (బుధవారం) 65,570 మంది స్వామివారిని దర్శించుకోగా 24,446 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.53 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది 7 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి: తిరుమలలో నేడు రద్దీ పెరిగింది. భక్తులతో కంపార్ట్మెంట్లలో ఎక్కువ నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఉచిత సర్వ దర్శనానికి 18 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,549 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,816 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్యకు పోటెత్తిన భక్తులు
-
తిరుమలకు క్యూ కడుతున్న వీఐపీలు, సామాన్య భక్తులు
-
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్ (ఫొటోలు)
-
రాజమండ్రి గోదావరిలో కార్తీక మాస స్నానాలు
-
Devotees Rush: తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తజన సందోహం (ఫోటోలు)
-
వరంగల్ భద్రకాళి అమ్మవారు ఆలయానికి పోటెత్తిన భక్తులు
-
భక్తజన సంద్రంగా తిరుమల
-
యాదాద్రికి భక్తుల తాకిడి (ఫొటోలు)
-
మహాశివరాత్రి సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
-
కనులపండువగా లింగమంతుల స్వామి కల్యాణం
సూర్యాపేట: దురాజ్‌పల్లి శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మూడవ రోజు మంగళవారం యాదవ పూజారులు చంద్రపట్నం వేసి భక్తిశ్రద్ధలతో శ్రీ లింగమంతుల స్వామి, మాణిక్యమ్మల కల్యాణం జరిపించారు. చంద్రపట్నంపై లింగమంతుల స్వామి వారు ఉన్న పెట్టెను ఉంచి పూజలు చేశారు. చంద్రపట్నం ముందు మెంతబోయిన, మున్న, బైకాను వంశస్తులు బియ్యంతో పోలు పోసి తమలపాకులు, పోకలు, ఖర్జూరాలు ఉంచి స్వామివారి కథలతో కల్యాణ తంతు నిర్వహించారు. జాతరలో నాలుగో రోజు బుధవారం నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు. -
మేడారానికి పోటెత్తిన భక్తులు
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలో మినీజాతర ముగిసినప్పటికీ భక్తుల రాక కొనసాగుతూనే ఉంది. ఆదివారం 1.50 లక్షల మందికిపైగా భక్తులు తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం కిటకిటలాడింది. మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది. రద్దీని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఏర్పాట్లను ఈవో రాజేంద్రం పర్యవేక్షించారు. -
ఓం నమః శివాయ.. శంభో శంకర (ఫొటోలు)
-
కమనీయం.. రామలింగేశ్వరుడి కల్యాణం
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారు జామున కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయం నుంచి స్వామి అమ్మవారిని నంది వాహనంపై మంగళవాయిద్యాలు, భజనల మధ్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్యశాస్త్రి, నీలకంఠశివాచార్య, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సురేశ్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ తంతు జరిపించారు. స్వామి వారికి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. -
పసుపుమయం పట్నం వారం
కొమురవెల్లి (సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని తోటబావి ప్రాంగణంలో పట్నం వారాన్ని పురస్కరించుకొని సోమవారం అగ్నిగుండాలు, పెద్దపట్నం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒగ్గు పూజారులు పంచవర్ణాల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలతో (మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలతో నిప్పు కణిక లు తయారు చేసి అగ్ని గుండాలను సిద్ధం చేశారు. తర్వాత ఉత్సవ విగ్రహాలతో ఆలయ పూజారులు పెద్దపట్నం, అగ్ని గుండాలు దాటారు. -
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతరకు శనివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భక్తులు తొలుత మోయతుమ్మెద వాగులో స్నానం చేసి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వాగు పక్కన చెలమను తోడి అందులో నుంచి తీసిన నీటితో వంకాయ కూర, చింతపండు చారు చేసుకొని అక్కడే భోజనాలు చేశారు. మరికొందరు వంకాయ, చిక్కుడు, టమాటాలను కలిపి కూర చేసుకోవడం గమనార్హం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జాతర సాగింది. జాతరకోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. -
యాదాద్రి దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు మూడు గంటలు, వీఐపీ దర్శనానికి సుమారు 45 నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 30వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్య ఆదాయం రూ.45,86,412 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
హంసవాహనంలో రామయ్య జల విహారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రగిరిపై కొలువైన వైకుంఠ రాముడు గోదావరి నదిలో జలవిహారం చేశారు. హంసవాహనంలో సీతాసమేతుడై జలవిహారం చేస్తున్న రామయ్యను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తర లివచ్చారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం నిర్వ హించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి తిరుప్పావై సేవాకాలం, మూలవర్లకు అభిషేకం, వేద పారాయణం, ప్రబంధ పాశుర పఠనం.. తదితర కార్యక్రమాలను ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం దర్బారు సేవ అనంతరం ప్రత్యేక పల్లకిలో సీతాసమేత రామచంద్రస్వామిని మేళతాళాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడ హంసాకృతిలో అలంకరించిన పడవలో సీతారాములను వెంచేపు చేసి, ఆగమ శాస్త్ర పద్ధతి లో షోడశోపచార పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు హంస వాహనంలో స్వామివారి జలవిహారం ప్రారంభమైంది. ఒక్కో పరిక్రమణాని కి ఒక్కో రకమైన హారతి ఇస్తూ కనుల విందుగా వేడుకను నిర్వహించారు. రాత్రి 7:01 గంటలకు ఐదు పరిక్రమణాలతో తెప్పోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కా గా, భూలోక వైకుంఠంగా పేరొందిన భద్రాచలంలో సోమవారం శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
న్యూ ఇయర్ సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు
-
యాదాద్రికి భక్తుల తాకిడి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, రింగ్ రోడ్డు ప్రాంతాలు కిటకిటలాడాయి. శ్రీస్వామి వారి ధర్మదర్శనానికి మూడున్నర గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారిని 40వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక వివిధ పూజలతో రూ.64,50,178 నిత్యాదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
యాదాద్రికి పెద్ద ఎత్తున భక్తులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు ఏకాదశి కలసి రావడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి ధర్మదర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకుపైగా సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. కాగా, వివిధ పూజల ద్వారా యాదాద్రి దేవస్థానానికి రూ.59,04,585 నిత్య ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
భక్త జన యాదాద్రి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణలోని నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వీఐపీ దర్శనం కోసం రూ.150 టికెట్ కొనుగోలు చేసిన భక్తులు తూర్పు రాజగోపురం నుంచి పడమటి రాజగోపురం వరకు క్యూకట్టారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు 2 గంటల సమయం పట్టింది. ఇక ధర్మదర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వీరికి 5 గంటలకు పైగా సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 50వేల మంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ప్రసాదం కొనుగోలు చేయడానికి భక్తులు అధికంగా ఆసక్తి చూపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు నిత్యాదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక్క రోజే శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.1,09,82,446 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి కార్తీకమాసంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. ఆదివారం ఉదయమే కార్తీకమాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాలు, దీపారాధనలకు క్యూకట్టారు. అనంతరం కొండపైన స్వయంభూలను దర్శించుకునేందుకు వెళ్లారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మ దర్శనానికి 5 గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఒక్కరోజే నిత్య ఆదాయం రికార్డుస్థాయిలో రూ.85,62,851 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, రద్దీ నేపథ్యంలో కొండపైకి, కిందికి బస్సులు ఆలస్యంగా నడవడంతో భక్తులు ఘాట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. బ్రేక్ దర్శనాల కోసం భక్తులను నిలిపివేయడంతో కొండపైన, కొండ కింద భక్తులు క్యూలైన్లలో 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రసాద విక్రయ శాల వద్ద తోపులాట జరిగింది. -
యాదాద్రికి కార్తీకం తాకిడి
యాదగిరిగుట్ట : కార్తీక మాసం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.150 టికెట్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 734 జంటలు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వ్రతాలు, నిత్య పూజల ద్వారా ఆదివారం ఒక్కరోజే రూ.52,17,063 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణమాసం ముగుస్తుండటంతో జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు క్షేత్రానికి అధిక సంఖ్యలో తరలి వ చ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీస్వామి వారి ధర్మదర్శనానికి సుమారు మూడున్నర గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామిని 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో వివిధ పూజల ద్వారా శ్రీస్వామి వారికి నిత్య ఆదాయం రూ.47,19,965 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
వరుస సెలవులు .. తిరుమలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
బాసరలో పోటెత్తిన భక్తులు
-
తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
భక్తులతో కిటకిటలాడుతున్న కీసరగుట్ట శివాలయం
-
హరోం హర.. హర!
- మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం: శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు హరహర మహదేవ.. శంభోశంకర నామస్మరణతో మార్మోగుతున్నాయి. దేశంలో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివ నామస్మరణతో శ్రీశైల మల్లన్నదర్శించుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయం ప్రాంగణంలోనే వేలమంది భక్తులు ఉపావాస దీక్షలు ఆచరిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే భక్తులు పాతాల గంగలో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం ముక్కంటి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి(నల్లగొండ): తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచే శ్రీ లక్ష్మి నర్సింహ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. యాదాద్రి కొండపై సత్యనారాయణస్వామి వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయింది. వ్రత టికెట్ల కోసం భక్తులు బారులుతీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు
తిరుమల : చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు హుండీ ఆదాయం రూ.3.57 కోట్లకు చేరింది. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. అక్కడ స్వామివారి దర్శనానికి 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం నాడు స్వామి వారిని 60,135 మంది భక్తులు దర్శించుకున్నారు. -
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి(నల్లగొండ): తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణమాసం ప్రారంభం కావడంతో లక్ష్మినరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి ధర్మ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నానికి 31 కంపార్టుమెంట్లు నిండాయి. సాధారణ దర్శనానికి 15 గంటలు, కాలినడక భక్తులకు 7 గంటల సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావటంతో అలిపిరి గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో కూడా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడం విశేషం. -
శ్రీవారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎక్కడచూసినా క్యూలైన్లే కనిపిస్తున్నాయి. సాయంత్రం 3 గంటల సమయానికి 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. అదేవిధంగా కాలినడక వచ్చే భక్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. -
తిరుమలలో గణనీయంగా పెరిగిన రద్దీ
-
కొండగట్టు కాషాయమయం
కొండగట్టు: హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాల సందర్భంగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి క్షేత్రం భక్తుల రద్దీతో పోటెత్తింది. వేలాది మంది హనుమాన్ దీక్షాపరులు ఇరుముడులతో తరలిరాగా.. అంజన్న పుణ్యక్షేత్రం కాషాయ వర్ణం సంతరించుకుంది. బుధవారం జరగనున్న హనుమాన్ జయంతి వేడుకలకు మంగళవారం నుంచే భక్తుల రాక మొదలైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల నుంచి రాత్రి వరకు సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు లక్షమంది భక్తులు చేరుకునే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు. -మల్యాల హనుమాన్ నామస్మరణతో కొండగట్టు మార్మోగుతోంది. ఇరుముడులతో దీక్షాపరులు అంజన్న సన్నిధికి తరలివస్తున్నారు. వేలాది మంది దీక్షాపరులతో కొండగట్టు కాషాయమయమైంది. మెట్లదారివెంట, నాచుపల్లి, ఘాట్‌రోడ్డు వెంట దీక్షాపరులు భజనలు చేసుకుం టూ కాలినడకన తరలివస్తున్నారు. జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు. హనుమాన్ పెద్దజయంతి ఉత్సవాలకు కొండగట్టు అంజన్న ఆలయం ముస్తాబైంది. ఆలయ ప్రాకారాలు విద్యుద్దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. కొండగట్టు వై జంక్షన్ నుంచి ఆలయం వరకు విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రికే 70 వేల మంది భక్తులు కొండపైకి చేరుకున్నట్లు అంచనా. హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ ఉచిత అన్నదానం, మంచినీరు అందించారు. బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు లక్షమంది భక్తులు చేరుకునే అవకాశం ఉంది. నేడు ప్రత్యేక పూజలు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆంజనేయస్వామివారి సన్నిధిలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 3 గంటలకు తిరుమంజనము, 6 గంటలకు ద్రావిడ ప్రబంధ పారాయణములు, 9 గంటల నుంచి విశేష అభిషేకము, అర్చన, పట్టు వ స్త్రముల అలంకరణ, సహస్ర నాగవల్లి అర్చన, హోమము, మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఉత్సవ మూర్తికి ఉయ్యాల సేవ, మంత్ర పుష్పం, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగం, సామూహిక భజన నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30కు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణము, అమ్మవారికి కుంకుమార్చన, ఒడి బియ్యం, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహనసేవ, కంకణోద్వాసన, మంత్ర పుష్పము, మహదాశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గజరాజు నర్సింహులు తెలిపారు.