![Wife thrown out of house for viewing hubby mobile - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/1/Lalitha.jpg.webp?itok=NpTDRnEH)
భర్త రవీంద్రతో శ్రీలలిత (ఫైల్ ఫొటో)
సాక్షి, రాజమండ్రి : అనుమతి లేకుండా ఫోన్‌లో మెసేజ్ చూసినందుకు భర్త తనను ఇంట్లోంచి గెంటేశాడని ఓ వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగిన ఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన శ్రీలలితకు రాజమండ్రికి చెందిన రవీంద్రతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది.
పెళ్లైన కొద్దిరోజులకే ఇరువురి మధ్య మనస్పర్దలు వచ్చాయి. ఆదివారం అనుమతి లేకుండా తన ఫోన్‌కు వచ్చిన ఓ మెసేజ్‌ను లలిత ఓపెన్ చేసి చూడటంతో రవీంద్ర కోపోద్రేకుడయ్యాడు. లలితను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు.
దీంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ లలిత తల్లిదండ్రులతో కలసి అత్తింటి ముందు నిరాహార దీక్షకు దిగారు. మనస్పర్దలు వస్తే సర్ది చెప్పి కలపాల్సిన పెద్ద మనుషులే తమను దూరం చేస్తున్నారని లలిత ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment