
కల్యాణం.. కమనీయం
గార్లదిన్నె : మండల పరిధిలోని కోటంకలో వెలసిన గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. శ్రీవల్లీ, దేవసేన సతీసమేత సుబ్రమణ్యుడికి సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపించారు. కార్యక్రమానికి చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.