
మమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు: భూమన
చంద్రబాబు ఇంటి పేరు వంచన..కేరాఫ్ అడ్రస్ కుట్ర అని భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
గుంటూరు:
తుని ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి రెండో రోజు సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాలనలో న్యాయం..నేతిబీరకాయలో నెయ్యిలా మారిందన్నారు. అన్యాయంగా కేసులో ఇరికించి తనను జైలుపాలు చేయాలని చూస్తున్నారని భూమన మండిపడ్డారు.
కాపుల ఉద్యమానికి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతివ్వడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బదనాం చేసేందుకే తుని ఘటనలో బాబు మమ్మల్ని పావుగా వాడుకుంటున్నరని భూమన నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఇంటి పేరు వంచన..కేరాఫ్ అడ్రస్ కుట్ర అని ధ్వజమెత్తారు. పోలీసులను కూడా స్వార్థానికి వాడుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా భయపడనని భూమన తెలిపారు. ఎంతటి త్యాగానికైనా తాను మానసికంగా సిద్ధపడ్డట్టు భూమన స్పష్టం చేశారు.