సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. తాజాగా తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులకు ధ్వంసం చేసేందకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రి రోడ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కూటమి సర్కార్ అండతో ఏపీలో అధికారులు ఓవరాక్షన్‌కు దిగారు. తాజాగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి డీబీఆర్ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో కూల్చివేతకు దిగారు మున్సిపల్ అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలకు రావడంతో స్థానిక వైఎస్సార్‌సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది.
అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుపతి నగరం కార్పొరేషన్ పరిధిలో కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులు ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ కుట్రలు చేస్తోంది. డీబీఆర్ ఆసుపత్రి రోడ్‌లో శేఖర్ రెడ్డి ఐదు అంతస్థుల భవనం నిర్మాణంలో ఉండగా మూడవ అంతస్తులో కూల్చివేతలు చేపట్టారు.
ఇక, కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం నోటీసులు ఇవ్వాలి. 15 రోజులు సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికార బలంతో కూల్చివేతకు దిగుతున్నారు. కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు.
తిరుపతిలో @JanaSenaParty కక్ష సాధింపు రాజకీయాలు
వైయస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డికి చెందిన భవనాన్ని కూల్చేసేందుకు కూటమి నేతలు పన్నాగం
శేఖర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ.. లీగల్ టీమ్‌తో కలిసి ఆ భవనం వద్దకు వెళ్లిన తిరుపతి వైయస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్… pic.twitter.com/rfB5G03b6F— YSR Congress Party (@YSRCParty) February 1, 2025
Comments
Please login to add a commentAdd a comment