‘రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాలయాలపై ధర్మపోరాట దీక్ష’ అంటూ చంద్రబాబు చేస్తున్న ఒక్కరోజు నిరాహార దీక్ష చూసి జనం నవ్వుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. ఇది ప్రజల్ని వంచించడానికి చేస్తున్న ‘నయా’వంచక దీక్ష అని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై ధ్వజమెత్తారు.