హైదరాబాద్:నగరంలో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. ఆదివారం ఒక జ్యూయలరీ షాపులోకి తెగబడ్డ కొందరు దుండగులు అక్కడ హల్ చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం జ్యూయలరీ షాపు యజమాని కాళ్లు, చేతులు కట్టేసి భారీ స్థాయిలో నగలు దోచుకున్నారు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఆ దుండగులు దోచుకెళ్లిన నగలు విలువ రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని జ్యూయలరీ షాపు యజమాని స్పష్టం చేశాడు.