
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుడు సడ్లపల్లి నాగరాజు, మరో ముగ్గురు అతడి అనుచరులు గంగాధర్, శివకుమార్, వెంకటేష్‌ను హిందూపురం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. ఇటీవల బైక్‌పై ఓ చిరు వ్యాపారి ఒంటరిగా వెళుతున్న సమయంలో నాగరాజు, అతని అనుచరులు దౌర్జన్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతని అకౌంట్‌లోని రూ.33 వేలు ఫోన్‌పే ద్వారా వారి ఖాతాలకు జమ చేసుకున్నారు.
ఈ విషయంపై బాధితుడు హిందూపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి.. సడ్లపల్లి నాగరాజు,అతని అనుచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో..
దారిదోపిడీ కేసులో అరెస్టయిన టీడీపీ నాయకుడు నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా పలుమార్లు మంత్రి లోకేశ్‌ను కూడా కలిశాడు.
Comments
Please login to add a commentAdd a comment