రఘువీరా మట్టి యాత్ర... ఒట్టి యాత్రే | Anam Ramnarayan reddy takes on Raghuveera reddy | Sakshi
Sakshi News home page

రఘువీరా మట్టి యాత్ర... ఒట్టి యాత్రే

Published Fri, Nov 13 2015 2:10 PM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

రఘువీరా మట్టి యాత్ర... ఒట్టి యాత్రే - Sakshi

రఘువీరా మట్టి యాత్ర... ఒట్టి యాత్రే

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం మండిపడ్డారు. రఘువీరారెడ్డి చేపట్టిన మట్టియాత్ర... ఒట్టియాత్ర అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల్లో చైతన్యం లేకుండా ఎన్ని యాత్రలు చేపట్టిన వృథానే అని ఆనం స్పష్టం చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడంపై ఆనం ఈ సందర్భంగా స్పందించారు. చంద్రబాబును కలిసేందుకు ఎందుకు వెళ్లారో పవన్ కల్యాణ్కే తెలియదన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మట్టి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement