Anil Kumar Serious Comments Over Nara Lokesh And Anam Ramanarayana - Sakshi
Sakshi News home page

ఆనం, లోకేశ్‌కు మాజీ మంత్రి అనిల్‌ కౌంటర్‌.. ఏమన్నారంటే

Published Sat, Jun 24 2023 1:43 PM | Last Updated on Sat, Jun 24 2023 2:05 PM

Anil Kumar Serious Comments Over Nara Lokesh And Anam Ramanarayana - Sakshi

సాక్షి, నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌కు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. పులకేశి చేసేది పాదయాత్ర కాదు. లోకేశ్‌.. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. నువ్వు గతంలో పోటీ చేసిన మందలగిరిలో మందు గెలువు అంటూ కామెంట్స్‌ చేశారు. 

కాగా, అనిల్‌ కుమార్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేశ్‌కు సరిగ్గా మాట్లాడటం కూడా రావడం లేదు. సాగునీటి ప్రాజెక్ట్‌లపై చర్చకు నేను సిద్ధం. లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పనులు స్టార్ట్‌ చేశాం. 

టీడీపీ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లోకేశ్‌.. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. నువ్వు గతంలో పోటీ చేసిన మందలగిరిలో మందు గెలువు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరే చరిత్ర ఆనం రామనారాయణది. అవినీతి చేసిన ఆనంను పక్కన పెట్టుకుని లోకేశ్‌ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదు. పార్టీలో ఉన్న కలుపు మొక్కలను మేమే పీకి పక్కడ పడేశాం. 

ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ.. లోకేశ్‌ పాదయాత్ర వల్ల టీడీపీకే నష్టం. ఎవరెన్ని పాదయాత్రలు చేసినా మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. లోకేశ్‌ పాదయాత్ర అట్టర్‌ ప్లాప్‌. జనాలు లేక లోకేశ్‌ పాదయాత్ర వెలవెలబోతోంది అంటూ కామెంట్స్‌ చేశారు.  

ఇది కూడా చదవండి: ‘ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తోనే ఉంటాను’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement