garladinne
-
పచ్చ పచ్చాని దారిలో సాగిపోదామా..
కనువిందు చేసే పచ్చని చెట్లు... బడలికను పోగొట్టే చల్లగాలి... ఎవరైనా సరే ఆ మార్గంలో ఒకసారి ప్రయాణిస్తే ఫిదా అవ్వాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ దారిలో వెళ్లాలనే కోరిక తట్టాల్సిందే. రహదారికి పచ్చటి తోరణం కట్టినట్లుండి.. వాటి కిందకు వెళ్లగానే ఏదో గుహలోకి ప్రవేశించినట్లుగా కలిగే అనుభూతి ప్రయాణికులను కొద్దిసేపు అక్కడ ఆగేలా చేస్తోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె నుంచి మిడ్‌పెన్నార్ డ్యాంకు వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా చెట్లు ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంగుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలు అంటే గుర్తుకువచ్చేది పత్తి, మిర్చి సాగు. దశాబ్దాలుగా ఇవే పంటలు ఈ ప్రాంతంలో సాగుచేస్తుంటారు. కానీ ఇటీవల ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే బంతి పూల తోటలు కూడా సాగుచేశారు. గుంటూరు పర్చూరు పాత మద్రాసు రోడ్డు వెంబడి పుల్లడిగుంట సమీపంలో పండించిన బంతి పూలు పసుపు, ఆరెంజ్ రంగుల్లో చూపరులను ఆకర్షిస్తున్నాయి.నిత్యం అలలతో ఎగసి పడే సంద్రం.. వెనక్కు తగ్గింది. ఇప్పటి వరకు అలల మాటున ఉన్న శిలలు అందమైన ఆకృతులతో సరికొత్తగా పరిచయం చేసుకున్నాయి. వాతావరణ మార్పులతో సముద్రం వెనక్కు వెళ్లడంతో విశాఖ బీచ్‌లోని వైఎంసీఏ ప్రాంతంలో నల్లని రాళ్లు కనువిందు చేశాయి. దీంతో సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఓ రైతుకు చెందిన నాటుకోడి అతి చిన్న గుడ్డు పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు గండి రమణ నాటు కోళ్లు పెంచుతున్నారు. ఇందులో ఒక పెట్ట ముందు రోజు సాధారణ పరిమాణం కలిగిన గుడ్డు పెట్టగా.. మంగళవారం చిన్న గుడ్డు పెట్టింది. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశు వైద్యుడు శ్రీధర్ చెప్పారు.విశాఖ కేంద్ర కారాగారం ఆవరణలో సీజనల్ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కూరగాయల పంటలు ప్రారంభమయ్యాయి. కొన్ని కాపు దశకు వచ్చాయి. జైలులో ఉండే ఓపెన్ ఎయిర్ ఖైదీలచే రసాయనిక ఎరువుల్లేకుండా అధికారులు ఇక్కడ పంటలు పండిస్తుంటారు. జైలు లోపల మామిడి, కొబ్బరితోపాటు, బయట ఆవరణ సుమారు 20 ఎకరాల్లో సీజనల్ పంటలు పండించి వాటిని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన వాటిని జైలు గేటు ముందు బీఆర్టీఎస్ పక్కన సుధార్ కేంద్రంలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం వంగ, బీర, క్యాబేజీ, టమాటా, ఆనప (సొర) సాగు చేస్తున్నారు. ఈ పంటలతో జైలు ఆవరణ అన్ని కాలాల్లోను పచ్చదనంతో కళకళలాడుతోంది.తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని వీర్నమల ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఎస్సీ కాలనీలో ఉన్న బోరులో నీరు ఇంకిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కోవాల్సిన ఖర్మ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో వారంతా ఖాళీ బిందెలతో ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.చౌక దుకాణాల వద్ద రేషన్ కోసం లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని అమలు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని 27వ వార్డు చామంతిపురం రేషన్‌షాపు వద్ద మంగళవారం ప్రజలు రేషన్ కోసం గంటల కొద్దీ పడిగాపులు కాశారు. గంటల కొద్దీ నిలబడలేక తాము తెచ్చుకున్న సంచులను వరుస క్రమంలో పెట్టారు. సమీపంలోని 28వ వార్డులో, మరికొన్ని మండలాల్లో సైతం ఇదే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజలు గత ప్రభుత్వ పాలనే బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు -
Dragon Fruit: ఎకరాకు 8 లక్షల పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!
ఆరోగ్యదాయినిగా పేరుగాంచిన డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కాసుల పంట పండిస్తోంది. ఉద్యాన పంటలకు నెలవైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు లాభదాయకంగా సాగు చేస్తున్న పండ్ల రకాల జాబితాలో తాజాగా డ్రాగన్ ఫ్రూట్ చేరింది. సేంద్రియ పద్ధతుల్లో డ్రాగన్ సాగు చేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు మంచి లాభాలు కళ్లజూస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే కేవీ రమణారెడ్డి. అనంతపురం శివారు సిండికేట్‌నగర్‌కు చెందిన రమణారెడ్డి గార్లదిన్నె మండలం మర్తాడులో 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు మరో 6 ఎకరాల్లో ఖర్జూరం సాగు చేస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకున్న రమణారెడ్డి రెండేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టి, రెండో ఏడాదే మంచి దిగుబడులు సాధించారు. 2 వేల మొక్కలు.. రెండేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్ రెడ్ రకం 6 వేల మొక్కలను తెప్పించిన రమణారెడ్డి మూడు ఎకరాల్లో నాటారు. చెట్ల మధ్య 8 అడుగులు, సాళ్ల మధ్య 10 అడుగులు దూరంలో సిమెంటు స్థంభాలు నాటి... స్థంభానికి నాలుగు మొక్కలు నాటారు. గుంత తీసి అందులో వేపపిండి, వర్మీకంపోస్టు, పశువుల ఎరువు వేసి.. ఎకరాకు 500 సిమెంటు స్థంభాల చుట్టూ 2 వేల మొక్కలు నాటారు. స్తంభం పైభాగంలోకి మొక్కలకు ఆలంబనగా పాత టైరును అమర్చారు. ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి మొత్తమ్మీద పంటకు తొలి ఏడాది మొక్కల ఖర్చు, సిమెంటు పోలు, రింగు తదితర వాటిని పరిగణలోకి తీసుకుంటే ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.50 వేలకు కాస్త అటుఇటుగా ఖర్చవుతుంది. నీళ్లు పెద్దగా అవసరం లేదు. డ్రిప్ ద్వారా 15 రోజులకో తడి ఇస్తున్నాను. వర్షాకాలంలో అవసరం లేదు. ఎకరాకు ఏటా 10 నుంచి 12 టన్నుల వరకు డ్రాగన్ పండ్ల దిగుబడి వస్తుందని అంటున్నారు రమణారెడ్డి. వేపనూనె పిచికారీ చేస్తే ఎర్రచీమల సమస్య అదుపులోకి వచ్చిందని రమణారెడ్డి వివరించారు. ఏడాదికి రెండు సార్లు ఐదు ట్రాక్టర్లు పశువులు ఎరువు వేశారు. కొంత కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వాడాను. పండ్ల కోతకు కూలీల అవసరం తక్కువే. తాను, తన భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు ముగ్గురు కూలీలతో సరిపోతోందన్నారు. మొక్కల ద్వారా ఆదాయం అంట్లు కట్టి, మొక్కల అమ్మకం మొదలు పెట్టారు. ఒక కటింగ్‌ను రూ.70కి, రెండు నెలలు పెంచిన మొక్కను రూ.100కి అమ్ముతున్నానని రమణారెడ్డి చెబుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో డ్రాగన్ మించిన ఆదాయాన్నిచ్చే పంట మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రెడ్ వెరైటీ.. ఎండను తట్టుకుంటుంది.. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనంతపురం జిల్లా నేలలు, వాతావరణం అనుకూలమే. ఇప్పటికి 20 మందికి పైగా రైతులు 70–80 ఎకరాల్లో డ్రాగన్ సాగు చేపట్టారు. మొదటి ఏడాది పెట్టుబడి ఎక్కువ అయినా మున్ముందు లాభదాయకంగా ఉంటుంది. ఒక్కసారి నాటుకుంటే గరిష్టంగా 25–30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. డిసెంబర్–మే మధ్య కాలంలో ప్రూనింగ్, పోషకాల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు చేపడితే ఇబ్బంది ఉండదు. మొక్కల ఎంపికలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. మర్తాడు రైతు రమణారెడ్డి సాగు చేసిన రెడ్ వెరైటీ డ్రాగన్ పండ్లు సైజు పరంగా, దిగుబడి పరంగా మంచిదే. ఎండకు తట్టుకుంటుంది. – డా. బి.విమల (94938 31009), ఉద్యాన శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా రెండో ఏడాదే అధికాదాయం డ్రాగన్ ఫ్రూట్ పంట ద్వారా రెండో ఏడాది ఊహించిన దానికన్నా అధిక దిగుబడి వచ్చింది. మూడు ఎకరాల్లో ఇప్పటికే 18 టన్నుల పండ్లు అమ్మాను. చెన్నై, బెంగళూరు వ్యాపారులతోపాటు స్థానిక వ్యాపారులు కూడా తీసుకెళుతున్నారు. కేవీ రమణారెడ్డి పండు సైజును బట్టి టన్ను రూ.1.35 లక్షల నుంచి రూ.1.65 లక్షల వరకు పలికింది. కాపు బాగున్నందున ఇంకా రూ.15 టన్నులకు పైగా దిగుబడి రావచ్చు. ఈ లెక్కన రూ.50 లక్షలకు పైగా రావచ్చనుకుంటున్నా. నాటిన రెండో ఏడాది నుంచే రెమ్మలు కత్తిరించి అమ్ముతున్నా. ఇప్పటికి రూ.24 లక్షల విలువ చేసే మొక్కలు అమ్మాను. – కేవీ రమణారెడ్డి, డ్రాగన్ ఫ్రూట్ రైతు , (93469 25502, 94908 56363), మార్తాడు, గార్లదిన్నె మం., అనంతపురం జిల్లా – గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ ఫొటోలు: బి.మహబూబ్‌బాషా చదవండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం! -
Photo Feature: మిడ్ పెన్నార్ రిజర్వాయర్.. కొత్త అందాలు
చుట్టూ పచ్చని గిరులు.. ఆ పైనే గాలిమరలు.. మధ్యన పెన్నార్ నీరు.. పక్కన గలగల పారే కాలువ.. ఏపుగా పెరిగిన చెట్లు.. స్వచ్ఛమైన గాలి..స్వేచ్ఛగా తిరుగుతున్న పశుపక్ష్యాదులు... సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల వద్ద గల మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) కొత్త అందాలను సంతరించుకుని పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. – డి.మహబూబ్‌బాషా, సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
లవ్‌చాట్.. మేడ్ ఇన్ ఆంధ్రా
సాక్షి, అనంతపురం: వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్.. ఇవన్నీ యువతకు సుపరిచితమే. ఇదే తరహాలో ఇప్పుడు కొత్తగా మరో యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటారా? ఇది మేడ్ ఇన్ ఆంధ్రా. ఇంకా చెప్పాలంటే.. మేడ్ ఇన్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురానికి చెందిన సాయికుమార్ అనే విద్యార్థి ఈ ‘లవ్‌చాట్’ మెసేజింగ్ యాప్‌ను రూపొందించాడు. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం విలేకరులకు వెల్లడించాడు. సాయికుమార్ నాన్న శేఖర్, అమ్మ నాగలక్ష్మి. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతను శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాళసముద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై సాయికుమార్‌కు ఆసక్తి ఎక్కువ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటేషనల్ థింకింగ్ ఉపాధ్యాయుడు త్యాగేశ్వర్ నాయక్ మార్గదర్శకత్వంలో appinventor.mit.edu అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుని యువతకు ఆకర్షణగా ‘లవ్‌చాట్’ అనే యాప్‌ను సాయికుమార్ రూపొందించాడు. 5 సార్లు ప్రయత్నించి విఫలమైన తర్వాత 6వ సారి యాప్ రూపకల్పనలో విజయవంతమయ్యాడు. ఇది మెసెంజర్ యాప్‌గా పని చేస్తుంది. వాట్సాప్ మాదిరిగానే లవ్చాట్లోనూ స్నేహితులు, బంధువులతో చాటింగ్, ఫొటో షేరింగ్, ఫోన్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు లవ్‌చాట్ యాప్‌ను 150 మందికి పైగా డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. https://appsgeyser. com/15260267 అనే లింకు ద్వారా గూగుల్ క్రోమ్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
వదినతో వివాహేతరం సంబంధం.. మరో పెళ్లి చేసుకుంటే.. ఆమెతోనూ..
సాక్షి, అనంతపురం(గార్లదిన్నె): గత నెల 19న గార్లదిన్నె మండలం రామదాసుపేట సమీపంలో రైలు పట్టాలపై లభ్యమైన యువకుడి మృతదేహం కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగా సొంత తమ్ముడినే అన్న హతమార్చినట్లుగా నిర్దారణ కావడంతో సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ శివశంకర్ నాయక్ వెల్లడించారు. మడకశిర మండలం ఎర్రబొమ్మనపల్లికి చెందిన రంగనాథ్, అనంతరాజు (30) అన్నదమ్ములు. తన భార్యతో అనంతరాజు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం గమనించిన రంగనాథ్ కొన్నేళ్ల క్రితమే ఆమెను హతమార్చాడు. అనంతరం ఏడేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతోనూ అనంతరాజు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా రంగనాథ్ అనుమానాలు పెంచుకుని గొడవపడేవాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు యువకులతో కలిసి గార్లదిన్నె మండలం కల్లూరులో అద్దె ఇంటిలో ఉంటూ కేబుల్ పనుల్లో అనంతరాజు పాల్గొనసాగాడు. విషయం తెలుసుకున్న రంగనాథ్ గత నెల 19న రాత్రి కల్లూరుకు చేరుకుని మిద్దెపై నిద్రిస్తున్న అనంత రాజు గొంతుమీద ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. అనంతరం బెల్ట్‌ను గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. చదవండి: (ప్రేమ వివాహం.. కొత్తగా పరిచయమైన మరో ప్రియుడి మోజులో) మృతదేహాన్ని కారులో తీసుకుని రామదాసుపేట సమీపంలోని రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హతుడి భార్య సుజాత ఫిర్యాదు చేయడంతో కేసును గార్లదిన్నె పోలీసులకు రైల్వే పోలీసులు రెఫర్ చేశారు. దర్యాప్తులో అనంతరాజును రంగనాథ్∙హతమార్చినట్లుగా నిర్ధారణ కావడంతో సోమవారం అనంతపురం రూరల్‌మండలం సోముల దొడ్డి వద్ద అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. -
దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి
సాక్షి, గార్లదిన్నె (అనంతపురం): అదనపు కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో భార్యను, మూడు నెలల పసికందును హతమార్చిన ఘటన గార్లదిన్నె మండలం కల్లూరులో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం సంకలాపురం గ్రామానికి చెందిన వెంకటేశులు, వెంకటేశ్వరమ్మ పెద్ద కుమార్తె పుష్పలత (24)ను గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన కుమ్మర తరుణ్‌కుమార్‌కు ఇచ్చి 2020 డిసెంబర్ 24న వివాహం జరిపించారు. కట్న కానుకల కింద 30 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఇచ్చారు. తరుణ్‌కుమార్ కల్లూరులో రైస్ మిల్లు నిర్వహించడంతో పాటు ఇటుకల వ్యాపారం కూడా చేస్తున్నాడు. పుష్పలతకు మూడు నెలల క్రితం ఆడబిడ్డ జన్మించింది. అప్పటి నుంచి అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. ఆడబిడ్డ పుట్టిందని సూటిపోటి మాటలు అనడంతో పాటు మరింత కట్నం తేవాలంటూ పుష్పలతను భర్త, అత్త, మామ వేధించేవారు. చదవండి: (మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..) ఆమె పది రోజుల క్రితం పసిబిడ్డతో కలిసి అత్తారింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం పామిడి సంగమేశ్వర ఆలయంలో అభిషేకం చేయించి పాపకు మోక్షిత అని పేరు పెట్టారు. అయితే.. ఆదివారం తెల్లవారుజామున ఇంటి పైగదిలో పుష్పలత, చిన్నారి మోక్షిత విగతజీవులై కనిపించారు. ఈ విషయమై స్థానికుల నుంచి సమాచారం అందడంతో డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ శివశంకర్ నాయక్, ఎస్ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పుష్పలత తండ్రి వెంకటేశులు ఫిర్యాదు మేరకు భర్త తరుణ్‌కుమార్, మామ ఓబిలేసు, అత్త లక్ష్మిదేవి, ఓబిలేసు చిన్నల్లుడు హరిపై కేసు నమోదు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భార్య పుష్పలతను గొంతు నులిమి హతమార్చినట్లు, పసికందు ముక్కును మూసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తరుణ్‌కుమార్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. రూ.50 లక్షలివ్వాలని వేధించారు.. అప్పులు తీర్చేందుకు రూ.50 లక్షలు తీసుకురావాలని తన కుమార్తెకు పదేపదే ఫోన్ చేసి అత్తింటివారు వేధించారని మృతురాలి తండ్రి వెంకటేశులు ఆరోపించారు. తాము కూడా అప్పుల్లో ఉన్నప్పటికీ కూతురి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మరో రూ.20 లక్షలు ఇచ్చామని తెలిపారు. అయినా అత్తింటి వేధింపులు ఆగలేదని, మిగిలిన డబ్బు తేవాలని ఒత్తిడి చేసేవారని వివరించారు. తన పరిస్థితి బాగోలేకపోవడంతో ఇక డబ్బివ్వలేనని చెప్పానని, దీంతో కూతుర్ని, ఆస్తికి అడ్డొస్తుందన్న కారణంతో మనుమరాలిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారని తెలిపారు. -
‘అగ్రి’డబ్బు రావాలంటే.. బాబు జాబు పోవాలి
సాక్షి, గార్లదిన్నె : రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు రావాలంటే బాబు జాబుపోవాలి..వైఎస్ జగన్మోహన్రెడ్డి రావాలని అనంతపురం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి, అగ్రిగోల్డ్ బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, జేఏసీ నాయకులు సుధాకర్‌రెడ్డి తదితరులు తెలిపారు.ఆదివారం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు వై.నారాయణరెడ్డి నివాసంలో ఆయన ఆధ్వర్యంలో అగ్రీగోల్డ్ బాసట కమిటీ సభ్యులు, జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. పేదలు,నిరుపేదలు రోజూ కష్టపడి సంపాదించిన డబ్బు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారని, సంస్థ దివాలా తీయడంతో ఇక తమ డబ్బులు రావని, మనస్థాపంతో రాష్ట్రంలో 263 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. ఈసమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు గుర్తించారన్నారు. గత ఏడాది డిసెంబర్ 28న అగ్రిగోల్డ్ అసోసియేషన్ అమర నిరాహారణ దీక్షలు చేయగా, ప్రభుత్వం మాత్రం రూ.250 కోట్లు డబ్బులేని జీవో ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే మన అందరి ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మూడు నెలలో రూ.1,183 కోట్లు విడుదల చేసి, రూ.20వేల లోపు ఉన్న 14 లక్షల మందికి ఉపశమనం కలిగిస్తామని భరోసా ఇచ్చారన్నారు. శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి జొన్నల గడ్డ పద్మావతి, ఎంపీ అభ్యర్థి తలారి పీడీ రంగయ్యతోపాటు జిల్లాలో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అఖండ మోజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈనెల 8న జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాసట కమిటీ జేఏసీ నాయకులు రాజగోపాల్, దస్తగిరి, రామచంద్ర ఆచారి, కుళ్లాయప్ప, గోపాల్ రెడ్డి, కృష్టమోహన్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
తల్లీ పిల్లల గొంతులు కోశారు
ఎవరిది ప్రేమ.. ఏది ప్రేమ... పిల్లలు ప్రేమించుకుంటే పెద్దల ప్రేమ ప్రాణాలు తీస్తుందా? కంటి పాపలనే కాలరాస్తుందా? పెంచిన చేతులే పీకలు కోసే పగగా మారుతుందా? రోజులు.. నెలలు.. సంవత్సరాలు నిరీక్షించి మరీ విరుచుకుపడుతుందా? అవును.. ఆ ఇంట్లో ప్రేమ రక్తం చిందించింది. ప్రేమ పెళ్లి చేసుకున్న పాపానికి ఆ యువతి చిన్నాన్న కొడుకే యముడయ్యాడు. నాలుగేళ్ల తర్వాత కొడవలి పట్టి కసితీరా కుత్తుకలు కోశాడు. ఈ ఘటన శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నెలో బుధవారం సాయంత్రం కలకలం రేపింది. గార్లదిన్నె: ఓ దుండగుడు తల్లి, ఇద్దరు పిల్లలను గొంతులు కోసి హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం జరిగింది. గార్లదిన్నెకు చెందిన నారాయణ, సుబ్బమ్మ దంపతుల కుమారుడు బోయ నల్లప్ప నాలుగేళ్ల కిందట పామిడి మండలం కొత్తపల్లికి చెందిన శివయ్య, సరస్వతి దంపతుల చిన్న కుమార్తె మీనాక్షి(24)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి వితేష్(3), కీర్తి(1) పుట్టారు. బుధవారం నల్లప్ప పని నిమిత్తం బస్టాండ్‌కు వెళ్లాడు. నల్లప్ప తల్లి సుబ్బమ్మ తమ ఇంటి సమీపాన గల పీహెచ్‌సీకి వెళ్లింది. ఇంట్లో మీనాక్షి, వితేష్, కీర్తి మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి కత్తితో మీనాక్షి, వితేష్, కీర్తిల గొంతులు కోసి హత్య చేశాడు. అక్కడకు వచ్చిన సుబ్బమ్మ.. తమ ఇంట్లో నుంచి రక్తపు మరకలతో వస్తున్న ఆ దుండగుడిని అడ్డుకోగా ఆ వ్యక్తి బైక్‌పై పారిపోయాడు. ఇంట్లోకి వెళ్లిన ఆమె.. మీనాక్షి, వితేష్, కీర్తి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేసరికి వారు చనిపోయారు. ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ వెంకట్రావ్, సీఐ ప్రసాద్‌రావు, ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి భర్త నల్లప్ప మాట్లాడుతూ.. మీనాక్షి చిన్నాన్న కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆరోపించాడు. తమ పెళ్లికి మీనాక్షి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. కసాపురం వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. కొన్నాళ్లకు మీనాక్షి తల్లిదండ్రులు తమ ఇంటికి వస్తూపోతుండేవారని వివరించాడు. మీనాక్షి చిన్నాన్న కొడుకు తమతో గొడవ పడ్డాడని, వారే ఈ హత్యలు చేయించి ఉంటారని ఆరోపించాడు. డీఎస్పీ వెంకట్రావ్ మాట్లాడుతూ.. మీనాక్షి, నల్లప్పలది ప్రేమ వివాహమైనందున ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ముగ్గురిని హత్యచేసి పరారైన నిందితున్ని పోలీసులు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి చిన్నాన్న కుమారుడు హరి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడైంది. గార్లదిన్నె మండలంలోని ఉల్లికంట్టిపల్లి గ్రామంలోని తన అత్తగారింటి వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతోనే అంతమొందించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తల్లి ఇద్దరు పిల్లల హత్య బుధవారం సాయంత్రం 5.30 గంటలకు : నిందితుడు గార్లదిన్నెలోని మీనాక్షి ఇంటి దగ్గరకు వచ్చాడు. 5.45: ఆ ఇంట్లోకి వెళ్లి తల్లి మీనాక్షితో పాటు కుమారుడు వితేష్, కుమార్తె కీర్తిని కత్తితో హతమార్చాడు. 6.00: ఇంటి బయటకు వచ్చిన నిందితుడిని మీనాక్షి అత్త సుబ్బమ్మ చూసి.. ఎవరు బాబు నువ్వని ప్రశ్నించింది. 6.02: నిందితుడు ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు 6.05: సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్లి హత్యలను చూసి కేకలు వేసింది 6.10: చుట్టు పక్కల ఉన్న జనమంతా పోగయ్యారు 6.25: స్థానిక ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో వచ్చారు 6.50: డీఎస్పీ వెంకట్రావ్ , సీఐ ప్రసాద్‌రావులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7.10: డాగ్ స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది 7.45: డాగ్ స్క్వాడ్ తనిఖీలు పూర్తయ్యాయి 8.20: జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి వచ్చారు 8.30: మీనాక్షి భర్త నల్లప్పను ఎస్పీ విచారించారు 9.30: నిందితుడు హరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అనంతపురం జిల్లాలో దారుణం
-
గార్లదిన్నెలో వాహనం ఢీకొని చిరుత మృతి
-
ఇల్లూరులో విషాదం
మామిడి తోటకు కాపలా వెళ్లి.. తెల్లవారుజామున ఇంటికి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరు రైతులను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు వీరిని ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఇద్దరి మృతితో ఇల్లూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. గార్లదిన్నె: గుడ్డాలపల్లి క్రాస్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన రైతులు ఎరికిల ఆంజనేయులు(62) మాల ఓబిలేసు (37) మరో నలుగురు కలిసి తిమ్మంపేట సమీపంలోని సుంకిరెడ్డి తోటలో మామిడికాయలు కోసుకునేందుకు లీజుకు తీసుకున్నారు. రోజూ రాత్రి, పగలు ఇద్దరు చొప్పున తోటకు కాపలాగా ఉండేవారు. శుక్రవారం కాపలా విధుల్లోకి వచ్చిన ఆంజనేయులు, ఓబులేసు శనివారం తెల్లవారుజామున ఇంటికి బయల్దేరారు. గుడ్డాలపల్లి క్రాస్ సమీపాన 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న హోటల్లో టీ తాగేందుకు వెళుతున్న సమయంలో కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వీరిని ఢీకొంది. దీంతో ఇద్దరూ పైకి ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ సమాచారం అందిన వెంటనే సీఐ శివనారాయణస్వామి ఎస్ఐ రామ్‌ప్రసాద్, సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుడు ఆంజనేయులుకు భార్య రామక్క, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. మరో మృతుడు ఓబిలేసుకు భార్య మాలశ్రీ ఆరు నెలల పాప ఉంది. దేవుడా ఎంతపని చేశావయ్యా..? రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు ఒకేసారి మృతి చెందడంతో ఇల్లూరు గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు స్వగ్రామానికి చేరగానే కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో మిన్నంటింది. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో రెండు కుటుంబాలూ వీధినపడ్డాయి. ‘దేవుడా ఎంతపని చేశావయ్యా? కూలి పనులు చేసుకుని జీవనం సాగించే మాకు ఎంత శిక్ష విధించావయ్యా’ అంటూ మృతదేహాలపై పడి భార్యా, పిల్లలు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
ఆత్మాభిమానికి పెద్దమ్మ
రెక్కలు ముక్కలు చేసుకుని సాయంత్రానికి నాలుగు రాళ్లు చేతిలో పడితే.. ఆ డబ్బుతో వండివార్చిన పచ్చడి మెతుకులైనా పరమాన్నం తిన్నట్లే ఉంటుంది. ఈ మనసు ఎందరికుంటుంది? అన్ని అవయవాలూ బాగున్నా.. రోడ్ల వెంట చేయి చాస్తున్న మనుషులు నిత్యం తారసపడుతుంటారు. ఇదే సమయంలో ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులకూ ఇవే రోడ్లు ఆశ్రయం. ఊరికే డబ్బు వస్తుందంటే ఎవరికి చేదు అనుకుంటాం. కానీ 90 ఏళ్లు పైబడిన ఆ అవ్వకు తనది కాని ఒక్క రూపాయి కూడా పాముతో సమానం. అయినవాళ్లకు ఆమె అక్కరకు రానిదైనా.. జానెడు పొట్ట నింపుకునేందుకు అనాథగా రోడ్డెక్కింది. ఉంటే తింటుంది. లేదంటే పస్తులుంటుంది. ఎవరైనా జాలిపడి పదో పరకో ఇవ్వజూపితే తాను బిచ్చగత్తెను కాదని నవ్వుతూ చెబుతుంది. తాను చేయగలిగిన పని చెబితే చేస్తానని.. ఆ తర్వాత మీరు ఇవ్వదలిచిన డబ్బు ఇవ్వండని ముందుకు కదులుతుంది. ఎండ లేదు.. వాన లేదు.. చలిగాలికీ బెదరదు.. ఫుట్‌పాత్‌పైనే బతుకీడుస్తున్న ఈ చెన్నమ్మ ఆత్మాభిమానానికి పెద్దమ్మే మరి. గార్లదిన్నె మండలం రంగనాథపురానికి చెందిన చెన్నమ్మకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అవసాన దశలో ఉన్న చెన్నమ్మను వారు భారమనుకున్నారేమో.. పదేళ్ల క్రితం నిర్దయగా వదిలేశారు. అప్పటి వరకు ఎంతో పరువుగా బతికిన ఊళ్లో ఆమె ఇమడలేకపోయింది. ఉన్న ఊరు వదిలేసి అనంతపురానికి చేరుకుంది. బతికేందుకు రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఓ కర్రను ఊతంగా పట్టుకుని నడుస్తూ.. రోడ్డు పక్కన పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ గుత్తిరోడ్డులోని ఓ గుజరీలో విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఆకలిదప్పికలు తీర్చుకుంటోంది. ఎవరైనా జాలితో అన్నమో.. డబ్బో ఇచ్చేందుకు ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరిస్తుంది. తనకు చేతనైనా పనిచేసిపెడతానని, అప్పుడే తనకు ఆ డబ్బు ఇవ్వాలని సూచిస్తోంది. ఇదిగో.. టీ తాగు చచ్చే వరకూ ఒకరిపై ఆధారపడకుండా తన రెక్కల కష్టంపైనే జీవిస్తానంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న చెన్నమ్మను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. చివరకు తనకు వస్తున్న పింఛన్‌ను బిడ్డలు లాక్కెళుతున్నా.. ఆమె నోరు మెదపడం లేదు. ఇదంతా తన ఖర్మ అంటూ కర్మసిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటుంది. కొసమెరుపేమిటంటే.. తనను ఫొటోలు తీస్తుండగా గమనించిన ఆమె ఎందుకు అంటూ ఆరా తీసింది. ‘ఎండలో చాలా కష్టపడుతున్నావు నాయనా.. ఇదిగో ఈ డబ్బు తీసుకుని టీ తాగు’ అంటూ ఓ ఐదు రూపాయలు తీసి ఇవ్వజూపినప్పుడు కెమెరా కళ్లు చెమ్మగిల్లాయి. అనంతపురంలోని గుత్తి రోడ్డులో చెత్తకుండి నుంచి వ్యర్థాలు ఏరుకుంటూ.. సేకరించిన వ్యర్థాలను గుజరీ షాపులో వేస్తున్న చెన్నమ్మ -
బెత్తం విసిరిన టీచర్.. కంటిచూపు కోల్పోయిన విద్యార్థి
గార్లదిన్నె : ఓ విద్యార్థిపైకి టీచర్ బెత్తం విసరడంతో కంటి చూపు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెలో చోటు చేసుకుంది. స్థానిక పీడబ్ల్యూ కాలనీలో ముస్లిం, మైనార్టీ గురుకుల పాఠశాలలో అనంతపురంలోని రుద్రంపేటకు చెందిన నాగేంద్రనాయక్, లక్షి దంపతుల ఏకైక కుమారుడు పవన్‌కుమార్‌నాయక్ 6వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాల తరగతులు ముగిసిన తర్వాత విద్యార్థులంతా గ్రౌండ్లో ఆడుకొంటుండగా అహమ్మద్ అనే ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు బెత్తం తీసుకొని విద్యార్థులపైకి విసిరేశారు. దీంతో పవన్‌కుమార్ నాయక్ అనే విద్యార్థి ఎడమ కంటికి తగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే పీఈటీ మునేనాయక్ విద్యార్థి బంధువులకు సమాచారం అందించారు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన చికిత్స నిమిత్తం అనంతపురంలోని ప్రకాశ్ కంటి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కంటి లోపల గుడ్డు దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యంకోసం వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. కంటిచూపు పోయినట్లు వైద్యులు తెలపడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరైంది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఉపాధ్యాయుడు బెత్తం విసరడం వాస్తవమేనని, ప్రమాదవశాత్తూ జరిగిందన్నారు. -
పోటాపోటీగా రాతిదూలం పోటీలు
గార్లదిన్నె (శింగనమల) : గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం మండల కేంద్రం గార్లదిన్నెలోని ఇందిరమ్మ కాలనీ షిర్డిసాయిబాబా దేవాలయం వద్ద ముంటిమడుగు యల్లారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. పోటీల్లో 20 జతల వృషభాలు పాల్గొన్నాయి. అనంతపురానికి చెందిన ఓబుళపతి ఆచారి వృషభాలు 5,500 అడుగులు రాతిదూలం లాగి విజేతగా నిలిచాయి. కర్నూలు జిల్లా సంకలాపురం గంగుల బ్రహ్మయ్య వృషభాలు ద్వితీయ, వైఎస్సార్ జిల్లా తంపెట్ల రవీంద్రారెడ్డి వృషభాలు తృతీయ, గుత్తి మండలం నేమతాబాద్ సూర్యనారాయణరెడ్డి వృషభాలు నాలుగో స్థానం, పెద్దవడగూరు మండలం చాగల్లు ఆదినారాయణ వృషభాలు ఐదో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులకు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.2500 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు విశాలాక్షి, ముంటిమడుగు కేశవరెడ్డి, గేట్ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ రామక్రిష్ణ, మహేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఊరిస్తున్న ‘మోడల్’ వసతి
– అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తున్న ప్రభుత్వం – ఏటా విద్యార్థులకు తప్పని తిప్పలు – ఈసారైనా ప్రారంభించేరా? చాలామంది పేద పిల్లలు ప్రతిభ ఉండి సరైన ప్రోత్సహం లేక చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారికోసం ఆంగ్లమాధ్యమంతో కూడిన మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉత్తమ విద్య, అత్యుత్తమ సౌకర్యాలు అంటూ చేసిన ప్రకటనలు నేడు నీటమూటలయ్యాయి. నాలుగేళ్లు పూర్తయినా కనీస వసతి గృహాలు కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ‘మోడల్ చదువు’ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లు సమస్యలతో సతమతమవుతన్నాయి. వీటి ఏర్పాటు వెనుక లక్ష్యం పాలకుల పుణ్యామా అని నెరవేరే సూచనలు కనిపించడం లేదు. - అనంతపురం ఎడ్యుకేషన్ మోడల్ స్కూళ్లలో వసతి ఏర్పాటుపై ప్రభుత్వం వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. 2013–14 విద్యా సంవత్సరంలో ఈ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించినా.. నేటికీ వసతి కల్పించలేకపోయింది. అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తోంది తప్ప ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వ అలసత్వం.. ఇతర విద్యా సంస్థలకు మోడల్‌గా నిలవాల్సిన ఈæ స్కూళ్లు ప్రభుత్వ అలసత్వం కారణంగా నిర్వీర్యమవుతున్నాయి. 2012–13 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 63 మండలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు అనుకూలించక 2013–14 సంవత్సరానికి వాయిదా వేశారు. ఆ ఏడాది కూడా తొలివిడతగా కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. ప్రభుత్వంలో జవాబుదారీ తనం లోపించడం... నిధుల కొరత కారణంగా తక్కిన మండలాల్లో నేటికీ ఈ స్కూళ్లు ఏర్పాటు కాలేదు. ‘వసతి’ కల్పనలో అంతులేని నిర్లక్ష్యం ప్రారంభ సంవత్సరంలో హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీ పడి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి వసతి విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆయా మండల పరిధిలో సుదూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకోలేక, వదిలిపెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల తల్లిదండ్రులు అద్దె ఆటోలను మాట్లాడి రోజూ పిల్లలను బడికి పంపుతున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి, కనుముక్కల, ఓబుళంపల్లి, వెంకటాంపల్లి, పులేటిపల్లి తదితర గ్రామాల నుంచి వందమంది దాకా విద్యార్థులు రోజూ ఆటోల్లో స్కూల్‌కు వస్తున్నారు. మోడల్ స్కూల్ ఉన్న ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి. ఊరిస్తున్న అధికారులు వసతి కల్పిస్తామంటూ ఏటా ప్రారంభంలో ప్రకటించడం తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. అన్ని తరగతులకు హాస్టల్ వసతి ఉంటుందని చెప్పిన అధికారులు తర్వాత బాలికలకు మాత్రమే అన్నారు. అది కూడా 9 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న బాలికలకు మాత్రమే కల్పిస్తామని చెప్పుకొచ్చారు. పోనీ అదైనా అమలు చేశారా అంటే లేదు. ప్రతి హాస్టల్లోనూ 9 నుంచి ఇంటర్ వరకు బాలికలకు వంద సీట్లు కేటాయిస్తామన్నారు. జిల్లాలో 25 స్కూళ్లకు గాను 19 స్కూళ్లలో ప్రారంభించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు. ఒక్కో స్కూల్‌కు రూ. 61 వేలతో వంటపాత్రలు కొనుగోలు చేశారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. కానీ ఈసారి స్కూళ్లు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా వసతిపై అధికారుల నుంచి స్పష్టత లేదు. ఇదిలా ఉండగా హాస్టళ్లు ప్రారంభించాలంటే ముందుగా మ్యాట్రిన్, చౌకీదారు, హెడ్, హెల్పర్ కుకింగ్ పోస్టులు భర్తీ చేయాలి. ఇప్పటిదాకా వీటి భర్తీ ప్రక్రియ జరగలేదు. తొలివిడతగా 19 స్కూళ్లలో ప్రారంభం తొలివిడతగా జిల్లాలో 19 స్కూళ్లలో బాలికలకు వసతి కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కణేకల్లు, నల్లచెరువు, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రాయదుర్గం, విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాల్లో హాస్టళ్లు ప్రారంభించనున్నారు. అయితే ఇది ఎంత మాత్రం ఆచరణలో ఉంటుందో నమ్మశక్యంగా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఆటోలో వస్తున్నాం మా ఊరి నుంచి ఆదర్శ పాఠశాలకు 12 కిలోమీటర్ల దూరం ఉంది. హస్టల్ వసతి లేకపోవడంతో ప్రతిరోజూ ఆటోలో బడికి వెళ్లి వసుం్తన్నాం. ఇలా రోజూ తిరగడం వల్ల స్కూల్లో చెప్పిన పాఠాలను ఇంటి వద్ద అభ్యసన చేసేందుకు సమయం చాలడం లేదు. ఇబ్బందిగా ఉంది. హాస్టల్ వసతి కల్పిస్తే చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. – అరుణ, పదోతరగతి మడ్డిపల్లి, పుట్లూరు మండలం ఈ ఏడాది ప్రారంభిస్తామన్నారు ఈ సంవత్సరం నుంచి హాస్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. పాఠశాల ప్రారంభించి వారం రోజులు కావస్తున్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. హాస్టల్ లేకపోవడంతో పుట్లూరులోని మా బంధువుల ఇంటిలో ఉంటూ చదువుకోవాల్సి వస్తోంది. హాస్టల్ వసతి కల్పిస్తే బాగుంటుంది. – గంగవైష్ణవి, ఇంటర్ ప్రథమ సంవత్సరం, తాడిపత్రి -
గార్లదిన్నెలో బహిరంగసభ నిర్వహణపై కేసు
గార్లదిన్నె: వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 3వ తేది గార్లదిన్నెలో నిర్వహించిన బహిరంగసభపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. బహిరంగసభకు పోలీసులే అనుమతులు ఇచ్చినప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించారనీ, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని కేసు నమోదు చేశారు. ఆదేవిధంగా మేలుకొలుపు యాత్ర సందర్భంగా నార్పల బస్టాండు వద్ద బహిరంగ సభ నిర్వహించడంపై నార్పల పోలీసులు కేసు నమోదు చేశారు. -
శింగనమలకు ఏం చేశారో చెప్పండి?
- ఎస్సీ ఓట్లతో గెలిచి వారి సంక్షేమానికి పాతరేస్తున్న శమంతకమణి, యామినీబాల - రైతులకు అర టీఎంసీ నీళ్లు కూడా ఇవ్వలేని చేతగాని ప్రజాప్రతినిధులు - వీళ్ల తప్పులను ప్రశ్నిస్తే అరెస్టులు చేసి పాదయాత్రను ఆపేస్తారట - కాంట్రాక్టు పనులను కమీషన్లకు అమ్ముకునే వీరు నా గురించి మాట్లాడటమా? -పాదయాత్ర ముగింపు సభలో జొన్నలగడ్డ పద్మావతి ధ్వజం - పాదయాత్ర ముగించాం.. దమ్ముంటే టీడీపీ నేతలు రండి : మాజీ ఎంపీ అనంత - చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఎప్పుడో విశ్వాసం పోయింది : ఎమ్మెల్యే విశ్వ - ఘనంగా ముగిసిన పాదయాత్ర.. పద్మావతిని అక్కున చేర్చుకున్న ఆరు మండలాల ప్రజలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ‘స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ యామినీబాల ఎస్సీల ఓట్లతో గెలిచారు. ఆమె తల్లి శమంతకమణి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తల్లీకూతుళ్లు ఈ మూడేళ్లలో ఎస్సీలకు ఏ ఒక్క మేలైనా చేశారా? కాంట్రాక్టు పనులు వస్తే కమీషన్లకు అమ్ముకుంటున్నారు. అవినీతి డబ్బులకు కక్కుర్తి పడుతున్నారు. రైతులకు సాగునీరు ఇవ్వలేరు. కలుషితనీరు తాగి కిడ్నీలు పాడవుతున్న పుట్లూరు, యల్లనూరు మండలాల గురించి పట్టించుకోవడం లేదు. ఈ మూడేళ్లులో నియోజకవర్గానికి గానీ, ఎస్సీలకు కానీ ఫలానా మేలు చేశామని దమ్ముంటే చెప్పండి’ అని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి సవాల్ విసిరారు. ‘మేలుకొలుపు’ పేరుతో గత నెల 26న యల్లనూరులో చేపట్టిన పాదయాత్ర శనివారం గార్లదిన్నెలో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. పద్మావతి మాట్లాడుతూ.. ‘పాదయాత్ర ఆపాలని, నన్ను అరెస్టు చేయాలని ప్రభుత్వం, పోలీసులు చూశారు. ఎందుకని ప్రశ్నిస్తే నేను ప్రజలను రెచ్చగొట్టానని అంటున్నారు. వ్యవసాయానికి నీళ్లిచ్చారా? రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణం మాఫీ అయిందా? ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చారా? అని అడిగితే రెచ్చగొట్టినట్టా?! మీరు చేసిన వెధవ పనులకు ప్రజలు ఎప్పుడో రెచ్చిపోయి ఉన్నారు. ఎన్నికలొస్తే ఏస్థాయిలో రెచ్చిపోతారో మీరే చూస్తారు. తరిమెలలో నన్ను అరెస్టు చేయాలనుకున్నారు. గ్రామంలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తరలివచ్చి అడ్డుగా నిలిచారు. అలాగే యాత్రను నిర్వీర్యం చేయాలని ప్రతి గ్రామంలో మాకంటే ముందుగానే పోలీసులు వెళ్లి ప్రజలను భయపెట్టారు. అయినా ప్రజలు తరలివచ్చారు. యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ 9 రోజులను నా జీవితంలో మరవలేను. హెచ్చెల్సీ కింద 1 నుంచి 9 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. మూడేళ్లలో ఒక్కసారైనా నీళ్లివ్వలేదు. శింగనమలకు అర టీఎంసీ ఇస్తే రైతులు బతుకుతారని అడిగాం. కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేశాం. హెచ్చెల్సీ ఎస్ఈని, కలెక్టర్‌ను కలిశాం. కల్లూరు వద్ద హైవేపై ధర్నా చేశాం. అయినా చుక్కనీరు ఇచ్చిన పాపాన పోలేదు. సుబ్బరాయసాగర్ నుంచి పుట్లూరు, యల్లనూరుకు తాగునీరు కూడా ఇవ్వలేద’ని పద్మావతి వివరించారు. నేను సంపూర్ణ ఎస్సీని కాదట ‘నేను రెడ్డి కులస్తుణ్ని చేసుకున్నందుకు సంపూర్ణ ఎస్సీని కాదంటున్నారు. ఎస్సీలు దైవంగా భావించే అంబేడ్కర్ భార్య అస్వస్థతతో చనిపోతే బ్రాహ్మణ మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఆయన సంపూర్ణ ఎస్సీ కాదా?’ అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఎïస్సీలకు ఉచితంగా కరెంటు వచ్చేదని, ఇప్పుడు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. యాత్రను ముగించాం..దమ్ముంటే రండి - వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. యాత్రను ఆపకపోతే బదిలీ చేయిస్తామని డీఎస్పీని బెదిరించారు. యాత్ర ముగించాం. గార్లదిన్నెలో ఉన్నాం. దమ్ముంటే వచ్చి అడ్డుకోండి. ఎమ్మెల్యేగా యామినీబాల, ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారు? యాడికి కాలువకు నీళ్లివ్వకపోగా ఇప్పుడు రూ.600కోట్లు దోపిడీ చేసేందుకు దివాకర్‌రెడ్డి సిద్ధమయ్యారు. కరువు పేరు చెప్పి అనంతపురానికి వందలకోట్ల పనులు మంజూరు చేయించి దోపిడీ చేస్తూ శవాలపై చిల్లర ఏరుకునేలా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 267 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత జూన్ నుంచే 68 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. జిల్లాకు నీటి సమస్య తీర్చకుండా నిద్రమత్తులో ఉన్నట్లు నటిస్తే సూదులతో గుచ్చి నిద్రలేపుతాం. బాబు అవినీతిలో కూరుకుపోయారు - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఎప్పుడో విశ్వాసం పోయింది. అవినీతిలో చంద్రబాబు పీకల్లోతు మునిగిపోయారు. చివరకు తన మనవడికి ‘అ’అంటే అమరావతి, ‘ఆ’ అంటే ఆదాయం అని అక్షరాభ్యాసం చేయించి ఇప్పటి నుంచే ఆదాయమార్గాలు నేర్పుతున్నారు. ఏక్షణం ఎన్నికలొచ్చినా చంద్రబాబు ప్రభుత్వ పతనం తథ్యం. ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నవ నిర్మాణ దీక్షలకు జనాలు రాకపోవడమే ఇందుకు నిదర్శనం. కరువు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ – శంకరనారాయణ, జిల్లా అధ్యక్షులు చంద్రబాబు కరువు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఆయన గత 9 ఏళ్ల పాలనలో కరువు చూశాం. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి. ముఖ్యంగా జిల్లాలో 60 ఏళ్లుగా లేని డొక్కల కరువు ఈ ఏడాది కనిపిస్తోంది. 2019లోపు ఏమి చేస్తాననేది చెప్పకుండా 2022, 2050లో ఏదో చేస్తానని ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు. ఒక్క హామీ అమలు కాలేదు – మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఎన్నికల ముందు సుమారు 600 హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీనీ అమలు చేయలేదు. జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎంతసేపూ ప్రతి పక్షాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. వైఎస్ హయాంలో లబ్ధి పొందని వారున్నారా? – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త వైఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందారు. జిల్లాలో లబ్ధి పొందని కుటుంబాన్ని చూపిస్తే నేను జిల్లా విడిచి వెళ్లిపోతా. పాలనంటే అలా ఉండాలి. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు వద్ద రెడ్లను జేసీ దివాకర్‌రెడ్డి తాకట్టు పెట్టాడు. పద్మావతిని గెలిపిస్తే 80 వేల ఎకరాలకు నీరు – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు సమన్వయకర్త వచ్చే ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతిని గెలిపిస్తే శింగనమల నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. వైఎస్ పథకాలతో గతంలో ఎమ్మెల్సీ శమంతకమణి కుటుంబం కూడా లబ్ధి పొందింది. పోలీసులు రౌడీలు, ఫ్యాక్షనిస్టులపై చర్యలు తీసుకోవాలి కాని గుంటనక్క చంద్రబాబు మాటలు విని సమస్యలు సృష్టించొద్దు. వారి కుటుంబాన్ని లోకలైజేషన్ చేసుకున్నారు – పెన్నోబులేసు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తనను ఎమ్మెల్యే చేస్తే శింగనమల చెరువును లోకలైజేషన్ చేసి ఏడాదికి రెండు పంటలకు నీళ్లిస్తామని చెప్పిన యామినీబాల...చెరువు సంగతి దేవుడికెరుక ఆమె ఇంటిని మాత్రం లోకలైజేషన్ చేసుకున్నారు. తనకు విప్, తల్లికి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారు. దళితబిడ్డ జొన్నలగడ్డ పద్మావతి మంచి మనసుతో పాదయాత్ర చేపట్టారు. ఆమెను ఆశీర్వదిస్తూ పాదయాత్ర వెంటే వర్షం కురిసింది. వచ్చే ఎన్నికల్లో ఆమెను గెలిపించేందుకు దళితులు సిద్ధం కావాలి. ప్రతి గ్రామంలోనూ వలసలు వెళ్లారు – శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర కరువు నెలకొంది. ఉపాధి లేక ప్రతి గ్రామంలోనూ వలసలు వెళ్లారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఇవేవీ జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కనిపించలేదా? -
గార్లదిన్నెలో బహిరంగ సభ జరుపుతాం
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత శింగనమల : వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు’ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా గార్లదిన్నెలో బహిరంగసభ జరిపి తీరుతామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ‘మేలు కొలుపు’ యాత్రలో భాగంగా గార్లదిన్నె మండలం కల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలో 4 లక్షల మంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారన్నారు. జిల్లాలో 267 మంది రైతులు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సాగు, తాగు నీరు అందడం లేదని, పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందని పాదయాత్ర ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని జొన్నలగడ్డ పద్మావతి ‘మేలుకొలుపు’ కార్యక్రమ చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వ విప్ ప్రభుత్వ పెద్దలతో చర్చించి పోలీసుల ద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ధర్మవరంలో ప్లెక్సీల కోసం మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కొట్టుకుంటే పోలీసులు దగ్గర ఉండి బహిరంగ సభ జరిపించలేదా..? అనంతపురం ఎమ్మెల్యే, ఎంపీ ఘర్షణ పడితే ప్రత్యేకంగా వారికి సభలు పెట్టించలేదా..? నవనిర్మాణ దీక్షల పేరుతో అనంతపురంలోని టావర్క్లాక్ వద్ద ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా సభలు పెట్టించారన్నారు. పోలీసులు ప్రజాసామ్యబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ‘మేలుకొలుపు’ పాదయాత్రను అడ్డుకుంటే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర చేపడుతామని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, సీనియర్ నాయకులు అమరేంద్రనాథ్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, ఎంపీటీసీ సభ్యులు జగ్గాల రవి, వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన రైలు
గార్లదిన్నె : సాధారణంగా రైలు ఇంజన్లు పట్టాలపై ఒక చోట నుంచి మరో చోటికి వెళ్తుంటాయి. కానీ ముంబాయి నుండి నాగపూర్‌కు 40 చక్రాల లగేజీ వాహనంలో రైలు ఇంజన్ ఆదివారం తరలించారు. మార్గమధ్యలో గార్లదిన్నె మండలం ఎగువపల్లి జాతీయ రహదారిపై డ్రైవర్ ఆ వాహనాన్ని నిలపడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు. -
పామిడి, గార్లదిన్నెలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో గరిష్ణ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటున్నాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పామిడి, గార్లదిన్నె మండలాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గుంతకల్లు, శింగనమల, కొత్తచెరువు, ముదిగుబ్బ, పుట్టపర్తి, కంబదూరు మండలాల్లో కూడా 38 నుంచి 39 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీల మధ్య కొనసాగాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 12 నుంచి 22 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. బత్తలపల్లి, కనేకల్లు, ఆత్మకూరు, పుట్లూరు, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, యాడికి, కదిరి, బొమ్మనహాల్, తాడిపత్రి, బెళుగుప్ప, పామిడి, ఓడీ చెరువు, కంబదూరు, కుందుర్పి మండలాల్లో గాలి వేగం 14 నుంచి 20 కిలో మీటర్ల వరకు నమోదైంది. -
పోటాపోటీగా షటిల్ పోటీలు
గార్లదిన్నె (శింగనమల) : మండలంలోని కల్లూరు గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ముందడుగు యూత్ సేవాసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం షటిల్ టోర్నమెంట్ జరిగింది. పోటీలను వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు అమరేంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. టోర్నీలో అనంతపురం, గార్లదిన్నె, పామిడి, గుత్తి, ధర్మవరం, కదిరి మండలాల నుంచి సుమారు 60 జట్లు పాల్గొన్నాయి. పోటీలను తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ముందడుగు యూత్ సేవా సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పెద్దపోతుల పవన్, రమేష్, పిల్లల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
గార్లదిన్నె : శిరివరం వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తుతెలియని యువకుడు (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శివనారాయణ స్వామి అందించిన వివరాల మేరకు.. గుడ్డాలపల్లి క్రాస్ సమీపాన 44వ నంబరు జాతీయరహదారికి అర కిలోమీటర్ దూరంలో గల వ్యవసాయ పొలాల్లో గుబురు వేప చెట్టులో ఓ యువకుడు ఉరికి వేలాడుతుండటాన్ని గొర్రెల కాపరులు గుర్తించారు. వీరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం నల్లగా మారి, గుర్తు పట్టలేని విధంగా ఉండి, దుర్వాసన వస్తుండటంతో.. వారం రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. సమీపంలో టోపీ, ఒక జత చెప్పులు, బీర్ బాటిల్ పడి ఉన్నాయి. శనివారం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. హత్య, ఆత్మహత్యనా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
కల్యాణం.. కమనీయం
గార్లదిన్నె : మండల పరిధిలోని కోటంకలో వెలసిన గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. శ్రీవల్లీ, దేవసేన సతీసమేత సుబ్రమణ్యుడికి సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపించారు. కార్యక్రమానికి చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. -
ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం
-
ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం
అనంతపురం: సికింద్రాబాద్ నుంచి తిరుపతి బయల్దేరిన సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని గార్లదిన్నె వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో రాళ్ల దాడి అనంతరం రైల్లోకి చొరబడిన దుండగులు ప్రయాణీకులను బెదిరించి 30 తులాల బంగారం, పెద్ద మొత్తంలో నగదు దోచుకెళ్లారు. అంతకుముందు దుండగుల రాళ్ల దాడితో ఒక్కసారిగా షాక్ కు గురైన ప్రయాణీకులు కేకలు వేశారు. దీంతో రైల్వే పోలీసులు పలుమార్లు కాల్పులు జరిపారు. రైల్వే పోలీసులు వచ్చే లోపే ప్రయాణీకులను దోచుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.