raghuveera reddy
-
అత్యాచారం తర్వాత..బండరాయి కట్టి విచారణలో విస్తుపోయే నిజాలు..
-
పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్.. రఘువీరా ప్లాన్ అదేనా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయనొక సీనియర్ పొలిటీషియన్. కొన్నేళ్ళ క్రితం రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. కాని కొంతకాలం క్రితం మళ్ళీ యాక్టివ్‌గా మారారు. కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేసి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తున్నారాయన. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన వేస్తున్న ప్లాన్ ఏంటి? కొన్నేళ్ళ క్రితం రాజకీయ సన్యాసం తీసుకుని మళ్ళీ యాక్టివ్‌గా మారిన ఈ రాజకీయ నాయకుడి పేరు నీలకంఠాపురం రఘువీరారెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మడకసిర ఎస్సీ రిజర్వుడు సీటుగా మారిపోయింది. 2009లో కల్యాణదుర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భూ స్థాపితం కావడంతో విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు రఘువీరారెడ్డి. అయితే కర్నాటక ఎన్నికల సమయంలో అక్కడ ప్రచారం చేసి మళ్ళీ కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా మారారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడయ్యారు. తన రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్న రఘువీరారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటైనా సాధించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వ్డ్ మడకశిర నియోజకవర్గంలో తన ముఖ్య అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌ను బరిలో దించాలని భావిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పక్క రాష్ట్రాల నేతలతో రఘువీరారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన రఘువీరారెడ్డికి అక్కడి కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని మడకశిర నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కర్నాటక మంత్రులను ఇంఛార్జులుగా తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. మడకశిర ఆంధ్ర - కర్నాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడి ప్రజలు కన్నడ భాష కూడా మాట్లాడుతారు. దీంతో కర్నాటక రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను మడకశిరకు తీసుకొచ్చి అన్నివిధాలుగా ఉపయోగించుకోవాలని రఘువీరారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. -
రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్..పెద్దిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అనంతపురం: రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్ అంటూ మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై ఎలాంటి హత్య కేసులు లేవని.. రఘువీరారెడ్డి ఆరోపణలు అర్థరహితమన్నారు. తనపై హత్య కేసులున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్ రాప్తాడు సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి అన్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాప్తాడు సభలో పాల్గొంటాయి. మధ్యాహ్నం 1 గంటకు రాప్తాడు ‘సిద్ధం’ సభ ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని -
నాడు ‘పోలవరం’పై టీడీపీ తప్పు చేసింది: రఘువీరారెడ్డి
సాక్షి, మడకశిర: జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణ బాధ్యతను టీడీపీ ప్రభుత్వం నెత్తినెత్తుకుని తప్పు చేసిందని సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శనివారం శ్రీసత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ కృషితోనే పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుందనేది జగమెరిగిన సత్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మతతత్వ బీజేపీ ఓడిపోతేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశానికి ‘ఇండియా’ కూటమి అవసరం చాలా ఉందని చెప్పారు. ఈ నెల 9న ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని తెలిపారు. చదవండి: స్కిల్ కార్పొరేషన్‌కు, టీడీపీకి ఒకరే ఆడిటర్ -
టీడీపీ స్వీయ తప్పిదాల వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారు: రఘువీరారెడ్డి
-
CWC: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రఘువీరా సహా వీరికి చోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్నట్లు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. తెలుగు నేతలకు చోటు.. కాగా, ఈ సమావేశం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 16వ తేదీన సమావేశానికి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని మల్లికార్జున ఖర్గే పునర్వ్యవస్థీకరించారు. ఈ క్రమంలోనే సీడబ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు నేతలకు చోటు కల్పించారు. ఇక, సీడబ్ల్యూసీలో మొత్తం 39 మంది సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది ఇన్ఛార్జ్లు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు. రఘవీరాకు స్థానం అయితే, రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరారెడ్డికి సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అలాగే, శాశ్వత ఆహ్వానితుల జాబితాలో సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనరసింహకు చోటు కల్పించగా.. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో పళ్లం రాజు, వంశీచంద్ రెడ్డి, రాజస్థాన్ అసమ్మతి నేత సచిన్ పైలట్, వివాదాస్పద నేత శశి థరూర్‌కు చోటు దక్కింది. ఈ కమిటీలో ముందు నుంచి సభ్యులుగా ఉన్న అధిర్ రంజన్ చౌదరి, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, దిగ్విజయసింగ్, పి.చిదంబరం, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ ఉన్నారు. కాంగ్రెస్ మెగా ర్యాలీ.. ఇక, సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం హైదరాబాద్‌కు సమీపంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో సహా పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిపారు. కాగా సెప్టెంబర్ 17 మెగా ర్యాలీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలోనే ఎన్నికలకు 5 గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటించనుందని తెలిపారు. అదే రోజు 119 నియోజకవర్గాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీలు బస చేయనున్నారని, సెప్టెంబర్ 18న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారన్నారు. Congress president Shri @kharge will convene the first meeting of the newly constituted Working Committee on September 16 in Hyderabad, Telangana. On September 17, there will be an extended Working Committee meeting. All CWC members, PCC Presidents, CLP leaders and Parliamentary… pic.twitter.com/VjwmZ5fEgx — Congress (@INCIndia) September 4, 2023 ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
హోలీ వేడుకల్లో రఘువీరారెడ్డి డ్యాన్స్
-
మనవరాలితో కలిసి స్టెప్పులేసిన రఘువీరారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘువీరా రెడ్డి గురించి తెలియని వారుండరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా కుటుంబంతో గడపడం మొదలుపెట్టారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా వ్యక్తిగా అందరిలో కలిసిపోయి జీవిస్తున్నారు. తాజాగా.. రఘువీరా రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
రఘువీరా రెడ్డిని స్తంభానికి కట్టిపడేసింది...ఎవరు?ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మాజీ వ్యవసాయ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయాలను పక్కన పెట్టి, వ్యవసాయ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన రైతుగా కనిపించి ఇటీవల అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ అభిమానులను ఫిదా చేసిన డా.రఘువీరా తాజాగా మరోసారి ఆకట్టు కుంటున్నారు. మనవరాలు సమైరా స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రఘువీరా ట్విటర్, ఫేస్బుక్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. (HBD Nivetha Thomas: ఈ విషయాలు తెలుసా మీకు?) తనకు సమయాన్ని కేటాయించడం లేదని అలిగిన ఆయన మనవరాలు సమైరా రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి కట్టి వేసిన దృశ్యంపై సోషల్ మీడియా యూజర్లు స్పందిస్తున్నారు. తాళ్లతో కట్టేసి మరీ తనతో ఆడుకోమని డిమాండ్ చేయడం భలే వుంది. చాలా హృద్యంగా, కట్టిపడేసేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. డౌన్ టు ఎర్త్ అనేది రఘు వీరారెడ్డికి సరిపోయే మాట అంటున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సేవలు అందించి, విభజన అనంతరం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు. -
వైరల్‌గా మారిన మాజీ మంత్రి ఫోటో
సాక్షి, అనంతపురం : ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు మూడు తరాలు బతికేలా వెనకేసుకునే ఘనాపాటీలు ఉన్న దేశం మనది. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు ప్రజాపతినిధులంతా కోట్లపై కన్నేసే వారే. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిస్తే చాలు జీవితాంతం ప్రభుత్వ పింఛన్‌తో బతికొచ్చని ఆరాపడేవారే. ప్రస్తుత రాజకీయాల్లో ఎంతోమంది ఇదే కోవకు చెందినవారు ఉన్నారు. ఎక్కడో ఒకరు రాజకీయాల నుంచి రిటైరైన తరువాత సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుత కమర్శియల్ పాలిటిక్స్‌లో ఓ మాజీమంత్రి అందరికీ ఆదర్శంగా నిలిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సేవలు అందించి, విభజన అనంతపురం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడూ చుట్టూ పదిమంది గన్‌మెన్స్, పదికార్ల కాన్వాయ్‌తో ఎప్పూడూ హడావిడిగా ఉండే ఆయన.. ప్రస్తుతం అవేవీ లేకుండా సామాన్యుడిలా ఉంటున్నారు. పూర్తిగా నెరిసిన గెడ్డంతో.. పక్కా రాయలసీమ స్టైల్లో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా రఘవీరా మారిపోయారు. తెల్లటి పంచ కట్టుకుని చిన్న టూవీలర్‌ను నడుపుతూ ఆయన వెళ్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం ఏపీలో జరిగిన పంచాయితీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఒక పాత మోపెడ్ మీద వెళ్తున్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నాలుగో విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా గంగులవానిపాలెంలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి ఓ పాత మోపెడ్ వాహనంపై తన సతీమణి సునీతతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దీనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఏపీ రాజకీయాలలో ఒక్కప్పుడు చక్రం తిప్పిన నాయకుడు ఇప్పుడు సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయనే స్వయంగా ట్విటర్లో షేర్ చేశారు. రఘువీరరెడ్డి రాజకీయ జీవితం.. 1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాననసభ్యుడిగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో తొలిసారి పశు సంవర్థక శాఖా మంత్రిగా పనిచేశారు. 1994 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 లో మరోసారి గెలుపొంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. రాజశేఖరరెడ్డి మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా రెవిన్యూ శాఖా మంత్రిగా కొనసాగారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్‌కు పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఆయన స్థానంలో మరోనేతను ఎన్నుకున్న అనంతరం పూర్తిగా రాజకీయాలకు దూరమైయ్యారు. I along with my wife Sunitha Raghuveer casted our vote for our panchayat Gangulavanipalyam during fourth phase panchayat elections. pic.twitter.com/x5UaB16B9h — Dr. N Raghuveera Reddy (@drnraghuveera) February 21, 2021 -
మాజీమంత్రి శైలజానాథ్‌కు కీలక బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ నూతన అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కార్యనిర్వహణ అధ్యక్షులుగా ఎన్.తులసిరెడ్డి, మస్తాన్ వలీని నియమించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తుందని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే రఘువీరారెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను గత ఏడాది మే నెలలో కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినా, అప్పటి నుంచి రఘువీరా రాజీనామాను కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు. రఘువీరా తన పట్టు వీడకపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి అయింది. దీంతో పలువురు నేతలు ఆ పదవి కోసం పోటీ పడ్డారు. పార్టీ నేతలు సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్, సుంకర పద్మశ్రీ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సాకే శైలజానాథ్‌కు దక్కింది. పూర్వ వైభవాన్ని తెచ్చేలా కృషి చేస్తా.. పీసీసీ చీఫ్‌గా నియమకంపై శైలజానాథ్ ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సీనియర్ల అనుభవాలను కలుపుకుని ఏపీలో ముందుకు వెళతామని శైలజానాథ్ పేర్కొన్నారు. రాజధాని మార్పుపై ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరికొన్ని రోజుల్లోనే రాజధాని అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రజల పక్షాన నిలబడి, వారి అభీష్టం నెరవేర్చేలా పోరాడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని పని చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అధికారంలో ఉన్న బీజేపీ ...ప్రజల ఆలోచనలు, కోరికలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. -
రేసులో సాకే, చింతా మోహన్, పద్మశ్రీ!
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎన్.రఘువీరారెడ్డి ససేమిరా అంటున్నారు. సొంత పనులపై బిజీగా ఉన్నందున నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండలేనంటూ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి కావడంతో పలువురు నేతలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్‌లు ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. అయితే వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని పారీ్టలో అధిక శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీ మాజీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలసి విన్నవించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును ఎంపిక చేయాలని భావిస్తున్నా ఆయన సుముఖంగా లేనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోవాలంటూ ఎక్కువ మంది అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్‌చాందీకి అధిష్టానం సూచించింది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అవును రాజీనామా చేశాను: రఘువీరారెడ్డి -
అవును రాజీనామా చేశాను: రఘువీరారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : తన రాజీనామాపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశాననన్నారు. తన రాజీనామా లేఖను మే 19వ తేదీనే కాంగ్రెస్ అధిష్టానానికి పంపించినట్లు చెప్పారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూనే ఉన్నానని, అయితే ఇంతవరకూ రాజీనామాపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కాగా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. -
ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం
సాక్షి, మడకశిర: ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆయన తన స్వగ్రామమైన అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం తొలుత ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉండగా.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయించారన్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల తల రాతలు మారే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ఈవీఎంల పనితీరు చాలా అధ్వానంగా ఉందన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెలుతురులేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారని, చాలా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడ్డారు. సమస్యాత్మక గ్రామాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే హింస చెలరేగి ముగ్గురు హత్యకు గురయ్యారన్నారు. అర్థరాత్రి దాటాక కూడా పోలింగ్ నిర్వహించడం ఈసీ వైఫల్యమేనన్నారు. ఓటర్లకు ఈసీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాణానికి ముప్పు ఉందని, కేంద్ర ప్రభుత్వం రాహుల్‌కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని కోరారు. రాహుల్‌కు ఏమైనా జరిగితే ప్రధాని మోదీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. -
ఏపీతో నాది కుటుంబ సంబంధం
సాక్షి, అనంతపురం: ‘‘నాన్నమ్మ కాలం నుంచి ఆంధ్రప్రదేశ్‌తో మా కుటుంబానికి కేవలం రాజకీయ సంబంధమే కాకుండా కుటుంబ సంబంధం ఉంది’’ అని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాహుల్‌గాంధీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. కళ్యాణదుర్గం పట్టణ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అయితే ఆయన షెడ్యూలు కన్నా గంట ఆలస్యంగా 4 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. దీంతో ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో వచ్చిన వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన రాకముందు వేదికపైనున్న కాంగ్రెస్ పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు అభ్యర్థులతో పాటు వివిధ అసెంబ్లీ అభ్యర్థులు ప్రసంగించారు. కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. రాహుల్‌గాంధీ ప్రసంగానికి ముందు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధిని కోరుకుంటున్న వ్యక్తి రాహుల్ అన్నారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి కూతురు అమృతావీర్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ ఇక్కడికి వచ్చారని, మళ్లీ ప్రధాని అయిన తర్వాత కళ్యాణదుర్గం రావాలని కోరారు. నీళ్ల కోసం ఇబ్బందులు రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సబాస్థలికి కనీసం నీటిప్యాకెట్లను కూడా అనుమతించలేదు. గంటలపాటు ఎదురుచూసిన ప్రజలు తీవ్ర దాహంతో అల్లాడిపోయారు. ఎండలో బందోబస్తులో ఉన్న పోలీసులు, చివరికి కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులు కూడా తాగునీళ్లకు ఇబ్బందులు పడ్డారు. కనీసం కూర్చోవడానికి చైర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మీడియాప్రతినిధులు రెండు గంటలపాటు నిలుచునే ప్రోగ్రాం కవర్ చేశారు. పాపం రఘువీరా కళ్యాణదుర్గం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘువీరారెడ్డికి ఓట్లు వేయాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ అభ్యర్థించకపోవడంతో రఘువీరా బిక్కమొహం వేశారు. దాదాపు 35 నిముషాలు ఆంగ్లంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ మాటలను... రఘువీరారెడ్డి తెలుగులో అనువాదం చేశారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించాలని కోరారు తప్ప కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డిని గెలిపించాలని రాహుల్ కోరలేదు. రాహుల్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. క్వాటర్ బాటిల్.. కర్ణాటక జనం కళ్యాణదుర్గం: ఎన్ని...వ్యూహాలు రచించినా...ఆదరణ లభించలేదు. ఓటు బ్యాంకు పెరగలేదు. తాయిలాలతో ఎర చూపినా బలం పుంజుకోలేదు. చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచార సభకు తీసుకువచ్చి కాంగ్రెస్‌కు బలముందని, ప్రత్యేకించి రఘువీరారెడ్డికి జనాదరణ ఉందని చాటుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు పడరాని పాట్లు పడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదటిసారిగా కళ్యాణదుర్గం వస్తుండటంతో భారీ జనసమీకరణచేయాలని భావించారు. అయితే స్వచ్ఛందంగా జనం వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో రఘువీరారెడ్డి భారీగా డబ్బు ఖర్చు చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఒక్కో వ్యక్తికి క్వాటర్ బాటిల్ మద్యం, బిర్యానీలు, రూ.200 కూలీ ముట్టజెప్పి జనాన్ని తీసుకువచ్చారు. మరోవైపు కర్ణాటకలోని పరుశురాంపురం, చెళ్ళికెర, చిత్రదుర్గం, జాజూరు తదితర ప్రాంతాల స్థానిక కాంగ్రెస్ నాయకులు భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. ఉదయం నుంచి పలు వాహనాల్లో శెట్టూరు మీదుగా కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి రావడం కనిపించింది. అందువల్లే రాహుల్ సభ ఆవరణలో వందలాది కర్ణాటక వాహనాలు కనిపించాయి. వచ్చిన వారంతా కన్నడలో మాట్లాడటం కనిపించింది. అయినా ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి తగ్గట్టుగా జనం రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఎంపీ టికెట్ అడిగితే చితకబాదారు’
సాక్షి, సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): తనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరినందుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తనపై దాడిచేసి చంపడానికి ప్రయత్నించాడని ఆ పార్టీ నేత, అడ్వకేట్ సుంకర కృష్ణమూర్తి శుక్రవారం విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 1972 నుంచి తాను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నానని, గతంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయానని అన్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో రఘువీరాను కలిసి విజయవాడ పార్లమెంట్ టికెట్‌ను తనకు గాని, సుంకర పద్మశ్రీకి గాని కేటాయించాలని కోరానన్నారు. అందుకు రఘువీరా, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజా, అధికార ప్రతినిధి కిరణ్, ఆఫీస్‌బాయ్ గౌస్, మరో పది మందితో తనపై దాడి చేయించి పిడిగుద్దులు గుద్ది మెడపట్టుకుని బయటకు తోసేశారన్నారు. తనను చంపడానికి ప్రయత్నించిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘సీటు అడిగితే చితకబాదారు’
-
వీధికెక్కిన కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట
-
నన్ను కొట్టించి.. మెడ పట్టి గెంటిస్తావా?
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట వీధికెక్కింది. పోలీసు కేసుల వరకు వెళ్లింది. టీడీపీతో కుమ్మక్కయ్యారని ప్రశ్నించిన సొంత పార్టీ నాయకుడిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేశారు. తనపై పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి దాడి చేయించారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకర కృష్ణమూర్తి శుక్రవారం గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన సామాజిక వర్గానికి సీటు కేటాయించమని అడిగినందుకు తనపై దాడి చేయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. టిక్కెట్లు అమ్ముకుని పార్టీని నమ్ముకున్న వారికి రఘువీరారెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీకి కొమ్ము కాస్తున్న రఘువీరారెడ్డిని పార్టీ నుంచి వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లాలూచీ రాజకీయాలతో పార్టీని నాశం చేస్తున్నారని, పార్టీకి సేవ చేసేవారికి మొండి చేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు లేదని, సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. అధికార పార్టీ కొమ్ముకాసే విధంగా సీట్లు కేటాయించారని ప్రశ్నించినందుకు తనను కార్యకర్తలతో కొట్టించి బలవంతంగా మెడపట్టి గెంటించారని కృష్ణమూర్తి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని హోల్‌సేల్‌గా రఘువీరారెడ్డి అమ్మేశారని విమర్శించారు. విజయవాడలో ఒక్క సీటు కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదని తెలిపారు. ఈనెల 25లోగా తమ సామాజిక వర్గానికి సీటు కేటాయించకుంటే పార్టీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. రఘువీరారెడ్డి రాజీనామా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుందన్నారు. -
రఘువీరారెడ్డికి చంద్రబాబు ఆశీస్సులు!
సాక్షి, అనంతపురం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ-కాంగ్రెస్ మైత్రి ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన బంధం తేటతెల్లం కాగా ...తాజాగా టీడీపీ-కాంగ్రెస్ బంధం కూడా మరోసారి బయటపడింది. తెలంగాణలో ఏర్పడిన ఆ రెండు పార్టీల బంధం...ఏపీలోనూ పునరావృతమైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిని గెలిపించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని స్థానికేతరుడైన ఓ డమ్మీ అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలోకి దించారు. అంతటితోనే ఆగకుండా...రఘువీరా రెడ్డిని గెలిపించాల్సిందిగా తమ పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇవ్వడంతో కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీ అభ్యర్థినే ఓడించమని చెప్పడం ఏమిటని వాడివేడి చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, అభ్యర్థిగా తాను ప్రకటించిన అమిలినేని సురేంద్రను కాదనుకున్న చంద్రబాబు...అనూహ్యంగా ఉరవకొండకు చెందిన ఉమా మహేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రాహుల్ గాంధీ సూచనలతోనే రఘువీరాను గెలిపించేందుకే స్థానికేతరుడైన ఉమా మహేశ్వరరావుకు చంద్రబాబు టికెట్ ఇచ్చారని సాక్షాత్తు టీడీపీ వర్గాలే చెప్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ఎలా సహకరించాలని స్థానిక టీడీపీ నేతలు పట్టుకుంటున్నారు. మరోవైపు టీడీపీ-కాంగ్రెస్ అంతర్గత పొత్తుపై అనంతపురంలో చర్చనీయాంశంగా మారింది. -
టీడీపీకి మిత్రపక్షంగానే ఉంటాం
సాక్షి, అమరావతి/ఏడిద (మండపేట): సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మిత్రపక్షంగానే ఉంటామని, అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తుమాత్రం ఉండదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. పీసీసీ సభ్యుడు కామన ప్రభాకరరావు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు గురువారం తూర్పు గోదావరి జిల్లా ఏడిద వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో స్థానిక పార్టీలు కలుస్తున్నాయన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జంప్ జిలానీల కోసం వేచి చూడకుండా శుక్రవారం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థుల ఖరారు చివరి దశకు చేరుకుందని, వీటిపై ఢిల్లీలో అధిష్టానంతో చర్చించి జాబితా విడుదల చేస్తామన్నారు. -
టీడీపీకి ఇప్పుడు జ్ఞానోదయమైంది...
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీతో పాటు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన టీడీపీకి ఇప్పుడే జ్ఞానోదయం అయిందని అన్నారు. కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాలర్ ఎగరేసి తిరగాలని రఘువీరా పేర్కొన్నారు. టీడీపీ తప్పులను పక్కనపెట్టాలని ఆయన సూచించారు. ఢిల్లీ రాజకీయాలు వేరన్న రఘువీరా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నమైనవని చెప్పుకొచ్చారు. ఏపీలో పొత్తులపై రఘువీరా రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఏపీలో పొత్తులు పెట్టుకోవాలా లేక ఒంటరిగా పోటీ చేయాలన్న దానిపై త్వరలో రోజుల్లో స్పష్టత వస్తుందని ... రాష్ట్ర పార్టీలోనూ పొత్తు కావాలి, పొత్తు వద్దు అనే నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. ఇక రైతు కోటయ్య మృతి వెనుక ఉన్న వివాదాల జోలికి తాము వెళ్లమని, వ్యవసాయ వ్యతిరేక విధానాలే కోటయ్య మరణానికి కారణమని భావిస్తున్నామని రఘువీరా తెలిపారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ను ఓడించేందుకు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసిన ఈ రెండు పార్టీలను ప్రజలు ఏమాత్రం ఆదరించలేదు సరికదా, రెండోసారి కూడా టీఆర్ఎస్కే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో బీజేపీతో జత కట్టిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే సర్కార్ నుంచి బయటకు వచ్చేసిన విషయం విదితమే. తాజాగా ఆయన కాంగ్రెస్ చేయందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దించేందుకు పొత్తులపై కాంగ్రెస్ పార్టీతో పాటు మరోవైపు ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నారు. -
ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు కానీ..
సాక్షి, విజయవాడ : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఉమెన్ చాందీ తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పొత్తులపై తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీదేనని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు గానీ బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మాత్రం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమతో ఉంటారని తెలిపారు. ఫిబ్రవరి 1న రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం : రఘువీరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. విభజన హామీలు అమలు చేసేది, ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని, ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర బంద్‌లో పాల్గొంటామని తెలిపారు. పొత్తులపై నిర్ణయం తీసుకుంది ఏఐసీసీయేనని, ప్రియాంక గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించడం శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు. -
రాహుల్‌తో రఘువీరా భేటీ.. పొత్తులపై కామెంట్
సాక్షి, న్యూఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ గురువారం సమావేశయ్యారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత రాహుల్‌తో వీరు చర్చించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ విధానంపై తాము చర్చించామని తెలిపారు. 175 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతల అభిప్రాయాలు రాహుల్‌కు వివరించామని, రానున్న ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని దానిపై వారంలో నిర్ణయం తీసుకుంటామరని తెలిపారు. ఏపీలో పొత్తులు పెట్టుకోవాలా లేక ఒంటరిగా పోటీ చేయాలన్న దానిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. రాష్ట్ర పార్టీలోనూ పొత్తు కావాలి, పొత్తు వద్దు అనే నాయకులు ఉన్నారని చెప్పారు. -
‘అందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నారు’
సాక్షి, విజయవాడ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యాక్సిడెంటల్ ప్రధాని కాదని, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను నిలిపిన స్పృహ కలిగిన గొప్ప ప్రధాని అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ... ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమా ట్రైలర్ మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న ఆర్థిక నిపుణుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు.. 4 శాతం పడిపోయిన దేశ జీడీపీనీ 7 శాతానికి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. రుణమాఫీతో పాటు అనేక కీలక చట్టాలు మన్మోహన్ సింగ్ పాలనా సమయంలోనే వచ్చాయని గుర్తుచేశారు. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ... ‘ ప్రధాన మంత్రి పదవి కాదు కదా కనీసం కేంద్ర మంత్రి పదవి కూడా వద్దని, తాను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి రాహుల్’ అని వ్యాఖ్యానించారు. ఆయన భార్య బీజేపీ ఎంపీ ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రధారి అనుపమ్ ఖేర్ గురించి ప్రస్తావిస్తూ.... అనుపమ్, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థ చైర్మన్ గా పని చేశారని రఘువీరా గుర్తుచేశారు. అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారని.. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి సినిమాలు తీసుకువస్తోందని విమర్శించారు. సెన్సార్ బోర్డ్ ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అయినా 2019 ఎన్నికల్లో ఈ సినిమా ప్రభావం ఎంతమాత్రం ఉండబోదని జోస్యం చెప్పారు. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. విభజన హామీల అమలు ఇప్పటికే ఆలస్యమైందని.. హైకోర్టు విభజన అనేది వ్యక్తుల కోసం జరగదని పేర్కొన్నారు. ఈ విషయంలో తమ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోందని గుర్తు చేశారు. -
‘ఎంతిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి’
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పెథాయ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి కోరారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘువీరా మాట్లాడుతూ..హుద్‌హుద్ నష్టం రూ.8 వేల కోట్లు అయితే, కేంద్రం ప్రకటించింది వెయ్యి కోట్లు మాత్రమేనని, ఇచ్చింది రూ.400కోట్లేనని వెల్లడించారు. తిత్లీ నష్టం రూ.3 వేల 4 వందల కోట్లని, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెథాయ్ తుపాను కారణంగా 7 జిల్లాల్లో రైతులు, చేతికి వచ్చే పంట నష్టపోయారని అన్నారు. తుపాను చలి తీవ్రతకు 25 మంది చనిపోగా..భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. పెథాయ్ తుపాను వల్ల 90 శాతం కౌలు రైతులే నష్టపోయారని చెప్పారు. రైతులకు బీమా కంపెనీలు నష్టపోయిన పంటకు బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు. తుపాను కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. తడిచి రంగు మారిన ధాన్యం ఎఫ్‌సీఐ రంగంలోకి దిగి కొనుగోలు చేయాలని, అలాగే నష్టపరిహారాన్ని కౌలు చేసే రైతులకే చెల్లించాలని చెప్పారు. కార్పొరేట్ల రుణాలు మాఫీ చేస్తున్న కేంద్రం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయరని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే రూ.2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో రైతుల పరిస్థితి బాగోలేదని, తక్షణమే రైతులను ఆదుకోవాలని కోరారు. -
భజనపరులు మాత్రమే టీఆర్ఎస్ వైపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొందరు భజన పరులు మాత్రమే టీఆర్ఎస్ వైపు ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. కూటమిని గెలిపించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో రఘువీరాతో పాటు పలువురు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం రఘువీరా మాట్లాడారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో ద్వేషం, అసహ్యం నెలకొందని విమర్శించారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థికి 15 కోట్లకు పైగా కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా వాహనాలు, 108 వాహానాల్లో డబ్బులు తరలిస్తుంటే ఎలక్షన్ కమిషన్ ప్రేక్షకపాత్ర వహిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని చూస్తే టీఆర్ఎస్కు వణుకు పుడుతుందని అందుకే బరితెగించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. రేవంత్‌ను అరెస్ట్ చేయడంతో టీఆర్ఎస్ ఓటమి ఖరారయిందని జోస్యం చెప్పారు. అరెస్టు చేసిన అధికారులపై వెంటనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు సార్లు ఎన్నికల మేనిఫెస్టో మార్చి చివరకు కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారని ఎద్దేవ చేశారు. కారుకు ఓటేస్తే కమలంకు ఓటేసినట్లేనని విమర్శించారు. -
అంపశయ్యపై బీజేపీ, టీఆర్ఎస్: రఘువీరారెడ్డి
హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్లు అంపశయ్యపై ఉన్నాయని, అధికారం పోయే దశలో కూడా ప్రజాకూటమి గెలిస్తే పగ్గాలు ఆంధ్రాకు పోతాయని తెలంగాణ ప్రజలను కేసీఆర్ రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానని చెప్పిన కేసీఆర్.. ఓడిపోతున్నా నని బహిరంగంగా ఒప్పుకున్నందుకు, ఆయన నిజాయితీకి అభినందనలు చెప్పాలన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ గాంధీనగర్‌లోని ఎన్నికల కార్యాలయంలో ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మందడి అనిల్ కుమార్ యాదవ్ తయారు చేసిన నియోజవర్గ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి, ఓడిషా ఇన్చార్జ్ షేక్‌మస్తాన్‌వలీతో కలసి విడుదల చేశారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా వాళ్ళ పెత్తనం అంటూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఆంధ్రాకు వెళ్ళడానికి పాస్‌పోర్టులు, వీసాలు కావాలా అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సోనియా గాంధీ అమ్మలాగా హామీ ఇచ్చింది’
సాక్షి, పశ్చిమ గోదావరి : తెలంగాణ ఎన్నికల సభలో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు అమ్మలాగా హామీ ఇచ్చిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాకు తొలిసంతకం ఏపీకి వరమన్నారు. ప్రజాస్వామ్య శక్తులు ఏకమై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మేలు చేయాలనుకునే వారు కాంగ్రెస్‌తో రానున్నారని, రాష్ట్రానికి కీడు చేయాలనుకునేవారు బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి వెళ్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో 100 అసెంబ్లీ స్థానాల్లో ఢీ కొనే స్థాయిలో సిద్దంగా ఉందని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా పోరాటం చేయవని, జాతీయ పార్టీతోనే కలిసి వెళ్తాయన్నారు. బూత్ కమిటీ ఏర్పాటు, ఇంటింటా కాంగ్రెస్, శక్తి ప్రాజెక్ట్ అంశాలపై పార్టీ శ్రేణులతో సమీక్షించామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోని ఇంటింటా కాంగ్రెస్‌లో ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని తెలిపారు. -
గరుడపురాణం: ఆ వ్యక్తినే సీఎం కుర్చీలో కూర్చోబెట్టండి!
అమరావతి: వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి అతి హేయమైనదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ..దాడి జరిగిన వీఐపీ లాంజ్‌లో సీసీ కెమెరా ఎందుకు పనిచేయడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. తాను వైఎస్ జగన్‌తో విభేదించవచ్చు.. కానీ జరిగిన దాడిని మాత్రం ఖండిస్తున్నానని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే ఒక ముఖ్యమంత్రి కనీసం ఫోన్ చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అనేది ఒక బలీయమైన వ్యవస్థ అని, ఒక విశ్వసనీయ సమాచారం వస్తే విచారణ చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గరుడపురాణాన్ని ధ్రువీకరించారని, గరుడపురాణమంటూ ఆ వ్యక్తి చెప్పినట్టే జరుగుతుంది అనుకుంటే ఎందుకు విచారణ చేయించలేదని ప్రశ్నించారు. మీ ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. ఇక ఆ గరుడపురాణం చెప్పిన వ్యక్తినే సీఎం కుర్చీలో కూర్చోబెట్టండి.. మీరెందుకు దండగ అని దుయ్యబట్టారు. -
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి’
సాక్షి, పశ్చిమ గోదావరి : నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని కాళ్లకూరు గ్రామంలో చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, గాదిరాజు లచ్చిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. రాహూల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే మొదటి సంతకం ఏపీకి సంబంధించిన ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపై చేస్తారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తున్నది నిరుద్యోగ భృతి కాదని, యువకులకు పెన్షన్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. -
బీజేపీ కంటే బ్రిటీష్ పాలనే మేలు: రఘువీరా
ప్రొద్దుటూరు: బీజేపీ ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వ పరిపాలనే మేలు అనిపిస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ... రైతులను నమ్మించి బీజేపీ ప్రభుత్వం గొంతు కోసిందని విమర్శించారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజున హింసను ప్రోత్సహించిందని తూర్పారబట్టారు. జై జవాన్- జై కిసాన్ అనే నినాదం వదిలేసి జై జపాన్- జై కార్పొరేట్ అని అంటోందని ధ్వజమెత్తారు. కోర్టుఇచ్చిన ఫ్రీ సెక్స్ తీర్పు పైన బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం అరాచకమని, ఇది మన సంప్రదాయానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ టాక్స్ కాదని, గబ్బర్ సింగ్ టాక్స్‌గా పరిగణిస్తున్నామని వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు దేశవ్యాప్తంగా 2లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, అలాగే జీఎస్టీని సరళీకృతం చేసి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చారు. టీడీపీతో పొత్తు గురించి ఇంకా ఆలోచనలు చేయలేదని అన్నారు. -
అప్పులు మాఫీ చేయరు.. అంబానీలకు దోచిపెడతారు..
సాక్షి, విజయవాడ : బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఢిల్లీ శివారు ప్రాంతంలో రైతులపై పోలీసులు చేసిన దౌర్జన్యానికి నిరసనగా కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నరఘువీరా మాట్లాడుతూ.. రైతులు తమ గోడు చెప్పుకోవటానికి ఢిల్లీ వస్తే పోలీసులు లాఠీ జలిపించారని అన్నారు. రైతుల కోసం ఎన్నికల్లో మీరిచ్చిన హామీలేంటి.. చేసిందేంటని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు అప్పులు మాఫీ చేయరు కానీ అంబానీలకు దోచిపెడతారని మండిపడ్డారు. స్వామినాథన్ రిపోర్టు ప్రకారం రైతు కష్టపడిన దానికి యాభై శాతం ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారని ఆరోపించారు. అహింసావాది అయిన గాంధీ జయంతి రోజునే రైతులను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే 2లక్షల రైతు రుణమాఫీ ఉంటుందని అన్నారు. పంట భీమా కూడా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీని గద్దెదించే వరకు రైతులు నిద్రపోవద్దని చెప్పారు. -
‘ప్రధానిగా కొనసాగే అర్హత లేదు’
సాక్షి, అనంతపురం : సైనికుల ప్రాణాలను పణంగా పెట్టిన నరేంద్ర మోదీకి ఒక్క క్షణం కూడా ప్రధానిగా కొనసాగే అర్హత లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నీలకంఠపురంలో విలేకరులతో మాట్లాడిన రఘువీరా.. ‘హెచ్ఏఎల్ను కాదని రిలయన్స్ వారికి రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ఇవ్వమని భారత ప్రధాని చెప్పారని.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చాలా స్పష్టంగా చెప్పారు. దేశ రక్షణను పణంగా పెట్టి 41 వేల కోట్ల రూపాయలు రిలయన్స్‌కు దోచి పెట్టిన నరేంద్ర మోదీ నిజ స్వరూపం బయటపడిందని’ వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంపై వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి, వెనువెంటనే ప్రధాని రాజీనామా చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. -
‘20 ఏళ్లయినా పోలవరం పూర్తయ్యేలా లేదు’
సాక్షి, విజయవాడ: 20 ఏళ్లు అయినా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదని ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి అన్నారు. సోమవారం ఏపీసీసీ కార్యాలయంలో రఘవీరా మీడియాతో మాట్లాడుతూ.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. పోలవరం నిర్వాసితులు, పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు భరోసా కలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు, వైద్యం సరిగా అందడం లేదన్నారు. నష్ట పరిహారం విషయంలో నిర్వాసితులను గిరిజన, గిరిజనేతరులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీకి పోలవరం నిర్వాసితుల సమస్యల గురించి లేఖ రాస్తున్నట్టు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు వర్ణాతీతంగా ఉన్నాయని అన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు గురించి కాకుండా నిర్వాసితుల గురించి ఆలోచించాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. 20 తేదీలోపు నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే వాళ్లమని పేర్కొన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ 6 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ఈ నెల 18న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలుకు రానున్నారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా దామోదరం సంజీవయ్య ఇంటిని రాహుల్ సందర్శిస్తారని.. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారని.. ఆ తర్వాత కర్నూల్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారని తెలిపారు. రాఫెల్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రఘవీరారెడ్డి విమర్శించారు. 500 కోట్లతో కొనుగోలు చెయాల్సిన ఒక యుద్ధ విమానానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి వ్యతిరేకంగా 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. 24వ తేదీన రాష్ట్ర నాయకత్వం మొత్తం విజయవాడ వేదికగా నిరసన తెలుపుతుందని ప్రకటించారు. ఆ రోజున గవర్నర్ నరసింహాన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిందిగా కోరారు. -
ఆ కుంభకోణం దేశంలోనే అతి పెద్దది; రఘవీరా
సాక్షి, విజయవాడ: రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఆరోపించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ రిలయన్స్‌తో కుమ్మకై ఒక్కొ యుద్ద విమానం మీద 1000 కోట్లకు పైగా రాబందుల్లా దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్‌కు కాంట్రాక్టులు ఇవ్వడంలో జరిగిన అవినీతిని ఎండగడతామన్నారు. సెప్టెంబర్ 16 నుంచి 31 మధ్యలో రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేసి.. గవర్నర్ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు కేరళకు సహాయ చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. కేరళలో ఇళ్లు కొల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున 1000 ఇండ్లు కట్టివ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 2019 లో కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చిందని.. కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామన్నారు. కర్నూలు జిల్లాలో రాహుల్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని 97.8 శాతం మంది కోరుకుంటున్నారని తమ సర్వేలో తేలిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని.. తాము సొంతంగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు. -
‘వైఎస్సార్ సీపీ గెలుస్తుందనుకున్నా’
సాక్షి, అనంతపురం: గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సైకిల్-హస్తం పొత్తుపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు. సోమవారం స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండాలన్న దానిపై రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని, అధిష్టానం ఆదేశిస్తే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్దమేనని రఘువీరా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామని, ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. వైఎస్సార్ సీపీ గెలుస్తుందనుకున్నా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని 2014లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భావించామన్నారు. అయితే చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయని రఘువీరా అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీ, బీజేపీ వైఫల్యాలపై కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేస్తామని రఘువీరా తెలిపారు. -
కాంగ్రెస్ ముఖ్యులతో ముగిసిన రాహుల్‌గాంధీ సమావేశం
ఢిల్లీ: కాంగ్రెస్ వార్ రూంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లతో పాటు ముఖ్య నేతలు అశోక్ గెహ్లాట్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మతో సహా కీలక నేతలు హాజరయ్యారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేరళ ప్రజలను ఆదుకోవడంపై కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి హాజరైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడుతూ..రఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో జరిగిన అవినీతి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రఫెల్ కుంభకోణంలో మోదీ పెద్ద దోషి అని, ఆయనే ప్రధాన దోపిడీదారుడని విమర్శించారు. రూ.500 కోట్ల విలువ చేసే విమానాలను రూ.1600 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రజా ధనాన్ని మోదీ దోచుకున్నారని, రిలయన్స్ కంపెనీకి డబ్బును దోచిపెట్టారని ఆరోపణలు గుప్పించారు. దేశ రక్షణను పణంగా పెట్టారని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ రఫెల్ కుంభకోణాన్ని బయటపెట్టినా ప్రధాని మాట్లాడటం లేదు..రఫెల్ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అవినీతిని ఏవిధంగా బయటపెట్టాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఏపీలో జిల్లా స్థాయి సమావేశాలు, ఓరియెంటేషన్ సమావేశాలు, బూత్ కమిటీల ఏర్పాటు జరుగుతోందని, సెప్టెంబర్ 15 నుంచి 25 వరకు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్‌లో రఫెల్ కుంభకోణంపై ఏపీలో కోటి కుటుంబాలకు కరపత్రాలను పంచుతామని ఈ సందర్భంగా తెలిపారు. -
జోగుళాంబ సన్నిధిలో రఘువీరారెడ్డి
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఏపీ పీసీసీ ప్రసిడెంట్ రఘువీరారెడ్డి మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరిపించారు. అనంతరం తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. ఇన్చార్జ్ సీనియర్ అసిస్టెంట్ చంద్రయ్య ఆచారి రఘువీరా రెడ్డి దంపతులకు శేష వస్త్రాలు, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో సదానందమూర్తి, వెంకటేశ్వర్లు, పరుషురాముడు, ఖాసీం, నరసింహులు, ప్రేమదాసులు, రాము, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ఉమెన్
ఏలూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. ఏలూరులో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు అని యూపీఏ ప్రతిప్రాదిస్తే కాదు పదేళ్లు ఇవ్వాలన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో నాలుగేళ్లుగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తాజా తీర్పుపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కాపులకు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ వెనుకడుగు వేయడం దారుణమన్నారు. 25 మంది ఎంపీలుంటే ప్రత్యేక హోదా తీసుకు వస్తానని వైఎస్ జగన్ ఎలా అన్నారు...ప్రత్యేక హోదా కూడా కేంద్ర పరిధిలోనిదే కదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వగలదన్నారు. ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రాంతీయ పార్టీలు ఏమీ చేయలేవని చెప్పారు. ఏపీలో 44000 బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలిపారు. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్ల గురించి నేను ఎలా మాట్లడతా..నేను ఏపీకి మాత్రమే ఇన్చార్జిని అని స్పష్టం చేశారు. తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి...అదే విధంగా ఏపీలో కూడా ఇబ్బందులు రాకుండా రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు. కొంగ దీక్షలు చేస్తే జనం ఒప్పుకోరు: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఏపీకి జరిగిన అన్యాయంపై, పార్లమెంట్లో అవిశ్వాసం చర్చపై మొదట మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఎన్డీఏపై అవిశ్వాసంపై టీడీపీతో పాటు మిత్ర పక్షాలు కూడా నోటీసులు ఇచ్చాయని..టీడీపీ నోటీసులకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని చంద్రబాబు చెప్పుకోవడం ముఖ్యమంత్రి స్ధాయికి తగదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లు ఎన్డీఏలో ఉండి ఇపుడు బయటకు వచ్చి కొంగ దీక్షలు చేస్తే జనం ఒప్పుకోరు...ఎవరూ నమ్మరని విమర్శించారు. ప్రత్యేక హోదా పై ఏఐసీసీ సమావేశంలో తీర్మానం చేశాం...రాహుల్ ప్రధాని అయిన వెంటనే తొలిసంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు తప్పితే ఏపీకి మరే పార్టీ న్యాయం చేయలేవని వ్యాఖ్యానించారు. -
టీడీపీతో పొత్తు రూమర్
అమరావతి : టీడీపీతో పొత్తు అనేది రూమర్ అని, పొత్తుల విషయం గురించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చూసుకుంటారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి తెలిపారు. సీడబ్ల్యుసీ మీటింగ్‌లో ఏపీ ప్రత్యేక హోదా అంశం మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఇచ్చిన హామీ వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, వేరే రాష్ట్రంతో పోల్చుకోవద్దని, సోనియా, రాహుల్ అన్నట్లు తెలిపారు. ఈ విషయంపై సోనియా, రాహుల్ గాంధీలకు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్‌కి ఇస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, కేకే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పదుల సార్లు చెప్పారని, కానీ ఇప్పుడు ఇద్దరు చంద్రులు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. గట్టిగా అడగొద్దని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా చెప్పి ఉంటారని అందుకే కేసీఆర్ అలా అంటున్నారని చెప్పారు. -
రాక్షస పాలన అంతమొందించండి: రఘువీరా
ఢిల్లీ : వచ్చే 2019 లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరిగిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) సమావేశానికి రఘువీరా రెడ్డి హాజరయ్యారు. ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో ఏఏ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించే అధికారం రాహుల్ గాంధీకి కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిందని తెలిపారు. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్తాన్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. బీజేపీ రాక్షస పాలన అంతమొందించాలని కోరుతూ, బడుగు బలహీన వర్గాలకు బీజేపీ పాలనలో న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా, మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక హోదా అమలులోకి తీసుకువస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమావేశంలో చెప్పారని రఘువీరా రెడ్డి తెలిపారు. -
బీజేపీ వంచనలో టీడీపీ భాగస్వామి
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో రాష్ట్రానికి జరిగిన వంచనలో బీజేపీతోపాటు టీడీపీ కూడా భాగస్వామి అని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి హోదా వద్దు ప్యాకేజీ ముద్దని సీఎం చంద్రబాబు ఒప్పుకున్నప్పుడే మోసం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలై ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. గడిచిన 60 ఏళ్లలో రూ.లక్ష కోట్లు అప్పు చేస్తే, టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఆడంబరాల కోసం మరో రూ.లక్షన్నర కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరిపి ప్రచారానికి వాడుకోవాలని టీడీపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. అదే జరిగితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరై ప్రజల అజెండాను ప్రస్తావించాలని కోరారు. కాగా, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని రఘువీరా స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం నుంచి మొదటి దశలో 4 జిల్లాల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఉమెన్ చాందీ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. కేంద్రంలో యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాపైనే మొదటి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 13న కాంగ్రెస్‌లో చేరుతున్నారని రఘువీరా తెలిపారు. వైఎస్ పాలనలో ప్రతి కుటుంబానికీ లబ్ధి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ లబ్ధి కలిగిందని రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఆదివారం వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రాపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోయాయి
-
సంక్షేమ పథకం అందని కుటుంబమే లేదు
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళలు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పేదలకు వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకం, సహాయం పొందని కుటుంబమే లేదని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేశాయని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత దివంగత నేతకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిసిస్తోందన్నారు. నిరంతరం పేదల సంక్షేమం గురించే ఆలోచించే వారని, బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌కే చెందుతుందని అన్నారు. ఆయన ప్రజల కోసం ప్రవేశ పెట్టిన పథకాల కారణంగానే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని తెలిపారు. -
మెడికల్ సీట్ల వ్యవహారం.. బాబుకి రఘువీరా లేఖ
విజయవాడ: ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డి, గురువారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి లేఖ సంధించారు. 2018 సంవత్సరంలో ఎంబీబీస్ సీట్ల వెబ్ కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దానిని వెంటనే సరిదిద్దాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో మాదిరిగా జోన్‌ని ఒక యూనిట్‌గా తీసుకుని కాకుండా కాలేజీని ఒక యూనిట్‌గా తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారని, దాని వల్ల బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య నభ్యసించే అవకాశాన్ని కోల్పోతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న జీఓ నెంబర్ 550పై స్టేని ఎత్తి వేయించకుండా, ఆ మేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకుండా సంవత్సరకాలంగా మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దేనికి సంకేతం.. ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశ పూర్వకమా అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల చాంఫియన్‌గా పదే పదే తమను తాము అభివర్ణించుకునే మీకిది తగునా అని సూటిగా అడిగారు. వివక్షకు గురై తీవ్రంగా నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, జీఓ నెంబర్ 550 మీద హైకోర్టు ఇచ్చిన స్టేని వెకేట్ చేయించడానికి ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని లేఖ ద్వారా తెలిపారు. -
చంద్రబాబు పాలనపై కాంగ్రెస్ చార్జ్‌షీట్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనపై కాంగ్రెస్ పార్టీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, పీసీసీ నేతలు శుక్రవారం చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. అనంతరం పల్లంరాజు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదన్నారు. ఎన్డీఏలో ఉండి రాష్ల్రం కోసం చంద్రబాబు ఏమీ చేయలేదని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుకను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందన్నారు. విభజన చట్టం హామీలను సాధించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని, ఈరోజు నుంచి వారం పాటు ప్రజావంచన వారంగా నిరసనలు తెలుపుతున్నట్టు ఆయన ప్రకటించారు. చర్చకు చంద్రబాబు సిద్ధమా? విభజన హామీల్లో ఉన్నవాటి కంటే ఎక్కువ చేస్తామని ఆనాడు బీజేపీ, టీడీపీలు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశాయని పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఆరోపించారు. నాలుగేళ్ల పాలనపై కాంగ్రెస్ విడుదల చేసిన చార్జ్‌షీట్‌లోని ప్రధానాంశాలపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. డ్వాక్వా మహిళకు రూ. 30 వేలు మాఫీ చేయాలి కానీ రూ. 4 వేలే చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు లేదు.. పైగా కొత్త ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. కాపులకు ఇచ్చిన హామీలేమయ్యాయని రఘువీరా ప్రశ్నించారు. పోలవరంపై కమీషన్లకు కక్కుర్తిపడి ఆలస్యం చేస్తున్నారన్నారు. దుగరాజుపట్నం పోర్టు, రైల్వే జోన్ ఏమయ్యాయి.. నాలుగేళ్లలో అన్నీ శాఖల్లో అభివృద్ధి శూన్యం..ఇందులోనే చంద్రబాబు పాలన నంబర్‌వన్ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. -
ఇది కసాయి ప్రభుత్వం : రఘువీరా
కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ ఆగిరిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న బెజవాడ శ్రీనివాస రావు కుటుంబాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ..కేంద్రంలో కసాయి ప్రభుత్వం పాలన చేస్తోంది. ప్రత్యేక హోదా రాకపోతే తన కుమారుడికి ఉద్యోగం రాదనే బాధతోనే ప్రత్యేక హోదా కోసం శ్రీనివాస రావు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం శ్రీనివాస్ కుమారుడికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. పార్టీ తరపున మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.25 వేల ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు రఘువీరా రెడ్డి తెలిపారు. -
‘రాష్ట్రంలో మా గేమ్ ప్రారంభమవుతోంది’
సాక్షి, విజయవాడ: భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్నామని తెలుగుదేశం చెబుతూనే బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ పాలకమండలి సభ్యత్వం ఎలా ఇచ్చారు ? బీజేపీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్తను మహానాడు వేదికపై ఎలా అనుమతించారు? మీరు నిజంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారని ఎవరు నమ్ముతారు? అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి టీడీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ సీనియర్ నేత ఉమన్ చాందీని రాష్ట్ర పార్టీ ఇంచార్జిగా వేశారు. ఇప్పటి నుంచి రాష్ట్రంలో మా గేమ్ ప్రారంభమవుతోంది. 2019 మా టార్గెట్. ప్రత్యేక హోదా, విభజన హామీలను కాంగ్రెస్ వల్లే సాధ్యం. రైతు రుణమాఫీ, స్నేహపూరిత జీఎస్టీ, పెట్రోల్ డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తాం. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం. ప్రజల్లోకి ఇదే నినాదంతో వెళ్తాం. కర్ణాటకలో తెలుగు వారు కాంగ్రెస్‌ను గెలిపించారు. తాజాగా 14 చోట్ల జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల బీజేపీయేతర శక్తులు గెలిచాయి. చంద్రబాబు రాహూల్ గాంధీని బెంగుళూరులో కలిసింది కాకతాళీయంగా జరిగిందే. దానికి రాజకీయ ప్రాధాన్యత లేదు. 2019లో బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదనేది రాహుల్ గాంధీ నిర్ణయం. రాష్ట్రంలో టీడీపీతో ఇప్పటి వరకు ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. టీడీపీతో పొత్తులు అంటూ జరుగుతున్న ప్రచారంపై కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటున్నాం. మా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి వచ్చిన తరువాతే దీనిపై వివరిస్తాం’ మని రఘువీరా వెల్లడించారు. కాంగ్రెస్‌లోనే ఉంటాను నేను కాంగ్రెస్‌లోనే వుంటాను. రాజకీయాల్లో ఉన్నంతవరకు కాంగ్రెస్ లోనే వుంటాను. పార్టీలో నాది సంతృప్తికరమైన రాజకీయ జీవితం. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. -
కర్ణాటక: చంద్రబాబు సెల్ఫ్ డబ్బా..!
సాక్షి, విజయవాడ : కర్ణాటకలో అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నించిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. కర్ణాటకలో బలపరీక్ష విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే.. సీఎం చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ చేత్తో పట్టుకొని రెడీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో తన సలహాలు, సూచనలు వల్లే కాంగ్రెస్-జేడీఎస్ అధికారంలోకి వచ్చాయని సీఎం చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయమని మండిపడ్డారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యకు టీటీడీలో బోర్డులో సభ్యత్వం ఎందుకు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. సూర్యుడు, చంద్రుడు ఉదయించేది, అస్తమించేది తన వల్లేనని చంద్రబాబు చెప్పుకుంటారని, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన చంద్రబాబుతోపాటు కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులపైనా సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని అన్నారు. -
ప్రకృతి వైపరీత్యంతో రాష్ట్రంలో చాలా నష్టం జరిగింది
-
ఇద్దరు గంటన్నర పాటు ఏం మాట్లాడుకున్నారు..
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ గంటన్నర పాటు ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, గవర్నర్‌కు లై డిటెక్టర్‌తో పరీక్షలు చేస్తేనే నిజాలు బయటికి వస్తాయని రఘువీరా వ్యాఖ్యానించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, రాజకీయ సానుభూతి కోసమే చంద్రబాబు తనపై దాడి జరిగిందంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌వి పగటికలలు.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగిరిన చందంగా ఉందంటూ రఘువీరా రెడ్డి ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణా రాష్ట్రాన్నే అభివృద్ధి చేయలేకపోయిన కేసీఆర్.. ప్రధాని అయినట్లు పగటి కలలు కనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. 17మంది ఎంపీలతో భూకంపం ఎలా సృష్టిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. తెలుగువారు బీజేపీని ఓడించాలి.. ఆంధ్ర్రప్రదేశ్‌కు బీజేపీ తీరని అన్యాయం చేసిందన్న రఘువీరా.. కర్ణాటకలో తెలుగు మాట్లాడేవారంతా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న జేడీఎస్‌ను కూడా ఓడించాలన్నారు. ఈనెల 30 వ తేదీన కర్ణాటక తెలుగు వారితో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభతో బీజేపీ పతనానికి నాంది పలుకుతామని ఆయన తెలిపారు. గవర్నర్ రాజకీయ పనులు చేస్తున్నారని.. మజ్లిస్, టీడీపీలతో మాట్లాడి కర్ణాటకలో బీజేపీకి సహకరించాలని కోరుతున్న గవర్నర్ బీజేపీ క్రియాశీల కార్యకర్తగా మారారని రఘువీరా ఆరోపించారు. గవర్నర్‌ను ఇప్పటికే బాయ్‌కాట్ చేశామని పేర్కొన్నారు. ఏపీలో వైఎస్సార్‌కు ఉన్న ఇమేజ్.. కర్ణాటకలో సిద్ధరామయ్యకు ఉందని.. గెలుపు సులభమేనని ధీమా వ్యక్తం చేశారు. -
నయవంచనకు మారుపేరు బాబు
-
‘చంద్రబాబు దీక్ష నవ్వులపాలు’
సాక్షి, విజయవాడ: ‘రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాలయాలపై ధర్మపోరాట దీక్ష’ అంటూ చంద్రబాబు చేస్తున్న ఒక్కరోజు నిరాహార దీక్ష చూసి జనం నవ్వుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. ఇది ప్రజల్ని వంచించడానికి చేస్తున్న ‘నయా’వంచక దీక్ష అని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై ధ్వజమెత్తారు. దీక్షకు మద్ధతు తెలపాలని తనకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షడు కళా వెంకట్రావు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ విజ్ఞప్తి చేశారనీ వెల్లడించారు. అందర్నీ మాయచేసేందుకే చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారని రఘువీర వ్యాఖ్యానించారు. ‘టీడీపీ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ దీక్ష’ అని ఆరోపించారు. ‘ధర్మపోరాట దీక్ష’కు మద్ధతుగా అశోక్‌బాబు కూడా దీక్ష చేపట్టాల్సిందిగా చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదా అంశంపై అశోక్‌బాబు ఉద్యమం చేస్తే.. ఆ క్రెడిటంతా చివరికి చంద్రబాబు కొట్టేశారనీ, మరోసారి చంద్రబాబు మోసానికి బలికావద్దని ఆయన సూచించారు. ఇప్పటికైనా టీడీపీ నీచ రాజకీయాల్ని గ్రహించి.. ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు చంద్రబాబు ఆడుతున్న మరో నాటకం చూసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. -
‘చంద్రబాబుది నయవంచన దీక్ష’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోంది ధర్మ దీక్ష కాదు.. నయవంచన దీక్ష అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే చంద్రబాబు దీక్షల డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లు బీజేపీకి మద్దుతు ఇచ్చి, ఇపుడు ఉద్యమాలు చేస్తామంటే ప్రజలు నమ్మరని రఘువీరా తెలిపారు. -
‘మోదీ బీసీ కాదు.. బిగ్ క్రిమినల్’
సాక్షి, అమరావతి: అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో చర్చకు రాకుండా చేసిన కేంద్రప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసంలో ఓడిపోతామనే చర్చకు రాకుండా చేశారన్నారు. ఎల్కే అద్వానీ లాంటి సీనియర్ నేతలు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయం ప్రధాని మోదీకి పట్టుకుందని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం దుర్మార్గమన్నారు. 5 కోట్ల ఆంధ్రులను కేంద్ర ప్రభుత్వం అగౌరవ పరిచిందని, దేశంలో బీజేపీని ఒంటరి చేస్తామన్నారు. మోదీ బీసీ కాదని.. బిగ్ క్రిమినల్ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ మీ అనుబంధ సంస్థా? చంద్రబాబు నాయుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారని రఘువీరా రెడ్డి అన్నారు. చంద్రబాబు కలియుగ కుంభకర్ణుడన్నారు. నాలుగేళ్లు తమని అవమానించి, కేసులు పెట్టిన చంద్రబాబుకు ఇపుడు అఖిలపక్షం గుర్తొచ్చిందా .. కాంగ్రెస్ ఏమైనా మీ అనుబంధ సంస్థ అనుకుంటున్నారా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లేటపుడు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకువెళ్లలేదన్నారు. దేశ రాజధానిలో హేమాహేమీలను కలిసి వస్తారనుకున్నామని.. కానీ హేమమాలినిని కలిశారని ఎద్దేవా చేశారు. -
‘చంద్రబాబు.. సెల్ఫీ రాజా’
సాక్షి, తిరుపతి: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోలకు పోజులివ్వడం తప్ప.. చేసిందేమీ లేదని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం గురువారం కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో 48 గంటల పాటు దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. చంద్రబాబు సెల్ఫీ రాజా అని ఏద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై ఆయనకు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. పార్లమెంటును ప్రజా దేవాలయంగా చంద్రబాబు భావించలేదని ఆరోపించారు. హోదా కోసం కాంగ్రెస్ 29 రాష్ట్రాలలో తీర్మానాలు చేయించిదని గుర్తు చేశారు. అంతేకాకుండా హోదా కోసం రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని తెలిపారు. -
‘బాబు-బీజేపీలది డ్రామా’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ-బీజేపీలు ఇంకా డ్రామాలు ఆడుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు 5 కోట్ల ప్రజలను నమ్మించి దారుణంగా మోసం చేశాయని.. ప్రజలు ఇంకా వారిని నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విజయవాడలో ఆదివారం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘అమిత్ షా, చంద్రబాబు ఇద్దరూ నాటకాలాడుతున్నారు. 4 ఏళ్ళు కలిసి ఉండి ఇప్పుడు ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా మారినట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో అమిత్ షా రూ. 1.40లక్షల కోట్ల లెక్కలు చెప్పినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సింది. ఇప్పుడు నిలదీయటం వ్యర్థం. ప్రధాని మోదీ-అమిత్‌షాలు అబద్ధాలకోరులు.. వారికీ విశ్వసనీయత లేదు’ అని రఘువీరా పేర్కొన్నారు. కాంగ్రెస్ త్యాగం చేసింది : విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని.. చిత్తశుద్ధితో పోరాడేది.. చివరకు 2019లో హోదాను ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనేనని రఘువీరా చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే టీడీపీ-బీజేపీ కుట్ర చేశాయన్నారు. ‘విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయింది. కానీ, రాష్ట్రానికి అన్నివిధాలా న్యాయం చేయడానికి ప్రయత్నించింది. ఏపీకి కాంగ్రెస్ వడ్డించిన విస్తరి ఇస్తే.. దాన్ని బీజేపీ-టీడీపీలు అవకాశవాద రాజకీయాలతో కుక్కలు చింపిన విస్తరి చేశాయి. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ దెబ్బతీస్తే.. చంద్రబాబు 5 కోట్ల ప్రజల హక్కులను కేంద్రం కాళ్ళ దగ్గర పెట్టారు’ అని చెప్పారు. ఇంక తప్పించుకోలేరు... కాంగ్రెస్ పార్టీపై ఇంకా నిందలేసి ఇక బీజేపీ, టీడీపీలు తప్పించుకోలేవని.. వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని, ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రఘువీరా అన్నారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన అమలు చేయమనే ఇవాళ అందరూ అడుగుతున్నారు. హోదాతోసహా ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ అమలైతే రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు ఏపీకి నెరవేరతాయి. అసత్యాల అమిత్ షా, మోసకారి మోదీ, వెన్నుపోటు చంద్రబాబు.. వీరంతా ఏపీని ముంచినోళ్లే’ అని రఘువీరా ఆక్షేపించారు. -
వైఎస్సార్సీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్ మద్దతు
-
కేంద్రంపై అవిశ్వాసంలో కీలకమలుపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్న 20 పార్టీలు అవిశ్వాసానికి మద్దతిస్తాయని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీలను సంప్రదించాలని లోకసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గేను సోనియా ఆదేశించారని రఘువీరా తెలిపారు. ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేందుకు పూర్తిగా సహకరిస్తామని రఘువీరా స్పష్టం చేశారు. -
హోదా విషయంలో బాబుది డబుల్ గేమ్
గన్నవరం: ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఒక పక్క ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, మరో పక్క ప్రధాని మోదీకి ఆగ్రహం రాకుండా చూసుకోవాలనే ద్వంద్వ వైఖరి సరికాదని హితవు పలికారు. ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరంలోని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వింత సంజీవరెడ్డి నివాసంలో కేంద్ర మాజీ మంత్రి పల్లాంరాజు, టీపీసీసీ నేత మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పోలవరం, రాజధాని నిర్మాణాల్లో ఎంత దోచుకోవాలి, ఎమ్మెల్యేల సీట్లు ఎలా పెంచుకోవాలనే ఆరాటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు బాబుకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. హోదా కోసం అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే కొత్త ఫ్రంట్‌ను తెరమీదకు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, కిసాన్ సెల్ కన్వీనర్ కొమ్మినేని మల్లికార్జునరావు, పీసీసీ నాయకులు నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లోకి జనసభ అధ్యక్షుడు
సాక్షి, విజయవాడ : బడుగు, బలహీన వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదలనూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. బీసీ జనసభ అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ చేరిక సందర్భంగా ఆదివారం విజయవాడలో న్విహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాండ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి పల్లంరాజులు డాక్టర్ గంగాధర్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటాలు చేస్తుందని, గంగాధర్ రాకతో పార్టీకి పునర్వైభవం వచ్చిందని కేవీపీ అన్నారు. మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ తీరును ఎండగట్టారు. ‘‘పరిపాలనా దక్షత ఏమాత్రంలేని మోదీ.. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. చరిత్రలోనే లేనివిధంగా నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారంటే దేశంలో పరిపాలన ఏవిధంగా సాగుతున్నదో అర్థంచేసుకోవచ్చు. గురువు అద్వానీకి కనీసం నమస్కారం పెట్టని మోదీ ఎంత కుసంస్కారో ప్రజలే అర్థంచేసుకోవాలి’’ అని పల్లంరాజు వ్యాఖ్యానించారు. -
టీడీపీ, బీజేపీల గుర్తింపు రద్దు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీ, టీడీపీల గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు తదితరులు శుక్రవారం ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారిని కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు, విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చి, అమలులో మాత్రం విస్మరించిందన్నారు. అలాగే రాష్ట్రంలోని టీడీపీ ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. టీడీపీ ఇచ్చిన 600 హామీలు ఎలా సాధ్యం అంటూ నాడు కేంద్రం ఎన్నికల సంఘం వివరణ కోరిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని టీడీపీ వివరణ కూడా ఇచ్చిందన్నారు. అయితే రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగులకు రూ. 2 వేల భృతిలాంటి ప్రధాన హామీలను టీడీపీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. హామీలు విస్మరించినందునా ఎన్నికల నియమావళికి అనుగుణంగా బీజేపీ, టీడీపీల గుర్తింపును రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. -
ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ ప్రామిస్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామియిచ్చారు. మంగళవారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నిర్వహించిన ఆత్మగౌరవ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అందరం కలిసికట్టుగా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఒక్క నిమిషంలోనే ప్రసంగం ముగించి వేదికపై దిగి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నాయకుడు మధు ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు. -
'బీజేపీ, టీడీపీలను రద్దు చేయాలి'
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం కాగడాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేని బీజేపీ, టీడీపీలను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని తెలిపారు. ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. సాక్షాత్తు పార్లమెంటులో అయిన చట్టాలు, ప్రధాన మంత్రి హామీలు, కెబినెట్ నిర్ణయాలకు దిక్కు లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రతీ ఆంధ్రుడి గుండె లబ్ డబ్కు బదులు ప్రత్యేక హోదా అని కొట్టుకుంటుందన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రన్న పార్టీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. కాగా, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై కట్ మోషన్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. -
పవన్ ఫోన్.. స్పందించని రఘువీరా!
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన ఆర్థిక సహాయం గురించి చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని తెలిసింది. సోమవారం రఘువీరా పుట్టినరోజు కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో తప్ప ఎవరితోనూ మాట్లాడరని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై నిజనిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు వెల్లడిస్తామని పవన్ కల్యాణ్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. రఘువీరా స్పందించకపోవడంతో ఆయన సతీమణి సునీతకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసినా మరొకరోజు మాట్లాడాలని ఆమె పవన్‌కు చెప్పినట్లు సమాచారం. కాగా, ఇటీవల లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను పవన్ కలిసిన సంగతి తెలిసిందే. -
‘అందుకే సీఎం కుర్చీలో బాలకృష్ణ’
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎన్నికోట్ల పెట్టుబడులు వచ్చాయో సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు ఏమోగానీ దోచుకున్నది.. దాచుకోవడానికి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. బాబు హయాంలో గిరిజనులు, దళితులు, మహిళలపై దాడులు అధికమయ్యాయన్నారు. మరోవైపు ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను పొగడటమే పనిగా పెట్టుకున్నారని రఘువీరా ఆరోపించారు. ఇరు రాష్ట్రాలను పక్షపాతం లేకుండా చూసే బాధ్యత గవర్నర్‌పై ఉందని అన్నారు. బాలకృష్ణ మోజు తీర్చుకున్నాడు.. కాగా, విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించిన అంశంపై రఘువీరా స్పందించారు. 'తన తండ్రి ఎన్టీఆర్ కుర్చీని చంద్రబాబు లాక్కున్నారని బాలకృష్ణ మనస్సులో ఉండి ఉండొచ్చు.. అందుకే సీఎం రాష్ట్రంలో లేనప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు. సీఎం సీట్లో కూర్చుని బాలకృష్ణ మోజు తీర్చుకున్నాడు' అని వ్యాఖ్యానించారు. -
సీట్ల పెంపుకు వ్యతిరేకం కాదు.. కానీ
సాక్షి, ఢిల్లీ: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీని కలిసిన అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడుతూ..' ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను రాహుల్‌కు వివరించాను. పోలవరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రాహుల్ దృష్టికి తీసుకెళ్లా. విభజన హామీల అమలులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోకసభలో రూల్ 184 కింద విభజన హామీల అంశాలపై నోటీసులు ఇవ్వాలని రాహుల్ ని కోరాము. ఇదే అంశంపై పార్లమెంట్లో ఓటింగ్‌కు పట్టుబడతామని ఆయన హామీ ఇచ్చారు. విభజన హామీలు గాలికొదిలేసి అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. అసెంబ్లీ సీట్ల పెంపుకు మేము వ్యతిరేకం కాదు కానీ ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేరిస్తేనే పార్లమెంటులో సీట్ల పెంపు ప్రతిపాదనకు సహకరిస్తాము. రెండు రాష్ట్రాలకు విభజన హామీల అమలుకు మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం. ప్రాధాన్యత అంశాలు వదిలేసి అసెంబ్లీ సీట్లపై దృష్టి సారించడాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తోంది. విభజన హామీలన్నీ రెండు రాష్ట్రాలకు అమలుపరచాలి. రాష్ట్రానికి సంబందించి అంశాల వారీగా కాంగ్రెస్ పోరాడుతుంది. రాహుల్ గాంధీ కూడా ఏపీ సమస్యలపై పోరాడతామని హామీ ఇచ్చారు' అని రఘువీరా తెలిపారు. -
గజల్ శ్రీనివాస్ కేసుపై రఘువీరా స్పందన
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న గజల్ శ్రీనివాస్ వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు. టీడీపీ ప్రభుత్వం బుద్ధే వక్రబుద్ధి అని, అందుకే అలాంటి వారిని సెలక్ట్ చేస్తోందని విమర్శించారు. గజల్ శ్రీనివాస్ తమ పార్టీలో తిరగలేదని, స్వచ్ఛంగా ఉండాల్సిన అంబాసిడరే ఇలా చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రఘువీరా అన్నారు. రేపటి నుంచి పోలవరం యాత్రం.. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు పాదయాత్ర చేపడుతున్నామని రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారిని రఘువీరా రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేపటి నుంచి 10 తేదీవరకు ధవళెశ్వరం నుండి పోలవరం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నాం. 10న పోలవరంలో సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం పూర్తి చేయాలి. పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు ఏవిధంగా పంచుకోవాలి అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పాదయాత్రను విజయవంతం చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించాలని అమ్మవారిని వేడుకున్నాం’ అని రఘువీరా అన్నారు. ఇంద్రకీలాద్రి పై తాంత్రిక పూజలపై.. ‘ఆలయంలో అర్ధరాత్రి పూజలు జరిగాయని దుర్గగుడి చైర్మన్ ఒప్పుకున్నారు. అధికారులతో మాట్లాడుదామంటే భయపడిపోతున్నారు. దుర్గమ్మ సన్నీధిలో ఎవ్వరూ అబద్ధాలు ఆడలేరు. అలాగని నిజం చెప్పాలంటే నోటికి తాళాలు వేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా దుర్గగుడి లో ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంది. గతంలో అమ్మవారి ముక్కుపుడక విషయంలో ప్రభుత్వం మూల్యం చెల్లించుకొంది. ఆలయంలో పాలక మండలి నోరు మెదపకూడదని టీడీపీ నేతలు హుకుం జారీ చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే’ అని రఘువీరా అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ వ్యవహారంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం, దేవాదాయశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూజలు జరిగాయనేది వాస్తవమని, జరగలేదని బుకాయించొద్దని సూచించారు. ఈ వ్యవహారంపై సిట్డింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి, లేకుంటే టీడీపీ సర్కారు మళ్లీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. -
'రైతులపై రౌడీషీట్లు దుర్మార్గం'
సాక్షి, విజయవాడ: రైతులపై రౌడీషీట్ తెరవడాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తప్పుబట్టారు. నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన గంపలగూడెం రైతులు నష్టపరిహారం కోసం పోరాడుతున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ న్యాయం చేయమని కోరితే క్రిమినల్ కేసులు, రౌడీషీట్లు తెరవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడి క్రషింగ్ చేయించే బాధ్యతను తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, సాధికారిత సంస్ధలో సహాయం చేయాల్పిందిబోయి.. సహాయ నిరాకరణ జరుగుతోందని ఆరోపించారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సింగపూర్‌కు పదిమంది రైతులను ఎందుకు పంపించారో అర్ధం కావడం లేదన్నారు. అధికార పార్టీకి చెందిన వారి పెళ్ళిళ్ళు ఉన్నాయని అసెంబ్లీకి మూడు రోజులు సెలవులు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. మరో రోజు సెలవు ఇచ్చి గంపలగూడెంలో రైతులను, డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీని, నాగార్జున సాగర్ రైతులు నీళ్ళు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్న ప్రాంతాలను సందర్శించాలని సూచించారు. ఫాతిమా మెడికల్ కాలేజి స్టూడెంట్స్ 26 రోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఫాతిమా కాలేజి విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుంటామంటున్నా ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. ఫాతిమా విద్యార్ధులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం కాపాడలేని పరిస్ధితిలో ముఖ్యమంత్రి, డాష్ బోర్డు ఉందని రఘువీరా వ్యాఖ్యానించారు -
బీజేపీ, టీడీపీలకు కాలం మూడింది!
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతున్న బీజేపీ, టీడీపీలకు కాలం మూడిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. హోదా కోసం ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన ఉద్యమకారులపై ఏపీ ప్రభుత్వం అమానుష నిర్బంధ చర్యలకు పాల్పడటాన్ని ఆయన ఖండించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షులు ఎన్.తులసిరెడ్డి, సూర్యానాయక్, ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతంలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో రెండు దఫాలు ప్రత్యేక హోదాపై తీర్మానాలు చేసిందని, దానిని గుర్తు చేసేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేయడం దారుణం అన్నారు. హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు ద్రోహం చేశాయన్నారు. ఇదిలా ఉండగా దేశంలోని పీసీసీ సభ్యులందరూ రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారని, ఆయన నాయకత్వంలోని దేశం, ప్రజలు, యువత ముందుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. -
‘నంది అవార్డులకు కావాల్సిన వారి ఎంపిక’
సాక్షి, మడకశిర: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం ఇప్పుడే ఆగేట్లు కనిపంచడం లేదు. ఈ నంది అవార్డులపై తాజాగా పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని పీసీసీ చీఫ్ విమర్శించారు. ఆయన శుక్రవారం తన స్వగ్రామమైన నీలకంఠపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండటం తగదన్నారు. ప్రభుత్వం నంది అవార్డులకు కావాల్సిన వారిని ఎంపిక చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం సాగదీస్తోందని విమర్శించారు. పోలవరం పనుల్లో వేగవంతం లేదని ఆయన అన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం తప్పిదం వల్లే బోటు ప్రమాదం జరిగిందని విమర్శించారు. ఈ ప్రమాద సంఘటనపై ప్రజలను దృష్టి మళ్లించేందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులను తీసుకెల్లి షుటింగ్ తరహాలో ప్రభుత్వం వ్యవహరించదన్నారు. ఈ నంది అవార్డులపై ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను తెలిపిన విషయం తెలిసిందే. కొంత మంది ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. కొందరు అయితే సోషల్ మీడియా ద్వారా అవార్డులపై చెలరేగిపోతున్నారు. దర్శకత నిర్మాత గుణశేఖర్ ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వాన్ని, నంది అవార్డుల జ్యూరీపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రతి విషయంపై స్పందించే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఫెస్బుక్ ద్వారా నంది అవార్డులపై తీవ్ర విమర్శలు చేశారు. -
పడవ ప్రమాదంపై పీసీసీ నిజనిర్ధారణ కమిటి
సాక్షి, విజయవాడ : కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంపై కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పడవ ప్రమాదం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు వివరించారు. ఈ కమిటీలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు సూరిబాబు, మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి, డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌లు ఉంటారన్నారు. ఈ కమిటీ ఈ నెల 14న ఉదయం 10 గంటలకు పవిత్ర సంగమం వద్దకు వెళ్లి ప్రమాదస్ధలిని పరిశీలిస్తుందని తెలిపారు. అనంతరం బాధితుల బంధువులతో మాట్లాడి నివేదిక సమర్పిస్తుందన్నారు. -
స్పీకర్ కోడెలపై రఘువీరా మండిపాటు
-
స్పీకర్ కోడెలపై రఘువీరా మండిపాటు
సాక్షి, కడప: పార్టీ ఫిరాయింపుదారులను వెంటనే సస్పెండ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ పదవిని కోడెల భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని, లేకుంటే నిర్వాసితులతో కలిసి సామూహిక దీక్ష చేపడతామని రఘువీరారెడ్డి హెచ్చరించారు. కాగా, తమ పార్టీ నుంచి అధికార టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ కూడా డిమాండ్ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. -
'నిధులు తెచ్చుకోలేని దద్దమ్మ చంద్రబాబు'
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు పోలవరం పూర్తి చెయ్యలేక కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారని.. మూడేళ్లుగా ప్రాజెక్టుకు కనీస నిధులు తెచ్చుకోలేని దద్దమ్మ చంద్రబాబు అని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. 'బాబు ఈ ప్రాజెక్టును పూర్తి చెయ్యలేడని ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రాజెక్ట్‌కు ఒక్క రుపాయి కూడా రాష్ట్ర ఖజానా నుంచి నిధులు ఇవ్వడానికి వీలులేదు. నిధులన్నీ కేంద్రం నుంచే రప్పించాలి. ప్రాజెక్ట్ విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కమీషన్ల కక్కుర్తిలో పోలవరం ప్రాజెక్ట్ నలిగిపోతోంది. చేతకాకపోతే ప్రాజెక్ట్ నుంచి, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై వచ్చే నెల 19 వ తేదీలోపు స్పష్టత ఇవ్వలేకపోతే ప్రాజెక్ట్ వద్ద దీక్ష చేస్తామన్నారు. -
మరో జన్మభూమి కమిటీలా చేయొద్దు
సాక్షి, అమరావతి: అత్యంత కీలకమైన గ్రామ కార్యదర్శి పదవుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ కార్యదర్శుల నియామకాలపై సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 5800 ల కార్యదర్శుల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయితే ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించకుండా మెరిట్ ప్రకారం నియామకాలు జరగాలని, రూల్ అప్ రిజర్వేషన్ పాటించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే పంచాయితీ కార్యదర్శులదే ముఖ్యపాత్ర అన్నారు. అలాంటి నియామకాలు ఔట్ సోర్సింగ్ విధానంలో అంటూ మరో జన్మభూమి కమిటీలా చేయవద్దన్నారు. -
అది పోలవరం కాదు.. టీడీపీ నేతలకు కమీషన్ల వరం..
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు టీడీపీ నేతలకు కమీషన్ల వరంగా మారిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం గురించి సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. మాటలు తప్ప చేతలు లేవని మండిపడ్డారు. 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నచంద్రబాబు కనీసం పోలవరానికి పరిపాలన మంజూరు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిల హయాంలో రూ. 5,136 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం అనుమతులు కూడా అప్పుడే వచ్చాయన్నారు. దురదృష్టవశాత్తూ కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందన్నారు. నిధుల మంజూరు గురించి కేంద్రం ఎలాంటి భరోసా ఇవ్వలేదని, ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ అంచనాల మేరకు ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ. 58,319 కోట్లు అవసరం అని, కాని మోదీ ప్రభుత్వం పిల్లికి భిక్షం వేసినట్లు మూడేళ్లలో రూ. 4,328 కోట్లు మాత్రమే ఇచ్చింన్నారు. ఈ మేరకు నిధులు విడుదల చేస్తే కొన్ని దశాబ్ధాలైనా ప్రాజెక్టు పూర్తి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
పేదల హృదయాల్లో నిలిచారు
వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో కేవీపీ, రఘువీరా సాక్షి, అమరావతి: రైతులకు రైతుగా.. కూలీలకు కూలీగా.. రోగులకు డాక్టర్‌గా మహానేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల హృదయాల్లో నిలిచిపోయారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. వైఎస్ 8వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేవీపీ తదితర నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేవీపీ మాట్లాడుతూ రెండు పూటలా గంజికి లేని కుటుంబాల్లో కూడా వైఎస్ కృషితో నేడు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని గుర్తు చేశారు. రఘువీరా మాట్లాడుతూ రాజకీయంగా వైఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా గట్టిగా నిలబడ్డారని గుర్తు చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.