shekhar reddy
-
కూటమి కవ్వింపు.. వైఎస్సార్సీపీ నేత భవనం కూల్చివేతకు ప్లాన్
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. తాజాగా తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులకు ధ్వంసం చేసేందకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రి రోడ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.కూటమి సర్కార్ అండతో ఏపీలో అధికారులు ఓవరాక్షన్‌కు దిగారు. తాజాగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి డీబీఆర్ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో కూల్చివేతకు దిగారు మున్సిపల్ అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలకు రావడంతో స్థానిక వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది.అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుపతి నగరం కార్పొరేషన్ పరిధిలో కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులు ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ కుట్రలు చేస్తోంది. డీబీఆర్ ఆసుపత్రి రోడ్లో శేఖర్ రెడ్డి ఐదు అంతస్థుల భవనం నిర్మాణంలో ఉండగా మూడవ అంతస్తులో కూల్చివేతలు చేపట్టారు.ఇక, కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం నోటీసులు ఇవ్వాలి. 15 రోజులు సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికార బలంతో కూల్చివేతకు దిగుతున్నారు. కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. తిరుపతిలో @JanaSenaParty కక్ష సాధింపు రాజకీయాలు వైయస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డికి చెందిన భవనాన్ని కూల్చేసేందుకు కూటమి నేతలు పన్నాగం శేఖర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ.. లీగల్ టీమ్‌తో కలిసి ఆ భవనం వద్దకు వెళ్లిన తిరుపతి వైయస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్… pic.twitter.com/rfB5G03b6F— YSR Congress Party (@YSRCParty) February 1, 2025 -
ప్రశ్నిస్తే కేసులు.. ఇంత భయమా!
-
సాక్షి టీవిలో కూర్చున్నావ్.. నెక్స్ట్ ఏసేది నిన్నే.. YSRCP నేతకు వాట్సాప్ లో వార్నింగ్
-
వచ్చే ఎన్నికల్లో YSRCP గెలిచే ఛాన్స్ ఎంత...ఆధారాలతో శేఖర్ రెడ్డి
-
దివ్యాంగుడికి ‘గృహలక్ష్మి’ చేయూత
భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన దివ్యాంగుడైన చుక్క నరేశ్, పావని దంపతులు గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోనే మొదటి ప్రొసీడింగ్‌ను అందుకున్నారు. ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.. నరేశ్ ఇంటికి వెళ్లి రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. శనివారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా అక్కడ మగ్గం పనిచేస్తున్న చుక్క పావని, నరేశ్ కుటుంబం దీనస్థితిని తెలుసుకొన్నారు. వారికి సొంత ఇల్లు లేదని తెలుసుకొని వెంటనే స్పందించిన మంత్రి.. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ప్రొసీడింగ్‌ను అందజేయాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలసి నరేశ్ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తమ సొంతింటి కల నెరవేరనుండటంతో ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలలక్ష్మిశ్రీనివాస్, సర్పంచ్ కోట అంజిరెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంని జయించేది ఎవరు?
భువనగిరి నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన పైళ్ల శేఖర్ రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది కుంభా అనిల్‌కుమార్ రెడ్డిపై 24063 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉన్న ఈ ప్రాంతం నుంచి టిఆర్ఎస్ తేలికగా గెలించింది. కాగా ఇక్కడ యువ తెలంగాణ పార్టీ పక్షాన పోటీచేసిన జిట్టా బాలకృష్ణారెడ్డికి 13400 పైచిలుకు ఓట్లు వచ్చాయి. శేఖర్ రెడ్డికి 84898 ఓట్లు రాగా, అనిల్ కుమార్ రెడ్డికి 60556 ఓట్లు వచ్చాయి. శేఖర్ రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గం నేత. 1985 నుంచి భువనగిరిలో అప్రతిహతంగా విజయ దుంధుభి మోగిస్తున్న తెలుగుదేశం పార్టీ 2014లో తొలిపారి ఓడిపోయింది. మాజీ మంత్రి, దివంగత నేత ఎ.మాధవరెడ్డి, ఆయన భార్య ఉమ మూడు దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతి నిద్యం వహించారు. 2014లో టిఆర్ఎస్ నేత పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరిలో విజయం సాధించారు. విశేషం ఏమిటంటే ఆయన సమీప ప్రత్యర్ధిగా స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి కావడం. శేఖర్‌రెడ్డి 15416 ఆధిక్యతతో గెలిచారు. ఉమా మాధవరెడ్డికి 24569 ఓట్లు వచ్చాయి. ఆమె ఇక్కడ రెండో స్థానంలో కూడా లేరు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉండడం కూడా కారణం కావచ్చు. మాధవరెడ్డి నాలుగుసార్లు విజయం సాధిస్తే ఆయన భార్య ఉమా మాధవరెడ్డి మూడుసార్లు గెలుపొందారు. 1999 ఎన్నికల తర్వాత నక్సల్ ఘాతుకానికి మాధవరెడ్డి బలైపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలోను, 2004, 2009లలో ఉమా మాధవరెడ్డి గెలిచారు. మాధవరెడ్డి గతంలో ఎన్.టి.ఆర్, ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్లలో పనిచేశారు. ఉమ కూడా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు. భార్యభర్తలిద్దరూ మంత్రులైన ఘనత వీరికి దక్కింది. భువనగిరి, ఆలేరులలో గతంలో గెలుపొందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవిలు రెండుసార్లు గెలుపొంది శాసన సభ్యులుగా ఉండడం మరోరికార్డు. రామచంద్రారెడ్డి ఒకసారి మెదక్‌జిల్లా నుంచి, ఒకసారి ఇక్కడ నుంచి గెలవగా, కమలాదేవి ఆలేరు నుంచి మూడుసార్లు గెలిచారు. భువనగిరిలో పిడిఎఫ్ రెండుసార్లు, సిపిఐ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందగా, టిడిపి ఏడుసార్లు టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. కేంద్ర మాజీ మంత్రి ఎ. నరేంద్ర 2004లో ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కాగా జిట్టా బాలకృష్ణరెడ్డి 2009లో టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలో ఉండగా, 2014, 2018లలో స్వతంత్రుడిగా పోటీచేశారు. తెలంగాణ పోరాట యోధుడు, కమ్యూనిస్టు పార్టీ నేత రావి నారాయణరెడ్డి భువనగిరిలో రెండుసార్లు గెలిచారు. 1952లో ఈయన ఒకేసారి లోక్‌సభకు, అసెంబ్లీకి గెలుపొందారు. తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కొండా లక్ష్మణ్‌బాపూజీ మరో రెండుసార్లు చినకొండూరులో గెలిచారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కూడా ఒకసారి విజయం సాధించారు. ఈయన దామోదరం సంజీవయ్య, కాసు మంత్రివర్గాలలో పనిచేశారు. భువనగిరిలో పద్నాలుగుసార్లు రెడ్లు గెలుపొందితే, రెండుసార్లు పద్మశాలి, ఒకసారి ఎస్.సి వర్గం నేతలు గెలుపొందారు. భువనగిరి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/దిల్సుఖ్నగర్/ముషీరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మొదలైన ఐటీ సోదాలు గురువారం రెండోరోజూ కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 36లో ఉన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటితోపాటు కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. తనిఖీల్లో వారి కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలు, లాకర్లు, బ్యాలెన్స్ షీట్లను అధికారులు సేకరించారు. ఒక్కో కంపెనీకి చెందిన ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించారు. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి... పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసిన రియల్ ఎస్టేట్, మైనింగ్ సహా ఇతర వ్యాపారాలపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్ సిండికేట్ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు తెలిసింది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను సైతం అధికారులు తెరిపించారు. పన్నుల ఎగవేతపై ఆరా తీశారు. సోదాలయ్యాక వారి సంగతి చూస్తా: ఎమ్మెల్యే మర్రి ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేయగా తన ఇంటి నుంచి బయటకు వచ్ఛి న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఐటీ అధికారులు వారి పని చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోవైపు తమ సిబ్బందిని ఐటీ అధికారులు బెదిరించారని... కొందరిపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. అధికారులకు చేయి చేసుకొనే హక్కు లేదని... అలా జరిగితే తాము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు. సోదాలు ముగిశాక వారి సంగతి చూస్తామన్నారు. కాగా, ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కొండపల్లి మాధవ్ నివాసంపై బుధవారం ఉదయం 5 గంటలకు మొదలైన ఐటీ దాడులు రాత్రి 12 గంటలకు ముగిశాయి. తన ఇంటిపై ఐటీ దాడులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని మాధవ్ ఆరోపించారు. -
ఈ సినిమాతో క్లారిటీ వచ్చింది – కార్తికేయ
‘‘90 ఎంఎల్’ కథ ఎంపిక చేసుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనుకున్నా. ప్రేక్షకులు నన్ను వైవిధ్యంగా చూడటానికి ఇష్టపడుతున్నా రని ఈ సినిమాతో క్లారిటీ వచ్చేసింది’’ అని కార్తికేయ అన్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘శుక్రవారం విడుదలైన మా సినిమా సక్సెస్ అయ్యిందని సోమవారంతో పూర్తిగా అర్థమైంది. ప్రతి సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి వంద శాతం కష్టపడతా’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బి,సి సెంటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు శేఖర్ రెడ్డి. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కథానాయిక నేహా సోలంకి పాల్గొన్నారు -
అడ్డొచ్చిన ఎస్సై మీదకు కారు తోలడంతో..
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులోని దుండిగల్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. దోపిడీ యత్నాన్ని అడ్డుకోబోయిన దుండిగల్ ఎస్సై శేఖర్ రెడ్డిపైకి కారు ఎక్కించేందుకు యత్నించారు. దుండిగల్ ప్రాంతంలోని ఓ జ్యుయెలరీ షాప్ వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యాన్ నిలిచి ఉంది. సిబ్బందితో కలిసి అటుగా వెళ్తున్న ఎస్సై శేఖర్‌రెడ్డి ఆ వాహనాన్ని చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే, పోలీసుల రాకను గమనించిన దొంగలు.. వ్యాన్‌లో వేగంగా ముందుకు దూసుకెళ్లారు. అడ్డుకోబోయిన ఎస్సై శేఖర్‌రెడ్డిని ఢీకొట్టాలని చూశారు. ప్రమాదాన్ని గ్రహించిన ఎస్సై వెంటనే పక్కకు తప్పుకుని తమ వాహనంలో వారిని వెంబడించారు. కారును దూలపల్లి అడవుల్లోకి మళ్లించిన దొంగలు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. కారు, కట్టర్, షెటర్ తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు కొద్ది రోజుల క్రితం అల్వాల్‌లో చోరీకి గురైందని పోలీసులు తెలిపారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
శేఖర్‌రెడ్డికి చెందిన 34 కోట్ల ఆస్తులు అటాచ్
చెన్నై: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము కేసులో టీటీడీ ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో పాటు పలువురి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. సుమారు రూ.34 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్ కింద టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డిసహా నలుగురిపై సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దు అనంతరం శేఖర్‌రెడ్డి అతని భాగస్వాముల ఇళ్లు, ఆస్తులపై గత ఏడాది డిసెంబర్లో ఆదాయపుపన్నుశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి రూ.131 కోట్ల నగదు, ఇందులో రూ.34 కోట్ల కొత్త కరెన్సీ, 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణ బాధ్యత సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఈ మొత్తం డబ్బు, బంగారం అంతా తనదేనని శేఖర్‌రెడ్డి చెబుతున్నా.. వీటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఈడీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో వాటిని అటాచ్ చేసుకుంటున్నట్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. -
శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ
చెన్నై: టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు జె.శేఖర్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసి, సోమవారం రాత్రి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 28 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా సీబీఐ కేసులో శేఖర్ రెడ్డి సోమవారం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి రాగానే ఆయన్ని ఈడీ సుమారు 10 గంటలపాటు విచారణ జరిపింది. శేఖర్ రెడ్డితో పాటు మరో ముగ్గుర్ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఇన్కమ్ టాక్స్ (ఐటీ) అధికారులు జరిపిన సోదాల్లో శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లలో రూ. 170 కోట్ల నగదు, 127 కిలోల బంగారం దొరికిన సంగతి తెలిసిందే. దీనిపై శేఖర్ రెడ్డిపై నేరపూర్వక కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్ కింద శేఖర్‌రెడ్డి సహా నలుగురిపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ పై విడుదల అయిన శేఖర్ రెడ్డిని నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. -
శేఖర్‌రెడ్డిపై మరో రెండు కేసులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి, అతని అనుచరులపై సీబీఐ మంగళవారం మరో రెండు కేసులు నమోదు చేసింది. శేఖర్‌రెడ్డి అతని భాగస్వాముల ఇళ్లు, ఆస్తులపై గత నెల 8వ తేదీన ఆదాయపుపన్నుశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి రూ.131 కోట్ల నగదు, ఇందులో రూ.34 కోట్ల కొత్త కరెన్సీ, 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణ బాధ్యత సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ చేతుల్లోకి వెళ్లింది. ఈ కేసులో శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, అన్నాడీఎంకే నేత దిండుగల్లు రత్నం, పుదుక్కోట్టై రామచంద్రన్ లను అరెస్ట్ చేశారు. శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులుల జ్యుడిషియల్ కస్టడీ బుధవారంతో ముగియనుంది. వేలూరులో రూ.8 కోట్ల కొత్త నోట్లు, తిరుచ్చిరాపల్లిలో రూ.1.5 కోట్లు దాచి ఉంచారనే ఆరోపణలతో శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రేమ్‌రెడ్డి లపై సీబీఐ అధికారులు తాజాగా మరో రెండు కేసులు నమోదు చేసి మంగళవారం మళ్లీ అరెస్ట్ చేశారు. మంగళవారం గట్టి బందోబస్తు మధ్య ఆ ముగ్గురిని పుళల్ జైలు నుంచి చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని.. బ్యాంకు మోసం కేసుల ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వెంకటస్వామి సమక్షంలో విచారణ జరిగింది. ఒకే రకమైన ఆరోపణలపై రెండోసారి అరెస్ట్ చేయవచ్చా అనే సందిగ్ధంలో తేదీ ప్రకటించకుండా కేసును వాయిదా వేశారు. -
శేఖర్ రెడ్డి అరెస్ట్
• శ్రీనివాసరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న సీబీఐ • కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు • వీరితో బ్యాంకర్లు, ప్రభుత్వోద్యోగులు కుమ్మక్కైనట్లు ఆరోపణ సాక్షి ప్రతినిధి, చెన్నై/ న్యూఢిల్లీ: టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు జె.శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుడు కె.శ్రీనివాస రెడ్డిలను సీబీఐ అధికారులు బుధవారం చెన్నైలో అరెస్ట్ చేశారు. చెన్నై ఎగ్మూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా జనవరి 3వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వారిని పుళల్ జైలుకు తరలించారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఇన్కమ్ టాక్స్ (ఐటీ) అధికారులు జరిపిన సోదాల్లో శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లలో రూ. 170 కోట్ల నగదు, 127 కిలోల బంగారం దొరికిన సంగతి తెలిసిందే. దీనిపై శేఖర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, ప్రేమ్ కుమార్లపై నేరపూర్వక కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఐటీ దాడుల్లో నిందితుల నుంచి రూ. 170 కోట్లు దొరియాయని, వాటిలో రూ. 34 కోట్ల విలువైన కొత్త రూ. 2,000 నోట్లు ఉన్నాయని సీబీఐ అధికారులు మీడియాకు చెప్పారు. పాత పెద్ద నోట్లను కొత్త నోట్లుగా మార్చుకునేందుకు వివిధ బ్యాంకులకు చెందిన గుర్తు తెలియని ఉన్నతాధికారులు నిందితులకు సహకరించారని పేర్కొన్నారు. పలువురు బ్యాంకు అధికారులు ఆర్బీఐ మార్గదర్శకాలకు తూట్లుపొడుస్తూ ‘ప్రతిఫలం’ ఆశించి నిందితులకు కొత్త నోట్లు అందజేశారని వివరించారు. ఈ ముగ్గురు నిందితులు.. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కుమ్మక్కై లెక్కలో లేని పాత నోట్ల (నల్లధనం)ను కొత్త నోట్లుగా మార్చి భారత ప్రభుత్వాన్ని మోసం చేశారన్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి. రామ్మోహన్రావు కుమారుడితో శేఖర్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు. -
టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అరెస్ట్
-
టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అరెస్ట్
చెన్నై: అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు, బంగారం దాచిన కేసులో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు సోదరుడిని, ఆడిటర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని చెన్నై సీబీఐ కోర్టులో హాజరుపరచగా జనవరి 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శేఖర్‌రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇటీవల దాడులు చేసి మొత్తం రూ. 106.52 కోట్ల నగదు, రూ. 36.29 కోట్ల విలువ చేసే 127 కిలోల బంగారం, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము ఇదేనని ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. ఈ కేసు వెలుగుచూసిన తర్వాత శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్ కింద శేఖర్‌రెడ్డి సహా నలుగురిపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామ్మోహన్ రావు కొడుకుతో శేఖర్ రెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ రోజు రామ్మోహన్ రావు కార్యాలయం, బంధవుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. -
శేఖర్‌రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసుల నమోదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్ కింద టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డిసహా నలుగురిపై సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. టీటీడీ పాలకమండలి బహిష్కృత సభ్యుడు శేఖర్‌రెడ్డితోపాటు ఆయన వ్యాపార భాగస్వాములైన ప్రేమ్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఇటీవల మెరుపు దాడులు చేసి భారీ ఎత్తున నగదు, కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐకి అప్పగించాలని ఆదాయపు పన్ను శాఖాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ సంస్థలు మంగళవారం కేసు నమోదు చేశాయి. -
పట్టుపడకుండా నంబర్ల జంబ్లింగ్
శేఖర్‌రెడ్డి కరెన్సీ వ్యవహారంలో బ్యాంకు అధికారుల తెలివి ► కేసు విచారణకు వందమందితో బృందాన్ని ఏర్పాటు చేసిన సీబీఐ సాక్షి ప్రతినిధి, చెన్నై: కాంట్రాక్టర్‌గా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో చక్రం తిప్పిన శేఖర్‌రెడ్డి కేసును ఛేదించేందుకు వందమందితో కూడిన అధికారుల బృందాన్ని సీబీఐ నియమించింది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా శేఖర్‌రెడ్డికి కోట్లాది రూపాయల కొత్త నోట్లు చేరేందుకు, నిందితులు పట్టుబడకుండా వరుస నంబర్ల జంబ్లింగ్ సలహా ఇచ్చి సహకరించిన బ్యాంకు అధికారులెవరో కనుగొనేందుకు ఈ బృందం పనిచేస్తోంది. చెన్నైలో స్థిరపడిన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన శేఖర్‌రెడ్డి, ఆయన భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఈనెల 7న దాడులు జరపడం తెలిసిందే. చెన్నై, వేలూరు, కాట్పాడిల్లో జరిగిన సోదాల్లో రూ.170 కోట్ల నగదు, 177 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. (ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా నగదు) పట్టుబడిన నగదులో రూ.70 కోట్లు కొత్త కరెన్సీ(రూ.2వేల నోట్లు) అని తెలుస్తోంది. చెన్నై బ్రోకర్ ద్వారా పాతనోట్లకు కొత్త కరెన్సీ పొందినట్లు శేఖర్ అంగీకరించారన్నారు. కరెన్సీ మార్పిడికి సహకరించారనే అనుమానంతో 50 మందిని విచారించారు. ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ పట్టుబడిన సొమ్మంతా తనదేనని శేఖర్‌రెడ్డి అంగీకరించినందున తగిన పన్ను వసూలు చేయడం మినహా ఈ కేసులో తాము అంతకంటే ముందుకెళ్లలేమని చెప్పారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి కరెన్సీని రిజర్వు బ్యాంకుకు అప్పగించడం ఆనవాయితీ. అత్యవసర పరిస్థితుల్లో నేరుగా బ్యాంకులకూ పంపడం జరుగుతుందన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో కొత్త కరెన్సీని సమకూర్చడంలో అత్యవసర పరిస్థితులు తలెత్తగా దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు బ్యాంకు అధికారులు ప్రెస్ నుంచే వచ్చిన కరెన్సీని నేరుగా శేఖర్‌రెడ్డికి చేరవేసినట్లు నమ్ముతున్నామన్నారు. ఐటీ, విజిలెన్స్, సీబీఐ అధికారుల కళ్లు కప్పేందుకే కొత్త కరెన్సీ నంబర్లను తెలివిగా జంబ్లింగ్ చేసినట్లు తెలిపారు. -
ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా నగదు
-
ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా నగదు
విశాఖపట్టణం స్పెషల్ బ్రాంచ్ నుంచి శేఖర్‌రెడ్డికి సరఫరా సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ ఎత్తున నగదు, బంగారంతో పట్టుబడిన టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డికి ప్రింటింగ్ ప్రెస్ ద్వారానే కొత్త కరెన్సీ అందినట్లు తెలిసింది. ఇందుకు పది మంది అధికారులు ఆయనకు సహకరించినట్లు సమాచారం. శేఖర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఇటీవల ఐటీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి రూ.161 కోట్ల నగదు, 179 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో రూ.2వేల నోట్లు రూ.34 కోట్లు కొత్త కరెన్సీ అని అధికారిక సమాచారం కాగా రూ.70 కోట్లుగా అనధికారిక సమాచారం. ఇంత భారీ మొత్తంలో శేఖర్‌రెడ్డికి ఎలా లభించిందని ఆశ్చర్యపోయిన అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. రూ.2వేల నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా శేఖర్ రెడ్డికి అందినట్లు తేలింది. ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన నోట్లను రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు, అక్కడినుంచి ఇతర బ్యాంకులకు పంపిణీ జరగాలి. ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక శాఖ (స్కేప్)లకు పంపారు. స్కేప్‌గా పిలిచే ఈ శాఖలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణం, హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ శాఖలకు వచ్చిన కొత్త కరెన్సీని యథాతథంగా శేఖర్‌రెడ్డికి బదలాయించారు. దీన్ని ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
శేఖర్‌రెడ్డి అక్రమాలపై బాబు నోరు విప్పాలి!
ధ్వజమెత్తిన సీపీఐ రాష్ట్ర సమితి సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల అండతో టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి వంటి నల్లకుబేరులు రూ.వందల కోట్లను తెల్లడబ్బుగా మార్చుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపకపోవడం విస్మయం కలిగిస్తోందని సీపీఐ రాష్ట్ర సమితి ధ్వజమెత్తింది. ఏ ప్రభుత్వ అధినేత అండతో శేఖర్‌రెడ్డి రూ.70 కోట్ల కొత్త కరెన్సీని సంపాదించారో చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇలాంటి ఘరానా మోసగాళ్లకు చంద్రబాబు ఎలా పదవులు కట్టబెట్టారో చెప్పాలని నిలదీసింది. రెండు రోజులుగా విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం మీడియాకు విడుదల చేశారు. శేఖర్‌రెడ్డి ఇంట్లో వందల కోట్ల డబ్బు, కిలోల కొద్దీ బంగారం దొరికిన తర్వాత టీటీడీ బోర్డు నుంచి తీసేసినంత మాత్రాన చంద్రబాబు పాపం ప్రక్షాళన అయిపోదని, ఆ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. టీటీడీ బోర్డులో వ్యాపార, వాణిజ్యవేత్తలను నియమించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. -
గుప్త నిధి గుట్టు రట్టు
- శేఖర్‌రెడ్డి ఇంటి గోడలో కరెన్సీ కట్టలు వెలికితీత - స్టార్ హోటల్ గదిలో 40 కేజీల బంగారం పట్టివేత - పన్నీర్ సెల్వంతోనూ శేఖర్‌రెడ్డికి సంబంధాలు! సాక్షి, చెన్నై/వేలూరు: నల్ల కుబేరుడు శేఖర్‌రెడ్డి ఇంటా బయటా తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, బంగారం నిల్వలు బయటపడుతున్నాయి. ఆదివారం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో 40 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు వెలికితీశారు. వేలూరులో సాగిన తనిఖీల్లో ఆరు బ్యాగుల్లో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నోట్లు ఎంత మొత్తం అన్నది అధికారులు వెల్లడించలేదు. పలువురు ప్రముఖులు, బ్యాంకు అధికారులు, శేఖర్‌రెడ్డి సన్నిహితులు లక్ష్యంగా దాడులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. జయలలిత మరణానంతరం తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వంతో కూడా శేఖర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని కొన్ని స్థానిక చానెళ్లలో కథనాలు ప్రసారమ య్యాయి. శేఖర్‌రెడ్డి ఆస్తులపై గత నాలుగు రోజులుగా ఐటీ దాడులు సాగుతున్నాయి. శనివారం నాటికి సుమారు రూ. 170 కోట్ల నగదు, 130 కేజీల బంగారం పట్టుబడింది. ఆదివారం శేఖర్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు శేఖర్‌రెడ్డి సతీమణి జయశ్రీని అధికారులు శనివారం విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఐటీ వర్గాలు ఆరు ట్రావెల్ బ్యాగుల్లో నోట్లకట్టల్ని, రెండు సూట్‌కేసుల్లో బంగారాన్ని, కీలక పత్రాలను తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. నోట్ల కట్టలు ఇంటి గోడలో ఏర్పాటు చేసిన అరలో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పన్నీర్, శశికళ లక్ష్యంగా దాడులు గత 4 రోజులుగా శేఖర్రెడ్డిఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు తాజాగా తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళ సన్నిహితుల ఇళ్లు, ఆస్తులు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు తెలిసింది. చెన్నైతో పాటు తిరునల్వేవి, వెల్లూరు, కాట్పాడి సహా 16 ముఖ్య ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో సీబీఐ, ఈడీ అధికారులు కూడా పాల్గొంటున్నట్టు తెలిసింది. -
శేఖర్ రెడ్డి భార్యను విచారించిన ఐటీ అధికారులు
చెన్నై: టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కాట్పాడి గాంధీనగర్‌లో శేఖర్ రెడ్డి ఇంట్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు శేఖర్ రెడ్డి భార్యను విచారించారు. శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు చేశారు. గత మూడు రోజుల నుంచి భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసును ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెలుగుచూశాక ఏపీ ప్రభుత్వం టీడీడీ పాలక మండలి సభ్యత్వం నుంచి శేఖర్ రెడ్డిని తొలగించింది. -
నల్లకుబేరుడు..శేఖర్ రెడ్డి పదవిపై వేటు
-
శేఖర్‌రెడ్డి కేసు సీబీఐకి..!
-
శేఖర్‌రెడ్డి కేసు సీబీఐకి..!
• చెన్నైలో రెండోరోజూ కొనసాగిన సోదాలు • రూ.170 కోట్ల నగదు, 130 కిలోల బంగారం స్వాధీనం సాక్షి ప్రతినిధి, చెన్నై/ న్యూఢిల్లీ: చెన్నైకి చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగారుు. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్‌రెడ్డికి చెందిన చెన్నై, వేలూరు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై గురువారం నుంచి రెండురోజుల పాటు జరిగిన దాడుల్లో మొత్తం రూ.170 కోట్ల నగదు, 130 కిలోల బంగారం పట్టుబడినట్లు సమాచారం. కాగా చెన్నైలోని వివిధ ప్రాంతా ల్లో జరిపిన దాడుల్లో లెక్కల్లోకి రాని రూ.142 కోట్లకు పైగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటన వెల్లడించింది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసు ను ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీబీఐ డీఐజీ తేన్మొళి నేతృత్వంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. నగదు అక్రమ రవా ణా, అవినీతి కోణంలో తదుపరి విచారణ కొనసాగించేందుకు ఈ కేసు వివరాలన్నిటినీ తాము ఈడీ, సీబీఐలకు ఇస్తామని ఢిల్లీలోని ఐటీ విభాగం చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది. డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలను పూర్తిస్థారుు లో పరిశీలించిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉన్నాయంది. పట్టుబడిన నగదు, బంగారం తనదేనని శేఖర్‌రెడ్డి పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపారుు. ఆరు నెలలుగా నిఘా... 2014లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంచి పలుకుబడి కలిగి ఉండటంమే కాకుండా అధికార తెలుగుదేశం పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న శేఖర్‌రెడ్డితో పాటు ఇతరుల కార్యకలాపాలను నిఘా వర్గాలు సుమారు ఆరు నెలల పాటు పరిశీలించినట్టు తెలుస్తోంది. సెల్‌ఫోన్ సంభాషణలను రికార్డు చేశారని సమాచారం. ఈ మేరకు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, శేఖర్‌రెడ్డి హైదరాబాద్ వచ్చిన ప్పుడు ఒక ప్రముఖ హోటల్లో టీడీపీ ముఖ్య నేతతో భేటీ అవుతారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనను టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమించారని చెబుతు న్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు కాట్పాడిలో సీల్ చేసిన శేఖర్‌రెడ్డి ఇంటిని తనిఖీ చేసి వెళ్లారు. ఆయన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని శేఖర్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సీజ్ చేసిన నగదు, బంగారం. -
‘రీట్స్’ సరికొత్త పెట్టుబడి సాధనం!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా ప్రతికూల పరిస్థితులు.. రుణాల మంజూరులో కనికరించని బ్యాంకులు.. అయినా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం సా....గుతోంది. కాకపోతే కొనుగోలుదారులే మందగించారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగానికి కొత్త ఊపిరినందించింది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్. ఈ బడ్జెట్లో కొత్తగా రియల్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్ (రీట్స్)ను ప్రతిపాదించారు. అసలు రీట్స్ అంటే ఏంటి? పెట్టుబడులు ఎలా పెడతారు? వంటి అనేక అంశాలను భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఏమన్నారంటే.. ‘రీట్’ మనకు పెద్దగా పరిచయం లేని పెట్టుబడి సాధనం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రీట్స్‌తో మ్యూచువల్ ఫండ్ల తరహాలోనే నిర్మాణ సముదాయాల్లోనూ పెట్టుబడులు పెట్టొచ్చన్నమాట. వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు.. ఇలా అన్ని రకాల నిర్మాణాల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఓ ట్రస్టు, స్పాన్సర్, మేనేజర్ ఉన్నట్టే.. దీనికీ ఉంటారు. ఇందులోని ఫండ్ మేనేజర్లకు స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉండాలి. స్థానికులైనా, ప్రవాసులైనా కనీసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. యూనిట్ సైజు రూ.లక్షగా నిర్ణయించారు. మార్కెట్ అభివృద్ధి చెందిన తర్వాత అందరికీ అవకాశం కల్పిస్తారు. బంగారంపై అధిక పెట్టుబడి పెట్టేవారికి ‘రీట్’ చక్కటి ప్రత్యామ్నాయమని చెప్పొచ్చు. కొనాలంటే 110%.. అమ్మాలంటే 90% రీట్స్‌లో పెట్టుబడులను నిర్మాణం జరిగే వాటిలో పెట్టడానికి ఒప్పుకోరు. 90 శాతం సొమ్మును నిర్మాణం పూర్తయిన వాటిలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా సొమ్మునంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో మదుపు చేస్తానంటే కుదరదు. ఇలాంటి నిబంధనల వల్ల పెట్టుబడిదారులకు ఆదాయం త్వరగానే అందుతుంది. ప్రతి ప్రాజెక్ట్ విలువను ఏడాదికోసారి లెక్కిస్తారు. ఆరు నెలలకోసారి ఎన్ఏవీ (నెట్ అసెట్ వ్యాల్యూ)ని ప్రకటిస్తారు. ఇక్కడ సెబీ ఒక నిబంధనను పొందుపర్చింది. ఒకవేళ కొనాల్సి వస్తే.. 110 శాతం కంటే ఎక్కువ సొమ్మును పెట్టకూడదు. అమ్మాల్సి వస్తే ఆస్తి విలువలో 90 శాతం కంటే తక్కువకు విక్రయించకూడదని తెలిపింది. డబ్బులే డబ్బులు.. మూడేళ్ల వరకూ పెట్టిన సొమ్మును కదపడానికి వీలుండని రీట్స్‌లో పెట్టుబడులు చేసేవారికి కార్పొరేట్ పన్ను వర్తించదు. క్రమం తప్పకుండా ఆదాయమూ లభిస్తుంది. కొన్ని రీట్లయితే నిర్మాణ సంస్థలకు నేరుగా నిధుల్ని కూడా సమకూర్చుతాయి. వీటన్నింటిని మించి నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి పారదర్శకత నెలకొంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తి రంగం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకూ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య తేడా వల్ల కొంత సొమ్ము నల్లధనం రూపంలో నిర్మాణ సంస్థల ఖాతాలోకి వెళ్లేది. ఫలితంగా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడేది. రీట్ల రాకతో పెట్టుబడులు పెట్టే ముందు ఆస్తి విలువలు పక్కాగా తెలిసే వీలుంటుంది. లావాదేవీల్లో, సొమ్ము చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. నిధుల కొరత పెద్దగా ఉండదు కాబట్టి దేశవ్యాప్తంగా చేపట్టే నిర్మాణాలు ఆలస్యమయ్యే ప్రమాదముండదు. డెవలపర్లకూ ప్రయోజనమే.. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టడానికి అంగీకరించవు. కేవలం నివాస సముదాయాలకే ప్రాధాన్యమిస్తాయి. ఈ నేపథ్యంలో రీట్లకు ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు. రీట్స్‌తో డెవలపర్లకూ ప్రయోజనమే. అభివృద్ధి చేసిన ఆస్తులను రీట్లుగా సులువుగా బదిలీ చేయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో 6 కోట్ల చ.అ. వాణిజ్య స్థలం అందుబాటులో ఉంది. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. లీజులకు ఇవ్వాల్సిన ఆఫీసు స్థలాన్ని త్వరగా సొమ్ము చేసుకోవచ్చు. దీనిపై ఎంతలేదన్నా పది శాతం చొప్పున వడ్డీ గిట్టుబాటవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మన వద్ద కేవలం ఆరు నుంచి ఏడు శాతం వడ్డీ లభిస్తుందని భావించే నిపుణులూ లేకపోలేరు. ఏదేమైనా నగదు కొరతతో అల్లాడుతున్న డెవలపర్లకు ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశముంది. -
తెలంగాణకు చంద్రబాబు అన్యాయం
భువనగిరి :తెలంగాణ ద్రోహి చంద్రబాబు జెండాలను మోస్తున్న వారంతా సోయి తెచ్చుకుని ఆ పార్టీ జెండాను వదిలిరావాలని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి పట్టణంలో రూ.4 కోట్ల నిధులతో చేపట్టిన ఆర్‌ఆండ్‌బీ రోడ్డు విస్తరణ పనులకు ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజ ల పట్ల చంద్రబాబు కుట్రలు ఇంకా సాగుతున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్ తెప్పించారన్నారు. తన హయంలోనే విద్యుత్‌శాఖలో తెచ్చిన పీపీఏల విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం తెలంగాణ ప్రజలకు కరెంటు లేకుండా చేయడమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించాలని చూస్తే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల విద్యుత్ సమస్యను తీర్చడానికి సీఎం కేసీఆర్ చత్తీస్ఘడ్ నుంచి 3500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఆక్కడినుంచి ఇక్కడికి విద్యుత్ మార్గం ఏర్పాటు చేయడానికి ఏడాది సమ యం పడుతుందని, అంతవరకు కొంత ఇబ్బంది తప్పదన్నారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి బలైన బీబీనగర్ నిమ్స్‌ను పూర్తిచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని మంత్రి జగదీష్‌రెడ్డిని కోరారు. బునాదిగాని, పిలాయి పల్లి, ధర్మారెడ్డి కాల్వలను యద్ధప్రాతి పదికన పూర్తిచేయడానికి అధికా రులతో సమన్వయం సమావేశం నిర్వహించాలని, యాదగిరిగుట్ట దేవస్థానం, భువనగిరి కోట వంటి ప్రదేశాలను అభివృద్ధి చేయాలని కోరారు. సభకు అధ్యక్షతన వహించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ భువనగరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రి సహకారం అందించాలని కోరారు. నిమ్స్ ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్.మధుసూదన్, ఆర్‌ఆండ్‌బీ ఎస్ఈ లింగయ్య, టీఆర్ఎస్ నాయకులు అమరేందర్, నాగారం అంజయ్య, చందుపట్ల వెంకటేశ్వర్రావు, అతికం లక్ష్మినారాయణ, జనగాం పాండు, రాముగౌడ్ బీరుమల్ల య్య, మిర్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బదిలీల వేళ
సాక్షి, నల్లగొండ: జిల్లాలో అధికారుల బదిలీల వాతావరణం వేడెక్కింది. దీర్ఘకాలి కంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న క్రమంలో సీట్లలో పాతుకపోయిన, స్థానిక అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధముండే ఆయా శాఖ లకు బదిలీల సెగ తాకింది. మూడేళ్లకు పైబడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు అధికార యంత్రాంగాన్ని కదలించేందుకు కసరత్తు జరుగుతోంది.సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్, ఎంపీడీఓలకూ స్థానచలనం ఉండేలా జాబితా రూపుదిద్దుకుంటోంది. ఈ బాధ్యతలను ఆయా ఆర్డీఓలకు జిల్లా యంత్రాంగం అప్పజెప్పింది. అలాగే పోలీసు శాఖలో సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్లు)లు, ఎస్ఐ (సబ్ ఇన్స్పెక్టర్ల)ల జాబితా తయారు చేస్తున్నారు. ఈ జాబితాలను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడ ఆమోదముద్ర పడడ మే తరువాయి బదిలీలు జరుగుతాయి. అయితే ఓటర్ల తుది జాబితా వెలువడే వరకు బదిలీలకు అవకాశం లేదు. ఈ మేరకు నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈనెలాఖరులోగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా బదిలీ ప్రక్రియ వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. బదిలీ అయిన అధికారులు ఫిబ్రవరి 11వ తే దీన కొత్తస్థానాల్లో ఆసీనులవుతారు. ఎంపీడీఓలకూ..? ఎన్నికల వేళ అధికారులు సొంత జిల్లాలో పనిచేస్తే పక్షపాతంగా వ్యవహరిస్తారన్న ఉద్దేశంతో ప్రతి రెవెన్యూ, పోలీస్ అధికారులను ఈసీ బదిలీ చేస్తుంది. ఈసారీ అందుకు తగ్గట్టుగానే రంగం సిద్ధమవుతోంది. త్వర లో సాధారణ ఎన్నికలు జరగనుండడంతో ఈ ప్రక్రియ ఊపందుకుంది. ఈసారి బదిలీల జాబితాలోకి ఎంపీడీఓలు చేరే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు అధికారుల సంఖ్య సరిపోరని భావిస్తే ఇతర అధికారుల అవసరం ఏర్పడనుంది. అప్పుడు ఎంపీడీఓలకు బదిలీ తప్పదు. వీరికీ స్థానచలనం... జిల్లాలో 18 మంది డిప్యూటీ, స్పెషల్ డి ప్యూటీ కలెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఐదుగురికి స్థానచలనం లభించనున్నట్లు సమచారం. భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మధుకర్‌రెడ్డి, సీతారామరాజు, శేఖర్‌రెడ్డి జిల్లాకు చెందిన వారే. ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీ నాటికి కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదరావు జిల్లాలో విధులు నిర్వహించడం మూడేళ్లు పూర్తవుతుంది. ఈయనా బదిలీ కావొచ్చు. జిల్లాలో మూడేళ్లకు పైబడి పనిచేసిన తహసీల్దార్ల సంఖ్య బాగానే ఉంది. వీరికి తోడు ఇదే జిల్లాకు చెందిన వారు స్థానికంగా పనిచేస్తున్న వారూ ఉన్నారు. ఇలా దాదాపు 40మంది వరకు తహసీల్దార్లు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీడీఓల అవసరం ఏర్పడితే.. ఇంచుమించుగా వారుఉ కూడా అంతే సంఖ్యలో బదిలీ అవుతారు. మరోవైపు పోలీస్ శాఖలోనూ పెద్దఎత్తున బదిలీలు జరగనున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలు, సీఐలకు స్థానచలనం తథ్యం. మొత్తం మీద పోలీసుశాఖలో 40 మందికిపైగానే బదిలీ కానున్నట్లు తెలిసింది.