మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కుట్ర
వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన
తిరుపతి మంగళం : శ్రీకాళహస్తిలో రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేత కూటమి ప్రభుత్వ కక్షసాధింపే అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేతను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీకాళహస్తిని మధుసూదన్‌రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయనపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
చంద్రబాబు బెదిరింపులకు, కేసులకు భయపడే తత్వం వైఎస్సార్‌సీపీ నేతలకు లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచి్చన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని జైలుకు పంపడమే పనిగా పెట్టుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ప్రజలు గ్రహిస్తున్నారని, చంద్రబాబుకు త్వరలోనే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment