looted
-
పట్టపగలు శాస్త్రవేత్త ఇంట్లో రూ. రెండు కోట్లు దోపిడీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఒక రిటైర్డ్ సైంటిస్ట్‌తో పాటు అతని భార్యను బంధించి దోపిడీకి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో తమ సొంత ఇంట్లో ఓ రిటైర్డ్ సైంటిస్ట్‌ను అతని భార్యను తుపాకీతో బెదిరించి, ఆ తర్వాత బందించి రూ. రెండు కోట్ల విలువైన నగలు నగదును దుండగులు దోచుకెళ్లారు. శాస్త్రవేత్త శిబు సింగ్, అతని భార్య నిర్మల ఇంట్లో ఉండగా, మధ్యాహ్నం సమయంలో ఇద్దరు యువకులు తాము కొరియర్ బాయ్స్మని చెబుతూ, వారి ఇంట్లోకి ప్రవేశించారు.తర్వాత వారు శిబు, అతని భార్య నిర్మలను తుపాకీతో బెదిరించి, బందించారు. ఈ క్రమంలో నిందితులు వారిపై దాడి చేశారు. దుండగుల తమ ఇంట్లోని రూ. రెండు కోట్ల విలువైన నగలు, నగదు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితులు ఈ విషయాన్ని తమ కుమారునికి తెలియజేశారు. ఆయన ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్లు ప్రారంభించారు. బాధితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటన తీరు చూస్తుంటే ఈ వ్యవహారంలో తెలిసినవారి ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇది కూడా చదవండి: వికాస్ యాదవ్ కథలో కొత్త మలుపు -
పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: ‘‘ఆటంక్, లట్కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు. గతంలో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతికి ఆస్కారమున్న పనులు తప్ప ప్రజలకు మంచి చేసే పనులు చేయలేదని ఆరోపించారు. మోదీ శుక్రవారం గుజరాత్లో బనస్కంతా జిల్లా కాంక్రేజ్ గ్రామంలో ఎన్నికల సభలో ప్రసంగించారు. కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. పేదలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవు కాంగ్రెస్ పాలనలో దేశంలో మధ్యలో వదిలేసిన 99 తాగునీటి సరఫరా పథకాలను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 4 లక్షల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేశామన్నారు. అవినీతి అడ్డుకోవడం కొందరికి నచ్చడం లేదని, అందుకే తనను దూషిస్తున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసి దొరికిపోయినవారు తనను తిడుతున్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోబీజేపీ మరోసారి విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. కాంక్రేజ్‌లోని ఔగర్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వం స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలకులతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ నేతలు బానిస మనస్తత్వాన్ని అలవర్చుకున్నారని మోదీ చెప్పారు. బ్రిటిషర్ల చెడు అలవాట్లను కాంగ్రెస్ నాయకులు నేర్చుకున్నారని తెలిపారు. ఆనంద్ జిల్లాలోని సోజిత్రా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ సమస్య కేవలం సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ మాత్రమే కాదని, దేశ ఐక్యత కూడా అని చెప్పారు. విభజించు, పాలించు అనే విధానంపైనే కాంగ్రెస్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ప్రజలందరినీ ఏకం చేయాలని సర్దార్ పటేల్ భావించారని, అందుకే ఆయనంటే కాంగ్రెస్‌కు గిట్టదని పేర్కొన్నారు. బీజేపీ విజయాన్ని ఒప్పుకున్న కాంగ్రెస్ గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ట్యాంపరింగ్ చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. ‘‘ఓటమి తప్పదని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈవీఎంలపై నిందలు మోపుతోంది. తద్వారా బీజేపీ విజయాన్ని పరోక్షంగా అంగీకరించింది’’ అని అన్నారు. ఆయన ఉత్తర గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు మోదీని తిట్టడం, ఎన్నికలయ్యాక ఈవీఎంలను నిందించడం.. కాంగ్రెస్‌కు తెలిసింది ఈ రెండు విషయాలేనని ఎద్దేవా చేశారు. దేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు దక్కాల్సిన సొమ్మును దోచుకున్నాయని దుయ్యబట్టారు. ధనికుల, పేదల మధ్య అంతరాలు పెంచిన ఘనత కాంగ్రెస్‌దేనని ధ్వజమెత్తారు. -
బ్యాంకు వద్ద తుపాకితో సన్యాసి హల్చల్... షాక్‌లో ఉద్యోగులు
చెన్నై: ఒక బ్యాంకు వద్ద సన్యాసి తుపాకితో హల్ చల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్‌లో చోటు చేసుకుంది. ఒక సన్యాసి రైఫిల్ చేతపట్టుకుని బ్యాంకు ఉద్యోగులపై బెదరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తిరుమలై స్వామి అనే సన్యాసి తిరువారూర్ జిల్లాలోని మూలంగుడి గ్రామ నివాసి. ఆ సన్యాసి తన కుమార్తె చదువు కోసం లోన్ కావాలంటూ ఒక ప్రైవేట్ బ్యాంకు వద్దకు వచ్చాడు. తన కూతురు చైనాలో మెడిసిన్ చదివేందుకు లోన్ కావాలని అడిగాడు. అందుకు హామీ పత్రాలు సమర్పించాల్పి ఉంటుందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐతే సన్యాసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు నిరాకరించాడు. తానే వడ్డితో సహా కట్టేస్తాను కాబట్టి హామీ పత్రాలు ఎందుకంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అధికారులు వివరంగా చెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నాడు. చేసేదేమి లేక బ్యాంకు అధికారుల లోన్ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో సన్యాసి ఇంటికి వెళ్లి తుపాకిని తీసుకుని లోన్ ఇస్తారా? లేదా? అని ఉద్యోగులను బెదిరించడం ప్రారంభించాడు. సామాజిక మాధ్యమాల్లో సైతం సదరు సన్యాసి లోన్ ఇవ్వనందుకు బ్యాంకును లూటీ చేస్తానంటూ లైవ్ వీడియోని పోస్ట్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సదరు సన్యాసిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోరం: మరుగుదొడ్డిలో ఆటగాళ్లకు భోజనం) -
కాల్పులు జరిపి.. దోచుకెళ్లి..
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చెలరేగింది. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు సినీ ఫక్కీలో ఓ కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అందులోని రూ. 43.5 లక్షలను దోచుకెళ్లారు. ఈ సమాచారం అందుకొని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... గాయపడిన డ్రైవర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకొనేందుకు జిల్లావ్యాప్తంగా 15 బృందాలను రంగంలోకి దించారు. సిద్దిపేట పట్టణంలోని అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామని ఘటనాస్థలిని పరిశీలించేందుకు వచ్చిన పోలీసు కమిషనర్ శ్వేత తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నివసించే చేర్యాల మండలం దొమ్మాట మాజీ సర్పంచ్ వకులా భరణం నర్సయ్య టీచర్స్ కాలనీలోని తన 176 గజాల స్థలాన్ని సిద్దిపేటలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కన్నయ్యగారి శ్రీధర్‌రెడ్డికి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గజం భూమి రూ. 36,500 చొప్పున 176 గజాలకు రూ.64.24 లక్షలు చెల్లించేందుకు శ్రీధర్ రెడ్డి అంగీకరించి గతేడాది డిసెంబర్ 19న రూ. 16.06 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించాడు. సోమవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్ దగ్గరకు వారిద్దరూ వచ్చారు. ఆ స్థలానికి వీధిపోటు ఉండటంతో కొంత ధర తగ్గించాలని నర్సయ్యను శ్రీధర్‌రెడ్డి కోరగా ఆయన అగ్రిమెంట్ ధరకంటే రూ. 1.29 లక్షలు తగ్గించాడు. దీంతో రూ. 48.18 లక్షల తుది చెల్లింపులో భాగంగా సోమవారం రూ. 43.50 లక్షల నగదు, మరో రూ 1.76 లక్షలకు చెక్కు ఇచ్చాడు. మిగితా రూ. 1.63 లక్షలను సాయంత్రం ఇస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు. డబ్బు తీసుకున్న నర్సయ్య ఆ బ్యాగును తన కారు (టీఎస్15ఈఈ7127) డ్రైవర్ రంగు పరుశరాములుకు ఇచ్చాడు. ఆపై మధ్యా హ్నం 12:40 గంటలకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లి మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రక్రియ పూర్తిచేసుకున్నారు. అరగంటపాటు దుండగుల రెక్కీ... కొనుగోలుదారుడైన శ్రీధర్‌రెడ్డి రూ. 43.5 లక్షలను నర్సయ్య డబ్బులు చెల్లించడం, ఆయన ఆ సొమ్మును ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా లెక్కించి ఎర్రటి రంగు ఉన్న బ్యాగులో పెట్టి డ్రైవర్‌కు అప్పగించడాన్ని ఇద్దరు దుండగులు చూస్తూ అరగంటకుపైగా అక్కడే రెక్కీ నిర్వహించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆపై మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో ఇన్నోవా కారు దగ్గరికి ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. కారు డ్రైవర్‌ను తలుపు తీయాలని 9 ఎంఎం పిస్టల్‌తో ఓ దుండగుడు బెదిరించగా డ్రైవర్ అప్ర మత్తమై వాహనాన్ని స్టార్ట్ చేసి నడిపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో దుండగుడు గన్ను రివర్స్‌లో పెట్టి కారు అద్దాన్ని పగలగొట్టాడు. నుదిటిపై గన్ పెట్టడంతో డ్రైవర్, దుండగుడు మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో కాల్పులు జరగడంతో డ్రైవర్ ఎడమ తోడలోకి బుల్లెట్ దూసుకెళ్లి బయటకు వచ్చింది. ఆ సమయంలో పిస్టల్ కారులోనే పడిపోయింది. ఈ క్రమంలో వాహనం ఎడమ పక్కన నుంచి మరో దుండగుడు డోర్ తీసి ముందు సీట్లో ఉన్న డబ్బుల బ్యాగు తీసుకున్నాడు. అనం తరం ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. గాయపడ్డ డ్రైవర్ తన యజమానికి సమాచారం అందించేందుకు కారు దిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వైపు పరుగెత్తాడు. తుపాకీని తీసేందుకు 3 గంటల నిరీక్షణ! కారులో దుండగులు వదిలేసిన పిస్టల్‌ను బయటకు తీసేందుకు మూడున్నర గంటలకుపైగా సమయం పట్టింది. తుపాకీ అన్‌లాక్ అయి ఉండటం, పైగా డ్రైవర్ సీటుకు, డోర్‌కు మధ్య అది ఇరుక్కుపోవడంతో దాన్ని తీసే క్రమంలో ఫైరింగ్ జరగొచ్చని భావించిన పోలీసులు నిపుణులు వచ్చే వరకు వేచిచూశారు. అనంతరం సీపీ సమక్షంలో గన్ను దస్తావేజులు రూపొందించే గదిలోకి నిపుణుడైన శేఖర్ తీసుకెళ్లి దాన్ని లాక్‌చేసి సీజ్ చేశారు. క్లూస్ టీం సభ్యులు తుపాకీపై వేలిముద్రలతోపాటు రక్తపు మరకలను సేకరించారు. మాఫియా ముఠాలు వాడే తుపాకీలా అది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో ఉన్న వారు చెబుతుండగా ఒక తూటా క్యాప్ మాత్రమే పోలీసులకు లభ్యమైంది. దీంతో దుండగుడు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపాడనే దానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలుదారుడిపైనే అనుమానం: నర్సయ్య తన సొమ్ము చోరీ ఘటన విషయంలో ప్లాట్ కొనుగోలు చేసిన శ్రీధర్‌రెడ్డిపైనే తనకు అనుమానం ఉందని స్థలం విక్రేత నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. నేను తప్పు చేయలేదు: శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడినైన తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్థలం కొనుగోలుదారుడు శ్రీధర్‌రెడ్డి వివరించాడు. నిజం నిలకడ మీద తెలుస్తుందని.. పోలీసుల విచారణకు సహకరిస్తానని పేర్కొన్నాడు. గతంలోనే గొడవలు... క్రయవిక్రయదారుల మధ్య అగ్రిమెంట్ కుదిరినప్పటి నుంచి సెట్ బ్యాక్, వీధిపోటు విషయమై గొడవలు జరిగాయి. అయితే పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో వారు సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఘటన జరిగిన అనంతరం విక్రయించిన వ్యక్తి నర్పయ్య మీడియాతో మాట్లాడుతూ ప్లాట్ విషయం గతంలో గొడవ జరిగిందన్నారు. ఎప్పుడు...సోమవారం మధ్యాహ్నం 12:40 గం. ఏం జరిగింది? 176 గజాల స్థలానికి సిద్దిపేట అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద క్రయవిక్రయదారుల మధ్య ఒప్పందం కుదిరింది. రూ.43.50 లక్షల నగదును విక్రేత తన కారులో ఉన్న డ్రైవర్‌కు ఇచ్చాడు. మధ్యాహ్నం 1:05గం.కు రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి. ఎలా జరిగింది? మధ్యాహ్నం 1:10 గంటలకు కారు దగ్గరికి నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు వచ్చారు. కారు డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి కిటికీ అద్దం తెరవాలని బెదిరించారు. మాటవినకపోవడంతో అద్దం పగలగొట్టి డ్రైవర్‌పై దాడికి ఓ దుండగుడు యత్నించాడు. పెనుగులాటలో కారు డ్రైవర్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. డబ్బు సంచి తీసుకొని దుండగులు పరారయ్యారు. -
పోలీసులమంటూ ఇంట్లోకి ప్రవేశించి..
యశవంతపుర: పోలీసులమంటూ ఇంటిలోకి దూరిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి రూ. 19 లక్షల నగదు, అరకేజీ బంగారంతో పాటు వారిని అపహరించి కారులో బెంగళూరు చుట్టూ తిప్పి ప్రాణం తీస్తామంటూ హెచ్చరించి వదిలిపెట్టిన ఘటన శుక్రవారం మహాలక్ష్మీ లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై ఇంజినీర్ సామ్యానాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు... సామ్యా నాయక్ ఒక నిర్మాణ సంస్థలో పని చేస్తూ భార్య బిడ్డలతో మహాలక్ష్మీ పురంలో నివాసం ఉంటున్నారు. 31న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నలుగురు వ్యక్తులు తిపటూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ ఇంటిలోకి ప్రవేశించారు. మీ అల్లుడు జయనాయక్ ఇచ్చిన గన్, బంగారు నగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నగదు, నగలు తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు నమ్మించి వారిని బలవంతంగా కారులో కూర్చొబెట్టుకుని నగరమంతా తిప్పారు. సాయంత్రం సామ్యానాయక్ అన్న కొడుకు రోహన్ పిలిపించుకుని అప్పటికే కిడ్నాపైన మనోహర్, రోహన్లపై దాడి చేశారు. విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తామంటూ హెచ్చరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
సినీ ఫక్కీలో.. 5.5 కేజీల బంగారం దోపిడీ
శివాజీనగర: వ్యాపారిని బెదిరించి సుమారు రూ.రెండున్నర కోట్ల విలువచేసే 5.5 కేజీల బంగారు బిస్కెట్లను దొంగలు దోచుకున్నారు. శుక్రవారం రాత్రి 9:20 సమయంలో బెంగళూరులో హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ వ్యాప్తిలో చోటు చేసుకుంది. వివరాలు.. డీ.కే.మార్కెట్లో నగల దుకాణం యజమాని సిద్దేశ్వర్ హరిబాసింధ్ బాధితుడు. కొన్నేళ్లుగా బంగారం విక్రయాలు నిర్వహిస్తున్నాడు. గుమాస్తా సూరజ్ శ్రీకాంత్ జాదవ్‌తో కలిసి స్కూటీ మీద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని అట్టికా గోల్డ్‌కు వచ్చారు. అక్కడ 5.5 కేజీల బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసి స్కూటీలో ఉంచుకుని బయల్దేరారు. రాజ్‌హోటల్ వద్ద ఘటన.. కబ్బన్‌పేట మెయిన్ రోడ్డు రాజ్ హోటల్ వద్ద టర్నింగ్ తీసుకునేటప్పుడు బైక్‌మీద ఇద్దరు దుండగులు అడ్డుకొన్నారు. వారిలో వెనుక కూర్చొన్న వ్యక్తి కత్తితో దాడికి యత్నించగా సిద్దేశ్వర్ తప్పించుకునే యత్నంలో స్కూటీ నుంచి కిందపడిపోయారు. తక్షణమే దోపిడీదారుడు బంగారు బిస్కెట్లు ఉన్న స్కూటీని లాక్కుని సంజీవ్ నాయక్ లేన్ మీదుగా పరారయ్యాడని ఫిర్యాదులో తెలిపారు. దొంగల్లో ఒకరు ఎరుపు రంగు లెదర్ జాకెట్, మరొకరు బ్లూ జీన్స్ ప్యాంట్, నల్లరంగు జాకెట్ ధరించాడు. ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నందున ముఖాలు కనిపించలేదని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న హలసూరు గేట్ పోలీసులు రాత్రి 10 గంటల నుంచి అన్నిచోట్ల నాకాబందీ జరిపినా ఉపయోగం లేకపోయింది. దుండగుల కోసం గాలింపు సాగుతోంది. -
ఫోన్ల లోడుతో వెళ్తున్న ట్రక్ బోల్తా.. ఎగబడ్డ జనం, మొత్తం స్వాహా!
సాక్షి, ముంబై: మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ట్రక్కులో ఉన్న వస్తువులను స్థానికులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై చోటుచేసుకుంది. ట్రక్కు నుంచి సుమారు రూ.70 లక్షల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోతీచంద్ రాథోడ్ పేర్కొన్నారు. పోలీసుల విజ్ఞప్తితో కొందరు తిరిగి అప్పగించారు. కాగా ఇప్పటివరకు 40 శాతం వరకు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చదవండి: మాజీ డీఎస్పీ ఇంట్లో చోరీ.. బంగారం, డబ్బు మాయం -
కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి..
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో దొంగలు రెచ్చిపోయారు. జాతీయ రహదా రిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఆదివారం అర్ధరాత్రి ఓ ఏటీఎంలో చోరీ చేశారు. అందు లోంచి రూ.7.12 లక్షలు ఎత్తుకెళ్లారు. మరో ఏటీఎంలో కూడా చోరీకి విఫలయత్నం చేశా రు. ఎస్ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ బస్‌స్టేజీ వద్ద నిలిపి ఉంచిన ఓ కారును దొంగి లించిన దుండగులు పట్టణంలోని ఎస్బీఐ పక్కన ఉన్న ఏటీఎం సెంటర్‌కు చేరుకున్నారు. ఆ ఏటీఎంలోని సీసీ కెమెరాలపైకి పొగను పంపి మెషీన్‌ను ధ్వంసం చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల వాహ నం రావడంతో వారు తమ ప్రయత్నాన్ని విరమించుకుని కారులో పరారయ్యారు. ఏటీఎం లో చోరీకి జరిగిన ప్రయత్నాన్ని గుర్తించిన పో లీసులు వెంటనే తేరుకుని జాతీయ రహదారి వెంట గల ఏటీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో ఇండిక్యాష్ ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. క్యాష్ ర్యాక్‌లను బయటికి తీసిన దుండగులు అందులోని రూ.7.12 లక్షలను అపహరించారు. వాహనాలు అపహరించి ప్రయాణం.. దుండగులు వాహనాలను అపహరించి అందులో ప్రయాణించారు. మొదట వట్టిమర్తి లో అపహరించిన ఇండికా కారులో వెలిమినేడు వరకు వచ్చిన దుండగులు అక్కడే దానిని వదిలేశారు. అనంతరం వెలిమినేడుకు చెందిన సంగప్ప అనే వ్యక్తి క్వాలిస్ వాహనాన్ని దొంగిలించి పంతంగి టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని దానిని కూడా అక్కడే వదిలి పరారయ్యారు. చోరీకి రెండు బృందాలుగా వచ్చి నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
పెళ్లింట భారీ చోరీ
కుషాయిగూడ: ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీ 4– ఎవెన్యూ బీ ,–171లో పారిశ్రామికవేత్త ఐలేని నర్సింహారెడ్డి కుటుంబం నివాసముంటోంది. నర్సింహారెడ్డి చిన్నకుమారుడు సూర్య వివాహం గత నెల 29న జరగ్గా, రిసెప్షన్‌ను పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించారు. విందులో పాల్గొనేందుకు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోగా, నేపాల్‌కు చెందిన వాచ్‌మన్ భీం ఒక్కరే ఇంట్లో ఉండిపోయారు. ముందస్తు పథకం ప్రకారం భీం మరో సహచరుడిని పిలిపించుకుని ఇంట్లోని లాకర్ తాళాలు పగులగొట్టాడు. వజ్రాలు పొదిగిన హారంతోపాటు బంగారం తదితర 25 రకాల ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను రెండు పెద్ద సంచుల్లో నింపుకుని ఇంటి యజమాని స్కూటీపైనే పరారయ్యాడు. సైనిక్‌పురి చౌరస్తాకు వెళ్లిన తర్వాత స్కూటీని ఓ చెత్తకుప్ప సమీపంలో వదిలేసి ఆ సంచులను భుజాన వేసుకుని తాపీగా వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో సాయంత్రం ఏడున్నర గంటలకు రికార్డు అయ్యాయి. విందు నుంచి వచ్చేసరికి చిందరవందర పెళ్లి, రిసెప్షన్ ప్రశాంతంగా జరిగాయన్న ఆనందంలో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు అక్కడి పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యారు. రిసెప్షన్ పూర్తికాగానే కొంతమంది బంధువులు, కుటుంబసభ్యులు రాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటికి వచ్చారు. గేటు మూసి ఉండటంతో కాలింగ్ బెల్ కొడుతూ వాచ్‌మన్‌ను పిలిచారు. ఉలుకూపలుకు లేకపోవడంతో లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. నర్సింహారెడ్డి వచ్చి ఆభరణాలు, ఇతర పరికరాలు చోరీకి గురయ్యాయని గుర్తించి మరునాడు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్తోపాటు డాగ్‌స్క్వాడ్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. చోరీ జరిగిన తీరును పరిశీలించి అక్కడ పలు ఆధారాలను సేకరించారు. సైనిక్‌పురి చౌరస్తా సమీపంలో స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 7 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ పేర్కొన్నారు. -
దోపిడి దొంగల బీభత్సం; భారీ చోరి
పాట్నా : బిహార్‌లోని బేగుసారయి జిల్లాలో మంగళవారం రాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కారు డ్రైవర్‌ను కాల్చి చంపడమే గాక ఇద్దరు నగల వ్యాపారలును గాయపరిచి రూ. 25 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన రాత్రి తొమ్మిది గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, దాడిలో చనిపోయిన డ్రైవర్‌ను దీపక్‌కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు. బేగుపారయి డీఐజీ రాజేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బేగుసారయికి చెందిన ప్రిన్స్ సోనీ, అభయ్ కుమర్ సింగ్, సంతోష్ కుమార్‌లు నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకొనిహోల్‌సేల్‌గా బంగారం కొందామని మంగళవారం కోల్‌కతాకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో కోల్‌కతా నుంచి బరౌని వరకు రైళ్లో వచ్చిన వీరు అక్కడి నుంచి బేగుసారయి వెళ్లడానికి దీపక్ కుమార్‌కు చెందిన ఎస్యూవీ కారులో బయలుదేరారు. ఠాకూరిచౌక్ వద్దకు రాగానే అప్పటికే మాటు వేసిన దోపిడి దొంగలు కారును అడ్డుకొని వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆభరణాలు ఉన్న బ్యాగులను ఎత్తుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పులల్లో కారు నడుపుతున్న డ్రైవర్ దీపక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, సంతోష్, సోనీలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దుండగులు దోచుకెళ్లిన ఆభరణాల విలువ సుమారు రూ. 25 కోట్లు వరకు ఉన్నట్లు తెలిసింది. కాగా, దీపక్‌కుమార్ మృతదేహానన్ని పోస్టుమార్టంకు తరలించామని.. గాయపడిన సంతోష్, సోనీలను బేగుసారయిలోని ఆసుపత్రికి తరలించినట్లు డీఐజీ పేర్కొన్నారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడమే గాక, ఒకరి మృతికి కారణమైన దుండగులపై ఐపీసీ సెక్షన్ 302, 307, 395 కింద గర్హారా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రాజేశ్ కుమార్ వెల్లడించారు. అయితే దుండగులు వారిని ఉదయం నుంచే వెంబడిస్తూ పక్కా ప్లాన్ ప్రకారమే చేశారా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు డీఐజీ స్పష్టం చేశారు. -
నీరు–చెట్టు పేరుతో దోపిడీ
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ‘నీరు–చెట్టు’అవినీతికి మారుపేరుగా నిలిచింది. ఈ పథకం కింద ఉదయగిరి చెరువు పూడికతీత పనుల పేరుతో రూ.లక్షలు మింగేశారు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలలముందు అభివృద్ధి పేరుతో పట్టణ ముఖద్వారం వద్ద ఉన్న చెరువు పూడికతీత పనులు తూతూమంత్రంగా చేసి అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ప్రజాధనాన్ని దోచుకున్నారు. సాక్షి, ఉదయగిరి: గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న బొల్లినేని వెంకటరామారావు ట్యాంక్‌బండ్ రూపురేఖలే మార్చేస్తానని పలుమార్లు ఉదయగిరి పట్టణంలో జరిగిన సమావేశాల్లో గొప్పలు చెప్పారు. ఐదేళ్లపాటు చెరువు అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పట్టణానికి వచ్చిన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అభ్యర్థన మేరకు అధ్వానంగా ఉన్న ట్యాంక్‌బండ్ అభివృద్ధి కోసం నిధులు మంజూరుచేశారు. ఆ నిధులతో పనులు చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి వైఎస్సార్సీపీలో కొనసాగటం, అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసే అవకాశం మేకపాటికి దక్కలేదు. మళ్లీ వచ్చిన ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ట్యాంక్‌బండ్ అభివృద్ధిని ఉదయగిరి ముఖద్వారపు రూపురేఖలు మారుస్తానని చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కనీసం గతంలో ఆగిపోయిన ముఖద్వారం పనులు కూడా పూర్తిచేయలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టణ ప్రజలను మభ్యపెట్టే నిమిత్తం, స్థానిక నేతలకు ఆదాయం సమకూర్చే నిమిత్తం ఉదయగిరి చెరువు పూడికతీత కోసమని రూ.34 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. తూతూమంత్రంగా పనులుచేసి అందులో రూ.18 లక్షలకు రికార్డు చేశారు. కేవలం రెండు మూడు లక్షలకంటే ఎక్కువ పనులు జరగలేదని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. అయినా అధికారులు లెక్కచేయకుండానే అధిక మొత్తంలో ఎంబుక్‌లు రికార్డు చేశారని ఆరోపణలున్నాయి. తదనంతరం ప్రభుత్వం మారటంతో మరింత నిధులు దోపిడీకి అడ్డుకట్ట పడింది. ఈ పనులపై పూర్తిస్థాయి విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అవినీతిని వెలికితీస్తాం ఉదయగిరి ఆనకట్ట పూడికతీత పనుల పేరుతో అవినీతి జరిగింది. తూతూమంత్రంగా పనులు చేసి రూ.లక్షలు దిగమింగారు. అందరి కళ్లెదుటే ఈ దోపిడీ జరిగింది. కొంతమంది స్థానిక నేతలు ప్రజాధనం దోచేశారు. ఈ పనుల్లో జరిగిన అవినీతిపై ప్రతిపక్షంగా తాము అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ ఎమ్మెల్యేగా ఈ పనులపై పూర్తిస్థాయి విచారణ చేయించి అందులో భాగస్వామ్యం ఉన్న కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకుంటాం. – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
రూ.50 లక్షలు స్వాహా చేసిన ‘అక్షయపాత్ర’..!
సాక్షి, నెల్లూరు : ఓవైపు నట్టింట్లోకి టెక్నాలజీ సేవలు వచ్చి చేరడంతో ఆన్లైన్ మోసాలు పెరిపోగా.. మరోవైపు టీ దగ్గర నుంచి బాంబు చుట్టడం వరకు యూట్యూబ్ పుణ్యమా అని అందరూ నేర్చేసుకుంటున్నారు. ఇక మూఢనమ్మకాల పేరుతో బురిడీ కొట్టించడానికి ‘మహిమగాళ్ల’కు అమాయక జనం కొరత ఎప్పడూ ఉండదు. తాజాగా నెల్లూరు జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. అక్షయ పాత్ర పేరుతో జిల్లాలో జరిగిన భారీ మోసం బయటపడింది. అక్షయ పాత్రకు ఉన్న మహిమతో భారీగా సంపాదించవచ్చని పలువురికి ఆశ చూపిన నలుగురు వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కోళ్ల శేషగిరితో పాటు మరో ముగ్గురిని బురిడీ కొట్టించారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయాలు వసూలు చేశారు. అక్షయపాత్ర మోసాన్ని గ్రహించిన ప్రసాద్‌రెడ్డి చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నిందితులు వికాస్, సుభాష్‌లను అరెస్టు చేసిన పోలీసులు.. వారివద్ద నుంచి రూ.51 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పోలీసుకే బురిడీ..
కడప అర్బన్ : కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అయ్యవారయ్య డెబిట్ కార్డు వివరాలను ఉపయోగించి రూ.84 వేలు మాయం చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మాయమాటలతో ఎస్బీఐ డెబిట్ కార్డు గురించి వివరాలు తెలుసుకున్నారు. డెబిట్ కార్డును పరిశీలించగా దాన్ని ఉపయోగించి రూ.84 వేలు షాపింగ్ చేసినట్లుగా చూపడంతో ఖంగుతిన్నాడు. సీఐ టీవీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకు అధికారిపై దాడి.. లూటీ
రాంచీ: జార్ఖండ్‌లో దోపిడీదారులు మరోసారి రెచ్చిపోయారు. గిరిద్ జిల్లాలో.. ఓ బ్యాంకు అధికారిని టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ. 5 లక్షల విలువైన రెండువేల నోట్లను దుండగులు లూటీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఇటీవల బ్యాంకు నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుని వెళ్తున్న వర్తకుడిపై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేసి రూ. 5 లక్షలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం
-
ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం
అనంతపురం: సికింద్రాబాద్ నుంచి తిరుపతి బయల్దేరిన సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని గార్లదిన్నె వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో రాళ్ల దాడి అనంతరం రైల్లోకి చొరబడిన దుండగులు ప్రయాణీకులను బెదిరించి 30 తులాల బంగారం, పెద్ద మొత్తంలో నగదు దోచుకెళ్లారు. అంతకుముందు దుండగుల రాళ్ల దాడితో ఒక్కసారిగా షాక్ కు గురైన ప్రయాణీకులు కేకలు వేశారు. దీంతో రైల్వే పోలీసులు పలుమార్లు కాల్పులు జరిపారు. రైల్వే పోలీసులు వచ్చే లోపే ప్రయాణీకులను దోచుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. -
కోటిన్నర పాత నోట్లు కొట్టేశారు..
-
కోటిన్నర పాత నోట్లు కొట్టేశారు..
హరియాణా: ఒక వైపు పెద్ద నోట్ల రద్దుతో ఖాతాదారుల అవసరాలు తీర్చడానికి అష్టకష్టాలుపడుతున్న బ్యాంకులను మరో తలనొప్పి వేధిస్తోంది. సందట్లో సడేమియాలా దొంగలు తమ చోరకళను ప్రదర్శిస్తున్నారు. హరియాణాలో దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. హిసార్ జిల్లాలో ఖార్ ఖోడాలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో చోరీకి పాల్పడ్డారు. ప్రజలు జమ చేసిన పాతనోట్లను సర్దుకు పోయారు. బుధవారం రాత్రి జరిగిన ఈఘటనలో దాదాపు రూ 1.22 కోట్లు పాతనోట్లను లూటీ చేశారు. గురువారం ఉదయం బ్యాంకు తెరిచిన తరువాత ఈవిషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, బ్యాంకు వెనకవైపు గోడకు కన్నం వేశారు. రద్దుచేసిన రూ .500, రూ.1,000 నోట్లను ఎత్తుకుపోయారు. అయితే వీటిలో కొత్త కరెన్సీ విలువ సుమారు రూ 30,000 ఉండొచ్చని చెప్పారు. మొఖాలకు ముసుగులు వేసుకొని, బ్యాంకు కన్నంవేసిన దొంగలు, అనంతరం సీసీటీవీలను ధ్వంసం చేశారని పోలీసు అధికారి రవీందర్ తెలిపారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం నిందితుల చేతులు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. దొంగతనం, క్రిమినల్ కుట్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. కాగా ఇటీవల (నవంబర్ 19) పంజాబ్ నేషనల్ బ్యాంకు ను టార్గెట్ చేసినదొంగల ముఠా రూ.81.46 లక్షలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. -
ఎన్ హెచ్-91 పై బస్సు లూటీ..
హత్రాస్ః ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రభుత్వం వరుస అవమానాలను ఎదుర్కొంటోంది. 91 నెంబర్ జాతీయ రహదారిపై వెడుతున్న ప్రయాణీకులతో కూడిన బస్సును సాయుధ దుండగులు లూటీ చేయడం సంచలనం రేపుతోంది. బులంద్ షహర్ బైపాస్ కు దగ్గరలో తల్లీకూతుళ్ళ గ్యాంగ్ రేప్ ఘటన జరిగి 48 గటలు గడవక ముందే బస్ లూటీ ఘటన.. తీవ్ర కలకలం సృష్టించింది. మొత్తం 25మంది ప్రయాణీకులతో వెడుతున్న బస్సును సాయుధ దుండగులు అడ్డుకొని చోరీకి పాల్పడటం ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపింది. అలిఘర్ పులారి గ్రామ ప్రాంతంలో బస్సును అడ్డగించి లోనికి ప్రవేశించిన దుండగులు.. కత్తులు మొదలైన పదునైన ఆయుధాలతో ప్రాయాణీకులను బెదిరించి దోపిడీకి పాల్పడినట్లు సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అజయ్ పాల్ తెలిపారు. సికింద్రారావ్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఘటన జరిగిందని, ఘటనాస్థలానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకులను దోచుకున్న అనంతరం దుండగులు అక్కడినుంచీ పారిపోయినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు అనంతరం ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అజయ్ పాల్ తెలిపారు. బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన అనంతరం హైవేల్లో కఠినమైన పెట్రోలింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ బస్సు లూటీ జరగడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ లో గూండారాజ్యం నడుస్తోందని, విపక్షాలు అఖిలేష్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. బులంద్ షహర్ ఘటన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
గుజరాత్లో రూ. 5 కోట్ల విలువైన సొమ్ము దోపిడీ
అహ్మదాబాద్: గుజరాత్లో జాతీయ రహదారిపై భారీ దోపిడీ జరిగింది. దాదాపు రూ. 5 కోట్ల విలువైన బంగారం, వెండిని దుండగులు దోచుకున్నారు. ఈ ఘటన అహ్మదాబాద్‌కు చేరువలోని భాల్యా గ్రామం వద్ద చోటుచేసుకుంది. రూ. 5 కోట్ల విలువైన సొత్తును ఒక ట్రక్‌లో అహ్మదాబాద్ నుంచి రాజ్‌కోట్‌కు తరలిస్తుండగా దాదాపు ఐదు మంది దుండగులు ట్రక్‌ను అడ్డగించారు. ట్రక్‌లోని 25 సొమ్ముతో కూడిన బాక్సులను కారులోకి తరలించి పోలీసులు రాకముందే పారిపోయారు. అంతకు ముందే ట్రక్కు జీపీఎస్‌ను ఏర్పాటు చేసిన యజమాని ఈశ్వర్ బేచర్ అంగాడియా ట్రక్ నిర్మానుష్య ప్రదేశంలో ఆగి ఉండడం గమనించి డ్రైవర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరేసరికే దుండగులు అక్కడి నుంచి సొమ్ముతో ఉడాయించారు. ఆ సొత్తు విలువ రూ. 5 కోట్లని అహ్మదాబాద్ గ్రామీణ పోలీస్ నిర్లిప్త్ రాయ్ తెలిపారు. -
బ్యాంకు లూటీ చేసినందుకు చేయి నరికేశారు
పాట్నా: బ్యాంకు దొపిడీకి పాల్పడిన ఓ వ్యక్తి పారిపోయే క్రమంలో గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఆగ్రహించిన గ్రామస్తులు అతని చేయి నరికేశారు. ఈ ఘటన బిహార్‌లోని మహువా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం సాయుధులైన నలుగురు దుండగులు గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ సర్వీస్ సెంటర్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 1.70 లక్షలు దోచుకొని పారిపోతున్న క్రమంలో.. నలుగురిలో జితేందర్ కుమార్ అనే దుండగుడు గ్రామస్తులకు చిక్కాడు. పారిపోతున్న సమయంలో దుండగులు తమపై కాల్పులకు కూడా పాల్పడటంతో ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు జితేందర్ కుమార్‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం దోపిడీకి శిక్షగా అతని చేయిని నరికేశారు. పోలీసులు గ్రామస్తుల నుండి జితేందర్ కుమార్‌ను కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు పాట్నా ఎస్పీ మను మహరాజ్ తెలిపారు. -
సీఎం వెళ్లడానికి కొన్ని గంటల ముందు ...
థానే: పట్టపగలు... అదీ నడిరోడ్డుపై... రద్దీగా ఉన్న ప్రాంతంలో దుండగులు మారణాయుధాలతో బెదిరించి, రూ. 58 లక్షల నగదు దోచుకుని వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ థానే జిల్లాలోని డోంబివ్యాలీలో ర్యాలీ నిర్వహించేందుకు ఇదే మార్గంలో కొన్ని గంటల ముందు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని అన్ని రైల్వేస్టేషన్లల్లో టికెట్లు విక్రయించిన సొమ్మను తీసుకుని భద్రతా సిబ్బందితో వ్యాన్ బయలుదేరింది. ఆ క్రమంలో కళ్యాణ్ - షిల్ రహదారిలోని నిల్జీ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఏడుగురు దుండగులు ఆ వ్యాన్ ను ఆపారు. మారణాయుధాలతో బెదిరించి, నగదు మొత్తం తీసుకుని తెల్ల కారులో పరారయ్యారు. ఇదంతా కన్నుమూసి తెరిచేలోపు జరిగిపోయింది. వెంటనే తేరుకున్న సిబ్బంది... పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించలేదు. అయితే దుండగులు ఉపయోగించిన తెల్లకారును మాత్రం వారు కనుగొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు జరుపుతున్నట్లు డీసీపీ పరాగ్ మనీరి వెల్లడించారు. -
ఇనుపరాడ్లతో బెదిరించి..భారీ దోపిడీ
-
కోట్ల విలువైన బంగారాన్ని దోచేశారు
లక్నో: కోట్లాది రూపాయిల విలువైన బంగార బిస్కెట్లు, నగలు తీసుకు వెళ్తున్న ఓ కొరియర్ వాహనాన్ని అడ్డుకున్న దుండగులు... వాహన డ్రైవర్, సెక్యూరిటీ గార్డుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించగా... సెక్యూరిటీ గార్డు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం దుండగులు వాహనంలోని బంగారం, నగదు తీసుకుని పరారైయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఉన్నవ్ జిల్లాలో లక్నో - కాన్పూర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బజీహెరా గ్రామం సమీపంలోని ఎఫ్ఐ మెడికల్ అండ్ రీసెర్చి సెంటర్ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై వాహనంలోని ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు ఘటన స్థలానికి డ్రైవర్, సెక్యూరిటీ గార్డును సమీపంలోని నవాబ్ జంగ్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే డ్రైవర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గార్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని... అయితే అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దాంతో మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని లక్నోలోని ట్రూమా సెంటర్‌కు తరలించారు ఈ వాహనం సీక్వెల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిందని పోలీసులు చెప్పారు. వ్యాన్‌లో నగదు అంతా బంగారం బిస్కెట్లు... నగల రూపంలో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితల కోసం గాలింపు చర్యల కోసం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
బాలాజీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
తిరుపతి : తిరుపతి నుంచి ముంబయి వెళుతున్న బాలాజీ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు సోమవారం అర్థరాత్రి చోరీకి పాల్పడ్డారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం హస్తవరం సమీపంలోని దుండగులు చైన్ లాగి అనంతరం ముగ్గురు మహిళల వద్ద నుంచి బంగారాన్ని దోచుకున్నారు. సుమారు 56 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. దుండగులు పథకం ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు పదిమంది ముందు స్టేషన్లో ఎక్కి...హస్తవరం అండర్ బ్రిడ్జి వద్దకు రైలు రాగానే చైన్‌లాగి ఆ తర్వాత చోరీకి తెగబడ్డారు. అయితే భారీ దోపిడీకి పథకం రచించినా..రైలు వేగం అందుకోవటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్-7, 8, 9 బోగీల్లో చోరికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే డీఎస్పీ సూర్యచంద్రరావు సంఘటనాస్థలాన్ని సందర్శించారు. దోపిడీ ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
దొంగ దొరికాడు.. కానీ 14 కేజీల బంగారం..
పాట్నా: గుజరాత్ వ్యాపారవేత్తకు చెందిన 14 కేజీల బంగారాన్ని దొంగిలించిన దొంగ అర్జున్ రామ్‌ను అరెస్ట్ చేసినట్లు బీహార్ పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం వెల్లడించారు. అతన్ని అరెస్ట చేసి పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త షాపులో అర్జున్ రామ్ పని చేసేవాడు. అదను చూసి షాపు నుంచి గతేడాది 14 కేజీల బంగారాన్ని అపహరించి పరారైయ్యాడు. దాంతో వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అర్జున్ రామ్ స్వగ్రామం రోహతక్ జిల్లాలోని దుమారియా గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే అతడి నుంచి 14 కేజీల బంగారం మాత్రం స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. దీనిపై అతడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కానీ దొంగను పట్టుకుంటే పోలీసులకు రూ. లక్ష నజరానా ఇస్తానని వ్యాపారవేత్త ముందే ప్రకటించారు. వ్యాపారవేత్త మాత్రం ముందుగా ప్రకటించినట్లు పోలీసులకు రూ. లక్ష నజరానా అందజేశారు. -
యువకుడిపై దాడి: 2.50 లక్షలతో పరారీ
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది. దుండగులు ఓ యువకుడిని కొట్టి అతని నుంచి రూ.2.50 లక్షలు ఎత్తుకుపోయారు. సూళ్లూరుపేటకు చెందిన సిద్దిఖి అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై పట్టణం వైపు వస్తుండగా దారి కాచిన దుండగులు అటకాయించారు. ప్రతిఘటించిన సిద్దిఖిని విచక్షణారహితంగా కొట్టి, అతని వద్ద ఉన్న రూ.2.50 లక్షల నగదును లాక్కుని పరారయ్యారు. -
సాఫ్ట్ వేర్ శిక్షణ పేరుతో భారీ మోసం
హైదరాబాద్: బహుళజాతి సంస్థల్లో కొలువులు ఇప్పిస్తామని అరచేతిలో వైకుంఠం చూపి... 40 మంది విద్యార్థులను ఓ సాఫ్ట్వేర్ శిక్షణా సంస్థ నిండా ముంచేసింది. రూ.20 లక్షల మేర వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేసింది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ వరుణ్‌సాయి పంజగుట్ట దుర్గానగర్‌లో ఓ అద్దె ఇంటిలో వరుణ్‌సాయి కన్సల్టెన్సి పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. బిటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్ధులకు సాఫ్ట్వేర్ రంగంలో శిక్షణ ఇచ్చి, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు. ఇందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 60వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశాడు. ఇలా 40 మంది నుంచి రూ.20 లక్షలకు పైగా వసూలు చేశాడు. అయితే, గత 20 రోజులుగా కార్యాలయం తెరవడం లేదు. బాధితులు ఫోన్ చేయగా తనకు కొన్ని సమస్యలున్నాయని, త్వరలోనే కార్యాలయం తెరుస్తానని నమ్మబలికాడు. దీంతో భాదితులు శనివారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దళారీ వ్యవస్థను అరికట్టండి: గవర్నర్
అనంతపురం: దళారీ వ్యవస్థను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం మార్కెట్ సదుపాయం కల్పించాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురంలోమాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్నిపెంపొందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులు విక్రయిస్తున్న ధరకు, మార్కెట్లో విక్రయిస్తున్న ధరకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. పంట పండించిన రైతుకు ఆదాయం దక్కినపుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని గవర్నర్ తెలిపారు. జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని గవర్నర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం కదిరి జూనియర్ కాలేజ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎంసెట్, జల వివాదాలు లేకుండా చూడాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మల్యే చాంద్ భాషా గవర్నర్ ను కోరారు. వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థ అరికట్టాలన్న గవర్నర్ సూచనను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఫలించని వ్యూహం..
ఇబ్రహీంపట్నం: దొంగల చోరీ వ్యూహం ఫలించలేదు. పోలీసులు రావడంతో పరారయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇబ్రహీంపట్నంలోని సహకార కేంద్ర బ్యాంకులోకి చొరబడ్డారు. బీట్ కానిస్టేబుళ్లు అక్కడి రావడంతో పరారయ్యారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓ ఇన్నోవా వాహనంతో పాటు చోరీకి ఉపయోగించేందుకు దొంగలు తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్లు, కట్టర్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం క్లూస్ టీం, జాగిలాలలో వివరాలు సేకరించారు. సీఐ మహ్మద్‌గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఇబ్రహీంపట్నం పీఎస్ కానిస్టేబుళ్లు రామకృష్ట, భీమాగ్నిలు బీట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో వారు పట్టణంలోని సహకార బ్యాంక్ పరిసరాల్లో ఉన్నారు. బ్యాంక్ దగ్గర ఓ వ్యక్తి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అతడిని ప్రశ్నించారు. అంతలోనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా బ్యాంక్ భవనం వెనక గ్యాస్ సిలిండర్లు కనిపించాయి. అక్కడే ఉన్న ఓ ఇన్నోవా(ఏపీ16బీఆర్2473)ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దగ్గరికి వెళ్లి చూడగా కిటికీ ఊచలు తొలగించి ఉన్నాయి. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ, ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణ, సీఐ మహమ్మద్‌గౌస్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆదివారం ఉదయం క్లూస్ టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. బ్యాంకులో ఎలాంటి చోరీ జరగలేదని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేనేజర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. కాగా బ్యాంక్‌లో కొంతకాలంగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఈవిషయమై తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. బ్యాంక్‌కు సెక్యూరిటీగార్డు కూడా లేడు. ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులో చోరీ సులభమని దొంగలు భావించి ఉంటారని పోలీసులు తెలిపారు. చోరీ యత్నంలో దాదాపు ముగ్గురునలుగురు దుండగులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే మూఠానా..? ఘట్కేసర్: మండలంలోని జోడిమెట్లలో దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీకి పాల్పడిన ముఠా, ఇబ్రహీంపట్నం సహకార కేంద్ర బ్యాంకులో చోరీకి యత్నించింది ఒకే ముఠా అయి ఉండొచ్చని ఘట్కేసర్ పోలీసులు అనుమానిస్తున్నారు. గతనెల 9న దక్కన్ గ్రామీణ బ్యాంకులో దుండగులు కిటి కీ ఊచలు హైడ్రాలిక్ జాకీ సహాయంతో వంచి లోపలికి చొరబడి రూ. 35 లక్షల నగదు, 9 తులాల బంగారం అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. రెండు ఘటనల్లో దుండగులు కిటికీలను వంచడం, ఒకేవిధమైన సామగ్రి ఉపయోగించారు. ఈనేపథ్యంలో రెండు ఘటనలకు పాల్పడిందే ఒకే ముఠా కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఘట్కేసర్ సీఐ రవీందర్ ఆదివారం తెలిపారు. నెల రోజుల్లో రెండు ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగింది. కాగా పూర్తిగా నిర్ధారణకు రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఇబ్రహీంపట్నంలో పోలీసులు రావడంతో దొంగలు తమ ఇన్నోవా వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. దీంతో ఆధారాలు కొంతమేర దొరికే అవకాశం ఉందని చెప్పారు. త్వరలో దుండగులను పట్టుకొని కటకటాల వెనక్కి పంపుతామని సీఐ చెప్పారు. కొంతే రికవరీ.. ఐదేళ్ల క్రితం యాచారం పీఏసీఎస్‌లో నాలుగున్నర కిలోల బంగారం, నగదు చోరీ రెండున్నర కిలోల బంగారాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్న పోలీసులు యాచారం: మండల కేంద్రంలోని పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)లో 2009 జరిగిన చోరీ ఘటనలో పోలీసులు పూర్తిస్థాయిలో సొత్తు రికవరీ చేశారు. దొంగలు అప్పట్లో నాలుగున్నర కిలోల బంగారం, రూ. లక్ష నగదు అపహరించారు. ఏడాది తర్వాత దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు వారి నుంచి కేవలం రెండున్నర కిలోల బంగారాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఖాతాదారులు ఆందోళన చేయడంతో అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు సంస్థకు చెందిన రూ. 50 లక్షల నగదును బాధితులకు పంపిణీ చేశారు. కాగా ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో సొత్తు స్వాధీనం చేసుకుంటే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. -
రెండోసారి ఫెడరల్ బ్యాంక్‌లో భారీ దోపిడీ
-
రెండోసారి ఫెడరల్ బ్యాంక్‌లో దోపిడీ
హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్‌గిరిలో ఫెడరల్ బ్యాంక్‌లో చోరీ జరిగింది. దుండగులు రెండోసారి బ్యాంక్‌పై గురిపెట్టి...అందినకాడికి దోచుకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున దుండగులు బ్యాంక్ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. సుమారు లక్ష రూపాయల నగదుతో పాటు,ఒక కేజీ బంగారాన్ని అపహరించినట్లు సమాచారం. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. గతంలోనూ ఇదే బ్యాంకులో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు పాత నేరస్తులపై దృష్టి సారించారు. ఇదిలా ఉండగా బ్యాంకులో వచ్చిన వారెవరైనా చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
చార్మినార్ లో దోపిడీ దొంగల బీభత్సం
-
చార్మినార్ లో దోపిడీ దొంగల బీభత్సం
హైదరాబాద్:నగరంలో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. ఆదివారం ఒక జ్యూయలరీ షాపులోకి తెగబడ్డ కొందరు దుండగులు అక్కడ హల్ చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం జ్యూయలరీ షాపు యజమాని కాళ్లు, చేతులు కట్టేసి భారీ స్థాయిలో నగలు దోచుకున్నారు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఆ దుండగులు దోచుకెళ్లిన నగలు విలువ రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని జ్యూయలరీ షాపు యజమాని స్పష్టం చేశాడు. -
ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎన్ఎస్సీ నగర్ వద్ద దారికాచిన దుండగలు అటుగా వస్తున్న దంపతులను చితకబాది వారి వద్ద నుంచి అందినకాడికి దోచుకున్నారు. దంపతుల వద్ద నుంచి 7 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15వేల నగదు, బైక్ అపహరించుకు వెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాయలాడి అరెస్ట్
తాడిపత్రి: గొప్పింటి మహిళగా పరిచయం చేసుకుని ఇళ్లలో చొరబడి లూటీలకు పాల్పడుతున్న మాయలేడిని పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితురాలని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన సునీతగా గుర్తించారు. సీఐ సుధాకరరెడ్డి తెలిపిన మేరకు... రెండు రోజుల క్రితం పెద్దపప్పూరు రోడ్డులోని కృష్ణావృద్ధాశ్రమానికి వచ్చిన వృద్ధురాలి లక్ష్మిదేవి వద్ద బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితురాలి సమాచారంతో విచారణ వేగవంతం చేశారు. జమ్మలమడుగుకు చెందిన సునీత అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి పూజలు చేసుకుని వెళ్తుంటారని తెలుసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఆమెపై జమ్మలమడుగు, కడప పోలీస్ స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. ఫ్యాక్షన్‌లో భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. -
మియాపూర్ సిటిజన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో చోరి
-
బ్యాంక్ ఖాతాదారుడికి బురిడీకొట్టించిన అపరిచీతుడు
-
513 ఎకరాలకు రెక్కలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ భూమికి రెక్కలొచ్చాయి.. వందల ఎకరాలు అక్రమార్కుల చెరలోకి వెళ్లినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. నకిలీ పట్టాల జారీతో సర్కారు భూమికి ఎసరు పెట్టినట్టు గుర్తించింది. మంచాల మండలం లోయపల్లిలో చోటుచేసుకున్న బోగస్ పట్టాల జారీలో 513ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అడ్డగోలుగా పుట్టుకొచ్చిన పట్టాల వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం విచారణను ముమ్మరం చేసింది. లోయపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 334, 335, 370లలో 694 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో భూమిలేని పేదలకు 1991లో 175 ఎకరాల మేర అసైన్మెంట్(లావణి) పట్టా సర్టిఫికెట్లు జారీచేసినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సర్వే నం.334లో 11మంది లబ్ధిదారులకు 33 ఎకరాలు, సర్వే నం. 335లో ఐదుగురికి 15ఎకరాలు, సర్వే నం.370లో 62మందికి 127ఎకరాలను కేటాయించారు. అయితే, ఆ తర్వాత కాలంలో అడ్డగోలుగా పట్టాలు పుట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇవన్నీ దాదాపుగా నకిలీవేనని ప్రాథమిక అంచనాకొచ్చిన జిల్లా యంత్రాంగం.. ఈ పట్టాలను నిశితంగా పరిశీలించేందుకు పట్టాదార్లకు నోటీసులు జారీచేయాలని నిర్ణయించింది. గుట్టుగా మొత్తం భూమికి ఎసరు.. పదేళ్ల వ్యవధిలో ఈ సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములన్నింటికీ రెక్కలొచ్చాయి. 2011-12 పహాణీ రికార్డుల మేరకు సర్వే నం. 334లో 238.30 ఎకరాలను 84మందికి, సర్వే నం.335లో 219 ఎకరాలను 65మందికి, సర్వే నం.370లో 231ఎకరాలను 96మందికి పట్టాలు జారీ చేసినట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. మొత్తం విస్తీర్ణంలో ఆరు ఎకరాలు మినహా మిగతా భూమికి ఎసరు పెట్టినట్టు తేల్చింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే పట్టాలు సృష్టించినట్లు గుర్తించిన యంత్రాంగం.. పహాణీలో పేర్లు నమోదు కావడాన్ని సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది పాత్రపై ఆరా తీస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో బోగస్ పట్టాలు పుట్టుకొచ్చాయా? లేక వారే ఈ అక్రమాలకు తెరలేపారా? అనే కోణంలో కూపీ లాగుతోంది. స్థానిక తహసీల్దార్ ఇప్పటికే ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది. కాగా, నకిలీ పట్టాలిచ్చిన భూమి చాలావరకు కొండ లు, గుట్టలతో నిండిపోవడంతో వ్యవసాయానికి అనువుగా లేదు. దీంతో ఈ పట్టాలను ఉపయోగించుకొని బ్యాంకుల్లో రుణాలను విరివిగా తీసుకున్నట్లు బయటపడింది. ఈ క్రమంలో సంబంధిత సర్వే నంబర్లలోని పట్టాలను పూచీకత్తుగా పెట్టుకొని మంజూరు చేసిన రుణ వివరాలను అందజేయాలని జిల్లా యంత్రాంగం ఆయా బ్యాంకులకు లేఖలు రాసింది.