Bhumana
-
కూటమి కవ్వింపు.. వైఎస్సార్సీపీ నేత భవనం కూల్చివేతకు ప్లాన్
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. తాజాగా తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులకు ధ్వంసం చేసేందకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రి రోడ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.కూటమి సర్కార్ అండతో ఏపీలో అధికారులు ఓవరాక్షన్‌కు దిగారు. తాజాగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి డీబీఆర్ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో కూల్చివేతకు దిగారు మున్సిపల్ అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలకు రావడంతో స్థానిక వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది.అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుపతి నగరం కార్పొరేషన్ పరిధిలో కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులు ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ కుట్రలు చేస్తోంది. డీబీఆర్ ఆసుపత్రి రోడ్లో శేఖర్ రెడ్డి ఐదు అంతస్థుల భవనం నిర్మాణంలో ఉండగా మూడవ అంతస్తులో కూల్చివేతలు చేపట్టారు.ఇక, కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం నోటీసులు ఇవ్వాలి. 15 రోజులు సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికార బలంతో కూల్చివేతకు దిగుతున్నారు. కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. తిరుపతిలో @JanaSenaParty కక్ష సాధింపు రాజకీయాలు వైయస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డికి చెందిన భవనాన్ని కూల్చేసేందుకు కూటమి నేతలు పన్నాగం శేఖర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ.. లీగల్ టీమ్‌తో కలిసి ఆ భవనం వద్దకు వెళ్లిన తిరుపతి వైయస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్… pic.twitter.com/rfB5G03b6F— YSR Congress Party (@YSRCParty) February 1, 2025 -
శ్రీకాళహస్తిలో రెస్టారెంట్ కూల్చివేత కక్షసాధింపే
తిరుపతి మంగళం : శ్రీకాళహస్తిలో రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేత కూటమి ప్రభుత్వ కక్షసాధింపే అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేతను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీకాళహస్తిని మధుసూదన్‌రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయనపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.చంద్రబాబు బెదిరింపులకు, కేసులకు భయపడే తత్వం వైఎస్సార్సీపీ నేతలకు లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచి్చన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని జైలుకు పంపడమే పనిగా పెట్టుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ప్రజలు గ్రహిస్తున్నారని, చంద్రబాబుకు త్వరలోనే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
‘రాజీనామా గోప్యత’ కథనంపై భూమన అభినయ్ సీరియస్
తిరుపతి, సాక్షి: మున్సిపల్ కార్పొరేషన్‌కు తన రాజీనామా విషయంలో తప్పుడు కథనాలు ప్రచురితం కావడంపై వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి భూమన అభినయ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అందులో ఎలాంటి గోప్యతా లేదని.. తాను రాజీనామా ఎప్పుడు చేశానో, దానికి ఎప్పుడు ఆమోదం లభించిందో.. తదితర విషయాల్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, అలాగే నేను ప్రాతినిథ్యం వహించిన నాల్గో డివిజన్ కార్పొరేషన్ పదవికి నేను ఎప్పుడో రాజీనామా చేశాను. తిరుపతి వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నా పేరు ఖరారైన వెంటనే, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా ఆ పదవుల్ని వద్దనుకున్నా. నా రాజీనామాను మేయర్ డాక్టర్ శిరీష గారితో పాటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆమోదం తెలిపారు. .. నేను పదవులకు రాజీనామా చేసిన విషయం ఎన్నికలకు ముందు అన్ని పత్రికల్లో వచ్చింది. తాజాగా ఒక పత్రికలో నా రాజీనామాల విషయాన్ని గోప్యంగా వుంచానని రాయడం ఆశ్చర్యం అనిపించింది. .. నా రాజీనామా లేఖను బయట పెట్టొద్దని ఒత్తిడి చేసానని రాయడం వారి ఆలోచనల సంకుచితాన్ని బయట పెడుతున్నదే తప్ప, అందులో నిజం లేదని అందరికీ తెలుసు. పచ్చకామెర్లోళ్లకి లోకమంతా అట్లే కనిపిస్తుందని పెద్దలన్నట్టుగా, రాజీనామాపై గోప్యత పాటించడం వెనుక అనుమానాలున్నాయని రాయడాన్ని ఆ కోణంలోనే చూడాల్సి వుంటుంది. .. ప్రజాతీర్పు నాకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ హుందాగా స్వీకరించాను. ప్రజాతీర్పును గౌరవించి కొత్తగా ఎన్నికైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేశాను. .. డిప్యూటీ మేయర్ పదవి కోసం కక్కుర్తి పడే స్వభావం నాది కాదని మరోసారి చెబుతున్నాను. తిరుపతిలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో పుట్టడం, ఈ నగరానికి డిప్యూటీ మేయర్‌గా రెండేళ్ల పాటు సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అంతే తప్ప, దాన్ని అలంకారంగా నేనెప్పుడూ వాడుకోలేదు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా తిరుపతి ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజీనామాపై నిజానిజాలు చెప్పడానికే ఈ వివరణ’’ అని భూమన అభినయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రజ్యోతి పత్రికలో తాజాగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు అభినయ్ రాజీనామా అంటూ తాజాగా కథనం వచ్చింది. పోలింగ్‌కు 40 రోజుల ముందే రాజీనామా లేఖ సమర్పించారని తెలిసింది. అయితే మున్సిపల్ యంత్రాంగం ఈ విషయం చాలా గోప్యంగా ఉంచిందని అందులో పేర్కొంది. టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే! -
అనతికాలంలోనే అవార్డులు
పాఠశాలలో విద్యార్థులకు ఆట, పాటలతోపాఠ్యాంశాలను బోధించడంలో ఆమె దిట్ట. చిన్న వయసులోనే ఉద్యోగాన్ని సొంతం చేసుకుని అనతి కాలంలోనే పలు అవార్డులతో పాటు అందరి ప్రసంశలను అందుకుంటోంది టీచర్ శ్రీశైల. వ్రిడవలూరు: సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉంది. అలాంటి వృత్తికి వన్నే తెచ్చిన ఉపాధ్యాయురాలు భూమన శ్రీశైల. నెల్లూరుకు చెందిన భూమన వెంకటసుబ్బయ్య, రాధిక దంపతుల రెండో సంతానం శ్రీశైల. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో తాను కూడా టీచర్‌ను కావాలని చిన్నతనం నుంచే కల కనేది. తన 19వ ఏటాలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమె మండలంలోని దండిగుంట దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా చేసింది. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు తాను ఈ వృత్తిని ఎంచుకున్నట్లు చెప్పింది. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా.. శ్రీశైల పనిలో ఎక్కడా రాజీపడకుండా విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు కృషిచేస్తోంది. ఆట, పాటలతో కూడిన విద్యను అందించడం ఆమె ప్రత్యేకత. అంతే కాకుండా ప్రతి పండగ ప్రాముఖ్యత, ప్రముఖుల జన్మదినాల నాడు వారి జీవిత చరిత్రను వివరిస్తూ విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంచుతోంది. తన సొంత నిధులతో పాఠశాలలో టీవీని ఏర్పాటుచేసింది. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు చెందిన పాఠ్యాంశాలను విద్యార్థులకు ఎలా బోధించాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది. అంతే కాకుండా ప్రస్తుతం అమలవుతున్న ఆనందలహరి కార్యక్రమానికి జిల్లా మాస్టర్ కోచ్‌గా శ్రీశైల ఎన్నికైంది. ఆమె ప్రతిభను గుర్తించి 2017 మహిళా సా ధికారత అవార్డు, సమత అకాడమీ వా రు 2018లో ఉత్తమ టీచర్ అవార్డులు అందజేశారు. త్వరలో మహిళారత్న అవార్డును అందుకోకున్నారు. కలెక్టర్ ముత్యాలరాజు, పాఠశాల విద్య ఆర్జేడీ శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నుంచి పలుమార్లు ప్రశంసాపత్రాలను స్వీకరించింది. తల్లి స్ఫూర్తితో ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి మా అమ్మ రాధిక ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆమెకు అంగన్వాడీ సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చినప్పటికి మా బాగోగులు చూసుకునేందుకు ఉద్యోగం వదలి గృహిణిగా మారింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈ వృత్తిలో చేరాను. భవిఫ్యత్‌లో ప్రొఫెసర్ కావాలని పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించాను. – భూమన శ్రీశైల -
కాపులు రోడ్డెక్కడానికి బాబే కారణం
-
కాపులు రోడ్డెక్కడానికి బాబే కారణం: ముద్రగడ
కర్నూలు (అర్బన్)/ సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో కాపులు రోడ్డెక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు బీసీ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న ప్రధాన డిమాండ్‌పై ఆదివారం ఆయన కర్నూలులోని మెగా సిరి ఫంక్షన్ హాలులో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అవి సాధించే వరకు తాము నిద్రపోమని, బాబుకూ నిద్ర పట్టకుండా చేస్తామన్నారు. ప్రతిపక్ష నేత జగన్ సహకారంతోనే తాను ఉద్యమం చేస్తున్నాన ని సీఎం వ్యాఖ్యానిం చడం తగదన్నారు. బావమరిది బాలకృష్ణను కాల్పుల కేసు నుంచి రక్షించుకునేందుకు అర్ధరాత్రి నెంబరు బోర్డులేని వాహనంలో వెళ్లిన బాబు.. అప్పటి సీఎం వైఎస్ కాళ్లు పట్టుకోలేదా అని ప్రశ్నించారు. ముద్రగడ కర్నూలులో చేపట్టిన ఒక్క రోజు దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. ముద్రగడకు వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర రెడ్డిలు కూడా వేర్వేరుగా తమ మద్ధతును ప్రకటించారు. -
మమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు: భూమన
గుంటూరు: తుని ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి రెండో రోజు సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాలనలో న్యాయం..నేతిబీరకాయలో నెయ్యిలా మారిందన్నారు. అన్యాయంగా కేసులో ఇరికించి తనను జైలుపాలు చేయాలని చూస్తున్నారని భూమన మండిపడ్డారు. కాపుల ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ మద్దతివ్వడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బదనాం చేసేందుకే తుని ఘటనలో బాబు మమ్మల్ని పావుగా వాడుకుంటున్నరని భూమన నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఇంటి పేరు వంచన..కేరాఫ్ అడ్రస్ కుట్ర అని ధ్వజమెత్తారు. పోలీసులను కూడా స్వార్థానికి వాడుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా భయపడనని భూమన తెలిపారు. ఎంతటి త్యాగానికైనా తాను మానసికంగా సిద్ధపడ్డట్టు భూమన స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ హైకమాండ్ ఏజెంట్ కిరణ్ : భూమన
-
విభజనకు సీఎం పూర్తిగా సహకరిస్తున్నారు: భూమన
-
రాష్ట్ర విభజన ద్రోహులు సిఎం కిరణ్, చంద్రబాబు
-
ప్రజల కోసం జగన్ పోరాడుతున్నారు:భూమన
-
జనంతోటే జగన్ : భూమన
-
కొనసాగుతున్న సమైక్యాంధ్ర సెగ
-
చంద్రబాబు లేఖ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
-
పోలీసుల తీరు పై నిరసనల వెల్లువ
-
వినూత్న నిరసనలతో దద్దరిల్లిన తిరుపతి
-
విజయమ్మ పైనే ప్రజలందరి నమ్మకం
-
విజయమ్మ దీక్షకు అన్నివర్గాల మద్దతు.
-
విజయమ్మ దీక్షకు భూమన మద్దతు
-
మహిళభేరిలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన
-
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: భూమన
-
బైక్ ర్యాలీ నిర్వహించిన భూమన
-
షర్మిళ పాదయత్ర ఒక సువర్ణ అధ్యాయం
-
చంద్రబాబుపై భూమన ఫైర్
-
కేంద్రం నిజాయితీగా వ్యవహరించాలి: భూమన
-
తెలంగాణపై షిండేకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల లేఖ
-
ఫీజుపోరు ఫోస్టర్ విడుదల
-
ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మాయం
-
భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం 1st July
-
తిరుపతిలో వైస్ఆర్ సీపీ నిరసన దీక్షలు
-
తిరుపతిని మద్యపాన రహిత నగరంగా ప్రకటించాలి