సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ గ్రిడ్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసాలు వెలుగు చూశాయని, బూత్ కమిటీల పరిశీలన వల్లే ఈ అక్రమాలు బయట పడ్డాయని వైఎస్సార్ సీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహించి ఓట్లను తొలగిస్తున్న తీరును బట్టి చూస్తే.. రాష్ట్రంలో ప్రజల జీవితాలకు భద్రత లేదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ నాయకుడికి మద్దతు ఇస్తున్నారో తెలుసుకుని వారి ఓట్లను తొలగిస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌లు ఈ కుంభకోణం వెనుక వున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌ల తప్పిదాలు బయటపడకుండా ఉండేందుకు కొన్ని పత్రికలు ఎదురుదాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ సమాచారం ప్రైవేట్ సంస్థలకు ఎలా వెళ్లిందో ఎన్నికల సంఘం విచారణ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment