
‘‘90 ఎంఎల్’ కథ ఎంపిక చేసుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనుకున్నా. ప్రేక్షకులు నన్ను వైవిధ్యంగా చూడటానికి ఇష్టపడుతున్నా రని ఈ సినిమాతో క్లారిటీ వచ్చేసింది’’ అని కార్తికేయ అన్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్‌లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘శుక్రవారం విడుదలైన మా సినిమా సక్సెస్ అయ్యిందని సోమవారంతో పూర్తిగా అర్థమైంది. ప్రతి సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి వంద శాతం కష్టపడతా’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బి,సి సెంటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు శేఖర్ రెడ్డి. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కథానాయిక నేహా సోలంకి పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment