anam ramanarayana reddy
-
నిజమైతే నిరూపించండి.. మంత్రి ఆనంకు భూమన సవాల్
సాక్షి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట(tirupati stampede)లో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సందర్భంగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) చేసిన అర్థం లేని ఆరోపణలపై వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) వీడియో ద్వారా ధీటుగా బదులిచ్చారు.భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..:‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాపై చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. నిజానికి మీ నిర్వాకం వల్ల ఆరుగురు మరణిస్తే, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, జగన్‌పై ఆరోపణలు చేశారు. ఇది కచ్చితంగా మీరు స్థాయి దిగజారి మాట్లాడటమే. ఇంత హీనంగా మాట్లాడగలనని మీకు మీరు నిరూపించుకున్నారు. మీ మాటలతో తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులు, క్షతగాత్రులను దారుణంగా అవమానించారు’.‘తొక్కిసలాట బాధితులపై సానుభూతి చూపాల్సింది పోయి, పరామర్శించి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. మేం డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నామనడం రాజకీయం కాదా?. దీన్ని బట్టే ఎవరు రాజకీయం చేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. మీకు క్షతగ్రాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. వారు మీ గురించి మాట్లాడలేదని మీరు ఇలా మాట్లాడుతారా? మీ అస్తిత్వానికి ఇబ్బంది వస్తుందని ఇలా ఆరోపణలు చేస్తారా?’.‘మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకోవడం దారుణం కాదా?. కనీస భధ్రత ఇవ్వాలని కూడా తెలియదా?. జగన్ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంతసేపు అక్కడెందుకు ఉన్నారు?. అది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా?. జగన్ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసిన మాట నిజం కాదా?’.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా!‘మిమ్మల్ని తిట్టించడం కోసం మేం ఆస్పత్రిలో డబ్బులిచ్చామన్నది సీసీ కెమెరాలో రికార్డయిందని అంటున్నారు కదా?. ఆనం రామనారాయణ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. తొక్కిసలాట క్షతగాత్రులతో మిమ్మల్ని తిట్టించడం కోసమే మేము వారికి డబ్బులు ఇచ్చామంటున్నారు కదా!. ఒకవేళ అది నిజమైతే, మీకు నిజంగా దేవుడిపై భక్తి కలిగి ఉంటే మేం కేవలం మిమ్మల్ని తిట్టించడం కోసమే తొక్కిసలాట క్షతగాత్రులకు డబ్బులిచ్చినట్లు మీరు నిరూపించాలి. ఆ పని చేయలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి’.‘నిజానికి జగన్ వచ్చేవరకు మమ్మల్ని ఆసుపత్రి వైపు మీ పోలీసులు, అధికార గణం వెళ్లనీయలేదు. ఆ విషయం గుర్తుంచుకొండి. చంద్రబాబు పాలనపై ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా.. మీ పార్టీలో ఎవరూ గుర్తించడం లేదనే మీరు, ఇలా ఆరోపణలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది’’ అని భూమన పేర్కొన్నారు. -
మా ప్రభుత్వంపై నమ్మకం లేదు.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు, సాక్షి: తన భద్రత విషయంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ భద్రత సరిగా లేకపోవడంపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘సొంత సెక్యూరిటీ సిబ్బందితో నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లైసెన్సుడ్ వెపన్‌ను క్యారీ చెయ్యాలనుకుంటున్నా. అందరికీ సెక్యూరిటీ ఇచ్చినట్లే నాకు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది’ అని అనుమానం వ్యక్తం చేశారు.చదవండి: ‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’ -
మంత్రి నారాయణకు తీవ్ర అవమానం
జిల్లాలో ఇసుక ఓపెన్ రీచ్‌ల టెండర్ల వ్యవహారం ఇద్దరు మంత్రుల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెరతీసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా లాటరీ విధానంలో పారదర్శకంగా ఇసుక రీచ్‌లు కేటాయించాలని మంత్రి నారాయణ ఇచ్చిన ఆదేశాలను మరో మంత్రి ఆనం తిప్పికొట్టారు. తన ఇలాకాలో ఉండే ఇసుక రీచ్‌లపై నారాయణ పెత్తనం ఏమిటన్నట్లుగా కన్నెర్ర చేశారు. బరితెగించి బాహాటంగానే కాంట్రాక్టర్‌ను, కలెక్టర్‌ను బెదిరించిన ఆనం.. ఏకంగా సహచర మంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన ఆధిపత్యంతో రీచ్‌ల కేటాయింపునే రద్దు చేయించారు. నామినేషన్ పద్ధతిలో తన అనుచరులకు కట్టబెట్టించుకున్నారు. మంత్రి నారాయణను చెల్లని నాణెం చేశారు.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య ఇసుక తుఫాన్ పెను దుమారం రేపుతోంది. టీడీపీ ప్రభుత్వంలో నంబర్ టు మంత్రిగా చెలామణి అవుతున్న నారాయణ ఆదేశాలకే దిక్కులేకుండా పోయింది. మరో మంత్రి ఆనం కింగ్ మేకర్‌గా చక్రం తిప్పే స్థాయిలో వ్యవహరిస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో జరిగిన పరిణామాలు ఇద్దరు మంత్రుల మధ్య అగాధాన్ని సృష్టించాయి. ఇసుక టెండర్ల వ్యవహారంలో మంత్రి ఆనం తన పంతం నెగ్గించుకోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన కోటరీలో చేరిపోయారు. ఈ వ్యవహారం కలెక్టర్ ఆనంద్‌కు తలనొప్పిగా మారింది. రీచ్‌లను పంచుకునేందుకు.. జిల్లాలోని పెన్నానదిలో నాలుగు చోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మినగల్లు, పడమటి కంభంపాడు, పల్లిపాడు, విరువూరులో ఓపెన్ రీచ్‌ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల 6న టెండర్లను ఆహా్వనించారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రం చేసి టీడీపీ నేతలకే కట్టబెట్టేందుకు మంత్రి ఆనంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజకీయంగా ఒత్తిడి తెచ్చారు. చివరి తేదీ వరకు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరు రోజు 16వ తేదీన ఆయా రీచ్‌లకు టీడీపీ నేతలతో పాటు బయట వ్యక్తులు మొత్తంగా 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిలో ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది. 69 శాతం లెస్తో తమ్ముళ్ల టెండర్లు నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపించేందుకు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.90 నుంచి రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లించేది. అంతకంటే తక్కువ ధరకే కేటాయిస్తే గిట్టుబాటు కాదని, అక్రమ రవాణాకు ప్రోత్సహించినట్లే అవుతుందని భావించిన కలెక్టర్ ఆనంద్ టన్నుకు రూ.114.90 వంతున నిర్ణయించి టెండర్లు ఆహా్వనించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం రీచ్‌ల్లోకి ఎంట్రీ అయితే చాలన్నట్లుగా 69 శాతం లెస్తో కేవలం రూ.36 మాత్రమే కోట్ చేశారు. టీడీపీ నేతలు లోకాస్ట్‌లో టెండర్లు వేయడంతో వారికి కేటాయిస్తే అక్రమాలకు ఆస్కారం ఉంటుందని భావించిన కలెక్టర్ ఆనంద్ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్లతో సమావేశమైన మంత్రి నారాయణ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా చేయాలంటే లాటరీ విధానం ఉత్తమమని భావించి ఆ ప్రకారమే కేటాయించమని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ లాటరీ విధానంలో నలుగురు కాంట్రాక్టర్లకు నాలుగు రీచ్‌లకు అనుమతులు కేటాయించారు. ఒక్కో రీచ్‌కు ముగ్గురిని ఎంపిక చేసి ప్రథమ స్థానంలో ఉన్న వారికి రీచ్‌ను కేటాయించారు. మరో ఇద్దరిని రిజర్వులో ఉంచారు. నారాయణ ఆదేశాలు 48 గంటల్లోనే రద్దు టీడీపీ ప్రభుత్వంలో నంబర్ టుగా చెలామణి అవుతున్న మంత్రి నారాయణ ఆదేశాలు 48 గంటల్లోనే రద్దు చేయించి.. తన ఆదేశాలు అమలు జరిగేలా మరో మంత్రి ఆనం చక్రం తిప్పారు. మంత్రి నారాయణ ఎవరు.. అంటూ కలెక్టర్‌పై అగ్గిమీద గుగ్గిలం కావడంతో పాటు టెండర్ల వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సీఎం కార్యాలయంలో పంచాయితీ పెట్టి లాటరీ ద్వారా చేసిన కేటాయింపులను రద్దు చేయించారు. మంత్రి నారాయణకు తీవ్ర అవమానం ఇసుక టెండర్ల వ్యవహారంలో మంత్రి నారాయణకు అవమానం జరిగిందని ఆ పారీ్టలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. టీడీపీకి ఆర్థికంగా వెన్నుముకలాంటి నారాయణ ఆదేశాలకు దిక్కేలేకుండా పోయిందని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి నారాయణ తీసుకున్న పారదర్శక నిర్ణయాన్ని అమలు చేసిన తర్వాత అడ్డుకోవడం అంటే ఆయన్ను అవమానించినట్లేనని ఆ పార్టీలోని సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కలెక్టర్ సైతం మంత్రి నారాయణ ఆదేశాలను పక్కన పెట్టడంతో జిల్లా యంత్రాంగంలో కూడా చెల్లని నాణెం అయ్యారనే చర్చ నడుస్తోంది. నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారుఇసుకను ఓపెన్ రీచ్‌లను ఓ పథకం ప్రకారం మంత్రి ఆనంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. తమ అనుచరులకు నామినేషన్ పద్ధతిలో ఒక్కొక్కరికి 5 వేల టన్నుల తవ్వేందుకు తాత్కాలిక అనుమతులు ఇప్పించేశారు. ఆదివారం నుంచి బహిరంగంగానే ఇసుక దోపిడీకి జిల్లా అధికార యంత్రాంగం గేట్లు ఎత్తి రాచబాట వేశారు. -
సామాన్య భక్తులను పట్టించుకోరా?
తిరుమల: తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదని.. ఆదివారం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నా శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదంటూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై తమిళనాడుకు చెందిన బుల్లితెర నటుడు మహేశ్‌తో పాటు పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయన్ని ఆలయ అధికారి అని భావించిన తమిళనాడు భక్తులు చుట్టుముట్టేశారు. వీరిలో తమిళ నటుడు మహేశ్‌బాబు కూడా ఉన్నారు.ఆయన మాట్లాడుతూ.. 10 మంది కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం తిరుమలకు చేరుకున్నట్లు చెప్పారు. ఆదివారం క్యూ లైన్లోకి వెళ్లినా స్వామివారి దర్శన భాగ్యం మాత్రం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయట్లేదని మరికొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నప్రసాదం, పాలు, మజ్జిగ ఇవ్వకపోవడంతో.. చిన్న పిల్లలతో క్యూ లైన్లలో ఉండలేక బయటకు వచ్చేశామంటూ వాపోయారు. తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదంటూ మరో భక్తుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆనం స్పందిస్తూ.. అధికారుల ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తానంటూ సర్దిచెప్పి.. అక్కడి నుంచి జారుకున్నారు. -
వీఐపీ ఏంటి..? జనరల్ ఏంటి..?
-
తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు
తిరుమల, సాక్షి: తిరుమలలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తుడు మూడు రోజులుగా శ్రీవారి దర్శనం కాలేదని, వీఐపీలు మాత్రమే భక్తులా అంటూ శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రిని నిలదీశాడు. తిరుమలలో సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారని అన్నారు.గంటల తరబడి క్యూలైన్లో ఉన్నా ఆహారం అందలేదని, శ్రీవారి దర్శనం చేసుకోలేక పోతున్నామని భక్తులు ప్రశ్నించారు. ఆలయం ముందు భక్తులు ప్రశ్నించడంతో మళ్లీ మాట్లాడుతానంటూ మంత్రి రామనారాయణరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
చంద్రబాబు సీరియస్.. ఆ ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్
-
ఆ మంత్రులిద్దరికీ చంద్రబాబు వార్నింగ్?!
అమరావతి, సాక్షి: సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ‘నెల్లూరు పంచాయితీ’ జరిగింది. ఆ జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలపై ఆయన క్లాస్ తీసుకున్నారు.నెల్లూరు మంత్రులిద్దరూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యవహారాల్లో పూర్తిగా ఆయన్ని పక్కన పెడుతూ వస్తున్నారు. తాజాగా మంత్రి ఆనం నిర్వహించిన సమీక్షకు ఆయన్ని పిలవలేదు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన బీద రవిచంద్ర.. అధినేత చంద్రబాబుని కలిసి ఆ ఇద్దరు మంత్రులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆనం తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చూపిస్తుండడంపైనా గరం అయ్యారని, ఇక నుంచైనా బీద రవిచంద్రతో కలిసి పని చేయాలని మంత్రులిద్దరికీ చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు సమాచారం.ఇంకా భేటీలో మంత్రులతో చంద్రబాబు ఏమన్నారంటే.. నెల రోజుల పని తీరుపై చర్చ జరిపాం. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలి. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందే. అధికారాన్ని తలకెక్కించుకోవద్దు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. -
లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్!
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం తర్వాత తొలిసారి స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాను స్పీకర్‌గా ఆమోదించడంలో రాజకీయ కుట్ర ఏముందని తమ్మినేని ప్రశ్నించారు. గడువు తర్వాతే నిర్ణయం.. గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను నాకు ఎప్పుడో ఇచ్చారు. పైగా స్పీకర్ ఫార్మాట్లోనే ఆయనే ఇచ్చారు. ఎమ్మెల్యేగా తప్పుకుంటానని తెలిపారు. లేఖ ఇవ్వగానే ఆమోదించడం సరికాదని వేచిచూశాం. మనసు మార్చుకుంటాడన్న మానవతా దృక్పథంతో ఇప్పటివరకు ఆగాను. ఇప్పుడు స్పీకర్‌గా నా పదవీకాలం ముగుస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇన్నాళ్లు అవకాశం ఇచ్చినా నిర్ణయాన్ని మార్చుకోలేని ఇప్పుడెలా మార్చుకుంటాడని భావించాను. పదవీ కాలం సమీపిస్తుండడంతో రాజీనామాను ఆమోదించాను. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అమ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి.. ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు ఏదైనా భిన్నంగా ఆలోచిస్తే.. కోర్టుల ద్వారా ముందుకు వెళ్లొచ్చు. రాజీనామా ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం అనేది సరికాదు. చట్టసభల విషయంలో నియమ నిబంధనలను పాటించాలి. ఒక వేళ గంటా శ్రీనివాసరావు ఓటుతోనే అధికార పార్టీ రాజ్యసభ సీట్లు ఆధారపడిలేవు కదా. వైఎస్సార్సీపీ రాజ్యసభ సీటు కోల్పోతుంది అని ప్రచారం చేస్తున్న విషయమే కరెక్టయితే అందరికీ నోటీసులు ఎందుకు ఇస్తాం? ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇచ్చాను. వారంలోపు అన్ని పిటిషన్లు క్లియర్ చేస్తాం. స్పీకర్ లేఖలు.. ఒక పార్టీ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరుకునపడ్డారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఇప్పటికే అనర్హతా వేటు ఎదుర్కొంటున్నారు. వీరిపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో స్పీకర్ వీరికి నోటీసులిచ్చారు. ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కావాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది. వారంలో ఏం జరగనుంది? స్పీకర్‌గా తన పదవీ కాలం సమీపిస్తుండడంతో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై వారంలోగా నిర్ణయం తీసుకుంటానని తమ్మినేని ప్రకటించడం తెలుగుదేశంలో గుబులు రేపుతోంది. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన నలుగురిని వెంటనే లాగేసుకున్న చంద్రబాబు.. తాజాగా జరుగుతున్న పరిణామాలపై గుంభనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురికి తెలుగుదేశం టికెట్ ఇచ్చి పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. పక్కపార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. 2014-19 మధ్య ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బోలెడు డబ్బు గుమ్మరించి లాగేసుకున్న చంద్రబాబుకు ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టారు ఓటర్లు. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. అనర్హతా పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకుని వేటు వేస్తే.. ఈ నలుగురు కూడా పోటీ చేసేందుకు అర్హతా కోల్పేయే అవకాశం ఉంది. అది స్పీకర్ విశిష్టాధికారం అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్ నిర్ణయం. స్పీకర్ వ్యవస్థ పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. గంటా రాజీనామాను ఆమోదించాలన్నది స్పీకర్ నిర్ణయం. ఎప్పుడు ఆమోదించాలో అన్నది కూడా ఆయన నిర్ణయమే. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు YSRCP గెలుస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తుందనుకుంటారు? అసలు టీడీపీకి తగినంత సంఖ్యాబలమే లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. -
టీడీపీలో అయోమయంగా ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి
-
వెన్నుపోటు నేతలకు భంగపాటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:నమ్మిన వారిని మోసం చేయడం, వారిని నట్టేట ముంచేయడం చంద్రబాబు నాయుడి నైజం. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నిజస్వరూపం తెలిసి కూడా మరోసారి నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు బొక్కబోర్లా పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు చెప్పిన తియ్యటి మాటలు ఇప్పుడు విన్పించడం లేదు. దీంతో ఆ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాటమార్చి మోసం చేసి.. వెంకటగిరి, నెల్లూరురూరల్, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు చంద్రబాబు చేసిన మోసంపై మథన పడుతున్నారు. జిల్లాలోనే ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ క్రీడలో ఓ పావుగా మారారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనను 2016లో ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవి ఆశ చూపడంతో టీడీపీలో చేరారు. పచ్చ కండువా కప్పుకోగానే మాట మార్చిన చంద్రబాబు కనీసం ఆత్మకూరు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఇవ్వకుండా అవమానించారు. టీడీపీలో జరిగిన అవమానాల్ని తట్టుకోలేక కుమిలిపోతున్న తరుణంలో వైఎస్సార్సీపీ అక్కున చేర్చుకుని వెంకటగిరి నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది. అయితే అక్కున చేర్చుకున్న పార్టీనే కాదనుకున్న ఆనం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. దీంతో ఆనం టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లి పార్టీ కండువా కప్పుకోకుండానే లోకేశ్ యువగళం పాదయాత్రలో హల్చల్ చేశారు. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలతో పాటు నెల్లూరు సిటీ, ఆత్మకూరు సీట్లు ఇస్తామని టీడీపీ అధినేత నమ్మబలకడంతో ఆనం యువగళంలో పాల్గొన్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అ«ధినేత మాట మారింది. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు కాకుండా.. ఒక్క ఆత్మకూరుకే పరిమితం కావాలని ఆదేశాలొచ్చాయి. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఈ విషయం తేలడంతో ఆత్మకూరులో పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలుసుకున్న ఆనం తనకు నెల్లూరు సిటీ లేదా వెంకటగిరి స్థానాన్ని కేటాయించాలని చంద్రబాబు వద్ద మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆత్మకూరు లేదా సర్వేపల్లిలో పోటీ చేయాలని తెగేసి చెప్పడంతో ఆనంకు దిక్కతోచని పరిస్థితి నెలకొంది. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయానంటూ ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉదయగిరికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఆనం వద్దకు వెళ్లి ఉదయగిరి రావాలని ఆహ్వానించగా పార్టీలో తన పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదని వాపోయారని తెలుస్తోంది. కోటంరెడ్డి సీటు వెనుక కుట్ర నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి కూడా టీడీపీలో అయోమయంగా మారింది. రూరల్ టీడీపీ టికెట్ నీదేనంటూ మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ సీటు జనసేనకు ఇచ్చేందుకు తెరవెనుక రాజకీయం చేస్తున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ఒక్క సీటైనా జనసేన అడిగే అవకాశం ఉంది. ముందుగా నెల్లూరు సిటీ మీద జనసేన కన్నుపడింది. అయితే మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన సామాజికవర్గంలో ఉన్న పరపతిని ఉపయోగించి జనసేన అధినేత వద్ద పంచాయితీ పెట్టారని, నెల్లూరు సీటు ఆశించకుండా ఉంటే ప్యాకేజీతోపాటు మరోచోట పోటీ చేస్తే అక్కడ అయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటూ షరతు పెట్టారని ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రూరల్ టికెట్ రాకుండా తెరవెనుక కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉదయగిరి టికెట్ నీదేనంటూ చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీ కండువా కప్పుకున్న చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ కాదు కదా ఎమ్మెల్సీ కూడా ఇచ్చేది లేదని, ముందు పార్టీకి పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారంట. చంద్రశేఖర్‌రెడ్డి సతీమణికి పార్టీ పదవి ఇచ్చి ‘ఈ పదవే నీకు ఎక్కువ ఇక చాలు’ అని చెప్పడంతో చంద్రశేఖర్‌రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకుంటున్నారు. ఇటుఉదయగిరిలో కూడా టీడీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డికి కనీస గౌరవంకూడా ఇవ్వటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించక పోవడంతో ఆయన పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా తయారై ఇంటికే పరిమితం అయ్యారనే ప్రచారం సాగుతోంది. -
నకిలీ ఓట్ల వ్యవహారంపై నెల్లూరు YSRCP నేతలు మండిపడ్డారు
-
ఆనం.. ఏమిటీ ఆగం..?
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంగంలో బుధవారం చీప్ పాలిటిక్స్ చేసి నవ్వుల పాలయ్యారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంగంలో స్థానిక వలంటీర్లతో సమావేశాన్ని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనల మేరకు ఏర్పాటు చేశారు. సచివాలయాల పరిధిలో సమస్యల గుర్తింపు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, తదితర అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇలా రెండు రోజులుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంగంలోని సొసైటీ కార్యాలయంలో వలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక మండలాధ్యక్షులతో పాటు ఎమ్మెల్యే ప్రతినిధులు హాజరయ్యారు. అయితే వలంటీర్లతో సొసైటీ కార్యాలయంలో సమావేశాన్ని పెట్టడమే తప్పనే రీతిలో అక్కడికి వెళ్లిన ఆనం రామనారాయణరెడ్డి నానా హంగామా చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ చేస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు. వాస్తవానికి కలెక్టర్ హరినారాయణన్ సంగం మండలంలో ఇటీవల పర్యటించి ఓట్ల తొలగింపు, చేర్పుల విషయాన్ని పరిశీలించారు. ఎక్కడా అవకతవకలు జరగలేదని ఆయన ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇవేవీ తెలుసుకోకుండా ఆనం రామనారాయణరెడ్డి హడావుడి చేయడంపై పలువురు మండిపడుతున్నారు. -
అప్పుడేమో హడావుడి.. ఇప్పుడేమో గప్‌చుప్.. ఆగమైన ఆనం
టీడీపీ కండువా కప్పుకోకుండానే యువగళం యాత్రలో హడావుడి చేసిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం మౌనం దాల్చడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పునర్జన్మనిచ్చిన వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన ఆనంకు టీడీపీ రాచబాట వేసినా కాలం కలిసి రావడం లేదు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఒకప్పుడు ఆనం రామనారాయణరెడ్డి ఓ వెలుగు వెలిగినా మారిన రాజకీయ పరిస్థితులతో ఆయనకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఆనం కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లారు. అప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ ఆనంను టేకెటీజీగా తీసుకుంది. పార్టీలో చేరే ముందు ఇచ్చిన ఒక్కహామీని నెరవేర్చలేదు. సీనియర్ నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ఆత్మకూరులో పార్టీ ఇన్చార్జిగా కూడా నియమించలేదు. దీంతో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆనంను అక్కున చేర్చుకుని వెంకటగిరి ఎమ్మెల్యేగా హోదా ఇచ్చింది. అక్కున చేర్చుకున్న పార్టీకే వెన్నుపోటు పొడిచి ఆనం మళ్లీ టీడీపీలోకి వెళ్లడంతో ఆయనకున్న ఇమేజ్ సొంత క్యాడర్లోనే దెబ్బతింది. అయోమయంలో ఆనం ఆత్మకూరుపై మోజు పెట్టుకున్న ఆనంకు అన్నింటా అపశకునాలే ఎదురవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఆత్మకూరులోకి ఆయన రీఎంట్రీ ఇచ్చినా యాత్రను విజయవంతం చేయడంలో విఫలమయ్యారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన సీనియర్ నేత గూటూరు కన్నబాబును పాదయాత్రలోకి ఎంట్రీ ఇవ్వకుండా చేయించారు. అదే రీతిలో మరో సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడును ఘోరంగా అవమానించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఆనం ప్రవేశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఉన్నప్పటికీ ఆనం కోసం పనిచేసేది లేదని తెగేసి చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కి వచ్చి క్యాడర్‌ను ముప్పుతిప్పలు పెట్టి వెళ్లిపోయిన వ్యక్తికి మరోసారి ప్రవేశానికి ఎలా గ్రీన్‌సిగ్నల్ ఇస్తారంటూ కన్నబాబు తన అనుచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం ఉంది. సొంత సర్వేల్లోనూ నిరాశే ఆనం టీడీపీ పక్షం వహించాక రెండు టీములతో సొంత సర్వే చేయిస్తున్నారని సమాచారం. తనతో పాటు తన కుమార్తె కై వల్యారెడ్డి ఏదోక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు ఎలా ఉంటుందన్న అంశంపై సర్వే చేయిస్తుండగా, అధికారం కోసం పార్టీలు మారుతున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె కై వల్యారెడ్డి అభ్యర్థిత్వంపై నిర్వహించిన సర్వేలోనూ ఎలాంటి సానుకూల పరిస్థితులు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో ఆనం చూపు వెంకటగిరి వైపు ఉన్నట్లు కూడా రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో వైపు కుటుంబం కూడా ఆనంతో కలిసిరావడం లేదు. దీంతో పాటు ఆనంను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఆత్మకూరులో పార్టీని నడిపించేందుకు, ఎన్నికల ఖర్చును పార్టీయే పెట్టుకుంటుందని చెప్పిన వారే ప్రస్తుతం ముఖం చాటేస్తుండడంతో ఆయన అయోమయంలో పడ్డారు. టీడీపీ కార్యక్రమాలపై నిరాసక్తి టీడీపీ నిర్ణయం మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో మహిళలతో మహాశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ఆత్మకూరు నియోజకవర్గంలో మాత్రం చేపట్టడం లేదు. ఇటీవల మహాశక్తి కార్యక్రమ నిర్వహణపై నిర్వాహకులు ఆనంను కలిసినా తాను ఇప్పట్లో సహకరించలేనని నిరాకరించారనే ప్రచారం ఉంది. -
ప్చ్.. నెల్లూరు టీడీపీ సీనియర్ల దుస్థితి ఇది
జిల్లాలో నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర టీడీపీలో చిచ్చురేపింది. ఇప్పటికే పార్టీ పరిస్థితి దిగజారుతున్న క్రమంలో పాదయాత్ర జోష్ నింపుతుందని ఆశించిన ఆ పార్టీ శ్రేణులకు నిరుత్సాహమే మిగిలింది. పాదయాత్రలో వలస నేతలకు రెడ్‌కార్పెట్ వేసిన చినబాబు కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి జెండా మోసిన సీనియర్ నేతలు అవమానపడేలా చేయడంతో వారు అంటీముట్టనట్లు వ్యవహరించారు. పాదయాత్రకు ప్రజల్లో కూడా సృందన కరువై ఫ్లాప్‌షోగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గత నెల 13వ తేదీన జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు నెల రోజులకు పైగా చినబాబు పాదయాత్ర చేపట్టారు. నిత్యం పసలేని ఆరోపణలు, తడబడిన ఉచ్ఛారణ వెరసి ప్రజల్లో మరింత చులకన అయ్యాడు. ప్రజల్లో కూడా స్పందన లేకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లాప్‌షోగా మారింది. ఓ వైపు టీడీపీ నేతలు సభలను విజయవంతం చేసేందుకు జన సమీకరణ కోసం కోట్లాది రూపాయలు వెదజల్లినా ఆశించిన ఫలితాలు కన్పించలేదు. ఒకే ఫార్ములా.. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు నిర్వహించే సభల్లో ఒకే ఫార్ములా పాటిస్తున్నారు. టీడీపీ సభలకు జనస్పందన లేకపోవడంతో జనం ఎక్కువగా కన్పించేందుకు వారు ఇరుకు రోడ్లపై సభలు నిర్వహిస్తున్నారు. సహజంగా సభ జరిగే ప్రాంతం వై జంక్షన్లో రెండువైపులా కన్పించేలా వాహనం ఉంచి ప్రసంగాలు చేస్తారు. కానీ టీడీపీ సభలు జరిగే ప్రదేశం జంక్షన్ ఉన్న ప్రాంతాన్ని కాదని ఇరుకురోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 40 అడుగుల రోడ్డులో రహదారికి ఇరువైపులా పది అడుగులు కుదించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండువైపులా ఇరవై అడుగులు కుదించడంతో ఇరవై అడుగులు మాత్రమే ఉండేలా చేస్తున్నారు. అక్కడ వెయ్యి మంది జనం పోగైతే చాలు వేలాది మంది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో షూట్ చేసి వేలాది మంది ఉన్నట్లు భ్రమలు కల్పించే ఫార్ములాను అమలు చేస్తున్నారు. గతంలో కందుకూరులో చంద్రబాబు సభ ఇదే రీతిలో చేపట్టడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇదే ఫార్ములా యువగళంలో కూడా అమలు చేసి సభలు నిర్వహించారు. సీనియర్ నేతలకు అవమానాలు లోకేశ్ పాదయాత్రలో టీడీపీ సీనియర్ నేతలకు ఘోర అవమానాలు ఎదురయ్యాయి. ఆత్మకూరులో నాలుగేళ్లపాటు పార్టీ ఇన్చార్జిని కూడా నియమించని దుస్థితి ఉంది. ఈ క్రమంలో ఆత్మకూరుకు వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి(వెంకటగిరి) కోసం పాకులాడాల్సి వచ్చింది. పార్టీ సీనియర్ నేతలంతా ఆత్మకూరులో యువగళం వ్యవహారాలు చూడాలని ఆనంను కోరడంతో ఆయన కొన్ని డిమాండ్లు విధించారు. పాదయాత్ర జరిగే సమయంలో టీడీపీ సీనియర్‌నేత గూటూరు కన్నబాబు కన్పించకూడదని తెగేసి చెప్పడంతో ఆనం కోసం కన్నబాబును దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఆత్మకూరులో కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకుని వెన్నంటి ఉన్న కన్నబాబును ఆనం మూలాన బలిచేయాల్సి వచ్చింది. పాదయాత్ర జరిగే సమయంలో ఆయన్ను విదేశీ పర్యటన పేరుతో పంపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు లోకేశ్‌ను కలిసే అవకాశం లేకుండా చేశారు. కాగా నెల్లూరురూరల్ నియోజకవర్గంలో అదే సీన్ జరిగింది. వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోసం ఆ పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్‌ను పక్కనపెట్టారు. గత నాలుగేళ్లలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన కోటంరెడ్డి కోసం అబ్దుల్ అజీజ్‌ను బలి చేశారు. ద్వితీయశ్రేణి నేతలు సైతం కోటంరెడ్డి రాకతో లోలోన కుమిలిపోతున్నారు. పసలేని ఆరోపణలు జిల్లాలో లోకేశ్ పాదయాత్రలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చేసిన పసలేని అడ్డుగోలు ఆరోపణలు ఆయన్ని నవ్వులపాలు చేశాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడి వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని అవినీతి జరిగిందని చెప్పడంపై అందరినీ ఆశ్చర్యపరిచింది. లోకేశ్ పసలేని ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సవాల్ విసిరినా టీడీపీ నేతలు మారుమాట్లాడక పోవడం గమనార్హం. ఒక్కొక్కరికీ ఒక్కో చేదు అనుభవం ► నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి నారాయణ కోసం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఉద్వాసన పలికారు. గత నాలుగేళ్లుగా టీడీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కోటంరెడ్డిని కాదని మాజీ మంత్రికి బాధ్యతలు అప్పగించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా ఈ దఫా నేను ఎమ్మెల్యే అభ్యర్థినని కోటంరెడ్డి బహిరంగంగా ప్రకటించుకోగా ఆ కలను చినబాబు కలగానే మిగిల్చాడు. ► కోవూరు నియోజకవర్గంలో సీనియర్ నేతలను సైతం టీడీపీ పెద్దలు కరివేపాకులా వాడుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా ఆ పార్టీని నమ్ముకున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ప్రతి దఫా సీటు ఇస్తామంటూ ఆశపెడుతూ అన్యాయం చేస్తున్నారు. యువగళంలో కూడా పెళ్లకూరుకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన గర్రుగా ఉన్నారు. ► కావలి నియోజకవర్గంలో సీనియర్ నేతలకు చుక్కలు చూపించారు. బీద రవిచంద్ర మాలేపాటి సుబ్బానాయుడుని తెరపైకి తెచ్చి చేతిచమురు వదిలింపజేయగా, ప్రస్తుతం దగుమాటి వెంకటకృష్ణారెడ్డిని తెరపైకి తెచ్చారు. అనంతరం అందరికీ మస్కాకొట్టి బీద రవిచంద్ర యువగళంలో తన సతీమణిని రంగంలోకి దింపడంతో టికెట్ ఆశించే నేతలకు దిమ్మదిరిగి మైండ్‌బ్లాక్ అయిందని అందరూ చర్చించుకున్నారు. ► ఉదయగిరిలో టికెట్ నీదేనంటూ పార్టీకి ఫండ్ తీసుకుని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌ను చినబాబు ఎంకరేజ్ చేశారు. దీంతో టికెట్ ఆశించిన కాకర్ల సేవా కార్యక్రమాల పేరుతో ఉదయగిరిలో మకాం వేశారు. తీరా యువగళంలో కాకర్లను దూరం పెట్టారు. పాదయాత్రలో ఆయన నీడ కూడా పడకుండా పంపించేశారు. అలాగే పార్టీలో సీనియర్‌నేతగా ఉన్న కంభం విజయరామిరెడ్డికి అవమానం జరిగింది. కొండాపురంలో జరిగిన సభలో కంభంకు మైకు ఇవ్వకుండా దింపేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డిలకు మైకు ఇచ్చి మాట్లాడించిన చినబాబు కంభం విజయరామిరెడ్డికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. -
ఆనంకి దెబ్బ మీద దెబ్బ..
-
ఇంత బిల్డప్ ఇచ్చారు.. తీరా చూస్తే.. ఇదేంటి ఆనం..
జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తిరుగులేదు. అన్ని చోట్లా నా అనుచరులు ఉన్నారంటూ బిల్డప్ ఇచ్చిన ఆ నేతకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అడుగుపెట్టిన ప్రతి చోటా.. స్థానిక నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడం ఇప్పుడు ఆయన్ని ఆందోళనలోకి నెట్టేసింది. నెల్లూరు జిల్లాలో రాజకీయ చరిత్ర కల్గిన ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని జిల్లాలో ఆయన గురించి తెలిసిన రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీ మీదే విమర్శలు చేసిన అనం.. తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి.. తనకు కావాల్సినవి జరగలేదన్న అక్కసుతో ప్రతిపక్షం చెంత చేరిన ఆనం.. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తన బలం.. బలగాన్ని చూపాలని ప్రయత్నించి బోర్లా పడ్డారు. లోకేష్ పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించి, జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలన్న ఆలోచన బెడిసి కొట్టిందట. ఆత్మకూరులో ఇటీవల జరిగిన పరిణామాలు ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు లోకేష్, అనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం రామనారాయణ రావడం వల్లే తనకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని గ్రహించిన కొమ్మి.. పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మరోవైపు టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న గూటూరు కన్నబాబును చంద్రబాబు కరివేపాకులా తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ద్రోహం చేసి వచ్చిన ఆనంకి ఆత్మకూరు బాధ్యత అప్పగించారు. దీంతో కన్నబాబుకి మండి ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికా ప్రయాణం కట్టేశాడట. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ఆత్మకూరు టీడీపీలో ఎదురైన ఈ పరిణామం ఒకెత్తయితే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రకటించిన ఆత్మకూరు అభివృద్ధి అజెండాకు నియోజక వర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. విక్రం వివరిస్తున్న తీరుకు..చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఫిదా అయ్యారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు భారీగా జనాలు రావడం.. క్యాడర్ లో జోష్ గమనించిన ఆనం రామనారాయణ ఆత్మకూరు నుంచి తన దృష్టిని నెల్లూరు సిటీ వైపు మళ్ళించారట. ఆనం వేసిన ఈ ఎత్తును గమనించిన మాజీ మంత్రి నారాయణ అనుచరులు టీడీపీ సిటీ ఇంఛార్జి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. మా సీటు కోసం ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోం అంటున్నారట. మరో వైపు ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి ఆనంకి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం వినిపిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి భుజాలపై రాజకీయంగా ఎదిగి.. ఆయన మరణానతరం అందరినీ వదిలి తాను.. తన కుమార్తె అన్నట్టుగా రామ నారాయణ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని ఉమ్మడి కుటుంబ సభ్యులు ఆగ్రహిస్తున్నారట. చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీదే జయభేరీ ఒకవైపు టీడీపీలో పెత్తనం చేద్దామని వస్తే.. ఆదిలోనే ఎదురుగాలి మొదలైంది. ఇంకోవైపు తమది పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటున్నప్పటికీ అదే కుటుంబం నుంచి సహకారం లేకపోవడంతో ప్రస్తుతం ఆనం పరిస్థితి అయోమయంలో పడిందట. అక్కున చేర్చుకున్న అధికార పార్టీకి దూరమై అసమ్మతితో బయటకు వచ్చిన ఆనం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని టాక్ నడుస్తోంది. -
ఆనం రాజకీయ చరిత్రను నెల్లూరులోనే ముగిస్తా
నెల్లూరు(బారకాసు): ఆనం రామనారాయణరెడ్డి రాజకీయం ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఆయన చరిత్రను ముగించేస్తానని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకునే దమ్ము ఆనం రామనారాయణరెడ్డికి ఉందా అని అన్నారు. ఒకవేళ ఆనం టికెట్ తెచ్చుకుంటే.. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఇద్దరం పోటీ చేద్దామని, తాను ఓడిపోతే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఎమ్మెల్యే అనిల్ తెలిపారు. ఆనం రాజకీయ చరిత్ర ముగిసిపోతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారని, లేకుంటే ఆయనకు రాజకీయ చరిత్ర ఎక్కడుందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాతో గెలుపొందిన ఆనం.. పార్టీకి రాజీనామా చేయకుండా.. ప్రతిపక్ష పార్టీతో కలిసి నడవడంసరికాదన్నారు. తాను ఆనం కుటుంబానికి వ్యతిరేకం కాదని, ఏసీ సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, సంజీవరెడ్డి.. వీరంతా జిల్లాకు ఎంతోకొంత మంచి చేసిన వారు కాబట్టే వారికి మంచిపేరుందని తాను రాజకీయాల్లోకి రాకముందు పెద్దలు చెబుతుంటే విన్నానన్నారు. అదే కుటుంబానికి చెందిన ఆనం విజయకుమార్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత అవకాశాలిచ్చినందుకు జగనన్నతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఆనం కుటుంబంలో రామనారాయణరెడ్డి తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారని విమర్శించారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉంటే తన మీద పోటీ చేసి గెలవాలన్నారు. బీద రవిచంద్రకు కౌంటర్ ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని బీద రవిచంద్ర తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. బీద రవిచంద్ర టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీని నాశనం చేశారన్నారు. దగదర్తి మండలంలో మాయమైన భూరికార్డులకు సంబంధించి సమగ్ర చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, బీద రవిచంద్ర చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ హయాంలో ఎంత ఖర్చు చేశారో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చి తాము ఖర్చు చేశామో ప్రజలకు తెలుసునని, దీనిపై చర్చకు సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు. -
ఆనంకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్
-
ఆనంకు మాజీ మంత్రి అనిల్ కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము ఆనం రాం నారాయణ రెడ్డికి ఉందా? అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. తాను ఆనం మీద పోటీ చేసి ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. ఆనం రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో.. అక్కడే క్లోజ్ చేస్తానన్నారు అనిల్. అలా చేయని పక్షంలో రాజకీయాల నుంచి వైదొలుగుతానని అనిల్ పేర్కొన్నారు. నెల్లూరు సిటీని తాను ఎంత అభివృద్ధి చేశానో.. టీడీపీ ఎంత ఖర్చు పెట్టిందో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు అనిల్. -
పార్టీలో కలుపు మొక్కలను పీకి పడేశాం: మాజీ మంత్రి అనిల్ కౌంటర్
సాక్షి, నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పులకేశి చేసేది పాదయాత్ర కాదు. లోకేశ్.. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. నువ్వు గతంలో పోటీ చేసిన మందలగిరిలో మందు గెలువు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, అనిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేశ్‌కు సరిగ్గా మాట్లాడటం కూడా రావడం లేదు. సాగునీటి ప్రాజెక్ట్‌లపై చర్చకు నేను సిద్ధం. లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదు. సోమశిల హైలెవల్ కెనాల్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పనులు స్టార్ట్ చేశాం. టీడీపీ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లోకేశ్.. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. నువ్వు గతంలో పోటీ చేసిన మందలగిరిలో మందు గెలువు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరే చరిత్ర ఆనం రామనారాయణది. అవినీతి చేసిన ఆనంను పక్కన పెట్టుకుని లోకేశ్ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదు. పార్టీలో ఉన్న కలుపు మొక్కలను మేమే పీకి పక్కడ పడేశాం. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకే నష్టం. ఎవరెన్ని పాదయాత్రలు చేసినా మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. లోకేశ్ పాదయాత్ర అట్టర్ ప్లాప్. జనాలు లేక లోకేశ్ పాదయాత్ర వెలవెలబోతోంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తోనే ఉంటాను’ -
ఆత్మకూరు టీడీపీలో అయోమయం.. ఆనం రాక.. నాయకుల అలక
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలైంది. పాత, కొత్త నాయకులందరూ దీనిని విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే అలా జరగకపోవడంతో ఆదిలోనే పార్టీ వర్గాలు డీలా పడిపోయాయి. ముందు నుంచి ఉన్న వారిని కాదని వలస వచ్చిన నాయకుడికి బాధ్యతలు అప్పగించారంటూ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘నియోజకవర్గంలో టీడీపీ నేల విడిచి సాము చేస్తోంది. పార్టీ అధికారంలో లేనప్పుడు జెండా మోసిన వారిని కాదని, వలస నేతలకు రెడ్ కార్పెట్ వేసింది. నిన్నటి వరకు అధికారం అనుభవించి ఎన్నికలు సమీపిస్తుండగా కండువా మార్చిన వారికి నేడు ప్రాధాన్యమిస్తూ నమ్మిన వారిని నట్టేట ముంచడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమని మరోసారి నిరూపితమైంది’. ఇదీ ఆత్మకూరు టీడీపీలో ప్రస్తుతం నడుస్తున్న అంతర్గత చర్చ. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా పార్టీకి దిక్కే లేదన్నట్లుగా వలస నేత ఆనం రామనారాయణరెడ్డిని జిల్లా పార్టీ నాయకత్వం ఆహ్వానించి బాధ్యతలు అప్పగించడంపై అనేకమంది రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జెండా మోసిన నేతలు పాదయాత్రకు ముఖం చాటేశారు. మరికొందరు గత్యంతరం లేక అలా కనిపించి తప్పుకున్నారు. ఎన్నికల వేళ తప్ప.. 2014 ఎన్నికల సమయంలో పార్టీకి అభ్యర్థి కూడా దొరక్కపోవడంతో స్థానికంగా ఉన్న కన్నబాబే దిక్కయ్యాడు. ఓటమి తప్పదని భావించినా రంగంలోకి దిగి నష్టపోయాడు. 2019లో మరోసారి టికెట్ వస్తుందని భావించిన కన్నబాబుకు చుక్కెదురైంది. గతంలో కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లినేని కృష్ణయ్యను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన పారిశ్రామికవేత్త. ఎన్నికల వేళ తప్ప ఎప్పుడూ నియోజకవర్గంలో కనిపించడు. ఏనాడు పార్టీ కార్యకర్తలకు చేరువ కాలేదు. కన్నబాబును కాదని అధిష్టానం కృష్ణయ్యకు టికెట్ ఇచ్చింది. అందరూ అనుకున్నట్లుగానే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కనిపించలేదు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఆనంకు ఆత్మకూరు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో సీనియర్ నాయకులు భగ్గుమంటున్నారు. పర్యటన పేరుతో డుమ్మా ఆనంను తెచ్చి కన్నబాబుకు ఈసారి కూడా మొండిచేయి చూపారు. కష్టపడిన వారిని పట్టించుకోవడంలేదనే భావనలో ఉన్న ఆయన లోకేశ్ పాదయాత్రకు ముఖం చాటేశాడు. విదేశీ పర్యటన పేరుతో డుమ్మా కొట్టాడు. అలాగే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు పరిస్థితి మరోలా ఉంది. గత నాలుగేళ్లుగా పార్టీ ఇన్చార్జిగా నియమించే సాహసం కూడా అధిష్టానం చేయలేకపోయింది. కన్నబాబు, కొమ్మి, బొల్లినేని, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి ఇన్చార్జి మీరేంటే మీరంటూ ఊరించారు. ఇప్పుడు ఆనంకు బాధ్యతలు అప్పగించడంతో ఆ నేతలకు చుక్కెదురైంది. టీడీపీలో నమ్మిన వారిని నట్టేట ముంచుతున్నారని ముందుగానే పసిగట్టిన బొమ్మిరెడ్డి వైఎస్సార్సీపీలో చేశారు. మిగిలిన ఆ ముగ్గురికి తమ పరిస్థితి ఏమిటో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఆత్మకూరులో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. మళ్లీ పచ్చజెండా రెపరెపలాడిన సందర్భం లేదు. బలమైన నాయకత్వం కరువైంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వలస నేతలు లేదా పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపడం.. వారిని ఓటమి వరించడం.. ఆపై మళ్లీ ఎన్నికలొచ్చే వరకు వారు ముఖం చాటేస్తున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతుండడంతో స్థానికంగా పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతూనే ఉందని కార్యకర్తల భావన. ఇక్కడ బలమైన నేతలున్నా వారిని ఎన్నికల సమయంలో కరివేపాకుల్లా వాడుకుంటుండడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. -
కక్కిన కూడే పరమాన్నమాయే.. లోకేశ్ కోసమేనా ఇంత హైప్!
మనంతట మనం బెల్లం.. యాలకులు.. చిక్కనిపాలు .. జీడిపప్పు వేసి వండుకుని చేసేదాన్ని పరమాన్నం అంటాం. మరి ఎవరో ఆరగించి కక్కిన కూడు పరమాన్నం అని ఎలా అంటాం?. అంత దిక్కుమాలిన గాచ్చారం ఎవరికీ ఉంటుంది. ఎవరికీ అంటే.. అంతకు మించి మరో మార్గం లేనివాళ్లకు అది తప్ప మరో గతిలేని వాళ్లకు ఆ కక్కిన కూడే మహాభాగ్యం అవుతుంది. టీడీపీ పరిస్థితి సైతం అచ్చం అలాగే ఉంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసి అనైతికానికి పాల్పడి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వెలివేతకు గురైన ఆనం రామనారాయణ రెడ్డి (వేంకటగిరి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) వరుసగా టీడీపీ లీడర్లతో సమావేశమవుతూ వస్తున్నారు. వాళ్లకు మరి వేరే మార్గం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెంటేశాక వేరే మార్గం లేదు కాబట్టి టీడీపీ గుమ్మానికి వేలాడక తప్పదు. నెల్లూరులో గత ఎన్నికల్లో ఒక సీట్ కూడా గెలవలేక మొత్తం పది సీట్లూ వైఎస్సార్సీపీకి అప్పగించి బిక్కముఖం వేసిన టీడీపీకి ఇప్పుడు సస్పెండ్ అయిన ఈ ముగ్గురే దిక్కయ్యారు. వీళ్ళను వంద తలలు నరికివచ్చిన కాలభైరవుల్లా కీర్తిస్తూ ఎల్లో మీడియా సైతం విస్తృత కవరేజి ఇవ్వడం చూస్తుంటే టీడీపీ వాళ్ళు ఎంత కరువులో ఉన్నారో అర్థం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత లీడర్లు పార్టీ నుంచి అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్ లేక మొహం వాచిపోయిన టీడీపీ, ఎల్లోమీడియాకు కరువులో ఉన్న కుక్కకు వల్లకాట్లో ఎముక దొరికినట్లయింది. దీంతో వారినే రకరకాలుగా చూపిస్తూ ఆషాఢంలో పండగ చేసుకుంటున్నారు. లోకేశ్ కోసమే హైప్.. త్వరలో నెల్లూరులోకి ప్రవేశించనున్న నారా లోకేష్ పాదయాత్రకు హైప్ తేవడానికి తప్ప ఈ ముగ్గురి చేరిక టీడీపీకి ఎందుకూ పనికిరాదన్న విషయం కార్యకర్తలకు అర్థం అవుతూనే ఉంది. వాస్తవానికి చంద్రబాబుకు, టీడీపీకి ప్రజల్లో ఆమోదం ఉంది. గ్రాఫ్ పెరిగితే కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఒక్కరైనా చేరాలి కదా. మరి అలాంటి చేరిక ఒక్కటీ లేదు అంటే గత ఎన్నికల్లోనే సీఎం జగన్ చేతిలో చచ్చి మమ్మీగా మారిన శవానికి ఈ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అనే పట్టు చీర కట్టి ఉత్తుత్తి ముస్తాబు చేయడం తప్ప శవం లేచేది లేదని గ్రామస్థాయిలో కార్యకర్తలు చెవులుకొరుక్కుంటున్నారు టీడీపీలో గొడవల మాటేమిటి.. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు ఉంది టీడీపీ తీరు. ఆల్రెడీ టీడీపీలో కొన్నాళ్లుగా ఉంటూ వస్తున్న నాయకుల మధ్య తలెత్తుతున్న గొడవలు సర్దుబాటు చేయడం వదిలేసి వైఎస్సార్సీపీ నుంచి వెలివేతకు గురైన వాళ్ళను చూసి పండగ చేసుకుంటున్నట్లు ఉంది. ఇప్పటికే విజయవాడలో పార్టీకి నిప్పెట్టేసి దూరం నుంచి చలి కాస్తున్న కేశినేని నానిని ఏమీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు అటు సత్తెనపల్లిలో కోడెల శివరామ్ చేస్తున్న గాయి గత్తరను సైతం వినే ధైర్యం చేయడం లేదు. ఇక గన్నవరంలో తంగిరాల సౌమ్య ఆర్తనాదాలు అరణ్యరోదనే అవుతున్నాయి. ఇక ఫారిన్ నుంచి నేరుగా సూట్ కేసులతో దిగిపోయి డబ్బుతో చంద్రబాబును కొట్టి చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావుకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన భాష్యం ప్రవీణ్ వ్యవహారం సైతం ఒక తలనొప్పి. రాత్రికి రాత్రి ఫారిన్ నుంచి దిగిపోయి అక్కడక్కడా సేవలు పేరిట ఈవెంట్స్ చేస్తే సరిపోతుందా? మరి మేము ఏమవ్వాలి అని వెక్కివెక్కి ఏడుస్తున్న పుల్లరావు ఆవేదన ఎవరికి వినబడడం లేదు. ప్రస్తుతానికి కొన్నాళ్ళు ఈ వైస్సార్సీపీ ఎమ్మెల్యేలతో ఈవెంట్ నడపడం తప్ప వేరే మార్గం లేదని చంద్రబాబుకు అర్థం అయింది. ఇది కూడా చదవండి: జేపీ నడ్డా వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్ -
ఆనం రాంనారాయణరెడ్డికి నేదురుమల్లి ఛాలెంజ్
-
మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు: సీఎం జగన్ టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటానని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలంతా సీఎం ఫొటోతో గెలిచినవారే.. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ‘‘మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఏ పార్టీలోనూ టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చంద్రశేఖర్‌రెడ్డి ఓటు వేశాడో లేదో అతని అంతరాత్మకు తెలుసు. తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తూనే ఉంటా. పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురిలో ఒక్కరు శాసనసభకు వచ్చినా జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను. ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. రాజకీయాల్లో లేకుండా పోవడమే కాదు. నెల్లూరు జిల్లాకు శాశ్వతంగా దూరమైపోతా. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించండి’’ అంటూ అనిల్ వ్యాఖ్యానించారు. చదవండి: లోకేష్‌కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా? -
టీడీపీ పతనమైందని లోకేష్ ఒప్పుకున్నట్టేనా?
తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఒక వ్యాఖ్య చేస్తూ నెల్లూరు నుంచే వైస్సార్సీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఇది వినడానికి టీడీపీ వారికి బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా.. అదే సూత్రం ఆ పార్టీకి వర్తింపచేస్తే టీడీపీ ఇప్పటికే పతనమైపోయిందని వారే ఒప్పుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయితే పతనం అయిపోతే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మూడేళ్ల క్రితమే బయటకు వచ్చేశారు కదా!. మరి ఇప్పటికే పార్టీ పతనం అయిందని అంగీకరిస్తారా?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పటికీ వైఎస్సార్సీపీ, పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెక్కుచెదరలేదు. అదరలేదు.. బెదరలేదు. అలాంటిది ఇలాంటి ఉడత ఊపులకు ఉలిక్కిపడతారా!. నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు అసమ్మతిగళం విప్పడం పార్టీకి కొద్దిగా చికాకే కావచ్చు. కానీ, పార్టీ అదినాయకత్వం వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకుంది. శ్రీధర్ రెడ్డి బదులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డిని, రామనారాయణరెడ్డి స్థానంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియోజకవర్గాల బాధ్యుయులుగా ప్రకటించింది. ఆదాల ప్రభాకర రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశంలోనే ఉండేవారు. మంత్రి కూడా అయ్యారు. కానీ, అప్పట్లో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సరిపడక కాంగ్రెస్‌లోకి వచ్చారు. తదుపరి సోమిరెడ్డిని శాసనసభ ఎన్నికలలో ఓడించారు. విభజన సమయంలో కొంతకాలం టీడీపీలో ఉన్నా 2019లో వైఎస్సార్సీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. ఆయన మందీ మార్బలం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. నెల్లూరు రూరల్‌లో ఆయన రంగంలోకి దిగడం వల్ల వైఎస్సార్సీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత విధేయుడనని తనకు తానే ప్రకటించుకునేవారు. తాను చనిపోతే సీఎం జగన్ వచ్చి పార్టీ జెండా కప్పాలన్నదే తన కోరిక అన్నంతవరకు కూడా వెళ్లేవారు. ఇలాంటి మాటలను బహిరంగసభలలో పెద్ద స్వరంతో చెప్పేవారు. తాను మధ్య తరగతి కుటుంబీకుడిని అయినా సీఎం జగన్ చేరదీసి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని, ఆ విశ్వాసాన్ని ఎన్నటికీ మరువబోనని చెప్పేవారు. అలాంటి కోటంరెడ్డి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యాక మంత్రి పదవిపై ఆశ పుట్టింది. అందులో తప్పు లేదు. కానీ, వివిధ కారణాల రీత్యా ఆయనకు పదవి లభించలేదు. అంతమాత్రాన ఆయన ఇలా అవిధేయుడుగా మారతారని ఎవరూ ఊహించలేదు. నిజానికి శ్రీధర్ రెడ్డి అప్పడప్పుడు సంకేతాలు ఇవ్వకపోలేదు. అమరావతి రైతుల పేరుతో కొందరు చేసిన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం, పార్టీ కార్యక్రమాలుగా కాకుండా సొంతంగా తన పేరుతోనే నియోజకవర్గంలో ప్రోగ్రాంలు పెట్టుకోవడం వంటివి చేశారు. అప్పుడప్పుడు అధికారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ నేతలు గతంలో కోటంరెడ్డిపై దౌర్జ్యన్యకారుడని, బెట్టింగ్ రాయుడని పలు ఆరోపణలు చేయడం, వాటిన ఆయన ఖండించడం జరిగేవి. ఒక మహిళా అధికారి పట్ల దురుసుగా వ్యవహరించిన అభియోగంపై కేసు నమోదు అయింది. ఇవన్ని ఎలా ఉన్నా ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేయకుండా ఉండటం కూడా గమనించాల్సిన అంశమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఆనం రామనారాయణరెడ్డిని మెచ్చుకోవడం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని తమ ట్రాప్‌లోకి తెచ్చుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేత, అమరావతి భూ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కుంటున్న నారాయణతో ఆపరేషన్ నిర్వహించారన్న సమాచారం బయటకు వస్తోంది. ఆయన వీరిద్దరిని తమ ట్రాప్‌లోకి తెచ్చుకోగలిగారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌తో పాటు ఆర్థికవనరులు సమకూర్చే బాధ్యత ఆయన తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా వైఎస్సార్సీపీ నాయకులు కోటంరెడ్డి విషయంలో పెద్దగా అనుమానించలేదని అనుకోవాలి. అలా భావించి ఉంటే ఇటీవలే ముఖ్యమంత్రి జగన్.. ఆయనను పిలిచి మందలించేవారు కారు. అప్పుడే కొత్త ఇన్ఛార్జీని నియమించేవారు. కోటంరెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేయడం సహజంగానే ప్రతిపక్షానికి ఒక అస్త్రం దొరికినట్లయింది. విశేషం ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్‌లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడటం. ఆయన వద్ద ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన అధికారి అప్పట్లో ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి విపక్షంపై నిఘా పెట్టాలని ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసులోనే ఆయన సస్పెండ్ కూడా అయి కేసును ఎదుర్కొంటున్నారు. కోటంరెడ్డి విషయంలో ప్రభుత్వ నిఘా విభాగం అధినేత అనవసరంగా తనకు వచ్చిన ఒక సమాచార రికార్డును శ్రీధర్ రెడ్డికి పంపినట్లు అనిపిస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఆ అధికారి చెప్పబోతే, పరిస్థితిని అర్ధం చేసుకున్న కోటంరెడ్డి అప్రమత్తమై అన్ని విషయాలు బహిర్గతం అయిపోతున్నాయని భావించి ఈ ఆరోపణ చేసినట్లుగా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఈయన నారా లోకేష్‌తో ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నట్లు టీడీపీ నేతలే వెల్లడించారని చెప్పారు. అలాగే, చంద్రబాబుతో కూడా అన్నీ మాట్లాడుకునే ఈ ఆరోపణలు చేశారని అంటున్నారు. లేకుంటే టీడీపీ టిక్కెట్ వచ్చేస్తుందని ఎలా చెప్పగలుగుతారు?. ఇంతవరకు వైఎస్సార్సీపీని వీడలేదు.. టీడీపీలో చేరలేదు. అయినా, నియోజకవర్గంలో టీడీపీ పెత్తనం తనదే అయినట్లుగా అంటున్నారంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. పోనీ, ఆయన అనుకున్నట్లు వస్తే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినో, లేక ఏ ఇతర సీనియర్ నేతనో కాదని కోటంరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా?. దీనిని ఆయన నమ్మగలరా?. అసలు సమస్య ఏమిటంటే ఈయన ప్రవర్తన తీరుతెన్నులు, ఇతర అంశాలపై పార్టీ నాయకత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తుంటాయి. వాటి ఆధారంగా 2024 ఎన్నికలలో టిక్కెట్ రాదన్న భావన ఈయనకు వచ్చి ఉండవచ్చు. గెలిచినా, ఓడినా రాజకీయాల్లో కొనసాగాలంటే ఏదో పార్టీ నుంచి పోటీచేయాలని నేతలు అనుకుంటారు. అందువల్లే కోటంరెడ్డి తన విధేయతను అవిధేయతగా మార్చుకుని ఉండవచ్చనిపిస్తుంది. అతిగా పొగిడే వారిని అంతగా నమ్మరాదనే లోకోక్తి కూడా ఉంది. అతి వినయం ధూర్త లక్షణం అంటారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో సీఎం జగన్‌ను అంతగా పొగిడింది తన పదవిపైన ఆశతోనే అన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఇలాంటి ఫిరాయింపుదారులు చరిత్రలో ఎంతో మంది కనిపిస్తారు. వారిలో అత్యధికులు రాజకీయంగా కనుమరుగైపోయిన ఘట్టాలే ఎక్కువ. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
కోటంరెడ్డికి మాజీ మంత్రి అనిల్‌కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: కోటంరెడ్డికి దమ్ముంటే 51 సెకన్ల ఆడియో బయట పెట్టాలని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్తేందుకే కోటంరెడ్డి విమర్శలు అంటూ దుయ్యబట్టారు. ‘‘కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే.. నువ్వు రాజీనామా చేస్తావా?. 24 గంటల సమయం ఇస్తున్నా.. ఎప్పుడైనా రండి.. నేను రెడీ. ఆనం రామనారాయణ చచ్చిన పాము.. ఆయనకేంటి ప్రాణహాని’’ అని అంటూ అనిల్ నిప్పులు చెరిగారు. చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా? -
టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ అంటూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు.. కాని ఇలాంటి ఆరోపణలు సమంజసం కాదంటూ మంత్రి హితవు పలికారు. సీఎం జగన్ పార్టీ పెట్టకపోతే ఎమ్మెల్యేలు అయ్యేవారా?. ఇలాంటి వారికి సీఎం జగన్ భయపడేవారు కాదు. టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే. ఇలాంటి వాళ్లు వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చదవండి: కోటంరెడ్డి ఆరోపణలు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ -
ఆనం రామనారాయణపై నేదురుమల్లి సీరియస్ కామెంట్స్
సాక్షి, నెల్లూరు: ఆనం రామనారాయణ రెడ్డిపై నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, నేదురుమల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే గెలిచావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయతలచి సీటు ఇచ్చారు. గెలిచిన మొదటి ఏడాది నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. తప్పుడు ఆరోపణలు ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని ఇప్పుడు చెబుతున్నారు. నీ తప్పులనీ బయటకు వస్తున్నాయి. కాంట్రాక్ట్‌ల విషయాలు కూడా బహిర్గతమవుతున్నాయి. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం రామనారాయణ రెడ్డి. వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించింది. వెంకటగిరి నక్సల్ ప్రాంతమని ఆనం మాట్లాడుతున్నారు. ఆనంను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నారు. ముందునుంచే శ్రీధర్ రెడ్డి, ఆనంలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు. ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
సోమశిల ప్రాజెక్టు కోసం గౌతమ్ పరితపించేవారు
-
సీఎం జగన్ పై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించాడు
-
బాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలి
సాక్షి, నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలన్నారు. ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను గవర్నర్‌కు పంపేందుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఎమ్మెల్యే అందజేశారు. (చదవండి: టీడీపీ హయాంలోనే గంజాయి మూలాలు.. టీడీపీ మాజీ మంత్రి వీడియో వైరల్) అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సభ్య సమాజం చంద్రబాబు వైఖరిని తప్పు పడుతోందన్నారు. రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజాతీర్పుని గౌరవించకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జనాగ్రహ దీక్షలో టీడీపీకి తీరుకి నిరసనగా గవర్నర్ లేఖ కోసం సంతకాలు సేకరించామని ఆయన తెలిపారు. చదవండి: కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవ ఎన్నిక -
తిరుపతి ఎన్నికల ప్రచారం వైఎస్ జగన్ ప్రతిష్టను నిలబెడుతాయి
-
‘టీడీపీ త్వరలో తెరమరుగయ్యే పార్టీ’
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి విజయం ఖాయమని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయతకు జనం జేజేలు కొడుతున్నారన్నారు. శంఖారావం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజల ఆదరణతో వైఎస్సార్సీపీకి అద్వితీయమైన బలం వచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి సీఎం జగన్ జననేతగా ఎదిగారు. ఏడాదిన్నరకాలంగా సీఎం జగన్ నవరత్నాలతో నవశకాన్ని తెచ్చారు. టీడీపీ త్వరలోనే తెరమరుగయ్యే పార్టీల్లో ఒకటి. నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. లోకేష్‌కు ఇంకా రాజకీయ పరిణతి రాలేదు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి బీజేపీ దిగజారిపోయింది’’ అని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. చదవండి: ‘కూన’ గణం.. క్రూర గుణం బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్చల్ -
'మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 21 కోట్లతో అభివృద్ధి'
సాక్షి,నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు కావస్తోంది. గత ప్రభుత్వాల కన్నా వైసీపీ ప్రభుత్వం ఎంతో మెరుగ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. 'మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 21 కోట్లతో అభివృద్ధి పనులు చేశాము. త్రాగునీరు, వైద్యం వంటి మౌలిక వసతుల కోసం మరిన్ని నిధులు మంజూరు అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఆ అభివృద్ధి పనులు కూడా ప్రారంభం అవుతాయి' అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ వైఎస్సార్సీపీకి పట్టం కట్టాలని ఆయన విఙ్ఞప్తి చేశారు. (ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల) -
ఎంతటి వారైనా ఉపేక్షించం: ఆనం హెచ్చరిక
సాక్షి, నెల్లూరు (కలువాయి): గిరిజన కుటుంబానికి దక్కాల్సిన ప్రభుత్వ సహాయంలో ఎవరు అవకతవకలకు పాల్పడి ఉన్నా, వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరించారు. రమణయ్య అనే వ్యక్తి మృతిచెందగా వైఎస్సార్ భీమా పథకం కింద బాధిత కుటుంబానికి అందాల్సిన రూ.2 లక్షలను స్థానిక పెద్దలు, అధికారులు కలిసి దుర్వినియోగం చేశారు. దీనిపై ఆదివారం సాక్షిలో ‘మనుషులా.. రాబంధులా!’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆనం స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తిన్యాయం చేస్తామని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (మనుషులా.. రాబంధులా!) ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని ఎమ్మెల్యే కలువాయి ఎంపీడీఓ సింగయ్యను ఆదేశించారు. ఆయన స్పందించి వెలుగు అధికారులను గ్రామానికి పంపి విచారణ చేయించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నామన్నారు. పొదుపు రుణానికి కట్టేందుకు అని పక్కన పెట్టిన రూ.80 వేలు, అప్పు కింద గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జమ చేసుకున్న రూ.60 వేలు రెండురోజుల్లో వసూలు చేసి రమణయ్య కుమార్తెల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. వారు నగదు తక్షణమే చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. రమణయ్య చిన్న కుమార్తె స్వాతికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. రమణయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం – కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కలువాయి: ‘మనుషులా.. రాబంధులా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పందించారు. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆ రమణయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన సాక్షితో మాట్లాడుతూ రెండు, మూడురోజుల్లో రమణయ్య పిల్లల పేరున నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. రమణయ్య కుటుంబానికి జరిగిన అన్యాయ్యాన్ని కలెక్టర్, గూడూరు సబ్ కలెక్టర్, ఆత్మకూరు ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరామన్నారు. వారికి ప్రభుత్వ స్థలం ఇచ్చి, రమణయ్య చిన్న కుమార్తె స్వాతికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేసేలా చర్యలు కలెక్టర్‌ను కోరానన్నారు. -
ప్రతిపక్షాల వల్ల ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చేలా ఉంది
సాక్షి, నెల్లూరు: ఎన్నికలు వాయిదా వేయడానికి ఎన్నికల సంఘం సహేతుక కారణాలను చెప్పలేదని, కేవలం ప్రతిపక్షాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్నట్లుందని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల ధోరణి వల్ల ఆర్థిక ఎమర్జెన్సీకి దారితీసే పరిస్థితి వస్తుందని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఏమి మాట్లాడాలన్నా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారనుందన్నారు. మార్చి 31లోపు ఎన్నికలు జరగకపోతే రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని, ఆర్థిక వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయన్నారు. పూర్తి మెజార్టీతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రతిపక్షాలు పనిచేయడం దారుణమని వ్యాఖ్యానించారు. గవర్నర్ ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలి ‘రాష్ట్రంలో ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు జరగడం సర్వసాధారణం. అలాంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలిగానీ ఎన్నికలు ఆపడం సరికాదు. కరోనాను కారణంగా చూపి ఎన్నికలు వాయిదావేయడం సరైన నిర్ణయం కాదు. రాజ్యాంగబద్దమైన సంస్థలకు ఇది ధర్మం కాదు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం నివేదిక ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రంలో తలెత్తబోయే ఆర్థిక ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలి’ అని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. (బాబుకు ‘లోకల్’ భయం) -
చంద్రబాబు.. ఎక్కడ దాక్కున్నారు
-
‘బాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు..’
సాక్షి, నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పడు నిజమవుతున్నాయని మాజీ ఆర్థికశాఖ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన జిల్లాలో మాట్లాడుతూ.. అవినీతి కేసుల్లో విచారణను తప్పించుకునేందుకే కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. నిత్యం మీడియా సమావేశాలు పెట్టి హడావిడి చేసే చంద్రబాబు.. ఎక్కడ దాక్కున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాజీ కార్యదర్శికి అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నించారు. మాజీ కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటు టీడీపీ నేతల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. (‘ఇది ఉల్లిపాయపై పొర మాత్రమే’) మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం: చంద్రబాబు అండ్ కో రూ. 2 వేల కోట్లు దోపిడి చేసి టీడీపీ నేతలు కిక్కురుమనడం లేదని విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. టీటికి మాటికి పిచ్చి రాతలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడుకి రూ.2 వేల కోట్ల స్కాం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. స్కాం వివరాలు బయటపడ్డాక చంద్రబాబు, లోకేష్ నోర్లు మూత పడ్డాయా అని నిలదీశారు. ఒక్క సీఏ దగ్గరే రెండు వేల కోట్ల స్కాం బయటపడితే.. ఇక చంద్రబాబు అవినీతి ఎన్ని వేల కోట్లు ఉంటుందన్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. స్కాంలో బాబు పాత్ర కూడా ఉందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుని బాబు అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!) ఎమ్మెల్యే కిలారి రోశయ్య గుంటూరు : చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య విమర్శించారు. నిప్పు అని చెప్పుకునే బాబు ఇప్పుడేం చెప్తారని ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరిపాలన అందించాలని ప్రజలు అయిదేళ్లు బాబుకు అధికారం అందిస్తే ఆయన రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం : వానపాము లాంటివారిపైన ఐటీ దాడులు జరిగితేనే రెండువేల కోట్లు బయటపడ్డాయంటే.. అనకొండ లాంటి చంద్రబాబు మీద విచారణ జరిపితే లక్షల కోట్లు బయటపడతాయని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృసారాణీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమరావతి గ్రాఫిక్స్ చూపించి చంద్రబాబు లక్షల కోట్లు ప్రజాధనం లూటీ చేశారని తాము చెప్పింది నిజమవుతుందని అన్నారు. డొల్ల కంపెనీలు సృష్టి, అక్రమ మార్గంలో రాష్ట్ర ప్రజల సొమ్ము విదేశాలకు తరలింపులో చంద్రబాబు పాత్రే కీలకమని విమర్శించారు. చదవండి : పెళ్లితో ఒక్కటైన ఇద్దరమ్మాయిలు -
‘ఆ భూములు రైతులకు ఇవ్వడమే సముచితం’
సాక్షి, నెల్లూరు : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వేలాది కటుంబాలు సంతోషిస్తున్నాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ఈ సారి శాసనసభ సమావేశాలు ఫలప్రదమయ్యాయన్నారు. సమావేశాల్లో 16 చట్టాలను ప్రభుత్వం తీసుకుని రావడమే కాకుండా వాటిపై పూర్తి స్థాయిలో చర్చ జరగడం హర్షనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను విభజించడం వల్ల వారికి మరింత ప్రయోజనం కలగనుందన్నారు. చంద్రబాబు రాజధానికి 40 వేల ఎకరాలు సేకరించి.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేవలం ఒక వర్గం ప్రయోజనాలను కాపాడేందుకే ప్రయత్నించారని మండిపడ్డారు. రైతుల భూములను బలవంతంగా లాక్కొని, టీడీపీ నేతలకు అప్పగించారని ఆరోపించారు. రైతులకు చెందిన అసైన్మెంట్ భూములను వారికే ఇవ్వడం సముచితమన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన సంస్కారానికి నిదర్శనమని అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడిండ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అన్నీ తాత్కాలిక భవనాలు కట్టారని, ప్రజలు కూడా ఆయనను తాత్కాలిక ముఖ్యమంత్రిగా భావించి గత ఎన్నికల్లో తొలగించారని దుయ్యబట్టారు. -
‘ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు’
సాక్షి, అమరావతి: రాజకీయమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. సోమశిల-మర్రిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో 5 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. భూసేకరణ సమస్యను కూడా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 90 వేల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. పంపింగ్ పనుల్లో నాసిరకమైన పనులు కొన్ని ఉన్నాయన్నారు. భూసేకరణ పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. అసంపూర్తిగానే మిగిలిపోయాయి.. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరారు. ఉపాధి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి... గత టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లలో నాణ్యత లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం నిధులను తెలుగు తమ్ముళ్లకు పెంచిపెట్టారని మండిపడ్డారు. గతంలో టీడీపీ నుంచి పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ ఉన్నారని తెలిపారు. ఉపాధి నిధులను దుర్వినియోగంపై విచారణ జరిపించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో భారీ అవినీతి జరిగింది.. టీడీపీ సభ్యుల రగడతో ప్రశ్నోత్తరాలు సరిగ్గా జరగడం లేదని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. గత ఐదేళ్లలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. రాజోలు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందన్నారు. రాజోలులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. రాజోలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. -
‘చంద్రబాబు వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ వేయాలి’
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో స్పీకర్, సభా నాయకుని పట్ల ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ వేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి స్పీకర్‌ను కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు, వాటి పర్యవసానాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకున్న సాంప్రదాయం ప్రకారం తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. లేదా ఎథిక్స్ కమిటీ వేయమని స్పీకర్‌ను కోరారు. ప్రస్తుత చర్చల్లో వ్యక్తిగత దూషణలు, కుటుంబాల ప్రస్తావన, కులాలు, మతాలు, వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం లాంటి పరిణామాలు మంచివి కాదన్నారు. మనుషులన్నాక పొరపాట్లు చేస్తారని, ఈ విషయాన్ని చంద్రబాబు ఒప్పుకొని సభకు క్షమాపణ చెప్పాలని, లేదా మాటను వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేకపోతే ఎథిక్స్ కమిటీ వేస్తే అందులోని సభ్యులే ఎవరిది తప్పో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. సభ ఇలాగే కొనసాగితే సయమం వృథా అవుతుండడంతో పాటు ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్పందించిన స్పీకర్ క్షమాపణ చెప్పాలా? లేదా? అన్నది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నా. క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని పేర్కొన్నారు. -
చంద్రబాబు వ్యాఖ్యలు బాధ కలిగించాయి
-
ఆనం వ్యాఖ్యలు.. సీఎం జగన్ నవ్వులు
సాక్షి, హైదరాబాద్: ‘దయచేసి నా సీటు మార్చండి. ప్రతిపక్ష నాయకుడే వచ్చి నా దగ్గర నిలబడితే ఏమి మాట్లాడగలను’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నవ్వులు విసిరాయి. విద్యుత్ రంగంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా రామనారాయణరెడ్డి స్పందించారు. అరాచక శక్తులంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సమంజసం కాదని అన్నారు. ఆ పదం గౌరవప్రదం కాదని, ఆ పదాన్ని చంద్రబాబు ఉపసంహరించుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని హితవు పలికారు. ఒకవేళ చంద్రబాబు ఉపసంహరించుకోకపోతే ఈ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను ఆనం కోరారు. తన సీటు మార్చాలని, ప్రతిపక్ష నేతే తన పక్కన నిలబడితే తానెలా మాట్లాడగలనని రామానారాయణ అన్న మాటతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవ్వేశారు. అధికా పార్టీ సభ్యులు కూడా నవ్వులు చిందించారు. రామనారాయణరెడ్డి సూచనతో అరాచక శక్తులు అనే పదాన్ని తొలగిస్తున్నట్టు స్పీకర్ సీతారాం ప్రకటించారు. సంబంధిత వార్తలు.. మహిళల భద్రత చట్టాలపై చర్చ జరగాలి: సీఎం జగన్ పీపీఏలపై అత్యున్నత కమిటీ సమీక్ష ‘వాటిపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు’ వచ్చే నెలలో మెగా డీఎస్సీ: మంత్రి సురేష్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం -
శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర శాసనసభ కమిటీల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఆగ్ర తాంబూలం దక్కింది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వివిధ కమిటీలకు చైర్మన్లను, సభ్యులను నియమించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్‌గా నియమించారు. అలాగే శాసనసభ రూల్స్ కమిటీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని, శాసనసభ పిటిషన్స్ కమిటీ సభ్యుడిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నియమించారు. అలాగే ప్రివిలేజ్ కమిటీలో సభ్యుడిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్‌ను నియమించారు. అసెంబ్లీ నిర్వహణ, విధివిధానాల అమలు, సభ్యుల హక్కుల పరిరక్షణలో కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి. -
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు
సాక్షి, వెంకటాచలం(నెల్లూరు) : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ)లో సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. సభా వేదికను పరిశీలించిన తరువాత వీఎస్‌యూ సెమినార్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించనుండటంతో ఆ పథకం లబ్ధిదారులు, వలంటీర్లు సభకు తరలివచ్చేలా చూడాలని అధికారులకు సూచించామని కలెక్టర్ శేషగిరిబాబు చెప్పారు. సభావేదిక వద్ద ఏర్పాట్లను అధికార సిబ్బందితో త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతాంగం ఎక్కువగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం రైతులకు గర్వకారణమన్నారు. నవరత్నాలలో ప్రతిష్టాత్మకమైన రైతు భరోసాను నెల్లూరు నుంచే ప్రారంభించాలనుకోవడం జిల్లాపై వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానాన్ని చాటిచెప్పుతుందన్నారు. రైతులు, ప్రజలు అంతా కలిసి 50 వేలమందికి పైగా రైతు భరోసా కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా చిన్నపొరపాట్లు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. అధికారయంత్రాంగం, జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ సమష్టి కృషితో సీఎం జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్రెడ్డికి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. రబీ సీజన్‌కు ముందు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ శీనానాయక్, వీఎస్‌యూ రిజిస్ట్రార్ అందె ప్రసాద్, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలుకుదాం సభ్యుడు మందల వెంకటశేషయ్య పాల్గొన్నారు. -
ఆ విషయంలో టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని వెంకటగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమి చేసినా ముందుగా ప్రజలకు, మీడియాకు చెప్పే చేస్తారని అన్నారు. వరదల కారణంగా రాజధాని ప్రాంతం ముంపుకు గురైనందువల్ల దాని పరిష్కారం కోసం మాత్రమే చర్యలు చేపడుతున్నారని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. సోమశిల - స్వర్ణముఖి లింక్ కెనాల్ పూర్తిచేసి, సోమశిల ద్వారా తెలుగు గంగ, ఎస్.ఎస్. కెనాల్లకు నీరు అందిస్తామన్నారు. వెంకటగిరిలో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ పోలేరమ్మ జాతర ఏర్పాట్లను ప్రజల సలహాలతో, ప్రభుత్వ శాఖల సమన్వయంతో సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామన్నారు. -
ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిన ఆనం
సాక్షి, అమరావతి: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ఆస్తుల విషయమై అసెంబ్లీలో చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆనం రామ్‌నారాయణరెడ్డి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విషయమై తన అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ తరఫున అశోక్ గజపతిరాజు, నాగం జనార్దన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య ఈ సమావేశంలో రాష్ట్ర విభజన అంత మంచిది కాదని, సమైక్య రాష్ట్రమే కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిద్దామని, మీరు కూడా సహకరించండి.. మీ చంద్రబాబుకు చెప్పి ఒప్పించండని కోరారు. నీ, టీడీపీ నేతలు మాత్రం పెద్ద మనిషి అన్న గౌరవం కూడా ఆయనకు ఇవ్వకుండా.. నువ్వు ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం పెడతావా? లేదా? లేకుంటే నీ మెడలు వంచి నీతో తీర్మానం పెట్టిస్తామని అన్నార’ని ఆనం గుర్తు చేశారు. ఆ రోజు రాష్ట్ర విభజన కావాలని తాము ఎవరూ కోరుకోలేదని, సమైక్య రాష్ట్రమే కావాలని ఏపీ ప్రాంతం నేతలు కోరుకున్నారని, కానీ, ఆ రోజు ఈవిధంగా వ్యవహరించిన టీడీపీ ఈ రోజు ఏపీ ఆస్తులు తెలంగాణకు ఇచ్చేస్తున్నారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వాస్తవాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తోందని ఆనం మండిపడ్డారు. -
పులులకు బెబ్బులి..వెంకటగిరి చివరిరాజు
సాక్షి, వెంకటగిరి(నెల్లూరు) : వెంకటగిరి రాజుల కీర్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తం అనడం అతిశయోక్తి కాదు. వెంకటగిరి రాజాలు అనగానే నేటితరం వారికి పెద్దరాజాగా కీర్తి గడించిన వెలుగోటి వెంకటశేష వరదరాజ గోపాలకృష్ణ యాచేంద్ర (వీవీఆర్కే యాచేంద్ర) వెంటనే గుర్తుకు వస్తారు. వెంకటగిరి సంస్థానం 31వ తరానికి చెందిన ఆయన క్రీడలు, వ్యాపార, రాజకీయ రంగాల్లో విశిష్టతను చాటారు. వేటాడడం అంటే ఆయనకు మహా సరదా. ఆయన హయాంలో పెద్దపులులు (బెంగాల్ టైగర్స్)ను వేటాడారు. వీవీఆర్కే యాచేంద్ర 2010 జూన్ 29వ తేదీన ఆయన హైదరాబాద్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈయన వెంకటగిరి సంస్థానం చివరి పట్టాభిషిక్తుడిగా కీర్తి గడించారు. శనివారం ఆయన 9వ వర్ధంతి సందర్భంగా కైవల్యానది వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహం వద్ద వీవీఆర్కే యాచేంద్ర వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వెంకటగిరి ప్రాంతంలోని వెలుగొండలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి మొదలగు ప్రాంతాల్లో అడవుల్లో ఆయన వేట సాగించేవారని ఆనాటి తరం వారు చెబుతున్నారు. ఓ చేత్తో జీప్ నడుపుతూ గన్‌తో వేటాడడంలో ఆయన దిట్ట. ఇక 1954 –1960 మధ్య ప్రాంతంలో ఆంధ్రా రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. రాజకీయ రంగంలో 1967 –1973 మధ్య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1994లో వెంకటగిరి శాసనసభ్యుడిగా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి విజయం సాధించి గుర్తింపు సాధించారు. ఇక వెంకటగిరి పాలకేంద్రం సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసే సమయంలో ఐదు ఎకరాలు, గోషాస్పత్రి ఏర్పాటు కోసస్పైదు ఎకరాలు, సత్యసాయి వరదరాజపురంగా పిలచే మందరిల్లు ప్రాంతంలో పేదలకు నివాసాల కోసం, ఉపాధ్యాయనగర్ సమీపంలో చేనేత కార్మికుల నివాసాల కోసం వీవర్స్‌కాలనీ, ఉపాధ్యాయనగర్ను నామమాత్రం ధరకు ఉపాధ్యాయుల నివాసాల కోసం అందించి వెంకటగిరి ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన కుమారులు రాంప్రసాద్ యాచేంద్ర, డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రతోపాలు మనవడు సర్వజ్ఞకుమార యాచేంద్ర ప్రస్తుతం వెంకటగిరి వైఎస్సార్సీపీలో కీలక నేతలుగా ఉంటూ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సన్నిహితులుగా మెలుగుతున్నారు. -
ఆర్ధిక పరిస్ధితిని వైఎస్ జగన్ గాడిలోకి తెస్తారు
-
ఫ్యాన్‌గాలికి కొట్టుకుపోయిన సైకిల్
సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి నియోజకవర్గంలో ఫ్యాన్‌గాలికి సైకిల్ కనిపించనంత దూరంలోకి కొట్టుకుపోయింది. ప్రతిరౌండ్‌లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తన ఆధిక్యతను చాటుకుని విజయం వైపు దూసుకుపోయారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇద్దామన్న నినాదం పల్లెల్లోని ఓటర్లలో బలంగా నాటుకుపోవడంతో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఫ్యాన్ గిరాగిరా తిరిగేసింది. ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రామనారాయణరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ సాధించలేని రికార్డు మెజార్టీని సాధించి వెంకటగిరి రాజకీయ చరిత్ర పుటల్లో తనదైన పేజీని దక్కించుకోగలిగారు. నెల్లూరులోని ప్రిదయదర్శిని ఇంజినీరింగ్ కళాశాల్లో గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి 1,09,204 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణకు 70,484 ఓట్లు వచ్చాయి. 22 రౌండ్ల పాటు జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపులో ప్రతిరౌండ్‌లోనూ రామనారాయణరెడ్డికి మెజార్టీ వచ్చింది. కలువాయి మండలం తెలుగురాయిపురం పోలింగ్ కేంద్రం ఈవీఎం నుంచి ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైయింది. రాపూరు మండలంలో పోలింగ్ వన్‌సైడ్‌గా జరిగినట్లు ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తొంది. కలువాయిలో 6,400, రాపూరులో 9,000 పైచిలుకు, సైదాపురం మండలంలో 5,600, డక్కిలిలో 4,320, బాలాయపల్లిలో 4,519 , వెంకటగిరి పట్టణ, రూరల్ ప్రాంతాల్లో 7వేల మెజార్టీ ఆనం రామనారాయణరెడ్డి సాధించారు. గతంలో వెంకటగిరి పట్టణ, రూరల్ ప్రాంతాల్లో టీడీపీకి 10వేలకు పైగా మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని తగ్గించి ఈ ఎన్నికల్లో ఏడు వేలు ఓట్లు రావడం విశేషమన్న భావన వైఎస్సార్సీపీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. రికార్డు మెజార్టీ వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందిన ఆనం రామనారాయణరెడ్డి రికార్డు మెజార్టీ సాధించారు. ఆయన ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణపై 38,720 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. 1956 నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 1985లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన సాయికష్ణ యాచేంద్రకు 25వేలు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో ఆయనది ఓ రికార్డుగా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ రికార్డును రామనారాయణరెడ్డి బద్దలు కొట్టి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. వైఎస్సార్సీపీ నాయకుల్లో జోష్ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతోపాటు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిచడంతో వెంకటగిరి నియోజకవర్గ వైస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిప్తోంది. గెలుపు ఇలా వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ గురువారం నెల్లూరులోని ప్రియదర్శని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. ఆనం రామనారాయణరెడ్డికి ప్రతి రౌండ్లోనూ మెజార్టీ లభించిది. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 2074 కాగా వీటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామనారాయణరెడ్డికి 1,046 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి కె రామకృష్ణకు 903 ఓట్లు వచ్చాయి. రామనారాయణరెడ్డికి పోస్టల్ బ్యాలెట్లలో143 ఓట్ల ఆధిక్యత లభించింది. పోస్టల్ బ్యాలెట్లో 98 ఓట్లు ఇన్‌వ్యాలీడ్ అయ్యాయి. ఐదుగురు ఉద్యోగులు నోటాకు ఓటు వేశారు. -
‘పుట్టబోయే బిడ్డ మీద కూడా రూ. 40వేల అప్పు’
సాక్షి, నెల్లూరు : ప్రభుత్వ ఆర్థిక శాఖను ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించడం దారుణమని ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా పతనం కావడానికి చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... తొమ్మిది నెలల్లో తీసుకోవాల్సిన అప్పులను ఒక నెలలోనే బహిరంగ మార్కెట్ నుంచి తీసుకుని ప్రభుత్వం.. రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ ప్రతి నెలా ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కింద మొత్తం 26 వేల 22 కోట్ల రూపాయలను ప్రభుత్వ తీసుకుంది. వేస్ అండ్ మీన్స్ కింద గత రెండు నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. చేసిన అప్పులతో తమకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది. చివరి సంవత్సరంలోనే ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. పుట్టబోయే బిడ్డ మీద కూడా 40 వేల రూపాయల మేర అప్పు ఉంది’ అని ఆనం పేర్కొన్నారు. ప్రశ్నించిన సీఎస్‌పై విమర్శలా? చంద్రబాబు చేసిన ఆర్థిక తప్పిదాలను ప్రతి నిపుణుడూ విమర్శిస్తున్నారని రామనారాయణ రెడ్డి అన్నారు. ‘ప్రభుత్వ ఆర్థిక శాఖను ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఆర్థిక శాఖలోని విభాగాలను ఎన్నారై వాసిరెడ్డి కృష్ణ దేవరాయలు నిర్వహించారు. సి.ఎఫ్.ఎం.ఎస్.ను ఏర్పాటు చేసి దానిని కృష్ణదేవరాయలు చేతిలో పెట్టారు. ఆర్థికశాఖ లో అవకతవకలను ప్రశ్నించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విమర్శించిన సీఎం, ఆర్థిక మంత్రి తీరు సరికాదు. ఆర్థిక శాఖలో అవకతవకలను చూసి ఐఏఎస్ అధికారులు సెలవుపై పోతున్నారు. టీటీడీ బంగారం తరలింపులో సూత్రధారులు, పాత్రధారులను బయట పెట్టాలి. ఆర్థికశాఖ తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. ’ అని డిమాండ్ చేశారు. -
కొత్త రకం దోపిడీకి చంద్రబాబు శ్రీకారం : ఆనం
నెల్లూరు : టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. కనీసం జీతభత్యాకు కూడా వేస్ అండ్ మీన్స్ కింద అప్పు తీసుకొచ్చి చెల్లించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచంలో తానే గొప్ప ఆర్థికవేత్తగా చెప్పుకునే చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని నిప్పులు చెరిగారు. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘అభివృద్ధి తానే చేశానని చెప్పే బాబు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఉన్నతాధికారులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారు. తమ అనుచరులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కొత్త రకం దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు పెరగక పోగా అప్పులు పెరిగాయి. ఎన్నికలు పూర్తయిన తరువాత తన అనునాయులకు నిధులు కట్టబెట్టేందుకు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఆర్థిక శాఖ ద్వారా ఏదైనా జీఓ వస్తే దాన్ని వెబ్ సైట్లో పెట్టాలి. రహస్య జీఓల పేరుతో ఉత్తర్వులు ఇచ్చి నిధులను కొల్లగొడుతున్నారు. ఈ జీవోలను బయట పెట్టాలని గవర్నర్ నరసింహాన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డిమాండ్ చేస్తున్నాము. దీనిపై విచారణ చేసి కుట్రదారులను బయట పెట్టాలి. పోలవరం పేరుతో 11 వేల కోట్ల రూపాయల మేర నిధులను కట్టబెడుతున్నారు. సమీక్షల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకునేందుకు చంద్రబాబు పని చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఇచ్చిన జీఓలపై విచారణ చేయాలి. దీనిపై తక్షణం ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి’ అని తెలిపారు. -
చంద్రబాబుకు ఆ విషయం అర్థమైంది!
సాక్షి, నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైందని, అందుకే ఆ నెపాన్ని ఈవీఎంలపై వేయాలని హంగామా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే ఇతరులపై ఆయన దాడి చేస్తున్నారని, ఎన్నికల ముందు తనకు అనుకూలంగా ఉన్న అధికారులను ఎస్పీలుగా, కలెక్టర్లుగా చంద్రబాబు నియమించుకున్నారని, ప్రజలను మెప్పించి కాకుండా అధికారుల సహకారంతో ఎన్నికల్లో గెలవాలని ఆయన అనుకున్నారని అన్నారు. ఈవీఎంను దొంగిలించిన కేసులో నిందితుడైన హరిప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్ కూడా విధించారని, అలాంటి వ్యక్తిని ఎన్నికల కమిషన్ వద్దకు చంద్రబాబు ఎలా తీసుకెళతారని ప్రశ్నించారు. సొంత ఓటు గురించి కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని కలెక్టర్లు, ఎస్పీలను బెదిరించి.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేశారని, విలువలు దిగజార్చిన ఆయన గురించి మాట్లాడాలంటే సభ్యత అడ్డం వస్తోందని ఆనం పేర్కొన్నారు. -
ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం
సాక్షి, సైదాపురం: వైఎస్సార్ ప్రజల కోసం ఒక అడుగు ముందుకు వేశారు, ఆయన ఆశయ సాధనలో భాగంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మరో రెండు అడుగులు ముందుకు వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని వైఎస్సార్సీపీ వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని జోగిపల్లి, పొక్కందల, ఆదూరుపల్లి, ఊటుకూరు, తురిమెర్ల, పరసారెడ్డిపల్లి, గోవిందపల్లి, ఇస్కపల్లి, గిద్దలూరు, రాగనరామాపురం, తిప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి నోటి రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదీవెన కార్యక్రమాలను నిర్వహించారు. ఆనం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి పేద కుటుంబానికి లబ్ధిచేకూరుతుందన్నారు. అవ్వా, తాతలకు, దివ్యాంగులకు పింఛన్ పెంచుతామన్నారు. రాజన్న రాజ్యం తిరిగి చూడాలంటే మనమందరం కష్టపడి జగనన్నను సీఎం చేద్దామని, అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో తనను గెలిపించాలని కోరారు. వడ్డీలు చెల్లించలేక అప్పుల్లో కూరుకుపోయిన డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేసి ఆదుకుంటామన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు నాలుగున్నర రాజశేఖరరెడ్డి పాలన చూడాలంటే వైఎస్జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. రాజన్న రాజ్యం కావాలంటే ప్రతి ఒక్కరు వైఎస్సార్సీపీకి చెందిన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ చైర్పర్సన్ పోట్టేళ్ల శిరీషా, జిల్లా పార్టీ కార్యదర్శి దాసరిరాజు శంకరరాజు, మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్, సైదాపురం మాజీ సర్పంచ్ బండి వెంకటేశ్వర్లురెడ్డి, ప్రచార కార్యదర్శి మహేంద్రరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటి కో–ఆర్డినేటర్ చెముర్తి జనార్దన్‌రాజు, నాయకులు టీవీఎల్‌నారాయణరావు, రాంగోపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, కరణం శ్రీనివాసులునాయుడు, గజ్జెల రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ కామేశ్వరి, మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేన్సర్ హాస్పిటల్.. క్యాన్సిల్
మంత్రి నారాయణ స్వార్ధానికి ప్రాంతీయ కేన్సర్ వైద్యశాల ఎగిరిపోయింది. జిల్లా కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ కేన్సర్ వైద్యశాలను నెలకొల్పితే తన వైద్యశాలకు మనుగడకు ముప్పు తలెత్తుతుందని తరలించేశారు. ఘనత వహించిన పాలకుల నిర్లక్ష్యానికి కేన్సర్ ఆస్పత్రి దూరమైంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేశారు. పేదోడికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చారు. జిల్లా కేంద్రంలో కేన్సర్ ఆస్పత్రికి కేంద్రం రూ.45 కోట్లు మంజూరు చేస్తే చేజేతులారా క్యాన్సిల్ చేయించారు. పేదోలు కేన్సర్ వైద్యానికి జిల్లా ప్రజలు చెన్నై, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి తప్పడం లేదు. సాక్షి, నెల్లూరు (బారకాసు): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రి ప్రాంగణంలో ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి కలగానే మిగిలిపోయింది. ఏడాది క్రితం కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.45 కోట్లు నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే జిల్లా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేజారిపోయింది. నెల్లూరు నగరంలో నూతనంగా అత్యాధునిక వసతులతో ఏర్పాటైన ప్రభుత్వ బోధనాస్పత్రికి అనుబంధంగా అదే ప్రాంగణంలో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని 2014లో అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కేంద్రానికి ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు రేడియేషన్ అంకాలజీ (కేన్సర్ విభాగం) పోస్టును భర్తీ చేస్తూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసన్‌ను నియమించారు. ఆ తర్వాత 2015లో కేన్సర్ విభాగం ఏర్పాటుకు తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ప్రభుత్వ బోధనాస్పత్రి ప్రాంగణంలో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ 2015లో రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు అప్పటి కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. డాక్టర్ శ్రీనివాసన్ రెండు పర్యాయాలు నేరుగా వెంకయ్యనాయుడిని కలిసి కేన్సర్ ఆస్పత్రి ఆవశ్యకతపై నివేదికను అందజేశారు. నెల్లూరులో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు అంగీకారం ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 20 ప్రధాన కేన్సర్ ఆస్పత్రులను ఒక్కో ఆస్పత్రికి రూ.120 కోట్లు, 50 ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రులను ఒక్కో ఆస్పత్రికి రూ.45 కోట్లు నిధులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటి కేంద్ర మంతిగా ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరుకు ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రిని కేటాయించాలని అందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. వెంకయ్యనాయుడు కృషితో నెల్లూరులో ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి కోసం రూ.45 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో 2016 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ప్రధాన కేన్సర్ ఆస్పత్రిని, నెల్లూరులో ప్రాంతీయ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి లేఖ రాసింది. కామ్‌గా.. క్యాన్సిల్ చేయించారు.. నెల్లూరులో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు ఉన్న వసతులపై కేంద్ర ప్రభుత్వం అదే ఏడాది జూన్‌లో వైద్యుల బృందాన్ని ఇక్కడి ప్రభుత్వ బోధనాస్పత్రికి పంపించింది. ఆ బృందం పరిశీలన అనంతరం నివేదికను కేంద్రానికి అందజేసింది. లోటు పాట్లను పూర్తి చేయగానే వెంటనే రూ.45 కోట్లు నిధులు ఇచ్చేందుకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఏసీఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్ ఆస్పత్రి కమిటీతో చర్చించారు. ఈ మేరకు 2017 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ బోధనాస్పత్రి అధికారులు నివేదిక అందజేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు కొంత కాలం పట్టించుకోలేదు. దీంతో అదే ఏడాది ఆగస్టులో రెడ్‌క్రాస్ సంస్థ తాము కేంద్రానికి సంబంధించిన హోమిబాబా కేన్సర్ కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని, మీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా మంత్రులు పట్టించుకోవడం మానుకున్నారు. రెండేళ్ల పాటు వేచి చూసిన కేంద్ర ప్రభుత్వం నెల్లూరుకు ఇస్తామన్న రూ.45 కోట్లు నిధులను ఇతర ప్రాంతానికి కేటాయిస్తున్నామని తెలియజేయడంతో అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. విషయం తెలుసుకున్న కొందరు నెల్లూరుకు నష్టం జరుగుతోందని 2018 జనవరిలో కేన్సర్ ఆస్పత్రి సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని పోరాటాలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అప్పటి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రితో పాటు జిల్లా మంత్రులు రెడ్‌క్రాస్ ఒప్పుకోలేదు కాబట్టే నెల్లూరుకు ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు కుదరదని కారణాలు చెబుతూ వచ్చారు. వసతులున్నా.. నిర్లక్ష్యం నూతనంగా నిర్మించిన బోధనాస్పత్రిలో కేన్సర్ ఆస్పత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలంటే అందుకు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెటర్నిటీ, రేడియాలజీ, అనస్థిషియా విభాగాలతో పాటు ప్రత్యేకంగా 50 పడకలు ఉండాలనేది నిబంధన. ఈ నిబంధనలు ప్రస్తుతం నగరంలో ఉన్న ప్రభుత్వ బోధనాస్పత్రికి ఉన్నాయి. నెల్లూరులో ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి జిల్లా యంత్రాంగం, జిల్లా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు లేకపోవడంతో తరలిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేసి ఉంటే జిల్లా ప్రజలతో పాటు చుట్టు పక్కల ప్రకాశం, వైఎస్సార్ జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఏది ఏమైనా పాలకుల నిర్లక్ష్యం మనకు కేన్సర్ వైద్యశాల దూరమైంది. -
వెంకటగిరిలో టీడీపీ వెలవెల
వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న రాజాల కుటుంబీకులు ఆ పార్టీని వీడి బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. వీరితోపాటు వేలాదిమంది రాజాల అభిమానులు ఆ పార్టీలోకి వెళ్లారు. అధిక సంఖ్యాకుల సామాజిక వర్గానికి చెందిన చెందిన మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): వెంకటగిరి ఉద్యమాలకు పెట్టింది పేరు. జమిందారీ వ్యతిరేక పోరాటం పురుడు పోసుకుంది వెంకటగిరిలోనే. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. వెంకటగిరి అంటే గుర్తుకు వచ్చేది వెంకటగిరి సంస్థానం, రాజా కుటుంబీకులు, చేనేత పరిశ్రమ. ఇక నియోజకవర్గంలోని రాపూరు మండలంలోని చెల్లటూరు వద్ద 1983లో నిర్మించిన కండలేరు జలాశయాన్ని 11 కి.మీ. పొడవైన మట్టికట్టతో నిర్మించారు. ఇది ఆసియాలోనే మట్టితో నిర్మించిన అతిపెద్ద డ్యామ్. ఇక వెంకటగిరి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కలిగిన వెంకటగిరి చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించాయి. నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో మైకామైన్ పరిశ్రమ విరాజిల్లుతోంది. అరుదైన మైకా ఖనిజ సంపద వెంకటగిరిలో లభ్యమవతుండడంతో ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నియోజకవర్గంలోని రాపూరు మండలంలోనే ఉంది. అంతటి విశిష్టత కలిగిన వెంకటగిరి నియోజకవర్గంలో ఎందరో ఉద్దండులు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు, సీఎంగా పనిచేసిన చరిత్ర ఉంది. అయితే అధికారపార్టీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రతి పనిలోనూ మామూళ్లు ముక్కుపిండి వసూళ్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. కృష్ణపట్నం–ఓబులవారిపల్లి రైల్వే పనులు చేసిన కాంట్రాక్టర్ నుంచి రూ.కోట్లు డిమాండ్ చేయడం, వారు నిరాకరించడంతో తన అనుచరులతో పనులు అడ్డగించడం, కాంట్రాక్టర్లను కమీషన్ డిమాండ్‌కు సంబంధించి ఆడియో టేపులు లీకై రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. అయినా వెంకటగిరి నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అన్నట్లు నియంత్రత్వ పోకడతో వ్యవహరించినా పార్టీ అధిష్టానం ఆయన్ను చూసీ చూడనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పచ్చపార్టీలో కనీస గౌరవం దక్కక వివాద రహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర, రామ్‌ప్రసాద్ యాచేంద్ర ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద సైతం ఎమ్మెల్యే పెట్టిన అవమానాలు భరించలేక ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఆనం అభ్యర్థిత్వంతో వైఎస్సార్సీపీలో జోష్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై స్థానికుల్లో ఆశలు చిగురించాయి. వెంకటగిరి నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో మౌలిక వసతులు కోసం ఆనం రామనారాయణరెడ్డి ప్రకటిస్తున్న సమగ్ర ప్రణాళికపై పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుండడంతో ఈ దఫా ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అంతా వైఎస్సార్సీపీ గాలి వీచినా వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకు గానూ 21 వార్డుల్లో టీడీపీకి పట్టం కట్టారు. ఈ విజయాల పరంపర వెనుక వెంకటగిరి రాజాల కృషి ఉందనేది నిర్విదాంశం. అయితే టీడీపీలో తగిన ప్రాధాన్యం దక్కక రాజా కుటుంబీకులు వైస్సార్సీపీలో చేరారు. అంతకు ముందే మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద సైతం వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హ్యాట్రిక్ అందని ద్రాక్షే.. గతంలో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, ఓజిలి మండలాల్లో కొంతభాగం వరకూ నియోజకవర్గం ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రాపూరు నియోజకవర్గం అంతర్ధానం కావడంతో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్లో సరికొత్తగా వెంకటగిరి నియోజకవర్గం అవతరించింది. టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్‌పార్టీకి పెట్టని కోటగా ఉన్న వెంకటగిరి నియోజకవర్గం 1983 నుంచి ఎనిమిది పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు దఫాలు టీడీపీ, మూడుసార్లు కాంగ్రెస్‌పార్టీకి నియోజకర్గ ఓటర్లు పట్టం కట్టారు.1956లో కాంగ్రెస్ అభ్యర్థిగా పి.వెంకటస్వామిరెడ్డి, 1957, 1962లో అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయానికి ప్రయత్నించిన అల్లం కృష్ణయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి ఓరేపల్లి వెంకటసుబ్బయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 1978లో వెంకటగిరి నియోజకవర్గం జనరల్ కావడంతో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ అభ్యర్థిగా నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్దిగా విజయం సాధించి 90వ దశకంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1994లో జనార్దన్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి, రాజా కుటుంబీకుడు వీవీఆర్కే యాచేంద్ర విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా నేదురుమల్లి రాజ్యలక్ష్మి వరుస విజయాలు సాధించారు. 1999లో హ్యాట్రిక్ విజయం సాధించలేక టీడీపీ అభ్యర్థి కె.రామకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ౖటీడీపీ అభ్యర్థి కె.రామకృష్ణను గెలుపొందారు. దీంతో ఆయన 2019లో హ్యాట్రిక్ ఆశలు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. అల్లం కృష్ణయ్య, నేదురుమల్లి రాజ్యలక్ష్మికి దక్కని హ్యాట్రిక్ విజయం ఈ దఫా కురుగొండ్ల రామకృష్ణ నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆయన ఆశలు నెరవేరుతాయో లేక వెంకటగిరి సెంటిమెంట్ మరోసారి పునరావృతం అవుతుందో వేచి చూడాల్సిందే. వెంకటగిరి నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు మొత్తం ఓట్లు 2,45,144 పురుషులు 1,42,674 స్త్రీలు 1,42,674 ఇతరులు 39 సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు సమీప అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు మెజారిటీ 2014 కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ 83,669 కొమ్మి లక్ష్మయ్యనాయుడు వైఎస్సార్సీపీ 78,034 5,635 2009 కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ 69,731 నేదురుమల్లి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ 62,965 6,766 2004 నేదురుమల్లి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ 57,830 వీబీ సాయికృష్ణ యాచేంద్ర టీడీపీ 51,135 6,695 1999 నేదురుమల్లి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ 48,876 తాటిపత్రి శారద టీడీపీ 38,158 10,718 1994 వీవీఆర్కే యాచేంద్ర టీడీపీ 61,324 నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ 44,328 16,996 1989 నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ 62,270 నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ 43,129 19,141 1985 వీబీ సాయికృష్ణ యాచేంద్ర టీడీపీ 55,240 పెట్లూరు బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ 26,418 28,822 1983 నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ 40,835 నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ 37,282 3,553 1978 నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ 26,696 పాదిలేటి వెంకటస్వామిరెడ్డి జనతాపార్టీ 26,284 412 1972 ఓరేపల్లి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ 33,136 అల్లం కృష్ణయ్య ఇండిపెండింట్ 9,092 24,044 1967 ఓరేపల్లి వెంకటసుబ్బయ్య ఇండిపెండెంట్ 31,193 అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ 23,197 7,996 1962 అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ 24,075 బండి చంద్రశేఖర్‌రెడ్డి స్వరాజ్ 16,285 7,790 1957 అల్లం కృష్ణయ్య కాంగ్రెస్ ––––– ––––– ––––– ––––– ––––– 1956 పాదిలేటి వెంకటస్వామిరెడ్డి కాంగ్రెస్ 45,989 ––––– ––––– 44,159 1830 -
‘పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు’
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను భ్రస్టు పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కుట్రతో కేసులు పెట్టి అరెస్ట్ చేయటం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీకి సంబంధం లేకుండా ఇంటలిజెన్స్ డీఎస్పీ చెప్పినట్లు కింద స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల్లా కాకుండా అధికారుల మాదిరిగా పోలీసులు వ్యవహరించాలని సూచించారు. పోలీసుల అనాలోచిత నిర్ణయాలు..తప్పుడు అరెస్టులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించే ఉద్యోగులు ఇబ్బంది పడతారని హెచ్చిరంచారు. చంద్రబాబు ఓటమి భయంతో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటమి భయంతో వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగిస్తున్నారని, దీనిని ప్రశ్నించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల కనుసన్నలలోనే సర్వే బృందం ఓట్లను తొలగిస్తోందన్నారు. తప్పుడు కేసులకు భయపడమని తేల్చి చెప్పారు. శ్రీధర్ రెడ్డికి అందరూ అండగా నిలిచి పోరాడతామన్నారు. -
చంద్రబాబుది నయవంచన పాలన
సాక్షి, వెంకటాచలం: చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురిచేసి పారిపాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. వెంకటాచలం మండలం కసుమూరులో శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరయ్యారు. తొలుత కసుమూరు మస్తాన్‌వలీ దర్గాలో వైఎస్సార్సీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆనం మాట్లాడుతూ గత ఎన్నికల ముందు 600పైగా వాగ్దానాలిచ్చిన చంద్రబాబు ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురిచేశారన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ముందు రాష్ట్రంలో అప్పుల భారం రూ.86 వేల కోట్లుండగా ప్రస్తుతం మరో రూ.1.50 లక్షల కోట్ల అప్పులు భారాన్ని చంద్రబాబు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులను అభివృద్ధికి వినియోగించకుండా పందికొక్కుల్లా పంచుకున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ వ్యవస్థకు అడ్డుకట్ట పడాల్సిన అవసరాన్ని ప్రజానీకం గుర్తించాలని పిలుపునిచ్చారు. మరో ఐదేళ్లు బాబు అధికారంలో ఉంటే భవిష్యత్ తరాల ప్రజలు ఇబ్బందుల్లో పడతారని తెలిపారు. టీడీపీ పాలనలో దొడ్డిదారిన వచ్చేవారు ఎక్కువైపోయి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశమిస్తే ఏపీని అగ్రగామిగా మార్చుతారని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే మళ్లీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ బాబు పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగ యువతకు, ఇలా ఏ వర్గానికీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు, కరువు కవలపిల్లలు లాంటివారన్నారు. బాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో వర్షాలు పడక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి మాటున రూ.కోట్లలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీరు–చెట్టు పథకంలో అవసరం లేని కాలువలు తవ్వి ప్రజాధనాన్ని దోచుకోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి జరిగితే సంగం, కనుపూరు కెనాల్ ఆధునీకరణ ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. మంత్రి సోమిరెడ్డి ఓట్లు తొలగింపు వివాదంపై మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే తొలగిస్తున్నారని సోమిరెడ్డి చెప్పే మాటలు విని జనం నవ్వుకుంటున్నారని హేళన చేశారు. దొంగ ఓట్ల విషయంలో టీడీపీ నాయకుల చేసే కుట్రలను ప్రశ్నిస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక మండలంలోని చవటపాళెం గ్రామానికి చెందిన పీఏసీఏస్ ఉపాధ్యక్షుడు వళ్లూరు రమణయ్యనాయుడు, కసుమూరు గ్రామానికి చెందిన తూమాట మధునాయుడు, జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కుడితిపూడి మురళీనాయుడు, ఎం.సుధాకర్‌నాయడుతోపాటు 300 కుటుం బాలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కె.కోదండరామిరెడ్డి, సంయుక్త కార్యదర్శి కె.విజయమోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, పార్టీ మండల కన్వీనర్ కె.చెంచుకృష్ణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, జిల్లా, మండల కో–ఆప్షన్ సభ్యులు అక్బర్‌బాషా, హుస్సేన్ పాల్గొన్నారు. -
ప్రజల భద్రతకు ముప్పు
నెల్లూరు (సెంట్రల్): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను దొంగచాటుగా తీసుకున్న తీరును చూస్తే ప్రజల భద్రతలకే ముప్పు ఏర్పడిందని నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో మంగళవారం సమరశంఖారావం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తదితరులతో కలసి మంగళవారం విలేకరుల సమవేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 3.69 కోట్ల ఓట్లు ఉంటే అందులో దాదాపుగా 59 లక్షల ఓట్లు దొంగచాటుగా తొలగించడం, రెండు ఓట్లు చేయించడం వంటి నీచపు పనిని చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు) మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్ అండదండలతో ఐటి గ్రిడ్స్ పేరుతో ప్రతిపక్షానికి చెందిన ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల మందికి చెందిన వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం సేవామిత్ర పేరుతో ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత వివరాలు సేకరించి ఓట్లు తొలగింపు చేస్తున్నారన్నారు. ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని సేకరించడంలో నారా లోకేష్‌తో సన్నిహితంగా ఉంటున్న అశోక్, కిలారి రాజేష్, పెద్ది రామారావు, అబిష్ణ తదితరులు ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. ప్రైవేటు ఏజన్సీలకు చంద్రబాబు రూ.కోట్లు కుమ్మరించి ఓట్ల తొలగింపు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా ఒక వ్యక్తి సమాచారన్ని మరొక వ్యక్తికి ఇవ్వరాదని సర్వోన్నత న్యాయ స్థానం కూడా చెప్పిందని, కాని నిబంధనలు బుట్టదాఖలు చేసి ఇలా చేయడం బాధాకరమన్నారు. వ్యక్తిగత జాబితాలను సేకరించి ఓట్లు తొలగించడంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాన ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించి ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో మంగళవారం జరగనున్న సమరశంఖారావం సభ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ నేతలు సోమవారం పరిశీలించారు. (ఏపీ పరువు తీశారు) -
ప్రజల జీవితానికి భద్రత లేదు : ఆనం
-
ప్రజల జీవితానికి భద్రత లేదు : ఆనం
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ గ్రిడ్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసాలు వెలుగు చూశాయని, బూత్ కమిటీల పరిశీలన వల్లే ఈ అక్రమాలు బయట పడ్డాయని వైఎస్సార్ సీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహించి ఓట్లను తొలగిస్తున్న తీరును బట్టి చూస్తే.. రాష్ట్రంలో ప్రజల జీవితాలకు భద్రత లేదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ నాయకుడికి మద్దతు ఇస్తున్నారో తెలుసుకుని వారి ఓట్లను తొలగిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌లు ఈ కుంభకోణం వెనుక వున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌ల తప్పిదాలు బయటపడకుండా ఉండేందుకు కొన్ని పత్రికలు ఎదురుదాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ సమాచారం ప్రైవేట్ సంస్థలకు ఎలా వెళ్లిందో ఎన్నికల సంఘం విచారణ చేయాలని కోరారు. -
సర్వేపల్లిలో కాకాణి విజయం తథ్యం : ఆనం
-
చంద్రబాబుది నయవంచన పాలన
నెల్లూరు, ముత్తుకూరు: మోస పూరిత హామీలతో రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేసిన చంద్రబాబు నయవంచన పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర పడిందని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు ఏఎంసీ మాజీ చైర్మన్ మునుకూరు రవికుమార్‌రెడ్డి(బాబిరెడ్డి) శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. మండలంలోని ముసునూరువారిపాళెంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు బాబిరెడ్డికి పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి ఆనం మాట్లాడుతూ 600 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబును ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలు రావాలి జగన్–కావాలి జగన్ అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో దోస్తీ కట్టి విలువలకు పాతర వేశారన్నారు. యాష్‌పాండ్‌లో సోమిరెడ్డికి కమీషన్లు జెన్కో ప్రాజెక్ట్ రెండో యాష్‌పాండ్ నిర్మాణంలో కమీషన్లు తీసుకోలేదని మంత్రి సోమిరెడ్డి ప్రమాణం చేయగలరా అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ఈ సభలో సవాలు చేశారు. కమీషన్లు ముట్టలేదని కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తే తాను బహిరంగంగా క్షమాపణ చెబుతానన్నారు. తాను కమీషన్లు తీసుకోలేదంటూ రైసు మిల్లర్లను బెదిరించి చెప్పించారని కాకాణి మండిపడ్డారు. సోమిరెడ్డి దగ్గర ధనం బలం ఉండవచ్చు, కానీ తమ వద్ద జనం బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. రైతుల్ని ముష్టివాళ్లుగా భావిస్తే సహించేదిలేదన్నారు. మునుకూరు బాబిరెడ్డి మాట్లాడుతూ యాష్‌పాండ్ ఏర్పాటులో సోమిరెడ్డి చూపిన స్వార్థం వల్ల టీడీపీని వీడి, వైఎస్సార్సీపీలో చేరానన్నారు. పరిసర గ్రామాలకు చెందిన 600 మంది అనుచరులు బాబిరెడ్డి వెంట పార్టీలో చేరారు. నాయకులు ఆనం రంగమయూర్‌రెడ్డి, వేమారెడ్డి శ్యామసుందరరెడ్డి, పేర్నాటి శ్యామ్‌సుందరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రైతులు, మహిళలకు అండగా వైఎస్సార్సీపీ
నెల్లూరు ,వెంకటగిరి: ‘టీడీపీ ప్రభుత్వం మహిళలు, రైతులను మోసం చేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి అండగా ఉంటుంది. అభివృద్ధికి కృషి చేస్తుంది’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. పట్టణంలో నూతనంగా ప్రారంభించిన వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ డిక్లరేషన్‌ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తారన్నారు. ‘వర్షం కావాలంటే బాబు పోవాలి’ అనే కొత్త నినాదాన్ని వెంకటగిరి వేదికగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలోని యువత ఆకాంక్షలను తెలుసుకునేందుకు మార్చి మొదటివారంలో సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు తెలియజేసి యువత డిక్లరేషన్ ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చింతమనేని వ్యాఖ్యలు దారుణం దళితులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరని సీఎం చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను స్ఫూర్తిగా తీసుకుని చింతమనేని ప్రభాకర్ దళితులను అవమానించారన్నారు. టీడీపీ నేతలు దళితులు, బీసీలు, గిరిజనుల ఓట్లు తమకు అవసరం లేదని ప్రకటించి ఎన్నికలకు రాగలరా అని ప్రశ్నించారు. వెంకటగిరి ప్రాంతాన్ని విద్య, వైద్య, ఆరోగ్య, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. అన్యాక్రాంతం కాలేదు వెంకటగిరి రాజాల దాతృత్వంతో ఏర్పాటు చేసిన వీఆర్ విద్యాసంస్థలకు అప్పట్లో వారిచ్చిన స్థలంలో ఒక్క సెంట్ కూడా అన్యాక్రాంతం కాకుండా చూశామన్నారు. అలాగే మరో ఐదెకరాలు కొనుగోలు చేసి వారి పేరుతోనే మరిన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన చరిత్ర తమదని ఆనం తెలిపారు. అయితే వెంకటగిరి రాజాల దానంతో ఏర్పాటైన గోషాస్పత్రిని మూయించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల ప్రయత్నించారని విమర్శించారు. రాజా కుటుంబీకులకు సరైన గౌరవం కూడా ఇవ్వని అధికారపార్టీ నేతలకు తమను విమర్శించే నైతికత లేదని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ జి.ఢిల్లీబాబు, వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, ధనియాల రాధ, యస్ధానీబాషా, గూడూరు భాస్కర్‌రెడ్డి, ఆవుల గిరియాదవ్ పాల్గొన్నారు. -
‘సమర శంఖారావాన్ని విజయవంతం చేయాలి’
సాక్షి, నెల్లూరు: ఈ నెల 19వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఎన్నికల ముందు కీలక సమావేశం కానుందని తెలిపారు. బూత్ కమిటీ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. అనంతరం నెల్లూరు వైఎస్సార్ సీపీ జిల్లా ఇంచార్జి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సదస్సులో బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, పార్టీ నేతలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్ధేశం చేయనున్నారని తెలిపారు. -
హోదా పేరుతో చంద్రబాబు డ్రామా : ఆనం
సాక్షి, నెల్లూరు : ప్రత్యేక హోదా సంజీవని కాదని , హోదా కలిగిన రాష్ట్రాలు ఏం సాధించాయని గతంలో ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు నల్లదుస్తులతో ఢిల్లీలో హోదా కోసం డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ప్యాకేజీతోనే ప్రయోజనమని చెప్పి కమీషన్ల కోసం కక్కుర్తిపడిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహారదీక్ష చేస్తుంటే మోదీ అమరావతికి వస్తున్నారని దీక్షను భగ్నం చేశారన్నారు. అదే చంద్రబాబు ఇప్పుడు బుడబుక్కల జాతరలాగా ఢిల్లీలో హోదా పేరుతో హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి 29 సార్లు వెళ్లానని చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర సమస్యలను మాత్రం ప్రస్తావించలేదు. హౌసింగ్ స్కీం పెద్ద స్కామ్ అనీ, ఇందులో మంత్రి నారయణ దళారీ కాగా, లోకేష్‌కు వాటాలు దక్కుతున్నాయని ఆనం ధ్వజమెత్తారు. -
చంద్రబాబు ధనబలం ఉంటే,జగన్‌కు జన బలం ఉంది
-
‘మీకు ధనబలం ఉంటే.. వైఎస్ జగన్‌కు జనబలం ఉంది’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధనబలం ఉంటే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనబలం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంల మీద సాకులు చెప్పడానికి టీడీపీ ఇప్పుడే ప్రచారాన్ని ప్రారంభించిందని విమర్శించారు. నంద్యాల ఉపఎన్నికలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన టీడీపీ.. ఇప్పుడు కత్తిరింపు సర్వేతో దగా చేయడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో తెలుగు యువత పేరుతో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కార్యక్రమానికి తెరతీశారని మండిపడ్డారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 10 వేలు, 20 వేల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ట్యాబ్స్‌లో ఓటర్ల లిస్ట్ పెట్టుకుని సర్వేలు చేయడమేమిటని.. అసలు ట్యాబ్‌లకు, ఆర్టీజీఎస్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వీటిని టీడీపీ కార్యాలయానికి లింక్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని, చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి తమ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారని తెలిపారు. బాబుకు ఎందుకో అంత భయం! ఐటీ, సీబీఐ అంటే సీఎం చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారు.. అసలు ఆయన బాధ ఏంటో అర్థం కావడం లేదని ఆనం ఎద్దేవా చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుకు నిజంగా నిజాయితీ ఉంటే తన పాలన మీద రెఫరెండం పెట్టమని అని చెప్పగలరా అని ప్రశ్నించారు. 40 సంవత్సరాల అనుభవంతో కొత్త హామీలు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ము ఉందా అంటే.. అది కూడా చెప్పలేని స్థాయికి దిగజారి పోయారని విమర్శించారు. ధనబలంతో రాష్ట్ర ప్రజలని వంచించే ప్రయత్నం చేస్తూ... డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చెక్కుల పంపిణీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అంటే కాపీ మినిస్టర్ తమ పార్టీ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతూ... సీఎం అంటే కాపీ మినిస్టర్‌గా మారారని ఆనం ఎద్దేవా చేశారు. టీడీపీ వేసేది మ్యానిఫెస్టో కమిటీ కాదు.. మ్యానిపులేషన్ కమిటీ అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణ అంటే బాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ కుట్రలో లోకేష్ పాత్ర లేకపోతే... డీజీపీతో లోపాయకారి ఒప్పదం చేసుకోకపోతే ఎన్ఐఏను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. -
చంద్రబాబుకు భయం పట్టుకుంది
సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభద్రతాభావంతో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిస్తే చంద్రబాబుకు ఎక్కడా లేని భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం తణుకులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీల నాయకులు ఎక్కడైనా కలిసినా, మాట్లాడుకున్నా చంద్రబాబుకు భయం కలుగుతుందని విమర్శించారు. ‘చంద్రబాబు కేసీఆర్‌తో పొత్తు అడిగితే ఆయన బాబు నీకో దండం, నీతో పొత్తు వద్దన్నారు మర్చిపోయారా?. చంద్రబాబు శవరాజకీయాలు చేయటానికి కూడా సిద్దమవుతారు. హరికృష్ణ మృతదేహం వద్ద కూడా కేటీఆర్‌తో చంద్రబాబు రాజకీయాలు మాట్లాడారు. శవాల మీద పేలాలు వేరుకొని తినే మనస్తత్వం గల చంద్రబాబు.. కేటీఆర్ వద్ద కూడా తిరస్కరించబడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఛీ పొమ్మంటే కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టారు’అంటూ చంద్రబాబుపై ఆనం రాంనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
శ్వేతపత్రాలపై బ్లాక్ పత్రాలు విడుదల చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు బూటకమని నిరూపిస్తామని, అందులో భాగంగా తమ పార్టీ బ్లాక్ పేపర్లను విడుదల చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు విడుదల చేసే ఒక్కో శ్వేతపత్రంపై తమ పార్టీ స్పందిస్తుందని, వాటిలోని లోటుపాట్లను ఎత్తి చూపుతూ బ్లాక్ పేపర్ విడుదల చేస్తామన్నారు. బాబు విడుదల చేసే శ్వేతపత్రాలు తెల్ల కాగితాలతో సమానమని, వాటికి విలువ లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు, దగా చేసేందుకు వీటిని విడుదల చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలపుడు చంద్రబాబు 600కుపైగా హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్క దానినీ సంపూర్ణంగా అమలు చేయలేదని, అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను మభ్య పెట్టేందుకే శ్వేతపత్రాల పల్లవిని అందుకున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేరాలంటే వచ్చే ఎన్నికలలో 25 ఎంపీ సీట్లు టీడీపికి రావాలని ధర్మపోరాట దీక్షలలో చంద్రబాబు కోరడంపై ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు. టీడీపీకి ప్రస్తుతం కొనుగోలు చేసిన ముగ్గురితో కలిపి 20 మంది ఎంపీలున్నారని, అయినా కేంద్రంతో నాలుగున్నర సంవత్సరాలు అంటకాగి చంద్రబాబు ఏపీ కోసం సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఈవీఎంపై ఆరోపణలు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ఈవీఎంలపై విమర్శలు చేస్తూ, బ్యాలెట్ పత్రాలే కావాలని హంగామా చేస్తున్నారంటే రానున్న ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్లేనన్నారు. తెలంగాణలో ఈవీఎంలు టాంపరింగ్ అయినట్లైతే మరి మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎలా గెలిచింది, అక్కడ ఈవీఎంలు సరిగ్గానే పని చేశాయా? అని ప్రశ్నించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా దిగజారి మాట్లాడడం శోచనీయమన్నారు. తిరుపతి పేరును సిలికాన్ సిటీగా ఎలా మారుస్తారు? తిరుపతిని సిలికాన్ సిటీగా మారుస్తానని ప్రకటించి కోట్ల మంది హిందువుల మనో భావాలను ముఖ్యమంత్రి దెబ్బతీశారని అన్నారు. గతంలో వేయి కాళ్ల మండపాన్ని కూల్చిన చంద్రబాబుకు దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో అర్థం అయ్యే ఉంటుందన్నారు. చంద్రబాబు కోవర్టు కిరణ్.. చంద్రబాబుకు ఇద్దరు కోవర్టులు ఉన్నారని, వారిలో ఒకరు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి కాగా రెండో వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగున్నరేళ్లు గోల్ఫ్ ఆడి అలసి పోయి, ఇపుడు చంద్రబాబు కోవర్టుగా రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. ఇంతకూ కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన చెప్పుల పార్టీ ఏమైంది. ? దాన్ని రద్దు చేశారా? అలాగే ఉందా? అని ప్రశ్నించారు. కోవర్టు కిరణ్ ఈ మధ్య రాజకీయ సభలలో మాట్లాడుతూ వైయస్సార్సీపీపై విమర్శలు గుప్పిస్తున్నారనీ సోనియా దయాదాక్షిణ్యాలతో సీఎం పదవిని దక్కించుకున్న కిరణ్‌కుమార్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేవన్నారు. -
ఎన్నికల్లో గెలుపు కోసమే ధర్మపోరాట దీక్షలు
-
'అపవిత్ర కూటమిని తెలంగాణలో తిరస్కరించారు'
సాక్షి, నెల్లూరు : అపవిత్రమైన కూటమిని ప్రజలు తెలంగాణలో తిరస్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేశంలో చక్రం తిప్పుతానన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి అడుగులోనే బోల్తా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కోట్ల రూపాయల డబ్బును చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రెండు సీట్లు గెలిచి ప్రధాని మోదీతో పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు చంద్రబాబుకి బుద్ది చెప్పాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని గడిచిన 3 దశాబ్దాలుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని నిప్పులు చెరిగారు. హరికృష్ణ కూతురు సుహాసినిని ఎన్నికల్లో పోటీ చేయమన్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబానికి అనుమానం వచ్చిందని ఆనం అన్నారు. నందమూరి కుటుంబాలను రాజకీయంగా నాశనం చేయడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. -
రాజధానిలో అన్నీ తాత్కాలికమే: ఆనం
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, సోనియా ఇటలీ దెయ్యం అని గత ఎన్నికల సమయంలో చెప్పి ఇప్పుడదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాకినాడలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆనం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కూడా మాయమాటలు చెబుతూ మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. చంద్రబాబుతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధానిలో శాశ్వత భవనాలు ఉండవు..అన్నీ తాత్కాలికమేనని, తాత్కాలిక రాజధానితో రాజధాని లేకుండా బాబు తీర్చిదిద్దారని తీవ్రంగా మండిపడ్డారు. కనీసం పోస్టల్ పిన్‌కోడ్ కూడా తెచ్చుకోలేని పరిస్థితికి బాబు తెచ్చారని విమర్శించారు. బీజేపీతో ఉన్నన్ని రోజులూ నవ నిర్మాణ దీక్షలు..ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి మరో పోరాటం అంటూ మోసానికి తెరలేపారని అన్నారు. బాబు విద్యార్ధి దశ నుంచే వంచన చేస్తూ వచ్చారని, రాజకీయాల్లో ఆనాడు కాంగ్రెస్‌ను వంచించారని వ్యాక్యానించారు. అధికారం ఇచ్చిన ముఖ్యమంత్రులను, చేరదీసి కుటుంబంలో సభ్యుడిగా చేసుకున్న ఎన్టీఆర్‌ను కూడా వంచించారని ఆరోపించారు. ఏపీని విభజించండి అభ్యంతరం లేదని కాంగ్రెస్‌కు లేఖ ఇచ్చి, మళ్లీ ప్రజల వద్దకు వచ్చి రెండు కళ్ల సిద్ధామంతమంటూ డ్రామాలాడారని తీవ్రంగా దుయ్యబట్టారు. వైఎస్ జగనే లక్ష్యంగా బాబు పాలన: మోపిదేవి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే లక్ష్యంగా చంద్రబాబు పాలన చేశారు తప్పితే పేద ప్రజల పరిస్థితి మెరుగుపడేందుకు ఏనాడూ చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతిపాలు చేశారని, ఏపీ పరువు ప్రతిష్టలను చంద్రబాబు దిగజార్చారని మండిపడ్డారు. రైతులు, యువత, మహిళలను ఏ మాత్రం కూడా చంద్రబాబు పట్టించుకోలేదని, బీజేపీతో కలిసున్నన్ని రోజులూ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే తేలేదని అన్నారు. హోదాను అవహేళన చేసింది బాబే: వర ప్రసాద్ ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాపై పోరాడదామని పిలుపునిచ్చినపుడు హోదాను చంద్రబాబు అవహేళన చేశారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వర ప్రసాద్ గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాం..రాజీనామాలు చేసి ఢిల్లీలో వారం రోజుల పాటు ఆమరణ దీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైఎస్సార్సీపీయేనని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో అంశాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఏపీ విభజనకు బాబే కారణం: రౌతు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్సీపీ నేత రౌతు సూర్యప్రకాశ రావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల డబ్బు కాజేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనేత వైఎస్సాఆర్ ఒక్కరేనని కొనియాడారు. -
చంద్రబాబు, కరువు.. కవలలు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడు, కరువు.. కవల పిల్లలని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువుతో రాష్ట్రం అల్లాడిపోతుందని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. కృష్ణానది ఒడ్డునే ఉన్న పల్నాడు ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తున్నా బాబు సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి అధ్యక్షత దాచేపల్లిలో గురువారం జరిగిన ‘పల్నాడు గర్జన’ సభలో ఆనం ప్రసంగించారు. కృష్ణా నదిలో నీరు ఉన్నప్పటికీ పంటలకు ప్రభుత్వం నీరు విడుదల చేయక పోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నవనిర్మాణ దీక్ష, ధర్మ పోరాటమంటూ దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జత కట్టడం చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. సీఎం రమేష్, సుజన చౌదరిలు వేల కోట్లు దోచుకున్నట్లు ఐటీ, ఈడీ సోదాల్లో తేలితే వారిపై కక్ష సాధింపుగానే దాడులు జరిగాయంటూ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి లోకేశ్‌కు కమీషన్లు ఇప్పించే బ్రోకర్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పల్నాడును అవినీతి మయం చేసిన యరపతినేని పౌరుషాల పురిటిగడ్డ పల్నాడును యరపతినేని అవినీతిమయంగా మార్చారని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే దోపిడీ దొంగలనే మాదిరిగా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు రాహుల్‌ను చంకన పెట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పంటలు వేసుకోండి.. నీరిస్తామని పల్నాడు రైతులకు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నిండా ముంచారని మండిపడ్డారు. హైకోర్టు విచారణకు ఆదేశించగానే తెల్లరాయిని దోచేసిన యరపతినేని తప్పుకొని.. డ్రైవర్లు, పాలేర్లను కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్, పేకాట క్లబ్‌లు, గంజాయి సరఫరా, క్రికెట్ బెట్టింగ్‌లు, అనేక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా చివరకు లైంగిక దాడులకు నిలయంగా మార్చేశారని మండిపడ్డారు. లైమ్‌సిటీగా ఉన్న పిడుగురాళ్లను క్రైమ్ సిటీ మార్చేశారన్నారు. దేశంలో పంటలకు సెలవు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అధికారులు, పోలీసుల అండతో అక్రమాలు అధికారులు, పోలీసులను అడ్డు పెట్టుకుని యరపతినేని వందల కోట్లు దోచుకున్నారని వైఎస్సార్సీపీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. యరపతినేనికి దమ్ముంటే కాసు బ్రహ్మనందరెడ్డి మనవడు కాసు మహేష్‌రెడ్డిపై గెలవాలని సవాల్ చేశారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజలు తమపై ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో, ఎక్కడ అక్రమ కేసుల్లో ఇరికిస్తారోననే భయాందోళనలో జీవిస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు పల్లెల్లో యరపతినేని చిచ్చుపెట్టే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబుకు పల్నాడు ప్రాంత రైతులు గుర్తుకు వచ్చారని, పక్కనే ఉన్న కృష్ణానది నీరు ఇవ్వలేని దద్దమ్మ.. ఎక్కడో ఉన్న గోదావరి నీరు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజని, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి తదితరులు ప్రసంగించారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, యనుమల మురళీధర్‌రెడ్డి, దేవళ్ల రేవతి, జంగా కోటయ్య, జెడ్పిటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
దశాదిశా చూపించే చిరుదివ్వె జగన్
కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత పార్టీని పెట్టకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ మరెవ్వరికీ రాజకీయ మనుగడ ఉండేది కాదనీ, సింగిల్ పార్టీ నియంతృత్వం నడిచేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ పెట్టబట్టే వైఎస్సార్ తనయుడిగా ప్రజల్లో మమేకమై దశా దిశా చూపించగల నాయకుడిగా, చిరుదివ్వెగా వైఎస్ జగన్ ఉన్నాడని రాష్ట్రం మొత్తంగా విశ్వసిస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలకు నిజమైన పరిపాలన వైఎస్ జగన్ వల్లే సాధ్యమవుతుందని, పైగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఎన్టీఆర్ కుటుంబాన్నే కాదు, ఆయన పెట్టిన పార్టీని కూడా బాబు ఖూనీ చేసేశాడన్నారు. టీడీపీని కౌగలించుకోవడమనేది కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి తీరుతుందని, ఈ ఒక్క కారణం వల్లే కేసీఆర్ తెలంగాణలో మళ్లీ సీఎం కావచ్చంటున్న ఆనం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... వైఎస్సార్సీపీలోకి వచ్చిన తర్వాత మీ ప్రయాణం ఎలా ఉంది? రాజశేఖరరెడ్డిగారితో ఉన్న అనుబంధం, ఆప్యాయతల్ని తిరిగి పొందగలుగుతున్నాను అనే నమ్మకం నాకు ఉంది. రాజకీయంగా కొన్ని సందర్భాల్లో ఆవేశంతోనూ, అనాలోచితంగానూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. వాటిని సరిచేసుకుని, చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపపడి మళ్లీ వైఎస్సార్ కుటుం బంతో, వైఎస్ జగన్‌తో కలవాలని, వైఎస్సార్సీపీతో చివరివరకూ నడవాలని నిర్ణయించుకునే ఇక్కడికి రావడం జరిగింది. ఉన్నట్లుండి టీడీపీలోకి వెళ్లి, మళ్లీ ఇటువైపు ఎందుకొచ్చారు? మొదట్నుంచీ అంటే 8 దశాబ్దాలుగా కాంగ్రెస్‌తోనే ముడిపడిన కుటుంబం మాది. కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం నాకు దక్కకపోవడంతో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశాను. తర్వాత మళ్లీ వైఎస్సార్‌తో బంధం బలపడింది. అలా 1991 నుంచి 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్‌తోటే కొనసాగాను. విభజనానంతరం ఏపీకి కలిగిన నష్టాలు, అడ్డగోలు విభజనతో వచ్చిన చిక్కుల నేపథ్యంలో టీడీపీలో చేరితే బాగుంటుందనుకున్నాను. కానీ గత 8 దశాబ్దాల మా కుటుంబ రాజకీయ జీవితంలో నాకై నేను తప్పటడుగు వేసి తీసుకున్న నిర్ణయం అది. నా నిర్ణయం మా కుటుంబంలో ఎవరికీ సుతరామూ ఇష్టం లేదు. నా తమ్ముడు వివేకా తన జీవితం చివరి దశలో ఉందని గ్రహిం చుకున్నాక, మనం రాజకీయంగా తప్పు చేశాం. మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పేశాడు. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టడం సరైందేనని భావిస్తున్నారా? జగన్ పార్టీని పెట్టకపోయి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో మరెవ్వరికీ రాజకీయ మనుగడ ఉండేది కాదు. అలా జరగకుంటే తెలుగుదేశం పార్టీకి తప్ప మరెవ్వరికీ ఏపీలో మనుగడ లేని స్థితి ఏర్పడేది. సింగిల్ పార్టీ నియంతృత్వంలో నడిచేది. ప్రశ్నించే ఒక ప్రతిపక్షం ఉందిప్పుడు. జగన్ పార్టీ పెట్టకపోయి ఉంటే ప్రజాసంకల్ప యాత్రతో ప్రజల సమస్యలను దగ్గరికిపోయి అర్థం చేసుకునే వ్యక్తి ఏపీలో ఇవాళ ఉండేవారు కాదు. వైఎస్సార్ తనయుడిగా ప్రజల్లో మమేకమై దశా దిశా చూపిం చగల నాయకుడిగా, చిరుదివ్వెగా వైఎస్ జగన్ ఉన్నాడని రాష్ట్రం మొత్తంగా విశ్వసిస్తోంది. 2019 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అని కచ్చితంగా చెప్పవచ్చు. భారత రాజ్యాంగం ఏపీ ప్రజలకు నిజమైన పరిపాలన చూపిస్తుందంటే అది ఒక జగన్ వల్లే సాధ్యమవుతుంది. అన్ని విభాగాలను, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిపెట్టినవాడు బాబు. అందుకే ఇవ్వాళ అతడు మాట్లాడే ప్రతిమాటా నిస్పృ హలోంచే వస్తోంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ బాబుకు పట్టంగట్టి మోసపోతారని మాత్రం నేననుకోవడం లేదు. మోదీకి వ్యతిరేకంగా మహాకూటమి కడుతున్నానని బాబు వ్యాఖ్య? అమరావతి కేంద్రంగా మహాకూటమి కడుతున్నానని చంద్రబాబు చెబుతున్నారు కానీ ఆయన ఎవరితో కూటమి కట్టారు? ఇప్పటికే యూపీఏలో ఉన్న పార్టీల వద్దకు వెళుతున్నాడు. పైగా వాళ్లు ఈయన వద్దకు రాలేదు. చంద్రబాబూ మీరే ఈ దేశానికి దిక్కు అని రాహుల్ గాంధీ బాబు వద్దకు రాలేదు. రాహుల్ వద్దకు ఈయన వెళ్లి శాలువా కప్పి తీగలు లేని వీణ ఇచ్చి నువ్వు వాయించు రాహుల్ అంటున్నాడు. ములాయం సింగ్ వద్దకెళ్లి శాలువా కప్పాడు. అంతకుముందు మోదీ వద్ద మోకరిల్లిన దానికంటే ఎక్కువ స్థాయిలో ములాయం వద్ద మోకరిల్లాడు. కాంగ్రెస్‌తో టీడీపీ కలిసిపోవడంపై ప్రజలేమనుకుంటున్నారు? అధికారంకోసం ఒకసారి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుది. మళ్లీ ఇప్పుడు రెండోసారి తన అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూనియర్ నేత రాహుల్ గాంధీ కాళ్లవద్ద టీడీపీని పెట్టి, అయ్యా నువ్వే నాకుదిక్కు అని ప్రాధేయపడటం ద్వారా ఎన్టీఆర్‌ను రెండోసారి వెన్నుపోటు పొడిచాడు బాబు. కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఎన్టీఆర్ కుటుం బాన్నే కాదు, ఆయన పెట్టిన పార్టీని కూడా ఖూనీచేసేశాడు బాబు. ఈ దేశం కోసం, రాజ్యాంగం కోసం రాహుల్‌తో కలిసిపోయాను అంటున్నావు. నీ రాష్ట్రంలో పాలనను, వ్యవస్థను నిర్వీర్యం చేసిపడేశావు, ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది నీవల్ల. నీ మనసుకు నీవు సమాధానం చెప్పలేనివాడివి ఆంధ్రప్రజలకు ఏం సమాధానం చెబుతావు? టీడీపీ, కాంగ్రెస్ కలిసిపోతే చంద్రబాబు పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందా? 2014లో చేసిన తప్పుడు నిర్ణయం వల్ల కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ కాంగ్రెస్‌ను కౌగలించుకోవడమనేది కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి తీరుతుంది. మనం తెలుగుదేశంతో కలవడం ఏమిటి? అదీ చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఏమిటి? చంద్రబాబు తాను వస్తానంటే ఢిల్లీలో రాహుల్ తన ఇంటి గేట్లు ఎలా తెరిచాడంటూ కాంగ్రెస్ కేడర్ తీవ్రంగా బాధపడుతోంది. పోయి పోయి టీడీపీతో అదీ చంద్రబాబు టీడీపీతో కలవడంపై కాంగ్రెస్ కేడర్ ఉడికిపోతోంది. మా రఘువీరారెడ్డి, మా కేవీపీ రామచంద్రరావు వెళ్లి టీడీపీతో వేదిక పంచుకునే దృశ్యాన్ని నాకు నేనే ఊహించుకోలేకపోతున్నాను. తెలంగాణలో కాంగ్రెస్‌కు చంద్రబాబు డబ్బులిచ్చి మరీ మద్దతిస్తున్నాడట కదా? డబ్బులిస్తున్నాడు కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలిసిందేమో మరి. నాకు తెలిసి తెలంగాణలో టీడీపీతో కలిసిన కాంగ్రెస్ బాగా నష్టపోనుంది. ఈ కలయిక దెబ్బతో కేసీఆర్ బహుశా రెండోదఫా కూడా తెలంగాణ సీఎం అయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణలో కేసీఆర్ ఏం తప్పు చేశాడు? ఇప్పుడు తెలుగుదేశం వచ్చి తెలంగాణలో ఉద్ధరించేదేమిటి? (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2DP8oPs https://bit.ly/2FyJBAO -
నాడు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు.. నేడు పార్టీని కూనీ చేశారు..
-
ఎన్టీఆర్ టీడీపీ ఇప్పుడు నారావారి టీడీపీ
-
అప్పుడు ఎన్టీఆర్‌కి అల్లుడు తర్వాత గిల్లుడు
-
వైఎస్ఆర్సీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డితో మనసులో మాట
-
చంద్రబాబు నియంతలా మారారు
సాక్షి, హైదరాబాద్: స్వార్థం కోసం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఓ నియంతలా మారారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను పనిచేయనీయకుండా అక్రమాలను, అరాచకాలను బయటకు రాకుండా బాబు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి వెళ్లి ‘సేవ్ నేషన్, సేవ్ డెమాక్రసీ’ అని మాట్లాడిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తాను చేసే అక్రమాలను ఏ వ్యవస్థా ప్రశ్నించడానికి వీల్లేదంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి రాష్ట్రంలో విచారణ జరిపే హక్కులేదని చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇవ్వడం ద్వారా సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తిని, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే దుస్సాహసానికి ఒడిగట్టారని, దీనికి అడ్డుకట్టవేయకపోతే దేశ భద్రతకే ప్రమాదమని హెచ్చరించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం కాదా? రాజ్యాంగేతర శక్తిగా పరిపాలన కొనసాగించాలనుకుంటున్నారా? అంటూ చంద్రబాబును నిలదీశారు. సీబీఐ అంటే ఎందుకు గజ గజ వణికిపోతున్నారని, రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేస్తే చంద్రబాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. దోపిడీ చేసిన దొంగ ఇంటికి వెళ్లాలంటే పోలీసులు కూడా ఆ దొంగ అనుమతి తీసుకోవాలనే చందంగా చంద్రబాబు సర్కార్ జీవో ఉందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో విపక్షనేతగా చంద్రబాబు మూడుసార్లు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారని, దానికి స్పందించిన వైఎస్ వెంటనే సీబీఐతో విచారణ జరిపించారని ఆనం గుర్తు చేశారు. అప్పుడు సీబీఐనే ముద్దు అన్న బాబు ఇప్పుడు ఆ సంస్థ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక... తనకు 40 ఏళ్ల సీనియార్టీ అని చెప్పుకొనే చంద్రబాబు.. నాలుగు పదుల వయసు నిండని వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక ప్రజలు తిరస్కరించిన యూపీఏ నేతలను కలుస్తూ ప్రజాధనంతో వారికి శాలువాలు కప్పుతున్నారని ఆనం విమర్శించారు. విపక్ష నేత జగన్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేనని తెలిసి మనిషినే లేకుండా చేయాలన్న నీచపు పనికి ఒడిగట్టారా? అంటూ ప్రశ్నించారు. హత్యాయత్నం కుట్రలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే బండారం బయటపడుతుందని భయమా? అని నిలదీశారు. రేపు హైకోర్టు మీకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తుందనుకుంటే దానినీ వద్దంటారా?, ఎన్నికల కమిషన్, ‘సుప్రీం’ కూడా మీ నియంత్రణలో ఉండాలని అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. తొలి నుంచి చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఆయనే సుప్రీం అనే స్థాయిలోకి వెళ్లారని ఆనం అన్నారు. దోపిడీతో సంపన్న సీఎం అయ్యారు చంద్రబాబు లాంటి అనాలోచిత, అహంకారపూరిత సీఎం దేశంలో ఇప్పటి వరకూ ఎవరూ లేరని ఆనం మండిపడ్డారు. గతంలో పాలించిన ఏ ముఖ్యమంత్రులూ సమాఖ్య స్ఫూర్తిని ప్రశ్నించలేదని చెప్పారు. దోపిడీ రాజ్యాన్ని నడిపి దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు మారారని చెప్పారు. వ్యవస్థలోని లోపాలను చంద్రబాబు అనుకూలంగా మార్చుకుని వ్యవస్థలనే నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. ఈ వ్యవహారం దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పు అని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకుని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. మూడు నెలల క్రితమే సీబీఐ ఏపీలో విచారణ చేయవచ్చు అని చెప్పిన చంద్రబాబు.. అంతలోనే ఎందుకు నిర్ణయం మార్చుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక దేశమని, దానికి తానే నియంతని చంద్రబాబు భావిస్తున్నారని, రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్న బాబుకు ఇక ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని ఆనం అన్నారు. -
దేశంలో ఏపీ అంతర్భాగం కాదా?
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం రామనారయణ రెడ్డి మండిపడ్డారు. ఎవరు ప్రశ్నించరాదనే స్థాయికి చంద్రబాబు వచ్చారని, దేశ ఔన్నత్యాన్నే ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి, అక్రమాలు, హత్యాయత్నం కుట్రలపై స్వయం ప్రతిపత్తి కలిగిన సీబీఐ దర్యాప్తు జరపడానికి వీల్లేదని, అసలు ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికే వీల్లేదంటూ టీడీపీ సర్కారు రహస్యంగా ఓ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోపై ఆనం శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశంలో ఏపీ అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఎందుకింత భయమని, రాష్ట్రంలో ఐటీ దాడులు చేస్తే ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని, ఆయన పాలన రాజ్యాంగ బద్ధంగా సాగుతోందా? అని నిలదీశారు. చంద్రబాబు బినామీ సంస్థలపై దాడులు జరిగితే ఆయనకెందుకు భయమని, ఏపీలో జరుగుతున్న అవినీతి, అన్యాయన్ని.. పార్టీలన్ని ప్రశ్నించాలని కోరారు. ప్రతిపక్షనేత హత్యాయత్నం కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని, వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. -
చంద్రబాబు.. దేశంలో ఏపీ అంతర్భాగం కాదా?
-
ఏపీలో నారాసురుడు రాజ్యమేలుతున్నాడు
-
‘నాడు నరకాసురుడు.. నేడు ‘నారా’సురుడు’
సాక్షి, హైదరాబాద్ : నాడు ప్రజలను నరకాసురుడు ఇబ్బంది పెడితే నేడు నారాసురుడు పెడుతున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం రామనారయణ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలన నరకాసురుడిని తలిపిస్తుందన్నారు. బెల్ట్ షాపులు తీసేయ్యలేదని, ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే పట్టించుకోలేదని, అవినీతి పెరిగిందని, ఇసుకాసురులు పెరిగిపోయారని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో నారాసురుడి రాజకీయ సంహారంతోనే ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి వస్తుందన్నారు. హుదూద్, తిత్లీ తుఫాన్లతో చంద్రబాబు లబ్దిపోందుతున్నారని ఆరోపించారు. తుఫాన్ బాధితులకు ఎదో సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవవస్థలు దిగజారిపోయాయన్నారు. ఆపరేషన్ గరుడ అని చెప్పిన వ్యక్తిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. పోలీస్ శాఖలు ఎక్కడ పనిచేస్తున్నాయని, ఇంటలిజెన్స్ శాఖ పక్క రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేయడం ఏంటని నిలదీశారు. యూపీఎలో చంద్రబాబు కొత్తగా కూడగట్టేదేముందని, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు రాజకీయ వ్యవస్థను కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఒకటిన్నర లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారని, ఆర్థికంగా చంద్రబాబు, ఆయన కుటుంబం మాత్రమే లాభపడిందని ఆరోపించారు. చంద్రబాబు తీరు గురవింద సామెతను తలపిస్తుందని విమర్శించారు. -
ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి
-
టీడీపీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వారు ప్రకటించారు. రాష్ట్ర మాజీ మంత్రి, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి గత నెలలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఎన్డీసీసీబీ మాజీ అధ్యక్షుడు వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేటర్ రంగమయూరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, చేజర్ల మండల టీడీపీ నాయకుడు నవకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆదిశేషయ్య, సంగం మండలానికి చెందిన హిందూపురరెడ్డి, పారిశ్రామిక వేత్త కె.ధనుంజయ్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి, పి.పెంచలయ్య, చర్ల రవికుమార్, ఆనం ప్రసాదరెడ్డి, రూపక్‌యాదవ్, ఏ.ఓబుల్‌రెడ్డి, కోటిరెడ్డి, చిన్నారెడ్డి తదితరులు కూడా వైఎస్సార్సీపీలోకి వచ్చారు. -
టీడీపీ పాలనలో ఎక్కడచూసిన అవినీతే
-
వైఎస్సార్సీపీలోకి ఆనం రామనారాయణరెడ్డి
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని వేచలం క్రాస్ (చీకటి తోట) చేరినప్పుడు పెద్ద ఎత్తున అనుచరులతో తరలివచ్చి ఆయన పార్టీలో చేరారు. అనంతరం రామనారాయణరెడ్డి కొద్దిసేపు వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశాయన్నారు. ప్రజలకు అండగా నిలిచేందుకే వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన ప్రముఖుల్లో ఎన్డీసీసీబీ మాజీ అధ్యక్షుడు వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేటర్ రంగమయూరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, చేజర్ల మండల టీడీపీ నాయకుడు నవకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆదిశేషయ్య, సంగం మండలానికి చెందిన హిందూపురరెడ్డి, పారిశ్రామిక వేత్త కె.ధనుంజయ్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి, పి.పెంచలయ్య, చర్ల రవికుమార్, ఆనం ప్రసాదరెడ్డి, రూపక్‌యాదవ్, ఏ.ఓబుల్‌రెడ్డి, కోటిరెడ్డి, చిన్నారెడ్డి తదితరులున్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన ఆనం
-
వైఎస్సార్ సీపీలో చేరిన ఆనం
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైఎస్సార్ సీపీలో చేరడంతో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. జగన్ ప్రయత్నం విజయవంతం కావాలి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆనం రామానారాయణ రెడ్డి విమర్శించారు. ప్రజలను టీడీపీ, బీజేపీ దారుణంగా మోసం చేశాయని దుయ్యబట్టారు. నాలుగేళ్లు కలిసి కాపురం చేసి ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే విడిపోయినట్టు డ్రామాలాడుతున్నాయన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేసి ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని మండిపడ్డారు. ప్రజలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన చేసే ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆనం రామానారాయణ రెడ్డి చేరికపై వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందరం కలిసి ఏకతాటిపై నడిచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. -
వైఎస్సార్సీపీలో ఆనం చేరిక నేడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్న ఆయన శనివారం పాదయాత్ర ముగిశాక పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని చోడవరం శివారులోని రాత్రి బస శిబిరం వద్ద కలిసి మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి, ఆనం ముఖ్య అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే జిల్లాలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మాట్లాడారు. గత వారం ముఖ్య అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి ఆందరి అభిప్రాయం తెలుసుకొని పార్టీలో చేరిక తేదీని ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని చోడవరం సమీపంలోని దేవరాయపల్లి మండలం వ్యాసనం చెరకు కాటా సెంటర్లో జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌తో కలిసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. -
నేడు వైఎస్ఆర్సీపీలోకి మాజీ మంత్రి ఆనం
-
2న వైఎస్సార్ సీపీలోకి ఆనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం వెళ్లి ప్రజాసంకల్పయాత్రలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దివంగత వైఎస్సార్ హయాంలో, తదనంతర ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణమాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. అయితే పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతోపాటు నేతల అవినీతి తారాస్థాయికి చేరడం తదితర కారణాలతో ఆయన రెండు నెలలుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ఇప్పటికే కలిసి మాట్లాడారు. వచ్చే నెల 2న జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి పార్టీలో చేరనున్నారు. విశాఖపట్నంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం నెల్లూరులో బహిరంగ సభ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా శుక్రవారం వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆనం నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలోకి ఆహ్వానించడానికి వెళ్లి చేరిక తేదీ ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలను కూడా ఆనం కలవనున్నారు. -
మంత్రి సోమిరెడ్డికి ఝలక్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు ఇన్చార్జి వ్యవహారంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. సోమిరెడ్డి తన అనుచరుడు కన్నబాబును ఇన్చార్జిగా చేయాలని గట్టిగా ప్రయత్నించారు. అయితే పార్టీ అధిష్టానం తాత్కాలిక ఇన్చార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమించింది. ఇప్పటి వరకూ ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి కోసం నేతల మధ్య విభేదాలు కొనసాగాయి. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ అనుచరులకు ఇన్చార్జి పదవి కట్టబెట్టాలని పోటీ పడ్డారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా నెల్లూరు పార్లమెంట్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆదాల ప్రభాకరెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఆదాల ప్రభాకర్‌రెడ్డికి పూర్తిగా నియోజకవర్గం కొత్త కావటంతో పార్టీ అంతర్గత విషయాల్లో సమన్వయం చేసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను ఆదేశిచింది. ఈ క్రమంలో సోమవారం మంత్రులతో కలిసి ఆదాల ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో సమావేశం నిర్వహించనున్నారు. గత నెల రోజులుగా అధికార పార్టీలో ఆత్మకూరు నియోజకవర్గ వ్యవహారం రగడ కొనసాగుతుంది. ముఖ్యంగా గతంలో పోటీచేసి ఓడిపోయిన కన్నబాబుకు ఇన్చార్జి పదవి ఇవ్వాలని మంత్రి సోమిరెడ్డి బలంగా ప్రయత్నించారు. డీసీసీ బ్యాంకు చైర్మన్ మెట్టకూరు ధనుంజయరెడ్డికి ఇప్పించాలని ఒక దశలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రయత్నించి చివరికి ఆయన కూడా కన్నబాబుకే మద్దతు పలికారు. మరికొందరు పదవి ఆశించారు. ఈ క్రమంలో ఆత్మకూరు వ్యవహారంపై గత శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయకమిటీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఆత్మకూరు ఇన్చార్జిని కాకుండా ఐదుగురు సభ్యులతో సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే దీనికి నిరసనగా డీసీసీ బ్యాంకు చైర్మన్ ధనుంజయరెడ్డి గైర్హాజరు కావటం, హాజరైన కన్నబాబు ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో నేతల మధ్య వివాదం సాగుతున్న క్రమంలో చివరకు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని తాత్కాలిక ఇన్చార్జిగా నియమించారు. జిల్లా అధ్యక్షుడిపై పరిశీలకుడు ఫిర్యాదు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రపై పార్టీ జిల్లా పరిశీలకులు ఎరిక్సన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ అంతర్గత విషయాలు చర్చించటానికి, ఇతర పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఎరిక్సన్ బాబు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి
-
ఆనం ఆంతర్యం ఏంటి!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. సుదీర్ఘకాలంగా ఇరు కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాల క్రమంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంత్రి సోమిరెడ్డిని తీవ్రంగా విమర్శించటం. రైతులకు టీడీపీ దూరం అవుతుందంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసి మళ్లీ తీవ్ర చర్చకు తెరతీశారు. అధికార పార్టీ జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవటం, చివరకు ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా మంత్రి సోమిరెడ్డి మితిమీరిన జోక్యం నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా మరో మంత్రి పి.నారాయణను ఇరకాటంలో పడేశారు. ‘ఇక్కడ జరిగిందంతా చంద్రబాబునాయుడుకు మీరే చెప్పండి’ అంటూ ఆనం హితవు పలికారు. పర్యవసానంగా ఆనం భవిష్యత్తు అడగులు ఎటువైపు ఉంటాయి. పార్టీలోనే ఉండి పోరు కొనసాగిస్తారా లేక కీలక రాజకీయ నిర్ణయం తీసుకుంటారా అనేది ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. అడుగడుగునా అవమానాలే.. ఆనం రామనారాయణరెడ్డికి అధికార పార్టీలో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన ఆనం సోదరులకు పార్టీలో నాటి నుంచి నామామత్రపు ప్రాధాన్యం కూడా దక్కలేదు. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆనం రాంనారయణరెడ్డిని నియమించిన క్రమంలో అక్కడ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కన్నబాబును మంత్రి సోమిరెడ్డి, కొందరు పార్టీ జిల్లా నేతలు కీలకంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో అక్కడ విభేదాలు రోజురోజుకీ ముదిరి పాకాన పడి ఒకే కార్యక్రమాన్ని రెండు వర్గాలు నిర్వహించే పరిస్థితికి వచ్చింది. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా నుంచి ఏకైక మంత్రిగా పని చేసి జిల్లాలో చక్రం తిప్పారు. ముఖ్యంగా దివంగత వైఎస్సార్ హయాంలో ఆనం కుటుంబం జిల్లా రాజకీయాలను కొంత కాలం నడిపిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఈ క్రమంలో తదనంతరం అధికార పార్టీలోకి ఆనం రామ నారాయణరెడ్డి, ఆయన సోదరుడు దివంగత నాయకుడు వివేకానందరెడ్డి చేరారు. ఈ వ్యవహారంలో మంత్రి నారాయణ క్రియాశీలకంగా పనిచేశారు. అయితే పార్టీలోకి వచ్చే సమయంలో ఇచ్చిన హమీలు ఒక్కటి కూడా అమలు చేయలేదనే అసంతృప్తి ఆనం వర్గీయుల్లో బలంగా ఉంది. దీని కొనసాగింపుగా పార్టీ సమావేశాలకు ఆనంను ఆహ్వానించకపోవటం. జిల్లా నేతలు ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో గతంలో పలుమార్లు తన అసంతృప్తిని వెళ్ళకక్కారు. అయితే ఆనం వివేకా మరణంతో కొద్దిరోజులుగా రాజకీయాలకు ఆనం దూ రంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ మారతారనే ప్రచారం కూడా సాగింది. కొద్ది రోజుల విరామం తర్వాత పార్టీ ఇన్చార్జిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరులో మినీ మహానాడు నిర్వహించారు. అక్కడ కనీసం ఫ్లెక్సీలో ఆనం ఫొటో లేకపోవటంతో పాటు కన్నాబాబు ఫొటో ఉండటం. నియోజకవర్గ పరిణామాలు అన్నింటినీ చూసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను చార్జింగ్ లేని ఇన్చార్జినని 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇన్ని అవమానాలు పడలేదని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా మంత్రి సోమి రెడ్డి జిల్లా రైతులను పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించారు. రైతులను జైలులో వేసినా పట్టించుకోరు.. సోమశిల హైలెవల్ మొదటి దశ పనులు 30 శాతం కూడా పూర్తి కాకముందే రెండో దశకు టెండర్లు పిలిచి కమీ షన్లు ఎవరు తీసుకుంటున్నట్లు అని ప్రశ్నించారు. మనకు మనమే పాలన బాగుందని నివేదికలు తెప్పించుకుంటే ఉపయోగం ఉండదని వాస్తవ పరిస్థితులు చూసుకోవాలని హితవుపలికారు. పనిలో పనిగా చంద్రబాబుకు సన్నిహితుడైన మంత్రి నారాయణ ఇదంతా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరటం విశేషం. ఆనంతో ఆదాల భేటీ ఈ పరిణమాల క్రమంలో శనివారం నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డిని మాజీ మంత్రి ఆదా ల ప్రభాకర్‌రెడ్డి కలిశారు. నెల్లూరు పార్లమెంట్ నేత హోదాలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి సోమిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య కూడా రాజకీయ వై రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ భేటీ కావటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
టీడీపీ నేతల తీరుపై మాజీమంత్రి ఆనం ఫైర్..
సాక్షి, నెల్లూరు : ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల మంత్రి అఖిలప్రియ, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. నేడు టీడీపీ నేతల తీరుపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఆత్మకూరు మినీ మహానాడులో ఆనం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇన్ని అవమానాలు పడలేదని ఆయన తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వంపై 80 శాతం సంతృప్తి ఉందని చెప్పడం అబద్ధమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నా, జిల్లాలో వ్యవసాయ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆనం మండిపడ్డారు. మా సమస్యలు పట్టని ప్రభుత్వంలో మేము ఇంకా కొనసాగుతున్నామా అనే బాధ రైతుల్లో ఉంది, వారు తిరుగుబాటు చేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ఆనం తెలిపారు. ‘అధికార పార్టీ ఇంచార్జిగా ఉన్న చార్జింగ్ మాత్రం లేదు. నేను కేవలం జెండా పట్టుకోవడానికే సరిపోతానా. ప్రజల సమస్యలు తీర్చడానికి నేను పనికిరానా. మినీ మహానాడు పెట్టుకుని మనకు మనమే భజన చేసుకుంటూ ఉంటే సరిపోతుందా. అభివృద్ధితోనే గెలుపు సాధ్యం కాదు. కార్యకర్తలకు అండగా ఉన్నప్పుడే విజయం వరిస్తుంది. జిల్లాలో ఉన్న వారి వద్ద నుంచి మాకు వ్యతిరేకత వస్తున్నప్పుడు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. నియోజక వర్గంలో ఎన్నో సమస్యలు. అభివృద్ధిపై ఎన్నిసార్లు చంద్రబాబుకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం. సోమశిల హైలెవల్ కెనాల్ ప్రారంభించి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ముప్పై శాతం పనులు కూడా పూర్తి కాలేదు. మొదటి దశ పూర్తి కాకముందే రెండవ దశకు టెండర్లు పిలుస్తున్నారు. కమీషన్ల కోసమా లేక రైతులను మభ్యపెట్టడానికా’. అని ప్రభుత్వ తీరుపై ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. -
‘ఆనం’ సాక్షిగా తమ్ముళ్ల గలాటా
ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఇన్చార్జి కన్నబాబు వర్గాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. సోమశిల ఉత్తరకాలువ ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను పరిశీలించేందుకు బుధవారం ఆనం ఆత్మకూరు చెరువు వద్దకు వచ్చారు. తొలుత పూజలు చేసి నీటి సరఫరాపై సోమశిల ప్రాజెక్ట్ ఈఈ, సాగునీటి శాఖ డీఈలతో మాట్లాడారు. ఈ క్రమంలో కన్నబాబు వర్గానికి చెందిన చెరువు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు మాదాల మస్తాన్‌నాయుడు మాట్లాడేందుకు ప్రయత్నించగా సాగునీటి సంఘం అధ్యక్షుడు ఎక్కడంటూ ఆనం ప్రశ్నించారు. అదే సమయంలో ఆనంకు అనుకూలంగా ఉన్న రైతులు ‘గతంలో 2వ నంబర్ తూముకు నీళ్లు వచ్చేవని, ఇప్పుడు ఎందుకు రావడం లేదని’ ఉపాధ్యక్షుడిని నిలదీశారు. ‘మీ వల్లే నీళ్లు రావడం లేదు, మా పంటలు ఎండిపోతున్నాయి, ఆ తూము కింద 350 ఎకరాలు సేద్యం నీరు లేక ఆపామని’ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరుకు చెందిన ఆనం అనుకూలుడు, రైతు చిట్టమూరు వెంకురెడ్డి ‘మీ వంటి వాళ్లు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడిగా పనికి రారని, మీ అధ్యక్షుడు నీళ్ల సమస్య అడుగుతారనే ఇక్కడికి రాలేదని, ఇద్దరూ వెంటనే రాజీనామా చేయాలని’ చెప్పారు. స్పందించిన నీటి సంఘం ఉపాధ్యక్షుడు ‘మేము రాజీనామా చేస్తాం. మీకిష్టమొచ్చిన వారిని పెట్టుకోండి’ అని రుసరసలాడారు. అధికారులు మాత్రం 75 క్యూసెక్కుల నీటిని వదిలామని అంటున్నారే తప్ప ఒక్క చుక్క కూడా చెరువుకు నీరు రావడం లేదని, పొలాలు బీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తనిఖీ చేయాలి ఆనం మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కాలువపై తనిఖీలు చేయాలని, ఆత్మకూరు చెరువుకు కచ్చితంగా 60 క్యూసెక్కులు ఇవ్వాల్సిందేన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ, ఏఈ, సోమశిల ప్రాజెక్ట్ డీఈ, కమిషనర్ శ్రీనివాసరావు, డీఎస్పీ రామాంజనేయులరెడ్డి, టీడీపీ నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య, ఐవీ రమణారెడ్డి, చల్లా రవి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు పాల్గొన్నారు. ఒకేలా ఉన్నామని చెబుతున్నా.. ఆనం వర్గీయులు తమ వారిపై విమర్శలు చేయడంపై కన్నబాబు వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినుంచి పార్టీలో ఉన్న తమను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో చర్చకు దారితీసింది. గతంలో ఈ రెండు వర్గాల నాయకులు వాదనలకు దిగిన సందర్భాలున్నాయి. పైకి తామంతా ఒకేలా ఉన్నామని చెబుతున్నా అవకాశం చిక్కినప్పుడల్లా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. వీరి వల్ల పార్టీ పరువుపోతోందని కొందరు జిల్లా పార్టీ నేతలకు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు వీరి వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లింది. కాగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆనం వర్గీయులు కన్నబాబు వర్గ నేతలపై విరుచుకుపడ్డారని ప్రచారం జరుగుతోంది. -
టీడీపీ బలోపేతానికి కృషి
మాజీ మంత్రి, ఆత్మకూరు టీడీపీ ఇన్చార్జ్ ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు(వేదాయపాళెం): సమష్టి కృషితో జిల్లాలో టీడీపీరి బలోపేతం చేస్తామని మాజీ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో విభేదాలకు తావులేకుండా ముందుకు సాగాలన్నారు. తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబునాయుడు ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించారని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి పాటుపడతానన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో మెలగాలన్నారు. ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పరసా రత్నం, నెలవల సుబ్రమణ్యం, నాయకులు కిలారి వెంకటస్వామినాయుడు, కొండ్రెడ్డి రంగారెడ్డి, పట్టాభిరామిరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, హరిబాబు పాల్గొన్నారు. అనంతరం ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు, వెంకటగిరి, పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు ఆయనకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. -
జిల్లాలో టీడీపీ బలహీనం
పదవుల కోసం పార్టీలో చేరలేదు అందరితో మమేకమై పనిచేస్తాం టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆనం నెల్లూరు సిటీ : జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉందని, అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తాము పదవులు ఆశించి టీడీపీలో చేరలేదని, పార్టీలోని అందరితో మమేకమై పని చేస్తామన్నారు. నగరంలోని సంతపేటలో ఆయన నివాసంలో శుక్రవారం ఆనం కుటంబ సభ్యులు ఆత్మీయులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన పరిణామాల దృష్ట్యా టీడీపీలో చేరామన్నారు. టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం, ప్రజలపై పెత్తనం చేయడానికి తాను బాధ్యతలు స్వీకరించలేదన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీతో పోరాటం సంగ్రామం ఉంటుందన్నారు. శనివారం సీఎం చంద్రబాబును కలిసి భవిష్యత్ కార్యాచరణపై సూచనలు తీసుకుంటామని, 28న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులతో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకాందరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ఆత్మకూరులో తమ్ముళ్ల అలక ...!
నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అప్పగించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నియోజకవర్గంలో ఆనం వర్గీయులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ నియామకంపై ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు మోసిన గూటూరు కన్నబాబు అలిగి మొబైల్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. ఆయనకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా, ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు బాధ్యతలు అప్పగించబోతున్నారని జూన్ 3 వతేదీ ‘ఆనం కుటుంబానికి ఆత్మకూరు, నెల్లూరు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. వైఎస్సార్ సీపీ బలాన్ని తట్టుకోలేక.. ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిని ఎదుర్కోవడం కన్నబాబు వల్ల కాదని పార్టీ అధిష్టానం చాలాకాలం కిందటే ఒక అభిప్రాయానికి వచ్చింది. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలం తగ్గించక పోతే రాబోయే ఎన్నికల్లో కూడా ఈ సీటు కోల్పోవాల్సి వస్తుందని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకుని వచ్చి ఆత్మకూరు బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఆయనకు టీడీపీ తీర్థం ఇచ్చారు. ఆయన రాకను కన్నబాబు తీవ్రం గా వ్యతిరేకించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిం ది. అయితే పరిస్థితులన్నీ సర్దుబాటు చేశాకే రామనారాయణరెడ్డిని అధికారికంగా రంగంలోకి దించాలని పార్టీ అధిష్టానవర్గం భావించింది. కన్నబాబుతో పార్టీ పెద్దలు అనేక సార్లు చర్చించినా రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పని చేయడానికి ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆనం, కన్నబాబు వర్గాల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరలేదు. తనకు అధికారి కంగా బాధ్యతలు ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి వెళ్లబోనని రామనారాయణరెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక పార్టీ ని బలపరచుకోవడం మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో ఇటీవల సీఎం ఈ విషయం గురించి చర్చించారు. ఆనంకు అధికారికంగా బాధ్యతలు అప్పగిస్తూ వారం రోజుల ముందే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. మంగళవారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి కన్నబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నందువల్ల తర్వాత ఉత్తర్వులు ఇద్దామని రవిచంద్ర సూచించారు. మంగళవారం కన్నబాబు పుట్టిన రోజు వేడుకలు ముగియడంతో బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రామనారాయణరెడ్డిని ఇన్‌చార్‌్జగా నియమించారనే సమాచారం తెలియడంతో బుధవారం ఉదయం నుంచి కన్నబాబు, ఆయన ముఖ్య అనుచరులు సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. మరోవైపు రామనారాయణరెడ్డి మద్దతుదారులు ఆత్మకూరు నియోజకవర్గంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కన్నబాబుకు పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఉన్న పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు జిల్లా పార్టీ నాయకత్వం ఆయన్ను బుజ్జగించే పనిలో పడింది. నెల్లూరులో ఇటీవల నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో తాము కన్నబాబు మాట వినాలా? ఆనం రామనారాయణరెడ్డి మాట వినాలా? అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్ధా రాఘవరావును అడిగామని, ఆయన కన్నబాబు మాటే వినాలని చెప్పారని గూటూరు మద్దతు దారులు చెబుతున్నారు. ఇప్పుడు రామనారాయణరెడ్డిని తమ నియోజకవర్గ బాధ్యుడిగా నియమిస్తే ఆయనతో ఎలా కలిసి పనిచేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మొదలైన వెంకటగిరి రాజకీయం!
► గంగాప్రసాద్ మేనల్లుడు నానాజీ అరంగేట్రం ► రాపూరుపై ఆనం కన్ను ► పెంచలకోనలో నానాజీ అభినందనసభ ► ఆనం కార్యకర్తల పరిచయ కార్యక్రమాలు ► బలనిరూపణ వేదికలేనా? వెంకటగిరి : సార్వత్రిక ఎన్నికలు మూడేళ్లు ఉండగానే వెంకటగిరి రాజకీయ చిత్రం మారుతోంది. 2019లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి రాపూరు నియోజకవర్గం ఏర్పాైటైనా, లేకపోయినా వెంకటగిరి నియోజకవర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తెరవెనుక వ్యూహాలు పన్నుతున్నారు బడా నేతలు. సీఎం చంద్రబాబునాయుడుకు సన్నిహితుడైన సూళ్లూరుపేటకు చెందిన గంగాప్రసాద్ తన మేనల్లుడు తానంకి నానాజీకి పెంచలకోన ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి ఇప్పించి అధ్యయనం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఈనెల 20న అభినందన సభ నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులను ఆహ్వానించాలనుకున్నారు. అయితే 20న సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం కావడంతొ మంత్రులు విజయవాడ తరలనుండటంతో కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాపూరు కేంద్రంగా ఈనెల 27న కార్యకర్తల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో రాపూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపోందడంతొ ఈ ప్రాంతంలో గట్టి పట్టున్న నేతలతొ నేటికీ సత్సంబంధాలు నెరుపుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతొ ఆపార్టీ కేడర్‌తో సత్సంబంధాలు నెరపేందుకు వ్యూహ ంసిద్ధం చేస్తున్నారు. అసమ్మతి నాయకుల ఆసక్తి: పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో పనిచేసిన సీనియర్ నాయకులు, ఇతర పార్టీల నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు నాయకులకు ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణకు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కీలకనేత గంగాప్రసాద్ వర్గం వెంకటగిరి రాజకీయాల్లోకి అడుగుపెడుతుండడం అసమ్మతినేతల చూపు ఆనం, నానాజీలపై పడింది. వారం క్రితం డక్కిలిలొ జరిగిన ఓ కార్యక్రమంలొ లింగసముద్రం సింగిల్‌విండో అధ్యక్షుడు వేముల రాజమోహన్‌నాయుడు ఎమ్మెల్యే రామకృష్ణ సమక్షంలొ టీడీపీలో చేరారు. ముందు నుంచి ఆనం వర్గం నేతగా ముద్రపడ్డారు. రాపూరుకు చెందిన కీలకనేత చెన్ను బాలకృష్ణారెడ్డి ఆనంకు సన్నిహితుడు కావడంతొ మరో అధికార కేంద్రం ఏర్పాటు కానుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తానంకి నానాజీ కి టీడీపీ ప్రధానకార్యదర్శి నారాలోకేష్తొ సన్నిహిత సంబంధాలు ఉండడంతొ ఆయన నియోజకవర్గంలో కీలకనేతగా మారబోతున్నారు. ఈ పరిణామాలు ఊపిరి పోసుకుంటే ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణకు భవిష్యత్తులో కష్టకాలం తప్పదని పలువురు చర్చించుకుంటున్నారు. స్థానికేతరులకు కలిసొచ్చిన వెంకటగిరి వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన స్థానికులు ఎమ్మెల్యేగిరితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి ఎన్నికైన స్థానికేతరులు మాత్రం మంత్రి, ముఖ్యమంత్రిగా పదవులు అందుకున్న చరిత్ర వెంకటగిరి సోంతం. పాదిలేటి వెంకటస్వామిరెడ్డి, కమతం షణ్ముగం, అల్లం కష్ణయ్య, ఒరేపల్లి వెంకటసుబ్బయ్య, సాయికష్ణయాచేంద్ర, వివిఆర్కే యాచేంద్ర, కురుగొండ్ల రామకష్ణలు ఎమ్మెల్యేలుగా గెలిచినా అంతకుమించి ఎదగలేదు. స్థానికేతరులైన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి 1978లో ఇక్కడి నుండి ఎన్నికై తొలిసారి పంచదార శాఖ మంత్రిగా అడుగుపెట్టారు. 1983లో ఎన్నికయిన నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పంచాయతీరాజ్ చాంబర్ ఛైర్మన్, 1989లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాకే నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి సైతం 2004లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక రాష్ట్రమంత్రిగా పనిచేశారు. -
శ్రీకాళహస్తిలో ఆనం కుమారుడి వీరంగం
తిరుపతి: పదవి ఉంది.. డబ్బు ఉంది.. వ్యవస్థతో ఎలా అయినా ఆడుకోవచ్చు అనుకుంటున్నారు నేతల కుమారులు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడి కీచక పర్వం మరచిపోకముందే తాజాగా మరో నాయకుడి కుమారుడు రెచ్చిపోయాడు. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయుడు శ్రీకాళహస్తిలో వీరంగం సృష్టించాడు. శివరాత్రి సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తికి వెళ్లిన ఆనం శుభకర్ రెడ్డి తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ అధికారులపై చిందులు వేశాడు. దర్శనం కల్పిస్తారా లేదా అంటూ ఈవో భ్రమరాంబపై ఒత్తిడి తీసుకు వచ్చాడు. అందుకు నిరాకరించిన ఈవో పై శుభకర్ రెడ్డి అంతు చూస్తానంటూ దుర్భాషలాడినట్టు సమాచారం. 'గతంలో ఎంతోమంది అధికారులను బదిలీ చేయించా. సీఎం చంద్రబాబు తో మాట్లాడి నీ కథ తేలుస్తా' అంటూ ఈవో భ్రమరాంబపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు శ్రీకాళహస్తిలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దర్శనం వివాదాస్పదమవుతోంది. బాపిరాజుకు ఈ రోజు ప్రత్యేక దర్శనం కల్పించడంపై ఆలయ చైర్మన్, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్ఎల్ఏ లకే లేని సౌకర్యాన్ని బాపిరాజుకు ఎలా కల్పిస్తారంటూ ఆలయ అర్చకులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆగ్రహంతో భక్తుల ఎదుటే వారిపై తిట్ల పురాణానికి దిగారు. -
టీడీపీలో చేరిన ఆనం సోదరులు
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆనం సోదరులు బుధవారం టీడీపీలో చేరారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి తమ జిల్లాకు చెందిన మంత్రి పి.నారాయణతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. చంద్రబాబు.. ఆనం సోదరులకు పచ్చకండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారి హోదాను గుర్తించి పార్టీలో ఆనం సోదరులకు తగిన గౌరవం, పదవులు దక్కుతాయని బాబు పేర్కొన్నట్లు సమాచారం. తిరిగి సొంతగూటికి వచ్చినట్లు భావించాలని బాబు వారికి సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరిక అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తమ నిర్ణయం వెల్లడించాలని నిర్ణయించుకున్నందున నేడు అధికారికంగా వివరాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నా తాము.. గత ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా బరిలో దిగామని, అధిష్ఠానం వైఖరిలో మార్పు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏదైనా తప్పు జరిగిందని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికీ భావించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకతతో టీడీపీలో చేరాల్సి వచ్చిందన్నారు. -
కాంగ్రెస్‌కు ఆనం బ్రదర్స్ గుడ్‌బై
కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన ఇంట్లో అన్న ఆనం వివేకానంద రెడ్డితో కలిసి తమ మద్దతుదారులతో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల మాటలను అధిష్ఠానం పెడచెవిన పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వివరించారు. తాము కాంగ్రెస్‌లో 25 ఏళ్లుగా ఉన్నామని తెలిపారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచే జిల్లాలో తమ రాజకీయ భవిష్యత్తుపై మీడియాలో, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోందన్నారు. ఈ చర్చకు తెరదించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి వారి అభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు. కార్యకర్తలు తాను ఏ పార్టీలో చేరినా అండగా నిలబడతామని చెప్పడం సంతోషకరమని రామనారాయణరెడ్డి అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా పార్టీలో చేరాల్సిందిగా తనపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల గ్రాఫ్ ఇప్పుడు మరింత దిగజారిపోయిందని తెలిపారు. తమను నమ్ముకున్న ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే బలమైన పార్టీలో చేరడం తప్పదని, అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామని తెలిపారు. టీడీపీలో చేరే తేదీలను మరో మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. -
రఘువీరా మట్టి యాత్ర... ఒట్టి యాత్రే
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం మండిపడ్డారు. రఘువీరారెడ్డి చేపట్టిన మట్టియాత్ర... ఒట్టియాత్ర అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల్లో చైతన్యం లేకుండా ఎన్ని యాత్రలు చేపట్టిన వృథానే అని ఆనం స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడంపై ఆనం ఈ సందర్భంగా స్పందించారు. చంద్రబాబును కలిసేందుకు ఎందుకు వెళ్లారో పవన్ కల్యాణ్‌కే తెలియదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మట్టి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఒక రాష్ట్రానికి సీఎం..పక్క రాష్ట్రంలో ఇలా చేయడం నీతా?
నెల్లూరు :ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనాలని చూసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నైతిక విలువలు లేవని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవని సాక్షాత్తూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆరే అన్నారన్నారు. తాను పునీతుడినని చెప్పుకొనే బాబు తెలంగాణ ఎంఎల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేను కొనాలని రేవంత్‌రెడ్డిని పంపడం సిగ్గుచేటన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో డీసీసీ నిర్వహించిన ప్రత్యేక హోదా, దుగ్గరాజు పట్నం పోర్టు సాధన సదస్సులో మంగళవారం ఆనం ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోకేష్‌కు అడ్డం రాకుండా ఉండేందుకే రేవంత్‌రెడ్డిని బాబు బలిపశువును చేశాడని ఆరోపించారు. నిద్రలేస్తే నిజాయితీపరుడ్ని అని చెప్పుకొనే బాబు ఒక రాష్ట్రానికి సీఎం అయ్యి పక్క రాష్ట్రంలో ఇలా చేయించడం నీతా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఉద్యోగులను రాజధానికి రావాలని చెబుతున్న బాబు హైదరాబాద్‌లో బాడుగ ఇంటిపేరుతో ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. దుగ్గరాజపట్నం పోర్టు ఏర్పాటుకు యూపీఏ హయాంలో అంతా సిద్ధమైందని, అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఉన్న కృష్ణపట్నం పోర్టుకు లబ్ధి చేకూర్చేందుకే దుగ్గరాజపట్నం పోర్టు పనులను ప్రారంభించడం లేదని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇచ్చిన డబ్బుతో బాబు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతున్నారని, వారికి నష్టం చేయడం బాబుకు ఇష్టం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి, గంగాధరం, నాయకులు పనబాక కృష్ణయ్య, చెంచలబాబు యాదవ్, భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కల్పించేంత వరకూ పోరాటం
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు(బారకాసు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేంత వరకూ పోరాటం చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయడం తదితర అంశాలను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రధాన ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కొడవలూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో జరిగి ఈ ధర్నాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. జిల్లాకు చెందినవారిలో ఒకరు కేంద్రమంత్రి, మరొకరు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. చంద్రబాబుకు రెండు జేబులు తానేనంటూ గొప్పలు చెబుతున్న మంత్రి నారాయణ జిల్లా విషయంలో మాత్రం ఆ రెండు జేబులు పనిచేయడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు దుగ్గరాజుపట్నంపోర్టుకు అవసరమైన చర్యలు చేపట్టి, పోర్టు నిర్మాణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ.25 వేల కోట్లు అవసరమని నిర్ణయించిందన్నారు. నేటి ప్రభుత్వాలు ఆ విషయంలో ఏవేవో కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. విద్యావ్యాపారవేత్తగా ఉన్న నారాయణ నేడు మంత్రి పదవి చేపట్టి కేవలం తన సంస్థలను అభివృద్ధి చేసుకునేందుకే శ్రద్ధ చూపుతున్నారే తప్ప రాష్ట్రంపై చూపడం లేదన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురావయ్యా అని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతుంటే.. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని, మలేషియాలా మారుస్తానని రూ.కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియో గం చేసి ప్రత్యేక విమానంలో పర్యటనలు చేస్తున్నారన్నారు. ‘ప్రజలను మాయమాటలతో మోసం చేసి గద్దెనెక్కావ్.. ఇక ఐదేళ్లు ఏమవుతుందిలే.. అనుకుంటున్నావేమో.. వదిలే ప్రసక్తే లేదు’ అంటూ హెచ్చరిం చారు. రాష్ట్రాన్ని చంద్రబాబు జపాన్, సింగపూర్‌కు కుదవపెట్టబోతున్నారని, తానేమి తక్కువ తినలేదని మంత్రి నారాయణ ఏకంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను తాకట్టు పెట్టబోతున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఏ విషయం అడిగినా అన్నింటికీ లోటు బడ్జెట్ అంటూ మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. ‘ఇకనైనా నిజం చెప్పు చంద్రబాబూ రాష్ట్ర విభజన విషయంలో మొదటి సంతకం పెట్టింది నువ్వే కదా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అర్థం చేసుకుని ప్రత్యేకహోదా కోసం తాము చేసే పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుశ్రీ, నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, వెంకట్రావు, రమణయ్యనాయుడు, చెంచలబాబుయాదవ్, సంగంషఫీ, నగర అధ్యక్షుడు ఏసీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ రంగమయూర్‌రెడ్డి, యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కె.వినోద్‌రెడ్డి, పిండి సురేష్, బర్నాబాస్, షణ్ముఖం, శివాచారి, ఎన్ఎస్యూఐ నాయకుడు ప్రేమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
'టీడీపీ ఎందుకు భయపడుతోంది'
అనంతపురం : విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ఇతర హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమయ్యిందని కాంగ్రెస్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి విమర్శించారు. హామీలను సాధించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నతెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీల డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే దీక్షలో పాల్గొనేందుకు ఆయన సోమవారం అనంతపురం జిల్లా కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. హామీ ఇవ్వని ఇసుక రవాణా చేపట్టి ఇసుక మాఫీయాని తయారు చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం ఒక్కటే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాణప్రదమన్నారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదన్నారు. ఈ విషయంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు బాధను వ్యక్తం చేశారన్నారు. రెక్కలు విరిచేసి ఎగరమంటే ఎలాగంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మంత్రి పదవుల కోసం బీజేపీతో కొనసాగడం ఎందుకుని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల నమ్మకాలను వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రజలు, ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు పలికారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ పాల్గొన్నారు. -
టీడీపీలో చేరాలని ఆహ్వానం అందలేదు: ఆనం
హైదరాబాద్: టీడీపీలో చేరాలని ఆహ్వానం అందలేదని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ కు చావుదెబ్బ తగలడంతో ఇటీవల కాలంలో ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్టు ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా 35 ఏళ్ల అనుబంధం ఉందని ఓ ప్రశ్నకు మాజీ మంత్రి ఆనం సమాధానమిచ్చారు. గతంలోనూ టీడీపీలో పనిచేశాను... ఆ పార్టీ నేతలతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఆనం అన్నారు. అయితే తాను టీడీపీలో చేరే ఆలోచనలో ప్రస్తుతం లేనని... ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. -
రాజకీయాలకు అనం గుడ్ బై?
-
'సమైక్యాంధ్ర ' ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం
ఆనం సోదరులపై జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి ఆదివారం నెల్లూరులో నిప్పులు చెరిగారు. గతంలో తమ తాతలు... తండ్రులు ప్రజా బలం కోసం తాపత్రయ పడ్డారని... ప్రస్తుతం వివేకానంద, రాంనారాయణ రెడ్డిలు ధనబలం పెంచుకునే క్రమంలో దిగజారిపోయారని ఆరోపించారు. రావణాసురిడి గుణం వివేకానంద రెడ్డిలో ఉందని జయకుమార్ రెడ్డి విమర్శించారు. వివేకాంద, రాం నారాయణలు ఇద్దరు ఇద్దరే అని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర పార్టీ తరఫున నెల్లూరు సీటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు జయకుమార్ రెడ్డి వెల్లడించారు. -
ఎటు వెళ్దాం?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఆత్మకూరు నుంచే మళ్లీ బరిలోకి దిగాలా? లేక నెల్లూరు రూరల్‌కు వెళ్లాలా? ఈ రెండింటిలో ఏదైతే మనకు సేఫ్? మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మెదడును ఈ ప్రశ్నలు తొలచివేస్తున్నట్లు సమాచారం. అటో, ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఆయన శుక్రవారం తన సన్నిహితులైన ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. రామనారాయణరెడ్డి ఆత్మకూరు నుంచి గత ఎన్నికల్లో గెలుపొంది కీలకమైన ఆర్థిక మంత్రి పదవి సంపాదించారు. అధికార బలంతో వందల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పేరుతో నియోజకవర్గంలో కుమ్మరింపజేశారు. ఇందులో వాస్తవంగా జరిగిన అభివృద్ధి ఎంత? అనే విషయం పక్కన పెడితే ఆయన మద్దతుదారులు, స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఆర్థికంగా బాగానే అభివృద్ధి చెందారనేది నిర్వివాదాంశం. ఈ ధీమాతోనే మళ్లీ ఆత్మకూరులో తాను గట్టెక్కగలననే ధీమాతో ఆనం నిశ్చయంగా గడుపుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిన ప్రభావం అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ఆనం ఇలాకాలో కూడా పడింది. కాంగ్రెస్ పేరు చెబితేనే జనం మాట అటుంచి నిన్నమొన్నటి దాకా ఆ పార్టీతో మమేకమైన నాయకులే ఆమడ దూరం పారిపోయే పరిస్థితి ఏర్పడింది. తాను చేసిన అభివృద్ధి మంత్రం వర్కవుట్ అవుతుందేమోనని మున్సిపల్ ఎన్నికల్లో ట్రయల్ రన్ నిర్వహించిన ఆనంకు ఆశించిన ఫలితం దక్కే సూచనలు కనిపించలేదు. ఆ ఎన్నికల్లో అన్ని వార్డులకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇదే సీన్ పునరావృతం అయింది. పిలిచి టికెట్ ఇస్తానని చెప్పినా మా కొద్దు బాబోయ్ అంటూ పార్టీ నేతలు పరుగులెత్తడం ప్రారంభించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రామనారాయణరెడ్డి చేతులెత్తేశారు. కనీసం హస్తం గుర్తుకు ఓటేయండి అని గ్రామాల్లో ప్రచారం చేయడానికి కూడా ఆయన సాహసించలేక పోయారు. ఇలాంటి అనానుకూల వాతావరణంలో మళ్లీ ఆత్మకూరు నుంచే పోటీ చేస్తే సీన్ సితార్ అవుతుందని ఆనం ఆందోళన చెందుతున్నారు. పోటీ చేస్తే ఒక ఇబ్బంది, చేయక పోతే భయపడి పోయాడనే పేరు వస్తుంది. ఏం చేయాలబ్బా అని కిందా మీదా పడుతూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న తరుణంలో టీడీపీ- బీజేపీ పొత్తు రాజకీ యం ఆయన నెత్తిన పాలుపోసినంత పనిచేసిందని రామనారాయణరెడ్డి సన్నిహితులు అంటున్నారు. ఈ స్థానం బీజేపీకి కేటాయించడం, ఆరు నూరైనా తాము ఇక్కడి నుంచే బరిలోకి దిగుతామని ఆ పార్టీ నాయకులు ప్రకటించడం ఆనం ఆశలకు మరింత బలమిచ్చినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ తమ సొంత నియోజకవర్గం కావడం, ఇక్కడ ప్రతి గ్రామంలో ఎవరు ఏమిటో తమకు అవగాహన ఉండటంతో ఈసారి ఎన్నికల్లో రూరల్ సీటు ఎంచుకోవడమే శ్రేయస్కరంగా ఆనం అంచనా వేశారని తెలిసింది. తాను ఇక్కడి నుంచి పోటీకి దిగితే తెలుగుదేశం శ్రేణుల మద్దతు సంపాదించి, తమ సొంత బలం జోడిస్తే కనీసం పోటీలో అయినా నిలవచ్చని ఆయన లెక్కలు కట్టినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. తన మనసులోని మాటను, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తన సన్నిహితులైన ముఖ్యుల ముందుంచి వారి మద్దుతు సంపాదించాలని రామనారాయణరెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలను నెల్లూరులోని తన నివాసంలో జరిగే సమావేశానికి ఆహ్వానించారు. వారి నుంచి కూడా సరేననిపించుకున్న తర్వాతే సీటు మార్పిడి ప్రకటన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సిటీ నుంచి సుబ్బారెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించడానికి ఆనం కుటుంబీకులు నిర్ణయించారు. వివేకానందరెడ్డి ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచీ పోటీ చేయరాదని భావిస్తున్నట్లు సమాచారం. నేను రాను... టీడీపీలో చేరాలని ఆహ్వానం అం దుకున్న డీసీసీ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఇందుకు నో చెప్పారు. ఆత్మకూరు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిన టీడీపీ నేతలు రెండు రోజుల్లో ఏ నిర్ణయం చెప్పాలని మెట్టుకూరును కోరారు. ఆనం రామనారాయణరెడ్డితో చర్చించిన అనంతరం ధనుం జయరెడ్డి మీతో కలవలేనని టీడీపీ నేతలకు స్పష్టం చేశారని తెలిసింది. -
రాజధానిపై దృష్టి సారించలేదు: ఆనం
హైదరాబాద్: సీమాంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మధ్య, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని సీమాంధ్ర పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల కోసం స్వల్పకాలిక ప్రణాళిక తయారు చేయాలని యోచిస్తోంది. ఎన్నికల అజెండా చర్చించేందుకు ఇందిరాభవన్‌లో సీమాంధ్ర పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ సమావేశమయింది. రాయలసీమ పారిశ్రామిక, టూరిజం కారిడార్, రోడ్డు, రైల్వే, ఎయిర్‌పోర్టు, వాణిజ్య రవాణా వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది. సీమాంధ్రకు రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపై దృష్టి సారించలేదని పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సీమాంధ్రలో సోనియా, రాహుల్ ప్రచారం చేస్తారని చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో మ్యానిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు. -
కప్పదాట్లు సాధారణమే: ఆనం
హైదరాబాద్ : పీసీసీ పదవి బాధ్యతలు ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని మాజీమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో కప్పదాట్లు సాధారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ జాబితాలో ఉన్నారని ఆనం తెలిపారు. కాగా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై కాంగ్రెస్ నేతలు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, కొండ్రు మురళి తదితరులు శనివారం సమావేశం అయ్యారు. ఎన్నికల కమిటీ, మ్యానిఫెస్టో కమిటీ...ప్రచార కమిటీ ఏర్పాటుపై తదితర అంశాలపై వారు కసరత్తు నిర్వహించారు. -
ఓట్లకు ఎర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాతరకు తెర లేపబోతున్నారు. మార్చి 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రూ.273 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజల్లో రాష్ట్ర విభజన సెగలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఈసారి ఎన్నికల్లో తనకు కూడా ఇబ్బంది కలగొచ్చని రామనారాయణరెడ్డి భావిస్తున్నారు. అయితే తాను కాంగ్రెస్‌లో ఉండటమే కాకుండా అనివార్యంగా జిల్లాలో ఆ పార్టీ బాధ్యతలు కూడా తలకెత్తుకోవాల్సి వచ్చింది. దీంతో సీఎం రాజీనామాకు ముందు తన నియోజకవర్గం ఆత్మకూరుకు వందల కోట్ల రూపాయల వ్యయమయ్యే పనులు మంజూరు చేయించుకున్నారు. నియోజకవర్గంలో ఈ పనులు ప్రారంభించడం వల్ల అభివృద్ధి నినాదంతో జనాన్ని ఓటు అడగవచ్చనే ఎత్తుగడ వేశారు. దీనికి తోడు ఈ పనులను తమ మద్దతుదారులు, ఓటర్లకు ప్రభావితం చేయగలిగే వారికి కట్టబెట్టడం ద్వారా ఎన్నికల లబ్ధిపొందాలనే వ్యూహరచన ఇందులో జోడించారు. రాజధాని నుంచే జిల్లా అధికారులకు ఈ నెల 3వ తేదీ తన నియోజకవర్గంలో ఎన్నికల శంకుస్థాపనలు, ఇప్పటికే పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలు ఒక్కటి కూడా వదలకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. మంత్రిగా ఇప్పుడు ఆయన వేస్తున్న శిలాఫలకాలకు సంబంధించిన పనులన్నీ పూర్తి అవుతాయా? లేదా? శంకుస్థాపనలు చూసి జనం ఓట్లు వేస్తారా? అనే సంగతి వేచిచూడాల్సి వుంది. -
కిరణ్ బండారం బయటపెడతా: ఆనం
-
కిరణ్ బండారం బయటపెడతా: ఆనం
హైదరాబాద్: రాష్ట్రపతి పాలనపై కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఉన్నప్పటికీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నందున కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర, తెలంగాణకు త్వరలో రెండు పీసీసీలు ఏర్పడతాయని తెలిపారు. ఎన్నికల ముందు రాజకీయ వలసలు సహజమే అన్నారు. అధికారమే పరమావధిగా భావించే అవకాశవాద నేతలు, వెన్నుపోటు దారులే పార్టీని వీడారని దుయ్యబట్టారు. కొత్త పార్టీ పెట్టాక కిరణ్ బండారాలన్నీ బయటపెడతామని ఆనం హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రానికా, రెండు రాష్ట్రాలకా అనేది రాష్ట్రపతి, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు. -
హస్తాన్ని వదలా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో తానే సారథ్యం వహిస్తానని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మీద శుక్రవారం ఆయన నేరుగా ధ్వజమెత్తడం ద్వారా మరోసారి అధిష్టానానికి తన విధేయత ప్రకటించుకున్నారు. రాష్ర్ట విభజన అంశం తెర మీదకు వచ్చినప్పటి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ హైకమాండ్‌పై ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాత్రం ఇందుకు భిన్నమైన బాట ఎంచుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతూ వచ్చారు. విభజన ప్రక్రియ జరిగే సమయంలో కూడా రామనారాయణరెడ్డి అమ్మ(సోనియా)కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. విభజన బాధాకరమే అంటూనే ఇదే సందర్భంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యం అనేలా వ్యవహరిస్తూ వచ్చారు. సీఎం రాజీనామా చేస్తారనే వార్తలు బయటకొచ్చినప్పటి నుంచి విధేయత మోతాదు మరింత పెంచారు. జిల్లాలోని పార్టీ శాసనసభ్యులు, ముఖ్య నేతలు పార్టీ మారే పనిలో పడ్డా, తమకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడం, ఇప్పుడు కాకపోయినా ఇంకొంత కాలానికైనా కాంగ్రెస్ హైకమాండ్ తమ కోరిక తీర్చదా అనే ఆశతో తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామంటూ ప్రకటిస్తూ వచ్చారు. లోక్‌సభ, రాజ్యసభలో విభజన బిల్లుకు ఆమోద ముద్రపడిన అనంతరం శుక్రవారం రాజధానిలో తొలిసారి ఆయన ఈ అంశంపై నోరు విప్పారు. అంతా అయ్యాక ఇక చేయగలిగిందేమీ లేదనీ, విభజన బాధాకరమే అయినా కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే వచ్చిందనీ, మంత్రిగా తాను పనిచేశానంటే కాంగ్రెస్ కార్యకర్తగానే తనకీ స్థాయి వచ్చిందని ఆయన చెప్పుకున్నారు. హస్త రక్షకుడిని తానేననీ, కాంగ్రెస్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి నిలబెడతామని ప్రకటించుకోవడం ద్వారా జిల్లాలో నేదురుమల్లి వర్గం మళ్లీ క్రియాశీలకం కాకుండా అడ్డుకట్టవేసే వ్యూహానికి పదును పెట్టారు. త్వరలోనే నెల్లూరులో జిల్లా స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ వల్లే సీమాంధ్రకు ప్యాకేజీ వచ్చిందనే నినాదంతో మరోసారి జనం వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాలు, ఎంపీ అభ్యర్థులందరినీ తన వారినే బరిలోకి దించడం ద్వారా జిల్లాలో కాంగ్రెస్ అంటే తామేననీ, తామంటే కాంగ్రెస్ అనే విధంగా పార్టీ మీద పట్టు సాధించే ఎత్తుగడ వేశారు. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాగూ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదని తెలిసినా, కేంద్రంలో అవకాశం ఉండొచ్చేమోననే ఆశ ఆనంతో ఈ అడుగులు వేయిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచినా తర్వాత రెండు రాష్ట్రాలకు సీఎంలను, కేబినెట్‌ను నియమిస్తుందని ఆనం గట్టిగా నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అవసరాల రీత్యా కూడా రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో అందరికంటే ముందుగానే ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ కాంగ్రెస్ జెండాను భుజానికెత్తుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
పిరికిపందల్లా పారిపోతారా ?
సీఎంతో సహా రాజీనామాలు చేస్తున్న నేతలపై ఆనం, రఘువీరా ధ్వజం సాక్షి, హైదరాబాద్: పదవులన్నీ అనుభవించి పార్టీ కష్టాల్లో ఉన్నపుడు రాజీనామాలు చేసి పిరికిపందల్లా పారిపోతారా అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న నేతలపై సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్. రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టడం సరికాదన్నారు. పార్టీని ఏ ఒక్కరూ విడిచి వెళ్లరాదని, సీమాంధ్రలో కాంగ్రెస్‌ను రక్షించుకోవలసిన బాధ్యత కార్యకర్తలందరిపైనా ఉందని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధి మళ్లీ కాంగ్రెస్ వల్లనే సాధ్యమన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరగకుండా చూడాలని ప్రయత్నించినా చివరకు విఫలమయ్యామన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ అభివృద్ధి సాధించేలా నేతలంతా పనిచేయాలన్నారు. విభజన తప్పు మొత్తాన్ని కాంగ్రెస్పైకే నెట్టేయడం తగదన్నారు. ప్రతిపక్షాలు సీమాంధ్రుల గొంతుల్ని తడిగుడ్డతో కోశాయన్నారు. కాంగ్రెస్‌ను బతికించుకోవడానికి ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తరఫునే పోటీచేస్తామని ప్రకటించారు. రాజధాని ఎక్కడన్న అంశంపై పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయానికి రాజకీయ నేతలతో పాటు మీడియా కూడా దోషేనని ఆనం ఆరోపించారు. సమైక్యాంధ్రను 60 ఏళ్ల పాటు అభివృద్ధి చేశామని, సీమాంధ్రను పదేళ్లలో పురోగతి బాట పట్టిస్తామన్నారు. మీడియా సమావేశానంతరం ఆనం, రఘువీరా కాంగ్రెస్ టోపీ ధరించి, జెండాలు చేబూని కార్యాలయం బయట మీడియా కెమెరాల ముందు నిలబడ్డారు. వారి కార్లకు ఉన్న జాతీయ జెండాల స్థానంలో పార్టీ జెండాలను పెట్టించారు. ఈలోగా అక్కడకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంద్రసేనారెడ్డి, యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలకు పార్టీ జెండాలు అందించారు. -
'విభజనలో మా తప్పుందని ఒప్పుకుంటున్నాం'
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పాత్ర ఉందని తాము అంగీకరిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, మంత్రి రఘువీరా రెడ్డిలు పేర్కొన్నారు. విభజనలో తమ తప్పుందని ఒప్పుకుంటున్నట్టు వారు తెలిపారు. కాంగ్రెస్ సారథ్యంలో ఇన్నాళ్లు పదవులు అనుభవించి కాంగ్రెస్‌ను వీడటమేనది సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నుంచి కిందిస్థాయి నేతల వరకు తగదని వారు అభిప్రాయపడ్డారు. ఇకపై తాము సీమాంధ్ర అభివృద్ధికి కావాల్సినవి అడిగి సాధించుకునే ప్రయత్నం చేస్తామని ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డిలు చెప్పారు. -
'మా తప్పు ఉందని ఒప్పుకుంటున్నాం'
హైదరాబాద్ : రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పాత్ర ఉందని అంగీకరిస్తున్నామని మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నుంచి కిందస్థాయి నేతల వరకూ చేసిన సమైక్య ప్రయత్నాలు విఫలం అయ్యాయని అన్నారు. విభజనలో తమ తప్పు ఉందని ఒప్పుకుంటున్నామని వారు అంగీకరించారు. ఇన్నాళ్లు పదవులు అనుభవించి... ఇప్పుడు కాంగ్రెస్ కష్టాల్లో, నష్టాల్లో ఉందని వెన్ను చూపడం ....సీఎం కిరణ్ నుంచి కిందిస్థాయి నేతల వరకూ తగదని ఆనం, రఘువీరా వ్యాఖ్యానించారు. తాము జిల్లా కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా పని చేయటానికి కూడా సిద్ధమని పీసీసీ అధ్యక్షుడికి తెలిపామని మంత్రులు చెప్పారు. సీఎం సహా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తామంటున్న పలువురు నేతలు పునరాలోచన చేసుకుని పార్టీలోనే కొనసాగాలని కోరుతున్నామన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఏంకావాలో చెప్పడంలో అన్ని పార్టీలు విఫలం అయ్యాయన్నారు. ఇందులో మీడియాకు భాగస్వామ్యం ఉందని ఆనం, రఘువీరా వ్యాఖ్యానించటం విశేషం. వైఫల్యాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని.... ఇక నుంచి సీమాంధ్రకు కావాల్సినవి అడిగి సాధించుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు, రాష్ట్రపతి పాలనకు అవకాశాల గురించి నిన్న గవర్నర్ నరసింహన్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. -
'ఓ చోట పొగడ్తలు... మరో చోట తిట్లు'
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఉభయ సభలలో ఆమోదం పొందిన నేపథ్యంలో విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల చేయగలిగిందేమి లేదని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామ్‌నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ ... ఇరు ప్రాంతాల ప్రజలు కలిసి ఉండాలన్న తమ ప్రయత్నం విఫలమైందన్నారు. రాష్ట్ర విభజనపై అనేకమంది అనేకరకాలుగా మాట్లాడుతున్నారన్ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిర్ణయం తీసుకోలేదన్నారు. అన్ని పార్టీల సహకారంతోనే రాష్ట్ర విభజన జరిగిందన్న నిజాన్ని అందరు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే, మరో ప్రాంత ప్రజలు చేస్తున్న నిందలు భరించవలసి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తమందరిపై ఉందని ఆనం రాంనారాయణ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
సింగిల్ డే సీఎంగానైనా....
నెల్లూరు : రాష్ట్ర విభజనపై ప్రజలు తీవ్రంగా రగిలిపోతుంటే, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మాత్రం చివరి దశలో అయినా సీఎం కుర్చీ సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సీఎం పదవికి రాజీనామా చేయటానికి రెండు రోజుల ముందు నుంచే ఆనం ఢిల్లీలో లాబీయింగ్ మొదలు పెట్టారు. 39 నెలల తర్వాత చేస్తున్న రెండో ప్రయత్నం నెరవేరొచ్చనే ఆశ ఆనం వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 2009లో అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్యకు సీఎం కుర్చీ వరించిన సంగతి తెలిసిందే. అనేక కారణాలరీత్యా 2010 నవంబరులో రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిని తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అప్పట్లో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాంనారాయణరెడ్డి ఏఐసీసీ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నించారు. సీఎం పదవిపై అప్పట్లో ఆయన చాలా ధీమాగా వ్యవహరించారు. అయితే ఊహించని విధంగా అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ సీఎంగా ఎంపిక చేయడంతో ఆనం తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలతో సీఎం కిరణ్ కచ్చితంగా అర్థాంతరంగా పదవి పోగొట్టుకోవడం ఖాయమని రాంనారాయణరెడ్డి అంచనా వేశారు. కిరణ్ రాజీనామాతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించరాదని అధిష్టానానికి విన్నవించుకుంటున్న వర్గంతో ఆయన చేతులు కలిపారు. -
20 నిమిషాల్లో రాష్ట్రాన్ని చీల్చారు: ఆనం
నెల్లూరు: కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. విభజన విషయంలో అన్ని పార్టీలు ఎన్నో తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు మాత్రమే చేసిందని ఆయన సమర్థించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వదిలిన బాణాల్లో ఒక్కటి కూడా లక్ష్యాన్ని తగల్లేదని ఆయన ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రాన్ని 20 నిమిషాల్లో చీల్చిన ఘనత అన్ని పార్టీలదీ అని విమర్శించారు. సీఎం రేసులో తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి లేరని తెలిపారు. కాగా, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణలతో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఉదయం గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించొద్దని గవర్నర్‌ను వీరుకోరినట్టు సమాచారం. తాము గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని ఆనం తెలిపారు. -
రూ. 100 కోట్ల పనుల సంతర్పణ
ఆగమేఘాల మీద నిధుల మంజూరు నేతల ప్రయోజనం కోసం నామినేషన్ల పనులకు తెరలేపిన ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ముంచుకొస్తుండటంతో మంత్రి, అధికార పార్టీ శాసనసభ్యులు ఆగమేఘాల మీద పనుల పందేరానికి తెర లేపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన నియోజకవర్గంతో పాటు, జిల్లాలో క్రీడా ప్రాంగణాలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.100 కోట్లకుపైగా అనుమతులు మంజూరు చేయించారు. కేడర్‌ను కాపాడుకోవడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు పనుల తాయిలాలు ఎర వేస్తున్నారు. రాష్ట్ర విభజన పుణ్యమాని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి అటు నాయకులు, ఇటు కేడర్ కూడా జంకుతున్నారు. ఏ దారి దొరకని వారు తప్పదన్నట్లు పార్టీనే అంటిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం తమతో వున్న కేడర్‌నైనా నిలుపుకోవడానికి వారు తంటాలు పడుతున్నారు. విభజన బిల్లు లోక్‌సభకు చేరడం, నేతలంతా హైదరాబాదు, ఢిల్లీలో బిజీగా ఉండటంతో రాబోయే వారం రోజులు ఇక కీలకమని వారు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన నియోజక వర్గం ఆత్మకూరులో రోడ్లు, కాల్వలు, భవనాల నిర్మాణాలకు గత 15 రోజుల సమయంలోనే సుమారు రూ.50 కోట్లు మంజూరు చేయించారు. జిల్లాలో పది మినీ స్టేడియాల నిర్మాణం, నెల్లూరులోని స్టేడియం ఆధునికీకరణకు రూ.14 కోట్లు, మాగుంట లేఔట్లో టెన్నిస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ 6.95 కోట్లు, అల్లీపురం మినీస్టేడియంకు రూ.3.60 కోట్లు కలిపి మొత్తం రూ.50 కోట్లకు శుక్రవారం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ పనులన్నీ తమకు కావాల్సిన ఒక కాంట్రాక్టర్‌కే దక్కేలా స్వయంగా మంత్రే మంత్రాంగం నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటితో పాటు ఆత్మకూరు నియోజక వర్గానికి మంజూరు చేసిన పనులను తాము సూచించిన వ్యక్తులకే నామినేషన్ పద్ధతిన కట్టబెట్టాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇవి కాకుండా వెంకటాచలం మండలం చెముడుగుంట, నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం, కోవూరు, మనుబోలు, పొదలకూరు, మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి, కావలి మండలం రాజువారి చింతలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం, ఇతర మరమ్మతులకు రూ.19.40 లక్షలు ఆగమేఘాల మీద మంజూరు చేయించారు. ఈ పనులను తమ వారికి ఇప్పించడం కోసం జిల్లా పరిషత్ అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇవి కాకుండా అనంతసాగరం, కొడవలూరు, సంగం, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, తాగునీటి పథకాల కోసం రూ.22 లక్షలు మంజూరు చేయించి, పనులు చేపట్టడానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయించారు. అధికారులు టెండర్లు పిలవడం, వీటిని ఖరారు చేయడం లాంటి ప్రక్రియ నిర్వహించడానికి సమయం పడుతుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడితే అధికారులెవరూ తమ మాట లెక్కపెట్టరనే అంచనాతో ఈ ప్రక్రియే లేకుండా పనులు నామినేషన్ కింద ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. -
5 నిమిషాల్లో బడ్జెట్ పద్దులకు ఆమోదం
చర్చ లేకుండానే... ముగింపు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఎలాంటి చర్చ లేకుండానే గందరగోళం మధ్య బడ్జెట్ పద్దులకు బుధవారం ఆమోదముద్ర పడింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. ‘ఇదేం సభ.. సీమాంధ్ర సభ’ ‘సీమాంధ్ర సీఎం మాకొద్దు’ ‘జెతైలంగాణ’.. అంటూ నినాదాలు చేశారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో తొలి 5 నిమిషాల్లోనే వాయిదా పడింది. అంతకుముందు వివిధ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. 11.45 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. గందరగోళం మధ్యే ఆరు నెలల కాలానికి అవసరమయ్యే రూ.79 వేల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పద్దుకు ఆమోదం తెలిపే తీర్మానాన్ని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సాధారణంగా బడ్జెట్ పద్దులపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత సభ ఆమోదానికి ప్రవేశపెడతారు. ఈసారి మాత్రం ఎలాంటి చర్చ లేకుండానే తీర్మానాన్ని సభ ఆమోదానికి పెట్టినట్లు స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఈ వ్యవహారం మొత్తం ఐదు నిమిషాల్లో ముగిసింది. అనంతరం సభను గురువారానికి స్పీకర్ వాయిదా వేశారు. ‘ద్రవ్య బాధ్యత’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: వివిధ శాఖలు ఇష్టానుసారం పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయకుండా నియంత్రించే ‘ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లు’కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఫలితంగా.. బడ్జెట్ కేటాయింపులకు 3 రెట్లకు మించకుండా మాత్రమే పనులకు పాలనా అనుమతులు ఇవ్వాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. మూడు రెట్లకు మించితే తప్పనిసరిగా శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. -
ఆనం గారడీ
జలయజ్ఞానికి నామమాత్రపు నిధులు సోమశిల, పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణం కష్టమే సాక్షి, నెల్లూరు: ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాల్గోసారి ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంకెల గారడీ అనే విమర్శలు వెల్లువెత్తాయి. పాత లెక్కలు మార్చి మసిపూసి మారేడుకాయ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థికమంత్రి జిల్లా వాసైనప్పటికీ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పలు ప్రధాన అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు నామమాత్రమే. పురోగతిలేని జలయజ్ఞం నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ. ప్రధానంగా వైఎస్సార్ హయాంలో జిల్లాలో జలయజ్ఞం పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా పెన్నా, సంగం బ్యారేజీ పనులు ప్రారంభమై ఐదేళ్లు గడిచాయి. ఇప్పటికీ ఆ పనులు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. సంగం బ్యారేజీ పనులు 30 శాతం, పెన్నా బ్యారేజీ పనులు 70 శాతానికి మించి పూర్తి కాలేదు. ఇవి ఎప్పటికి పూర్తి అవుతాయో తెలియని అయోమయ పరిస్థితి. తాజాగా మెట్ట ప్రాంతాల అభివృద్ధి పేరుతో సోమశిల హైలెవల్ కెనాల్‌కు రూప కల్పన చేశారు. దాదాపు రూ.1400 కోట్ల మేర అంచనాలతో ఇటీవలే పనులకు టెండర్లు పిలిచారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలిసి ఈ ప్రాజెక్టుకు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. కాని నిధుల కేటాయించిన పాపాన పోలేదు. ఈ ఏడాది కొత్త బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధుల కేటాయించి అన్ని జలయజ్ఞం పనులు పూర్తి చేస్తామని ఆనం ప్రకటించారు. ఆర్థిక మంత్రి హోదాలో నాల్గోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆనం జలయజ్ఞం పనులకు నామమాత్రంగానే నిధులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. సోమశిల ప్రాజెక్టుకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే కేటాయించినట్టు చూపారు. పెన్నా రివర్ కెనాల్ అభివృద్ధి పనులకు నామమాత్రంగా రూ. 150 కోట్లు, తెలుగు గంగ ప్రాజెక్టుకు రూ.154 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు లెక్కలు చూపారు. ఈ లెక్కన జిల్లాలో మరో ఐదేళ్లకు కూడా జలయజ్ఞం పనులు కూడా పూర్తి అయ్యే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో వేల కోట్ల జలయజ్ఞం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. కేవలం నెల్లూరు నగరంతో పాటు మంత్రి సొంత నియోజక వర్గం ఆత్మకూరులో మాత్రమే వందల కోట్లు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నారే తప్ప జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడ్ల సంగతి మాత్రం ఆనం సోదరులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తాజా బడ్జెట్లో రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు నామమాత్రంగానే ఉండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. రానున్నది వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు మున్సిపాలిటీలతో పాటు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. నెల్లూరు నగరంలో కూడా నీటి సమ్య తప్పడం లేదు. వేసవిని దృష్టిలో పెట్టుకుని శాశ్వత తాగునీటి పథకాలకు మరిన్ని నిధులు కేటాయిస్తారనుకుంటే ఈ బడ్జెట్లో కూడా నామమాత్రంగా కూడా నిధుల కేటాయించలేదు. నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. గతంలో రూ.440 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా పనులు ప్రారంభం కాలేదు. సీఎం కిరణ్ గతంలో నెల్లూరు పర్యటన సందర్భంగా రూ.600 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. ఇంత వరకూ అతీగతీ లేదు. తాజాగా రూ.770 కోట్లతో ప్రతి పాదనలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్లో కూడా ఈ పథకానికి నామమాత్రంగా కూడా నిధుల కేటాయించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష సమస్యలు న్నాయి. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఈ పనులు పూర్తికావడం ప్రశ్నార్థకమైంది. ఏళ్ల కొద్ది పెండిగ్లో ఉన్న జలయజ్ఞం పనులు, మెడికల్ కాలేజీ, దుగరాజపట్నం ఓడరేవు తదితర వాటి గురించి పదే పదే ప్రచారం చేసుకోవడం తప్ప పూర్తి అయ్యేలా బడ్జెట్లో కేటాయింపులు చేయక పోవడం ఆనం మార్కు బడ్జెట్‌ను తేట తెల్లం చేసింది. మోసపూరిత బడ్జెట్ ఇది పూర్తిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక బడ్జెట్. గత ఏడాది రూ.1.61లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ దఫా అంకెలను మార్చి గొప్ప కోసం రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. కేటాయింపులే తప్ప ఖర్చు చేయడం లేదు. గత ఏడాది ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.8,600 కోట్లను కేటాయించారు. ఇప్పటికి రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే ఎస్టీలకు రూ.3,600 కేటాయించి కేవలం రూ.882 కోట్లు ఖర్చు చేశారు. వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులే జరగలేదు. అందుకే ఇది మోసపూరిత బడ్జెట్. -చండ్ర రాజగోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రజలకు పనికిరాని బడ్జెట్ ప్రభుత్వం పేరుకు మాత్రమే లక్షా ఎనభైవేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సగం ఉద్యోగుల జీత భత్యాలకే పోతుంది. ఎనిమిది వందల కోట్లను ఎన్నికల కోసం కేటాయించారు. కేవలం ప్రచారానికి పనికి వచ్చేలా ఉంది. ప్రజలను మభ్యపెడుతూ ‘ఐ’వాష్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించింది. ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. ప్రాజెక్టులకు నిర్ధిష్టమైన నిధుల కేటాయింపులు జరగలేదు. తాగు, సాగు నీరు, ఉద్యోగకల్పనలకు చోటు దక్కక పోవడం శోచనీయం. -వి.రామరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
జిల్లాకు మళ్లీ మొండి‘చెయ్యి’..
సాగునీటి ప్రాజెక్టులకు పెరగని కేటాయింపులు.. గతేడాది విదిల్చినట్లుగానే ఈ‘సారీ’.. ఊసేలేని పెన్‌గంగా ప్రాజెక్టు ‘రిమ్స్’కు కేటాయించినా.. నిర్వహణ, జీతభత్యాలకే సరి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. కిరణ్ ప్రభుత్వం మరోమారు మొండి‘చెయ్యి’ చూపింది. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినా.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు విదిల్చారు. ఏటా మాదిరిగానే ఈసారీ మమ అనిపించారు. సోమవారం ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఓసారి పరిశీలిస్తే.. ఆదిలాబాద్, శ్రీకాకుళంలోని నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణానికి ఈసారి బడ్జెట్లో రూ.రెండు కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాకు రూ.కోటికి మించి వచ్చే అవకాశాలులేవు. ఈ ఒక్క అంశం మినహా ఈ బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ లేవు. ఆదిలాబాద్, ప్రకాశం, శ్రీకాకుళంలోని రిమ్స్ల్లో ఆధునిక పరికరాల కొనుగోలుకు మొత్తం రూ.4.5 కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాలోని రిమ్స్‌కు రూ.1.5 కోట్లు మించి వచ్చే అవకాశాలు లేవు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా ఇందుకోసం రూ.1.5 కోట్లే కేటాయించారు. రిమ్స్ ఆస్పత్రికి గతేడాది కేటాయించినట్లుగానే ఈసారి కూడా రూ. 20.92 కోట్లు విదిల్చారు. రిమ్స్ వైద్య కళాశాలకు కూడా రూ.20.92 కోట్లు నిధులు వచ్చాయి. ఈ నిధులు కేవలం ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకే సరిపోతాయే తప్ప, పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఊసేలేని పెన్‌గంగా : సర్వే దశలోనే ఉన్న ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించతలపెట్టిన పెన్‌గంగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు ఈ బడ్జెట్లోనూ ఊసే లేకుండా పోయింది. 50 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తెవాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయించడంలో ప్రభుత్వం ఈసారి కూడా మొండి చేయి చూపింది. దీంతో ఈ సర్కారు హాయంలో ఈ ప్రాజెక్టు కేవలం సర్వేకే పరిమితమైనట్లవుతోంది. {పాణహిత-చేవెళ్ల : తెలంగాణ వరప్రదాయనిగా పేరున్న ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు కేటాయింపులకు ఈసారి రూ.1,051.05 కోట్లుకు పెరిగినా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం రెండు ప్యాకేజీల పనులు మాత్రమే జిల్లాలో కొనసాగుతున్నాయి. స్వర్ణ ప్రాజెక్టు, ప్రధాన కాలువ ఆధునికీకరణకు రూ.14.88 కోట్లతో చేపట్టిన పనులకు ఈ బడ్జెట్లో రూ.1.20 కోట్లు కేటాయించారు. సాత్నాల ఆధునికీకరణకు గతేడాది మాదిరే ఈసారీ రూ.కోటి కేటాయించారు. గడ్డెన్నవాగు (సుద్ద వాగు) ప్రాజెక్టు ప్రధాన కాలువ సిమెంట్ లైనింగ్ పనులకు కూడా ఇంతకు ముందుసారి మాదిరిగానే ఈసారి కూడా రూ.10 కోట్లు కేటాయించారు. మధ్య తరహా ప్రాజెక్టులకు.. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులకు గతేడాది కేటాయింపులే ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావృతమయ్యాయి. ర్యాలీవాగు ప్రాజెక్టుకు రూ.కోటి, గొల్లవాగుకు రూ.ఐదు కోట్లు, నీల్వాయి ప్రాజెక్టుకు రూ.35 కోట్లు, కొమురంభీమ్ ప్రాజెక్టుకు రూ.32 కోట్లు, పెద్దవాగుకు రూ.2 కోట్ల మేరకు కేటాయింపులు జరిగాయి. ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టు రీ మోడలింగ్ పనులకు రూ.50 లక్షలు, దహెగాంలోని పీపీరావు ప్రాజెక్టుకు రూ.1.40 కోట్లు కేటాయించారు. -
కేటాయింపులు అంతంతే
నిరాశపర్చిన ఓటాన్ బడ్జెట్ జిల్లాకు నిధుల కేటాయింపు అరకొరే సాగునీటి ప్రాజెక్టులకు మొండిచేయి ప్రతిపాదనలతో పొంతనలేని మంజూరు రాయలసీమ యూనివర్సిటీ, పెద్దాసుపత్రిలపై శీతకన్ను సాక్షి, కర్నూలు: ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజానీకానికి నిరాశ మిగిల్చింది. వచ్చే ఆరు నెలల కాలానికి ఉద్దేశించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లాకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. జలయజ్ఞం ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తారని భావించిన రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. హంద్రీనీవా, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టులకు తప్ప ఎల్ఎల్సీ, గాజులదిన్నె తదితర ప్రాజెక్టులన్నింటికీ నిధుల్లో కోత పెట్టారు. ఇక ఆరు జిల్లాలకు పెద్దదిక్కుగా వైద్య సేవలందిస్తున్న కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రూ.2 కోట్ల మాత్రమే విదిల్చడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు జిల్లాలో 80వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే హంద్రీనీవాకు రూ.416 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ, పంట కాలువలు, లిఫ్ట్‌ల వద్ద తాత్కాలిక మరమ్మతులు, ప్రధాన కాలువ లైనింగ్ పనులకు రూ.900 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే గత ఏడాది తరహాలోనే 50 శాతానికి పైగా కోత పెట్టారు. కర్నూలు-అనంతపురం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే హంద్రీనీవాకు గత ఏడాది కేటాయించిన నిధుల్లో 60 శాతం కూడా వ్యయం చేయలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదేవిధంగా జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించే తెలుగుగంగ ప్రాజెక్టుకు ఈ ఏడాది కూడా రూ.154 కోట్లు మాత్రమే కేటాయించారు. జిల్లాతో పాటు చెన్నైవాసులకు తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు ఏటా అరకొర నిధులను కేటాయిస్తుండటంతో ప్రధాన కాలువ లైనింగ్ పనులకు ఇప్పట్లో మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం కుడిగట్టు కాలువ పనులకు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ కాలువతో గోరుకల్లు, అవుకు జలాశయాలను నింపి నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలో 200 గ్రామాలకు సాగునీటిని అందిస్తున్నారు. అరకొర నిధుల కారణంగా కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో 15 శాతం గ్రామాలకు కూడా తాగునీటిని అందించలేకపోతున్నారు. ఇక కర్నూలుతో పాటు కడప జిల్లాకు తాగు, సాగునీటిని అందించే కేసీ కెనాల్‌కూ రూ.70 కోట్లతో సరిపెట్టారు. 2.75 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కాలువకు పలుచోట్ల లైనింగ్ దెబ్బతినడం.. మరమ్మతులకు నోచుకోకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం గమనార్హం. తుంగభద్ర దిగువ కాలుల పరిధిలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఎల్ఎల్సీ కాలువ ఆధునికీకరణ పనులకు బడ్టెట్‌లో రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారు. పైనున్న కర్ణాటక రాష్ట్రంలో నీటి చౌర్యంతో పాటు కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో 75వేల ఎకరాలకు నీరందడం లేదు. ఈ పరిస్థితుల్లోనూ నిధులు పెంచకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘రాయలసీమ’కు రూ.5 కోట్లు రాయలసీమ విశ్వవిద్యాలయానికి సంబంధించి సుమారు రూ.170 కోట్లు కేటాయించాలని గత ఏడాది ప్రతిపాదనలు పంపారు. అయితే బడ్జెట్లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. కర్నూలు పెద్దాసుపత్రికి రూ.2కోట్లే ఆరు జిల్లాలకు పెద్దదిక్కుగా వైద్య సేవలు అందిస్తున్న కర్నూలు ప్రభుత్వాసుపత్రి తక్షణ అవసరాలకు రూ.2 కోట్ల బడ్జెట్‌తో సరిపెట్టారు. ఇప్పటికీ సరిపడా పడకలు లేక రోగుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇదే సమయంలో సరైన సౌకర్యాలు కరువై ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం అత్తెసరు నిధులతోనే సరిపెట్టింది. -
బడ్జెట్లో ప్రాధాన్యతేదీ..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యత లేదని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ఆక్వా, పొగాకు, ఉప్పు రైతులు జిల్లాలో అనేక మంది ఉండగా..వారి గురించి అసలు పట్టించుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై జిల్లా వాసులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌పై ఏ ఒక్కరూ సానుకూలంగా స్పందించక పోవడం గమనార్హం. పేలవమైన బడ్జెట్ ఇప్పటి బడ్జెట్ చాలా పేలవంగా ఉంది. జిల్లా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సొంత జిల్లాకు పోర్టును తరలించుకెళ్లారు. ఇప్పటికే నెల్లూరులో ఒక పోర్టు ఉంది. ప్రకాశం జిల్లాలో పోర్టు ఏర్పాటు చేసి ఉంటే జిల్లా అభివృద్ధి చెంది ఉండేది. - అక్తర్ బాషా, ఒంగోలు రామ్‌నగర్ మహిళలకు ఎటువంటి లబ్ధి లేదు ఈ బడ్జెట్ వల్ల మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు. ఇప్పటి వరకు ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగంలో మహిళల గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. దాదాపు అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. - వేదవతి, ఒంగోలు భాగ్యలక్ష్మీనగర్ గత బడ్జెట్ నిధులే ఉపయోగించలేదు... రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 474 కోట్ల మిగులు చూపడం హాస్యాస్పదంగా ఉంది. గత బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా ఉపయోగించే తీరిక రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి తిరగడానికే పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు కూడా ఉపయోగించలేకపోయారు. - శ్రీనివాసరావు, వ్యాపారి, కనిగిరి బడ్జెట్లో కొత్తదనం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నట్లు ప్రకటించిందని అయితే ఇది ఇప్పటికే పూర్తయిన కసరత్తు. ఇందులో కొత్తదేమీ లేదు. సీఎం కిరణ్ నిధులన్నీ తన నియోజకవర్గానికి మళ్లించుకుంటున్నారు..దీంతో ఇతర జిల్లాల పట్ల శ్రద్ధ చూపలేదు. - చదలవాడ రామారావు, గిద్దలూరు -
వ్యాట్ బాదుడుకు రంగం సిద్ధం
రాష్ట్ర ప్రజలపై ఈ ఏడాది అదనంగా రూ. 10 వేల కోట్ల భారం మొత్తం టార్గెట్ రూ. 61, 950 కోట్లు రాష్ట్ర ప్రజలపై విలువాధారిత పన్ను(వ్యాట్) భారం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాణిజ్య పన్నుల రూపంలో రూ. 61,950 కోట్ల వ్యాట్‌ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ. 9450 కోట్లు ఎక్కువ. దీంతోపాటు గత సంవత్సరం తగ్గిన వ్యాట్ వసూళ్లను కూడా ఈ ఏడు వాణిజ్య పన్నుల శాఖ టార్గెట్‌లో చేర్చారు. ఇబ్బడి ముబ్బడిగా పన్నులు పెంచడంతో గత ఏడాది కొనుగోళ్ళు తగ్గాయి. ఈ లెక్కన టార్గెట్ తగ్గాలి. కానీ తాజా బడ్జెట్లో లక్ష్యాన్ని మరో రూ. 9450 కోట్లు పెంచింది. అయితే ప్రభుత్వం మాత్రం గత ఏడాదితో పోలిస్తే 18 శాతం మాత్రమే పన్నులు పెంచినట్టు చెబుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ వసూళ్ళు దాదాపు రూ. 6 వేల కోట్లు తగ్గాయి. ఆ తగ్గిన మొత్తం, పెంచిన రూ. 9,450 కోట్లు కలుపుకుంటే దాదాపు రూ. 15 వేల కోట్లు వాణిజ్య పన్నుల శాఖ నిర్థాక్షిణ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. దానికి, మరికొన్ని వస్తువులను అధిక వ్యాట్ (14.5) శాతం పరిధిలోకి తేవడమే మార్గమని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 2.10 కోట్ల కుటుంబాలున్నాయి. ప్రతీ కుటుంబంపై 2013-14 వార్షిక బడ్జెట్ లెక్కల ప్రకారం రూ. 26 వేలకు పైగా పన్నుల భారం మోపారు. తాజా బడ్జెట్లో మరో రూ. 10 వేల కోట్ల బాదుడు కారణంగా, ఒక్కో కుటుంబం ఏడాదికి రూ. 5 వేలకు పైగా పన్నుల రూపంలో అదనంగా ఖజానాకు చెల్లించాల్సి ఉంటుంది. 2005లో వచ్చిన వ్యాట్ పరిధిలోకి ఇప్పటికే 592 వస్తువులను చేర్చారు. కేవలం 20 శాతం వస్తువులను మాత్రమే 5 శాతం పన్నుల పరిధిలో ఉంచి, మిగతా 80 శాతం 14.5 శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు. బియ్య, పప్పు, ఉప్పు వంటి నిత్యావసరాలపైనా వ్యాట్ బాదుడు బాదారు. ఇందులో 87 శాతం కిరణ్‌కుమార్ సర్కారు వచ్చిన తర్వాత జరిగినవే కావడం విశేషం. ఇప్పుడు మరికొన్ని నిత్యావసర వస్తువులు 14.5 శాతం పరిధిలోకి వచ్చే పరిస్థితి ఉంది. వాటితో పాటు, మధ్యతరగతి కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్, గృహోపకరణాలకు సంబంధించిన 70 వస్తువులను అధిక పన్ను పరిధిలోకి చేర్చే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దిగుమతి అయ్యే దుస్తుల్లో మరికొన్నింటిపైనా పన్ను బాదుడు తప్పదని భావిస్తున్నారు. అక్రమ రవాణాను నిరోధించడం ద్వారా పన్నుల భారం తగ్గించవచ్చని అంతర్గత నివేదికలు పేర్కొంటున్నా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంలేదు. కేవలం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉన్నత విద్య.. కేటాయింపు మిథ్య టెక్విప్కు కోత.. ‘రూసా’కు అరకొర నిధులు! సాంకేతిక విద్యలో నాణ్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే పథకం టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (టెక్విప్)కు రాష్ట్రం ఈసారి బడ్జెట్లో కోతపెట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వ పాలిటెక్నిక్ కశాశాలల భవన నిర్మాణాలకు నిధులు వెచ్చించాల్సి ఉంది. కోత విధించడంతో భవననిర్మాణాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్‌కు (రూసా) కూడా నిధులను అరకొరగానే విదిల్చింది. సోమవారం ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన 2014-15 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఉన్నతవిద్యకు గత ఏడాదితో పోల్చితే అదనంగా ఒక్క పైసా కేటాయించలేదు. టెక్విప్కు గత ఏడాది రూ. 105 కోట్లు కేటాయించగా ఈసారి వాటికి కోత పెట్టింది. సాంకేతిక విద్య ప్రధాన కార్యాలయానికి వెచ్చించాల్సిన రూ. కోటి, ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనాల నిర్మాణాలకు రూ.4.86 కోట్లు కలిపి మొత్తం రూ. 111 కోట్లకు కోత విధించింది. రాష్ట్రంలో ‘రూసా’అమలుకు రూ.2,600 కోట్లతో ప్రణాళిక ఉండగా, ఇందులో రాష్ట్రం వాటా రూ. 910 కోట్లకుగాను కేటాయించింది మాత్రం అత్తెసరే. ఫీజులకు ‘లోటు’ పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మళ్లీ కష్టాల బడ్జెట్టే దిక్కయ్యింది. ఎప్పటిలాగే ఈ పథకం అమలుపై ప్రభుత్వం నిరాసక్తతను, నిర్లిప్తతను చూపుతూ మళ్లీ ‘లోటు’ బడ్జెట్‌నే ప్రతిపాదించింది. 2014-15 సంవత్సరానికిగానూ ఫీజుల పథకానికి ప్రభుత్వం రూ. 4,444 కోట్లు కేటాయించారు. ఇందులో ఎస్సీలకు రూ. 610 కోట్లు, ఎస్టీలకు రూ. 610 కోట్లు, బీసీలకు రూ. 1,985 కోట్లు, ఈబీసీలకు రూ. 600 కోట్లు, మైనార్టీకు రూ. 630.16 కోట్లు, వికలాంగులకు రూ. 9 కోట్లు ఇస్తున్నట్లు చూపెట్టారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఎస్టీ విద్యార్థులకు రూ. 320 కోట్లు ఫీజుల పథకానికి కేటాయించారు. ఎస్సీ విద్యార్థులకు 2013- 14 బడ్జెట్లో కేంద్రం వాటాతో కలిపి కేటాయించిన రూ. 638 కోట్లు ఈసారి చూపించలేదు. అలాగే ఎస్టీలకు కేంద్రం ఇచ్చిన రూ. 290.51 కోట్లు, బీసీ స్కాలర్షిప్పులు రూ. 100 కోట్లు కూడా ఈసారి బడ్జెట్లో కనిపించలేదు. కేంద్ర బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టనందున వీటిని కలపలేదు. ఈబీసీలను గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ట్యూషన్ఫీజుకు మాత్రమే పరిమితం చేశారు. వారికి స్కాలర్షిప్ కింద రూపాయి కూడా కేటాయించలేదు. మిగిలేది రూ. 1,800 కోట్లే.. కేటాయింపుల సంగతి పక్కనబెడితే.. 2013-14 సంవత్సరానికి ఫీజుల పథకానికి అవసరమైన రూ. 4,500 కోట్లలో రూ. 1,805.87 కోట్లు మాత్రమే విడుదల చేశారు. వీటిని కూడా ఇంకా విద్యార్థుల ఖాతాలకు జమ చేయలేదు. అంటే ఈ ఏడాదికి సంబంధించినవే దాదాపు రూ. 2,700 కోట్లు బకాయిలుంటాయి. వచ్చే ఏడాదికి కేటాయించిన వాటిలో ఈ బకాయిలు పోతే మిగిలేవి రూ. 1,800 కోట్లే. కేంద్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 1,000 కోట్లు విడుదల చేస్తే ఈ మొత్తం రూ. 2,800 కోట్లకు పెరుగుతుంది. ఇక వచ్చే ఏడాది అంచనా రూ. 5,000 కోట్ల వరకు ఉండవచ్చు. ఏకీకృత ఫీజులు వృత్తివిద్యా కళాశాలలన్నింటికీ వర్తింపజేస్తే మరింత పెరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో మరో రూ. 2,000 కోట్లు ఇచ్చి ఉంటే వచ్చే ఏడాది ఫీజులు కూడా పూర్తిస్థాయిలో చెల్లించే అవకాశముండేది. ట్రిపుల్ ఐటీలపై శీతకన్ను 2014-15 ఆర్థిక సంవత్సరంలో ట్రిపుల్ ఐటీల అభివృద్ధికి రూ. 620 కోట్లకు పైగా కావాలని కోరగా రూ. 353 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో రాష్ర్టంలోని ట్రిపుల్ ఐటీలు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. మరిన్ని వివరాలు... 2013-14 బడ్జెట్లో ఆర్జీయూకేటీకి ప్రణాళిక వ్యయం కింద రూ. 722 కోట్లు అడిగితే కేవలం రూ. 353 కోట్లు మాత్రమే కేటాయించారు. 2014-15 బడ్జెట్లోనూ అంత మొత్తమే కేటాయించి సర్కారు చేతులు దులుపుకుంది. వర్సిటీ నిర్వహణ భారమవుతోందని అధికారులు పదేపదే విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీస వసతులు, అధ్యాపక సిబ్బంది లేకున్నా అదనంగా పైసా ఇవ్వకపోవడంతో బాసర, నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కేంద్రాలు సమస్యల వలయంలో నుంచి బయటపడే పరిస్థితి లేకుండా పోయింది. సీఎం, డిప్యూటీ సీఎం జిల్లాల్లో గత ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కాలేజీలకు మాత్రం గత ఏడాదిలాగే భారీగా నిధులు కేటాయించారు. చిత్తూరు జిల్లా కలికిరి జేఎన్టీయూకు రూ. 100 కోట్లు, మెదక్ జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూకు రూ.121 కోట్లు కేటాయించడం గమనార్హం. నాలుగేళ్లుగా కేటాయింపులిలా... 2010-11లో ఆర్జీయూకేటీకి రూ. 400 కోట్లు బడ్జెట్లో కేటాయించినా యూనివర్సిటీకి ఇచ్చింది రూ. 219 కోట్లే. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ. 425 కోట్లు కేటాయించినా విడుదల చేసింది రూ. 245 కోట్లు మాత్రమే. 2012-13లో రూ. 600 కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో చూపినా ఇచ్చింది రూ. 386 కోట్లే. 2013-14లో రూ. 722 కోట్లు అడిగితే రూ. 353.50 కోట్లు మాత్రమే కేటాయించారు. 2014-15లోనూ రూ. 353.50 కోట్లకే పరిమితం చేసింది. తలసరి ఆదాయం రూ. 78,564 రాష్ట్రంలో తలసరి ఆదాయం ఏటా పెరుగుతోంది. 2011-12 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2012-13లో తలసరి ఆదాయం 13.29 శాతం పెరిగి రూ.78,564 చేరింది. శాసనసభ, మండలికి ప్రభుత్వం సోమవారం సమర్పించిన సామాజిక, ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని పేర్కొన్నారు. మాటలకు అంకెలకు పొంతన ఎక్కడ? రాష్ట్రంలో వ్యవ‘సాయం’ 3.65 శాతమే! కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతి అంకెలోనూ... మొక్కుబడి వైఖరి ప్రతిఫలించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపు తగ్గింది. గత ఏడాది వార్షిక బడ్జెటలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 3.80 శాతం ఉండగా, ప్రస్తుతం (2014-15) బడ్జెట్లో ఇది 3.65 శాతానికి పడిపోయింది. ఏటా సగటున 10 శాతంగా ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ తగ్గుదల కనీసం 15 శాతం ఉంటుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ధరల స్థిరీకరణకోసం ప్రవేశపెట్టిన ‘ఆలంబన’ పథకానికి రూ.100కోట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈసారి ఆ ఊసే ప్రస్తావించలేదు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పినప్పటికీ, అంకెల్లో ఆ సంగతే లేదు. చాలా అంశాల్లో ప్రభుత్వం చెప్పినదానికి, కేటాయింపులకు పొంతన కనిపించలేదు. రైతులకు పంటరుణాలపై వడ్డీ చెల్లింపులకు సంబంధించిన కేటాయింపులు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. గత బడ్జెట్లో వడ్డీ లేని రుణాల కోసం రూ.500 కోట్లు, పావలా వడ్డీకి రూ.60 కోట్లు కేటాయిస్తే.. ఈసారి అవే అంకెలను యథాతథంగా ఉంచారు. బ్యాంకులు ఇస్తున్న 80 వేల కోట్ల పంటరుణాలకు జీరో వడ్డీ వర్తింపజేయూలంటే బడ్జెట్లో కనీసం 1600 కోట్లరుునా కేటాయించాల్సి ఉందని వ్యవసాయూధికారులే చెబుతున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు వివిధ పథకాలకు గత ఏడాది బడ్జెట్ కేటాయింపులను యథాతథంగా ఉంచేశారు. జాతీయ పంటల బీమా పథకానికి ఇటీవల ప్రీమియం మొత్తాన్ని కేంద్రం 11 శాతానికి పెంచింది. దీనికి రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి. అయితే గత ఏడాది కేటాయించిన రూ.410 కోట్లే యథాతథంగా ఉంచేశారు. వడ్డీ లేని రుణాలకు అరకొరే గ్రామీణానికి రూ.650 కోట్లు, పట్టణాలకు 150 కోట్లే సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలకు భారీగా రుణాలు ఇప్పిస్తున్నామని, వారు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఈసారి వడ్డీ లేని రుణాలకు కేటాయించిన మొత్తం చూస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీకింద బ్యాంకులకు దాదాపు రూ.1,400 కోట్లు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 650 కోట్లు మాత్రమే ఇచ్చిన సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా అంతే మొత్తాన్ని కేటాయించింది. మరిన్ని వివరాలు... గడిచిన మూడు నెలలుగా వడ్డీలేని రుణాల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బ్యాంకర్లు మహిళా సంఘాల నుంచి అసలుతోపాటు వడ్డీ కూడా కట్టించుకుంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వడ్డీ లేని రుణాల కింద కనీసం రూ.1,500 కోట్లు కావాల్సి వస్తుందని అంచనాలున్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా కేటాయింపులు లేకపోవడంతో మహిళా సంఘాలకు ఇక్కట్లు తప్పవని తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణం కింద ఈ సంవత్సరం సుమారు రెండువేల కోట్ల మేరకు రుణాలిప్పించారు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ సంఘాలకు కనీసం 280 కోట్ల మేరకు వడ్డీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేవలం 150 కోట్లే కేటాయించారు. కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వం జాతీయ పట్టణ నవీకరణ పథకాన్ని అమలు చేస్తుందో లేదో తెలియదు కానీ ఈ పథకం కింద కేంద్రంనుంచి రూ.1,855 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ పథకం కింద రాష్ట్రానికి 150 కోట్లు మించి రాకపోవడం గమనార్హం. -
ఓటి బడ్జెట్
2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ సమర్పించిన ఓటాన్ బడ్జెట్ ఆదాయ, వ్యయాల వివరాలు ఇవీ.. పన్నుల ఆదాయం: రాష్ట్ర పన్నుల ఆదాయంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ఆదాయం, రవాణా, భూమి శిస్తు, స్టాంప్స్,రిజిస్ట్రేషన్ల ఆదాయాలు ఇమిడి ఉంటాయి. 2014-15లో పన్నుల ఆదాయం ద్వారా రూ.84,780.64 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. పన్నేతర ఆదాయం: పన్నేతర ఆదాయంలో రాష్ట్రానికి రావాల్సిన వడ్డీతో పాటు మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా వచ్చే ఆదాయాలు మొదలైనవి ఇమిడి ఉంటాయి. వచ్చే ఏడాదిలో రూ.16,262.26 కోట్లు పన్నేతర ఆదాయంగా వస్తుందని అంచనా వేశారు. మూలధన ఆదాయంలో బహిరంగ మార్కెట్ రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు తదితరాలు ఉంటాయి. ఇందులో కేవలం ఒక్క బహిరంగ మార్కెట్ ద్వారా మాత్రమే ఏకంగా రూ.27,732.47 కోట్లు సమీకరించనున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. రూపాయి రాక 1. కేంద్ర పన్నుల్లో వాటా 2. రాష్ట్ర పన్నుల ఆదాయం; 3. పన్నేతర ఆదాయం 4. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్; 5. మూలధన ఆదాయం రూపాయి పోక 1. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, రవాణా 2. సంక్షేమం, పట్టణాభివృద్ధి, విద్య, కార్మిక, ఉపాధి 3. వేతనాలు, ఇతర వ్యయం రెవెన్యూ ఆదాయంలో నుంచి రెవెన్యూ వ్యయాన్ని తీసివేస్తే వచ్చే దాన్నే రెవెన్యూ మిగులు/లోటు అని అంటారు. మొత్తం రాబడికి మించి చేసే మొత్తం వ్యయాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. జీతాలు.. తడిసి మోపెడు పెరిగిన పెన్షన్ల భారం.. రెండింటి భారం రూ.10 వేల కోట్ల.. పెరిగిన ప్రభుత్వ ఖర్చులు, వడ్డీ భారాలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ నిర్వహణ వ్యయం, విద్యుత్ సబ్సిడీ, వడ్డీలు పెరగడంతో ప్రణాళికేతర వ్యయం 13 శాతం పెరిగింది. గతేడాది రూ.1,01,926 కోట్లున్నది కాస్తా ప్రస్తుత బడ్జెట్లో రూ.13,253 కోట్లు పెరిగి రూ. 1,15,179 కోట్లకు చేరింది. ప్రభుత్వోద్యోగుల జీతాల భారం తడిసి మోపెడైంది. ఇటీవల 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించిన నేపథ్యంలో జీతాలు, పెన్షన్లు పెరిగాయి. జీతాల పెంపు వల్ల ఏటా రూ.7,625 కోట్లు, పెన్షన్ల పెంపుతో రూ.2,308 కోట్ల భారం పడింది. జీతాలు, పెన్షన్లు కలిపి గతేడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్లు పెరిగాయి. రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల విషయానికొస్తే గతేడాది రూ. 14,209 కోట్లున్న నాన్ శాలరీ వ్యయం ఇప్పుడు రూ.16,517 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ నిర్వహణ ఖర్చులో పెరుగుదలను చూపించలేదు. రుణాల చెల్లింపు భారం గతేడాదితో పోలిస్తే కాస్త తగ్గింది. రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ రూ.14,519 కోట్ల నుంచి 16,787 కోట్లకు పెరిగింది. బియ్యంపై సబ్సిడీని గతేడాది మాదిరే రూ.3,000 కోట్లకే పరిమితం చేశారు. విద్యుత్ సబ్సిడీని రూ.5,700 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెంచారు. విద్యుత్ సబ్సిడీపై గతేడాదితో పోలిస్తే ఖజానాపై రూ.1,800 కోట్ల అదనపు భారం పడింది. సంక్షేమానికి కోతే! 2013-14 బడ్జెట్‌ను సవరించని ప్రభుత్వం ఒక్క వ్యాట్ ఆదాయంలోనే రూ.16 వేల కోట్ల కోత మిగిలిన ఆదాయూల పరిస్థితీ అంతే 2012-13లో కూడా రూ.16 వేల కోట్ల కోత సాక్షి, హైదరాబాద్: 2012-13లో ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్: రూ.1,45,854 కోట్లు వాస్తవంగా చేసిన వ్యయం: రూ.1,29,440 కోట్లు అంటే ప్రతిపాదిత బడ్జెట్లో ప్రభుత్వం రూ.16,400 కోట్లకుపైగానే ఖర్చు చేయలేదు. అంటే ఈ మేరకు వివిధ పథకాలకు నిధుల్లో కోత వేసిందన్నమాట. ఇక 2013-14లో బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ ఈసారి కూడా వివిధ సంక్షేమ పథకాలకయ్యే ఖర్చుకు కోత వేయూల్సిన పరిస్థితే నెలకొంది. బడ్జెట్ అంటే ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఖర్చు చేస్తామనే అంచనాలే. అయితే తదుపరి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో వేసిన అంచనాలకు, వాస్తవ పరిస్థితి మేరకు బడ్జెట్‌ను సవరిస్తారు. వీటినే సవరించిన అంచనాలు అంటారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (2014-15)ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విధంగా 2013-14 బడ్జెట్‌ను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారా రూ.52,500 కోట్లు వస్తుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ.36 వేల కోట్లు మాత్రమే. కేవలం వ్యాట్ ఆదాయంలోనే రూ.16 వేల కోట్లకుపైగా కోత పడింది. మిగిలిన ఆదాయాల పరిస్థితీ అంతే. ఇందుకు అనుగుణంగా 13-14 బడ్జెట్‌ను సవరించాల్సి ఉంది. అరుుతే ప్రభుత్వం ఈ ప్రయత్నమేదీ చేయలేదు. అంటే ఏర్పడిన లోటు మేరకు వివిధ సంక్షేమ పథకాలకు చేయూల్సిన వ్యయంలో కోత కోస్తుందన్నమాట. ఎందుకంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కోత కోసేందుకు సాధ్యం కాదు. బడ్జెట్ అంచనాలను సవరిస్తే ఈ నిజం బయటపడుతుందనే ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో అంచనాలను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదని అంటున్నారు. రూ.9 వేల కోట్ల షాక్! వచ్చే ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల భారం తప్పేలా లేదు. 2014-15లో మొత్తం రూ.16,500 కోట్ల మేర బడ్జెట్ లోటు ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పేర్కొన్నాయి. అంటే ఇందులో రూ.7,500 కోట్ల మేర సబ్సిడీ కింద ఇవ్వనున్నట్టు తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. అంటే మిగిలిన రూ.9 వేల కోట్ల మేరకు ప్రజల నుంచే వసూలు చేయాలని ప్రభుత్వం తేల్చిచెప్పిందన్నమాట. ఈ మొత్తాన్ని విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారానే డిస్కంలు భర్తీ చేసుకుంటారుు. 2013-14 బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీకి రూ.5,700 కోట్లు సర్కారు కేటాయించింది. దీనితో పోలిస్తే సబ్సిడీ మొత్తం రూ.7,500 కోట్లకు పెరిగినప్పటికీ భారీ లోటు నేపథ్యంలో ప్రజలకు చార్జీల భారం తప్పేలా లేదు. ‘హోం’కు రూ. 450 కోట్లు రాష్ట్ర పోలీసు విభాగానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 450 కోట్లు కేటాయించారు. రాష్ట్ర డీజీపీకి ఇందులో రూ. 247.2 కోట్లు మంజూరు చేశారు. ప్రణాళిక వ్యయంలో భాగంగా ఈ కేటాయింపులు చేశారు. ఆక్టోపస్‌కు గత ఏడాది మాదిరిగానే రూ. 35 కోట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ కాంప్లెక్స్ నిర్మాణానికి క్రితంసారి మాదిరిగానే రూ. 18 కోట్లు ఇచ్చారు. పోలీస్ ట్రైనింగ్ కళాశాలల ఆధునీకరణ కు రూ. 25 కోట్లు, పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ. 20 కోట్లు, పోలీస్ విభాగం భవనాల నిర్మాణానికి రూ. 51 కోట్లు చొప్పున కేటాయించారు. రోడ్డురవాణాలో పాత అంకెలే.. అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు.. కేటాయింపుల్లో స్వల్ప తేడాలు.. మొత్తంగా పాత అంకెలే పునరావృతం.. ఇదీ రోడ్డు రవాణా శాఖకు బడ్జెట్ కేటాయింపుల తీరు. ఏపీ రోడ్ సెక్టార్ ప్రాజెక్టు (ఏపీఆర్డీసీ)కి గత బడ్జెట్లో కేటాయించినట్టుగానే రూ. 400 కోట్లు, రైలు మార్గాలున్న చోట్ల వంతెనల నిర్మాణానికి రూ. 210 కోట్లు, స్టేట్ హైవేలకు రూ. కోటి, ముఖ్యమైన జిల్లా రోడ్లకు రూ. 812 కోట్లు, చిన్న రోడ్లకు రూ. 83 కోట్లు, కడప రోడ్డు విస్తరణకు రూ. 2 కోట్లు, బీవోటీ కింద నిర్మించే గోదావరి ఫ్లైఓవర్ వంతెనకు రూ. 22 కోట్లు, ఏపీఆర్డీసీ కోర్ నెట్వర్క్ రోడ్లకు రూ. 796 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా (50%)గా రూ. 100 కోట్లు, ఇతర పీపీపీ రోడ్లకు రూ. 350 కోట్లు, ఎన్‌ఆర్‌ఈజీపీ పనులకు రూ. 135 కోట్లు కేటాయించింది. ఆర్టీసీకి రూ. 100 కోట్లు.. కొత్త బస్సులు కొనేందుకు గతేడాది మాదిరే ఆర్టీసీకి రూ.100 కోట్లు కేటాయించారు. విమానాశ్రయాలకు రూ. 74 కోట్లు.. సివిల్ ఏవియేషన్ అభివృద్ధికి రాష్ట్ర వాటాగా ప్రభుత్వం బడ్జెట్లో రూ. 74 కోట్లు కేటాయించింది. విజయవాడ, శంషాబాద్ రాజీవ్‌గాంధీ విమానాశ్రయం, విశాఖపట్నాలకు రూ. కోటి చొప్పున, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్‌కు రూ. 150 కోట్లు, తిరుపతి విమానాశ్రయానికి రూ. 300 కోట్లు, ప్రభుత్వ హెలికాప్టర్లు నిలిపే హాంగర్ నిర్మాణానికి రూ. కోటి చొప్పున బడ్జెట్లో కేటాయించారు. తగ్గిన ‘వైద్య, ఆరోగ్యం’ వాటా వైద్య ఆరోగ్య రంగానికి అరకొర కేటాయింపులే దక్కాయి. గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014- 15) నిధులు స్వల్పంగా పెరిగినట్లు కనిపిస్తున్నా మొత్తం బడ్జెట్లో ఈ రంగం వాటా 4.02% నుంచి 3.74 శాతానికి తగ్గడం గమనార్హం. పేదింటిపై చిన్నచూపు! రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పేదల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే కావాల్సిన నిధులు రూ.15 వేల కోట్లు! కానీ బడ్జెట్లో ప్రభుత్వం అందుకు కేటాయించిన నిధులు ఎంతో తెలుసా? కేవలం రూ.2,726 కోట్లు!! ఇది గత బడ్జెట్లో కేటాయించిన ప్రణాళిక కేటాయింపు (రూ.1,923) కంటే రూ.803 కోట్లు మాత్రమే ఎక్కువ. ఈసారి రూ.5 వేల కోట్లయినా ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ కోరినా పట్టించుకోలేదు. ఆహారానికి భద్రత ఏది? ఓట్ ఆన్ అకౌంటులో జాతీయ ఆహార భద్రత పథకం ప్రస్తావనే లేదు. ఈ పథకాన్ని జూలై 5లోగా కచ్చితంగా అమల్లోకి తేవాలి. పథకం అమలుకు ఏటా అవసరమైన సుమారు రూ.2,800 కోట్లను ఎలా సమకూర్చుతారనే అంశాన్ని బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. -
బడ్జెట్టు.. కనికట్టు
సాక్షి, ఏలూరు: రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లాకు ఇచ్చిన కేటాయింపులు కేవలం ఓట్ల కోసం చేసిన అంకెల గారడీగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్ వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదు. అరకొర కేటాయింపులతోనే సరిపెట్టారు. అది కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొక్కుబడిగా నిధులు విదిల్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 1నుంచి సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండేలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. నాలుగు జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగించేందుకు రూ.457.50 కోట్లు కేటాయిస్తున్నట్టు ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు సైతం నామమాత్రంగానే నిధులు కేటాయించారు. డెల్టా ఆధునికీకరణకు కంటి తుడుపుగా రూ.180 కోట్లు ఇస్తున్నట్టు చూపించారు. పోలవరానికి అంతంతే.. ఏటా బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు అరకొర కేటాయింపులే ఇస్తున్నారు. 2012-13 బడ్జెట్లో రూ.850 కోట్లు కేటాయిస్తే.. 2013-14లో రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈసారి ఓట్ ఆన్ బడ్జెట్లో రూ.457.50 కోట్లు కేటాయించారు.పోలవరం మండలం రామయ్యపేట గ్రామంలో చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తయితే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడుతుంది. 80 టీఎంసీల గోదావరి నీటిని కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణానదికి, 23.44 టీఎంసీల నీటిని విశాఖ పరిసర 560 గ్రామాల్లో తాగునీటి, పరిశ్రమల అవసరాలకు ఎడమ కాలువ ద్వారా సరఫరా అవుతారుు. ఈ నాలుగు జిల్లాల్లో పర్యాటకం, చేపల పెంపకం, జలరవాణా వంటివి అభివృద్ధి చెందుతాయి. ప్రాజెక్టు వ్యయం రూ.17,500 కోట్లుగా నిర్ణయించారు. రూ.16,010 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి వచ్చింది. దాదాపు 14 వందల ఎకరాల భూసేకరణ ఇంకా జరగాల్సి ఉంది. నిర్వాసితులకు ఇప్పటివరకూ పూర్తిగా పునరావాసం చూపించలేదు. ఇటీవల ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి రూ.4,054 కోట్ల విలువైన పనులను అప్పగించారు. డెల్టా ఆధునికీకరణ ఇంకెలా.. ఎన్నో ఏళ్లుగా పంటలకు సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాలువలు, డ్రెయిన్లు పూడకుపోయూయి. చాలా చోట్ల గట్లు తెగిపోతున్నాయి. చిన్నపాటి వర్షాలకే చేలల్లోకి నీరుచేరి పంటలు రోజుల తరబడి ముంపులోనే ఉంటున్నాయి. ఈ సమస్యలన్నీ తీరాలంటే డెల్టా ఆధునికీకరణ ఒక్కటే శరణ్యం. అయితే మూడేళ్లుగా ఆధునికీకరణ పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. ఎప్పటికప్పుడు పంట ఆలస్యం కావడం, వెంటనే రెండో పంట వేసేస్తుండటంతో సమయం సరిపోవడం లేదు. దీంతో పనులు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. డెల్టా ఆధునికీరణ పనులను జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లాంగ్ క్లోజర్ ఇద్దామనుకున్నా రైతులు అంగీకరించకపోవడంతో షార్ట్ క్లోజర్ ద్వారా అయినా పనులు చేయాలనుకుంటున్నారు. అయితే ఓటాన్ బడ్జెట్లో డెల్టా ఆధునికీకరణకు రూ.180 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉభయగోదావరి జిల్లాల్లో సాగునీటి అవసరాలకు కాలువలు, డ్రెయిన్లే ప్రధాన ఆధారం. 2007-08లో వీటిని ఆధునీకరించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించగా 2008-09లో ఆమోదం లభించింది. పశ్చిమలో డెల్టా ఆధునికీకరణ పనుల కోసం రూ.1,383 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆధునీకరణ పూర్తి చేసేందుకు రూ.1464.44 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఐదేళ్లలో 2 లాంగ్ క్లోజర్లు (180 రోజుల చొప్పున), 2 షార్టు క్లోజర్లు (70 రోజుల చొప్పున) ఇచ్చి పనులు చేయాల్సి ఉంది. కానీ.. 2011-12లో ఒక్కసారి మాత్రమే లాంగ్ క్లోజర్ ఇచ్చి పనులు చేశారు. 2008-09లో రూ.23.20 కోట్లు, 2009-10లో రూ.8.65 కోట్లు, 2010-11లో రూ.16.60 కోట్లు, 2011-12లో రూ.68.63 కోట్లు, 2012-13లో రూ.115.08 కోట్లు, 2013-14లో రూ.91.25 కోట్ల విలువైన పనులు చేశారు. ఆధునికీకరణకు సంబంధించి ఇప్పటివరకూ మొత్తం రూ.323.41 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యూరుు. ఈ ఏడాది రూ.1,824 కోట్ల విలువైన పనులకు ప్యాకేజీలు ఖరారయ్యాయి. ‘పశ్చిమ’లో రూ.వెరుు్య కోట్లతో డెల్టాను ఆధునికీరించాలనుకుంటున్నారు. కానీ కేటాయించిన రూ.180 కోట్లు ఏ మూలకూ సరిపోవు. చింతలపూడికి ఎత్తిపోతలకు రూ.70 కోట్లు ప్రస్తుత ఓట్ ఆన్ బడ్జెట్లో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.70 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,701కోట్లు. 2012-13 బడ్జెట్లో రూ.70 కోట్లు, గతేడాది బడ్జెట్లో దాదాపు రూ.70 కోట్లు కేటాయించారు. 2015లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు అరకొరగా ఉండటంతో ఇప్పటివరకూ దాదాపు రూ.280 కోట్లు ఖర్చు చేశారు. తాడిపూడికి రూ.60 కోట్లు తాడిపూడి ఎత్తిపోతల పథకానికి రూ.60 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.526.27 కోట్లు కాగా, 2012-13 బడ్జెట్లో రూ.61 కోట్లు, గతేడాది బడ్జెట్లో దాదాపు రూ.40 కోట్లు కేటాయించారు. గతేడాదే పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు నేటికీ సాగుతోంది. కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.332.51కోట్లు కృష్ణా డెల్టా ఆధునికీకరణకు (కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు కలిపి) ఈ బడ్జెట్లో రూ.332.51కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో కొంత మన జిల్లాలో పనులకు ఉపయోగిస్తారు. ఏలూరు కాలువను 2 ప్యాకేజీలుగా విభజించి 2008లో పనులు చేపట్టారు. ప్యాకేజీ విలువ మన జిల్లాలో రూ.65.52 కోట్లు. నిధులు చాలక పనులు పూర్తికాకపోవడంతో గతేడాది గడువు పొడిగించినా పూర్తికాలేదు. 2012లో రూ.4.15కోట్లు, 2013లో 9.72 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తిచేశారు. -
సాగునీటి ప్రాజెక్టులకు గతం మాదిరే కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు గత ఏడాది కేటాయించిన స్థాయిలోనే ప్రస్తుత బడ్జెట్లో కూడా నిధులను కేటాయించారు. ఆయా ప్రాజెక్టులకు 2013-14లో కేటాయించిన నిధులకు సమానంగా తాజా బడ్జెట్లో కూడా చూపించారు. ఈ విషయంలో ప్రాజెక్టుల నిర్మాణ దశలను పట్టించుకోలేదు. ఏ ప్రాజెక్టుకు ఎంత మేర నిధులు అవసరమనే విషయాన్ని అంచనా వేయలేదు. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పోయిన ఏడాది మాదిరిగానే అంచనా వేసి బడ్జెట్లో పొందుపరిచారు. కాగా, నిర్మాణ పనుల్ని పక్కన పెట్టిన దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు రూ. 97 కోట్లను కేటాయించడం విశేషం. అలాగే కేంద్రం నుంచి ఏఐబీపీ కింద రూ. 1394.27 కోట్లు రానున్నాయని అంచనా వేశారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎక్కువ నిధులను కేటాయించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ. 1,051 కోట్లను కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ. 87.50 కోట్ల వస్తాయని, రాష్ట్రం నుంచి రూ. 370.50 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించారు. పునరావాస పనులకోసం రూ. 185 కోట్లను కేటాయించారు. -
సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం: వైఎస్ విజయమ్మ
సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చేతగాని పాలన వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి: విజయమ్మ పాత అంచనాలనే తిరగేసి తెచ్చారని విమర్శ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గించుకోవాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం నాయకురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. నీటి పారుదల, గృహ నిర్మాణం, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజుల చెల్లింపు వంటి పథకాలకు ఈ బడ్జెట్లో భారీగా కోతలు వేశారని ఆమె వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో సోమవారం ఆమె సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 2013-14 ఏడాదికి సంబంధించిన సవరించిన అంచనాలే ఇవ్వలేదని... పాత అంచనాలనే మళ్లీ తిరగేసి 2014-15 బడ్జెట్‌పై మాట్లాడ్డానికేమీ లేకుండా చేశారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను తుర్పారబట్టారు. అవి ఆమె మాటల్లోనే.. 2012-13లో రూ. లక్షా 16 వేల కోట్ల మేరకు రాబడిని అంచనా వేయగా.. రూ. లక్షా 3 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 13 వేల కోట్ల లోటు ఏర్పడింది. దాంతోపాటు రూ. 22,850 కోట్ల రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండగా.. రూ. 17,850 కోట్లే సేకరించారు. మొత్తంగా రుణాలు తీసుకోవడంలో 5,300 కోట్లు, రాబడిలో రూ. 13,000 కోట్ల తగ్గుదల కలుపుకొని రూ. 18,000 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం కోల్పోయాం. ఇక కేంద్రం నుంచి మనకు రూ. 14,940 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ రావాల్సి ఉండగా.. 7,687 కోట్లు మాత్రమే వచ్చాయి. 2012-13 సంవత్సరానికి రూ. 54 వేల కోట్ల ప్రణాళికా వ్యయం అంచనాలుండగా... సవరించిన ప్రకారం ఆ మొత్తం రూ. 48 వేల కోట్లకు వచ్చింది. అందులోనూ ఖర్చు చేసింది రూ. 43 వేల కోట్లే. ఇక పెట్టుబడి వ్యయం రూ. 19,972 కోట్లయితే.. ఖర్చు చేసింది మాత్రం రూ. 15,137 కోట్లే. 2004-09 మధ్య కాలంలో 11 నుంచి 12 శాతంగా ఉండిన రాష్ట్ర అభివృద్ధి రేటు.. ఇప్పుడు 5.29 శాతానికి పడిపోయింది. వీటన్నింటి కారణంగా... సంక్షేమ, ప్రజోపయోగ పథకాలకు తక్కువ నిధులు కేటాయించే పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణం. రాష్ట్రంలో 1994 వరకూ ఆస్తులు, అప్పుల నిష్పత్తి 101 ః 100గా ఉంటే 1994-2004 మధ్య కాలంలో (చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా) ఆస్తులు, అప్పుల నిష్పత్తి 50 ః 100గా ఉండేది. అలాంటిది వైఎస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఆస్తులు గణనీయంగా పెరిగాయి. 2004-09 మధ్యలో ఆస్తులు, అప్పుల నిష్పత్తి 130 ః 100 గా ఉండింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అన్నీ ఉండి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ తక్కువగా తెచ్చుకుంది. ప్రణాళికా వ్యయాన్ని కూడా సరిగా ఖర్చు పెట్టలేకపోయింది. ఇద ంతా ప్రభుత్వ ైవె ఫల్యం. చేతగానితనమే.. ఇది చేతగాని ప్రభుత్వం, చేతగాని పాలన. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని కూడా పూర్తిగా చదవలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు దగ్గరలో ఉంది. ప్రజా విద్రోహకం... అంపశయ్యపై ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజావిద్రోహక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అంకెల గారడీతో ప్రజలను మోసపుచ్చిందని దుయ్యబట్టింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి గొప్పలు చెప్పుకొన్నప్పటికీ అందులో తాజా గణాంకాలు లేనేలేవని పేర్కొంది. పార్టీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, బి.గుర్నాథరెడ్డి తదితరులు సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎప్పుడెప్పుడు టీడీపీలో చేరాలనే ఆత్రుతతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కూడా పూర్తిగా చదవకుండా సాంప్రదాయానికి తూట్లు పొడిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్నట్టల్లా ఆడుతున్న సీఎం కిరణ్ బండారం త్వరలో బట్టబయలు కానుందని రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన రోజే కిరణ్ రాజీనామా చేసుంటే విభజన జరిగేదే కాదన్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణలో తన కుమారుడు లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం కోసం చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారని ఆరోపించారు. -
జనాన్ని బాదుడే!
బడ్జెట్లో స్పష్టమైన సంకేతాలు రాష్ట్ర సొంత ఆదాయ అంచనాలు భారీగా పెంపు ఏకంగా 15- 18 శాతం పెరుగుదల చూపిన ప్రభుత్వం ప్రజలపై పెద్దఎత్తున భారం మోపేందుకు సిద్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాస్తవిక ఆదాయం రోజురోజుకీ తగ్గిపోతున్నప్పటికీ గొప్పలు పోయేందుకు ప్రభుత్వం రూపొందించిన తాజా బడ్జెట్... అంతిమంగా ప్రజలపైనే భారీ భారం మోపనుంది. ఒకవైపు వ్యాట్ ఆదాయం పడిపోతున్నా ప్రభుత్వం మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. తద్వారా ప్రజలపై భారీగా వ్యాట్ వడ్డన ఉండనుందని తెలుస్తోంది. గతంలో వ్యాట్ ఆదాయం పెంచుకునేందుకు సర్కారు కొత్తకొత్త వస్తువులపై పన్ను భారం మోపింది. తాజా బడ్జెట్లో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 12 శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా వేసిన ప్రభుత్వం... సొంత ఆదాయంలో మాత్రం ఏకంగా 18 శాతం వరకూ పెరుగుతుందని పేర్కొంది. అంటే ప్రజలపై పెద్ద ఎత్తున పన్నుల భారం మోపేందుకు సిద్ధపడిందన్నమాట! ఇవీ ఆదాయం వివరాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా రూ.24,132 కోట్లు వస్తుందని అంచనా వేయగా 2014-15లో ఈ మొత్తం 27,028 కోట్లు అని లెక్కకట్టింది. అంటే పెరుగుదల 12 శాతం మాత్రమే. రాష్ట్ర పన్నుల ఆదాయం మాత్రం 15 నుంచి 18 శాతం వరకూ పెరుగుతుందని అంచనా వేసింది. 2013-14లో వ్యాట్ రూ.52,500 కోట్లు కాగా వచ్చే ఏడాదిలో ఏకంగా రూ.61,950 కోట్లకు పెరుగుతుందని లెక్కకట్టింది. పెరుగుదల 18 శాతంగా ఉంది. వాస్తవానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాట్ ఆదాయం రూ.36 వేల కోట్లు మాత్రమే. దీనితో లెక్కిస్తే ఏకంగా రూ.50 శాతం పెంపును ప్రభుత్వం ప్రతిపాదించిందన్న మాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం రూ.7,500 కోట్లు కాగా, వచ్చే ఏడాది 15 శాతం పెరిగి రూ.8,625 కోట్లు వసూలు చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం మోటార్ వెహికల్ పన్ను ద్వారా వచ్చే ఆదాయం రూ.4,352 కోట్లు అయితే... ఇది కూడా 15 శాతం పెరిగి 2014-15లో రూ.5,005 కోట్లకు చేరుతుందని లెక్కగట్టింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.6,414 కోట్ల ఆదాయం 15 శాతం పెరిగి రూ.7,377 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు తప్పదన్నమాట! ఓటాన్ అకౌంట్ ఎందుకంటే...? ఎన్నికల సమయంలో కేంద్రంలో కానీ, రాష్ట్రాల్లో కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎన్నికలు జరుగుతాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ప్రభుత్వపాలన సక్రమంగా సాగేందుకు ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలలు లేదా ఆరు నెలల కాలానికిగానీ నిధులను ఖర్చు చేసేందుకు సభ ఆమోదాన్ని పొందుతారు. ఈ ఆమోదం తీసుకోకపోతే ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితి. ఉద్యోగుల జీతభత్యాలకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడుతుంది. అందుకే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-206 ప్రకారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తీసుకుంటారు. ఎన్నికల అనంతరం మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. -
రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్
బడ్జెట్ సమర్పయామీ అసెంబ్లీలో ఆనం, మండలిలో రామచంద్రయ్య ప్రణాళిక వ్యయం 67,950 కోట్లు.. ప్రణాళికేతర వ్యయం రూ. 1,15,179 కోట్లు ఓటాన్ అకౌంట్ మొదటి 6 నెలల కాలానికి రూ. 79,460 కోట్లు వ్యయం వందశాతం వైకల్యం ఉంటే వెయ్యి రూపాయల పింఛన్ సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మండలిలో సభా నాయకుడు సి.రామచంద్రయ్య సోమవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.1,83,129 కోట్ల బడ్జెట్లో ప్రణాళిక వ్యయం కింద రూ.67,950 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.1,15,179 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళితం చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ఓటాన్ అకౌంట్లో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి రూ.79,469 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, పేదల కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను గుర్తు చేశారు. ద్రవ్యలోటు రూ.25,402 కోట్లుగా అంచనా వేయగా, రెవెన్యూ మిగులు రూ.474 కోట్లుగా తేల్చారు. ఎస్సీ, ఎస్టీల సత్వర అభ్యున్నతి కోసం ‘ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాలు, తెగల ఉప ప్రణాళిక ఆర్థిక వనరుల చట్టం’ తీసుకు వచ్చినట్లు వివరించారు. బంగారు తల్లి పథకం కింద బాలికా ప్రోత్సాహాక సాధికారత చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. - 2012-13 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.78,564. ఇది దేశ తలసరి ఆదాయం కంటే అధికం. - రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు గతేడాది 5.78 మాత్రమే.. అయినా వ్యవసాయ (7.78%), సేవా (7.75%) రంగాలు గణనీయ ప్రగతి సాధించాయి. - పారిశ్రామిక ప్రగతి ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదు. - 2004-05 ఆర్థిక సంవత్సరంలో 29.9 శాతం ఉన్న పేదరికం.. 2011-12 సంవత్సరానికికల్లా 9.2 శాతానికి తగ్గింది. - తృణధాన్యాల అభివృద్ధిలో మంచి ప్రగతి సాధించినందుకు కేంద్రం రాష్ట్రానికి కృషి కర్మాన్ అవార్డు ఇచ్చింది. - 25.54 లక్షల మందికి రూ.1,507 కోట్ల సబ్సిడీని ఆన్లై న్లో పంపిణీ చేశాం. - 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 207.29 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా. - దేశంలోనే కోడి గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. - పావలా వడ్డీ రుణాన్ని వడ్డీలేని రుణాలుగా మార్చాం. ఈ రెండింటి కింద ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.2,659 కోట్లు పంపిణీ చేశాం. - వందశాతం వైకల్యం ఉంటే పింఛన్ రూ.500 నుంచి రూ.1000కి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. - అమ్మహస్తం కింద రూ.185కు నిత్యవసర వస్తువులు ఇస్తున్నాం. - జలయజ్ఞంలో 17 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కొత్తగా 19.40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడింది. - త్వరగా పూర్తయ్యే పథకాలకు ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయిస్తున్నాం. - 18 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 40 రకాల సేవలను ఏకగవాక్ష వ్యవస్థలోకి తె చ్చినందుకు రాష్ట్రానికి ఇ-బిజ్ అవార్డు లభించింది. - కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 2013-14లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - దుగ్గరాజపట్నంలో భారీ నౌకాశ్రయం, మచిలీపట్నంలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం కింద మరో నౌకాశ్రయం, భావనపాడు, కళింగపట్నంలో చిన్న నౌకాశ్రయాలు ఏర్పాటు చేస్తాం. - చిత్తూరు జిల్లాలో మొదటి దశలో రూ.5,990 కోట్లు, రెండో దశలో రూ.1,400 కోట్లతో మంచినీటి పథకం చేపడుతున్నాం. - రాష్ట్రం నుంచి రూ.51,285 కోట్ల ఐటీ ఎగుమతుల టర్నోవర్ సాధించాం. ఐటీఐఆర్, గే మ్పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. - 2014 సంవత్సరంలో రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు 2,370 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభిస్తాయి. - పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్‌గాంధీ పంచాయతీ సశక్తికరణ్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.203 కోట్లు కేటాయించింది. - ఉద్యోగులకు ఆరోగ్య పథకం ప్రారంభించాం. - రూ.22,377 కోట్లతో ఇప్పటివరకు 66.11 లక్షల గృహాలు నిర్మించాం. కొత్తగా భాషా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. - ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రహ దారులను పీపీపీ కింద నాలుగు లేన్ల రోడ్లుగా మార్చాలని నిర్ణయించాం. - మహిళలకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం. కొత్తగా 98,652 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. - 2012-13 సంవత్సరంలో తుది లెక్కలు ఆధారంగా రూ.1,128 కోట్ల రెవెన్యూ మిగులు తేలింది. 2013-14లో ఇది రూ.1,023 కోట్లుగా, 2014-15లో ఇది 474 కోట్లుగా ఉంటుందని అంచనా. మమ అనిపించారు.. అసెంబ్లీలో బడ్జెట్ తంతు మొక్కుబడిగా ముగిసింది. తెలంగాణ మంత్రులు, అధికార, విపక్ష సభ్యుల నిరసనలతో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిగా చదవలేక కేవలం పది నిమిషాల్లోనే మమ అనిపించారు. మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో.. టీ బిల్లు తిరస్కరించే తీర్మానాన్ని ఆమోదించే విషయుంలో సీఎం, స్పీకర్ ఒక ప్రాంతానికి అనుగుణంగా వ్యవహరించారని, అలాగే ఢిల్లీలో వుహిళా వుంత్రులను అవవూనించారని ఆరోపిస్తూ తెలంగాణకు చెందిన మంత్రులు నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన మంత్రిమండలి ప్రత్యేక సమావేశానికి సైతం తెలంగాణ మంత్రులు హాజరు కాలేదు. సభలో టీఆర్ఎస్, టీ కాంగ్రెస్, టీ టీడీపీ సభ్యులు పెద్దపెట్టున తెలంగాణ నినాదాలు చేశారు. సభ సజావుగా లేనందున ప్రసంగాన్ని చదివినట్లుగానే భావించాలంటూ ప్రసంగ పాఠంలోని ముందు నాలుగు పేజీలు, చివర్లో బడ్జెట్ పరిమాణాన్ని వివరించి 13వ శాసనసభ చివరి బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. పెద్దల సభ ఇంతకంటే మరీ అధ్వానంగా సాగింది. సభా నాయకుడు రామచంద్రయ్య బడ్జెట్ ప్రసంగం ప్రారంభించక ముందే తెలంగాణ ప్రాంత సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. ఏం జరుగుతుందో తెలియని గందరగోళం మధ్యే.. చైర్మన్ ఆదేశాల మేరకు మంత్రి ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ సభ్యులు సభా నాయకుడి మైక్‌కు అడ్డంగా చేతులు పెట్టి ప్రసంగించకుండా అడ్డుకున్నారు. దీంతో నిమిషానికే ప్రసంగం ముగించినట్లు పరిగణిస్తూ చైర్మన్ సభను వాయిదా వేశారు. మొత్తమ్మీద కొత్త పథకాలుగానీ, కొత్త కార్యక్రవూలుగానీ, ఉన్న పథకాలకు అధిక కేటారుుంపులుగానీ కనిపించకుండా.. కేవలం ఈ తంతు ముగిస్తే చాలన్న రీతిలో సభా వ్యవహారాలు కొనసాగాయి. -
ఈసారీ మొండిచెయ్యే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :రాష్ట్ర బడ్జెట్ జిల్లా వాసులకు ఈసారీ నిరాశే మిగిల్చింది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అరకొర నిధులే విదిల్చింది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ జిల్లా ప్రయోజనాలను విస్మరించింది. వంశధార, మడ్డువలస, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తిచేయడంపై ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి చూపించ లేదు. అసలు ఆ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి ఏమిటి? పూర్తి చేయాలంటే ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలన్న విషయాన్నే పట్టించుకోలేదు. ప్రాజెక్టుల పూర్తి కోసం అధికారులు గత ఏడాది నవంబర్‌లో పంపిన ప్రతిపాదనలకు, బడ్జెట్లో కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. దిశానిర్దేశం లేని ప్రభుత్వ వైఖరి వల్ల జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సందిగ్ధంలో పడిన తీరు ఇలా ఉంది.. వంశధారపై పూర్తి నిర్లక్ష్యం.. జిల్లాను సస్యశ్యామలం చేసేం దుకు ఉద్దేశించిన వంశధార ప్రాజెక్టుపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపింది. లక్ష ఎకరాలకుపైగా సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు అరకొర నిధుల కేటాయింపు విస్మయపరుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.13 కోట్లు మాత్రమే కేటాయించడం జిల్లా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. 2004లో అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.933 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అంతటి భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఈసారి కేవలం రూ.13 కోట్లు మాత్రమే విదల్చడం విడ్డూరం. ఇప్పటికే ఒడిశాతో ఉన్న వివాదాలతో ప్రాజెక్టు మూడేళ్లుగా పెండింగులో పడిపోయింది. ఆ వివాదం మన రాష్ట్రానికి అనుకూలంగా ఇటీవలే పరిష్కారం దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారీగా నిధులు ఇస్తే ప్రాజెక్టు పనులు చకచకా సాగుతాయని అంతా ఆశించారు. కానీ బడ్జెట్లో ప్రభుత్వ కేటాయింపు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. 2013-14 వార్షిక బడ్జెట్లో వంశధార ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.45 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఈ ఏడాది కాలంలో కేవలం రూ.1.50 కోట్ల విలువైన పనులు మాత్రమే జరగటం విస్మయపరిచే వాస్తవం. ఈసారి బడ్జెట్లోనైనా పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశ నిరాశే అయింది. నీటిపారుదల శాఖ అధికారులు గత ఏడాది నవంబర్‌లో పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం అస్సలు పట్టించుకో లేదు. ప్రాజెక్టు పనుల కోసం రూ.120 కోట్లు, భూసేకరణకు రూ.10 కోట్లు, నష్టపరిహారం కోసం రూ.50 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. వీటితోపాటు ఓపెన్‌హెడ్ చానల్ పనుల కోసం రూ.50.66 కోట్లు కావాలని కోరారు. కానీ ప్రభుత్వం కేవలం రూ.13 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఓపెన్ హెడ్ చానల్ పనుల కోసమే రూ.13 కోట్లు కేటాయించారని అధికారులు భావిస్తున్నారు. అంటే ఆ పనులు ఈ అరకొర నిధులతో పూర్తికావు. ఇక ప్రాజెక్టు పనులు, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు అనేవి పూర్తిగా అటకెక్కినట్లేనని అధికారులు నిసృ్పహ వ్యక్తం చేస్తున్నారు. తోటపల్లి’కి తోడ్పాటేదీ! శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వరప్రదాయినిగా గుర్తింపు పొందిన తోటపల్లి ప్రాజెక్టుపై ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. మసి పూసి మారేడు కాయ చేసిన తీరులో గణాంకాలతో కనికట్టు చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో తోటపల్లి ప్రాజెక్టుకు రూ.120 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నిధులు భారీగా కేటాయించినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఉంది అసలు కనికట్టు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. అందులో ఈ జిల్లాలోని 80 వేల ఎకరాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మూడేళ్లుగా నిధులు సక్రమంగా కేటాయించడం లేదు. ఫలితంగా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికాకపోవడంతో అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. తొలుత రూ.540 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు తాజా అంచనా ఇప్పటికే రూ.800 కోట్లకు చేరింది. గత ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. కానీ వాస్తవానికి రూ.60 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దాంతో నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తికాలేదు. ఈ ఏడాది అనుకున్న విధంగా పనులు పూర్తికావాలంటే కనీసం రూ.106 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గత ఏడాది పెండింగులో ఉన్న రూ.60 కోట్లకు అదనంగా ఈ రూ.106 కోట్లు కేటాయించాలని కోరారు. అంటే మొత్తం రూ.166 కోట్లు అవసరమని నివేదించారు. కానీ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో కేవలం రూ.120 కోట్లు మాత్రమే కేటాయిస్తునట్లు ప్రకటించింది. ఈ నిధులు దేనిదేనికి ఖర్చుచేయాలో కూడా స్పష్టం చేయలేదు. వాస్తవానికి అందులో ఎంత విడుదల చేస్తుందో కూడా సందేహమే. ప్రభుత్వం ఈ రీతిలో అంకెల గారడీ చేసి రైతాంగాన్ని మోసం చేసిందనే చెప్పాలి. దాంతో కీలకమైన తోటపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది కూడా పనులు అనుకున్న విధంగా పూర్తికావడం దాదాపు అసాధ్యమేనని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఆఫషోర్ రిజర్వాయర్‌కు మోక్షమెప్పుడో! మహేంద్రతనయ నదిపై చేపట్టిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులకు కూడా ప్రభుత్వం మొండిచెయ్యే చూపించింది. ఈ ఏడాది ప్రతిపాదిత పనుల కోసం కనీసం రూ.46 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం కేవలం రూ.15కోట్లతో సరిపెట్టింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.127 కోట్ల అంచనాతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తద్వారా టెక్కలి, నందిగాం, పలాస, మెళియాపుట్టి మండలాల్లోని 24,600 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఆ మహానేత లక్ష్యం. అంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకు రూ.36.30 కోట్లు మాత్రమే కేటాయించడంతో 12 శాతం పనులే పూర్తయ్యాయి. మరో 600 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. చాపర నుంచి రిజర్వాయర్ వరకు 13.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన వరద కాలువ పనుల్లో ఇప్పటికి 5.9 కిలోమీటర్ల వరకే పూర్తయ్యాయి. పూలసారి వద్ద 5.9 కిలోమీటర్ల నుంచి 6.5 కిలోమీటర్ల వరకు 600 మీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. అక్కడనుంచి రిజర్వాయర్ వరకు వరద కాలువ నిర్మించాల్సి ఉంది. హీరాపురం నుంచి రేగులపాడు వరకు గల 2.28 కిలోమీటర్లు రోడ్డు రిజర్వాయర్‌లో కలుస్తుంది. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ రోడ్డును కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్ ఎర్త్‌బండ్ వద్ద కటాఫ్ ట్రెంచ్ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రభుత్వం తాజా బడ్జెట్లో కూడా నిధులు సరిగా కేటాయించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం సందిగ్ధంలో పడింది. మడ్డువలస’కూ అరకొరే! భారీ నిధులు అవసరమైన ప్రాజెక్టులకు మొండిచెయ్యి చూపిన ప్రభుత్వం కనీసం మడ్డువలస ప్రాజెక్టును కూడా కనికరించలేదు. కొంచెం చిత్తశుద్ధి చూపితే పూర్తయిపోయే ఈ ప్రాజెక్ట్‌కు కూడా తగినన్ని నిధులు కేటాయించ లేదు. ప్రాథమికంగా 24,700 ఎకరాలకు, తదనంతరం మరో 12,500 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో న్యాయం చేయలేదు. జి.సిగడాం, పొందూరు, లావేరు మండలాల్లో 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరు అందించేందుకు రూ.39 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం కేవలం రూ.15 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. దీంతో ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జిల్లాకు రిక్తహస్తం
సాక్షి ప్రతినిధి, గుంటూరు :రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జిల్లాలోని వివిధ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని, గత ఏడాది సాధించిన ప్రగతిని వివరించకుండా మంత్రి అంకెల గారడీ చేశారని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు తక్కువగా ఉందని, కేటాయింపుల్లో ఎక్కువ మొత్తం బకాయిల చెల్లింపునకు సరిపోతుందంటున్నారు. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలకు, మెటీరియల్ సరఫరాదారులకు ఈ మొత్తాలు సరిపోతాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వాటాగా రావాల్సిన నిధులు కూడా తెచ్చుకునే ప్రయత్నమే జరగలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యవసాయం, సాగునీరు, రహదారులు తదితర శాఖలకు రాష్ట్ర స్థాయిలో భారీగా కేటాయింపులు జరిగినా గుంటూరు జిల్లాకు ఆ స్థాయిలో లేవని తెలుస్తోంది.బడ్జెట్లో సాగునీటిశాఖకు గత ఏడాది ఎంత కేటాయింపులు జరిగాయో అంతే మొత్తాలను దాదాపుగా తిరిగి కేటాయించారు. = సాగర్ ఆధునికీకరణకు రూ.743 కోట్లు కేటాయించారు. కుడి కాలువకు సంబంధించి రూ.252 కోట్లు, ఎడమ కాలువకు రూ.370 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో రూ.4444 కోట్లను సాగర్ ఆధునికీకరణకు కేటాయించింది. అయితే నిర్మాణ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించలేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు పరిమితంగానే విడుదల అయ్యాయి. = కృష్ణాడెల్టా ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.332.51 కోట్లను కేటాయించింది. సార్వత్రిక ఎన్నికలు రానున్న దృ ష్ట్యా ఈ మొత్తాన్ని ఈ సంవత్సరంలో పూర్తిగా ఖర్చు చేసే అవకాశం లేదని సాగునీటిశాఖ అధికారులు చెబుతున్నారు. = వ్యవసాయం: నీలం తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని సకాలంలో ఆదుకున్నామంటూ ఆర్థిక మంత్రి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపర్చడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపించాయి. నీలం తుపాను కారణంగా జిల్లాలోని 42 వేల మంది రైతులు నష్టపోగా ,32 వేల మందే పంటలు కోల్పోయారనీ, రూ.17 కోట్లు సరిపోతాయంటూ ప్రభుత్వం అరకొరసాయాన్ని విదిల్చింది. ప్రకటించిన మొత్తాలను కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనేలేదు. = విద్యుత్: రాష్ట్ర వ్యాప్తంగా ఏటా లక్ష మంది రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని చెబుతున్న పాలకుల మాటలు ఫైళ్ళు దాటడం లేదు. పెండింగ్ దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని, పంపిణీ కంపెనీలను కనెక్షన్లు పెంచాలని ఆదేశించినట్లు మంత్రి ఓటాన్ అకౌంట్లో వల్లె వేశారు. అయితే కాంగ్రెస్ సర్కారు మాటల్లో వాస్తవం లేదు. జిల్లాలో 5,900 కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, అయితే ఇప్పటివరకు 1,564 మాత్రమే మంజూరు చేశారు. = వైద్యం: జిల్లా వైద్య రంగానికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ఎంతో కీలకమైన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు జరగలేదు. ఈ ఏడాది గుంటూరు వైద్య కళాశాలకు అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు బోధనాసిబ్బందిని కేటాయించలేదు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఏళ్లతరబడి ఖాళీగా వున్న వైద్యులు, వైద్య సిబ్బంది భర్తీ ప్రస్తావన లేదు. = విద్య: జిల్లా విద్యారంగానికి కేటాయింపులు జరగలేదు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పథకం ద్వారా జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు మూడుదశల్లో 257 పాఠశాలలకు అదనపు తరగతులు మంజూరు కాగా, ఇప్పటి వరకు 100 పాఠశాలలకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. మిగిలిన 157 పాఠశాలకు నిధుల విడుదల చేయకపోవడంతో వాటి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లాలో అక్షరాస్యతలో వెనుకబడిన 16 మండలాల్లో మోడల్ స్కూల్స్ అవసరం కాగా, వీటిపై బడ్జెట్లో ప్రస్తావించలేదు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా జిల్లాలో వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టు ప్రకటించలేదు. -
మురిగిన నిధులే తిరిగొచ్చాయి
సాక్షి, సంగారెడ్డి: ఈసారీ అవే విదిలింపులు. పాత కేటాయింపులతోనే సరిపుచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2014-15) జిల్లావాసులను ఉసూరుమనిపించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల ముందుకు వచ్చిన ఈ బడ్జెట్లో జిల్లాకు కొత్తగా ప్రత్యేక కేటాయింపులేవి లేకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది. 2013-14 బడ్జెట్‌లాగానే ఈ బడ్జెట్లో సింగూర్ ప్రాజెక్టు, సుల్తాన్పూర్ జేఎన్టీయూలకు పాత కేటాయింపులు కేటాయించారు. జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు సింగూర్‌కు రూ.40 కోట్లు, పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్‌లో నిర్వహిస్తున్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు రూ.121 కోట్ల నిధులను ఈ బడ్జెట్లో కేటాయించారు. జహీరాబాద్ మండలం చిరాగ్పల్లితో పాటు రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాల్లో సమీకృత చెక్‌పోస్టుల నిర్మాణాల కోసం రూ.25 కోట్ల నిధులు కేటాయించారు. ఇవి మినహా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ లేవు. మళ్లీ అదే కథ.. సింగూర్ ప్రాజెక్టుపై కాల్వలతోపాటు ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.58.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సింగూర్ కాల్వల పథకం పనులు 55 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఈ పథకం పూర్తి కావాలంటే ఇంకా రూ.26 కోట్ల నిధులు అవసరం. రూ.20.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పనులు 42 శాతం పూర్తయ్యాయి. ఎత్తిపోతల పూర్తికావాలంటే రూ.12 కోట్లు నిధులు అవసరం. దాదాపు రూ.38 కోట్ల నిధులను ఖర్చు చేస్తే ఈ రెండు నిర్మాణాలు పూర్తయి ఆయకట్టుకు నీళ్లు పారనున్నాయి. గతేడాది కింద ఈ పనుల ఏ స్థితిలో ఉన్నాయో ప్రస్తుతం అలానే ఉన్నాయి. పనుల్లో ఏమాత్రం పురోగతి లేకపోవడంతో గతేడాది బడ్జెట్లో కేటాయించిన రూ.40 కోట్ల నిధులు మురిగిపోయాయి. దీంతో సింగూర్ ప్రాజెక్టు గత బడ్జెట్లో కేటాయించిన రూ.40 కోట్లనే ఈ ‘సారీ’ విదిలించారు. వచ్చే ఏడాదికాలంలోనైనా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే కేటాయించిన నిధులు వినియోగంలోకి రానున్నాయి. సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితి కూడా దాదాపు అంతే. గత బడ్జెట్లో కేటాయించిన రూ.121 కోట్ల నిధులను పూర్తిగా వినియోగించుకోకపోవడంతో మళ్లీ వాటినే తిరిగి కేటాయించారు. ప్రాణ‘హిత’మే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఈసారి కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో రూ.737.05 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ. 1051.05 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నాయి. ఒక్క మెదక్ జిల్లాలోనే 5,19,152 ఎకరాల ఆయకట్టుకు నీరు పారనున్నాయి. కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకుంటేనే సమీప భవిష్యత్తులో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. -
జిల్లాకు రిక్త హస్తం
బడ్జెట్ కేటాయింపులు అరకొర ఆశలు గల్లంతు విమ్స్‌కు రూ.10 కోట్లు కేజీహెచ్‌ను విస్మరించారు రాష్ట్ర విభజన అంశం.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణం.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు వరాల వర్షం కురుస్తుందని అందరూ భావించారు. చివరి బడ్జెట్లో ప్రభుత్వం జిల్లాకు రిక్తహస్తాన్నే చూపించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్న సీఎం.. సీమాంధ్రకు చెందిన ఆర్థిక శాఖా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఈ బడ్జెట్లో జిల్లాకు పెద్ద పీట వేస్తారన్న ఆశలు నెలకొన్నాయి. అందుకు భిన్నంగా అరకొర నిధులతో చేతులు దులుపుకున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత ప్రధాన నగరమైన విశాఖ అభివృద్ధిని గాలికొదిలేశారు. పురోగతి సాధించని నీటి పారుదల శాఖకు కూడా నిర్వహణలకు అంచనా వ్యయాన్ని చూపించారు తప్పా.. పూర్తి స్థాయిలో అవసరమైన కేటాయింపులు చేయలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్షా 83 వేల 129 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో జిల్లాకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం రూ.30 కోట్లు వరకు మాత్రమే కేటాయించింది. ప్రతిపాదిత ప్రాజెక్టులకు కానీ, ప్రస్తుతం కొనసా..గుతున్న వాటికి కానీ ఎటువంటి నిధులను మంజూరు చేయకపోవడం గమనార్హం. నీటి పారుదలకు అరకొర నిధులు జిల్లాలో నీరుపారుదల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రతీ ఏటా బడ్జెట్లో అన్యా యం జరుగుతూనే ఉంది. కనీసం రిజర్వాయర్ల నిర్వహణకు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. ప్రతీ ఏటా వ రదలు కారణంగా రిజర్వాయర్లు దెబ్బతింటు న్నా.. వాటి మరమ్మతులకు పైసా కూడా ఇవ్వ డం లేదు. అధికారులు పంపించిన ప్రతిపాదనలను కూడా కనీసం పరిశీలించలేనట్లు తెలుస్తోంది. ఎన్నికల బడ్జెట్‌గా ప్రవేశపెట్టిన ఇందు లో కూడా జిల్లా నీటి పారుదల శాఖకు అరకొరగానే నిధులు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్యాన్ని మరిచారు.. : జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు ఈసారి కూడా మొండి చెయ్యి చూపించారు. విమ్స్‌కు మాత్రం రూ.10 కోట్లు కేటాయించారు. వాస్తవానికి విమ్స్‌కు రూ.60 కోట్లు అవసరమని రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటి వరకు దశల వారీగా విడుదల చేస్తూ వస్తున్నారు. దీంతో నిర్మాణ, అవసరాల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు వైద్య సేవలందిస్తున్న కేజీహెచ్‌లో అదనపు బ్లాక్‌ల నిర్మాణం, నిర్వహణలకు ఈసారి బడ్జెట్లో నిధులు వస్తాయని భావించినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించారు. అదే విధంగా విక్టోరియా ఆస్పత్రి, ప్రభుత్వ ఈఎన్టీ, ఇతర ఆస్పత్రులకు కూడా ఎటువంటి నిధులివ్వలేదు. విమానాశ్రయానికి కేవలం రూ.కోటి మాత్రమే ఇచ్చారు. -
'టిడిపిలో ఎప్పుడు చేరదామా అన్న తొందరలో ఆనం'
-
'టిడిపిలో ఎప్పుడు చేరదామా అన్న తొందరలో ఆనం'
హైదరాబాద్: టీడీపీలో ఎప్పుడు చేరదామా అనే తొందరే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలో కనిపించిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభలో ఆనం రాజ్యంగ సాంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించారని అన్నారు. బడ్జెట్లో వాస్తవాలు లేవని ఆయన తెలిపారు. గత ఏడాది ఏం సాధించారో చెప్పలేదన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించలేదని చెప్పారు. ప్రభుత్వ అసమర్ధత వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకురాలేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గేస్తుందన్నారు. ప్రభుత్వ చేతగాని తనం కళ్లకు కట్టినట్లుందని పేర్కొన్నారు. టీడీపీకి పీఆర్పీకి పట్టినగతే పడుతుందన్నారు. చంద్రబాబు టీడీపీని త్వరలోనే బీజేపీలో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవికి పరిమితం అవుతారని జోస్యం చెప్పారు. -
'మేం అన్ని వర్గాలకు మేలు చేస్తాం'
హైదరాబాద్ : ప్రభుత్వ అసమర్థత వల్లే సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆమె సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే స్థితిలో ప్రభుత్వం లేదని విజయమ్మ విమర్శించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆస్తులు తక్కువగా ఉండి అప్పుల నిష్పత్తి ఎక్కువగా ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ఎక్కువగా ఉంచి ....అప్పులు తగ్గించారని విజయమ్మ అన్నారు. చేతకాని ప్రభుత్వం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని సాగనంపే రోజు దగ్గరలోనే ఉందని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి బడ్జెట్‌ను కూడా పూర్తిగా చదవలేక పోయారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు చేసే బడ్జెట్ ఉంటుందని విజయమ్మ హామీ ఇచ్చారు. -
మేం అన్ని వర్గాలకు మేలు చేస్తాం
-
'చదివే ఓపిక కూడా లేదా'
హైదరాబాద్ : అసెంబ్లీలో ఆర్థికమంత్రి రాంనారాయణ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంపశయ్య మీద ఉన్న ప్రభుత్వం మరోసారి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని ఆపార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సామాన్యులను వంచించే బడ్జెట్ అని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే బడ్జెట్ కాదని ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కె.శ్రీనివాసులు అన్నారు. ప్రజా విద్రోహక బడ్జెట్‌గా అభివర్ణించారు. ధనికుల బడ్జెట్ తప్ప, సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. బడ్జెట్‌ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. పూర్తిస్థాయిలో బడ్జెట్ చదవకుండా తప్పించుకున్నారని...ఆర్థిక మంత్రి సిగ్గులేని మంత్రి అంటూ ధ్వజమెత్తారు. ఆర్థికమంత్రికి బడ్జెట్ కూడా చదవే ఓపిక కూడా లేకపోవటం దారుణమన్నారు. ప్రచార ఆర్భాటాలే తప్ప...సంక్షేమ పథకాల ఊసే లేదన్నారు. బడుగు, బలహీన వర్గాలు...పేద విద్యార్థుల ప్రస్తావన లేకపోవటం దారుణమన్నారు. ఇందిర జలప్రభ కింద లబ్ది దారులను వేధించారని... బంగారుతల్లి పథకం లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్నారని వారు మండిపడ్డారు. రోజుకు రెండు గంటలు కూడా రైతులకు విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్ఆర్ హయాంలోని ప్రాజెక్టులకు ఇప్పటి సీఎం ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.