చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని ఓ ప్రముఖ బంగారపు నగల దుకాణంలో ఐటీ శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయం పది గంటల నుంచి దుకాణం షట్టర్ మూసివేసి సోదాలు జరిపారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న130 దుకాణలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్లు తెలిసింది. చిత్తూరులోని దుకాణంలో తమిళనాడు అధికారులు సోదాలు చేశారు. అమ్మకం, కొనుగోళ్ల ఇన్వాయిస్‌లు, ట్యాక్స్ రిట్నర్న్ వంటి కీలక పత్రాలు పరిశీలించారు. దీంతో నగరంలోని చిన్నచిన్న బంగారపు దుకాణదారులు అప్రమతమై కొన్ని దుకాణాలను మూసివేశారు. సాయంత్రం వరకు ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటంతో నగరంలోని పలు నగల దుకాణదారుల్లో అలజడి మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment