Ravindra
-
ఇసుకపై ఇంకో అబద్ధం
సాక్షి, అమరావతి: ఇసుకపై కేబినెట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలను వల్లె వేసింది. ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. నిజానికి జీఎస్టీని రద్దు చేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. అయినా సరే ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందని మంత్రి రవీంద్ర ప్రకటించడంపై అధికార యంత్రాంగం సైతం విస్తుపోతోంది.ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం వినియోగదారులపైనే పడుతుంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఇసుక సేల్ పాయింట్ల దగ్గర విక్రయిస్తే ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇది కూడా వినియోగదారులపైనే పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధికారంతో జీఎస్టీని రద్దు చేస్తూ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.జీఎస్టీ కౌన్సిల్‌దే నిర్ణయంఇసుక సహా ఏదైనా సరే జీఎస్టీ నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై జీఎస్టీ నుంచి మినహాయింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్ జారీ చేస్తారని, అది దేశమంతా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రానికో మాదిరిగా జీఎస్టీ ఉండదని, మీడియా సమావేశంలో మంత్రి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇసుకపై సీనరేజ్ రద్దు చేసే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే జీఎస్టీ కూడా రద్దు చేశామని ప్రకటించడమంటే ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చట్టం గురించి తెలియదా?ఇసుక కార్యకలాపాలపై ఎస్జీఎస్టీని మాత్రమే రీయింబర్స్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, అంతకు మించి జీఎస్టీని రద్దు చేసే అధికారం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. అందరి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేశానని, తనకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు జీఎస్టీని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలియదా? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిర్మాణ రంగానికి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే ఇసుకపై 2017 సీజీఎస్టీ చట్టం సెక్షన్ 9 ప్రకారం ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంలో సీజీఎస్టీ చట్టం సెక్షన్ 7 (1) ప్రకారం 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ చట్టం జమ్మూ–కశ్మీర్ మినహా దేశమంతా వర్తిస్తుంది.మాఫియాను అరికట్టలేక చేతులెత్తేశారు..!తనకు ఏమాత్రం అధికారం లేని జీఎస్టీని రద్దు చేసినట్లు అబద్ధాలు చెబుతూ సీఎం చంద్రబాబు ఇసుక వినియోగదారులతో చెలగాటం ఆడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో ఇసుక దొరకపోవడానికి, అత్యధిక ధరలకు విక్రయించడానికి మూల కారణం పచ్చ ముఠాలేనని తెలిసినా వారిని నిరోధించకుండా గత ప్రభుత్వంపై నిందలు మోపటాన్ని బట్టి ఇసుక మాఫియాను అరికట్టలేక చంద్రబాబు చేతులెత్తేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని, అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ అధికారులు ఇచ్చిన నివేదికలను పట్టించుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లితే ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రిగా తానే ఉన్నాననే విషయాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు టీడీపీ నేతల ఇసుక దోపిడీని అరికట్టకుండా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. ఇసుక విధానంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు మార్పులు చేసినా ప్రయోజనం శూన్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరఫరా కేంద్రాల వద్ద గంటల తరబడి వాహనాలు నిరీక్షించాల్సి రావడం వల్ల ఎక్కువ రవాణా చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. బ్లాక్ మార్కెటింగ్, అస్తవ్యస్థంగా రీచ్‌ల నిర్వహణ గురించి తెలిసినా పట్టించుకోకపోవటాన్ని బట్టి ప్రభుత్వం ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రచిన్ రవీంద్రకు అరుదైన అవార్డు.. తొలి క్రికెటర్‌గా
ప్రపంచ క్రికెట్లో ఇటీవల సంచలన ప్రదర్శనతో దూసుకొచ్చిన న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఆ దేశపు బోర్డు నుంచి సముచిత గుర్తింపు దక్కింది. కివీస్ వార్షిక అవార్డుల్లో రచిన్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచి ప్రతిష్టాత్మక ‘సర్ రిచర్డ్ హ్యడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అటు టెస్టు, ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్లో గత ఏడాది కాలంలో 24 ఏళ్ల రచిన్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. వన్డే వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు సహా 578 పరుగులు సాధించిన రచిన్... ఇటీవల దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. అతి పిన్న వయసులో ‘హ్యాడ్లీ అవార్డు’ గెలుచుకున్న ప్లేయర్‌గా రచిన్ నిలిచాడు. న్యూజిలాండ్ ’టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కేన్ విలియమ్సన్కు దక్కింది. -
ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం!
ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈసారి 90 స్థానాలకు గాను 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 35 సీట్లకే పరిమితమయ్యింది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సాజా స్థానం నుంచి ఏడు సార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసి, ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి రవీంద్ర చౌబేపై బీజేపీ అభ్యర్థి ఈశ్వర్ సాహు విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లా సాజా అసెంబ్లీ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో ఈశ్వర్ సాహు కుమారుడు మృతి చెందాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వర్ సాహుకు బీజేపీ టికెట్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబేని కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దింపింది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈశ్వర్ సాహు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. తన కుమారుడి మృతితో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఈశ్వర్ సాహు ఆ సాయం తీసుకోలేదు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు భువనేశ్వర్ సాహును బీరాన్‌పూర్, బెమెతారాలో జిహాదీల వర్గం హత్య చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. ఈ నేపధ్యంలో అతని తండ్రి ఈశ్వర్ సాహుకు ‘సాజా’ స్థానం నుండి పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: పొత్తు లేకనే కాంగ్రెస్ చిత్తు?.. ఇండియా అలయన్స్ నేతలు ఏమంటున్నారు? -
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ రిటైరయ్యారు. ఆఖరి పనిదినమైన శుక్రవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సహ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ..న్యాయవ్యవస్థ కోసం ముఖ్యంగా రాజ్యాంగ సంబంధ అంశాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానమని కొనియా డారు. 1979 నుంచి ఆయనతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిష్ అగర్వాల్ పాల్గొన్నారు. 2019 సెప్టెంబర్ 23న జస్టిస్ భట్ సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్లపాటు సేవలందించారు. పలు చారిత్రక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 1958లో మైసూరులో జన్మించిన జస్టిస్ భట్ 1982లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. -
శ్రీసిటీని సందర్శించిన జపాన్ ప్రతినిధుల బృందం
వరదయ్యపాళెం(తిరుపతి జిల్లా): ఒసాకాలోని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) డైరెక్టర్ జనరల్ మురహషి మసుయుకి, ఒసాకా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ బిజినెస్ కమిటీ చైర్మన్ టొమిటా మినోరు ఆధ్వర్యంలో 23మంది ప్రముఖ జపాన్ వ్యాపార ప్రతినిధుల బృందం గురువారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ మౌలిక సదుపాయాలు పరిశీలించడం, పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం వీరి పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీసిటీ ప్రెసిడెంట్(ఆపరేషన్స్)సతీష్ కామత్ వారికి స్వాగతం పలికారు. శ్రీసిటీలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అభివృద్ధి, తయారీ యూనిట్లను నెలకొల్పడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ బోడ్గన్ జార్జ్ వివరించారు. జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార ప్రతినిధులు, జెట్రో, ఓసీసీఐ ఉన్నతాధికారులు పర్యటనకు రావడంపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జపనీస్ భారీ పరిశ్రమలకు అవసరమైన సంస్థలు తమ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేట్టు ప్రోత్సహించే అనువైన పర్యావరణ వ్యవస్థ శ్రీసిటీలో ఉందంటూ ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం పై టొమిటా మినోరు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి వ్యాపార సామర్ధ్యం, వేగవంతమైన అభివృద్ధి తమను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. శ్రీసిటీ అధికారులతో చర్చల సందర్భంగా వివిధ అంశాలపై జపాన్ ప్రతినిధుల బృందం ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ ఆటో విడిభాగాలు, టెక్నికల్, టెక్స్టైల్స్ మొదలైన రంగాలకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు?
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ యునెస్కో వారసత్వ జాబితాలో చేరింది. శాంతినికేతన్ నాటి రోజుల్లో భారతదేశంలో ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఒక విశ్వవిద్యాలయం. దీనిని మనం ఇప్పుడు విశ్వభారతి అని కూడా పిలుస్తున్నాం. గురుదేవులు శాంతి నికేతన్‌ను ప్రారంభించినప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్.. త్రిపురతోపాటు అనేక రాజ కుటుంబాల నుండి ఆర్థిక సహాయం అందుకున్నారు. ఆ సమయంలో చైనా కూడా శాంతినికేతన్ నిర్వహణకు భారీగా ఆర్థిక సహాయం అందించింది. చైనా అందించిన ఆర్థిక సహాయానికి గుర్తుగా శాంతి నికేతన్‌లోని చైనా భవన్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ విద్యాలయంలో చైనీస్ భాష బోధించడంతో పాటు, చైనా సంస్కృతిపై అధ్యయనం చేస్తారు. శాంతి నికేతన్‌కు గొప్ప సహాయం అందించిన చైనా పండితుని పేరు తాన్ యున్ జెన్. ఆయన చదువుకునేందుకు శాంతి నికేతన్‌కు వచ్చారు. ఆ తర్వాత ఈ యూనివర్సిటీకి భారీగా ఆర్థిక సాయం అందించారు. తాన్ యున్ జెన్ శాంతినికేతన్ క్యాంపస్‌లో చైనా భవనాన్ని నిర్మించి, దానిని అభివృద్ధి చేసిన వ్యక్తి. అతను రచయిత, కవి, వ్యాసకర్త, తత్వశాస్త్ర పండితుడు. అలాగే భాషావేత్త. మహాయాన బౌద్ధ, కన్ఫ్యూషియన్ పండితునిగానూ పేరుగాంచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1924లో చైనాను సందర్శించారు. మూడు సంవత్సరాల తర్వాత గురుదేవులు మలయాలో తాన్ను కలిశారు. అనంతరం అతను చదువుకోవడానికి శాంతి నికేతన్‌కు వచ్చారు. అతను ఇక్కడ భారతీయ సంస్కృతిని అభ్యసించారు. కాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఠాగూర్ కొత్త విభాగాలను తెరవలేకపోయారు. గురుదేవులు చైనీస్ సంస్కృతి, భాష బోధించే ఒక విభాగాన్ని కూడా స్థాపించాలనుకున్నారు. 1931లో తాన్ నిధుల సేకరణ కోసం సింగపూర్, రంగూన్, చైనా దేశాలకు వెళ్లారు. దాదాపు ఐదేళ్ల తర్వాత శాంతినికేతన్‌కు తిరిగి వచ్చి రూ.50 వేల ఆర్థిక సహాయంతో పాటు లక్ష పుస్తకాలను అందించారు. తరువాత ఆయన శాంతినికేతన్లోనే ఉండిపోయారు. 30 ఏళ్లపాటు శాంతినికేతన్‌కు సేవలు అందించారు. 1937 ఏప్రిల్ 14న చైనా భవన్ ఏర్పాటయ్యింది. దీనిని ఇందిరాగాంధీ ప్రారంభించారు. చైనా ప్రతినిధి చియాంగ్ కై-షేక్ 1957లో శాంతి నికేతన్‌ను సందర్శించినప్పుడు చైనా హాల్, విశ్వవిద్యాలయానికి భారీ ఆర్థిక సహాయం అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో ఏడు ఎకరాల స్థలంలో ఆశ్రమాన్ని స్థాపించారు. అదే నేడు విశ్వభారతిగా పేరొందింది. ఠాగూర్ 1901లో కేవలం ఐదుగురు విద్యార్థులతో ఇక్కడ పాఠశాలను ప్రారంభించారు. వీరిలో అతని కుమారుడు కూడా ఉన్నాడు. 1921లో జాతీయ విశ్వవిద్యాలయ హోదా పొందిన విశ్వభారతిలో ప్రస్తుతం 6000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ క్యాంటీన్లో ఏమేమి దొరుకుతాయి? ధరలు ఎంత? -
శ్రీసిటీ అభివృద్ధి అద్భుతం
వరదయ్యపాలెం : తిరుపతి జిల్లాలోని శ్రీసిటీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్‌ఓవెన్ మంగళవారం సందర్శించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికి శ్రీసిటీలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతి, సుస్థిర అభివృద్ధి, హరితహిత చర్యలు, వ్యాపార అనుకూలతలు, వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక ప్రోత్సాహకాలను వివరించారు. శ్రీసిటీలో విభిన్న రంగాలకు చెందిన 8 ప్రముఖ బ్రిటిష్ కంపెనీ ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ శ్రీసిటీ పారిశ్రామిక అభివృద్ధిని అభినందించారు. 15ఏళ్లలో మంచి పారిశ్రామిక అభివృద్ధి సాధించడంతోపాటు పలు యూకే కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడం అద్భుతమని ప్రశంసించారు. త్వరలో వివిధ రంగాలకు చెందిన మరిన్ని బ్రిటిష్ కంపెనీలు శ్రీసిటీకి తరలివస్తాయన్నారు. హెడ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మిషన్ హెడ్ వరుణ్ మాలి మాట్లాడుతూ.. శ్రీసిటిలో టెక్నాలజీ, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో ముఖ్యంగా సుస్థిరతపై కలిసి పనిచేయాలని వ్యూహరచన చేస్తున్నట్టు చెప్పారు. పర్యటనలో భాగంగా గారెత్ విన్ ఓవెన్ శ్రీసిటీ పరిసరాలతో పాటు బెర్జిన్ పైప్స్ సపోర్ట్స్ ఇండియా, ఎంఎండీహెవీ మెషినరీ, రోటోలాక్ ఇండియా, ఎంఎస్ఆర్ గార్మెంట్స్, క్యాడ్బరీ కంపెనీలను సందర్శించారు. ఈ సందర్భంగా బెర్జిన్ పైప్స్ పరిశ్రమలో 350 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించారు. క్రియా యూనివర్సిటీని సందర్శించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!
ప్రముఖ నటుడు, మరాఠీ సినిమా దర్శకుడు రవీంద్ర మహాజనీ ఆకస్మికంగా కన్నుమూశారు. రవీంద్రకు 77 ఏళ్లు. పూణేలోని తలేగావ్ దభాడేలోని అంబి ప్రాంతంలోని అతని ఫ్లాట్‌లో నటుడి మృతదేహం కనుగొనబడినట్లు చెప్పబడింది. రెండు మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. (ఇది చదవండి: ‘బిగ్‌బాస్ 7’లోకి బ్యాకాంక్ పిల్ల.. వీడియోతో క్లారిటీ) అయితే రవీంద్ర మహాజని గత కొన్ని నెలలుగా అద్దె ఫ్లాట్‌లోనే ఒంటరిగా నివాసముంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఉంటున్న అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కనే ఉంటున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా నటుడు శవమై కనిపించాడు. దీంతో ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు. ఆయన మృతితో మరాఠాతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రవీంద్ర మరాఠీ సినిమాతో పాటు హిందీ సినిమాల్లో కూడా పనిచేశారు. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఆయనను వినోద్ ఖన్నా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం, రూపం రెండూ వినోద్ ఖన్నాను పోలి ఉన్నాయి. రవీంద్ర పలు మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ నటించిన 'సాత్ హిందుస్తానీ' చిత్రంలో రవీంద్ర మహాజని పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించారు. ఇదే అతని మొదటి సినిమా. ఆ తర్వాత మరాఠీలో 'ఆరం హరమా ఆహే', 'దునియా కరీ సలామ్', 'హల్దీ కుంకు' చిత్రాలకు పనిచేశాడు. 'ముంబయి చా ఫౌజ్దార్' (1984), 'కలత్ నకలత్' (1990)తో పాటు ఆయన నటించిన 'లక్ష్మీ చి పావ్లే' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రవీంద్ర మహాజని కుమారుడు గష్మీర్ మహాజని హిందీ సీరియల్ 'ఇమ్లీ'లో నటించారు. కుమారుడితో కలిసి తెరపై తొలి మరాఠీ చిత్రం 'క్యారీ ఆన్ మరాఠా'లో అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని కూడా గష్మీర్ తన తండ్రికి అంకితమిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు 2019లో వచ్చిన అర్జున్ కపూర్, కృతి సనన్ చిత్రం 'పానిపట్'లో కూడా కలిసి పనిచేశారు. రవీంద్ర చివరిసారిగా నటించిన చిత్రం కూడా ఇదే. (ఇది చదవండి: స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!) -
పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
రాయదుర్గం: పోలీసుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గచ్చిబౌలి లోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సైబరాబాద్ పోలీసు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం పునరుద్ధరించిన సైబరాబాద్ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించడం జరుగుతుందని, సొసైటీ సభ్యులంతా కలిసి సొసైటీని ముందుకు తీసుకువెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొసైటీ సభ్యులకు మేలు చేసే కొత్త ఆలోచలనకు సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధమన్నారు. సైబరాబాద్ అన్ని రకాల ఫార్మాట్లలో ముందుగా ఉందని, ముఖ్యంగా క్రైమ్ డిటెన్షన్ సైబర్ క్రైమ్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్, 17 ఫంక్షనల్ వరి్టకల్స్లో టాప్‌లో ఉందన్నారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క సర్విసులు, సొసైటీ యాప్ ద్వారా సభ్యులు చూసుకోవచ్చన్నారు. సొసైటీలో లావాదేవీలు అన్నీ పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సొసైటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో 72 ఏళ్ల చరిత్ర గల పాత సొసైటీని మూసివేస్తూ కోఆపరేటివ్ సొసైటీ ఆర్డర్ల ప్రకారం కొత్త సొసైటీని ప్రారంభించనున్నారు. సొసైటీలో గతేడాది ఏప్రిల్ 1 నాటికి ఉన్న షేర్ హోల్డర్లకు 40 శాతం, 2022–23 ఏడాదికి ఉన్న షేర్ హోల్డర్లకు 11 శాతం డివిడెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సభ్యులు నెలవారీ పొదుపునకు ఇచ్చే వడ్డీ 7.5 శాతం నుంచి 8 శాతానికి నిర్ణయించారు. ప్రతి సభ్యుడికి రూ.10 లక్షల గాను 8.5 శాతం వడ్డీపై లోన్లు ఇవ్వడానికి సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, అడ్మిన్ డీసీపీ యోగేష్ గౌతమ్, సొసైటీ సెక్రెటరీ, ఏసీపీ సురేందర్‌రావు, కోశాధికారి జి.మల్లేశం, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, డైరెక్టర్లు, ఎస్ఈ రాంబాబు, జూనియర్ అసిస్టెంట్ సరిత, హెడ్‌కానిస్టేబుల్ రాజారెడ్డి, కె.మాధవీలతా, ఇతర సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. -
పాపులర్ కపుల్ రవీంద్రన్-మహాలక్ష్మి ఫొటోలు చూశారా?
-
ఆ తపనతో ఈ సినిమా చేశారు
‘‘అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్’.. ఇలా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలంటే అన్న ఎన్టీఆర్‌గారే గుర్తొస్తారు. అలాంటిది ‘దేశంకోసం భగత్ సింగ్’ సినిమాలో రవీంద్ర గోపాల్ ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు చేయడం గొప్ప విషయం’’ అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘అన్నల రాజ్యం, నాగమ నాయుడు, రాఘవేంద్ర మహత్యం’ లాంటి సినిమాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర గోపాల లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దేశం కోసం భగత్‌సింగ్’. ప్రమోద్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ–‘ ‘స్వాతంత్య్ర సమర యోధుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలపాలన్న తపనతో ఈ సినిమా చేశాడు రవీంద్ర. ఈ సినిమా చూశా.. బాగుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 3న మా సినిమాని రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు రవీంద్ర గోపాల్. -
Hyderabad: కేటుగాళ్ల వలలో హైదరాబాదీ.. రూ.62 లక్షలు గోవిందా!
గచ్చిబౌలి: మార్కెట్ బాక్స్... అదో నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్. ఆ యాప్‌లో రిజిస్టర్ అయి లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ఉసిగొల్పి అందిన కాడికి దండుకొని బిచాణ ఎత్తేశారు. ఇలా మోసాలకు పాల్పడిన నలుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైంలో దేశంలోనే మొదటిసారిగా రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముగల్‌సరాయ్‌కి చెందిన కమోడిటీ ట్రేడర్ అభిషేక్ జైన్ (32) మార్కెట్ బాక్స్ అనే ఫేక్ ట్రేడింగ్ యాప్‌ను రూపొందించాడు. వాట్సాప్, టెలి గ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. దేశవ్యాప్తంగా వేలాది మంది రిజిస్టర్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తొలుత రూ.10 లక్షలు ఇందులో పెట్టగా, తిరిగి రూ.14.9 లక్షలు వచ్చా యి. దీంతో ఆయన ఈసారి రూ.62 లక్షలు పెట్టా రు. అయితే, కేవలం రూ.34.7 లక్షలే వచ్చాయి. రూ.27 లక్షలకుపైగా నష్టం వచ్చింది. దీంతో 2021 డిసెంబర్ 4న సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేసి యూపీ, రాజస్తాన్‌కు చెందిన ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇలా వేలాది మందిని మోసగించిన అభిషేక్ జైన్‌తోపాటు కృష్ణ కుమార్ (38), పవన్ కుమార్ ప్రజాపట్ (35), ఆకాశ్‌రాయ్ (39)లను అరెస్ట్‌చేశారు. ఉన్నది లేనట్లుగా చూపించి... మార్కెట్ బాక్స్‌లో మూడువేల మంది రిజిస్టర్ అయ్యారని సీపీ స్టీఫెన్ చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో రిజిస్టర్ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా లాభాల్లో ఉన్నట్లు కనిపించేలా చూపిస్తారన్నారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు ఇచ్చి నమ్మకాన్ని చూరగొంటారని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తరువాత డబ్బు లు కాజేస్తారని వివరించారు. వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి ఒకచోట ఉంచారని, యూపీ పోలీసుల సహకారంతో రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, ఏడీసీపీ రితురాజ్, ఏసీపీ శ్రీధర్, సీఐలు శ్రీనివాస్, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. -
Cyberabad CP: బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత, సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. అదే విధంగా, సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని తెలిపారు. సైబరాబాద్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేస్తూ.. తెలంగాణా పోలీస్ కి మంచి పేరు తీసుకోస్తామని తెలిపారు. చదవండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం -
టార్గెట్–2020!
గోదావరిఖని/జ్యోతినగర్(రామగుండం): దక్షణ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థ రామగుండం ఎన్టీపీసీ అని.. తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు అందించడం కోసమే వడవడిగా నూతన ప్రాజెక్టు నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర అన్నారు. సంస్థ 40వ ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని మిలీనియం హాలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థ 52,946 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అగ్రభాగాన నిలిచిందన్నారు. భారతావనికి 22.74 శాతం విద్యుత్‌ను అందిస్తున్న సంస్థగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. రామగుండం ప్రాజెక్టు 1978లో శంకుస్థాపన కాగా 1983లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిదని వెల్లడించారు. దినదినాభివృద్ధి చెందుతూ తెలంగాణలో అతిపెద్ద వెలుగుల కేంద్రంగా నిలిచిందని అన్నారు. రూ.10598.98 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తెలంగాణ స్టేజీ నిర్మాణపు పనులు ప్రమాదరహితంగా కొనసాగుతున్నాయని ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణం.. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజీ–1లో నిర్మాణంలో యూనిట్–1 టర్బైన్ జనరేటర్ 18 మీటర్లు. చిమ్నీ నిర్మాణం 180 మీటర్లు పూర్తయిందన్నారు. ఇంకా చాలా పనులు కొనసాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో బాయిలర్ సీలింగ్, బాయిలర్ ప్రెజర్ పార్ట్స్, టర్భైన్ జనరేటర్ యూనిట్–2 పనులు, బూడిద పైపులైన్ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జూన్–2019లో స్టీమ్ బాయిలింగ్ విధానం ప్రారంభం కానుందన్నారు. యూనిట్–1, మే–2020, యూనిట్–2, నవంబర్–2020న విద్యుత్ ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రకటించారు. సమావేశంలో జనరల్ మేనేజర్లు అరవింద్‌కుమార్ జైన్, పుష్ఫేందర్ కుమార్ లాఢ్, డాక్టర్ సశ్మితా డ్యాష్, శ్రీరామారావు, సౌమేంద్రదాస్, ఉమాకాంత్ గోఖలే, విజయ్‌సింగ్, యం.ఎస్.రమేష్, సీఎస్సార్ మేనేజర్ జీవన్‌రాజు, ఉద్యోగ వికాస కేంద్రం మేనేజర్ ప్రవీణ్‌కుమార్, పీఆర్వో సహదేవ్సేథీ, విష్ణువర్ధన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
జిల్లాల్లో పరిస్థితులపై ఐజీల పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోని పరిస్థితులను నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి గత మూడు రోజులుగా ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మావోల కదలికలు, వరుసగా వెలుగులోకి వస్తున్న పోస్టర్లు, బ్యానర్ల నేపథ్యంలో మావోయిస్టుల నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయా జిల్లాల ఎస్పీలకు నాగిరెడ్డి సూచనలు అందిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర–తెలంగాణ, ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో తనిఖీలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు దక్షిణ తెలంగాణలోని రాజకీయ గొడవలు, ఫ్యాక్షన్ వాతావరణం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీస్స్టేషన్ల వారీగా వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఫీల్డ్ లెవల్ సమీక్ష నిర్వహిస్తున్నారు. నల్లగొండలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో జరిగిన గొడవల దృష్ట్యా ముందస్తు చర్యలపై స్థానిక అధికారులకు అవగాహన కల్పించారు. ఇక, శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనపు డీజీపీ జితేందర్‌తో కలసి పర్యటించారు. నామినేషన్ల ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లతో స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. -
చిక్కులో మరో టాప్ బ్యాంకర్
పుణే : వీడియోకాన్ రుణ వివాద కేసులో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ అయిన చందాకొచర్ తీవ్ర ఇరకాటంలో పడగా.. మరో టాప్ బ్యాంకర్ కూడా చిక్కుల్లో కూరుకున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీఈఓ, ఎండీ రవీంద్ర మరాథేను ఆర్థిక నేరాల వింగ్ అరెస్ట్ చేసింది. రూ.3 వేల కోట్ల డీఎస్కే గ్రూప్ రుణ ఎగవేత కేసులో రవీంద్ర మరాథేతో పాటు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తాను ఆర్థిక నేరాల వింగ్ అదుపులోకి తీసుకుంది. ఈ రుణ ఎగవేత కేసుతో సంబంధం ఉన్న జైపూర్‌కు చెందిన బ్యాంక్ మాజీ సీఎండీ సుశిల్ మునోట్ కూడా పట్టుబడ్డారు. అరెస్ట్ అయిన ఈ ముగ్గురిపై చీటింగ్, ఫోర్జరీ నేర కుట్ర, నమ్మకాన్ని ఒమ్ము చేయడం వంటి వాటిపై కేసు బుక్ చేసినట్టు పోలీసులు తెలిపారు. డీఎస్కే గ్రూప్‌తో కలిసి ఈ అధికారులు, మోసపూరిత లావాదేవీలు చేశారని పుణేకు చెందిన ఆర్థిక నేరాల వింగ్ ఆరోపిస్తోంది. 4వేల మంది ఇన్వెస్టర్లను రూ.1,154 కోట్లకు మోసం చేసినందుకు గాను, పుణేకు చెందిన డీఎస్ కులకర్ని, అతని భార్య హేమంతీని ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అంతేకాక రూ.2,892 కోట్ల రుణాలను కూడా వీరు దారి మళ్లించినట్టు తెలిసింది. డీఎస్కే డెవలపర్స్ లిమిటెడ్‌తో కలిసి బ్యాంక్ అధికారులు, వారి అధికారాన్ని, అథారిటీని దుర్వినియోగం చేశారని ఆర్థిక నేరాల వింగ్ ఆరోపిస్తోంది. రుణాలను మోసపూరిత ఉద్దేశ్యంతో జారీచేశారని, రద్దు చేసిన రుణాలను వీరు వారికి మంజూరు చేశారని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన మాజీ, ప్రస్తుత అధికారులు మాత్రమే కాక, డీఎస్కే గ్రూప్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా ఆర్థిక నేరాల వింగ్ అదుపులోకి తీసుకుంది. డీఎస్కే గ్రూప్ సీఏ సునిల్ ఘట్పాండే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ నేవాస్కర్ను, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ నిత్యానంద్‌ను ఆర్థిక నేరాల వింగ్ అరెస్ట్ చేసింది. గత నెలలోనే కులకర్ని, ఆయన భార్య, డీఎస్కే గ్రూప్‌కు చెందిన ఇతర అధికారుల 124 ప్రాపర్టీలను, 276 బ్యాంక్ అకౌంట్లను, 46 వాహనాలను మహారాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. -
టార్గెట్ ఈదర!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై అవిశ్వాసం పెట్టి ఆయన్ను పదవీచ్యుతుడ్ని చేసేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోందా..? యర్రగొండపాలేనికి చెందిన టీడీపీ నేత మన్నే రవీంద్ర అధికార పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారా..? ఈదరను పదవి నుంచి దింపి చైర్మన్‌ను చేస్తామని రవీంద్రకుటీడీపీ హామీ ఇచ్చిందా..? ఈ మేరకు సీఎం సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..? ఈ నేపథ్యంలోనే జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి టీడీపీ సిద్ధమైందా..? ఇందుకు అధికార పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.. అసంతృప్తిలో మన్నే రవీంద్ర.. యర్రగొండపాలేనికి చెందిన టీడీపీ నేత, దొనకొండ జడ్పీటీసీ మన్నే రవీంద్ర అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి నాడు మన్నే రవీంద్ర బరిలో దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో అధికార పార్టీ జడ్పీటీసీ ఈదర హరిబాబుకు మద్ధతు పలకడంతో రవీంద్ర చివరి నిమిషంలో జిల్లా పరిషత్ చైర్మన్ కాలేకపోయారు. చైర్మన్‌గిరి కోసం ఆర్థికంగా నష్టపోయిన రవీంద్రకు పార్టీ అధికారంలోకి వచ్చినా ఒరిగిందేమి లేదు. మరోవైపు యర్రగొండపాలెం నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్‌రాజు అధికార పార్టీలో చేరడంతో రవీంద్ర అధిపత్యానికి గండిపడింది. అప్పటికే అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అజితరావు, కేడర్‌లో పట్టున్న జడ్పీటీసీ మన్నె రవీంద్రల మధ్య వర్గ విభేదాలున్నాయి. డేవిడ్‌రాజు రాకతో పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయింది. ప్రసుత్తం అజితరావు నియోజకవర్గానికి కొంత దూరంగా ఉన్నా, మన్నె రవీంద్ర, ఎమ్మెల్యే డేవిడ్‌రాజులకు పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో డేవిడ్‌రాజుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా.. అటు మన్నె రవీంద్ర, ఇటు అజితరావు వర్గాలు పని చేసే పరిస్థితి లేదు.ఒక వేళ అజితరావుకు టికెట్ ఇచ్చినా మన్నె రవీంద్ర, డేవిడ్‌రాజులు ఆమెకు మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదు. సుదీర్ఘంగా సేవలందించినా.. పదవితో పాటు ప్రాధాన్యత లేకపోవడంతో మన్నే రవీంద్ర అలకబూనినట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే టీడీపీని వీడతారన్న ప్రచారమూ సాగుతోంది. యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు ప్రాంతాల్లో సామాజికవర్గ బలంతో పాటు కొంత మేర ప్రజాబలమున్న మన్నే రవీంద్ర టీడీపీ వీడటం వల్ల ఆ పార్టీకి మరింత నష్టం కలగనుంది. జడ్పీ చైర్మన్‌గిరి ఎర.. అధికార పార్టీ మన్నే రవీంద్రను బుజ్జగించే ప్రయత్నానికి దిగింది. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబును పదవి నుంచి దించి మన్నే రవీంద్రకు చైర్మన్ పదవి అప్పగించాలని ముఖ్యమంత్రి జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌తో పాటు మిగిలిన నేతలను ఆదేశించినట్లు సమాచారం. దీంతో జడ్పీపై అవిశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు టీడీపీ నేతలు దీన్ని లోలోన వ్యతిరేకిస్తున్నా పైకి అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు అవిశ్వాసాన్ని దామచర్ల జనార్ధన్ నెత్తికెత్తుకొనే పక్షంలో కరణం బలరాం వర్గం ఇందుకు పూర్తి స్థాయిలో మద్ధతు పలికే అవకాశాలు కానరావడం లేదు. అయినా జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ తాజా పరిస్థితిని పరిశీలిస్తే... 56 మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో 31 మంది వైఎస్సార్సీపీ తరపున, 25 మంది టీడీపీ తరపున ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ తరపున నూకసాని బాలాజీ, టీడీపీ తరపున దొనకొండ జడ్పీటీసీ మన్నే రవీంద్రలు చైర్మన్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. తొలి సమావేశం నాటికే అధికార పార్టీ ముగ్గురు వైఎస్సార్సీపీ జడ్పీటీసీలను కొనుగోలు చేసింది. దీంతో ఇరుపార్టీలకు 28 చొప్పున సమానంగా జడ్పీటీసీలున్నారు. రెండవ సమావేశం నాటికి అధికార పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన మార్కాపురం జడ్పీటీసీ రంగారెడ్డిపై ఎస్సీ యాక్టు కేసు పెట్టించారు. సమావేశానికి వస్తున్న సమయంలో రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో టీడీపీకి 28 మంది, వైఎస్సార్సీపీకి 27 మంది సభ్యులున్నారు. దీంతో అప్పట్లో వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. టీడీపీ తరపున పొన్నలూరు జడ్పీటీసీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే హరిబాబును జడ్పీ చైర్మన్ చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందుకు నూకసాని బాలాజీని ఒప్పించారు. వ్యూహం మేరకు సమావేశంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయించి ఈదరను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 27 సభ్యులే కావడంతో టీడీపీ ఓటమిపాలైంది. మన్నే రవీంద్రకు చైర్మన్‌గిరి దక్కలేదు. ఆ తర్వాత టీడీపీ ఈదర హరిబాబును పార్టీ నుండి సస్పెండ్ చేయటం, జడ్పీటీసీ పదవి రద్దు కావడంతో ఈదర తాత్కాలికంగా చైర్మన్ కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కోర్టుకెళ్ళి ఆయన తిరిగి చైర్మన్‌గా కొనసాగారు. ఈ మధ్య కాలంలో 13 నెలల పాటు జడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్న నూకసాని బాలాజీ చైర్మన్‌గా కొనసాగారు. అవిశ్వాసం ఫలించేనా..? జిల్లా పరిషత్‌కు 56 మంది సభ్యులుండగా ప్రస్తుతం 55 మంది సభ్యులే సభలో ఉన్నారు. వీరిలో వైఎస్సార్సీపీకి 17 మంది సభ్యులున్నారు. ఈదర హరిబాబుతో కలిపితే 18 మంది అవుతారు. అధికార టీడీపీకి 37 మంది సభ్యులున్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఈ సంఖ్య సరిపోతుంది. నాలుగేళ్ళ పదవి కాలం అనంతరం అవిశ్వాసం పెట్టవచ్చు. ఈ లెక్కన జులై 13 నాటికి అవిశ్వాసం పెట్టే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం అధికార పార్టీకి అనుకూలంగానే ఉంది. ఈదరపై అవిశ్వాసం పెట్టే పక్షంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార పార్టీలోని దాదాపు 10 మంది సభ్యులు ఈదర హరిబాబుకు మద్ధతు పలికే అవకాశం ఉంది. కొండపి, చీరాల, గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి నియోజకవర్గాల పరిధిలోని పలువురు సభ్యులు వ్యక్తిగతంగా, సామాజికవర్గ పరంగా ఈదరకు మద్ధతునిస్తున్నారు. ఇదే జరిగితే ఈదర హరిబాబును చైర్మన్ పదవి నుంచి దించడం సాధ్యం కాదు. మరోవైపు టెక్నికల్‌గా ఈదరపై ఇప్పట్లో అవిశ్వాసం పెట్టే అవకాశం లేదన్న ప్రచారం సాగుతోంది. నాలుగేళ్ళ పదవి కాలం ముగిసిన తర్వాత అవిశ్వాసం పెట్టవచ్చు. ఈదర 13 నెలల పాటు పదవిలో లేరు. ఈ సమయాన్ని నాలుగు సంవత్సరాల సమయంతో లెక్కిస్తారా.. లేదా.. అన్న దానిపై అవిశ్వాస తీర్మానం ఆధారపడి ఉంది. చైర్మన్ పదవిలో ఉన్న కాలాన్ని మాత్రమే లెక్కించే పక్షంలో నాలుగేళ్ళ కాలం పూర్తి కాద. ఈ లెక్కన చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండదు. అలా కాకుండా పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి మొత్తం కాలాన్ని గణించే పక్షంలోనే అవిశ్వాసం వీలవుతుంది. చైర్మన్ పదవి కాలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉందని ఇప్పటికే న్యాయ నిపుణులు పేర్కొంటున్నట్లు సమాచారం. ఇదే జరిగితే జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసం జరిగే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఈదరకు పదవి గండం అవకాశాలు తక్కువే. ఒక వేళ అవిశ్వాసం నేపథ్యంలో మరోమారు ఈదర కోర్టు మెట్లెక్కాల్సి వస్తే అదృష్టం కలిసి వచ్చి వైస్ చైర్మన్‌గా ఉన్న తనకు పదవి దక్కకపోతుందా.. అని నూకసాని బాలాజీ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లా పరిషత్‌పై అవిశ్వాసం వ్యవహారం ప్రస్తుతం అధికార టీడీపీతో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
భర్త ఫోన్లో మెసేజ్ చూసినందుకు..
సాక్షి, రాజమండ్రి : అనుమతి లేకుండా ఫోన్లో మెసేజ్ చూసినందుకు భర్త తనను ఇంట్లోంచి గెంటేశాడని ఓ వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగిన ఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన శ్రీలలితకు రాజమండ్రికి చెందిన రవీంద్రతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే ఇరువురి మధ్య మనస్పర్దలు వచ్చాయి. ఆదివారం అనుమతి లేకుండా తన ఫోన్‌కు వచ్చిన ఓ మెసేజ్‌ను లలిత ఓపెన్ చేసి చూడటంతో రవీంద్ర కోపోద్రేకుడయ్యాడు. లలితను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ లలిత తల్లిదండ్రులతో కలసి అత్తింటి ముందు నిరాహార దీక్షకు దిగారు. మనస్పర్దలు వస్తే సర్ది చెప్పి కలపాల్సిన పెద్ద మనుషులే తమను దూరం చేస్తున్నారని లలిత ఆరోపించారు. -
ఆసరా ఉంటావనుకుంటే..
- ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య - మృతుడు ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు కారు అద్దాల ధ్వంసం చేసిన కేసులో నిందితుడు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటావని కూలి, నాలీ చేసి చదివించాం.. హైదరాబాద్‌కు వెళ్లి పెద్దోళ్లతో గొడవ పెట్టుకుంటివి..పెద్దోళ్లతో తగవు వద్ద నాయనా.. ఎంత ఖర్చయినా, ఎలాగోలా నిన్ను బయటకు తెచ్చుకుంటాం.. నువ్వేం బాధపడొద్దు అని చెప్పాం.. ఇంతలోనే ఇలా చేసుకుంటివా తండ్రీ.. అంటూ రవీంద్ర తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కగానొక్క కొడుకువు.. నువ్వూ లేకపోతే మేం ఎవరి కోసం బతకాలి అంటూ వారు గుండెలవిసేలా రోదించడం చూపరులను కలచివేసింది. - నల్లమాడ నల్లమాడ మండలంలోని ఎద్దులవాండ్లపల్లికి చెందిన వల్లిపి రవీంద్ర (32) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రముఖ సినీ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు కారు అద్దాలు ధ్వంసం చేసిన కేసులో మృతుడు నిందితుడు. 2016 జూలై 9న జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకిత్తించింది. కేసులో శిక్ష పడితే బీఎడ్ పూర్తిచేసిన తన భవిష్యత్తు నాశనం అవుతుందన్న భయంతో తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుని తల్లిదండ్రులు చెబుతున్నారు. వివరాలు ఎద్దులవాండ్లపల్లికి చెందిన వల్లిపి వెంకటప్ప, అంజనమ్మ దంపతులకు రవీంద్ర, సుకన్య సంతానం. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు రవీంద్ర బీఎడ్ పూర్తిచేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఆదివారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా అవ్వ నాగమ్మ ఇంట్లో ఉండేది. అవ్వ బయటకు వెళ్లగానే తలుపుకు లోపల గడియపెట్టి ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అరగంట తర్వాత ఇంటికి వచ్చిన అవ్వ మనవడిని ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో కిటికీలో నుంచి తొంగిచూసింది. మనవడు రవీంద్ర ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. ఇరుగుపొరుగు వారు తలుపు గడియ పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తెచ్చారు. అసలేం జరిగింది.. గత ఏడాది జూన్ 9న హైదరాబాద్‌లో ప్రముఖ సినీ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు ఇంటి వద్ద రవీంద్ర దాడికి దిగి రెండు కార్ల అద్దాలు ధ్వంసం చేసిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన శ్రీరామదాసు సినిమా కథ తనే రాశానని, ఆ డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో కారు అద్దాలు ధ్వంసం చేసినట్లు పోలీసులకు వివరించారు. ఈ సంఘటనపై అప్పట్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం 2017లో సైతం మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో అతడిని రిమాండ్‌కు తరలించగా తల్లిదండ్రులు బెయిల్‌పై బయటకు తెచ్చారు. అయితే వాయిదా ఉందంటూ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి శనివారం ఇంటికి తిరిగి వచ్చిన రవీంద్ర ఆదివారం ఉరి వేసుకుని మృతిచెందాడు. ఎస్ఐ కె.గోపీ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అతడి తండ్రి వెంకటప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
జైలు నుంచి విడుదలైన రవికిరణ్, రవీంద్ర
ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ధ్వజం సీతమ్మధార (విశాఖ ఉత్తరం): ముఖ్యమంత్రి చంద్రబాబు, తనయుడు లోకేశ్ ఆదేశాల మేరకే తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనని పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్, దరువు వెబ్ పోర్టల్ ప్రతినిధి ఇప్పాల రవీంద్ర మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే ఆరోపణపై వీరిని ఇటీవల అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు పంపిన విషయం తెలిసిందే. వీరు బుధవారం ఉదయం జైలు నుంచి బెయిలు మీద విడుదలయ్యారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. రవికిరణ్ మాట్లాడుతూ టీడీపీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు కక్ష సాధింపుగా అరెస్ట్ చేసి హింసలు పెట్టారని, ఎమ్మెల్యే అనితను దూషించినట్లు గత నెలలో విశాఖలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. మళ్లీ పీటీ వారెంట్‌పై తుళ్లూరు పోలీసులు గుంటూరు జైలుకు తీసుకెళ్లారని, ఆరు రోజులు రాత్రి పూట 8 నుంచి 2 గంటల వరకు కరెంట్ లేకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ గుంటూరు నుంచి విశాఖ జైలుకు తీసుకొచ్చారన్నారు. లోకేశ్ అనేక సందర్భాల్లో నోరు జారిన వీడియోలనే పోస్టు చేశాను తప్ప తానేమీ కొత్తగా సృష్టించలేదన్నారు. తనకు తన కుటుంబానికి ఏం జరిగినా చంద్రబాబు, లోకేశ్‌లదే బాధ్యత అన్నారు. ఇప్పాల రవీంద్ర మాట్లాడుతూ, అన్యాయాలను, వాస్తవాలను, ప్రభుత్వ తప్పుడు విధానాలను సోషల్ మీడియోలో పోస్టు చేయడం తప్పా? అని ప్రశ్నించారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వం వైఫల్యాలను, దౌర్జన్యాలను, అరాచకాలను సోషల్ మీడియా ద్వారా ప్రాణమున్నంత వరకు ఎండగడతామని స్పష్టం చేశారు. -
స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలోని ప్రీమెట్రిక్ (9,10 తరగతులు), పోస్ట్‌మెట్రిక్ (ఇంటర్ ఆపై) చదువుచున్న విభిన్న ప్రతిభావంతులు నేషనల్ స్కాలర్‌షిప్‌నకు ఈ నెల 31 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు రవీంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఠీఠీఠీ.టఛిజిౌl్చటటజిజీ pట.జౌఠి.జీn ను పరిశీలించాలని సూచించారు. -
రాఘవేంద్రరావుపై దాడి చేసిన వ్యక్తికి జైలుశిక్ష
ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావుపై దాడి చేయడమే కాకుండా ఆయనకుచెందిన ఖరీదైన కార్లను ధ్వంసం చేసిన ఘటనలో వల్లిపి రవీంద్ర(28)కి నాంపల్లిలోని మూడవ అదనపు న్యాయస్థానం రెండువారాల జైలు శిక్ష విదిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడిని శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో హాజరుపర్చగా ఈ మేరకు కోర్టు తీర్పు అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లి గ్రామానికి చెందిన రవీంద్ర గురువారం ఉదయం ఫిలింనగర్ సైట్-2లో నివసించే దర్శకుడు రాఘవేంద్రరావు నివాసానికి వెళ్లి ఆయన బయటకు వెళ్లిన సమయంలో కారును అడ్డగించి దాడికి యత్నించాడు. 2006లో తీసిన శ్రీరామదాసు సినిమా కథ తనదేనని ఆ కథ స్క్రిప్ట్‌ను పోస్టులో పంపించానని అయితే కథ పేరు తనకు బదులుగా వేరొకరిని చేర్చారని నిలదీశారు. రాఘవేంద్రరావు సర్దిచెప్తున్నా వినకుండా ఆయన కారు అద్దాలు కొడుతూ దాడికి యత్నించాడు. రవీంద్ర నుంచి తప్పించుకొని రాఘవేంద్రరావు వెళ్లిపోయారు. అనంతరం ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ రాడ్ తీసుకొని రాఘవేంద్రరావు ఇంట్లోకి ప్రవేశించిన రవీంద్ర అక్కడున్న ఆడి, బెంజ్, సాంత్రో కార్లను ధ్వంసం చేశాడు. ఇంటి అద్దాలు పగలగొట్టాడు. అడ్డు వచ్చిన వాచ్మెన్ కె. బాబుపై దాడి చేశాడు. అదే సమయంలో ఇంట్లో నుంచి వస్తున్న రాఘవేంద్రరావు కొడుకు కోవెలమూడి ప్రకాశ్‌రావుపై కూడా దాడి చేశారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో రవీంద్ర ఆ సినిమా కథ తనదేనని పలుమార్లు రాఘవేంద్రరావును ప్రశ్నించడం జరిగిందని న్యాయం జరగలేదని అందుకే అందరి దష్టికి ఈ విషయం వెళ్లాలని దాడి చేశానని వెల్లడించారు. -
గోవిందుడి దగ్గరికి వెళ్లొచ్చేసరికి..!
మలేషియా టౌన్షిప్(కేపీహెచ్ బీ): తిరుపతి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్నదంతా దొంగలు ఊడ్చుకెళ్లిన ఘటన కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఎస్సై రాందాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ తొమ్మిదో ఫేజ్‌కు చెందిన రవీంద్ర ఈ నెల 6న కుటుంబ సమేతంగా దైవదర్శనం కోసం తిరుపతికి బయలుదేరారు. సోమవారం ఉదయం పేపర్ బాయ్ పేపర్ వేసే క్రమంలో ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి రవీంద్రకు ఫోన్‌ద్వారా సమాచారం అందజేశాడు. సోమవారం రాత్రి తిరుపతి నుంచి తన నివాసానికి చేరుకున్న రవీంద్ర ఇంట్లో పరిశీలించగా సుమారు ఏడు తులాల బంగారు నగలు, రూ.11 వేల నగదు కనిపించలేదు. గుర్తు తెలియని దుండగులు సొత్తును అపహరించుకుపోయారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర'
-
చనిపోయి... లేచి వచ్చాడు
స్నేహితుడిని జైలుకు పంపాలని కుట్ర పథకం తారుమారై కటకటాల పాలైన వైనం కేజీఎఫ్ : మరణించాడు అనుకున్న వ్యక్తి బతికి వచ్చాడు. తన స్నేహితుడిని జైలుకు పంపేందుకు వేసిన పథకం కొన్ని రోజులకే భగ్నం కావడంతో చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... కేజీఎఫ్ పట్టణ సమీపంలోని తూకల్ గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌రెడ్డి, రవీంద్ర మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి పలు సంవత్సరాలుగా వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఇద్దరి మధ్యన మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. రవీంద్రపై కోపంగా ఉన్న అరుణ్‌కుమార్‌రెడ్డి ఎలాగైనా అతన్ని జైలు పాలు చేయాలని భావించాడు. ఇందులో భాగంగా వెంకటాపురం గ్రామానికి చెందిన నాగరాజుతో కలిసి పథకం వేశాడు. ఇందులో భాగంగా వారం రోజుల క్రితం మరణించిన క్యాసంబళ్లి ఫిర్కా గాండ్లహళ్లి గ్రామానికి చెందని బ్యాటప్ప(46) వృతదేహాన్ని సమాధి నుంచి వెలికి తీసి, తన ద్విచక్ర వాహనంపై తీసుకుని తూకల్ గ్రామ సమీపంలోని కాలువలో పడేసి ముఖం గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన సంబంధీకులతో ఆ వృతదేహం తనదేనని ప్రచారం కూడా చేయించాడు. ఘటనా స్థలంలో తన మొబైల్, బైక్‌ను పడేసి వెళ్లడంతో అరుణ్‌కుమార్ రెడ్డి హత్యకావింపబడ్డాడు అని అందరూ భావించారు. ఈ విషయాన్ని నమ్మిన అరుణ్‌కుమార్ రెడ్డి తల్లిదండ్రులు సైతం కంగుతిన్నారు. తమ కుమారుడిని హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను వేడుకున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాటప్ప కుటుంబీకులు సమాధి వద్ద పాలు పోసేందుకు వెళ్లిన సమయంలో సమాధిలో నుంచి వృతదేహాన్ని వెలికి తీసినట్లు గుర్తించి కేజీఎఫ్‌లోని అండర్సన్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఎస్పీ భగవాన్‌దాస్ వెంటనే ప్రత్యేక ృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించిన అరుణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన నాగరాజును పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తన స్నేహితుడిని జైలుకు పంపాలని మాస్టర్ ప్లాన్ వేసిన వ్యక్తి చివరికి తానే ఊచలు లెక్కపెట్టాల్సి రావడం విధి లిఖితమే మరి. -
సీసీఎస్ సీఐ విజయ్‌సింగ్ సస్పెన్షన్
సాక్షి, సిటీబ్యూరో: నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో యాంటీ నార్కొటిక్ విభాగం ఇన్స్పెక్టర్ విజయ్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైంగికదాడి కేసులో నిందితుడైన ఆదాయపన్ను శాఖ మాజీ అదనపు కమిషనర్ రవీంద్రను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. వివరాలు... బాధితుడు రవీంద్ర ఆదాయపన్ను శాఖలో అదనపు కమిషనర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో భారతి అనే మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో నారాయణగూడ పోలీసులు ఆరు నెలల క్రితం రవీంద్రపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్న భారతి నుంచి రూ.కోటి అక్రమంగా దండుకున్నాడ నే ఆరోపణలపై సీసీఎస్ పోలీసులు అతడిపై మరో చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భారతి చెల్లెలు ఫిర్యాదు మేరకు రవీంద్రపై బంజారాహిల్స్ ఠాణాలో లైంగికదాడి కేసు నమోదైంది. ఈ కేసుల్లో అరెస్టై బెయిల్‌పై వచ్చిన రవీంద్ర బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో మరో కేసు కూడా నమోదైంది. ఇలా నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న రవీంద్ర ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో... బంజారాహిల్స్‌లో నమోదైన లైంగిదాడి కేసు నెలన్నర క్రితం సీసీఎస్‌కు బదిలీ అయిందని, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న ఇన్స్పెక్టర్ విజయ్‌సింగ్ తనను, తన స్నేహితుడిని సీసీఎస్‌లో నిర్భందించి, చిత్రహింసలకు గురి చేశాడని బాధితుడు రవీంద్ర నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. అన్ని కేసుల్లో బెయిల్ పొందిన తనను కేసులన్నీ సెటిల్ చేసుకోవాలని బెదిరించడంతో పాటు తన ఆస్తితో పాటు స్నేహితుడి ఆస్తిని కూడా బలవంతంగా సీఐ తన పేరుపై బదిలీ చేయించుకున్నాడని రవీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై కమిషనర్ విచారణ చేపట్టగా...ఆరోపణలన్నీ వాస్తవమేనని తేలడంతో విజయ్సింగ్పై సస్పెన్షన్ వేటు వేశారు. -
ముప్పుతిప్పలు పెట్టి.. పోలీసులకు చిక్కి..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు ఆస్పత్రిలో చేర్పించిన వైనం పీఎం పాలెం: విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు రవీంద్ర పోలీసులకు చిక్కాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పీఎం పాలెం సీఐ అప్పలరాజు తెలిపిన వివరాలివి. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రవీంద్ర మధురవాడ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడి ఆగడాలు శుతిమించడంతో యాజమాన్యం కళాశాల నుంచి పంపిం చేసింది. అతడు ఆ ప్రాంతంలో ఉంటూ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని ఫొటో తీసి మార్ఫింగ్ చేసి ఆమెను బెదిరించ సాగాడు. తన రూమ్‌కు ఒంటరిగా వస్తే ఫొటోలు ఇస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మి ఆమె వెళ్లగా స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి యత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భీమిలిలో ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు శక్రవారం అక్కడకు వెళ్లారు. అతడు వారి నుంచి తప్పించుకుని ఆర్కే బీచ్ ప్రాంతానికి చేరుకున్నాడు. పోలీసులకు విష యం తెలిసి గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులకు చిక్కడం ఖాయమని భావించిన నిందితుడు శుక్రవారం రాత్రి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అప్రమత్తమై అపస్మారక స్థితిలో ఉన్న నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడికి నేరచరిత్ర నిందితుడు రవీంద్రకు నేరచరిత్ర ఉందని సీఐ అప్పలరాజు తెలిపారు. తన స్వస్థలంలో పలు నేరాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కాడని పేర్కొన్నారు. 2013లో మధురవాడ ప్రాంతం లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గాయపరిచాడని తెలిపారు. ఐదేళ్లలో మూడు కళాశాలలు మారాడని, విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు ఇబ్బందికరంగా మారాడని చెప్పారు. వేధింపులు తాళలేకే ఆత్మహత్యాయత్నం పోలీసులు విచారణ పేరుతో తమ కుమారుడ్ని హింసిస్తున్నారని తండ్రి నాగేశ్వరరావు ఆరోపించారు. వారి హింసను భరించలేకే ఆత్మహత్యాయత్నం చేశాడని విలేకరులకు తెలిపాడు. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాడు. -
220 మంది ఉద్యోగుల బదిలీ
కోటబొమ్మాళి: ఇటీవల జిల్లా పరిషత్ పరిధిలోని 220 మం ది ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేసినట్లు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఎస్.రవీంద్ర తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వీరఘట్టం, నందిగాం, హిరమండలం, పాతపట్నం మండలాల ఎంపీడీఓలను ఇతర జిల్లాలకు బదిలీ చేశామన్నారు. బదిలీలను పారదర్శకంగా నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాలో 9 ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న మండల పరిషత్ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లకు అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. సమావేశంలో ఎంపీడీఓ బి.రాజు పాల్గొన్నారు. కురుడు హైస్కూల్లో విచారణ మండలంలోని కురుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హుద్‌హుద్ తుపానుకు పాఠశాల ఆవరణలో 8 నీలగిరి చెట్లు కూలిపోగా వాటిని హెచ్.ఎం ఎల్వీ ప్రతాప్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మేశారంటూ గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మణరావు ఇటీవల జిల్లా పరిషత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఈఓ రవీంద్ర, ఎంపీడీఓ బి.రాజులతో కలసి శని వారం పాఠశాలలో విచారణ జరిపారు. చెట్లు కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. హెచ్.ఎం ప్రతాప్‌ను, ఫిర్యాదు దారుడు లక్ష్మణరావుల నుంచి వివరాలు సేకరించారు. -
మా అబ్బాయిని క్షమాపణ అడగాలనుంది...
కోపం చెడ్డదని ఎందుకంటారో తెలుసుకోవాలంటే నా జీవితమే ఉదాహరణ. ఆవేశంలో నేను చేసిన పని వల్ల నేనిప్పుడు చాలా బాధపడుతున్నాను. ఆ రోజు నా కళ్లముందు నుంచి ఎప్పుడూ తొలగిపోదు. మా అబ్బాయి రవీంద్రకు ఓ సంబంధం చూశాం. నేను, మావారు వాళ్లతో మాట్లాడి వచ్చాం. మంచి రోజు చూసుకుని రవిని తీసుకుని వస్తామని చెప్పాం. కానీ ఆ రాత్రి మేం విషయం చెప్పీ చెప్పగానే నో అనేశాడు రవి. దానికి కారణం సునీత. తను మావాడి కొలీగ్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మావాడు తనకి మాట కూడా ఇచ్చేశాడు. ఆ విషయం చెప్పగానే మావారు సెలైంట్‌గా అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయారు. నేను మాత్రం వాడి మీద ఇంతెత్తున లేచాను. ‘పెళ్లి చేసేసుకోలేదు కదమ్మా, ప్రేమించానంతే, మీకు చెప్పకుండా చేసేసుకుంటానా ఏంటి’ అన్నాడు. ఆ అమ్మాయి వివరాలు చెప్పాడు. అవి విన్నాక మరీ మండుకొచ్చింది నాకు. అందుకే పెళ్లికి ఒప్పుకునే ప్రసక్తి లేదని తెగేసి చెప్పాను. దాంతో వాడు ఏకంగా మాతో బంధమే తెంచుకుని వెళ్లిపోయాడు. సునీతను పెళ్లి చేసుకుని, ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని కూడా చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. మావారు అది భరించలేక మంచం పట్టారు. ఆయన్ని దక్కించుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కొడుకు దూరమైపోయాడు. భర్త వదిలి వెళ్లిపోయాడు. దిక్కులేని పక్షిలా మిగిలాను. కొన్నాళ్లకు ఆయన వస్తువులన్నీ సర్దుతుంటే ఓ డైరీ దొరికింది. అందులో ‘‘శారదా... చాలా పెద్ద తప్పు చేశావ్. కొడుకునైనా వదిలేసుకున్నావ్ కానీ ఓ పేదింటి పిల్లని కోడలిగా ఒప్పుకోలేకపోయావ్. మా అమ్మ కూడా నీలానే అనుకుని ఉంటే మన పెళ్లి జరిగేదా? ఆ మాట అని నిన్ను బాధ పెట్టలేను. అలా అని నువ్వు చేసిన పనిని క్షమించనూ లేను.’’ ఆయన అన్నది నిజం. ఒకప్పుడు నేనున్న స్థాయిని మర్చిపోయాను. సునీత పేదరికాన్ని ఎత్తి చూపించి నా కొడుకు మనసును గాయపర్చాను. తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. వెళ్లి నా కొడుకును క్షమాపణ అడగాలనుంది. నా కోడలిని గుండెలకు హత్తుకోవాలని ఉంది. మీరు ఇది చదివేనాటికి ఆ పని తప్పక చేస్తాను. నా తప్పిదానికి పరిహారం చేసుకుంటాను! - వి.శారద, నల్లజర్ల -
చేనేత కార్మికులను ఆదుకుంటాం
తిరుపతి సిటీ : రాష్ర్టవ్యాప్తంగా పర్యటించి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమం, ఎక్సైజ్, చేనేత జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం తిరుపతి గాంధీరోడ్డులోని ఆప్కో విక్రయశాలను ఆయన సందర్శించారు. అక్కడి చేనేత ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రూ.100 కోట్లతో చీరాలలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాచీన వృత్తి కళాకారులైన చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వారి ఉత్పత్తులకు ప్రోత్సాహం లభించేవిధంగా ఆప్కోను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. చేనేత విక్రయాభివృద్ధికి ఇన్సెంటివ్ భృతి, క్లస్టర్లు, నేత బజార్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులపై పడిన అదనపు సుంకాన్ని తగ్గించేందుకు నూలు, సిల్క్స్ దిగుమతులపై రాయితీని ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలకు దుప్పట్లు, విద్యార్థులకు యూనిఫాం, ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రిని చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల డెరైక్టర్లు మిద్దెల హరి, పడిదం చెంగల్రావు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రకాశంరోడ్డులోని జోయాలుకాస్ జువలరీ ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణ, టౌన్‌బ్యాంకు చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి రామచంద్రరాజు, ఆప్కో డివిజినల్ మేనేజర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. నగరమంతా మద్యం తొలగించండి.. మద్యం దుకాణాలను తొలగిస్తే నగరమంతా తొలగించాలని.. లేకుంటే అన్నింటినీ అలాగే ఉంచాలని బస్టాండ్ నుంచి కపిలతీర్థం రోడ్డులో తొలగించిన మద్యం దుకాణాల నిర్వాహకులు మంత్రి కే.రవీంద్రను కోరారు. మద్య నిషేధం పూర్తిస్థాయిలో అమలు చేయాలని భావిస్తే నగరంలో అన్ని దుకాణాలు, బార్లను తొలగించి రూరల్ ప్రాంతాలకు తరలించాలన్నారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో మద్యం దుకాణాల యజమానులు వెనుతిరిగారు. -
డీఎస్సీ-2014లో అవకాశమివ్వాలని ఆందోళన
కడప సెవెన్‌రోడ్స్ : డీఎస్సీ-2014లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం డీఎడ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. అంతకుముందు నగరంలో వారు ర్యాలీ నిర్వహించారు. బైఠాయింపులో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీంద్ర, గంగా సురేష్ మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడకముందే టెట్ నిర్వహించాలని, లేదంటే టెట్‌ను రద్దు చేసి డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా ఈ సంవత్సరం కౌన్సెలింగ్ ఆరు నెలలు ఆలస్యంగా నిర్వహించారని పేర్కొన్నారు. తమకు తరగతుల నిర్వహణ కూడా ఆలస్యమైందన్నారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వం డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని కోరా రు. విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చు కు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఏఐఎస్ఎఫ్ అధ్య క్ష, కార్యదర్శులతోపాటు ఏఐవైఎఫ్ ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్స్టేషన్కుకు తరలించారు. తమ కోర్కెలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అన్యాయమని విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను విడుదల చేశారు. ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మద్దిలేటి, జగన్ నాయక్, సునీల్, ఖాదర్‌వలీ, శ్యాం, నాగేంద్ర, నాగరాజు పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న వ్యాధులు
పింప్రి, న్యూస్‌లైన్ : కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. పుణే, పింప్రి-చించ్వడ్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. వర్షాలు, చల్లటి గాలులు, మరో పక్క ఎండ కూడా కాయడంతో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరాలతోపాటు డెంగీ, మలేరియా లాంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. నాలుగు రోజుల్లో రోగాల బారిన పడిన వారి సంఖ్య మరింత ఎక్కువైంది. జూన్‌లో కురవాల్సిన వర్షాలు జూలైలో కురుస్తుండడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా విస్తృతంగా వ్యాప్తి చెందడం ద్వారా నగర ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లతోపాటు నగర ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యుడు రవీంద్ర ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు కలుషిత నీటిని తాగడం ద్వారా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, విరేచనాలు, వాంతులు, జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. నీటిని మరిగించి, చల్లార్చి, వడపోసిన తర్వాత సేవించాలి. బయటి తినుబండారాలను, పులిసిన పుల్లటి పదార్థాలను, వీలైనంత వరకు మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి, నూనె పదార్థాలను తగ్గించాలి, సులువుగా జీర్ణమయ్యే వాటినే ఎక్కువగా తీసుకోవాలి. సూప్‌లను తరచూ తాగాలి. ముఖ్యంగా ఇలాంటి వాతావరణంలో సొంటి, తులసి, మిరియాలు, లవంగాలు ఉపయోగించాలి. ఆహార పదార్థాలలో సూప్‌లలో వీటిని వినియోగించాలి స్వచ్ఛమైన గాలిని ఇచ్చే తుసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవాలి. తులసి మొక్కలు 24 గంటలు ఆక్సీజన్ గాలిలోకి విడుదల చేస్తాయి. దోమలు కూడా పరిసరాలలోకి రావు. తులసిని సేవించడం డెంగీ నివారణకు దోహదపడుతోంది. -
ముమ్మరంగా వాహనాల తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత
నందిపేట, న్యూస్‌లైన్ : మండలంలోని వెల్మల్ చైరస్తా వ ద్ద ఎన్నికల అధికారులు 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెల్మల్ గ్రా మంలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు నుం చి 10 లక్షల నగదుతో సిబ్బంది రవీంద్ర జిల్లా కేంద్ర బ్యాంకుకు వెళుతున్నాడు. మార్గమధ్యలో ఎన్నికల అధికారులు తనఖీలు చేశారు. నగదుకు సంబంధిం చిన సరైన పత్రాలు లేవు. దీంతో అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నా రు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గజ్జన్నకు న గదును ముట్టజెప్పారు. ఈ తనిఖీల్లో ఇ రిగేషన్ ఏఈ అనంతయ్య, రెవెన్యూ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. ఎస్ఎన్ఏ రహదారిపై *2.78లక్షలు.. నిజాంసాగర్(పిట్లం) : పిట్లం మండల కేంద్రానికి సమీపంలో ఎస్ఎన్ఎ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం * 2.78 లక్షల నగదును పట్టుకున్నారు. నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు కారును వారు తనిఖీ చేశారు. వ్యాపారం నిమిత్తం కారులో తీసుకువెళ్తున్న నగదు అధికారులు పట్టుకున్నారు. తనిఖీలో స్థానిక డిప్యూటీ తహశీల్దార్ సాయాగౌడ్, హెడ్‌కానిస్టేబుల్ వెంక య్య, ఆర్ఐ క్రాంతికుమార్ ఉన్నారు. రేకుల్‌పల్లి చౌరస్తాలో 1.55 లక్షలు.. సిరికొండ : మండలంలోని రేకుల్‌పల్లి చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో లభించిన *1.55 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ విక్రం వాహనాలను తనిఖీ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన పైపుల వ్యాపారి టక్కరి విజయ్ తన కారులో భీమ్‌గల్ నుంచి సికింద్రాబాద్‌కు నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు. తనిఖీల్లో లభించిన నగదును సీజ్ చేసినట్లు విక్రం తెలిపారు. నగదును జిల్లా అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సత్యానందం, సునీల్ పాల్గొన్నారు. నగర సమీపంలో 2 లక్షలు.. నిజామాబాద్క్రైం : ఎన్నికల నిబంధనల్లో భాగంగా వాహనాల తనిఖీల్లో 2 లక్షలు పట్టుకుని సీజ్ చేసినట్లు శనివారం నాల్గో టౌన్ ఎస్సై నరేశ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కోణారావుపేట్కు చెందిన ఎండీ బషీర్, ఎండీ అజీమ్ నిజామాబాద్ జిల్లా నవీపేటలో శనివారం జరిగే మేకల సంతకు 2 లక్షలు పెట్టుకుని బయలు దేరారు. వీరు నగర సమీపంలోని బోర్గాం(పి) బ్రిడ్జి వద్దకు రాగానే అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. తనిఖీలో డబ్బులు బయటపడ్డాయి. దీంతో వాటి లెక్కలను పోలీసులు అడిగారు. వారు లెక్కలు చూపకపోవటంతో డబ్బులను సీజ్ చేశామన్నారు.