
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులోని దుండిగల్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. దోపిడీ యత్నాన్ని అడ్డుకోబోయిన దుండిగల్ ఎస్సై శేఖర్ రెడ్డిపైకి కారు ఎక్కించేందుకు యత్నించారు. దుండిగల్ ప్రాంతంలోని ఓ జ్యుయెలరీ షాప్ వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యాన్ నిలిచి ఉంది. సిబ్బందితో కలిసి అటుగా వెళ్తున్న ఎస్సై శేఖర్‌రెడ్డి ఆ వాహనాన్ని చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే, పోలీసుల రాకను గమనించిన దొంగలు.. వ్యాన్‌లో వేగంగా ముందుకు దూసుకెళ్లారు.
అడ్డుకోబోయిన ఎస్సై శేఖర్‌రెడ్డిని ఢీకొట్టాలని చూశారు. ప్రమాదాన్ని గ్రహించిన ఎస్సై వెంటనే పక్కకు తప్పుకుని తమ వాహనంలో వారిని వెంబడించారు. కారును దూలపల్లి అడవుల్లోకి మళ్లించిన దొంగలు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. కారు, కట్టర్, షెటర్ తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు కొద్ది రోజుల క్రితం అల్వాల్‌లో చోరీకి గురైందని పోలీసులు తెలిపారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment