![Minister Anam Ramanarayana Reddy Sensational Comments On His Security](/styles/webp/s3/article_images/2024/10/23/anam-ramanarayana-reddy.jpg.webp?itok=AZta1apo)
నెల్లూరు, సాక్షి: తన భద్రత విషయంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ భద్రత సరిగా లేకపోవడంపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘సొంత సెక్యూరిటీ సిబ్బందితో నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లైసెన్సుడ్ వెపన్‌ను క్యారీ చెయ్యాలనుకుంటున్నా. అందరికీ సెక్యూరిటీ ఇచ్చినట్లే నాకు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది’ అని అనుమానం వ్యక్తం చేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/25_8.png)
చదవండి: ‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’
Comments
Please login to add a commentAdd a comment