kalyanam
-
విజయవాడ : కమనీయంగా గోద, రంగనాథుల కల్యాణం (ఫొటోలు)
-
Dream Wedding Destination ఇక్కడ పెళ్లి జరగాలంటే అదృష్టం ఉండాలి!
హరహర మహదేవ శంభో అంటూ చార్ధామ్ యాత్రలో పరవశించిపోతారు భక్తులు. ఈ మార్గంలో చాలా తక్కువ మందికి తెలిసిన మరో విశిష్టమైన ఆలయం కూడా ఉంది. అదే త్రియుగినారాయణ దేవాలయం. ఇది చాలామందికి డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా. దీని గురించి విశేషాలు తెలుసుకుందాం రండి.ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది సుందరమైన గ్రామంలో కొలువు తీర ఉన్నది త్రియుగినారాయణ ఆలయం.దీని విష్ణువు అని భావిస్తున్నారు. ఇది ఎత్తు సముద్ర మట్టానికి 1,980 మీటర్లు (6,500 అడుగుల ఎత్తులో ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూడముచ్చటగా ఉండే పవిత్ర వైష్ణవ దేవాలయం. చార్ధామ్ ప్రదేశాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది కూడా. ఈ ఆలయంలో స్వామివారి నుండి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు, గర్వాల్ హిమాలయాల ఉత్కంఠ భరితమైన దృశ్యాలను వీక్షించవచ్చు. త్రియుగినారాయణ ఆలయం వెనుకున్న కథ ఏమిటి?మూడు యుగాలుగా లేదా "త్రియుగం"గా ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రం ఇది. పార్వతి దేవి , శివుడు వివాహం చేసుకున్న ప్రదేశంగా ఇది ప్రతీతి. ఇక్కడ విష్ణువు ముందు శివపార్వతుల కళ్యాణం జరిగిందట. అందుకే వారి గౌరవార్థం త్రియుగి నారాయణ్ ఆలయం నిర్మించారని చెబుతారు.శ్రీ మహావిష్ణువు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా, తల్లిగా విష్ణుమూర్తి వ్యవహరిస్తే, బ్రహ్మ దేవుడు వివాహంలో పూజారి పాత్రను పోషించాడట. హోమగుండం, బ్రహ్మశిలపార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన హోమగుండం మూడు యుగాలుగా నిర్విరామంగా వెలుగుతోంది. ఈ ఆలయం ముందు పవిత్రమైన అగ్ని అనంతంగా వెలుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని అఖండ ధుని ఆలయం అని కూడా పిలుస్తారు పెళ్లి చేసుకునే జంటలు ఏడడుగులు వేసి (సాత్ ఫేర్)పవిత్ర బంధంతో ఏకమవ్వాలని ఎదురు చూస్తారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కావాలని మొక్కుకుంటారట. ఇక్కడ కలపను నైవేద్యంగా సమర్పించి, విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు. త్రియుగినారాయణ ఆలయంలో బ్రహ్మ శిల ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇదే శివపార్వతుల కళ్యాణానికి వేదిక. దేవాలంయంలోకి అడుగు పెట్టగానే విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి వెండి విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు.దేవతలు వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైన,గౌరవప్రదమైన ప్రదేశంలో వివాహం చేసుకోవాలని ఎవరు కోరుకోరు? దేశ విదేశాలకు చెందిన జంటలు ఇక్కడ ఏడు అడుగులువేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతారు. అలాగే కొత్త జంటలు, వేలాదిమంది భక్తులు, పర్యాటకులు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించి విష్ణువు ఆశీర్వాదం పొందుతారు. కేదార్‌నాథ్‌కు సుమారు 25 కి.మీ.దూరం. అలాగే రుద్రప్రయాగ నుండి 70 కిలోమీటర్ల దూరం. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. -
వినాయక పరిణయం.. ఆ ఆంతర్యం ఏమిటో తెలుసా?
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. నారదుడి ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు.. ‘‘నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం. నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి’’ అని చెప్పాడు. ఇది వినాయకుడి పరిణయ గాథ ఆంతర్యం.శ్రీలక్ష్మీ గణపతి వైభవం..మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది. 1)వసంత నవరాత్రులు, 2) గణపతి నవరాత్రులు, 3) దేవీ నవరాత్రులు. వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది. ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు, గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వాటినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి. ఈరోజుల్లో.. చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది."శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. -
Simhachalam Kalyanam Photos: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం (ఫొటోలు)
-
Vemulawada : వేములవాడ ఆలయంలో రాజన్న కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
యూరప్‌లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణం
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్, యూకేలో మలయప్ప స్వామి కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫ్రాంక్ఫర్ట్, ఉట్రేచ్‌్ట–నెదర్లాండ్స్‌లో టీటీడీ అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణ క్రతువు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు హాజరై భక్తి పారవశ్యంతో పులకించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి సమన్వయంతో ప్రపంచంలోని తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల సహకారంతో శ్రీవారి కల్యాణాలు కనుల విందుగా సాగుతున్నాయన్నారు. కల్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. యూరప్‌లో స్వామి వారి కల్యాణానికి శివరామ్ తడిగొట్ల, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ కార్తీక్ యార్లగడ్డ, జి.వెంకట కృష్ణ, సూర్య ప్రకాష్ తదితరులు ఏర్పాట్లు చేశారని వివరించారు. -
కమనీయం.. రామలింగేశ్వరుడి కల్యాణం
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారు జామున కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయం నుంచి స్వామి అమ్మవారిని నంది వాహనంపై మంగళవాయిద్యాలు, భజనల మధ్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్యశాస్త్రి, నీలకంఠశివాచార్య, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సురేశ్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ తంతు జరిపించారు. స్వామి వారికి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. -
జూలై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
సాక్షి, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని జూలై 5న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జూలై 4న ఎదుర్కోళ్లు, 5న అమ్మవారి కళ్యాణం, 6న రథోత్సవం ఉంటుందన్నారు. అమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని వసతులూ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాల్లో సివరేజీ లీకేజీలు లేకుండా పర్యవేక్షించాలని వాటర్‌వర్క్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. రహదారుల మరమ్మతులను ఇప్పటినుంచే చేపట్టాలని చెప్పారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ లైన్లను సరిచేయడం, చెట్ల కొమ్మలను తొలగించాలని మంత్రి సూచించారు. అమ్మ వారి దర్శనం, కల్యాణం కోసం ఇచ్చే పాస్‌లను డూప్లికేట్‌కు ఆస్కారం లేకుండా బార్ కోడింగ్‌తో కూడిన పాస్‌లను జారీ చేయాలని ఆదేశించారు. కల్యాణం, రథోత్సవం సందర్భంగా ఆలయం వైపు రహదారులను మూసివేసి వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, పోలీసు అధికారులను ఆదేశించారు. దేవాలయ పరిసరాలలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అయిదు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని డీఎం అండ్ హెచ్ఓ వెంకటికి సూచించారు. భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈఓ అన్నపూర్ణ, వాటర్‌వర్క్స్ డైరెక్టర్ ఆపరేషన్ కృష్ణ, సీజీఎం ప్రభు, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, జోనల్ కమిషనర్ రవికిరణ్, అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ రంగారావు, పంజగుట్ట ఏసీపీ గణేష్ పాల్గొన్నారు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది! -
ముగిసిన ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం
అప్డేట్స్ ► ముగిసిన ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం ► వెన్నెల వెలుగుల్లో.. కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం.. భక్తుల పారవశ్యం ► కన్నుల పండువగా కోదండ రాముని కల్యాణ మహోత్సవం 8.10PM ► కోదండ రాముని కల్యాణోత్సవానికి హాజరైన సీఎం జగన్ ► ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న సీఎం జగన్. 7.44PM ► స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్ 7.42PM ► సంప్రదాయ రీతిలో రామయ్య దర్శనానికి వెళ్లిన సీఎం జగన్. 7.37PM ► ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ఆహ్వానం పలికిన మంత్రి ఆర్కే రోజా, అధికారులు. 6.46PM ► ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఎం జగన్. మరికొద్దిసేపట్లో ఒంటిమిట్ట ఆలయానికి. ► కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కోసం తొలుత ఒంటిమిట్ట కోదండరామాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని.. అక్కడ నుంచి నేరుగా స్వామి వారి కల్యాణ వేదికకు చేరుకోనున్న సీఎం జగన్. 5.50PM ► కడప చేరుకున్న సీఎం వైఎస్ జగన్. కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఒంటిమిట్ట చేరుకోనున్నారు. ► ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కోసం సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు. ► కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో జగదభిరాముడి జగత్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ► ఈ కల్యాణమహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై.. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ► కల్యాణం రాత్రి 8 గంటల నుంచి 10 గంటలవరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం.. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ► ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కల్యాణానికి సర్వం సిద్ధం.. సీఎం జగన్ పర్యటన వివరాలిలా..
సాక్షి, ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో జగదభిరాముడి జగత్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం టీటీడీ ఈఓ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఒంటిమిట్టలోని స్వామి వారి కల్యాణ వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణం రాత్రి 8 గంటల నుంచి 10 గంటలవరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. భక్తులందరికి అక్షింతలు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని వెల్లడించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, ఈఎంసీ సీఈఓ గౌతమి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. కడప కార్పొరేషన్: ఈనెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 7.30 నుంచి 7.40 గంటల వరకు కోదండరామస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సీతారాముల కల్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. 8.00 నుంచి 10.00 గంటల వరకు జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణాన్ని తిలకిస్తారు. తర్వాత రోడ్డు మార్గాన ఒంటిమిట్ట నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు కడపలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు, 16వ తేదీ శనివారం ఉదయం 9.10 గంటలకు కడప ఎన్జీఓ కాలనీలో నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి పాత బైపాస్‌లో ఉన్న ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుంటారు. 9.30 నుంచి 9.45 గంటల వరకు కడప నగర మేయర్ సురేష్‌బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ ముందస్తు వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి కడపకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలుజిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు వెళతారు. -
గాంధీ వ్యక్తిగత కార్యదర్శి కల్యాణం కన్నుమూత
సాక్షి, చెన్నై: మహాత్మా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి వి.కల్యాణం (99) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. స్వాతంత్య్ర సమరయోధుడైన కల్యాణం, 1943 నుంచి 1948 వరకు మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. చెన్నైలోని కుమార్తె ఇంట్లో ఉంటున్న ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: ప్రముఖ సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామి ఇకలేరు -
ఈసారీ రాములోరి భక్తులకు నిరాశే..ఎందుకంటే!
భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణాన్ని స్వయంగా వీక్షించాలనుకునే భక్తులకు ఈసారి కూడా నిరాశే ఎదురుకానుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఆంతరంగిక వేడుకగానే ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి సంతృప్తి చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనటం, ఆ తర్వాత ఆలయ సిబ్బంది, అర్చకుల్లో కోవిడ్ కేసులు వెలుగు చూడటం తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మతాలకతీతంగా అన్ని బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించింది. వేడుకలు నిరాడంబరంగా, ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరిస్తూ జరుపుతామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా అర్చకులు, వేదపండితులు, అధికారులు, పోలీసులు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే ప్రభుత్వ ప్రతినిధులు మినహా సాధారణ భక్తులకు అనుమతి ఉండే అవకాశం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధించిన ఈ ఆంక్షలకు భక్తులు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులెవరూ భద్రాచలం రావద్దని, ఇప్పటికే కల్యాణ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు డబ్బు వాపస్ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఫోన్లో చర్చించారు. ఇతర దేవాలయాల్లోనూ భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే దర్శనాలు చేసుకోవాలని కోరారు. దేవాలయాలకు వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు. అన్ని మతాల పండుగల విషయంలో కోవిడ్ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించారు. శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవ స్థానంలో ఆదివారం స్వామివారి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. చిత్రకూట మండపంలో ప్రత్యేకపూజలు చేశారు. ఆ తర్వాత కల్యాణంలో పాల్గొనే రుత్వికులు, వారి సతీమణులు పెళ్లి పనులకు అవసరమైన పసుపు దంచారు. అనంతరం పసుపు, అత్తరు, ఇతర సుగంధద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేశారు. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవాలను వైభవంగా జరిపించారు. కాగా, కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ ఏడాది కూడా స్వామివారి కల్యాణ వేడుకలను అంతరాలయంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భక్తులు నిరాశకు లోనవుతున్నారు. -
కల్యాణం.. వైభోగం
ఇల్లందకుంట(హుజూరాబాద్): అపర భద్రాద్రి ఇల్లందకుంటలో సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఉదయాన్నే ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. స్వామి వారిని ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేడుకల్లో మహిళల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రభుత్వం తరఫున కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఈవో సుదర్శన్ స్వామివారికి సమర్పించిన పట్టు వస్త్రాలను పూజారులు ఉత్సవ మూర్తులకు అలంకరించారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి మేళతాలాలతో తీసుకొచ్చారు. అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, శేషం సీతారామాచార్యులు వేదమంత్రోశ్ఛారణ మధ్య కల్యాణం తంతు ప్రారంభించారు. మొదట స్వామివారికి యజ్ఞోపవీతం చేయించారు. అభిజిత్ లగ్న సుముహూర్తమున మధ్యాహ్నం 12:30 గంటలకుసీతారాములకు జీలకర్రబెల్లం కార్యక్రమాన్ని జరిపించారు. వేలాది మంది భక్తుల శ్రీరామానామ స్మరణ మధ్య రామయ్య సీతమ్మవారికి తాళి కట్టారు. నేత్రపర్వంగా సాగిన ఈ వేడుకను తిలకించిన భక్తజనం పులకించిపోయారు. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమోగింది. ప్రముఖుల హాజరు.. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి జిల్లాలోని అందరు అధికారులు హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడకలకు హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్–జమున దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, ప్యాట రమేష్, తుమ్మేటి సమ్మిరెడ్డి, సర్పంచ్ కంకణాల శ్రీలత, ఎంపీటీసీ రామ్‌స్వరణ్‌రెడ్డి, రాష్ట్ర సహకార సంఘూల అధ్యక్షుడు తక్కళ్లపల్లి రాజే«శ్వర్రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పింగిళి రమేశ్, చుక్కా రంజిత్, దేశిని కోటి, ఎంపీపీ గంగారపు లత, జెడ్పీటీసీ అరుకాల వీరశలింగం, రామ్ నర్సింహారెడ్డి, జిల్లా వైద్యధికారి రామ్‌మనోహర్‌రావు, తదితరులు హాజరై పూజలు చేశారు. భారీగా బందోబస్తు.. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే బైపాస్ రూట్లలో వాహనాలను మళ్లించారు. వీఐపీ పాసులు ఉన్నప్పటికీ భక్తుల అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు కొంత మందిని అడ్డుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రొటోకాల్ ప్రకారం ముందు అనుకున్న ప్రకారమే మంత్రులు, ఎమ్మెల్యేలతో కొంత మందిని మాత్రమే లోపలికి పంపించి మిగతా వారిని ఆపివేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కల్యాణం వేడుకలు సజావుగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. మహా అన్నదానం.. శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. వేడుకలకు హాజరైన భక్తులకు జమ్మికుంట రైస్ మిల్లర్స్, కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యాక్రమం నిర్వహించారు. అందరికీ సరిపడా భోజనాలు చేయించారు. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. సామాజిక సేవ.. వేసవి కాలం కావడం, ఎండ ఎక్కువగా ఉండడంతో ఇల్లందకుంట పీహెచ్సీ ఆధ్వర్యంలో ముందస్తుగానే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా సంస్థ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ పాఠశాలల విద్యార్థులు కళ్యాణ మండపంలో మంచి నీటిని, మజ్జిగను పంపిణీ చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మజ్జిగ ట్యాంకర్‌ను పంపించగా, ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తాగునీరు సరఫరా చేశారు. -
నేడు పట్టాభిషేకం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి సోమవారం పట్టాభిషేకం చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియం వేదికపైనే పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపిస్తారు. సోమవారం ఉదయం మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో మిథిలా స్టేడియంలో ఆశీనులను చేస్తారు. అనంతరం విశ్వక్సేన ఆరాధనతో పట్టాభిషేకం మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేస్తారు. తర్వాత పవిత్ర నదీ జలా లతో స్వామివారికి అభిషేకం జరిపి అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన గావిస్తారు. కల్యా ణంలో లాగే అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మధ్యా హ్నం 12గంటలకు రజిత సింహాసనంపై శ్రీ సీతారామచంద్రస్వామివారిని పట్టాభిషిక్తుడ్ని చేస్తారు. ఒక్కో ఆభరణం ధరింçపజేస్తూ... రాముడికి పట్టాభిషేకం నిర్వహించే సమయంలో రామదాసు చేయించిన ఆభరణాలను ధరింపజేయడం ఆనవాయితీ. స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్ కిరీటం.. ఇలా ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను తెలుపుతూ స్వామివారికి అలంకరిస్తా రు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన ముహూర్తంలోనే భద్రాచలంలో కూడా పట్టాభిషేకం నిర్వహించడం రామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. 60 ఏళ్లకు మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 ఏళ్లకు ఒకసారి పుష్కర ప్రయుక్త సామ్రాజ్య పట్టాభిషేకం, ప్రతి యేటా కల్యాణం మరుసటి రోజున పట్టాభిషేకం నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో పట్టాభిషేక స్వర్గను పారాయణం చేస్తారు. వేడుక అనంతరం రామయ్యను అంతరాలయంలో వేంచేయింపజేస్తారు. హాజరుకానున్న గవర్నర్ ... శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సోమవారం నిర్వహించే పట్టాబిషేక మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు ఆలయ అధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కల్యాణం.. కమనీయం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పాతగుట్ట దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి, అమ్మవారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రాత్రి 8:00 గంటలకు ప్రారంభమైన కల్యాణ తంతును అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన కార్యక్రమాలతో పూర్తి చేశారు. వేద పండితులు నిశ్చయించిన శుభముహూర్త లగ్నం 9:35 గంటలకు స్వామి వారు ఆండాళ్ అమ్మవారిమెడలో మాంగల్య ధారణ చేశారు. అంతకుముందు స్వామి, అమ్మవారిని హనుమంత వాహనంపై అధిష్టింపజేసి కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా, కమనీయంగా సాగింది. స్వామి అమ్మవార్లను పట్టు పీతాంబరాలతో ముస్తాబు చేశారు. ప్రత్యేక గజ వాహనంపై అధిష్టింపజేసి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. మంగళ వాయిద్యాలతో, ఆలయ అర్చకులు, రుత్విక్కులు, వేద పండితులు చదివే వేద మంత్రాలైన పంచ సూక్తాలు, పంచోపనిషత్తులు, దశ శాంతుల పఠనంతో సేవ ముందుకు సాగింది. భక్తుల జయ నారసింహ జ య జయ నారసింహ అను నినాదాలతో పాతగుట్ట తిరువీధులు మారుమోగాయి. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. స్వామి అ మ్మవార్లకు దేవస్థానం తరఫున చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డిలు పట్టు వస్త్రాలను సమర్పించారు. రాత్రి 8ః00 గంటలకు స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన వంటి వివాహ తంతులను పూర్తి చేశారు. సరిగ్గా 9ః35 గంటల కు స్వామి వారు ఆండాళు అమ్మవారిమెడలో లో క కల్యాణార్థం మాంగల్య ధారణ చేశారు. అనంత రం స్వామి అమ్మవార్ల కు ఆలయ అర్చకులు, వేద పండితులు కలిసి తలంబ్రాల ఆటలను ఆడిం చారు. వివాహానికి అఖిల భారత పద్మశాలి అన్నసత్రం సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పిం చారు. గజవాహనంపై స్వామిఅమ్మవారిని కల్యాణ మండపానికి తీసుకొస్తున్న అర్చకులు, భక్తులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు స్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశా రు. కల్యాణ మండపం వద్ద బక్తుల కోసం బార్ కేడ్లను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందిరా కుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించారు. దారులకు ఇరువైపులా సున్నం లైన్లను వేశారు. యాదాద్రి పాతగుట్ట ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవానికి హాజరైన భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో హనుమంత సేవ పాతగుట్టలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై ఊరేగించి భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ఉదయం పంచామృతాలతో అభిషేకించి పట్టువస్త్రాలను ధరింపచేసి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకా రం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలను చేసి హారతులనిచ్చారు. మంగళ వాయిద్యాలు, బాజా బజంత్రీలు, ఆలయ అర్చకుల వేద నాదాలు, రుత్విక్కులు, పండితుల వేద మంత్రాలతో సేవ ముందుకు కదిలింది. అక్కడి నుంచి సేవను కల్యాణ మండపం వద్దకు తీసుకు వెళ్లి మండపంలో అధిష్టింపచేసి వేద పండితులు, రుత్విక్కులు, ఆలయ అర్చకులు శ్రీ సూక్తం, పురుష సూక్తంలను పఠించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్, దేవస్థానం చైర్మెన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు మాధవాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు మేడి శివకుమార్, పన్నగేశ్వర్రావు పాల్గొన్నారు. -
ఘనంగా వీరభద్రుడి కల్యాణం
టేక్మాల్(మెదక్): మండలం లోని బొడ్మట్‌పల్లిలో గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వీరభద్రుడి కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారం కల్యాణ వేడుకలో పది జంటలు పాల్గొన్నాయి. వివాహ వేడుకలకు ఏడుపాయల ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్ వీరభద్రుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. కాగా కల్యాణాన్ని తిలకిచేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వీరికి ఆలయ నిర్వాహకులు అన్నప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, సర్పంచ్ బీరప్ప, మండల ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రవిశంకర్, నాయకులు నిమ్మరమేష్, దశరథ్‌గౌడ్, ఈశ్వరప్ప, బేగరి మొగులయ్య, శ్రీనివాస్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
సాక్షి, రంగారెడ్డి : జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చూడముచ్చటైన సీతారాముల జంటను చూడటానికి చిన్నాపెద్దా తరలివచ్చారు. పూజారులు స్వామివార్లను పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. సీతమ్మవారికి తాళి బొట్టు కట్టే సమయం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు. మేళతాళాలతో ఆ అందమైన దృశ్యాన్ని చూసి తరించారు. చలువ పందిళ్ల నీడలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తృప్తి పొందారు. సీతారాముల కల్యాణం సందర్భంగా ఆలయ పూజారులు సీతారాముల కథను కళ్లకు కట్టినట్టుగా వినిపించారు. రామాయణంలోని కీలక ఘట్టాలను భక్తుల ముందు ఆవిష్కరింపజేశారు. -
నేడు భద్రాద్రిలో ఘనంగా సీతారాముల వారి కల్యాణం
-
గాంధీజీ ‘హేరామ్’ అనడం నేను విన్లేదు
చెన్నై: నాథూరాం గాడ్సే తుపాకీ తూటాకు నేలకొరిగిన మహాత్మా గాంధీ చివరిసారిగా ‘హేరామ్’ అన్నారో లేదో తనకు తెలియదని గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వెంకిట కళ్యాణం (96) చెప్పారు. తుదిశ్వాస విడవడానికి కొన్ని క్షణాల ముందు గాంధీ ‘హేరామ్’ అనలేదని కళ్యాణం దశాబ్దం క్రితం చెప్పడంతో అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై ఇన్నాళ్లకు కళ్యాణం స్పష్టతనిచ్చారు. ‘‘గాంధీజీ ‘హేరామ్’ అనలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ‘హేరామ్’ అనడం నేను విన్లేదు అని చెప్పా. ఆయన హేరామ్ అని అన్నారేమో.. నాకు తెలియదు. గాంధీజీపై కాల్పులు జరిగిన ఆ క్షణాన అక్కడంతా గందరగోళంగా ఉంది. అక్కడున్నవారంతా అరుస్తున్నారు. నాకసలేం వినిపించలేదు’’ అని ఆయన అన్నారు. 1943 నుంచి గాంధీజీ చనిపోయేదాకా ఆయనకు సహాయకుడిగా పనిచేశారు. -
కమనీయం..సంగమేశ్వరుని కల్యాణం
కొత్తపల్లి: సంగమేశ్వర క్షేత్రంలో సోమవారం శ్రీలలితా సంగమేశ్వరుని కల్యాణం.. కనులపండువగా నిర్వహించారు. ఉదయం ఏడుగంటల ప్రాంతంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు సప్తనదీజలాలతో వేదమంత్రాల మధ్య అభిషేకం నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలతో స్వామి, అమ్మవార్లను వధూవరులుగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం వద్దకు మేళతాళాలతో స్వామి, అమ్మవార్లను తీసుకొని వచ్చారు. బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠిస్తుండగా అర్చకులు తెల్కపల్లి రఘురామశర్మ .. కల్యాణ వేడుకలను ప్రారంభించారు. ఉదయం 11గంటలకు స్వామివారి తరఫున అర్చకులు అమ్మవారి మెడలో మాంగల్యధారణ గావించారు. శ్రీలలితా సంగమేశ్వరస్వామివార్ల కల్యాణ వేడుకలను తిలకించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మహిళా భక్తులు.. పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెలతో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. వేడుకలను తిలకించేందుకు కర్నూలు, ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ సతీమణి: శ్రీలలితా సంగమేశ్వరుని కల్యాణ వేడుకలను తిలకించేందుకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సతీమణి స్వర్ణశ్రీ, ఆయన కుమారులు వచ్చారు. వారు స్వామివారి వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సతీమణి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. వేడుకల్లో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, తహసీల్దారు రామకృష్ణ, ఇన్చార్జి ఎస్సై వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
వసంతోత్సవం...తన్నుల సేవ
- చిన్నహోతూరులో ఆకట్టుకున్న వేడుక ఆస్పరి : చిన్నహోతూరు గ్రామంలో గురువారం పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం.. కుడుములు ఆట, తన్నుల సేవ, వసంతోత్సవం వైభవంగా జరిగాయి. సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన పెద్దలు ఆడవేషంలో ఉన్న వ్యక్తిని శాంతింప జేస్తూ , ఆటు ఇటు తిప్పుతూ బుక్కు పిండిని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. ఆతరువాత ఇరువర్గాల వారు కుడుములతో ఆడుకున్నారు. ఇరువర్గాల పెద్దలు పెళ్లి ఒప్పందం చేసుకున్నారు. అనంతరం పార్వతీ, పరమేశ్వరుల ఉత్సవ విగ్రహలను మేళతాళాలతో ఊరేగించారు. పెళ్లి సమయంలో అలిగిన పార్వతీ దేవిని శాంతింప జేయడానికి పరమేశ్వరునిపై కుడుములు వేసి అవమానించారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఆ తరువాత దేవాలయం దగ్గర వీరభద్ర స్వామి అవతారంలో వున్న పూజారి తలపై తట్ట పెట్టుకుని, త్రిశూలం చేత పట్టుకుని కేకలు వేసుకుంటు భక్తులను తన్నుతూ తిరగడం ఆకట్టుకుంది. ఆయన తన్ను కోసం భక్తులు ఎగబడ్డారు. అనంతరం ఉగ్రుడైన వీరభద్ర స్వామి అవతారిని గ్రామస్తులు మిరప కాయల పొగబెట్టి శాంతింపజేశారు. పార్వతీ, పరమేశ్వరుల పెళ్లి చేసే విషయంలో విఫలమయ్యారని వీరభద్ర స్వామి ఉగ్రుడై గ్రామ పెద్దలను ఇలా తన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నామన్నారు. గ్రామస్తులు ఆనందోత్సవాల మధ్య వసంతోత్సవాన్ని జరుపుకున్నారు. గ్రామంలో అన్ని వర్గాల వారికి సంబంధించి ఐదు పెద్ద రంగుల గుంతలు ఉన్నాయి. వీటిలో గులాబీ రంగును కలిపి.. ఒక కడవతో దేవాలయానికి తీసుకెళ్లి సిద్ధరామేశ్వర స్వామికి పూజలు చేశారు. ఇక రంగుల వేసుకోవడం దేవాలయం నుంచి మొదలు పెట్టారు. ఆలయ నిర్వాహకులు మంజునాథ్‌గౌడ్, వీరభద్రగౌడ్, సర్పంచ్ మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యుడు మారెప్ప, గ్రామ పెద్దలు వరదరాజులు, నారాయణ, బసవరాజు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
నయన మనోహరం వెంకన్న కల్యాణం
వాడపల్లి(ఆత్రేయపురం) : వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కోనేటి రాయుడు కల్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి గంటలకు రమణీయంగా జరిగాయి. సుందరంగా అలంకరించిన కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో వేంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్ కుమార్ దంపతులు, డీఎల్పీవో జేవీవీఎస్ శర్మ దంపతులు, ఆలయ కమీటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు , ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట ఎంపీపీలు వాకలపూడి వెంకట కృష్ణారావు, కోట చెల్లయ్య, రెడ్డి అనంతకుమారి, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి, ఈఓపీఆర్డీ డీవై నారాయణలు స్వామి వారికి ప్రభుత్వం తరఫున∙పట్టు వస్త్రాలను సమర్పించారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం చైత్ర శుద్ధ ఏకాదశి శుభముçహూర్తం రాత్రి ఏడు గంటలకు కల్యాణోత్సవాలను వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిల ఉత్సవ విగ్రహలను పట్టు వస్త్రాలు, బంగారు, వెండి, వజ్రాభరణాలతో సుందరంగా అలంకరించి కల్యాణ వేదికకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. వ్యాఖ్యాతగా ఎన్వీ సోమయాజులు, అయ్యంగారి పట్టాబిరామయ్య వ్యవహరించారు. మ«ధ్యాహ్నం మూడు గంటలకు స్వామి వారి ర«థోత్సవం పురమాడ వీధుల్లో కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం గౌతమి గోదావరి లో ఏర్పాటు చేసిన హంస వాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం రాత్రి 10 గంటలకు కన్నుల పండువగా జరిగింది. రావులపాలేనికి చెందిన వ్యాపారి మన్యం సుబ్రహ్మణ్యేశ్వరారావు దంపతులు ముత్యాల తలంబ్రాలను సమకూర్చగా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి ముత్యాల తలంబ్రాల కార్యక్రమం వైభవంగా జరిగింది. కల్యాణ వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమీటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యలో ఆలయ కమీటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
అంతా రామమయం
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలా కల్యాణోత్సవాలు శ్రీరామ నవమి మహోత్సవం జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగింది. జిల్లాలోని పెదపూడి మండలం జి.మామిడాడలోని కోదండరామ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. అన్నవరంలోని రత్నగిరిపై, కె.గంగవరం మండలంలోని సత్యవాడలో జరిగిన కల్యాణోత్సవం కనువిందు చేసింది. ఏజెన్సీ ప్రాంతమైన వీఆర్ పురం మండలం శ్రీరామగిరిలో శ్రీరామ నామస్మరణ మారుమోగిపోయింది. రాజమహేంద్రవరం, కాకినాడలతోపాటు అన్ని ప్రాంతాల్లోని రామాలయాలే కాకుండా వీధుల్లో కూడా స్వచ్ఛందంగా చలువ పందిళ్లు వేసుకొని అర్థరాత్రి వరకూ భజనలు, భక్తి గీతాలతో భక్తులను అలరింపజేశారు. గొల్లల మామిడాడలో.. జి.మామిడాడ(పెదపూడి) : వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. బాజాభజంత్రీలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల శ్రీరామనామస్మరణతో కోదండరాముని కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పంచభూతాలు సాక్షిగా.. ఆకాశమంత పందిరిలో.. భూదేవంత పీటపై సీతారాముల వారి కల్యాణం కనుల పండువగా సాగింది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం గొల్లలమావిుడాడలోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముని కల్యాణం కడు రమణీయంగా జరిగింది. బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయ సమీపంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకటకూర్మరంగనాథాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 11.10 గంటలకు స్వామి వారిని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ సీహెచ్ అరుణకుమార్, శ్రీదేవి దంపతులు, సీతారాములకు పట్టువస్త్రాలు తలంబ్రాలను సమర్పించారు. అలాగే ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి, తోటత్రిమూర్తులు సూర్యకుమారి, పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ద్వారంపూడి వెంకటరెట్టి మంచిముత్యాలు తలంబ్రాలు స్వామి వారికి సమర్పించారు. 11.40 గంటలకు ఆలయ ధర్మకర్తలు ద్వారంపూడి శ్రీదేవి మహాలక్ష్మి ఇంటి నుంచి మంచి ముత్యాలు, తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకిలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తాడి శ్రీ వ్యవహరించారు. 12 గంటలకు ప్రారంభం.. మ««ధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ సంకల్పం ప్రారంభమైంది. మ్యధ్యాహ్నం 1.26 గంటలకు రక్షాబంధ¯ŒS చేశారు. 1.26 గంటలకు మంచి ముత్యాల దండ చూపించారు. మంత్రస్నానం చేయించారు. కన్యాదానం చేశారు. 2.05 గంటలకు జీలకర్ర బెల్లం కల్యాణమూర్తుల శిరస్సుపై ఉంచారు. 2.20 గంటలకు మాంగల్య సూత్రధారణ రాముల వారితో చేయించారు. 2.30 గంటలకు తలంబ్రాలు తంతు పూర్తి చేశారు. రామయ్య తండ్రి కల్యాణాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఇక్కడ ఆనవాయితీగా సాగే పిల్లల వేలంపాట తంతు యథావిధిగా జరిగింది. కల్యాణం తలంబ్రాలు వేసుకున్నవారికి కొద్ది కాలంలోనే కల్యాణం జరుగుతుందని, ముందురోజు ఆలయానికి చేరి నిద్రించేవారికి సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కల్యాణానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తలంబ్రాలు, బియ్యం పంపిణీ చేశారు. ఆలయ ఆర్గనైజర్ నల్లమిల్లి అచ్చుతానందరెడ్డి, పలువురు ఏర్పాట్లు పర్యవేక్షించి సేవలందించారు. జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం ర్యాలి(ఆత్రేయపురం) : ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణాన్ని బుధవారం రాత్రి 8.45గంటలకు వేదమంత్రోచ్ఛారణ నడుమ కడు రమణీయంగా నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర పండితులు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన శ్రీనివాసులు వెంకటచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు, ఆలయ అర్చకులు కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. జగన్మోహిని, కేశవస్వామికి వేదపండితులు వాడపల్లి రంగాచార్యులు, పెద్దింటి శ్రీనివాసాచార్యులు, వాడపల్లి భాస్కరాచార్యులు , వేదపండిట్ టీవీ ఫణికుమార్, పురాణ పండిట్ హరిరామనా«థ్లు వివాహ క్రతువు నిర్వహణకు సహకరించారు. తొలుత స్వామి వార్ల ఉత్సవ విగ్రహలను గర్భగుడి నుంచి కల్యాణ మండపం వద్దకు తోడ్కొని వచ్చారు. ముందుగా పండితులు విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనం, నిత్యహోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, అంకురార్పణ తదితర కార్యక్రమాలు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు పట్టు వస్త్రాలు , మంగళసూత్రాలను సమర్పించారు. ఉదయం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా పూల మాలలతో అలంకరించి గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ కరుటూరి నరసింహరావు, జగన్మోహినీ కేశవస్వామి ఆలయ మాజీ చైర్మన్ పి.సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. శ్రీరామగిరిలో.. శ్రీరామగిరి(వీఆర్‌పురం) : మరో భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీరామగిరి సుందర సీతారామచంద్ర స్వామివారి కల్యాణం రామనామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా బుధవారం జరిగింది. పుణ్యగోదావరి, పవిత్ర శబరి నదుల సంగమ ప్రాంతానికి చేరువగా మాతంగ మహారుషి నిర్మించిన ఆలయంలో సుందర సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అశేష భక్తజనుల నడుమ సాగింది. భక్తులు తనివితీరా కల్యాణాన్ని వీక్షించారు. సుందర సీతారామచంద్రులకు చేతులు జోడించి జేజేలు పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సౌమిత్రి పురుషోత్తమాచార్యులు వివాహ వేడుకలో భాగంగా కొండవీుద ఆలయంలో తెల్లవారుజామున ఒంటి గంటకు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కల్యాణ ఘట్టాలను క్రమ పద్ధతిలో చేపట్టారు. పుణ్య నదీతీర్థాన్ని స్వామివారికి సమర్పించిన అనంతరం అర్చకులు కల్యాణ పనుల్లో నిమగ్నమయ్యారు. సీతారాములను ఆలయంలో వధూవరులుగా చేశారు. అలాగే గర్భగుడిలోని మూలవిరాటులకు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి దేవరాజ వాహనంపై కొండ దిగువన ఉన్న కల్యాణ మండపానికి ఊరేగింపుగా తోడ్కొని వచ్చి, వేదికపై అధిష్టింపజేశారు. అక్కడ ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శోడషోపచార పూజలను వేదపండితులు నిర్వహించారు. పూర్ణాహుతుని తదుపరి శాంతి కల్యాణాన్ని చేపట్టారు. సంకల్పం, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాలతో మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కల్యాణోత్సం వైభవంగా జరిగింది. పట్టువస్త్రాలు అందజేసిన ఎమ్మెల్యే రాజేశ్వరి.. స్వామివారి కల్యాణానికి రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, చింతూరు ఐటీడీఏ పీఓ చినబాబులు పట్టువస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు మరికొందరు భక్తులు స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎటపాక సీఐ ఆర్.రవికుమార్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లా¯ŒS కమిటీ సభ్యురాలు కొమరం ఫణీశ్వరమ్మ, ఎంపీపీ కారం శిరమయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యాల కుసుమాంబ, తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్, వీఆర్‌పురం ఎస్సై ఎ¯ŒS.రామకృష్ణ , కూనవరం ఎస్సై అజయ్‌బాబు, ఆలయ కమిటీ చైర్మ¯ŒS ఆచంట శ్రీనివాస్, ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వి.గాంధీబాబు తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లికి పెళ్లికళ
నేటి నుంచి వెంకన్న కల్యాణోత్సవాలు రేపు రథోత్సవం, పరిణయపర్వం ఆత్రేయపురం (కొత్తపేట) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి పెళ్లికళను సంతరించుకుంది. శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవో బీహెచ్‌వీ రమణమూర్తిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎండ వేడి తగలకుండా చలువ పందిర్లు ఏర్పాటు చేసి, ఫ్యాన్లు అమర్చారు. స్వామి దర్శనానికి భక్తులు ఇబ్బంది పడకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లొల్ల నుంచి వాడపల్లి వరకు అనేక స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. చిరు వ్యాపారులు పలు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ వాడపల్లికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. స్వామివారి ప్రసాదం కొరత రాకుండా సుమారు 50 వేల లడ్డులు తయారుచేసి సిద్దంగా ఉంచారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మ¯ŒS, ఈవో తెలిపారు. కాగా బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్ర పుష్పం, కల్యాణం, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇదీ కల్యాణోత్సవాల క్రమం గురువారం ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణతో కల్యాణోత్సవాలు మొదలవుతాయి. 7న రథోత్సవం, రాత్రి స్వామి వారి కల్యాణమహోత్సవం జరుగుతాయి. ప్రభుత్వం తరఫున శాసనమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్ స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామికి అచారం ప్రకారం వంశ పారంపర్యంగా హైదరాబాదుకు చెందిన జఠవల్లభుల గోపాలకృష్ణ సోమయాజులు దంపతులు ఆగమ శాస్త్ర ప్రకారం కల్యాణఘట్టాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహిస్తారు. రావులపాలెంకు చెందిన వ్యాపారి మన్యం సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతులు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. గౌతమి గోదావరిలో రాత్రి 10 గంటలకు తెప్పోత్సవం విద్యుత్ వెలుగుల మధ్య జరుగుతుంది. 8న పొన్నవాహన మహోత్సవం, 9న సదస్యం, 10న ప్రత్యేక పూజలు, 11న గౌతమి గోదావరిలో స్వామి వారి చక్రతీర్థస్నానం జరుగుతాయి. 12న శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
అంతా రామయం!
శ్రీరామనవి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. రామాయణంలో ఆసక్తికర ఘట్టాలను అర్చకులు వివరించారు. నీలమేఘశ్యాముడి ఏకపత్నీవ్రతాన్ని పాటలతో కీర్తించారు. పల్లెలో గ్రామోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. రామనామ జపంలో రామాలయాలు మార్మోగాయి. గ్రామాల్లో ఎద్దుల పందేలు, పొట్టేళ్ల పోటీలు నిర్వహించారు. - సాక్షి నెట్వర్క్