Fasting strike
-
గడ్డ కట్టే చలిలో 16 రోజులుగా ‘‘క్లైమేట్ ఫాస్ట్"
లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక, వాతావరణ కార్యకర్త మెగసెసే అవార్డు గ్రహీత, సోనమ్ వాంగ్‌చుక్ 'లడఖ్‌ను రక్షించేందుకు' నిరాహార దీక్షకు దిగారు. పర్యావరణ పరిరక్షణోద్యమంలో స్వరాన్ని వినిపిస్తున్న సోనమ్ లడఖ్‌ను కాలుష్య కోరల నుంచి రక్షించాలంటూ గత కొంత కాలంగా పోరాడుతున్నారు. లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ భద్రత కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం, లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) నాయకుల మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నాలుగేళ్లపాటు తూతూమంత్రంగా సాగిన వ్యూహాల తర్వాత, హామీలను నెరవేర్చేందుకు కేంద్రం నిరాకరించిందని వాంగ్‌చుక్ విమర్శించారు. వాతావరణ మార్పులను నిరసిస్తూ, లడఖ్‌లోని హిమాలయ ప్రాంతంలోని పర్యావరణ భద్రత, లడఖ్‌కు ప్రజాస్వామ్య హక్కుల రక్షణ డిమాండ్‌తో మార్చి 6వ తేదీన మొదలైన ఈ ‘‘క్లైమేట్ ఫాస్ట్" 21 రోజులు పాటు కొనసాగనుంది. అవసరమైతే ఈ దీక్షను ఆమరణ దీక్షగా పొడిగించవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. BEGINNING OF DAY 16 OF #CLIMATEFAST 120 people sleeping outdoors under clear skies. Temperature: - 8 °C 16 days of just water n salts is finally taking a toll. Feeling quite week. But I can still drag for another 25 days n perhaps will. I'm sure our path of truth will win… pic.twitter.com/jsTFlvgD4c — Sonam Wangchuk (@Wangchuk66) March 21, 2024 > సాదాసీదాగాజీవనాన్ని ఎంచుకోవాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ క్లైమాట్ ఫాస్ట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల పౌరులు, రాజకీయ నాయకులు, సామాజిక-పర్యావరణ కార్యకర్తలు మద్దతుగి నిలిచారు. అలాగే ఈయనకు సంఘీభావంగా కాశ్మీర్ టూరిజం విభాగం కూడా 'క్లైమేట్ ఫాస్ట్'లో పా ల్గొనడం విశేషం. ఎప్పటికపుడు దీక్ష వివరాలను ట్వటర్లో షేర్ చేస్తున్నారు. 16 వ రోజు దీక్ష వివరాలను కూడా ఆయన పంచుకున్నారు. ‘‘8 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత వద్ద 120 మంది ఆరుబయట నిద్రిస్తున్నారు. నీరు, లవణాలుకొద్దిగా తగ్గుతున్నాయి. నేను ఇంకా 25 రోజులు దీక్ష కొనసాగించగలను అని విశ్వసిస్తున్నాను. సత్యం గెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ - సోనమ్ వాంగ్‌చుక్ కాగా ఇక్కడ పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, రాబోయే రోజుల్లో హిమానీ నదాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించిన సోనమ్ అనేక ఉద్యమాలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్ 1966లో ఆల్చి సమీపంలోని ఉలేటోక్పోలో పుట్టారు సోనమ్.విద్యాభ్యాసం కోసం వసతుల్లేక 1977లో ఢిల్లీకి తరలిపోయాడు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి 2011లో ఫ్రాన్స్‌లో ఎర్త్ ఆర్కిటెక్చర్ ను అధ్యయనం చేశారు. 1993 నుండి 2005 దాకా వాంగ్ చుక్ లడాగ్స్ మెలాంగ్ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే 2018లో రామన్ మెగసెసే అవార్డు , ఐసీఏ, సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, రోలెక్స్, ఇంటర్నేషనల్ టెర్రా అవార్డుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన దక్కించుకున్నారు. -
ఈ నెల 14 నుంచి అన్నా హజారే నిరాహారదీక్ష
పుణే: మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే ప్రకటించారు. సూపర్మార్కెట్లు, కిరాణా కొట్లలో వైన్ అమ్మకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తున్న అన్నాహజారే ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్దవ్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రప్రజలు కోరుతున్నారని ఆయన లేఖలో వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో 14 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. -
వరకట్నానికి వ్యతిరేకంగా గవర్నర్ నిరాహార దీక్ష
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేరు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, మీడియాలో తెగ వైరలవుతోంది. కారణం ఏంటంటే ఆయన వరకట్నాకి వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. తిరువనంతపరంలోని తన కార్యాలయంలో ఈ నిరసన దీక్షకు కూర్చున్నారు. ఇటీవల కేరళలో వెలుగు చూసిన వరకట్న వేధింపులు కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేరళలో పలు ప్రజా సంఘాలు వరకట్నానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టాయి. గాంధీ భవన్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి సంఘీభావంగా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా రాజ్‌భవన్‌లో దీక్షకు కూర్చున్నారు. వరకట్నం గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఆయన దీక్ష చేస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ.. ‘‘అక్షరాస్యలో ముందున్న మన రాష్ట్రానికి ఇది ఎంతో సిగ్గుచేటు. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం. అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మన రాష్ట్రాభివృద్ధిలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మహిళల గౌరవానికి వరకట్నం భంగం కలిగిస్తుంది. ఏ యువకుడైనా తన పెళ్లికి కట్నం డిమాండ్ చేస్తే అతడు చదువును, దేశాన్ని అవమానించినట్లేనని గాంధీజీ చెప్పారు. ఎవరూ కట్నం తీసుకోబోమని యువత ప్రతిజ్ఞ చేయాలి. వరకట్న వేధింపులకు ముగింపు పలకాలి’’ అని మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ పేర్కొన్నారు. వరకట్నానికి వ్యతిరేకంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఖాన్ అభిప్రాయపడ్డారు. మహిళల గౌరవానికి సంబంధించి కేరళ ప్రభుత్వం చేపట్టిన స్త్రీపక్ష కేరళం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభించిన ఆయన 6 గంటలకు విరమించారు. సాయంత్రం 5 గంటలలకు గాంధీ భవన్‌కు వెళ్లి.. వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన ప్రజా సంఘాలను మద్దతు తెలిపారు. గవర్నర్ ఇలా వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేయడం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రైతుల కోసం ఉపవాస దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు సమస్యలు, కూలీల ఇబ్బందులను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి లాక్డౌన్ విధించడంతో కూలీలు దొరకక, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక, ఐకేపీ సెంటర్లలో సరైన ఏర్పాట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారం రోజులుగా బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. -
ప్రభుత్వం హామీలను విస్మరించింది.. అందుకే నిరాహార దీక్ష
సాక్షి, సిద్దిపేట : ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత నర్సారెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు రేపు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష చేపడతానని నర్సారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలు, డబుల్ బెడ్రూం నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ప్రజలను మేల్కొల్పడానికి, ఇంకా అనేక సమస్యల సాధన కొరకు గజ్వేల్‌లో దీక్ష చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే నేను చేపట్టబోయే దీక్షకు ప్రభుత్వం అడ్డు తగులుతుందని ఆరోపించారు. జిల్లాలో 30వ సెక్షన్ అనేది కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుందని, కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం చాలా రోజులుగా కొనసాగుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మిషన్ భగీరథ కోసం పగలకొట్టిన రోడ్లను మళ్లీ నిర్మించలేదని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్, ఎర్రవల్లిలో సీఎం ఇంటి నిర్మాణం 6 నెలల్లోనే పూర్తి చేశారు.. మరి పేదలకు అందజేయాల్సిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఎన్ని రోజులు కావాలంటూ నర్సారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
అపస్మారక స్థితిలోకి స్వాతి మలివాల్
న్యూఢిల్లీ: రేప్ దోషులకు నేరం చేసిన ఆరు నెలల్లోగా కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఇక్కడి ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు ఆస్పత్రిలో చేర్పించాలని సూచించినప్పటికీ, ఆమె అందుకు నిరాకరించారు. అపస్మారక స్థితిలోకి చేరుకోగానే ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారని, స్పృహలోకి రాగానే డాక్టర్లు సెలైన్లు ఎక్కించడాన్ని స్వాతి నిరాకరించారని కమిషన్ సభ్యుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇక్కడి రాజ్‌ఘాట్‌లోని సమతా స్థల్ వద్ద స్వాతి పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. -
బాబు దీక్ష... సర్వత్రా విమర్శలు
-
బాబు దీక్షకు 5 కోట్లు!
-
బాబు దీక్షపై పలు రాజకీయ నేతల స్పందన
-
నయవంచనకు మారుపేరు బాబు
-
‘చంద్రబాబు దీక్ష నవ్వులపాలు’
సాక్షి, విజయవాడ: ‘రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాలయాలపై ధర్మపోరాట దీక్ష’ అంటూ చంద్రబాబు చేస్తున్న ఒక్కరోజు నిరాహార దీక్ష చూసి జనం నవ్వుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. ఇది ప్రజల్ని వంచించడానికి చేస్తున్న ‘నయా’వంచక దీక్ష అని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై ధ్వజమెత్తారు. దీక్షకు మద్ధతు తెలపాలని తనకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షడు కళా వెంకట్రావు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ విజ్ఞప్తి చేశారనీ వెల్లడించారు. అందర్నీ మాయచేసేందుకే చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారని రఘువీర వ్యాఖ్యానించారు. ‘టీడీపీ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ దీక్ష’ అని ఆరోపించారు. ‘ధర్మపోరాట దీక్ష’కు మద్ధతుగా అశోక్‌బాబు కూడా దీక్ష చేపట్టాల్సిందిగా చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదా అంశంపై అశోక్‌బాబు ఉద్యమం చేస్తే.. ఆ క్రెడిటంతా చివరికి చంద్రబాబు కొట్టేశారనీ, మరోసారి చంద్రబాబు మోసానికి బలికావద్దని ఆయన సూచించారు. ఇప్పటికైనా టీడీపీ నీచ రాజకీయాల్ని గ్రహించి.. ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు చంద్రబాబు ఆడుతున్న మరో నాటకం చూసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. -
భర్త ఫోన్లో మెసేజ్ చూసినందుకు..
సాక్షి, రాజమండ్రి : అనుమతి లేకుండా ఫోన్లో మెసేజ్ చూసినందుకు భర్త తనను ఇంట్లోంచి గెంటేశాడని ఓ వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగిన ఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన శ్రీలలితకు రాజమండ్రికి చెందిన రవీంద్రతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే ఇరువురి మధ్య మనస్పర్దలు వచ్చాయి. ఆదివారం అనుమతి లేకుండా తన ఫోన్‌కు వచ్చిన ఓ మెసేజ్‌ను లలిత ఓపెన్ చేసి చూడటంతో రవీంద్ర కోపోద్రేకుడయ్యాడు. లలితను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ లలిత తల్లిదండ్రులతో కలసి అత్తింటి ముందు నిరాహార దీక్షకు దిగారు. మనస్పర్దలు వస్తే సర్ది చెప్పి కలపాల్సిన పెద్ద మనుషులే తమను దూరం చేస్తున్నారని లలిత ఆరోపించారు. -
జనం కోసమే జగన్ దీక్ష
పట్టం గట్టిన ప్రజల నోట్లో మట్టికొడుతున్న చంద్రబాబు సర్కారుపై సమరానికి సిద్ధం కావాలని వైఎస్సార్ సీపీ నేతలు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకే పార్టీ అధినేత జగన్ నిరశనదీక్షకు ఉద్యుక్తులవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఊరూరా ప్రచారం చేసి, సర్కారు నిజస్వరూపాన్ని ప్రజలకు విప్పిచెప్పి, పాలకులకు గుణపాఠం చెప్పాలని దిశానిర్దేశం చేశారు. సాక్షి, రాజమండ్రి :వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరిలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టే రెండురోజుల నిరశన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్ష సందర్భంగా కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు.. రాజమండ్రి హోటల్ జగదీశ్వరిలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తు రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగన్ దీక్షకు ఉపక్రమిస్తున్నారని చెప్పారు. చేసిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేస్తుంటే గోడును ప్రధాన ప్రతిపక్షానికి చెప్పుకోవాలని రైతులు చూస్తున్నారన్నారు. అధికారంలోకి రాక ముందు చంద్రబాబు ఏం చెప్పారు, వచ్చాక ఏం చేస్తున్నా చేస్తున్నదేమిటి అన్నదానిపై నాడు, నేడు అంటూ ఊరూరా ఫ్లెక్సీలు కట్టి ఎండగట్టాలన్నారు. ఇది కోతల సర్కారు : సాయిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలకు మధ్యలో ఉంటుందన్న ఉద్దేశంతోనే నిరశన దీక్షకు జగన్ తణుకును ఎంపిక చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు, ఫీజు రీ యింబర్స్‌మెంట్, పెన్షన్లు ఇలా అన్నింటిలో కోత పెడుతోందని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. గుణపాఠం నేర్పుదాం : ధర్మాన పార్టీ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన మాట్లాడుతూ పార్టీ జగన్ దీక్ష ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడలేక పోతోందని ప్రజలను నమ్మించాలని కుయుక్తులు పన్నుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టాం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తత్తరపాటుకు గురయ్యారు. అందుకే కొత్త గేమ్‌కు తెరలేపింది. ఈ దీక్షలను విజయవంతం చేయడం ద్వారా ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడతామన్న ప్రజల విశ్వాసానికి బలం చేకూర్చాలి’ అన్నారు. వాగ్దానాలను మూటకట్టారు : జ్యోతుల జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల మాట్లాడుతూ రైతుల ఆశలపై నీళ్లు జల్లి, నిరుద్యోగ యువతకు నిరాశ మిగిల్చి, ఇచ్చిన వాగ్దానాలను మూట కట్టేసిందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కంటక విధానాలను తిప్పికొట్టే ధైర్యం మాకుందని పార్టీ శ్రేణులు చాటి చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్తా బాధ్యతాయుతమైన సైనికుల్లా వ్యవహరించి అధినేత దీక్షను విజయవంతం చేయాలని, టీడీపీ నేతల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఊరూరా ప్రచారం చేయండి : బోస్ మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ చంద్రబాబు మోసాన్ని గ్రామ గ్రామాన ప్రజలకు విడమరిచి చెప్పాలని, రైతాంగాన్ని ఉద్యమం దిశగా నడిపించాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ దీక్షను విజయవంతం చేసేందుకు తమ జిల్లా శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయన్నారు. ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నారన్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ జగన్ దీక్షకు మద్దతు పలికేందుకు గుంటూరుజిల్లాలో కూడా రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ బాండ్లంటూ ప్రభుత్వం ఇచ్చిన కాగితాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని బ్యాంకులు తిప్పి పంపుతున్నారన్నారు. చంద్రబాబు మోసపూరిత వ్యక్తిత్వాన్ని రైతులు ఇప్పుడు గమనిస్తున్నారన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజక వర్గ నాయకుడు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు జగన్ దీక్షను విజయవంతం చేయాలన్నారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు గతాన్ని విస్మరించి, నమ్మిన రైతులు మరోసారి నిండా మునిగారన్నారు. గతంలో క్రాప్ హాలిడే ద్వారా రైతు ఉద్యమమంటే ఏంటో జిల్లా రైతులు చూపించారన్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రైతు సమస్యలు ప్రధాన ఎజెండాగా సాగుతున్న దీక్షను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. తణుకు కో ఆర్డినేటర్ చీర్ల రాధయ్య మాట్లాడుతూ ఎన్నికల తర్వాత జగన్ చేస్తున్న తొలి దీక్షను విజయవంతం చేసేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. సమావేశంలో పార్టీ కార్యదర్శి తలశిల రఘురాం, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, పూడి ముత్యాలనాయుడు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కుడుపూడి చిట్టబ్బాయి, గొల్ల బాబూరావు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ రాష్ట్ర కార్యద ర్శులు కొల్లి నిర్మల కుమారి, గుండా వెంకటరమణ, సంగిశెట్టి అశోక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణ, సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, వివిఢధ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, తోట సుబ్బారావునాయుడు, చెల్లుబోయిన వేణు, తోట గోపి, తలారి వెంకట్రావు, పార్టీ ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదనరెడ్డి, వివిధ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు, మార్గాని గంగాధర్, శెట్టిబత్తుల రాజబాబు, గారపాటి ఆనంద్, గుర్రం గౌతమ్, రాజమండ్రి కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సాకా ప్రసన్నకుమార్, అప్పారి విజయకుమార్, పెట్టా శ్రీనివాస్, వట్టికూటి రాజశేఖర్, డీసీసీబీ డెరైక్టర్ శంకరరావు, గోపాలపురం మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నమని జనార్దనరావు, అత్తిలి సీతారామస్వామి, ట్రేడ్‌యూనియన్ జిల్లా కార్యదర్శి అల్లి రాజబాబు, పార్టీ నాయకులు పి.కె .రావు, మిండగుదిటి మోహన్, తాడి విజయభాస్కరరెడ్డి, విప్పర్తి వేణుగోపాలరావు, ఆర్వీవీ సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
జనం కోసమే జగన్ దీక్ష
సాక్షి, రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరిలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టే రెండురోజుల నిరశన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్ష సందర్భంగా కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు.. రాజమండ్రిలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగన్ దీక్షకు ఉపక్రమిస్తున్నారని చెప్పారు. వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేస్తుంటే గోడును ప్రధాన ప్రతిపక్షానికి చెప్పుకోవాలని రైతులు చూస్తున్నారన్నారు. అధికారంలోకి రాక ముందు చంద్రబాబు ఏం చెప్పారు, వచ్చాక ఏం చేస్తున్నా చేస్తున్నదేమిటి అన్నదానిపై నాడు, నేడు అంటూ ఊరూరా ఫ్లెక్సీలు కట్టి ఎండగట్టాలన్నారు. ఇది కోతల సర్కారు : సాయిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలకు మధ్యలో ఉంటుం దన్న ఉద్దేశంతోనే నిరశన దీక్షకు జగన్ తణుకును ఎంపిక చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్లు ఇలా అన్నింటిలో కోత పెడుతోందని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. గుణపాఠం నేర్పుదాం : ధర్మాన పార్టీ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన మాట్లాడుతూ వైఎస్ జగన్ దీక్ష ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడలేక పోతోందని ప్రజలను నమ్మించాలని కుయుక్తులు పన్నుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టాం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తత్తరపాటుకు గురయ్యారు. అందుకే కొత్త గేమ్‌కు తెరలేపింది. ఈ దీక్షలను విజయవంతం చేయడం ద్వారా ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడతామన్న విశ్వాసానికి బలం చేకూర్చాలి’ అన్నారు. ‘పశ్చిమ’ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ దీక్షను విజయవంతం చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లా శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయన్నారు. ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నారన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ బాండ్లంటూ ప్రభుత్వం ఇచ్చిన కాగితాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని బ్యాంకులు తిప్పి పంపుతున్నాయ న్నారు. చంద్రబాబు మోసపూరిత వ్యక్తిత్వాన్ని రైతులు ఇప్పుడు గమనిస్తున్నారన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు జగన్ దీక్షను విజయవంతం చేయాలన్నారు. పార్టీ తణుకు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చీర్ల రాధయ్య మాట్లాడుతూ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ చేస్తున్న తొలి దీక్షను విజయవంతం చేసేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ తోట గోపీ, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.