టీడీపీ బలోపేతానికి కృషి | Meeting at Nellore TDP office | Sakshi
Sakshi News home page

టీడీపీ బలోపేతానికి కృషి

Published Mon, Aug 29 2016 12:54 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీ బలోపేతానికి కృషి - Sakshi

టీడీపీ బలోపేతానికి కృషి

 
  •  మాజీ మంత్రి, ఆత్మకూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు(వేదాయపాళెం):
సమష్టి కృషితో జిల్లాలో టీడీపీరి బలోపేతం చేస్తామని మాజీ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో విభేదాలకు తావులేకుండా ముందుకు సాగాలన్నారు. తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబునాయుడు ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించారని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి పాటుపడతానన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో మెలగాలన్నారు. ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పరసా రత్నం, నెలవల సుబ్రమణ్యం, నాయకులు కిలారి వెంకటస్వామినాయుడు, కొండ్రెడ్డి రంగారెడ్డి, పట్టాభిరామిరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, హరిబాబు పాల్గొన్నారు. అనంతరం ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు, వెంకటగిరి, పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు ఆయనకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement