తిరుమల, సాక్షి: తిరుమలలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తుడు మూడు రోజులుగా శ్రీవారి దర్శనం కాలేదని, వీఐపీలు మాత్రమే భక్తులా అంటూ శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రిని నిలదీశాడు. తిరుమలలో సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారని అన్నారు.
గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా ఆహారం అందలేదని, శ్రీవారి దర్శనం చేసుకోలేక పోతున్నామని భక్తులు ప్రశ్నించారు. ఆలయం ముందు భక్తులు ప్రశ్నించడంతో మళ్లీ మాట్లాడుతానంటూ మంత్రి రామనారాయణరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment