సర్కారు గూండాగిరీ...కిడ్నాపులు, అక్రమ కేసులు.. దాడులు | Random kidnappings and illegal cases across the state | Sakshi
Sakshi News home page

సర్కారు గూండాగిరీ...కిడ్నాపులు, అక్రమ కేసులు.. దాడులు

Published Thu, Nov 7 2024 5:29 AM | Last Updated on Thu, Nov 7 2024 3:07 PM

Random kidnappings and illegal cases across the state

ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు వేధింపుల పరంపర 

రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా కిడ్నాపులు, అక్రమ కేసులు.. దాడులు

అధికారికంగా బరితెగిస్తున్న ప్రభుత్వం 

మూడు రోజుల్లోనే 101 అక్రమ కేసులు 

అదుపులోకి తీసుకున్న విషయాన్నీ వెల్లడించని పోలీసులు 

కుటుంబ సభ్యుల ఆచూకీ తెలీక బంధువుల ఆందోళన 

రాష్ట్రంలో నియంతృత్వ పాలన 

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: టీడీపీ కూటమి ప్రభు­త్వం అధికారికంగానే గూండాగిరీకి తెగబడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను అణచివేసే కుట్రతో వేధింపుల పరంపర కొనసాగి­స్తోంది. అక్రమ నిర్బంధాలు, కిడ్నా­పులు, అక్రమ అరెస్టులు, వేధింపులు, భౌతిక దాడు­లకు తెగబ­డుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్‌­సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేవ­లం మూడు రోజుల్లోనే 101 అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరా­కాష్టగా నిలుస్తోంది. 

పోలీసులు సివిల్‌ డ్రెస్‌లో వస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎక్కడి­కక్కడ అపహ­రించుకుపోతున్నారు. ఇలా అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని ఒక పోలీస్‌స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌స్టేషన్‌కు తిప్పుతూ చిత్రహింసలకు గురిచే­యడంతోపాటు భయోత్పాతం సృష్టిస్తున్నారు. 

అసలు అదుపులోకి తీసుకున్న విష­యాన్ని కూడా అధికారికంగా వెల్లడించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభు­త్వం బనాయి­స్తున్న ఈ అక్రమ కేసులు, పాల్పడు­తున్న వేధింపులకు తాజా ఉదా­హరణలు ఇవిగో..

నిద్రిస్తుంటే ఎత్తుకుపోయారు..
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం అరవీడుకు చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా సభ్యుడు హనుమంతురెడ్డిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లో నిద్రిస్తున్న ఆయన్ని సివిల్‌ డ్రెస్‌లో వెళ్లిన పోలీసులు అదుపు­లోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

వారు స్థానిక నేతలతో కలిసి గాలివీడు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లినా సరైన సమాచారం ఇవ్వలేదు. తాము అరెస్టుచేయలేదని చెప్పారన్నారు. సాయంత్రం వరకు అనేక పోలీస్‌స్టేషన్లలో వాకబు చేసినా హనుమంతరెడ్డి ఆచూకీ లభించలేదు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ను సంప్రదించగా తమకింకా ఎలాంటి సమాచారం లేదన్నారు.

కందిపప్పు తూకం తక్కువ ఉందంటే కేసు..
వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ప్రతినిధి తుమ్మా బాబుల్‌రెడ్డిపై పోలీసులు బుధవారం విచిత్ర కారణంతో కేసు నమోదు చేశారు. ప్రభుత్వం పౌరస­ర­ఫ­రాల శాఖ ద్వారా సరఫరాచేసే కంది­పప్పు ఒక కేజీకి బదులు 780 గ్రాములే ఉండటంపై అక్టోబరు 4న బాబుల్‌రెడ్డి సోషల్‌ మీడియాలో పోస్టుపెట్టారు. అదేదో తీవ్ర నేరమన్నట్లు పోలీసులు 352 (2) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. బాబుల్‌రెడ్డి ఫోనును పోలీసులు తీసుకున్నారు. రెండు మూడ్రోజుల వరకు తమకు అందుబాటులో ఉండాలంటూ హెచ్చరించారు. 

విశాఖ వాసిపై ప్రకాశం జిల్లాలో కేసు..
విశాఖ మద్దిలపాలేనికి చెందిన బోస రమణారెడ్డిని మంగళవారం అర్థరాత్రి ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని పొదిలి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పారని రమణారెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ నుంచి రమణారెడ్డిని ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం. 

ఒకరిపై మూడు జిల్లాల్లో అక్రమ కేసులు..
ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మునగాల హరీశ్వర్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో నెల్లూరు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నెల్లూరు రూరల్, కోవూరు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. హరీశ్వర్‌రెడ్డిని నెల్లూరుకు తరలించారు. విచారణ అనంతరం నోటీసిచ్చి పంపినట్లు సీఐ వేణు చెబుతుండగా, ఇంకా పోలీసుల అదుపు­లోనే ఉన్నట్లు సమాచారం. అలాగే, హరీశ్వర్‌రెడ్డిపై తిరుపతిలో రెండు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో అక్కడి పోలీసులు కూడా నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

దంపతులూ అక్రమ అరెస్టు..
ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టుచేశారు. స్టేషన్‌ బెయిల్‌ అనంతరం బయటకు రాగానే ప్రకాశం జిల్లా పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించారు. ఆ క్రమంలో వారిపై టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించారు.

మా బిడ్డను చూపించండి..
పోలీసులు అదుపులోకి తీసుకున్న మా కొడుకు హనుమంతరెడ్డి (40)ని చూపించాలని తల్లిదండ్రులు మనోహరమ్మ, వెంకట­రమణారెడ్డి కోరారు. అన్నమయ్య జిల్లా పోలీ­సులు బుధవారం తెల్లవారుజామున సివిల్‌ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు ఇంట్లో ఉన్న తమ కుమారుడ్ని  బలవంతంగా జీపులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. 

తాము పోలీసులమని, స్టేషన్‌కి తీసుకెళ్తున్నామని చెప్పారని.. కానీ, ఏ స్టేషన్‌కు తీసుకెళ్లింది.. ఎక్కడికి తీసుకెళ్లింది.. తీసుకెళ్లిన పోలీసులు ఎవరన్న విషయం తెలీదని వారు చెప్పారు. జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని తమ బిడ్డను విడుదల చేయాలని తల్లిదండ్రులు వేడుకున్నారు.

హైదరాబాద్‌లో గుడ్లూరు వాసి అరెస్ట్‌
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త రామాల మని్వత్‌ కృష్టారెడ్డిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఏ కేసులో అరెస్ట్‌ చేశారన్న సమాచారం తెలియలేదు. కృష్టారెడ్డి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఇటీవల హైదరాబాద్‌ వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు.

87మందిపై కేసు నమోదు వీరిలో రెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికీ నోటీసు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఓ వాట్సాప్‌ గ్రూపులో ఉన్న 87 మందిపైనా విజయవాడ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. వీరందరూ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేశారు. వారిలో రెండేళ్ల క్రితం చనిపోయిన తురక శ్రీనివాసరావు కూడా ఉండటం గమనార్హం. మరోవైపు.. గుంటూరు జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మేకా వెంకట­రామిరెడ్డిని పోలీసులు అరెస్టుచేశారు. 

సోష­ల్‌ మీడియా పోస్టులతో పేరుతోపాటు ఆయ­నపై మరిన్ని కేసులు నమోదు చేశారు. వెంకట రామిరెడ్డిని కోర్టులో హాజరుపరచగా న్యా­­యస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. అంతకుముందు వెంకటరామి­రెడ్డిని అంబటిరాంబాబు కలిసి ధైర్యం చెప్పారు. కాగా, చంద్రబాబును కించపరుస్తూ 2018­లో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

తెనాలి త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 4వ తేదీన కేసు నమోదవగా, తెనాలి రూరల్, కొల్లిపర స్టేషన్‌లలో మరో రెండు కేసులు నమోదు చేశారు. చివరకు తెనాలి త్రీ టౌన్, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లలో బుధవారం రాత్రి జగదీష్‌రెడ్డిని పోలీసులు విచారించి, కౌన్సెలింగ్‌ ఇచ్చి, 41 సీఆర్‌పీసీ నోటీసులిచ్చి పంపారు.

విచారణ పేరుతో ‘వర్రా’ కుటుంబంపై వేధింపులు..
వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడి­యాలో చురుగ్గా ఉన్న వేముల మండలం కొండ్రెడ్డి పల్లెకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని మంగళవారం రాత్రి పోలీసులు అతని ఇంటికెళ్లి దౌర్జన్య­ంగా కడపకు తీసుకొచ్చారు. కడప తాలూకా పోలీసుస్టేషన్‌లో హాజ­రు­పరిచిన తర్వాత వర్రా రవీంద్రా­రెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి పంపించారు. అయితే అతను ఎక్కడికి వెళ్లింది తెలియరాలేదు. నిజానికి.. బుధవారం ఉదయాన్నే ఆర్కే వ్యాలీ సీఐ నాగరాజు తమ సిబ్బందితో వెళ్లి రవీంద్రారెడ్డిని వేములకు తీసుకొచ్చారు.

రవీంద్రారెడ్డి భార్య కల్యాణి ఇతర కుటుంబ సభ్యులు పోలీసుల వెంట మరో వాహనంలో వచ్చారు. పోలీసుల సూచన­లతో అక్కడ నుంచి వేంపల్లెకు.. మళ్లీ కడప వచ్చారు. చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు 11.30 గంటలకు వచ్చిన వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు వేధింపుల పర్వం మొదలైంది. కల్యాణిని, వారి కుటుంబ సభ్యులను పదేపదే రవీంద్రారెడ్డి ఎక్కడికి వెళ్లాడని, సమాచారం చెప్పకపోతే కోటింగ్‌ ఇస్తామని బెదిరించారు. వీరంతా కూడా పోలీసుల అదుపులో ఉన్నారని మీడియాలో రావడంతో రాత్రి 7 గంటల సమ­యంలో కుటుంబ సభ్యులకూ 41ఏ నోటీసును పంపించారు. 

ఇది తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాష, నగర మేయర్‌ కె.సురేష్‌బాబు, డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి తదితరులు చింతకొమ్మదిన్నె పోలీసుస్టేష­న్‌కు చేరుకోగా బాధితులు వారికీ, మీడియాకు తమకు ఎదురైన వేధింపులను వివరించారు. 5వ తేదీ అర్థరాత్రి పోలీసులు ఇంటికొచ్చి దౌర్జన్యం చేశారని.. సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని కళ్యాణి చెప్పారు. తనకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని కోరినా వినకుండా డ్రామాలు ఆడొద్దని బెదిరించార­న్నారు. 

తన భర్త ఆచూకీ తెలియజేయాలని.. ఆయ­నకు ఏం జరిగినా హోంమంత్రి, పోలీసులదే బాధ్యతని కళ్యాణి చెప్పారు. అలాగే, ఈ విషయంపై పి.రవీంద్రారెడ్డి, అంజద్‌ బాషా, సురేష్‌బాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. వర్రా రవీంద్రారెడ్డి రెండేళ్ల కిందట పెట్టిన పోస్టుకు ఇప్పుడు చర్యలు తీసుకోవడం ఏమిటని.. ఇది ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. ప్రజలకు మంచి పాలన అందించకుండా వేధింపులకు గురిచేయ­డం ఏమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశా­లనూ బేఖాతరు చేస్తూ అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. రవీంద్రరెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని కారణం చూపిస్తూ  ఎస్పీని బదిలీ చేయడం దారుణమన్నారు.

మా కుటుంబ సభ్యులను కాపాడండి..
ఇదిలా ఉంటే.. పోలీసుల అక్రమ నిర్బంధం నుంచి తమ కుటుంబ సభ్యులను విడుదల చేసేలా సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరుతూ వేముల మండలం, కొండ్రెడ్డిపల్లెకు చెందిన వర సూర్యనారాయణరెడ్డి బుధవారం కడప మొదటి అదనపు, మానవ హక్కుల జడ్జికి ఫిర్యాదు చేశారు. తన కోడలు వర కల్యాణితో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు హింసిస్తున్నారని ఫిర్యా­దులో ఆరోపించారు. పోలీసుల చర్యలు ప్రాథమిక మానవ హక్కులకు, ప్రాథమిక న్యాయ సూత్రా­లకు గండి కొట్టేడమే అవుతుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement