నారా చంద్రబాబునాయుడు డిఫరెంట్ పర్సనాలిటీ. టీడీపీ కోసం కష్టపడి పనిచేసినవారిని పక్కన పెట్టడం...డబ్బిచ్చినవారికి సీటివ్వడం ఆనవాయితీ. నెల్లూరు జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేను తాజాగా దూరం పెట్టేశారు చంద్రబాబు. ఇంతకాలం తాను పడ్డ కష్టం అంతా వృధా చేశారంటూ టీడీపీ అధినేతపై ఆ మాజీ ఎమ్మెల్యే రగిలిపోతున్నారు. తనకు సీటు రాకపోవడంతో ఎలాగైనా టీడీపీని ఓడించడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు?
నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జిల్లాలోని పాత, కొత్తతరం నాయకులకు విష్ణువర్థన్‌రెడ్డి బాగా పరిచయం ఉన్న నాయకుడే. గత ఎన్నికల్లో కూడా కావలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఎన్నికల తర్వాతి నుంచి టీడీపీ నాయకత్వం ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. ఎన్నికల నాటికి పూర్తిగా పక్కన పెట్టేసింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర సూచనతో సుబ్బానాయుడిని కావలి ఇన్‌చార్జ్‌గా నియమించారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడిని పక్కకు నెట్టేసినందుకు ఇప్ప్పుడు టీడీపీ అక్కడ పతనం దిశగా పరుగులు తీస్తోంది.
జిల్లాలో తన ప్రాబల్యం తగ్గకుండా కాపాడుకునేందుకే బీదా రవిచంద్ర కాటంరెడ్డిని పక్కన పెట్టి సుబ్బానాయుడిని ఇంచార్జ్‌గా తీసుకువచ్చారని కావలి టీడీపీ నేతలే చెబుతున్నారు. చాలాకాలంగా విష్ణువర్డన్ రెడ్ది..రవిచంద్ర కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుండటమే దీనికి కారణమని అంటున్నారు. సుబ్బానాయుడు కావలి ఇన్‌చార్జ్‌గా మూడేళ్ళపాటు వ్యవహరించారు. అయితే ఇటీవల మాఫియా డాన్ కావ్య కృష్ణారెడ్డిని కావలి అభ్యర్థిగా ప్రకటించారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో కావలిలో ఉపయోగపడతాడని చంద్రబాబు భావించారు.
ఇదిలాఉంటే కావలిలో ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ జెండా ఎగరనివ్వబోనని కాటంరెడ్డి శపథం చేశారు. తాను కూడా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి చెమట్లు పడుతున్నాయి. నియోజకవర్గంలో కావ్యను వ్యతిరేకించేవారంతా కాటంరెడ్డికే మద్దతిస్తారు. బడా కాంట్రాక్టర్‌గా ఉన్న కావ్య కృష్ణారెడ్డిని మామూలుగానే కలవడం కష్టమని..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక మాకు అసలు అందుబాటులో ఉండడని టీడీపీలోనే చర్చలు జరుగుతున్నాయి. ఈవిధంగా సొంత పార్టీలోనే కావ్య కృష్ణారెడ్డికి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో కాటంరెడ్డి బరిలో ఉంటే కావ్య గల్లంతు కావడం ఖాయమనే టాక్ నడుస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టిక్కెట్ తెచ్చుకుంటే ఈ ఖర్మ ఏంటని టీడీపీ అభ్యర్థి తలపట్టుకుంటున్నారు.
గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్ది 49 శాతం ఓట్లు సాధించారు. కావలి నియోజకవర్గంలో అయన చేసిన అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలు ఆయన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయని.. ఈసారి 59 శాతం ఓట్లు కచ్చితంగా పడతాయని tdp చేసిన సర్వేల్లోనే తేలిందని చెబుతున్నారు. ఈ సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి రెబల్‌గా పోటీపడితే Tdp ఓడిపోవడం గ్యారెంటీ అంటున్నారు ఆ పార్టీ నాయకులు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఆందోళన చెందిన టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి...మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డితో రాజీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment