ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం | goons pelted on seven hills express, looted passengers | Sakshi
Sakshi News home page

ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం

Published Sun, Dec 4 2016 7:21 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

goons pelted on seven hills express, looted passengers

అనంతపురం: సికింద్రాబాద్ నుంచి తిరుపతి బయల్దేరిన సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని గార్లదిన్నె వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో రాళ్ల దాడి అనంతరం రైల్లోకి చొరబడిన దుండగులు ప్రయాణీకులను బెదిరించి 30 తులాల బంగారం, పెద్ద మొత్తంలో నగదు దోచుకెళ్లారు.
 
అంతకుముందు దుండగుల రాళ్ల దాడితో ఒక్కసారిగా షాక్ కు గురైన ప్రయాణీకులు కేకలు వేశారు. దీంతో రైల్వే పోలీసులు పలుమార్లు కాల్పులు జరిపారు. రైల్వే పోలీసులు వచ్చే లోపే ప్రయాణీకులను దోచుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement