Jewellery shop
-
నెల్లూరులో సందడి చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (ఫోటోలు)
-
ఈ అక్కల దొంగ తెలివి చూస్తే షాక్ అవ్వడం పక్కా!
-
మేడ్చల్: జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. షాపు యాజమానిని కత్తితో పొడిచి దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ఆ రోజు ఏం జరిగిందంటే?ఒకరు బుర్ఖా.. మరొకరు హెల్మెట్ ధరించిన దుండగులు పట్టపగలే జ్యువెలరీ షాపులో దోపిడీకి యత్నించారు. దుకాణ యజమానిపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో పలాయనం చిత్తగించిన ఘటన గురువారం మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, జ్యువెలరీ షాపు యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలో 44వ జాతీయ రహదారి పక్కన మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు (20 అడుగుల) దూరంలో జగదాంబ జ్యువెలరీ దుకాణం ఉంది.గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు దుండగులు (వెనుక కూర్చున్న వ్యక్తి బుర్ఖా.. మరొకరు ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారు) వచ్చారు. షాపులోకి వచ్చి యజమాని శేషురాం చౌదరిపై బుర్ఖా ధరించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆభరణాలు, నగదును తన వద్ద ఉన్న కవర్లో వేయాలని బెదిరించాడు. అరవవద్దని హిందీలో బెదిరించాడు. దీంతో పక్కనే ఉన్న శేషురాం చౌదరి కుమారుడు సురేశ్ షాపు వెనుక గదిలోకి పరుగులు తీశాడు.హెల్మెట్ ధరించిన దుండగుడు షాపులోని వెండి ఆభరణాలు తీసుకుని బుర్ఖా ధరించిన వ్యక్తికి కవర్ పట్టుకో అందులో వేస్తానని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని శేషురాం చౌదరి చాకచాక్యంగా వ్యవహరించి.. హెల్మెట్ ధరించిన వ్యక్తిని తోసి బయటికి వచ్చి చోర్ చోర్ అంటూ అరవసాగాడు. దీంతో దుండగులు పరారయ్యేందుకు బయటికి వస్తుండగా కొంత మేర దోచుకున్న ఆభరణాల కవర్ కిందపడింది. దానిని అక్కడే వదిలిపెట్టి బైక్ ఎక్కారు. అప్పటికే గది లోపలి నుంచి బయటికి వచ్చిన సురేశ్ షాపులోని కుర్చీని దుండగులపై విసిరి వారిని నిలువరించేందుకు యత్నించడంతో పరారయ్యారు. దుండగుల దాడిలో గాయపడిన శేషురాం చౌదరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దుండగులు దోపిడికి యత్నించిన జగదాంబ జ్యువెలరీ షాపులో, షాపు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో దుండగుల దోపిడీ చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బైక్‌పై వచ్చి లోపలికి ప్రవేశం. షాపు యజమానిపై దాడి, బెదిరింపులకు దిగిన తీరు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దర్యాప్తు చేపట్టి పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. బైక్ నంబర్, ఇతర ఆధారాలు సేకరించి నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. -
మేడ్చల్‌లో పట్టపగలే ముసుగు దొంగల బీభత్సం.. జ్యువెలరీ షాప్‌లో చొరబడి..
సాక్షి, మేడ్చల్: పట్టపగలే బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చోరుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం.. షాపులో కస్టమర్లు లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక వ్యక్తి బుర్ఖా ధరించి ఉండగా.. మరో దుండగుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. శేషారాంను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
HYD: జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్‌లో రాశీఖన్నా సందడి (ఫొటోలు)
-
తిరుపతి ఎస్ఎస్ జ్యువెలరీ చోరీ కేసులో పురోగతి
-
Goyaz Jewellery: గోయాజ్ జ్యువెలరీ నూతన స్టోర్ ను ప్రారంభించిన నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
బెంగళూరులో వర్ష బీభత్సం.. రూ.2 కోట్ల బంగారం కొట్టుకుపోయింది!
బెంగళూరు: గార్డెన్ సిటీగా పిలుచుకునే బెంగళూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమానికి తీవ్రంగా నష్టపోయాడు. వివరాల్లోకి వెళితే.. మల్లీశ్వర్‌లోని 9వ క్రాస్‌లోని ఓ నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. కాసేపు తర్వాత అధికంగా వరద నీరు షాపులోకి రావడంతో అక్కడున్న బంగారు నగలు కొట్టుకుపోయాయి. దాదాపు రూ.2 కోట్ల విలువైన నగలు కొట్టుకుపోయినట్లు సమాచారం. దుకాణం సమీపంలో జరుగుతున్న పనులే నష్టానికి కారణమని దుకాణం యజమాని ఆరోపిస్తున్నాడు. షాపులోని బంగారు ఆభరణాలు తడిసిపోయాయి.. కార్పొరేషన్‌కు ఫోన్ చేసి సహాయం కోరినా అధికారులు సాయం చేయకపోవడంతో 80 శాతం నగలు మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా నగరంలో భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయింది. వానల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోడంతో పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్ కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. చెట్లు కూలిపోయాయని, వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు ఇప్పటివరకు 600 వరకు ఫిర్యాదులు అందాయి. చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి! -
హైదరాబాద్ : నగల దుకాణంలో ప్రగ్యా జైశ్వాల్ సందడి
-
శాకుంతలం సినిమాలో ధరించిన బంగారు, వజ్రాభరణాలు చూశారా? (ఫొటోలు)
-
నగల దుకాణంలో సందడి చేసిన యాంకర్ సుమ (ఫొటోలు)
-
ఆర్డర్ ఇస్తే అడ్రస్ లేకుండా పరార్.. రూ.88లక్షల విలువైన ఆభరణాలతో..
సాక్షి, హైదరాబాద్: నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారు, వజ్రాలతో ఓ జ్యూవెలరీ షాప్ యజమాని పరారైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బషీర్‌బాగ్‌కు చెందిన శ్రీయాష్ జ్యూవెలరీస్ భాగస్వామి ఆనంద్‌కుమార్ అగర్వాల్ నారాయణగూడ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడలోని శ్రీయాష్ జ్యూవెలర్స్ నిర్వాహకులు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్ షాప్‌లు, కస్టమర్ల కోరిక మేరకు వారికి నచ్చిన విధంగా బంగారు, వజ్రాభరణాలను తయారు చేసి ఇస్తుంటారు. గత ఏడాది ఆనంద్‌కుమార్ అగర్వాల్‌కు గణేష్ చంద్ర దాస్(అతిక్ జ్యువెల్లర్స్) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన గత నవంబర్‌లో పలు దఫాలుగా రూ.కోటి విలువైన ఆభరణాల తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. గణేష్ చంద్రదాస్ వీటిలో దాదాపు రూ.30లక్షల విలువైన ఆభరణాలను తయారు చేసి అప్పగించాడు. రూ.65లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.17లక్షల వజ్రాల ఆభరణాల తయారీలో జాప్యం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 9 తేదీ నుంచి గణేష్ చంద్ర దాస్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన యాష్ జ్యూవెలరీస్ యజమాని ఆనంద్‌కుమార్ అగర్వాల్ చార్మినర్‌లోని అతని దుకాణానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందం కోల్‌కత్తాకు వెళ్లింది. చదవండి: Fire Accident: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ -
హైదరాబాద్: జ్యువెలరీ షాప్‌లో దోపిడీకి పక్కా స్కెచ్? కాల్పులు జరిపి భారీ చోరీ
సాక్షి, చైతన్యపురి/నాగోలు: జ్యువెలరీ దుకాణంలో చొరబడిన దుండగులు షాపు యజమాని సహా మరొకరిపై కాల్పులు జరిపి బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ పాలి జిల్లా లోటోపి గ్రామానికి చెందిన కల్యాణ్ చౌదరి (34) పదేళ్ల క్రితం స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్‌దేవ్ గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం సుఖ్‌దేవ్ చేతిలోని బ్యాగ్‌ను దుండగులు లాక్కున్నారు. దుకాణంలో నుంచి కాల్పుల శబ్దాలు రావటంతో దుకాణం వద్దకు స్థానికులు కొందరు చేరుకున్నారు. వారిలో కొందరు షాపు షటర్ తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆగంతుకులు తుపాకీ చూపించి భయపెడుతూ.. వారు వచ్చిన బైక్‌లపై పరారయ్యారు. స్థానికులు వెంటపడినప్పటికీ ఆర్కేపురం వైపు వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్యపురి ఇన్స్పెక్టర్ మధుసూధన్ క్రైం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని నాగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దుకాణం యజమాని కల్యాణ్ చెవికి బుల్లెట్ తగలగా, సుఖ్‌దేవ్‌కు ఒకటి మెడకు, మరొకటి వీపు వెనుక భాగంలో తగిలింది. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సుఖ్‌దేవ్‌ను అనుసరించే వచ్చారా? హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్‌ను అనుసరించే దుండగులు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుఖ్‌దేవ్ వద్ద ఉన్న నగల బ్యాగ్‌ను మాత్రమే తీసుకుని పారిపోవటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. పక్కా స్కెచ్ ప్రకారమే కాల్పులు జరిపి బంగారంతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్‌దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. -
Banjara Hills: కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కొని ఉడాయింపు.. ట్విస్ట్ ఏంటంటే!
సాక్షి, బంజారాహిల్స్: ముసుగు ధరించి నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు వజ్రాల వ్యాపారి వద్ద పని చేసే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి, అతడి చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్ యజమాని అంకిత్ అగర్వాల్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో నివాసం ఉంటున్నాడు. ఇతడి వద్ద పని చేసే సేల్స్‌మెన్ ఆనంద్ మంగళవారం రాత్రి 9 గంటలకు ఆభరణాల దుకాణాన్ని మూసివేశాడు. రెండు షట్టర్లు, లాకర్ల తాళం చెవులు బ్యాగ్‌లో వేసుకొని యజమానికి ఇవ్వడానికి స్కూటీపై అతని నివాసానికి వచ్చాడు. హెల్మెట్ తీసి తన వాహనంపై పెడుతుండగా అప్పటికే పంజగుట్ట నుంచి అనుసరిస్తూ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆనంద్ కళ్లల్లో కారం కొట్టి బ్యాగు లాక్కొని ఉడాయించారు. రాత్రి 10 గంటల సమయంలో బాధితుడు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, అదే రోజు రాత్రి ఆగంతకులు ఆ బ్యాగును పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్ ముందు పడేసి పరారైనట్లుగా గుర్తించారు. ఈ బ్యాగులో డబ్బు లేదా నగలు ఉంటాయని వారు భావించి ఉంటారని, అందులో తాళం చెవులు మాత్రమే ఉండటంతో బ్యాగు ను షాపు వద్ద పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లేదా తాళాలతో షాపు షట్టర్లు తెరుద్దామని వెళ్లి ఉంటారని,అయితే, అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండటంతో బ్యాగ్‌ను షాపు ముందు పడేసి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అగంతకుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్‌లో కృతిశెట్టి సందడి (ఫొటోలు)
-
తపంచాతో బెదిరించి దోపిడీకి యత్నం..
రాజేంద్రనగర్/మైలార్‌దేవ్‌పల్లి: జువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణంలోకి చొరబడిన ముగ్గురు యువకులు తపాంచాతో బెదిరించి దోపిడికి యత్నించారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. దుకాణం యజమాని తోటి వ్యాపారుల సహాయం కోరడంతో స్థానిక వ్యాపారులు ఇద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు. ఇద్దరు నిందితులతో పాటు తపాంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీలో దిలీప్, దినేష్‌లు సరస్వతీ జూవెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం దిలీప్ దుకాణంలో ఉండగా ముగ్గురు యువకులు ఆభరణాలు చూపించాలని కోరడంతో దిలీప్ చూపించేందుకు ప్రయత్నించాడు. రాజస్థాన్ భాషలో మాట్లాడుతుండడంతో రాజస్థాన్‌కే చెందిన దిలీప్ అప్రమత్తమైయ్యాడు. దిలీప్ సైతం రాజస్థాన్ భాషలో మాట్లాడుతుండగా నిందితుల్లో దినేష్ తపంచాతో బెదిరిస్తు దిలీప్ నుదుడిపై దాడి చేశాడు. దిలీప్ గట్టిగా నిందితుడు దినేష్‌ను పట్టుకోని కిందపడేయడంతో ఒక పక్క తపాంచా పడడం, మరో పక్క దినేష్ పడడంతో వెంట వచ్చిన మరో ఇద్దరు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దిలీప్ బచావ్ బచావ్ అని అరవడంతో పక్కనే ఉన్న స్వీటు షాపు యజమాని, కిరాణదుకాణం యజమానులు అప్రమత్తమై లోపలికి వస్తుండడంతో నిందితుల్లో ఒకరు తపాంచా చూపిస్తు తాను వచ్చిన ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. మరో యువకుడు పరిగెత్తేందుకు ప్రయత్నించగా స్వీటు షాపు యజమాని పట్టుకొని చితకబాదారు. దినేష్ పాటు మరో యువకుడు పట్టుబడడంతో స్థానికులు పట్టుకోని దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితుడు దినేష్ తోపాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకోని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఒక రౌండ్‌తో పాటు తపాంచాను స్వాదీనం చేసుకున్నారు. (చదవండి: నేటి నుంచి తెలుగు భాషా అమృతోత్సవాలు ) -
జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ..
-
జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ.. 5కేజీల బంగారు నగలు మాయం!
సాక్షి, విజయనగరం: విజయనగరంలోని జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. జ్యువెలరీ షాప్ యజమాని పోలీసు ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 5 కేజీల బంగారు నగల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. జ్యువెలరీ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: సర్టిఫికెట్ కోసం వస్తే.. చాక్లెట్, గ్రీన్ ఇంక్ పెన్ను.. చివరకు గదిలోకి రమ్మని.. -
ఘరానా మోసం.. ఐటీ అధికారినంటూ టోకరా
-
ఘరానా మోసం.. ఐటీ అధికారినంటూ టోకరా
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘరానా మోసం జరిగింది. ఐటీ అధికారినంటూ జువెల్లరీ షాపు యజమానికి టోకరా వేశాడు. ఆన్లైన్లో మనీ సెండ్ చేశానంటూ నగలతో ఆ కేటుగాడు ఉడాయించాడు. దీంతో ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
రూ.100 కోట్ల బంగారం దారి మళ్లింపు కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు ఎగుమతి చేయాల్సిన బంగారాన్ని దారి మళ్లించి దేశీయ విపణిలో విక్రయించిన ఆరోపణలపై ఘన్‌శ్యామ్‌దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ సహా మరికొన్ని సంస్థలపై నమోదు చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఈ ఏడాది మార్చిలో నమోదైన కేసుకు సంబంధించి ముగ్గురికి చెందిన రూ. 25.28 కోట్ల విలువైన ఆస్తుల్ని బుధవారం తాత్కాలిక జప్తు చేసింది. సంజయ్ కుమార్ అగర్వాల్, రాధిక అగర్వాల్, సంజయ్ కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్‌కు చెందిన ఖరీదైన విల్లాలతో పాటు 54 కేజీల బంగారం ఎటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. ►అబిడ్స్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపే ఘన్‌శ్యామ్‌దాస్ సంస్థను సంజయ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈయనతో పాటు ఇతరులూ విదేశాలకు ఎగుమతి చేసే నెపంతో నకిలీ పత్రాలు సృష్టించి ఎంఎంటీసీ, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డైమండ్ ఇండియా లిమిటెడ్ సంస్థల నుంచి 250 కేజీల బంగారం ఖరీదు చేశారు. ►ఎక్స్పోర్ట్ చేసే పసిడిపై కస్టమ్స్ సుంకం లేకపోవడాన్ని వీళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ మొత్తం బంగారాన్నిదారి మళ్లించి దేశీయ విపణిలోనే విక్రయించేశారు. దానికి సంబంధించన నగదు లావాదేవీలన్నీ హవాలా రూపంలో సాగించారు. ►కోల్‌కతాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయం గుర్తించారు. 2018 ఏప్రిల్ 4న ప్రీత్ కుమార్ అగర్వాల్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. అప్పటికే సంజయ్ అగర్వాల్ హైదరాబాద్ రావడానికి ఇండిగో సంస్థకు చెందిన విమానం ఎక్కేశారు. దీన్ని గుర్తించిన డీఆర్ఐ అధికారులు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద వెనక్కు రప్పించి ఆయన్నూ అరెస్టు చేశారు. అదేరోజు ఇండిగో ఎయిర్‌లైన్స్ డొమెస్టిక్ కార్గోలో రెండు బాక్సుల్లో ఉన్న రూ.16 కోట్ల విలువైన 1,194 బంగారం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ►ఎంఎంటీసీ సహా మూడు సంస్థల నుంచి ఖరీదు చేసిన బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వీళ్లు అన్ని పత్రాలు సిద్ధం చేసేవాళ్లు. విమానాశ్రయం వర కు వెళ్లిన తర్వాత ఆ బంగారాన్ని దారి మళ్లించి డొమెస్టిక్ కార్గొ ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చారని డీఆర్ఐ తేల్చింది. దీనికిపై ఈ ఏడాది మార్చిలో కోల్‌కతాకు చెందిన ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీళ్లు వివిధ దశల్లో రూ.100 కోట్ల విలువైన 250 కేజీల బంగారం దారి మళ్లించినట్లు తేల్చారు. ►ఈ నేపథ్యంలోనే కోల్‌కతా ఈడీ అధికారులు నగర యూనిట్ సహకారంతో ఈ ఏడాది మార్చిలో ఘన్‌శ్యామ్‌దాస్ సంస్థతో పాటు శ్రీగణేష్ జ్యువెల్స్, పీహెచ్ జ్యువెల్స్ సంస్థలోదాడులు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులోనే ఈడీ బుధవారం ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో సంజయ్‌కుమార్ అగర్వాల్‌ను 2012 ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. -
కొడుకు విదేశాలకు వెళ్లాలి.. తెలివిగా 7 కిలోల గోల్డ్ కాయిన్స్ స్వాహా
వడోదర: అప్పులు తీర్చేందుకు అడ్డదారులు ఎంచుకున్నాడు ఓ ఉద్యోగి. అందుకు సులభంగా ఉంటుందని తాను పని చేస్తున్న చోటే చేతి వాటం ప్రదర్శించాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 కిలోల బంగారాన్ని నగల దుకాణం నంచి మాయం చేసాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విరాల్ సోని వడోదరలో ఓ ప్రముఖ నగల దుకాణంలో కొనేళ్లుగా స్టోర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కళ్లేదుటే కోట్ల బంగారం కనపడేసరికి అడ్డదారిలో సులువుగా డబ్బు సంపాదించే ఆలోచన మనోడికి వచ్చింది. ఇక ఆలస్యం చేయక తెలివిగా తస్కరించడం మొదలెట్టాడు. ఆ విధంగా సోనీ 2016 నుంచి 2021 మధ్య రూ. 4 కోట్ల విలువైన 7.8 కిలోల విలువైన 24 కేరట్ల బంగారు నాణేలను చోరీ చేశాడు. కాగా దొంగలించిన ఈ బంగారం అమ్మడంలో అదే స్టోర్‌లో పనిచేస్తున్న తరజ్ దివాన్ సహకరించాడు. షోరూం క్యాషియర్లకు నకిలీ వోచర్లను సమర్పించి గోల్డ్ కాయిన్స్‌ను సోని చోరీ చేసినట్లు స్టోర్ యజమాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఎప్పటికప్పుడు ముగ్గురు కస్టమర్ల పేర్లతో నకిలీ వోచర్లను ఇస్తుండటంతో అనుమానించిన క్యాషియర్ యజమానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. కాగా అప్పులు తీర్చేందుకు, తన కుమారుడి విదేశీ విద్య కోసం ఈ నేరానికి పాల్పడినట్టు నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. -
బెంగాలీ స్వర్ణకారులను చితకబాదిన గోల్డ్ వ్యాపారి
-
కారంపొడి కొట్టి మరీ దొరికిపోయాడు
ఇండోర్ : బంగారం కొనేందుకు వచ్చినట్లు నటించి జ్యువెల్లరీ షాపు యజమాని కంట్లో కారం కొట్టి ఆభరణాలు చోరీ చేసేందుకు యత్నించాడు. అయితే ఆ యువకుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోటుచేసుకుంది. సరాఫా ప్రాంతంలో లవీన్ సోని అనే వ్యాపారి జ్యువెల్లరీ షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆభరణాలు కొనేందుకు దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి.. సోని కంట్లో కారం కొట్టి 50 గ్రాముల బంగారు ఆభరణాలతో పారిపోయేందుకు ప్రయత్నించాడు.(డిసెంబరు 3 నాటికి కరోనా కనుమరుగవుతుంది!) ఆ వ్యక్తి బంగారంతో పారిపోవడం గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మొత్తం షాపులోని సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది. పోలీసుల విచారణలో నిందితుడు మధ్యప్రదేశ్ దేవాస్ ప్రాంతానికి చెందిన ఆనంద్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామని, షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సరాఫా పోలీస్ స్టేషన్ ఇన్చార్జీ అమృత సింగ్ సోలంకి తెలిపారు. -
ఒక్కడి నుంచి వంద మందికి వైరస్!
చెన్నై : కరోనా.. ఎప్పుడు ఎక్కడనుంచి వస్తుందో తెలియని పరిస్థితి. ఒక వ్యక్తి ద్వారా 104 మందికి కరోనా సోకడం ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని(ఎన్ఎస్బీ రోడ్) ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే వ్యక్తికి జూన్ 22న కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతని నుంచి ఆ స్టోర్‌లో పనిచేసే మిగతా 303 సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా 104 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో దాదాపు అందరూ తురైయూర్, తాలూకాల గ్రామాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. దీంతో కేవలం 13 రోజుల్లోనే రెండు గ్రామాల్లో కరోనా కేసులు 10 రెట్లు పెరిగాయి. జూన్ 22 వరకు 10 కరోనా కేసులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 108కి చేరగా వారిలో నలుగురు మినహా అందరూ జ్యువెలరీ షాపుకి సంబంధించిన వారే కావడం గమనార్హం. అయితే మొట్టమొదటి కరోనా కేసు నమోదుకాగానే మిగతా సిబ్బందిని క్వారంటైన్‌కి పంపకుండా విధులు అప్పజెప్పారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ఎన్ఎస్బీ రోడ్‌లోని మిగతా దుకాణాలను కూడా రెండు వారాల పాటు మూసి వేయాలని ఆదేశించడంతో పాటు ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా గడచిన 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. (భారత్: 20 వేలు దాటిన కరోనా మరణాలు) -
జ్యువెలరీ షాపులో బంగారు నగలు పక్కదారి
మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ జ్యువెలరీ దుకాణంలో భారీస్థాయిలో బంగారు ఆభరణాలు పక్కదారి పట్టాయి. దుకాణ నిర్వాహకులకు ఏమాత్రం తెలియకుండా అక్కడ పని చేసే కొందరు సిబ్బంది గ్రూప్‌గా ఏర్పడి విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని రుణాలిచ్చే ఫైనాన్స్ కేంద్రంలో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.80లక్షల వరకు ఉంటుందని సమాచారం. తాకట్టు పెట్టిన తర్వాత వచ్చిన సొమ్మును సిబ్బంది ఒక్కొక్కరు రూ.ఐదు నుంచి రూ.ఏడు లక్షల వరకు పంచుకున్నట్లు తెలుస్తోంది. దుకాణంలో రోజుకు రోజుకు తగ్గుతున్న ఆభరణాలను కొంత ఆలస్యంగా గుర్తించిన జ్యువెలరీ దుకాణ యాజమాని ఏం జరిగిందని ఆరా తీస్తే అక్కడ పనిచేసే కొందరు దుకాణంలోంచి ఆభరణాలు తీసుకుపోయి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న వ్యవహారం బయటపడింది. దీంతో షోరూం యాజమాని హైదరాబాద్‌లోని పోలీస్ ఉన్నతాధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయం సమాచారం. మూడు రోజుల కిందట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌గౌడును సాక్షి వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కొన్ని ఆభరణాలు రీకవరీ కావాల్సి ఉందని, రెండురోజుల్లో ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
‘దుకాణం పైనే ఉండి కన్నం వేశాడు’
సాక్షి, హైదరాబాద్: నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ముఠాను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ నగర్లో ఉన్న ధనలక్ష్మి జువెలరీ షాప్‌లో ఈ నెల 11 న భారీ చోరీ జరిగింది. దాదాపు పావు కిలో బంగారం, 75 కిలోల వెండి దొంగిలించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు ఎనిమిది రోజుల్లోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 28 తులాల బంగారం, అరవై మూడు కిలోల వెండి, ఒక ట్రాలీ ఆటో, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: భార్యను బ్లాక్మెయిల్.. రూ.కోటి వసూలు!) వీటి విలువ సుమారు రూ.47 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులంతా రాజస్థాన్ చెందినవారే కావడం గమనార్హం. దొంగతనం జరిగిన ధనలక్ష్మి నగల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసే పప్పు రామ్ దేవాసి ప్రధాన నిందితుడిగా కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్నేహితులతో కలిసి తాను పనిచేసే దుకాణానికి పప్పు రామ్ కన్నం వేసాడని చెప్పారు. నిందితుడు పప్పు రామ్ తాను పనిచేసే దుకాణం పైనే నివాసం ఉండేవాడు. దుకాణ యజమానికి అనుమానం రాకుండా నమ్మకంగా ప్రవర్తిస్తూ అతని స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని కమిషనర్ తెలిపారు. -
వీళ్లు సామాన్యులు కాదు..
కుత్బుల్లాపూర్: బంగారు నగల దుకాణం లూటీకి యత్నిస్తుండగా అడ్డుకునేందుకు వచ్చిన ఎస్సైని కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించిన ముఠాను బాలానగర్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు కార్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నగరంతో పాటు సైబరాబాద్, రాచకొండ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో చిక్కుముడి వీడింది. సోమవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజారెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ నర్సింహారావు, డీఐ లు శంకర్, సుమన్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. బోయిన్పల్లి హస్మత్‌పేట ప్రాంతానికి చెందిన రంజిత్ సింగ్, బాన్సువాడ కు చెందిన రనీత్ సింగ్, మహారాష్ట్రకు చెందిన నర్సింగ్ సింగ్, కరన్ సింగ్, కర్తార్ సింగ్, మనోహర్ సింగ్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మారుతీ ఎగో కారును చోరీ చేసిన వీరు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో తొమ్మిది చోరీలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్లో ఒకటి, బోయిన్‌పల్లిలో ఒక చోరీకి పాల్పడ్డారు. మహారాష్ట్ర నుంచి రైళ్లలో నగరానికి చేరుకునే వీరు చోరీ అనంతరం రైలులోనే స్వస్థలాలకు చేరుకునే వారు. ఎస్సైపై దాడికి యత్నించి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెల 23న ఓ బంగారు నగల దుకాణంలో వీరు చోరీకి యత్నిస్తుండగా డ్యూటీలో ఉన్న దుండిగల్ ఎస్సై శేఖర్‌రెడ్డి వీరిని అడ్డుకున్నారు. దీంతో రంజిత్‌సింగ్, రజీత్‌సింగ్, నర్సింగ్ సింగ్ కారుతో ఏకంగా ఎస్సైపై హత్యాయత్నానికి ప్రయత్నించి అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు వెంట పడడంతో కారును చెట్టుకు ఢీకొట్టి మరో కారులో తప్పించుకున్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి పేట్ బషీరాబాద్, దుండిగల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, మేడ్చల్ ప్రాంతాలకు చెందిన ఎస్హెచ్ఓ లు, డీఐలతో పాటు బాలానగర్ సీసీఎస్, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు నగరం దాటి పోకుండా కట్టడి చేశారు. నిందితులు హస్మత్‌పేట ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొంపల్లి చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాలు అంగీకరించారు. వీరికి సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, ప్రస్తుతం ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితుల్లో రనీత్‌సింగ్ పై నిజామాబాద్ జిల్లాలో 2016లోనే పీడీయాక్ట్ నమోదై ఉందని తెలిపారు. కేసును చేధించడంలో ప్రధాన భూమిక పోషించిన అధికారులు, సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
అడ్డొచ్చిన ఎస్సై మీదకు కారు తోలడంతో..
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులోని దుండిగల్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. దోపిడీ యత్నాన్ని అడ్డుకోబోయిన దుండిగల్ ఎస్సై శేఖర్ రెడ్డిపైకి కారు ఎక్కించేందుకు యత్నించారు. దుండిగల్ ప్రాంతంలోని ఓ జ్యుయెలరీ షాప్ వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యాన్ నిలిచి ఉంది. సిబ్బందితో కలిసి అటుగా వెళ్తున్న ఎస్సై శేఖర్‌రెడ్డి ఆ వాహనాన్ని చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే, పోలీసుల రాకను గమనించిన దొంగలు.. వ్యాన్‌లో వేగంగా ముందుకు దూసుకెళ్లారు. అడ్డుకోబోయిన ఎస్సై శేఖర్‌రెడ్డిని ఢీకొట్టాలని చూశారు. ప్రమాదాన్ని గ్రహించిన ఎస్సై వెంటనే పక్కకు తప్పుకుని తమ వాహనంలో వారిని వెంబడించారు. కారును దూలపల్లి అడవుల్లోకి మళ్లించిన దొంగలు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. కారు, కట్టర్, షెటర్ తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు కొద్ది రోజుల క్రితం అల్వాల్‌లో చోరీకి గురైందని పోలీసులు తెలిపారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వ్యాపారిని బురిడీ కొట్టించిన.. కి‘లేడీలు’
సాక్షి, పాలకొండ రూరల్: పాలకొండ పోస్టాఫీస్ రోడ్డు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో రద్దీగా ఉంది. శుక్రవారం కృష్ణాష్టమి కావటంతో స్థానికులు పూజాసామగ్రి, తమ చిన్నారులకు కృష్ణుని వేషయం వేయించేందుకు అవసరమయ్యే వస్తువుల కొనుగోలులో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో పోస్టాఫీస్‌కు ఎదురుగా ఉన్న నాయుడు జ్యూయలరీలోకి ఇద్దరు మహిళలు వెళ్లారు. వెండి పట్టీలు కావాలని షాపు యజమాని లోలుగు శ్రీనివాసరావును అడిగారు. ఈ మహిళలకు వెండి పట్టీలు చూపిస్తున్న క్రమంలో మరో ఇద్దరు మహిళలు అక్కడకు చేరుకుని బంగారు చెవి దుద్దులు కావాలని అడగటంతో యజమాని ఆ మహిళలకు బంగారు వస్తువులు చూపించే పనిలో ఉన్నాడు. ఇదే అదునుగా చేసుకుని ముందు వచ్చిన కి‘లేడీ’లు మూడు కేజీల వెండి పట్టీలను చీరల్లో దాచిపెట్టి, యజమానిని మాటల్లో పెట్టి అక్కడ నుండి ఉడాయించారు. ఈ విషయాన్ని గంట వ్యవధి తర్వాత సీసీ కెమెరాలో గుర్తించిన వ్యాపారి లోబోదిబోమంటూ షాపు బయటకు వచ్చి చుట్టుపక్కల వాకాబు చేశాడు. అప్పటికే ఆ మహిళల అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఈ విషయం ఆనోటా, ఈనోటా మార్కెట్ అంతా తెలిసి సంచలనమైంది. విషయం తెలుసుకున్న ఇతర జ్యూయలరీ వ్యాపారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే రంగంలోకి దిగిన సీఐ ఎస్.ఆదాం ఘటన స్థలానికి చేరుకుని చోరీపై ఆరా తీశారు. షాపుల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. చోరీ చేసేందుకు వచ్చింది ఇద్దరా, లేక నలుగురు ఒకే ముఠా చెందిన వారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈ తరహా చోరీలకు పాల్పడిన మహిళల పాత చిత్రాలతో ప్రస్తుత సీసీ టీవీ ఫుటేజ్‌ను సరిపోల్చే పనిలో పడ్డారు. -
జ్యూయలరీ షాపులో చోరీ
ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : పటమట బందరు రోడ్డులోని ఓ జ్యూయలరీ షాపులో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సాయికిరణ్ జ్యూయలరీ షాపులో చొరబడి బంగారు, వెండి వస్తువులను అపహరించుకుపోయారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హెస్కూల్ రోడ్డు సమీపంలో ఉన్న జ్యూయలరీ షాపులో జరిగింది. షాపులోని 352 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి వస్తువులను అపహరించారు. పటమట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జ్యూయలరీ షాపు వెనుక భాగంలో రంధ్రం చేసి లోనికి ప్రవేశించారు. షాపులో ఉన్న బంగారు, వెండి వస్తువులను పట్టుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. కొన్ని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సాయంత్రం డాగ్ స్క్వాడ్‌తో షాపును, పరిసరాలను పరిశీలించారు. వేలిముద్రల్ని తీసుకున్నారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి దొంగల్ని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ఇది తెలిసిన వారి పనేనని భావిస్తున్నారు. జ్యూయలరీ షాపు పక్కనే భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడి కార్మికులు ఈ పని చేసి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దరాప్తు చేస్తున్నారు. పాత తరహాలో దొంగతనం? ఇదిలా ఉండగా చోరీ పాత తరహాలో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఇళ్లకు కన్నం వేసి దొంగతనం చేసిన ఘటనలు ఈ ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు జరిగాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
నగలు.. వగలు
-
బాలుడి సమాచారం... భారీ నేరం
ఓ బాలుడు ఇచ్చిన సమాచారంతో బందిపోటు ముఠా భారీ దొంగతనానికి పాల్పడింది. పాతబస్తీకి చెందిన జ్యువెలరీ దుకాణం యజమాని నుంచి 11కిలోల వెండిని దోచుకెళ్లింది. సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీకి చెందిన జ్యువెలరీ దుకాణం యజమాని నుంచి 11 కేజీల వెండిని దోచుకెళ్లిన బందిపోటు ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఆ దుకాణంలో పని చేసిన, దాని యజమాని సమీప బంధువు అయిన బాలుడు ఇచ్చిన సమాచారంతో పాత నేరగాళ్లు ఈ పని చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. నిందితులను నుంచి సొత్తును రికవరీ చేశామన్నారు. అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. శాలిబండకు చెందిన అజర్ ఫతేదర్వాజా చౌరస్తా ప్రాంతంలో జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడి సమీప బంధువైన ఓ బాలుడు గతంలో ఈ దుకాణంలో పని చేశాడు. అప్పట్లో దుకాణానికి ఆలస్యంగా వచ్చినా, సరిగ్గా పని చేయనందుకు దండించాడు. కొన్ని సందర్భాల్లో ఈ బాలుడి తండ్రికి అజర్ మిగిలిన బంధువుల ముందు అకారణంగా అవమానించే వాడు. దీంతో సదరు మైనర్ మాజీ యజమానిపై కక్షకట్టాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు అనువైన సమయం, అవకాశం కోసం ఎదురుచూశాడు. ఇదిలా ఉండగా ఖాజీపురాకు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ గతంలో ట్రావెల్ బిజినెస్‌తో పాటు చికెన్ సెంటర్ నిర్వహించాడు. దాదాపు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉండటంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో వీటి నుంచి బయటపడేందుకు ఏదైనా నేరం చేయాలని భావించాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన సదరు మైనర్‌తో పాటు ఖాజిపుర వాసి మహ్మద్ ఆసిఫ్‌తో చెప్పాడు. అప్పటికే అజర్‌పై కక్షతీర్చుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న బాలుడు వెంటనే స్పందించాడు. అజర్ ప్రతి రోజు రాత్రి దుకాణం మూసిన తర్వాత ఆభరణాలను బ్యాగ్‌లో పెట్టుకుని ఇంటికి తీసుకుçవస్తాడని తెలిపాడు. దీంతో అతడిని దోచుకోవాలని పథకం పన్నిన నిజాముద్దీన్ తన స్నేహితులైన ఫలక్‌నుమా వాసులు షేక్ ఖాలిద్, మహ్మద్ జావేద్ఖాన్, మిశ్రీగంజ్‌కు చెందిన మహ్మద్ ముఖరం అహ్మద్‌లతో చర్చించాడు. వారందరూ ఈ నేరంలో సహకరించడానికి అంగీకరించడంతో నిజాముద్దీన్ బందిపోటు దొంగతనానికి స్కెచ్ వేశాడు. అజర్ కదలికలపై సమాచారం అందించే బాధ్యతలను మైనర్ నిర్వహించాడు. మిగిలిన ఆరుగురూ మూడు బృందాలుగా విడిపోయారు. అజర్ దుకాణం నుంచి ఇంటికి వెళ్లేందుకు మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి. రెక్కీ ద్వారా ఈ విషయం గుర్తించిన నిజాముద్దీన్ ఒక్కో బృందాన్ని ఒక్కో మార్గంలో కాపుకాసేలా చేశాడు. ఇందుకుగాను తన రెండు బైక్‌లతో పాటు ఖాలిద్‌కు చెందిన మరో దానిని వినియోగించారు. ఈ నెల 17 అర్థరాత్రి పథకం అమలు చేయాలని నిర్ణయించుకున్న నిజాముద్దీన్ తన అనుచరులను రంగంలోకి దింపాడు. ఒక్కో బృందం ఒక్కో మార్గంలో కాపుకాసింది. ఆసిఫ్, ఖాలిద్‌లతో కూడిన టీమ్ మాత్రం శాలిబండలోని జగన్నాథస్వామి దేవాలయం వద్ద వాహనంపై వేచి ఉంది. నగల బ్యాగ్‌తో అజర్ దుకాణంలో పని చేసే మరో బాలుడితో కలిసి అదే మార్గంలో వస్తున్నట్లు సమాచారం అందింది. ఆ ప్రాంతానికి వచ్చిన బాధితుడిని బైక్‌పై ఫాలో అయిన ఈ ఇద్దరు దుండగులు ఓ ప్రాంతంలో అడ్డగించారు. వాహనం నడుపుతున్న ఆసిఫ్ వెంటనే అజర్‌పై దాడి చేయగా, వెనుక కూర్చున్న ఖాలిద్ తన వద్ద ఉన్న కారం పొడి చల్లాడు. ఈ హడావుడిలో నగల బ్యాగ్‌ను చేజిక్కించుకున్న ఆ ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శాలిబండ ఠాణాలో కేసు నమోదైంది. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్ వర్మ, వి.నరేందర్, మహ్మద్ తర్ఖుద్దీన్లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. నేరం జరిగిన ప్రాంతంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఫలితంగా దుండగులు వాడిన వాహనాల వివరాలతో పాటు వారి ఆనవాళ్లు గుర్తించింది. వీరి కోసం వేటాడిన పోలీసులు సోమవారం మైనర్ సహా ఆరుగురినీ అదుపులోకి తీసుకున్నారు. అజర్ నుంచి లాక్కుపోయిన బ్యాగ్‌లో ఉన్న 11 కేజీల వెండిని విక్రయించేందుకు ఖాజిపురకు చెందిన మహ్మద్ సల్మాన్, సయ్యద్ జిలానీలకు ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో వీరినీ పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ బందిపోట్లు ఎత్తుకుపోయిన సొత్తు, నేరం చేయడానికి వినియోగించిన వాహనాలు రికవరీ చేశారు. ఐదుగురికీ నేరచరిత్ర... ఈ బందిపోటు గ్యాంగ్ లీడర్ నిజాముద్దీన్‌తో పాటు అతడికి సహకరించిన నలుగురు ప్రధాన అనుచరులకూ నేర చరిత్ర ఉంది. నిజాంను హుస్సేనిఆలం పోలీసులు కల్తీ నూనె విక్రయం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆసిఫ్‌పై ఇదే ఠాణాలో దోపిడీ కేసు నమోదై ఉంది. షేక్ ఖాలిద్‌ను వాహనచోరీ కేసులో అఫ్జల్‌గంజ్ పోలీసులు కటకటాల్లోకి పంపారు. కాలాపత్తర్ ప్రాంతంలో నివసించే ఘరానా నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి నేరగాడు బాంబ్ గౌస్‌కు ప్రధాన అనుచరుడు, స్నేహితుడు. ఈ నేపథ్యంలో గతంలో నకిలీ కరెన్సీ కేసులో అతడితో కలిసి అరెస్టు అయ్యాడు. ఫలక్‌నుమ ఠాణాలో రౌడీషీటర్‌గా ఉన్న జావేద్ ఖాన్‌పై మొత్తం 11 కేసులు ఉన్నాయి. మరో నిందితుడైన అంజాద్ బహదూర్‌పుర పరిధిలో జరిగిన వసీం పహిల్వాన్ హత్య కేసు, కాలాపత్తర్‌లో నమోదైన బెదిరింపు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. -
కొత్త మోసం : ఎంటర్టైన్మెంట్ బ్యాంక్ కరెన్సీతో టోకరా
చండీగఢ్ : అవినీతి నిర్మూలన, నకిలీ నోట్ల కట్టడి అంటూ మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి.. జనాలను ముప్ప తిప్పలు పెట్టిన వైనాన్ని ఇప్పటికి మర్చిపోలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం కొత్త రంగుల్లో నూతన కరెన్సీని విడుదల చేసింది. పాపం ఈ కొత్త రంగుల కరెన్సీ వల్ల ఓ బంగారం షాపు యజమాని దాదాపు రెండు లక్షల రూపాయల వరకూ మోసపోయాడు. మోసగాళ్లు ఎంటర్టైన్మెంట్ బ్యాంక్ పేరుతో సొంత కరెన్సీని ప్రింట్ వేసి.. ఈ ఘరానా మోసానికి పాల్పడ్డారు. మోసపోయిన బాధితుడు ఇక నేను జీవితంలో కోలుకోలేను అంటూ విలపిస్తున్నాడు. వివరాలు.. శ్యామ్ సుందర్ వర్మ అనే వ్యక్తికి లుధియానాలో జ్యూవెలరి షాప్ ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఓ జంట బంగారం కొనాలని శ్యామ్ సుందర్ షాప్‌కి వచ్చింది. దాదాపు 56 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు 1. 90 లక్షల రూపాయల వరకూ ఉంటుందని తెలిసింది. బంగారం కొన్న అనంతరం సదరు జంట మాకు చాలా అర్జెంట్ పని ఉందంటూ ఓ నోట్ల కట్టను ఇచ్చేసే అక్కడి నుంచి హాడవుడిగా బయటపడ్డారు. అనంతరం శ్యామ్ సుందర్ వారు ఇచ్చిన నోట్లను పరిశీలించగా అవి నకిలీ నోట్లుగా తేలింది. సదరు జంట 500 రూపాయల నోట్ల కట్టను ఇచ్చారు. అవి చూడ్డానికి ఒరిజినల్ 500 రూపాయల నోట్ల రంగులోనే ఉన్నాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ అని ఉండాల్సిన చోట మాత్రం ఎంటర్టైన్మెంట్ బ్యాంక్ అని ఉందని బాధితుడు తెలిపాడు. వచ్చిన వాళ్లు తనకు నకిలీ నోట్లు ఇచ్చారని అర్థం చేసుకున్న శ్యామ్ సుందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి తనకు ఏళ్లు పట్టిందని.. ఈ నష్టాన్ని పూడ్చడం తనకు సాధ్యం కాదంటూ వాపోయాడు. -
రూ. 140 కోట్లు దోచేశారు
లక్నో : కాన్పూర్‌లో చోటు చేసుకున్న ఓ దొంగతనం పోలీసులతో పాటు జనాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. బిర్హానా రోడ్లో ఉన్న ఓ జ్యూవెలరి షాప్‌లో దాదాపు 140 కోట్ల రూపాయల విలువ చేసే సొత్తు చోరికి గురయినట్లు తెలిసింది. అయితే ఐదేళ్ల క్రితం మూసి వేసిన షాప్‌లో ఇంత భారీ దొంగతనం జరగడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాలు.. పార్టనర్ల మధ్య విబేధాలు తలెత్తడంతో బిర్హానా రోడ్డులో ఉన్న ఈ జ్యూవెలరి షాప్‌ని ఐదేళ్ల క్రితం మూసి వేశారు. ఈ వివాదం గురించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే కోర్టు పోలీసలు అధ్వర్యంలో షాప్‌ను ఒపెన్ చేయవచ్చంటూ ఆదేశించింది. దాంతో మరి కొద్ది రోజుల్లోనే షాప్‌ను తిరిగి తెరవాలని భావిస్తుండగా ఈ దొంగతనం చోటు చేసుకుంది. దొంగలు షాప్ నుంచి 10 వేల క్యారెట్ల విలువైన వజ్రాలు, 500 కేజీల వెండి, 100 కేజీల బంగారంతో పాటు 5 వేల క్యారెట్ల విలువ గల ఆభరణాలు దోచుకెళ్లినట్లు తెలిసింది. వీటితో పాటు షాప్‌కు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా తస్కరించినట్లు సమాచారం. షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపారు. షాప్ చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలిస్తున్నారు. -
తుపాకీతో హల్చల్.. బంగారం చోరికి యత్నం
సాక్షి, మేడ్చల్: తుపాకితో బెదిరించి బంగారు దుకాణంలో చోరికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ ఘటన జవహర్ నగర్, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దుమ్మాయిగూడలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద ఉన్న జ్యువెలరీ షాప్‌లో ఆరుగురు అగంతకులు తుపాకితో బెదిరించి చోరికి ప్రయత్నించారు. చోరీ సమయంలో ముఠా సభ్యులు అక్కడ ఉన్నవారిని బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న సమయంలో రోడ్డుపైన వెళ్తున్న వ్యక్తిని బెదిరించి బైక్ లాక్కుని ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ చోరికి యత్నించింది అంతర్ రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. అయితే జ్యువెలరీ షాప్‌లో బంగారం ఎంత చోరికి గురైందో తెలియాల్సివుంది. -
పంజాగుట్ట జువెల్లరీ షాపులో చోరీ
-
హైదరాబాద్‌లో సినీఫక్కీ తరహాలో భారీ దోపిడీ
-
అమీన్పూర్ జ్యువెల్లరీ షాపులో భారీ చోరీ
-
శ్రుతి బాటలో..
తమిళసినిమా: సినిమా ఇతర రంగాలకు కాస్త భిన్నమైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ రిస్క్ ఎక్కువే, ఆకర్షణ, క్రేజ్ ఎక్కువే. అలా లక్కుకిక్కు ఉన్న పరిశ్రమ సినిమా. ఈ రంగంలోకి ఒక్కసారి వస్తే, తిరిగి వెళ్లడం అంత సులభం కాదు. ఇక నటి కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే 2004లో బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చినా అక్కడ ఎవరూ గుర్తించలేదు. దీంతో దక్షిణాది సినిమాపై గురి పెట్టింది. ఇక్కడ కూడా మొదట్లో తడబడ్డా ఆ తరువాత నిలదొక్కుకుంది. కాజల్‌ను స్టార్‌ను చేసింది తెలుగు చిత్రం మగధీరానే. ఆపై తమిళం, తెలుగు చిత్రాల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. 14 ఏళ్ల తన నట జీవితంలో కాజల్ చాలా ఎత్తుపల్లాలను చూసింది. ఆ మధ్య సినిమా నిరంతరం కాదని, చాలినంత సంపాదించుకుని ఇతర వ్యాపారాల్లో దృష్టి సారించాలని పేర్కొంది. అలాంటిది ప్రస్తుతం తన నిర్ణయంలో మార్పు వచ్చింది. నిజానికి కాజల్‌అగర్వాల్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ప్యారిస్ ప్యారిస్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. ఇకపోతే ఈ బ్యూటీ వేరే రంగంలోనూ పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని గడిస్తోంది. మరో భాగస్వామితో కలిసి ముంబయిలో జ్యువెలరీషాప్ నడుపుతోంది. తాజాగా చిత్ర నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనలో ఉందట. దీని గురించి ఈ బ్యూటీ ఏమంటుందో చూద్దాం. జ్యువెలరీ వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో ఉన్నాను.. అదే విధంగా మంచి స్క్రిప్ట్ దొరికితే చిత్ర నిర్మాణం చేపట్టాలన్న ఆశ ఉంది. సరైన సందర్భం వచ్చినప్పుడు చిత్ర నిర్మాతగా అవతారమెత్తుతాను అని చెప్పింది. ఇటీవలే నటి శ్రుతిహాసన్ చిత్ర నిర్మాణంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాను సైతం అంటోందన్న మాట కాజల్. సరే ఇంతకీ ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తోంది. మరి ఏ భాషలో చిత్రాన్ని నిర్మిస్తుందో వేచి చూడాలి. -
దొంగలతో తలపడిన అక్కాచెల్లెల్లు
-
వైరల్ వీడియో; దొంగలతో తలపడిన అక్కాచెల్లెళ్లు
సాక్షి, బెంగుళూరు: నగరంలోని ఓ నగల దుకాణంలో ఓ ముఠా దోపిడీకి యత్నించడంతో కలకలం రేగింది. అయితే ఆ నగల వ్యాపారి కూతుళ్లిద్దరూ ధైర్యంగా వారికి ఎదురు తిరగడంతో ఆరుగురు సభ్యుల ఆ దొంగల ముఠా తోక ముడిచింది. ఈ ఘటన దక్షిణ బెంగుళూరులో రెండు వారాల క్రితం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జయానగర్‌లోని అశోక్ పిల్లర్ సమీపంలో రఘు(62) అనే వ్యక్తికి నగల కొట్టు ఉంది. మే 21(సోమవారం) రాత్రి 8 గంటల ప్రాంతంలో హెల్మెట్ ధరించిన ఓ ఆగంతకుడు నెక్లెస్ చూపించమని షాప్‌లో దూరాడు. అతని మాటలు నమ్మి రఘు షోకేస్ నుంచి నెక్లెస్ బయటకు తీయగానే మిగతా నగలన్నీ బయటపెట్టాలంటూ ఆ దొంగ కత్తి చూపించి బెదిరించాడు. ఏం జరుగుతుందో తెలియక అతను నిశ్చేష్టుడయ్యాడు. అదే సమయంలో బయట కాపలాగా ఉన్న మిగతా అయిదుగురు దొంగలు కుడా లోపలికి ప్రవేశించడంతో రఘు సహాయం కోసం కేకలు వేశాడు. అక్కడే ఉన్న అతని కూతుళ్లిద్దరూ వెంటనే స్పందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకుని ధైర్యంగా వారిని ప్రతిఘటించారు. తండ్రీ, కూతుళ్లు ఆ దొంగల ముఠాను బయటకు నెట్టారు. రద్దీ ప్రాంతం కావడంతో దొరికిపోతామనే భయంతో దుండగులు అక్కడ నుంచి జారుకున్నారు. కేసు నమోదు చేశామనీ, దుకాణంలోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దుండగులు హెల్మెట్ ధరించడంతో దర్యాప్తు కొంత ఆలస్యమవ్వొచ్చని అన్నారు. దోపిడీ యత్నం జరిగిన విధానాన్ని బట్టి వారు ప్రొఫెషనల్ దొంగలు కాకపోవచ్చని పోలీసులు తెలిపారు. -
ప్రేమను తిరస్కరించిందని చంపేసాడు
-
పట్టపగలు యువతి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ ప్రేమోన్మాది యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. బంగారు నగలు కట్ చేసే కట్టర్‌తో దాడికి తెగబడి ప్రాణాలు తీశాడు. సోమవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతడు ఓ పోలీసు అధికారి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అగ్గిరాముడు మధురానగర్‌లో ఇస్త్రీ షాపు నిర్వహించడంతోపాటు ఓ ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ జవహర్ నగర్లో కుటుంబంతో సహా అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె వెంకటలక్ష్మి (19) ఏడో తరగతి వరకు చదివింది. కొన్నాళ్లు ఇళ్లల్లో పని చేసింది. రెండు నెలల నుంచి జవహర్ నగర్‌లోని జోడి ఫ్యాషన్ జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్స్‌లో పని చేస్తోంది. ఈ షాపు యజమాని జ్యోత్స్న నాలుగు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లడంతో వెంకటలక్ష్మి దుకాణం నిర్వహిస్తోంది. సోమవారం కూడా స్టోర్స్ తెరిచిన వెంకటలక్ష్మి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో యజమానురాలికి ఫోన్ చేసింది. షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, తనను వేధిస్తున్నారని చెప్పింది. తర్వాత 3.30 గంటల సమయంలో ఓ యువకుడు షాప్‌లోకి వచ్చాడు. అక్కడే ఉన్న బంగారు నగలు కట్ చేసే కట్టర్‌తో వెంకటలక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడున్న వెంకటలక్ష్మిని స్థానికులు కొద్దిసేపటి తర్వాత గమనించారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల నుంచి వేధింపులు ఆరు నెలలుగా సాగర్ అనే యువకుడు తనను వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓసారి సాగర్ ఇలానే చేసినట్లు ఆమె పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిన కారణంగానే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే కుట్ర పన్ని సాగర్ గత నాలుగైదు రోజులుగా ఆమెను వెంటాడుతూ, ప్రతి కదలికను గుర్తించినట్లు తెలిసింది. దుకాణంలో ఒంటరిగా ఉందని, మధ్యాహ్నం వేళల్లో వినియోగదారుల రద్దీ కూడా ఉండదన్న ఉద్దేశంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో సాగర్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారు బయట కాపు కాయగా.. దుకాణంలోకి వెళ్లిన సాగర్ ఘాతుకానికి తెగబడినట్లు సమాచారం. గొంతు కోసిన తర్వాత సాగర్ ఆమె మెడలో ఉన్న చున్నీతో ఉరి వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు మధురానగర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. గతంలోనూ అతడు తమ కూతురిని బెదిరించాడని వెంకటలక్ష్మి కుటుంబీకులు తెలిపారు. రోదిస్తున్న వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నాం. స్థానికుల సమాచారంతోపాటు ఘటనా స్థలంలో ఉన్న సీసీఫుటేజీలు, వీధిలోని ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నాం. బాధితురాలి సెల్‌ఫోన్ కాల్‌డేటా సైతం పరిశీలిస్తున్నాం. – ఏఆర్ శ్రీనివాస్, వెస్ట్‌జోన్ డీసీపీ -
ఢిల్లీలొని నగల దుకాణ యాజమాని సాహసం
-
అచ్చంపేటలో భారీ చోరీ
సాక్షి, అచ్చంపేట: గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అచ్చంపేటలోని ఓనగల దుకాణంలో చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకుపోయారు. వెళ్తూ వెళ్తూ తమను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను సైతం ఎత్తుకెళ్లిపోయారు.. వివరాల్లోకి వెళ్తే అచ్చంపేట ఆలీ ఆభరణాల దుకాణంలో గత రాత్రి భారీ చోరీ జరిగింది. షాప్ వెనుకపైపు ఉన్న తలుపు పగలకొట్టి లోపలకి ప్రవేశించిన దొంగలు, సుమారు యాభైలక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు పెద్దమెత్తంలో నగదును దోచుకెళ్లారు. పారిపోతూ పోలీసులకు పట్టుపడకుండా ఉండేందుకు అతితెలివి ప్రదర్శించారు. దుకాణం భద్రతకోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తలుపు తెరచి చూసిన యజమానులు విషయం అర్థమై అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ చోరీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
నగల దుకాణంలో ఐటీ శాఖ తనిఖీలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని ఓ ప్రముఖ బంగారపు నగల దుకాణంలో ఐటీ శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయం పది గంటల నుంచి దుకాణం షట్టర్ మూసివేసి సోదాలు జరిపారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న130 దుకాణలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్లు తెలిసింది. చిత్తూరులోని దుకాణంలో తమిళనాడు అధికారులు సోదాలు చేశారు. అమ్మకం, కొనుగోళ్ల ఇన్వాయిస్లు, ట్యాక్స్ రిట్నర్న్ వంటి కీలక పత్రాలు పరిశీలించారు. దీంతో నగరంలోని చిన్నచిన్న బంగారపు దుకాణదారులు అప్రమతమై కొన్ని దుకాణాలను మూసివేశారు. సాయంత్రం వరకు ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటంతో నగరంలోని పలు నగల దుకాణదారుల్లో అలజడి మొదలైంది. -
అప్పు చేశారు.. అందకుండా పోయారు!
రణస్థలం: మరో ఆర్థిక నేరం. మొన్న నరసన్నపేట, నిన్న సంతకవిటి సంఘటనలు మర్చిపో క ముందే రణస్థలం మండలం పైడిభీమవరంలో ఇంకో మోసం వెలుగు చూసింది. జ్యూయలరీ షాపు అధినేతలుగా చెలామణీ అవుతున్న ఇద్దరు అన్నదమ్ములు రూ.15 కోట్లకుపైగా అప్పులు చేసి ఇప్పుడు ఎవరికీ కనిపించకుం డా పోయినట్లు తెలిసింది. దీనిపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీ ఆశతో అప్పులు ఇచ్చిన వారు పోలీసులను కూడా ఆశ్రయించలేకపోతున్నారు. అధిక వడ్డీ ఆశ చూపి.. రణస్థలం మండలంలోని పైడిభీమవరంలో ఏడెనిమిదేళ్లుగా వెంకటరామ జ్యూయలర్స్ యజమానులుగా చలామణీ అవుతున్న దన్నాన రామినాయుడు, లక్ష్మణ కస్టమర్లతో సన్నిహితంగా మెలిగేవారు. నూటికి రూ.6, రూ.10లు చొప్పున వడ్డీ ఇస్తూ చాలా మంది వద్ద అప్పులు చేశారు. అయితే నెలకు ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేస్తుండడంతో వీరికి అప్పులు ఇచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. రెండు మూడేళ్ల పాటు అదే మండలంలోని పైడిభీమవరం, నారువ, అక్కయ్యపాలెం పరిసర ప్రాంతవాసుల నుంచి సుమారు రూ.6కోట్ల వరకు అప్పులు చేశారు. ఇక్కడే కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, బెజ్జిపురం గ్రామాల్లో కూడా ఇలా ఆధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లలో అప్పులు చేసినట్లు సమాచారం. దీంతో పాటు బంగారం ఆర్డర్లు తీసుకుని తిరిగి వస్తువులు ఇవ్వకుండా తిప్పించిన దాఖలాలు కూడా ఇప్పుడే బయటపడుతున్నాయి. దాదాపు 200 తులాల వరకు బంగారం వస్తువులను వీరు వినియోగదారులకు ఇవ్వాల్సి ఉందని తెలిసింది. అయితే పది రోజులుగా వీరు కనిపించకపోవడంతో అప్పులు ఇచ్చిన వారిలో ఆందోళన పెరిగింది. వ్యసనాలకు అలవాటు పడేనా..? అన్నదమ్ముల్లో చిన్నవాడు లక్ష్మణకు అన్ని వ్యసనాలకు అలవాటు పడి, బెట్టింగ్‌లు ఇతరత్రా కార్యక్రమాలు చేసేవాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అన్నదమ్ములు పది రోజులుగా పత్తా లేకుండా పోవడంతో సుమారు 50 మంది బాధితులు ఈ అన్నదమ్ముల స్వగ్రామమైన బెజ్జిపురానికి వెళ్లి ఆ గ్రామ పెద్దలను కలిసి విషయం చెప్పారు. దీంతో అక్కడ పెద్దలు ఇచ్చిన సమాచారం విని వీరు అవాక్కయ్యారు. సొంత గ్రామంలో కూడా ఈ అన్నదమ్ములు అధిక వడ్డీల ఆశ చూపి రూ.కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పులు చెల్లించలేక వారి వద్ద ఉన్న సుమారు రెండెకరాల భూమిని రాసిచ్చేశారని తెలియడంతో బాధితుల్లో భయం పెరిగింది. తమ డబ్బులకు ఇక దిక్కెవరు అంటూ వీరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధిక వడ్డీలకు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వడంతో పోలీసులను కూడా ఆశ్రయించలేక లోలోపలే కుమిలిపోతున్నారు. దీనిపై జేఆర్ పురం ఎస్సై వి.సత్యనారాయణను వివరణ కోరగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
6 కిలోల బంగారం చోరీ!
కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో.. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు కోవెలకుంట్ల (బనగానపల్లె): కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఓ బంగారు నగల షాపు యజమాని ఇంట్లో భారీ చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో బంగారు నగలు, సొత్తు దొంగలు దోచుకెళ్లారు. యజమాని కోవెలకుంట్లలోని అమ్మవారిశాల సమీపంలో పెండేకంటి ఆంజనేయులు జ్యూవెలరీ షాపు నిర్వహిస్తు న్నాడు. భార్యకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఇంటికి తాళం వేసి శనివారం కుటుంబ సమేతంగా హైదరా బాద్‌లోని ఆసుపత్రికి వెళ్లారు. అదను చూసుకొని దొంగలు శనివారం అర్ధరాత్రి ఇంటి గేటు దూకి తాళాలు పగలగొట్టి బీరువా తలుపులు తెరిచి అందులో ఉన్న రూ.1.95 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున హైదరా బాద్ నుంచి వచ్చిన బాధితుడు ఇంట్లోకి వెళ్లి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యా దు చేశారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ వివరాలను తెలుసుకున్నారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
తుపాకులతో బెదిరించి రూ. 40లక్షల దోపిడి!
ఘజియాబాద్: బంగారపు షాపులో దుండగులు పడి రూ.40లక్షల విలువైన డబ్బు, బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం నగరంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రావల్పిండి జ్యువెలర్ లో ఐదుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా ముఖాలకు గుడ్డలు కట్టుకుని తుపాకీలతో లోపలికి ప్రవేశించారు. ఇద్దరు బయట బైక్ లతో సిద్ధంగా ఉండగా మిగిలిన ముగ్గురు 15 నిమిషాల్లో దోపిడీ పూర్తిచేసి తూర్పు వైపుగా పారిపోయారని పోలీసులు తెలిపారు. షాపులోకి ప్రవేశించిన తర్వాత దొంగలు జెబుల్లో నుంచి తుపాకీలు తీసి బెదిరించినట్లు ఓనర్ తెలిపాడు. షాపులో విలువైన వస్తువులతో పాటు క్యాష్ ను కూడా తీసుకువెళ్లినట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ల్లోని దొంగల గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఏటువంటి ఆధారాలు తమకు లభించలేదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సల్మాన్ తాజ్ పాటిల్ తెలిపారు. -
నగల దుకాణంలో ఐటీ సోదాలు
చైతన్యపురిలోని ఖజానా జువెలరీ షాప్‌పై గురువారం మధ్యాహ్నం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. దుకాణంలోని రికార్డులను పరిశీలించారు. సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హిమాయత్ నగర్‌లోని జువెల్లరీ షాపులో చోరీ
హైదరాబాద్ : హిమాయిత్ నగర్‌లోని ఓ జువెల్లరీ షాపులో గురువారం చోరీ జరిగింది. షాపులో పని చేసే వ్యక్తి ఆరు కిలోల బంగారంతో మహారాష్ట్రకు ఉడాయించాడు.దీంతో షాపు యజమాని నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఎస్ఐపై కాల్పులు.. పరిస్థితి విషమం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారెందుకని ప్రశ్నించినందుకు ఓ పోలీస్ అధికారిని దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. రాజేంద్ర ద్వివేది (50) లక్నోలోని టీపీనగర్ ప్రాంతంలో సోమవారం ఉదయం పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఒక బంగారు దుకాణం దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను గమనించి ప్రశ్నించారు. వారిలో ఒకడిని పట్టుకున్నారు. దీంతో మరో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎస్ఐ నడుము భాగంలో బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ పై కాల్పుల సందర్భంగా మిగిలిన పోలీసులు కాల్పులు జరిపినప్పటికీ వారు తప్పించుకొని పారిపోయారని సరోజినగర్ పోలీస్ స్టేషన్ అధికారి సుధీర్ కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ద్వివేది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. -
అమీర్‌పేటలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని గురుద్వార్ వద్ద ఓ నగల దుకాణంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. గణేష్ జుయెలర్స్లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన అక్కడి కాపలా సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్‌సర్క్యూటే మంటలకు కారణమని భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
రేపు జ్యువెలరీ షాపులు బంద్!
పాన్‌కార్డు నమోదు తప్పనిసరికి నిరసనగా జీజేఎఫ్ దేశవ్యాప్త సమ్మె కోల్‌కతా: దాదాపు 300 అసోసియేషన్స్‌కు చెందిన లక్షకు పైగా జ్యువెలరీ షాపు యజమానులు ఫిబ్రవరి 10న దేశవ్యాప్త సమ్మె చేయనున్నారు. రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సమ్మె చేపడుతున్నట్లు ‘ఆల్ ఇండియా జెమ్స్, జ్యువెలరీ ట్రేడ్ ఫెడరేషన్’ (జీజేఎఫ్) తెలిపింది. ప్రభుత్వపు చర్య.. దేశవ్యాప్తంగా ఉన్న అధిక సంఖ్యాక జ్యువెలర్స్, నగల తయారీదారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పేర్కొంది. అన్ని అసోసియేషన్స్ సహకారంతోనే సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను చెల్లించలేని, గ్రామాల్లో నివసించే, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నవారు అధికంగా ఉండే ప్రాంతాల్లోని బంగారు షాపుల వారి వ్యాపారానికి పాన్ కార్డు తప్పనిసరి చర్య అడ్డుగా పరిణమిస్తోందని జీజేఎఫ్ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా వివరించారు. భారత్‌లో కేవలం 22 కోట్ల పాన్ కార్డుల జారీ జరిగిందని, ప్రభుత్వపు చర్య వల్ల జ్యువెలరీ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. పాన్ కార్డు తప్పనిసరి చర్య అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి పరిశ్రమ మొత్తం టర్నోవర్ 30 శాతం తగ్గిందన్నారు. చిన్న వ్యాపారులు, పనివారు, నగల తయారీదారుల ఉపాధి కల్పన ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని బంగారు షాపు యజమానులు నష్టపోయే పరిస్థితి నెలకొందని జీజేఎఫ్ తూర్పు జోనల్ చైర్మన్ శంకర్ సేన్ పేర్కొన్నారు. దాదాపు 50 శాతంపైగా బంగారం వ్యాపారం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంద న్నారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుపై పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. -
బంగారు దుకాణంలో చోరీ
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చంద్రశేఖర్ జ్యువెలర్స్‌లో మంగళవారం ఉదయం చోరీ జరిగింది. చెవి పోగులు కొనేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు దుకాణం యజమాని కళ్లు కప్పి రూ. 2.50 లక్షల విలువైన 7 బంగారు గొలుసులను తీసుకుని పరారయ్యారు. ఆలస్యంగా గమనించిన దుకాణం యజమాని నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నోట్లో యాసిడ్ పోసి.. నగలు, నగదు దోపిడీ
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నేరేడుమెట్లో శనివారం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం షాపులోకి ఇద్దరు యువకులు ప్రవేశించి... అభరణాలు చూపించాలని యజమానిని హిందీలో అడిగారు. దాంతో యజమాని మోహన్ వారికి అభరణాలు చూపిస్తున్నాడు. ఆ క్రమంలో అభరణాలు బలవంతంగా లాక్కొనేందుకు యత్నించారు. దీంతో మోహన్ ప్రతిఘటించాడు. ఆగ్రహించిన ఇద్దరు దొంగలు మోహన్ తలపై ఆయుధంతో బాది... నోట్లో యాసిడ్ పోశారు. అనంతరం షాపు షటర్‌ను మూసివేసి ... షాపులోని 15 తులాల బంగారంతోపాటు నగదును దొంగలు బైక్‌పై పరారైయ్యారు. మోహన్ బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మోహన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యాసిడ్ కడుపులోకి వెళ్లడంతో ఆ భాగం మొత్తం మాడిపోయిందని అదికాక అతడు మాట్లాడలేక పోతున్నాడని తెలిపారు. పోలీసులు జ్యూయలరీ షాపునకు చేరుకుని.... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దొంగలు ఇద్దరు హిందీలో మాట్లాడారని మోహన్ కాగితంపై రాసి చూపించినట్లు పోలీసులు తెలిపారు. -
నోట్లో యాసిడ్ పోసి.. నగలు, నగదు దోపిడీ
-
బంగారు షాపుకు కన్నం.. నగలు చోరీ
-
బంగారు షాపునకు కన్నం.. నగలు చోరీ
హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్లో ఓ బంగారు షాపులో దొంగతనం జరిగింది. బీఎన్ రెడ్డి నగర్‌లోని శ్రియ జ్యుయలరీ షాపు గోడకు దొంగలు కన్నం వేసి చోరీ చేశారు. షాపులోని బంగారం, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
పట్టపగలు నగలు చోరీ
షాపు తెరిచిన వెంటనే అగంతకుల ప్రవేశం రెప్పపాటులో ఆభరణాలతో ఉడాయింపు విలువ రూ.1.12కోట్లు పథకం ప్రకారమే చోరీ అవాక్కయిన యజమాని తగరపువలస: తగరపువలస ప్రధానరహదారిలో సాయిపద్మ జ్యూయలరీ షాపులో గురువారం ఇద్దరు వ్యక్తులు నాలుగున్నర కిలోల బంగారు ఆభరణాలు చేజిక్కించుకుని ఉడాయించారు. వీటి విలువ రూ.1.12కోట్లు ఉంటుంది. సంఘటన వివరాలిలా.. జ్యువెలరీ షాపు పైభాగంలో యజమాని ఉప్పల రత్నశ్రీకాంత్ తోపాటు తండ్రి ఈశ్వరరావు, సోదరుడు సాయి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. రోజూ షాపు మూసివేసిన తరువాత ఆభరణాలను ఇంట్లో పెట్టుకుని ఉదయం తెరచిన తరువాత తిరిగి తీసుకురావడం రత్నశ్రీకాంత్కు అలవాటు. ఎప్పటిలాగే గురువారం తొలుత ఆలయంలో దండం పెట్టుకుని తర్వాత ఆభరణాల బ్యాగుతో షాపునకు వచ్చారు. వచ్చి తలుపులు తెరిచారు. అందులో పనిచేసే అమ్మాయి తుడుస్తుండగా రత్నశ్రీకాంత్ లోపల సోఫాపై ఆభరణాలు ఉంచారు. దేముని పటం వద్దకు దండం పెట్టుకోవడానికి వెళ్లారు. అప్పటికే బయట ద్విచక్రవాహనంపై మాటువేసిన పాతికేళ్ల వయసున్న ఇద్దరు యువకులలో ఒకరు షాపులోకి చొరబడి రెప్పపాటు కాలంలో బ్యాగును అందుకున్నాడు. వెంటనే ద్విచక్రవాహనం వద్దకు ఒక్క ఉదుటున వచ్చి ఎక్కేశాడు. ఇద్దరూ రాములమ్మ థియేటర్ వైపు ఉడాయించారు. వీరిలో ఒకరు నిక్కరు వేసుకున్నట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇద్దరు ముఖానికి మాస్కులు వేసినట్లు తెలిసింది. యజమానితో పాటు పక్కనే షూ మార్టు షాపులో ఫర్నిచర్ పనులు చేస్తున్న ముగ్గురు వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. క్రైమ్ డీసీపీ టి. రవికుమార్ మూర్తి, ఈస్ట్ ఏసీపీ రమణ, సీసీఎస్ ఏసీపీ రమేష్, పద్మనాభం సీఐ కాంతారావు, భీమిలి ఎస్ఐ వై. అప్పారావు, క్రైమ్ హెడ్‌కానిస్టేబుల్ సీతాపతి సంఘటన స్థలంకు చేరుకున్నారు. ప్రత్యక్షసాక్షులను విచారించారు. నిందితుని ఊహాచిత్రాలను గీయించారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాలతో పాటు చెక్‌పోస్టుల వద్ద తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దొంగలకు కలిసొచ్చిన అంశాలు పట్టపగలు ఆభరణాలు అపహరణకు గురైనా షాపులో సీసీ కెమేరా ఆఫ్‌చేసి ఉంది. దీంతో నిందితులు ఆచూకీ లభించలేదు. సమీపంలోని పలు షాపులలో కూడా సీసీ కెమేరాలను పరిశీలించినా ఆనవాళ్లు దొరకలేదు.{పయాణికులతో రద్దీగా ఉండే ఈ కూడలిలో పుష్కరాలు కారణంగా బస్సులు లేకపోవడంతో బోసిపోయింది. అంబేద్కరు కూడలి ఖాళీగా ఉండటం, అదే సమయంలో వర్షం కురుస్తున్న కారణంగా నిందితులు తప్పించుకున్నట్టు తెలుస్తుంది.వీరు బ్యాగుతో ఆభరణాలు ద్విచక్రవాహనంపై పట్టుకుపోతున్నప్పుడు వెంబడించినవారు కూడా అరవలేదు. పరుగెత్తడంతోనే ఇతరులకు అక్కడ ఏమి జరిగిందే తెలియరాలేదు. కనీసం ద్విచక్రవాహనం నంబర్‌కూడా చూడలేదని వెంబడించినవారు తెలిపారు. -
పట్టపగలే 7 కిలోల బంగారం చోరీ
తగరపువలస(విశాఖపట్టణం): విశాఖ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. విశాఖపట్నంలోని తగరపువలస ప్రాంతంలోని ఓ నగల దుకాణంలో గురువారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. మెయిన్ రోడ్డులో ఉన్న సాయిపద్మ జ్యువెలరీ దుకాణం పై అంతస్తులో యజమాని ఉప్పల శ్రీకాంత్ నివాసం ఉంటుంది. దుకాణంలో సొత్తును ప్రతిరోజూ ఆయన ఇంట్లోనే భద్రపరుస్తుంటారు. రోజు మాదిరిగానే సుమారు ఏడు కిలోల బంగారు, వెండి ఆభరణాలను దుకాణంలోకి తీసుకువచ్చిన శ్రీకాంత్ వాటిని అక్కడే ఉంచి... ఎదురుగా రోడ్డు అవతల ఉన్న సాయిబాబా ఆలయంలోకి వెళ్లారు. అక్కడ బాబాను దర్శించుకుని తిరిగి వచ్చి చూసేసరికి నగలు ఉన్న బ్యాగులు కనిపించలేదు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నగల దుకాణంలో చోరీ... దొరికిన దొంగలు
నారాయణవనం : చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో ఆదివారం ఉదయం ఓ నగల దుకాణంలో దొంగతనం జరిగింది. అయితే దుకాణదారుల అప్రమత్తతతో కొద్దిసేపటికే నిందితులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం నారాయణవనంలోని ఓ నగల దుకాణం తెరుస్తుండగానే ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు దుకాణంలోకి ప్రవేశించారు. ఆభరణాలు చూపించాలని కోరటంతో సిబ్బంది వారికి కావాల్సిన వస్తువులను చూపించారు. అయితే ఆగంతకులు వాటిలో నుంచి 60 గ్రాముల బంగారు నగలను మాయం చేసేశారు. వారు వెళ్లిన తర్వాత కొన్ని నగలు కనిపించకపోవటంతో దుకాణం సిబ్బంది అనుమానంతో సీసీ ఫుటేజిని పరిశీలించారు. దాంతో దుకాణం సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి.. స్థానికులిచ్చిన సమాచారంతో పక్కనే పుత్తూరులో ఉన్న నిందితులను పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. ఆ ముగ్గురూ పాత నేరస్తులేనని, వారిపై దొంగతనం కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. -
నగల దుకాణంలో చోరీ
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలంలోని ఓ నగల దుకాణంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యలమంచిలి మండలంలోని 'గాయత్రి జుయెలర్స్' అనే నగల దుకాణంలో గోడకు కన్నం వేసి దుకాణంలో ఉన్న 150 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును దొంగిలించారు. సోమవారం ఉదయం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సెక్యూరిటీ గార్డు గన్ను.. దోచుకెళ్ళాడిలా..!
-
నగల దుకాణంలో చోరీ
పైకప్పు తొలగించి 5కిలోల వెండి, 4 తులాల బంగారు ఆభరణాల అపహరణ తాండూరు: తాండూరు పట్టణంలోని ఓ జువెలర్స్ దుకాణంలో చోరీ జరిగింది. సోమవారం అర్థరాత్రి తరువాత దుండగులు దుకాణంలోకి ప్రవేశించి 5 కిలోల వెండి, 4 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. దుకాణం యజమాని కథనం ప్రకారం.. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలోని టి.సంజయ్‌కుమార్‌కు చెందిన శ్రీరంజని జువెలర్స్ దుకాణం ఉంది. సోమవారం రాత్రి సుమారు 9గంటల ప్రాంతంలో దుకాణాన్ని మూసి సంజయ్‌కుమార్ ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా చోరీ జరిగినట్టు తెలిసింది. దుకాణం పైకప్పు బండలను తొలగించి దుండగలు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోని వస్తువులు చిందరవందరగా పడిఉన్నాయి. దుకాణంలోని 5 కిలోల వెండి ఆభరణాలతోపాటు 4 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితుడు వివరించాడు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.2లక్షలకుపైగా ఉంటుందని వివరించారు. గతంలో కూడా ఒకసారి దుండగలు ఈ దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారన్నారు. మంగళవారం ఉదయం చోరీ సమాచారం తెలియగానే తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ నాగార్జునలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. అయితే దీపావళి పండుగకు ముందు ఈ జువెల్లర్స్ దుకాణం పక్కనే ఉన్న దుస్తుల దుకాణంలో కూడా ఇదే మాదిరిగా దుండగలు చోరీకి పాల్పడ్డారు. మరి ఈ రెండు చోరీలు ఒకే ముఠా చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. -
నగల దుకాణంలో అగ్నిప్రమాదం : ఆస్తి నష్టం
విజయవాడ: నగరంలోని కన్యకాపరమేశ్వరీ దేవాలయం సమీపంలోని ఓ నగల దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో హుటాహుటిన ఘటన స్థాలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే షాపులో అగ్రిప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో భారీగానే ఆస్తినష్టం సంభవించినట్లు షాపు యాజమాన్యం వెల్లడించింది. -
చార్మినార్ లో దోపిడీ దొంగల బీభత్సం
-
చార్మినార్ లో దోపిడీ దొంగల బీభత్సం
హైదరాబాద్:నగరంలో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. ఆదివారం ఒక జ్యూయలరీ షాపులోకి తెగబడ్డ కొందరు దుండగులు అక్కడ హల్ చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం జ్యూయలరీ షాపు యజమాని కాళ్లు, చేతులు కట్టేసి భారీ స్థాయిలో నగలు దోచుకున్నారు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఆ దుండగులు దోచుకెళ్లిన నగలు విలువ రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని జ్యూయలరీ షాపు యజమాని స్పష్టం చేశాడు. -
జ్యూయలరీ షాపులో భారీ చోరీ
అచ్చంపేట :అచ్చంపేట నడిబొడ్డు, 24 గంటలూ ఇసుక లారీల రాకపోకలతో రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలిలోని ఆంజనేయస్వామి విగ్రహ సెంటర్‌లోగల గంగాభవానీ జ్యూయలరీ షాపులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కొందరు దుండగులు షాపు పైకప్పునకు కన్నం వేసి మూడు కిలోల బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదు దోచుకుపోయారు. జ్యూయలరీ షాపులో సీసీ కెమెరాలు కూడా లేవు. పోలీసు అధికారులు సంఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మండలంలో సంచలనం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు రోజూలాగే షాపును నిర్వహించి అనంతరం తాళాలు వేసి యజమాని మణికంఠ ఇంటికి వెళ్లారు. యధావిధిగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన ఆయన షాపు షట్టర్ తాళాలు తీసి లోపలికి వెళ్లాడు. షో కేసుల్లో బంగారు ఆభరణాలు, క్యాష్ బాక్స్‌లో ఉంచిన నగదు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు రూరల్ సీసీఎస్ అదనపు ఎస్పీ శోభామంజరి, సత్తెనపల్లి డీఎస్పీ ఎన్ఆర్ వెంకటేశ్వరనాయక్, క్రైం డీఎస్పీ శ్రీనివాసరావు, సత్తెనపల్లి టౌన్ సీఐ శోభన్‌బాబు, సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. గుంటూరు నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. షాపు వెనుకభాగాన సీలింగ్‌కు, పైకప్పుకు మధ్య ఉన్న గోడకు నాలుగు పలకలుగా కన్నం వేసి దుండగులో షాపులోకి వచ్చినట్లు గుర్తించారు. అక్కడ రెండు మద్యం సీసాలు పడివుండడంతోపాటు అన్నం తిన్న ఆనవాళ్లు ఉన్నాయి. గోడ పగులగొట్టేందుకు ఉపయోగించిన పెద్దసైజు ఉలి కూడా లభ్యమైంది. గోడను కట్ చేసేందుకు ఎలక్ట్రానిక్ కట్టర్ మిషన్‌కు ఉపయోగించే విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి కట్టర్ సహాయంతో గోడను కట్‌చేసి, ఉలితో గోడకు ఉన్న ఇటుకలను ఒక్కొక్కటి జాగ్రత్తగా తొలగించి మనిషి పట్టేవిధంగా నాలుగు పలకలుగా రంధ్రం చేసి, జాగ్రత్తగా కిందకు దిగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు షో కేసుల్లోని మూడు కిలోల బంగారు ఆభరణాలు, క్యాష్ బాక్స్‌లోని రూ.8 లక్షల నగదు అపహరించారు. వారు వెండి వస్తువుల జోలికి వెళ్లలేదు. ఆభరణాల్లో బ్రాస్లెట్స్, నెక్లెస్‌లు, ఉంగరాలు, వంద గ్రాముల బరువుగల మూడు బంగారు బిస్కెట్లు ఉన్నాయి. మొత్తం రూ.70లక్షల నుంచి 80 లక్షల వరకు విలువైన ఆభరణాలు, నగదు దోచుకున్నారని బాధితుడు మణికంఠ తెలిపారు. తన తండ్రి పత్తి వ్యాపారానికి సంబంధించి రూ.8 లక్షల నగదును షాపులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్ని కోణాల్లో పరిశోధన చేశారు. సాయంత్రం వచ్చిన డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలం నుంచి సత్తెనపల్లి రోడ్డులోని సాయిబాబా గుడివరకు వెళ్లి ఆగిపోయింది. షాపు యజమానుల విచారణ.. షాపు యజమాని బొగ్గవరపు పుల్లారావు, ఆయన కుమారుడు మణికంఠలను విచారిం చారు. క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన పుల్లారావు రెండేళ్ల క్రితం అచ్చంపేటలో జ్యూయలరీ షాపు నెలకొల్పాడు. తాను పత్తి వ్యాపారం చేసుకుంటూ జ్యూయలరీ షాపును కుమారుడు మణికంఠకు అప్పగించారు. ఆరు నెలలుగా మణికంఠ జ్యూయలరీ షాపు పూర్తి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. వారం రోజుల క్రితం షాపు పైకప్పు పాక్షికంగా దెబ్బతినడంతో మరమ్మతులు చేయించారు. ఈ క్రమంలో షాపులో చోరీ జరగడంతో తాపీ మేస్త్రీలు, విద్యుత్ వర్కర్లపైనా, ఇతరత్రా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యూయలరీ వ్యాపారం కూడా ఒడిదుడుకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చోరీ కేసును ఛేదిస్తామని ఏఎస్పీ శోభామంజరి పేర్కొన్నారు. -
ప్రకాశం జిల్లాలో జ్యూయలరీ షాప్‌లో భారీ చోరీ
ప్రకాశం: దోపిడీ దొంగల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. బంగారు దుకాణాలపై కన్నేసిన దొంగలు అదును చూసి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఆదివారం ఓ జ్యూయలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. జీవన్ జ్యూయలర్స్ బంగారు దుకాణం నుంచి 28తులాల బంగారం, 6కేజీల వెండిని దొంగలు అపహరించినట్టు సమాచారం. -
చా(చో)ర్ సిస్టర్స్...!
ఏడాదిలో ఆరు జ్యువెలరీ షాపుల్లో చేతివాటం 28.5 తులాల బంగారం రికవరీ సాక్షి, సిటీబ్యూరో: ఆ నలుగురు అక్కాచెల్లెళ్లు. జ్యువెలరీ షాపు సిబ్బంది దృష్టి మళ్లించి అందినకాడికి కాజేయడం వీరి వృత్తి. ఇందుకు భర్తల అండదండలు కూడా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ ముఠా ఆరు నగల దుకాణాల్లో రూ.9.26 లక్షల విలువైన 28.5 తులాల బంగారు నగలు దోచుకుంది. వెస్ట్‌జోన్ పోలీసులు ఈ చా(చో)ర్ సిస్టర్స్‌తో పాటు ఇద్దరు భర్తను అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు. డీసీపీ సత్యనారాయణ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం... చిలకలగూడకు చెందిన జుబేదాబేగం (25), తాహేరాబేగం (27), ఫరీదా (24), సాబేరాబేగం (29) అక్కాచెల్లెళ్లు. జుబేదాబేగం భర్త మహ్మద్ హనీఫ్ (30), ఫరీదా భర్త మహ్మద్ అజహర్ (25)ఆటో డ్రైవర్లు. ఆరుగురూ ముఠాగా ఏర్పడ్డారు. వినియోగదారుల ముసుగులో నగల దుకాణాలకు వెళ్లి.. అక్కడి సేల్స్మన్స్, సెక్యూరిటీ సిబ్బం ది దృష్టి మళ్లించి నగలు చోరీ చేయడం తో ఈ నలుగురు అక్కాచెల్లెళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ‘పని’ పూర్తయ్యాక షాపు బయట ఆటోతో సిద్ధంగా ఉండే భర్తలతో కలిసి పారిపోతుంటారు. ఇలా పట్టుబడ్డారు.... ఈనెల 2న ఈ ముఠా హుమాయున్‌నగర్ ఠాణా పరిధిలోని మెహిదీపట్నంలో ఉన్న సత్యనారాయణ జ్యవెలరీ షాప్‌లో 8 బంగారు గోలుసులను కాజేసింది. ఈ ముఠా చోరీ చేసినప్పటి దృష్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజు కెమెరా ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలించి, అందులో బురఖాలు ధరించి ఉన్న నలుగురు మహిళా నిందితులను గుర్తించారు. బుధవారం మెహిదీపట్నం రైతు బజార్ వద్ద ఈ ముఠాను పట్టుకున్నారు. విచారణలో పంజగుట్ట ఠాణా పరిధిలోని ఖజానా జ్యువెలరీస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్, త్రిభువన్దాస్ భీమ్జీ జ్యువెలరీస్షాప్, మీర్‌చౌక్ ఠాణా పరిధిలోని సత్యనారాయణ జ్యువెలరీ షాప్, హుమాయున్‌నగర్ ఠాణా పరిధిలోని సత్యనారాయణ జ్యువెలరీ షాప్, మహ్మద్ అక్బర్ జ్యువెలరీ షాపుల్లో చోరీలక పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మొత్తం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో అదనపు డీసీపీ కేఆర్ నాగరాజు, ఆసిఫ్‌నగర్ ఏసీపీ డి.శ్రీనివాస్, డీఐ జి.రాజు, డీఎస్ఐ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇద్దరు స్నాచర్ల అరెస్టు.... ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకొని స్నాచింగ్స్ పాల్పడుతున్న ఇద్దరు ఆటో డ్రైవర్లను హుమాయున్‌నగర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.30 లక్షల విలువైన 8.2 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సత్యనారాయణ కథనం ప్రకారం...ఫస్ట్‌లాన్సర్‌కు చెంది న మహ్మద్ అబ్దుల్ గఫర్ (25), రాజేం ద్రనగర్కు చెందిన మహ్మద్ మెహరాజ్ (38) ఆటో డ్రైవర్లు. జల్సాలకు అలవాటుపడ్డ ఇద్దరూ ఈజీమనీ కోసం స్నాచింగ్‌లు ప్రారంభించారు. గతంలో 14 ప్రాంతాలలో స్నాచింగ్‌లకు పాల్పడి జైలుకెళ్లారు. రెండు నెలల క్రితం బెయిల్‌పై విడుదలైన వీరు మళ్లీ పాతదందా ప్రారంభించారు. హుమాయున్‌నగర్ ఠాణా పరిధిలోని విజయనగర్‌కాలనీ, మాసాబ్ట్యాంక్లలో నాలుగు స్నాచింగ్ లు చేశారు. వీరిద్దరినీ కూడా పోలీసులు బుధవారం అరెస్టు చేసి వారి నుంచి 8.2 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదుకు కమిషనర్‌కు సిఫారసు చేస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల నేరాలు తగ్గడంతో పాటు కేసు మిస్టరీ త్వరగా వీడుతుందని ఆయన ఈ సందర్భంగా వ్యాపారులకు డీసీపీ సూచించారు. -
చట్టం.. గిట్టం జాన్తానై!
జ్యువెలరీ షాప్‌లో చోరీ జరిగింది రూ.16 లక్షలు ఎఫ్ఐఆర్లో రూ.3 లక్షలే చూపిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెబుతోంది. అయితే, చట్టం.. గిట్టం జాన్తానై అంటున్నారు కుషాయిగూడ పోలీ సులు. జ్యువెలరీ షాప్ చోరీ విషయంలో బాధితుడు రూ.16 లక్షల సొత్తు పోయిం దని ఫిర్యాదు చేస్తే కాదు.. కాదు రూ.3 లక్షల సొత్తే పోయిందంటూ ఎఫ్ఐఆర్ చేశారు. దుకాణంలో సొత్తు ఎంత ఉంది? ఎంత పోయిందనే వివరాలను సాక్ష్యాలతో సహా బాధితుడు అందజేసినా పోలీ సులు మాత్రం తాము చెప్పిందే వేదం అనే రీతిలో వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలివీ... కుషాయిగూడకు చెందిన రాజేష్ స్థానిక రాధిక చౌరస్తాలో పూజా సిల్క్స్ పేరిట వస్త్ర, బంగారు నగల షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇతని షాప్‌లో దొంగలు చొరబడిరూ.16 లక్షల విలువైన 38 కిలోల వెండి ఆభరణాలు, రూ.90 వేలు నగదు ఎత్తుకెళ్లారు. రాజేష్ తన ఫిర్యాదులో చోరీకి ముందు తన దుకాణంలో 78 కిలోల వెండి ఆభరణాలున్నాయని, ప్రస్తుతం 40 కిలోల వెండి మాత్రమే మిగిలిందని.. సుమారు 38 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని స్పష్టంగా పేర్కొన్నాడు. అయితే పోలీసులు పోయిన సొత్తుకు విలువ కట్టుకుండా కేవలం రూ.3 లక్షల విలువైన (7.5 కిలోల వెండి ఆభరణాలు) చోరీకి గురైనట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. చట్టప్రకారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేయాలి. ఫిర్యాదులోని అంశాలన్నీ నిజమా? కాదా అని నిర్ధారించుకోవాలి. బాధితుడు తప్పుడు ఫిర్యాదు చేశాడని తేలితే అతనిపై చర్యలు తీసుకునే వీలు ఉంది. అయితే పోలీసుల అలా చేయకుండా దర్యాప్తుకు ముందే ఒక నిర్దారణకు రావడం దురదృష్టకరం. దీంతో బాధితుడు నష్టపోయే అవకాశం ఉంది. రేపోమాపో దొంగలు దొరికితే ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సొత్తునే కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో బాధితుడు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. చోరీ అయిన సొత్తును తక్కువగా చూపించడం పోలీసులకు తగదు. చోరీ సొత్తుకు సంబంధించిన రసీదులన్నీ తమ వద్ద ఉన్నాయని బాధితుడు పేర్కొన్నాడు. పది తాళాలు-ఆరు డోర్లు..... జ్యువెలరీ షాప్‌లో చోరీకి పాల్పడిన దొంగలు పది పెద్ద తాళాలను, మూడు గ్రిల్ డోర్స్, రెండు ఐరన్ డోర్స్, ఒక కాడ్బోర్డ్ డోర్‌ను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఇవన్నీ చేయడానికి కనీసం రెండు గంటలకు పైగానే పట్టింది. కాగా, బంగారు నగలు కలిగిన బీరువా తెరుచుకోకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. -
జ్యువెలరీ షాపులో చోరీ
39 కిలోల వెండి ఆభరణాల అపహరణ ఉప్పల్: గ్రిల్స్ తొలగించి బంగారు, వస్త్ర దుకాణం లోపలికి చొరబడ్డ దుండగులు 39 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వెంకట రమణ కథనం మేరకు... రాధిక చౌరస్తాలో పూజా సిల్క్స్ పేరిట రాజేష్ వస్త్ర, బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 10.30కి షోరూం మూసివేసి ఇళ్లకు వెళ్లారు. బుధవారం ఉదయం రాజేష్, సిబ్బంది దుకాణం తెరిచి చూడగా.. క్యాష్ కౌంటర్ తెరచి ఉంది. రెండో అంతస్తులో ఉన్న బంగారు నగల కౌంటర్ గ్రిల్స్ తొలగిం చి ఉన్నాయి. దీంతో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అల్వాల్ జోన్ డీసీపీ కె.కోటేశ్వరరావు, ఏసీపీ జి.ప్రకాశరావు, ఇన్స్పెక్టర్ వెంకట రమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ వచ్చినా అది రెండు ఫ్లోర్లలోనే తిరగడంతో ఫలితం లేకపోయింది. నిచ్చెన సహాయంతో.. షోరూం పక్క భవనంపై నుంచి నిచ్చెన సాయంతో దొంగలు షోరూం 3వ అంతస్తులోకి చొరబడ్డారు. మెట్లగుండా రెండో అంతస్తులోకి వచ్చి.. అక్కడ ఎనిమిది ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్న వెండి నగలను మూటగట్టుకుని బంగారు నగల లాకర్‌ను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. క్యాష్ కౌంటర్లో ఉన్న కొంత నగదును కూడా ఎత్తుకుపోయారు. కాగా, రెండేళ్ల క్రితం కూడా ఈ దుకాణంలో చోరీ జరిగినా యాజమాన్యం తగిన భద్రత చర్యలు తీసుకోలేదు. చోరీ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయక పోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ విషయమై ఫిర్యాదు చేసేందుకు షోరూం యాజమాన్యం రాత్రి 8 గంటల వరకు మీనమేషాలు లెక్క పెట్టడం కూడా వాటికి బలం చేకూరుస్తోంది. తొలుత నాలుగు కిలోల వెండి మాత్రమే చోరీ అయినట్లు తెలిపిన యాజమాన్యం, ఫిర్యాదులో మాత్రం 39 కిలోల వెండి, కొంత నగదు చోరీ అయినట్లు పేర్కొనడం గమనార్హం. -
కన్నేస్తే.. నగలు మాయం
కాకినాడ క్రైం: జ్యూయలరీ షాపుల్లో చోరీలకు పాల్పడిన మహిళను కాకినాడ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ వన్ టౌన్ క్రైం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎస్సై పి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురం మిరపకాయల వారి వీధికి చెందిన పెరుమాళ్ల మణి అలియాస్ చిట్టిని ఆయా షాపుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సోమవారం కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చోరీల వివరాలు తెలిశాయి. రద్దీగా ఉండే జ్యూయలరీ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెళ్లినట్లు నటించేది. షాపు సిబ్బంది మరో వస్తువు చూపించేందుకు వెనక్కు తిరిగిన వెంటనే ఆభరణాలను తస్కరించేంది. వారు వస్తువు పోయిందని గమనించేలోపు ఉడాయించేది. కాకినాడ ఖజానా జ్యూయలర్స్, మల్బార్ గోల్డ్, గ్రంధి జ్యూయలరీ షాపు, విశాఖపట్నం వైభవ్, విజయనగరం సీఎంఆర్ షాపింగ్ మాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమె వద్ద నుంచి రూ. 5.60 లక్షల విలువైన 197.540 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిందితురాలిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీనివాసరావు, ఏఎస్సై సత్యనారాయణ, సిబ్బంది వెంకటేశ్వరరావు, ప్రసాద్, నాయుడు, అజయ్, బాబు, ఫణికుమార్‌ను డీఎస్పీ ఆర్.విజయభాస్కర రెడ్డి, కాకినాడ సెంట్రల్ క్రైం స్టేషన్ సీఐ అల్లు సత్యనారాయణ అభినందించారు. -
అమ్మో రాధిక!
-
జ్యువెలరీ షాపులోభారీ అగ్ని ప్రమాదం
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక బెంగళూరు రోడ్డులోని జ్యువెలరీ దుకాణంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకొని పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. పోలీసుల కథనంమేరకు.. నగరానికి చెందిన బసవరాజ్ అనే వ్యక్తి శ్రీలక్ష్మీ గోల్డ్ ప్యాలెస్ అనే జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఉన్న ఫళంగా దుకాణంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకొని మంటలు చెలరేగాయి. క్షణాల్లో దుకాణమంతా వ్యాప్తించడంతో భయాందోళనకుగురైన సిబ్బంది కేకలువేస్తూ బయటకు పరుగులు తీశారు. సమీపంలోని దుకాణాలవారు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. అగ్ని మాపక దళం ఘటనా స్థలానికి చేరుకొనిమంటలను ఆర్పివేశారు. అప్పటికే రూ.10 లక్షల మేర ఫర్నీచర్, వస్తువులు కాలి బూడిద అయ్యాయని షాపు యజమాని పేర్కొన్నారు. జ్యువెలరీ వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సోని, సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి ధైర్యం చెప్పారు. -
చెల్లని చెక్కులు ఇచ్చి టోకరా
-
జ్యూయలరీ షాపు దగ్ధం
రామాయంపేట, న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తు ఓ జ్యూయలరీ షాపు దగ్ధమైన ఘటన మండలంలోని నిజాంపేటలో శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడు సురేష్ చౌదరి కథనం ప్రకారం.. నిజాంపేట గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ ఇంట్లో ఏడాది క్రితం శ్రీరాందేవ్ జ్యూయలరీ పేరిట షాపు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎప్పటిలాగే దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున దుకాణంలోంచి మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో చుట్టుపక్కల వారు సురేష్ చౌదరికి సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడకు చేరుకొని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అదే దుకాణంలో స్టీల్, ఫ్యాన్సీ సామగ్రి కూడా ఉండడంతో నష్టం భారీగా వాటిల్లింది. సుమారు 10 లక్షల విలువ గల స్టీల్, ఫ్యాన్సీ స్టోర్ సామగ్రి, 10 తులాల బంగారం, 20 కిలోల వెండి పూర్తిగా దగ్ధమైందని, వీటి మొత్తం విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని బాధితుడు సురేష్ చౌదరి తెలిపారు. కాగా ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.