నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందుగా బుధవారం నల్లగొండ లో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందుగా బుధవారం నల్లగొండ లో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీనగర్‌లో రథోత్సవాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. జేసీ హరిజవహర్‌లాల్ సతీసమేతంగా దర్శించి పూజలు చేశారు.
ఈ రథ ఊరేగింపును రామగిరి, క్లాక్‌టవర్, ఆర్‌పీరోడ్డు, ఎన్జీ కాలేజీ మీదుగా చెర్వుగట్టుకు మళ్లించారు. ఊరేగింపులో ఒంటెలు, గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనాచారి, డిప్యూటీ కమిషనర్ విజయరాజు, చెర్వుగట్టు సర్పంచ్ రమణబాలకృష్ణ, శంకర్‌గౌడ్, రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి, రాజిరెడ్డి, సుబ్రమణ్య దీక్షితులు, పి. రామలింగేశ్వరశర్మ, సురేష్ పాల్గొన్నారు.