vishnuvardharnreddy
-
టీడీపీ అధినేతపై రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్యే!
నారా చంద్రబాబునాయుడు డిఫరెంట్ పర్సనాలిటీ. టీడీపీ కోసం కష్టపడి పనిచేసినవారిని పక్కన పెట్టడం...డబ్బిచ్చినవారికి సీటివ్వడం ఆనవాయితీ. నెల్లూరు జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేను తాజాగా దూరం పెట్టేశారు చంద్రబాబు. ఇంతకాలం తాను పడ్డ కష్టం అంతా వృధా చేశారంటూ టీడీపీ అధినేతపై ఆ మాజీ ఎమ్మెల్యే రగిలిపోతున్నారు. తనకు సీటు రాకపోవడంతో ఎలాగైనా టీడీపీని ఓడించడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జిల్లాలోని పాత, కొత్తతరం నాయకులకు విష్ణువర్థన్‌రెడ్డి బాగా పరిచయం ఉన్న నాయకుడే. గత ఎన్నికల్లో కూడా కావలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఎన్నికల తర్వాతి నుంచి టీడీపీ నాయకత్వం ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. ఎన్నికల నాటికి పూర్తిగా పక్కన పెట్టేసింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర సూచనతో సుబ్బానాయుడిని కావలి ఇన్చార్జ్గా నియమించారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడిని పక్కకు నెట్టేసినందుకు ఇప్ప్పుడు టీడీపీ అక్కడ పతనం దిశగా పరుగులు తీస్తోంది. జిల్లాలో తన ప్రాబల్యం తగ్గకుండా కాపాడుకునేందుకే బీదా రవిచంద్ర కాటంరెడ్డిని పక్కన పెట్టి సుబ్బానాయుడిని ఇంచార్జ్‌గా తీసుకువచ్చారని కావలి టీడీపీ నేతలే చెబుతున్నారు. చాలాకాలంగా విష్ణువర్డన్ రెడ్ది..రవిచంద్ర కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుండటమే దీనికి కారణమని అంటున్నారు. సుబ్బానాయుడు కావలి ఇన్చార్జ్గా మూడేళ్ళపాటు వ్యవహరించారు. అయితే ఇటీవల మాఫియా డాన్ కావ్య కృష్ణారెడ్డిని కావలి అభ్యర్థిగా ప్రకటించారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో కావలిలో ఉపయోగపడతాడని చంద్రబాబు భావించారు. ఇదిలాఉంటే కావలిలో ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ జెండా ఎగరనివ్వబోనని కాటంరెడ్డి శపథం చేశారు. తాను కూడా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి చెమట్లు పడుతున్నాయి. నియోజకవర్గంలో కావ్యను వ్యతిరేకించేవారంతా కాటంరెడ్డికే మద్దతిస్తారు. బడా కాంట్రాక్టర్‌గా ఉన్న కావ్య కృష్ణారెడ్డిని మామూలుగానే కలవడం కష్టమని..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక మాకు అసలు అందుబాటులో ఉండడని టీడీపీలోనే చర్చలు జరుగుతున్నాయి. ఈవిధంగా సొంత పార్టీలోనే కావ్య కృష్ణారెడ్డికి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో కాటంరెడ్డి బరిలో ఉంటే కావ్య గల్లంతు కావడం ఖాయమనే టాక్ నడుస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టిక్కెట్ తెచ్చుకుంటే ఈ ఖర్మ ఏంటని టీడీపీ అభ్యర్థి తలపట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్ది 49 శాతం ఓట్లు సాధించారు. కావలి నియోజకవర్గంలో అయన చేసిన అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలు ఆయన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయని.. ఈసారి 59 శాతం ఓట్లు కచ్చితంగా పడతాయని tdp చేసిన సర్వేల్లోనే తేలిందని చెబుతున్నారు. ఈ సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి రెబల్‌గా పోటీపడితే Tdp ఓడిపోవడం గ్యారెంటీ అంటున్నారు ఆ పార్టీ నాయకులు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఆందోళన చెందిన టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి...మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డితో రాజీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలైంది. -
నెల్లూరులో.. టీడీపీ వర్సెస్ విష్ణు
కావలి: కావలి టీడీపీలో గందరగోళం నెలకొంది. కొత్త, పాత నేతల మధ్య కుదరని సఖ్యతతో రోజుకో వివాదం, పూటకో పంచాయతీ, సర్దుబాట్లతో తెలుగుతమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలకు, ప్రస్తుత కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి మధ్య వ్యవహారం చెడింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులతోపాటు ఇప్పటివరకు కావలి ఇన్చార్జ్గా ఉన్న బీద మస్తాన్‌రావుకు సన్నిహితులైన నాయకులను కనీసం మనుషులుగా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కోసం పనిచేయడం అంటే ఆత్మాభిమానం చంపుకోవాల్సిన దుస్థితి అని టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్ధన్‌రెడ్డి గెలిస్తే కావలిని తిప్ప దొంగలు పరిపాలన చేస్తారని, కావలి ప్రజలు నిద్రపోయే పరిస్థితి ఉండదని, కావలిని దొంగలు రాజ్యమేలుతారని తామే ప్రచారం చేశామని, ఇప్పుడు ఆయనకు ఓట్లేయాలని చెబుతుంటే ప్రజలే ఆనాడు తాము చెప్పిన అంశాలను గుర్తుచేస్తున్నారని, ఇది ప్రచారంలో ఇబ్బందిగా ఉందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. అందుకు తార్కాణం విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ట్రంక్‌రోడ్డులో ఉన్న వ్యాపారవర్గాల ప్రతినిధులు ఒక్కరు కూడా కనీసం పలకరించడానికి రాలేదని టీడీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. అదే వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో జరిగిన ర్యాలీలో ట్రంక్‌రోడ్డులోని వ్యాపారవర్గాల ప్రతినిధులు కిక్కిరిసిన జనాల రద్దీ నడుమ ఆయనను సత్కరించారని కూడా గుర్తుచేస్తున్నారు. ఈ తేడా చాలని కావలి ప్రజల ఆదరణ ఎవరికి ఉందనే విషయం తేటతెల్లం చేస్తోందని టీడీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం. అల్లూరులో అధికారపార్టీ రౌడీయిజం ఎన్నికల ప్రచారం సీరియస్‌గా జరుగుతున్న నేపథ్యంలో కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వర్గం, ఆయన కుమారుడు, వేర్వేరుగా వైఎస్సార్సీపీ నాయకులపై రౌడీయిజం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వైఎస్సార్సీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించడం, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రజలను భయకంపితులను చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రజల్లోకి వెళ్లిపోయిందని, ప్రచారంలో ప్రజలు ఈ అంశాలపైనే తమను ప్రశ్నిస్తున్నారని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సౌమ్యుడు అనే సానుకూలత ప్రజల్లో బలంగా ఉన్న నేపథ్యంలో.. ‘నా సంగతి ఎమ్మెల్యేకు పూర్తిగా తెలియదు, నేనేందో చూపిస్తా ఎమ్మెల్యేకు’.. అంటూ సాక్షాత్తూ మీడియా ముందే విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించడాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారని టీడీపీ శ్రేణులు చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రచారంలో పాల్గొంటున్న వారికి భోజనాల విషయంలో కూడా అభ్యర్థి మనుషులు చులకనగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి అనుచరుల తీరు, పార్టీ క్యాడర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకు నిరసనగా బుధవారం నుంచి భోజనాలు పెట్టే పథకాన్ని రద్దు చేశారు. అలాగే ఎన్నికల ప్రచారం, ఇతరత్రా అంశాల విషయంలో టీడీపీ నాయకులతోపాటు ప్రాంతాల వారీగా విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వ్యక్తులు కూడా పరిశీలన నిమిత్తం నియమించాలనే అంశాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేపోతున్నారు. తమపై నిఘా పెట్టి ఎన్నికల ప్రచారం తమను చేయమనడం ఏమిటని, అంతగా తమ పట్ల నమ్మకం లేకపోతే అసలు తమ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ టీడీపీ జిల్లా అధ్యక్షుడైన బీద రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లి చర్చించి, తాము తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
'12 నుంచి ప్రాజెక్టుల యాత్ర'
హైదరాబాద్: రాయలసీమ విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన పార్టీ ప్రధాన కార్యాయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో ఉన్న 150 సీట్లలో రాయలసీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 107 సీట్లు కేటాయించాల్సి ఉండగా ఈ ఏడాది 12 మందికే ప్రవేశాలు లభించాయన్నారు. 1974లో రాష్ట్రపతి ఆమోదంతో చట్టసవరణతో చేసిన జోనల్ వ్యవస్ధ ప్రకారం ఎస్వీయూ పరిధిలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి 107 సీట్లు ఇవ్వాలన్నారు. అయితే రాష్ట్రంలోని 13 జిల్లాలనూ లోకల్ ఏరియాగా అమలు చేస్తూ ప్రభుత్వం జీవో 120ని జారీ చేయడంతో సీమకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పటికే రాయలసీమ అన్ని విధాలా దగాపడ్డ, వెనకబడిన కరువు పీడిత ప్రాంతమన్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జోనల్ వ్యవస్ధను పాటించకపోతే అన్ని విధాలా అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోటీ అంటే సాధ్యమయ్యే విషయం కాదన్నారు.