లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక, వాతావరణ కార్యకర్త మెగసెసే అవార్డు గ్రహీత, సోనమ్ వాంగ్‌చుక్ 'లడఖ్‌ను రక్షించేందుకు' నిరాహార దీక్షకు దిగారు. పర్యావరణ పరిరక్షణోద్యమంలో స్వరాన్ని వినిపిస్తున్న సోనమ్ లడఖ్‌ను కాలుష్య కోరల నుంచి రక్షించాలంటూ గత కొంత కాలంగా పోరాడుతున్నారు. లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ భద్రత కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం, లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) నాయకుల మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నాలుగేళ్లపాటు తూతూమంత్రంగా సాగిన వ్యూహాల తర్వాత, హామీలను నెరవేర్చేందుకు కేంద్రం నిరాకరించిందని వాంగ్‌చుక్ విమర్శించారు.
వాతావరణ మార్పులను నిరసిస్తూ, లడఖ్‌లోని హిమాలయ ప్రాంతంలోని పర్యావరణ భద్రత, లడఖ్‌కు ప్రజాస్వామ్య హక్కుల రక్షణ డిమాండ్‌తో మార్చి 6వ తేదీన మొదలైన ఈ ‘‘క్లైమేట్ ఫాస్ట్" 21 రోజులు పాటు కొనసాగనుంది. అవసరమైతే ఈ దీక్షను ఆమరణ దీక్షగా పొడిగించవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.
BEGINNING OF DAY 16 OF #CLIMATEFAST
— Sonam Wangchuk (@Wangchuk66) March 21, 2024
120 people sleeping outdoors under clear skies. Temperature: - 8 °C
16 days of just water n salts is finally taking a toll. Feeling quite week. But I can still drag for another 25 days n perhaps will.
I'm sure our path of truth will win… pic.twitter.com/jsTFlvgD4c
>
సాదాసీదాగాజీవనాన్ని ఎంచుకోవాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ క్లైమాట్ ఫాస్ట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల పౌరులు, రాజకీయ నాయకులు, సామాజిక-పర్యావరణ కార్యకర్తలు మద్దతుగి నిలిచారు. అలాగే ఈయనకు సంఘీభావంగా కాశ్మీర్ టూరిజం విభాగం కూడా 'క్లైమేట్ ఫాస్ట్'లో పా ల్గొనడం విశేషం. ఎప్పటికపుడు దీక్ష వివరాలను ట్వటర్‌లో షేర్ చేస్తున్నారు. 16 వ రోజు దీక్ష వివరాలను కూడా ఆయన పంచుకున్నారు.
‘‘8 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత వద్ద 120 మంది ఆరుబయట నిద్రిస్తున్నారు. నీరు, లవణాలుకొద్దిగా తగ్గుతున్నాయి. నేను ఇంకా 25 రోజులు దీక్ష కొనసాగించగలను అని విశ్వసిస్తున్నాను. సత్యం గెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ - సోనమ్ వాంగ్‌చుక్
కాగా ఇక్కడ పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, రాబోయే రోజుల్లో హిమానీ నదాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించిన సోనమ్ అనేక ఉద్యమాలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే.
ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్
1966లో ఆల్చి సమీపంలోని ఉలేటోక్పోలో పుట్టారు సోనమ్.విద్యాభ్యాసం కోసం వసతుల్లేక 1977లో ఢిల్లీకి తరలిపోయాడు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి 2011లో ఫ్రాన్స్‌లో ఎర్త్ ఆర్కిటెక్చర్ ను అధ్యయనం చేశారు. 1993 నుండి 2005 దాకా వాంగ్ చుక్ లడాగ్స్ మెలాంగ్ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే 2018లో రామన్ మెగసెసే అవార్డు , ఐసీఏ, సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, రోలెక్స్, ఇంటర్నేషనల్ టెర్రా అవార్డుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment