చెర్వుగట్టు ఆలయం వద్ద భక్తజన సందోహం. (ఇన్‌సెట్లో) కల్యాణతంతు జరిపిస్తున్న అర్చకుడు
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారు జామున కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయం నుంచి స్వామి అమ్మవారిని నంది వాహనంపై మంగళవాయిద్యాలు, భజనల మధ్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు.
వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్యశాస్త్రి, నీలకంఠశివాచార్య, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సురేశ్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ తంతు జరిపించారు. స్వామి వారికి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment