అనతికాలంలోనే అవార్డులు | Small age teacher Bhumana srisaila special story | Sakshi
Sakshi News home page

అనతికాలంలోనే అవార్డులు

Published Wed, Feb 28 2018 11:15 AM | Last Updated on Wed, Feb 28 2018 11:15 AM

Small age teacher Bhumana srisaila special story - Sakshi

శ్రీశైలను సన్మానిస్తున్న సహచర ఉపాధ్యాయులు

పాఠశాలలో విద్యార్థులకు ఆట, పాటలతోపాఠ్యాంశాలను బోధించడంలో ఆమె దిట్ట. చిన్న వయసులోనే ఉద్యోగాన్ని సొంతం చేసుకుని అనతి కాలంలోనే పలు అవార్డులతో పాటు అందరి ప్రసంశలను అందుకుంటోంది టీచర్‌ శ్రీశైల.  

వ్రిడవలూరు: సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉంది. అలాంటి వృత్తికి వన్నే తెచ్చిన ఉపాధ్యాయురాలు భూమన శ్రీశైల. నెల్లూరుకు చెందిన భూమన వెంకటసుబ్బయ్య, రాధిక దంపతుల రెండో సంతానం శ్రీశైల. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో తాను కూడా టీచర్‌ను కావాలని చిన్నతనం నుంచే కల కనేది. తన 19వ ఏటాలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమె మండలంలోని దండిగుంట దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా చేసింది. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు తాను ఈ వృత్తిని ఎంచుకున్నట్లు చెప్పింది.

ఉత్తమ ఉపాధ్యాయురాలుగా..
శ్రీశైల పనిలో ఎక్కడా రాజీపడకుండా విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు కృషిచేస్తోంది. ఆట, పాటలతో కూడిన విద్యను అందించడం ఆమె ప్రత్యేకత. అంతే కాకుండా ప్రతి పండగ ప్రాముఖ్యత, ప్రముఖుల జన్మదినాల నాడు వారి జీవిత చరిత్రను వివరిస్తూ విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంచుతోంది. తన సొంత నిధులతో పాఠశాలలో టీవీని ఏర్పాటుచేసింది. ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌కు చెందిన పాఠ్యాంశాలను విద్యార్థులకు ఎలా బోధించాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది. అంతే కాకుండా ప్రస్తుతం అమలవుతున్న ఆనందలహరి కార్యక్రమానికి జిల్లా మాస్టర్‌ కోచ్‌గా శ్రీశైల ఎన్నికైంది. ఆమె ప్రతిభను గుర్తించి 2017 మహిళా సా ధికారత అవార్డు, సమత అకాడమీ వా రు 2018లో ఉత్తమ టీచర్‌ అవార్డులు అందజేశారు. త్వరలో మహిళారత్న అవార్డును అందుకోకున్నారు. కలెక్టర్‌ ముత్యాలరాజు, పాఠశాల విద్య ఆర్జేడీ శ్రీనివాసులురెడ్డి,  ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నుంచి పలుమార్లు ప్రశంసాపత్రాలను స్వీకరించింది.  

తల్లి స్ఫూర్తితో
ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి మా అమ్మ రాధిక ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆమెకు అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా ఉద్యోగం వచ్చినప్పటికి మా బాగోగులు చూసుకునేందుకు ఉద్యోగం వదలి గృహిణిగా మారింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈ వృత్తిలో చేరాను. భవిఫ్యత్‌లో ప్రొఫెసర్‌ కావాలని పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించాను.      – భూమన శ్రీశైల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement