ఆర్కియాలజీ నేపథ్యంలో... | Ravindra Chari about Chandreswara Movie | Sakshi
Sakshi News home page

ఆర్కియాలజీ నేపథ్యంలో...

Apr 7 2025 3:35 AM | Updated on Apr 7 2025 3:36 AM

Ravindra Chari about Chandreswara Movie

సురేష్‌ రవి, ఆశా వెంకటేశ్‌ జంటగా జీవీ పెరుమాళ్‌ వర్ధన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చంద్రేశ్వర’(Chandreswara). బేబీ అఖిల సమర్పణలో డా. రవీంద్ర చారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ‘‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ క్రైమ్‌ కామెడీ సస్పెన్స్‌ ఎంటర్‌టైనర్‌ మూవీని సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాం’’ అని కోప్రొడ్యూసర్స్‌ పి. సరిత, వి. బాలకృష్ణ పేర్కొన్నారు.

‘‘ఆర్కియాలజీ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీవన విధానం ఎలా ఉండేది? అనే అంశంతో ఈ చిత్రాన్ని డివోషనల్‌ టచ్‌తో పాటు వినోద ప్రధానంగా రూపొందించాం’’ అని  డా. రవీంద్ర చారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement